తెవికీ సోదర ప్రాజెక్టులు/తెలుగు వికీసోర్స్

వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్‌లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.

వికీసోర్స్ చిహ్నము

వికీసోర్స్ అంటే?

మార్చు

వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్‌. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి. దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.

ఎక్కడినుండి సేకరిస్తారు?

మార్చు

ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్‌)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్‌లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్‌లు ఆఫ్‌లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.

వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు

మార్చు
  • ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
  • అసలు గ్రంథాల అనువాదాలు
  • జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
  • వికీసోర్స్‌లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
  • ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు

వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు

  • కాపీరైట్ ఉల్లంఘనలు
  • ప్రాజెక్ట్‌కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
  • గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
  • సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
  • గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)

ఆవిర్భావం, చరిత్ర

మార్చు

ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్‌డొమైన్‌ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").

 
వికీసోర్స్ ప్రారంభ చిహ్నం

ఈ వికీసోర్స్‌ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్‌బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్‌బర్గ్‌”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).

డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్‌. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.

ఉపకరణాల అభివృద్ధి

మార్చు

ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్‌క్రిప్షన్‌, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్‌ వి. కోసం ప్రూఫ్‌ రెడ్‌ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్‌తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్‌ను ప్రూఫ్‌రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్‌గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్‌కి అప్‌లోడ్ చేయబడతాయి. ఈ వ్యవస్థ వికీసోర్స్‌లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్‌లు ఏ యూజర్‌కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్‌రెడ్‌పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్‌కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.

మైలు రాళ్లు

మార్చు
  • sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
  • జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
  • ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
  • నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్‌లను ఆమోదించింది,
  • మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
  • ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్‌లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్‌నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
  • నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్‌ల మైలురాయిని దాటింది.
  • సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
  • సబ్‌డొమైన్‌లలో 2,532 చురుకైన ఎడిటర్‌లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్‌లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
  • వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
  • బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
  • స్వంత సబ్‌డొమైన్‌లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్‌గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్‌డొమైన్‌లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
  • http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
  • థామస్‌ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్‌గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్‌గా పని చేయదు.

తెలుగు వికీసోర్స్

మార్చు

దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.

 
ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ

గణాంకాలు

మార్చు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.

వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow)

మార్చు
  1. కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
  2. సూచిక తయారు చేయడము: వికీసోర్స్‌లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్‌కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
    1. సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
    2. ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
    3. పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
  3. ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
    1. పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
    2. పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
    3. ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.
       
      పుట అచుదిద్దిన స్థితి
  4. ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
  5. విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
  6. సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
  7. పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
  8. రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
  9. రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
  10. రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి

తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు

మార్చు

ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.

ఆధారాలు

మార్చు
  1. List of Wikisources https://w.wiki/B5Zh
  2. వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
  3. https://en.wikipedia.org/wiki/Wikisource
  4. Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
  5. ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు