చి స్పందన
పంక్తి 2:
నిఘంటువు పేజీలలో అనవసరమైన మూసలు, వర్గాలు తొలగించాను. గమనించండి. ఏమైనా సందేహాలుంటే తెలపండి. ఇక కొన్ని పదాలకు తెలుగు వికీ లింకులు చేర్చివున్నాయి. అవి అనవసరం అనుకుంటాను. అది కాక ప్రతి నిఘంటు పేజీనుండి ఇతర పేజీలకు నేవిగేషన్ లింకు పెట్టవచ్చు. ఉదాహరణ [[s:మూస:అన్నమయ్య_పాటలు]] అది ఉపయోగమనుకుంటే తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 14:42, 31 జూలై 2020 (UTC)
:: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, కొన్ని రోజులు వ్యవధి ఇవ్వండి. నిఘంటువు పేజీలు కొన్ని మచ్చు చూసిన తరువాత నిర్ణయం తీసుకుందాం. ఈ లోగా నిఘంటువు ఎక్కువ మంది వాడుకోడానికి ఏయే హంగులు ఉంటే బాగుంటుందో మీరే సలహా ఇవ్వండి. తరువాత ఇక్కడ నిఘంటువు ఉన్నట్లు ఎక్కువ మందికి ఎలా తెలుస్తుంది? నా కంటిచూపులో శక్తి క్రమేపీ తగ్గిపోతోంది. కనుక ఇంకా ఎన్నాళ్లు నేను ఈ నిఘంటువుని కనిపెట్టుకుని ఉండగలనో తెలియదు. కనుక వికీపీడియా కార్యవర్గంలో బాధ్యతగల నిర్వాహకులు దీని ఉపయోగానికి కావలసిన హంగులు సమకూర్చహగలరనే ఆశిస్తున్నాను. ఈ నిఘంటులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో వేరే వివరంగా రాసి పంపుతాను. నమస్కారం. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 15:29, 31 జూలై 2020 (UTC)
::: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, వికీప్రాజెక్టులకు దాదాపు 50 శాతం సందర్శకులు గూగుల్ లాంటి వెతుకుయంత్రాల ద్వారానే వస్తారు. నిఘంటువు పేజీల పదాలకు అంతరిక లింకులు ఇవ్వం కాబట్టి ఇది దాదాపు 100 శాతంగా వుంటుంది. రెండు మూడు రోజులలో గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేస్తుంది. కావున వికీపీడియాలో పేజీలను రెండు రోజుల తర్వాత తొలగించడం మంచిది. దీనికి మీ అంగీకారం తెలపండి. ఇక ముందు ముందు దీని నిర్వహణ గురించి, తెలుగు వికీ సముదాయం బలహీనంగా వుండడం వలన ఎలా వుంటుందో ఊహించడం కష్టం. మీరు కోరినప్పుడు ఈ పేజీలను రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది.--[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:11, 1 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikibooks.org/wiki/వాడుకరి_చర్చ:Vemurione" నుండి వెలికితీశారు