Wikibooks:త్యాగరాజు కృతుల ప్రాజెక్టు

(త్యాగరాజు కృతుల ప్రాజెక్టు నుండి మళ్ళించబడింది)

మఱుగేలరా ఓ రాఘవ "మ"

మఱుగేల చరాచరరూప పరా త్పరసూర్య సుధాకరలోచన "మ"


అన్ని నీవనుచు అంతరంగమున

తిన్నగా వెతకి తెలిసికొంటినయ్య

నిన్నెగాని మది నెన్నఁ జాల నొరుల

నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత "మ"


ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||


చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||


చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి

కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||


చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర

ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||


చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు

పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||


చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా

కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||