తల్లిదండ్రుల మార్గదర్శి

పరిచయము: ఉమ్మడి కుటుంబాలలో పెద్దవాళ్ళు దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు ఎక్కువగా సంరక్షణ ఉండేది. నేటి సమాజంలో చిన్నకుటుంబాలు ఎక్కువవుతున్న తరుణంలో, పిల్లలకు ఎటువంటి చిన్న జలుబు, దగ్గులాంటివి వచ్చినా ఏమిచేయాలో తెలీక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

ఇంట్లో పెద్దవాళ్ళులేని కొరతను కొంతవరకైనా తీర్చడానికి, ఈ పుస్తకం సహకరిస్తుందని ఆశిస్తున్నాము.

జ్వరము, మూర్ఛలు మార్చు

చిన్న పిల్లలు వేడిని తట్టుకోలేరు. అందువల్ల జ్వరం రాగానే, వంటిమీద బట్టలు లేకుండా చేసి, తడిగుడ్డతో ఎప్పటికప్పుడు తుడవాలి. లేని పక్షంలో పిల్లలకు మూర్ఛలు వస్తాయి. మూర్ఛలు ఒకసారి వస్తే, ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడల్లా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మూర్ఛలు ఎంత ఎక్కువసార్లు వస్తే మెదడు అంతగా దెబ్బతింటుంది. పెద్దగా అయ్యాక వారి ఆలోచనా విధానంలోకూడా లోపం ఉంటుంది.

పాలు, పాల దంతాలు మార్చు

పోతపాలు తాగే పిల్లల విషయంలో, కొంత మంది తల్లులు, పాలడబ్బానోట్లో పెట్టి నిద్రపుచ్చుతారు. ఇలా రాత్రంతా నోట్లో ఉన్న పాలు, పిల్లల పళ్ళు పుచ్చిపోయేలా చేస్తాయి. రూట్ కెనాల్ థెరపీ అవసరమయిన రెండు సంవత్సరాల పిల్లలు ఉన్నారని గమనించండి.

పెరుగుదల, థైరాయిడ్ హార్మోన్ మార్చు

మీపిల్లల పెరుగుదల ఉండవలసినంతగా లేకుంటే థైరాయిడ్ హార్మోన్ లోపం అయిఉండవచ్చని గమనించండి. చంటి పిల్లలకు (రెండు సంవత్సరాలలోపు) ఏడుపు అవసరం అని గమనించండి. ఏడవడం వల్ల తాగిన పాలు అరుగుతాయి, కావలసిన ఎక్సర్సయిజ్ అందుతుంది. థైరాయిడ్ స్టిమ్యులేట్ అవుతుంది.

పెరుగుదల, తోటి పిల్లల పాత్ర మార్చు

వెనకట సంతానానికి, సంతానానికి ఎక్కువగా ఎడంలేనప్పుడు, ఉమ్మడి కుటుంబాలలో అదే వయసుగల అన్నదమ్ముల పిల్లలు ఉండటంవల్లనూ పిల్లల ఎదుగుదల ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సంతానానికి, సంతానానికి ఎక్కువగా ఎడం ఉండటం వల్లనూ, చిన్న కుటుంబాలవ్వడం వల్లనూ, పిల్లలకు త్వరగా మాటలు రాకపోవడం, పెరుగుదల మందగించడం జరుగుతుంది. పిల్లలను త్వరగా ply schoolకి పంపడం వల్ల కొంతవరకు సరిదిద్దుకోవచ్చు.