బెంగుళూరు వంకాయతో..కూరలు

కావలసిన పదార్థాలు:

మార్చు

(తొక్కతీసిన) బెంగళూరు వంకాయ ముక్కలు - 4 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 4 టీ స్పూన్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 1, కారం - అర టీ స్పూను, అల్లం తురుము - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు.

తయారుచేసే విధానం:

మార్చు

వంకాయ ముక్కల్లో పసుపు కలిపి కొద్ది నీటిలో ఉడికించి వార్చేయాలి. నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేగించి, చివర్లో ఉడికిన ముక్కలు కలపాలి. చిన్నమంటపై కూర చిక్కబడ్డాక పచ్చికొబ్బరి తురుము చల్లి దించేయాలి. పరాటాల్లోకి ఈ కూర బాగుంటుంది.

చెక్కు పచ్చడి

మార్చు

కావలసిన పదార్థాలు:

మార్చు

బెంగళూరు వంకాయ పై చెక్కు - 1 కప్పు, వేరుశనగల పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, దనియాల పొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 2, ఆవాలు - పావు టీ స్పూను, చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, బెల్లం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 1 టీ స్పూను.

తయారుచేసే విధానం:

మార్చు

అర టీ స్పూను నూనెలో వేరుశనగ, మినప్పప్పు కొద్ది సేపు వేగించి తీసేయాలి. అదే కడాయిలో బెంగళూరు వంకాయ చెక్కు, ఉప్పు, పసుపు వేసి కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిక్సీలో పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దనియాలపొడి బరకగా తిప్పి, మగ్గిన చెక్కు, చింతపండు గుజ్జు, బెల్లం కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఇందులో దోరగా వేగించిన తాలింపు కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు, దోశల్లోకి కూడా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు:

మార్చు

పెసరపప్పు - 150 గ్రా., బెంగళూరు వంకాయ - 1, ఉల్లిపాయ - 1, టమోటా - (చిన్నది) 1, పచ్చిమిర్చి - 3, పచ్చి కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు.

తాలింపు కోసం:

మార్చు

నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, శనగపప్పు - 1 టీ స్పూను, జీలకర్ర, మెంతులు - పావు టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 3, ఇంగువ - చిటికెడు.

తయారుచేసే విధానం :

మార్చు

పెసరపప్పులో చిటికెడు పసుపు కలిపి మూడు కప్పుల నీటిలో ఉడికించాలి. పప్పు మూడొంతులు మెత్తబడ్డాక బెంగళూరు వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, తగినంత ఉప్పు, ఒక కప్పు నీరు పోసి మూత పెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక మంట తీసేయాలి. ఇప్పుడు మరో కడాయిలో తాలింపు వేసి కూటులో కలపాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉండే వంటకం ఇది.