మీల్ మేకర్ మంచూరియా

మీల్ మేకర్ మంచూరియా తయారు చేయు విధానము


తయారికి కావలసిన పదార్థాలు

మార్చు

మీల్‌మేకర్ - 200 గ్రాములు, ఉల్లిపాయలు - 10(గా, క్యారెట్ -10(గా, బఠాణీలు - 10(గా, అల్లం వెల్లుల్లి - 10(గా, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు-10, కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు, అజినోమోటో - ఒక స్పూను, సోయా సాస్ - నాలుగు స్పూన్లు, వెనిగర్ - నాలుగు స్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు -రుచికి సరిపడా, మైదా - రెండు స్పూన్లు, రెడ్ కలర్ - ఒక స్పూన్

తయారు చేసేవిధానం

మార్చు

ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేసి వేయించుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా తయారు.

వనరులు

మార్చు

http://telugutaruni.weebly.com/15/category/aaedba652c/1.html