మంచిరోజులు వచ్చాయా?

స్వాతంత్య్రం వచ్చింది

రోజులు మారాయి

తెల్లదొరలు పోయారు

నల్లదొరలు వచ్చారు

నాయకులయ్యారు

ప్రభుత్వాలు మారాయి

పట్టెడన్నం కరువైంది

ఆకలి భాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యo

నిన్న ప్రత్తి రైతులు ,చేనేత కార్మికులు

నేడు వ్యవసాయ కూలీలు

ప్రభుత్వాలు ఆకలి కేకలు అరికడతామంటారు

పేదరికం రూపుమాపడానికి పధకాలంటారు

ఆత్మహత్యలను లెక్కిస్తున్నారు

నాయకులు అక్రమార్జన పెంచేస్తున్నారు

అవినీతికి ఆశ్రయ మిస్తున్నారు

పేదవాడి బ్రతుకులో మార్పు శూన్యం

ఆకలి కేకలు అనంతం.

ఈ పరిస్థితి మారెది ఎప్పుడో?

"https://te.wikibooks.org/w/index.php?title=ఆకలి&oldid=34630" నుండి వెలికితీశారు