ఋగ్వేదము
వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం మండలాలుగా భాగించబడి ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.