పాలకూర పకోడీ ఒక రకమైన పకోడీ.

కావలసిన పదార్థాలు

మార్చు
  • పాలకూర తరిగినది - మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
  • శెనగ పిండి - ఒకటిన్నర కప్పు
  • బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
  • కారం పొడి - ఒక టీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • అల్లం - అరటీస్పూన్
  • పుదీనా - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా కట్ చేసుకోవాలి)
  • కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె - వేయించుకోవడానికి సరిపడా
  • ఉప్పు - తగినంత
  • వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారుచేసే పద్ధతి

మార్చు
  • ఒక గిన్నెలో శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
  • తరువాత అందులో తరిగిన పాల కూర ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టు కోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ తయారైనట్టే.
  • దీనిని వేడి వేడిగా తింటే చాల రుచిగా వుంటుండి.
  • నిలువ వుంచు కోవడానికి, గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి

.

వనరులు

మార్చు

http://telugutaruni.weebly.com/15/category/c6c48cc72b/1.html[permanent dead link]