నేటి ఇల్లాలు
నేటి ఇల్లాలు
పెళ్లంటే నూరేళ్ల పంటనీ
కన్నతల్లి పుట్టిల్లు వదలి
అత్తింటి కోడలుగా
అన్నదమ్ముల నోదిలి
ఆత్మీయుల నొదిలి
చిన్ననాటి స్నేహితుల నొదలి
మెట్టినిoట అడుగుపెట్టిన
కొత్తకోడలికి
కట్టుకున్న భర్తను
ప్రత్యక్ష దైవంగా భావించినా
అత్తమామలను తల్లిదండ్రులుగా
భావించినా
కట్నం తేలేదని అఘాయిత్యం
చీటికి మాటికి చీదరింపులు .
భర్తతో ఏడమొహం , పెడమొహంగా
పుట్టింటి వారికి చెప్పుకోలేక
అత్తింటి ఆరళ్ళు భరించలేక
జీవచ్ఛవంలా బ్రతుకుతు
కుమారి నుండి
ఇంటిపేరు మార్చుకొని
శ్రీమతి గా మారిన
నేటి ఇల్లాలు .