వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/A: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 831:
* alleged, n. అభియోక్త; అభియోగి; అభియుక్తుడు;
* allegiance, n. విశ్వాసపాత్రత; ప్రభుభక్తి; రాజభక్తి; ఒక ప్రభుత్వం ఎడల కాని, వ్యక్తి ఎడల కాని నమ్మక ద్రోహం తలపెట్టకుండా ప్రవర్తించడం;
* allegory, n. (1) అర్థవాదం; అలిగొరి; ఒక ముఖ్యమైన విశేషాన్ని గాని, పారమార్థిక సత్యాన్ని గాని, నీతిని గాని తెలియజేయడానికి ఉపయోగించే సాహిత్య ప్రక్రియ. ఒక భావాన్ని పాత్రగా మార్చడం అలిగరి. ‘సమయం, సందర్భం కాకుండా ఇదేమిటి’ అనిపించే విధంగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించడం, కురుక్షేత్ర సంగ్రామం మధ్య శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతో పదేశం చేయడం ఇందుకు ఉదాహరణలు; కృష్ణమిశ్రుడనే సంస్కృత నాటకకర్త (11 - 12 శతాబ్దాలు) వివిధ మనోభావాలను పాత్రలుగా మార్చి ‘ప్రబోధ చంద్రోదయం’ అనే నాటకం రాసాడు. భావాల్ని పాత్రలుగా మార్చడం సాహిత్య శిల్పరీత్యా తక్కువస్థాయి శిల్పం. అందుకని అలిగరి అంటే రసజ్ఞుల దృష్టిలో తక్కువ అభిప్రాయమే ఉంటూంది; (2) ధ్వన్యర్థం; రూపకం; రూపకాలంకారం; చెప్పదలుచుకున్న విషయానికి బదులు మరొక విషయాన్ని చెప్పి అర్థం ఆరోపించడం; పంచతంత్ర హితోపదేశాలలో మనుష్యులకి బదులు జంతుజాలం చేత కథ నడిపించడం దీనికి ఒక ఉదాహరణ; అర్థము అంటే వస్తువు, ప్రయోజనం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రయోజనంతో కూడిన ప్రక్రియ ఇది;
* allele, n. జంటలో ఒకటి; తల్లిదండ్రుల నుండి సంక్రమించే వారసవాహికలలో జంటలుగా కనిపించే జన్యువులలో ఒకటి;
* allergen, n. ఎలర్జీని కలుగజేసే ప్రతిజని;