24. పాలకులు మార్చు

పాలకులు చేశారు మన రాష్ట్రాన్ని పేలికలు

పదవుల కాంక్షతో వేశారు పాచికలు

విభజన వద్దని మొత్తుకున్నా

భజన చేసేవారు ముద్దు అని హత్తుకున్నా

తెలుగు నేలను చీల్చారు

తెలుగు తల్లిని విభజించారు

అన్నదమ్ముల మధ్య ఆక్రోశం పెంచారు

తెలుగుతల్లి బిడ్డలను అనాధలను చేశారు

ఓట్ల కోసం ప్రజల పాట్లు మరచారు

సీట్ల కోసం రాష్ట్రాన్ని వేరుచేశారు

సుపరిపాలన అందించలేక

స్వపరిపాలన పెంచుకోన్నారు

పదవుల కోసమే ప్రభుత్వాలా!

ప్రజల కోసం పాటుపడవా!

ప్రజాస్తేయస్సు కోరని ప్రభుత్వాలు

ప్రజాగ్రహానికి గురియవుతాయి .

"https://te.wikibooks.org/w/index.php?title=పాలకులు&oldid=34601" నుండి వెలికితీశారు