కటిక పేదవాడు

కడుపు మంట తాళలేక

ఆకలి దప్పులు తీరక

పట్టెడన్నం కరువై

దొంగతనం చేస్తే

కరిన శిక్షలేసి

కనికరం చూపక

కసాయితనం ప్రదర్శించి

కటకటాలలో వేస్తారు .

కోట్లకు పడగలేత్తిన కుబేరులు

కుంభకోణాలు చేసినా

పేదల భూములు ఆక్రమించినా

కోట్లలో పన్ను ఎగవేసినా

పెద్దవారిని కాపాడుతుంది.

పేదకో న్యాయం

పెత్తందారులకో న్యాయం .

చట్టాలనేవి తప్పు చేసినవారిని శిక్షించడానికే కదా!

పెద్దలను రక్షించి , పేదలను శిక్షించడానికా!

మారాలి ఈ తీరు .

చట్టం ముందు అందరూ సమానులే

తప్పు ఎవరు చేసినా తప్పే.