పూర్ణం బూరెలు
పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు.
కావలసిన పదార్ధాలు
మార్చు- శనగ పప్పు - పావుకిలో
- బెల్లం లేదా చక్కెర - పావుకిలో
- మినప పప్పు - అర్ధాపావుకిలో
- మెత్తని బియ్యం పిండి - పావుకిలో
- ఎండు కొబ్బరి ముక్కలు
- ఏలకులు - తగినన్ని
తయారుచేయు విధానం
మార్చు- బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి.
- శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు.
- ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
- పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.
- పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.
చిట్కాలు
మార్చు- బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి.