సామెతలు - గ, ఘ

(సామెతలు - గ నుండి మళ్ళించబడింది)
భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.


సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]


ఇక్కడ "గ, ఘ" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.


రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.

గంగకు - దొంగకు - పంగకు తప్పులేదు

మార్చు

గంగలో మునిగినా కాకి హంస కాదు

మార్చు

గంగిగోవు పాలు గరిటడైన చాలు

మార్చు

ఈ సామెత వేమన శతకంలో ఒక పద్యం నుంచి స్వీకరించబడింది. "గంగిగోవు పాలు గరిటడైన చాలు" "కడవడైననేమి ఖరము పాలు" అంటే నాణ్యత కలది, లేదా ప్రేమతో ఇచ్చింది కొద్దిగానైనా చాలుగానీ నాణ్యత లేనివి లేదా మనసులో కుళ్ళుకుంటూ ఇచ్చినవి ఎంత ఎక్కువైనా వ్యర్థం అని దీని భావం. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

గంజాయి తోటలో తులసి మొక్క

మార్చు

గజమూ మిధ్య - పలాయనమూ మిధ్య అన్నట్లు

మార్చు

గజ్జి ఉన్నవాడికి లజ్జ వుండదు

మార్చు

గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు

మార్చు

గంజి మాత్రమే తాగగలిగే స్తోమత కలిగినవాడు, తాను గంజి తాగేటప్పుడు తన మీసాలు ఎత్తి పట్టుకోవటానికి ఇంకో మనిషిని నియమించుకోలేడు. అలాగే తమ ఆర్థిక స్తోమతే బాగాలేని వారు, వేరొకరిని తమకింద పనికిగాని, పరపతి కోసంగాని నియమించుకున్నప్పుడు వారిని విమర్శిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు.

గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారట

మార్చు

గంతకు తగ్గ బొంత

మార్చు

ఎవరికి తగిన వారు వారికి దొరకక పోతారా అని

గంత బొంత కలిపి గాడిద మోతంత అయినట్లు

మార్చు

గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడు

మార్చు

గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది - తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుంది

మార్చు

గట్టుమీద వానికి గప్పాలెక్కువ

మార్చు

గడ ఎక్కు తిమ్మన్నా - గంతులు వేయి తిమ్మన్నా అన్నట్లు

మార్చు

గడించేది ఒకడు - అనుభవించేది మరొకడు

మార్చు

గడించే వాడొకడు - గుణించే వాడొకడు

మార్చు

గడిచి బ్రతికినామని గంతులు వేయరాదు

మార్చు

గడియ పురసత్తు లేదు - గవ్వ ఆదాయం లేదు

మార్చు

గడ్డివాము దగ్గర కుక్కలాగా

మార్చు

తాను తినదు... తినే ఆవును దగ్గరకు రానీయదు....

గడ్డివామిలో సూది వెదికినట్లు

మార్చు

అసాధ్యమైన పనులు చేయడం

గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు

మార్చు

గడ్డ గడ్డకు గ్రుక్కెడు నీళ్ళు త్రాగినా రెడ్డే వ్యవసాయం చేయాలి

మార్చు

గడ్డ పలుగులు గాలికి కొట్టుకుపోతూంటే పుల్లాకు నా గతేంటి అన్నదట

మార్చు

గడ్డేసిన తావునే గొడ్డును కట్టెయ్యాలన్నట్టు

మార్చు

వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలు, సహాయకులున్నచోటే నివాసం ఉండటం మేలు అని చెప్పే సామెత ఇది.

గతం గత:

మార్చు

ఏదైన ఒక సంఘటన జరిగితే దాన్ని గురించి సదా ఆలోచించ కూడదని ఈ సామెత అర్తం. జరిగి పోయినది .... దాన్ని గూర్చి ఆలోచిస్తూ సమయం వృధా చేయకూడదు. జరగ వలసి వున్న దానినిగురించి ఆలోచించాలని ఈ సామెత అర్థం.

గతజల సేతు బంధనము

మార్చు

నీరు పోయాక ఆనకట్ట కట్టిన అనవసరం అలాగే అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు

గతి లేనమ్మకు గంజే పానకము

మార్చు

తిండికి గతి లేని వానికి గంజియే పానకము . రుచిలేనిదయిననూ దొరికిన పదార్థమును మిక్కిలి ఇష్టముగా తినటం.

గతి చెడినా మతి చెడరాదు

మార్చు

గతిమాలిన వాడికి కుతిక లావు

మార్చు

గద్దించే అత్త - మర్దించే మామ

మార్చు

గాదె క్రింద పందికొక్కులాగా

మార్చు

గానుగవాడి ఎద్దుగానూ - చాకలివాడి గాడిదగానూ పుట్టరాదు

మార్చు

గబ్బిలంలాగా అటు పక్షీ కాదు - ఇటు జంతువూ కాదు

మార్చు

గబ్బిలాయి ముఖంలాగా

మార్చు

గయ్యాళి, గచ్చపొద ఒకటే

మార్చు

గరిక మేసిన గాడిద చస్తుందిగానీ, గరిక చావదు

మార్చు

గురుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు

మార్చు

గరుత్మంతుణ్ణి చూచిన పాములాగా

మార్చు

గర్భాదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు

మార్చు

గర్భాదానానికి రమ్మని జాబువ్రాస్తే నాకు తీరికలేదు నేనున్నట్లుగానే జరిపించండని జాబు వ్రాసాట్ట

మార్చు

గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది

మార్చు

గ్రహాలు గతులు తప్పినా, ఆడినమాట తప్పరాదు

మార్చు

గండం గడిచి పిండం బయటపడ్డట్లు

మార్చు

గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదేనన్నట్టు

మార్చు

ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారని, అటు వంటి వారి గురించి ఈ సామెత పుట్టింది. . ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఈ సామెత కూడా అదే అర్థంలో చెప్పినదే.

గంపలాభం చిల్లు తీసినట్లు

మార్చు

గాజుల బేరం భోజనానికి సరి

మార్చు

సరిపడ ఆదాయము లేని వ్యాపారాన్ని చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు.

గాజుల చెయ్యి గలగల్లాడితే యిల్లు కళకళలాడుతుంది

మార్చు

గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు

మార్చు

ఇలాంటి సామెత మరొకటి: గడ్డి వామి దగ్గర కుక్క పాపలా వున్నట్లు: వివరణ. కుక్క గడ్డి తినదు.... ఆవును తిననీయదు.

గాడి తప్పిన బండివలె

మార్చు

గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన

మార్చు

మంచి విషయాల విలువ అర్హత ఉన్నవాళ్ళకే తెలుస్తుంది, అనర్హులకు, కుమతులకు వాటి విలువ తెలీదనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. పందికేం తెలుసు పన్నీరు వాసన అని కూడా అనడం కద్దు.

గాడిదకు గడ్డివేసి, ఆవును పాలిమ్మన్నట్లు

మార్చు

గాడిదకు భోగినీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట

మార్చు

గాడిదగుడ్డు

మార్చు

వట్టిది, లేనిది, శూన్యము. [నిస్సారతను సూచించుటలోను, తిరస్కారములోను, అహంభావములోను వక్రగతిని పోవువారలపట్ల ఉపయోగించు ఊతపదము.] "వాని దగ్గఱేముంది గాడిదగుడ్డ" "వానికేం తెలుసు గాడిదగుడ్డు" మొ|| (వ్యవ)

గాడిదకేమి తెలుసు గంధపు వాసన?

మార్చు

గాడిదతో సేద్యం కాలి తాపులకే

మార్చు

గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు జడిస్తే ఎట్లా?

మార్చు

గాడిద పుండుకు బూడిద మందు

మార్చు

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట

మార్చు

గాడిద, సంగీతము, ఒంటె, అందము పూర్తిగా భిన్న ధ్రువాలు. వేటిలోనూ ప్రావీణ్యత లేని ఆ రెండూ, ఒకరినొకరు ప్రశంశించుకోవటం అర్థంలేని పని. ఈ విషయాన్నే, పాండిత్యము లేని వారు పరస్పరం ఒకరినొకరు పొగుడుకునే సందర్భములో ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు.

గాదె క్రింద ఎలుక గాదె క్రిందే బ్రతకాలి

మార్చు

గాదె క్రింద పందికొక్కులాగా

మార్చు

గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట

మార్చు

గారెలు చేయవే పెండ్లామా అంటే వేలు మాత్రం చూపిందట

మార్చు

గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలి

మార్చు

ఇలాంటిదే మరొక సామెత: బిడ్డ ముద్దొచ్చినప్పుడే చంక నెక్కాలి.

గాలి కబుర్లు అంటే నిజం లేని మాటలు అబద్దాలు అని అర్థం దీనికి పుకార్లు ప్రచారం చేయటం అని కూడా పిలుస్తారు లేనిపోనివి కల్పించడం విషయానికి సంబంధించి మనకు స్పష్టమైన సమాచారం లేకుండడం

మార్చు

గాలికి పుట్టి ధూళికి పెరిగినట్లు

మార్చు

గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు

మార్చు

గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం

మార్చు

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట

మార్చు

గాలిలో దీపం పెట్టి, ఆర్పకుండా ఉండాలని దేవుని ప్రార్థించాట్ట వెనకటికెవడో. కనీస మానవ ప్రయత్నం చేయకుండా పూర్తిగా దేవునిపై భారం వేసే వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఒక పని చేసే టప్పుడు ఆపని సక్రమముగా పూర్తి కావడానికి తాను చేయ వలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆతర్వాత దేవునిపై భారం వేయాలని బోధించేది ఈ సామెత.

గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు

మార్చు

వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు చేసే వారిని గూర్చి ఈ సామెతను ఉపయోగిస్తారు.

గాలితో తాడు పేనినట్లు

మార్చు

సాధ్యంకాని పనిని సులభముగా చేస్తామని కోతలు కోసే వారి నుద్దేశించి ఈ సామెతను చెప్తారు.

గాలిని మూట కట్టగలం గానీ, గయ్యళి నోరు మూయలేం

మార్చు

గాలిలో మేడలు కట్టినట్లు

మార్చు

గ్రాసంలేని కొలువు - మీసంలేని బ్రతుకు - రసం లేని కావ్యం ఒక్కటే

మార్చు

గిరాకీ కొననివ్వదు - మందం అమ్మనివ్వదు

మార్చు

గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగుతుందా?

మార్చు

గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట

మార్చు

అసత్యం చెపితే అది నమ్మదగినదిగా ఉండాలి. ఇనుప గుళ్ళు నీట తేలుట అసాధ్యము, అటులనే కొయ్యతో చేసిన బెండ్లు మునుగుట అసాధ్యము. ఇది నిజమని నమ్మజూపు వాడు పరమ అసత్యవాది. ఈ సామెత ఈ విషయమునే తెలుపుచున్నది.

గుండెల ఊపుడుకాదు తొడల తొక్కుడుకు తయారుకా అన్నాడట

మార్చు

గుంపులో గోవిందా

మార్చు
  • ఎక్కువమంది గుమిగూడిన చోట ఎదైనా జరిగితే అది ఎవరు చేసారో కనిపెట్టడం కష్టం. దీనినే గుంపులో గోవిందా అని వ్యవహరిస్తాం.
  • గుంపుగా వెళుతున్న వెంకన్న భక్తులలో ఒక్కడు గోవిందా అని అరిస్తే అందరు గోవిందా అని అరుస్తారు. వారిలో ఏ ఒక్కడు అరవక పోయినా అది తెలియదు.

గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?

మార్చు

గుడగుడ ఆలోచన గుడిసెకు చేటు

మార్చు

గుడారం గూని బ్రతుకు

మార్చు

గుడి దగ్గరయితే గురుత్వం దూరం

మార్చు

గుడినే మింగే వానికి గుడిలోని లింగం ఓ లెక్కా

మార్చు

పెద్ద పెద్ద దొంగ తనాలు చేసే వానికి చిల్లర దొంగ తనాలు ఒక లెక్కా అనే అర్థంతో ఈ సామెత వాడతారు.

గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలు

మార్చు

గుడిని మింగే వాడికి లింగం అడ్డమా?

మార్చు

గుడ్డి కన్నా మెల్ల నయము కదా

మార్చు

పూర్తిగా అంధకారమయమయిన గుడ్డితనము కన్నా, అంతో ఇంతో కనపడు మెల్లతనము ఎంతో మిన్న. ఈ సత్యమునే ఈ సామెత ద్వారా పలు సందర్భాలలో చెప్పుదురు. ఒక ఉదాహరణ, పది రూపాయలు నష్టపోయే సందర్భంలో మరో చిన్న పని చేయటము ద్వారా ఆ నష్టాన్ని తొమ్మిది రూపాయలకు తగ్గించుకోగలిగే పరిస్థితిలో, ఈ సామెతను వాడవచ్చు.

గుడిసేటి పనులు

మార్చు

గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు

మార్చు

గుడ్డి కన్ను తెరిసినా ఒకటే మూసిన ఒకటే

మార్చు

ఉపయోగం లేని పనిచేసి నపుడు ఈ మాట అంటారు.

గుడ్డి గుర్రానికి దాణా చేటు

మార్చు

గుడ్డి మొగుడికి రేచీకటి పెళ్ళాం

మార్చు

గుడ్డివాడి ఉపాయం గుడ్డివాడిది, గూనివాడి ఉపాయం గూనివాడిది

మార్చు

గుడ్డివాడి చేతిలో రాయి

మార్చు

గుడ్డివాడు ఎటు రువ్వినా గురే

మార్చు

గుడ్డివాళ్ళు ఏనుగులను తడిమి చూచి వర్ణించినట్లు

మార్చు

గుడ్డి కంటికి మట్టి అద్దం

మార్చు

గుడ్డి కంటికి పగలైతేనే? రాత్రయితేనేం?

మార్చు

గుడ్డికన్నా మెల్ల మేలు

మార్చు

గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒక్కటే

మార్చు

గుడ్డి గుర్రానికి దాణా చేటు

మార్చు

గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు

మార్చు

ఆతల్లికి పుట్టిన పిల్లలు తిరిగి ఆ తల్లినే వెక్కిరించడము. అలాంటి వారిని గురిం చి ఈ సామెతను వాడతారు.

గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుంది

మార్చు

సమాదానము లేని ప్రశ్నలు వేసి నప్పుడు ఈ సామెతను వాడతారు.

గుడ్డోడికి కుంటోడి సాయం

మార్చు

సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్లు... అలాంటిదే పై సామెత కూడ.

గుడ్డెద్దు చేలో పడినట్లు

మార్చు

గుడ్డి ఎద్దు చేలో పడితే, అంతా విధ్వంసమే. దారీతెన్నూ తెలియక మొత్తం పైరుని నాశనం చేస్తుంది. కళ్ళు కనబడని కారణంగా అది పైరును మేసి నష్టపరచింది తక్కువైనా.... అది అటు ఇటు తిరిగి తొక్కి పైరుకు చేసిన నష్టం చాల ఎక్కువ. ఈ విషయాన్నే, తీరూతెన్నూ లేక అటూ ఇటూ పనిలేక తిరిగే వాణ్ణి ఉదహరిస్తూ చెబుతారు. ఆ సందర్భంలో చెప్పినదే ఈ సామెత.

గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు

మార్చు

వెనకటికెవరో గుమ్మడికాయల దొంగెవరు అంటే తన భుజాలు తడుముకున్నాట్ట. అంటే, తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్ళిన తాలూకు చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో అని చూసుకుంటున్నాడుట. నిజముగా దొంగతనము చేయనివాడయితే కదలక మెదలక ధైర్యంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేసి తట్రుపాటులో ఉంటే ఈ సామెతను వాడ్తారు.

గురి కుదిరితే గుణం కుదురుతుంది

మార్చు

గురి తప్పినా పులినే కొట్టాలి - గుంటనక్కను కాదు

మార్చు

గురివింద గింజ తన నలుపెరగదంట

మార్చు

గురివింద గింజ ముందు భాగమంతా ఎరుపుగా ఉండి, వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉండును. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. అదే విధముగా, తమలోని లోట్లు తెలుసుకోలేక, ఇతరులను తప్పు పట్టువారిని ఈ సామెతతో పరిహసించుట పరిపాటి.

గురివిందగింజ తన ముడ్డిక్రింద నలుపెరగదు

మార్చు

గురువుకే పంగ నామాలు పెట్టే రకం వాడు

మార్చు

మోసం చేయడానికి తన, పర భేదం పాటించని వాడిని గురించి ఈ సామెత వాడతారు.

గురువు నుంచుని త్రాగితే, శిష్యుడు పరిగెడుతూ త్రాగుతాడు

మార్చు

గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు

మార్చు

గురువుకు పంగనామాలు పెట్టినట్లు

మార్చు

గురువులేని విద్య గుడ్డి విద్య

మార్చు

గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట

మార్చు

ఓ అవివేకి యొక్క మనస్తత్వాన్ని ఈ సామెత తెలియచేస్తోంది. గుర్రం కరుస్తుందని భయపడి, అంతకన్నా ప్రమాదకరమయిన స్థానమయిన గాడిద వెనక ఓ అవివేకి కూర్చున్నాడట.

గుఱ్ఱము కడుపున గాడిదపిల్ల పుడుతుందా?

మార్చు

గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!

మార్చు

గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు

మార్చు

గుడ్డి గుర్రం ఏ పనికీ, ఎందుకూ పనికి రాదు. అయినా దానికి దాణా పెట్టడం తప్పదు. అలాగే కొంతమంది ఇంట్లో ఏ పనీ చేయకుండా జులాయిలా తిరుగుతూ తిండి తినే సమయానికి మాత్రం ఇల్లు చేరతారు. ఇంట్లో మనిషి కాబట్టి తిండి పెట్టడం ఎలాగూ తప్పదు. అలాంటి వారికి ఉద్దేశించిందే ఈ సామెత.

గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?

మార్చు

జన్మత: అబ్బే లక్షణాలను నేర్పనవసరము లేదని ఈ సామెత భావము. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినడము అన్నది స్వత:సిద్ధముగా వస్తుంది. అది మరొకరు నేర్పనవసరము లేదని ఈ సామెత చెబుతోంది. చేప పిల్లకుఈత నేర్పవలెనా అన్న సామెత కూడా ఇలాంటిదె.

గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా

మార్చు

గుర్రం తిండి గుర్రానిదే, ఆవు తిండి ఆవుదే. ఒకరికి సహాయపడి మరొకరి నుంచి ప్రతిఫలం ఆశించటం మూర్ఖత్వము. ఈ విషయాన్నే ఈ సామెత తెలియచేస్తోంది.

గుర్రానికి ముడ్డిలో కాలితే వరిగడ్డి తింటుంది

మార్చు

గుర్రానికి సకిలింత - సంగీతానికి ఇకిలింత వుండాలి

మార్చు

గుర్రాన్ని యేటివరకూ తీసికెళ్ళగలమే గానీ నీళ్ళు త్రాగించగలమా?

మార్చు

గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి పులిహోర కోరాడట

మార్చు

గుళ్ళో పిత్తక పోతే గుగ్గిలం వేసినంత పుణ్యం

మార్చు

గువ్వ గూడెక్కె - రాజు మేడెక్కె

మార్చు

గూటిలో కప్ప పీకితే రాదు

మార్చు

నోట్లో నాలుక

గూట్లో దీపం - నోట్లో ముద్ద

మార్చు

గూనివాని ఒడుపు పడుకున్నపుడు చూడాలి

మార్చు

గూబ ఎక్కిన గృహము చెడును

మార్చు

గూబ అనగా గుడ్లగూబ అని అర్థం. గుడగూబ ఇంటిలోకి వస్తే ఆ యింటికి అరిష్టమని అందరి నమ్మకము. ఆ నమ్మకానికి ఈ సామెత సమాధానం.

గెలువని రాజుకు గొప్పలు మెండు

మార్చు

గేదె, దూడ వుండగా గుంజకు వచ్చెరా గురక వాయువు

మార్చు

గొడుగుమీద గొడుగుంటే పిడుగుమీద పిడుగు పడినట్లే

మార్చు

గొడ్డుకు ఒక దెబ్బ - మనిషికి ఒక మాట

మార్చు

గొడ్డుకి తిన్నది పుష్టి - మనిషికి ఉన్నది పుష్టి

మార్చు

గొడ్డు రైతుకు ఒక బిడ్డ

మార్చు

పశువులు రైతులకు తమ పిల్లలతో సమానమని అర్థము.

గొడ్డు వచ్చిన వేళ - బిడ్డ వచ్చిన వేళ

మార్చు

ఒక ఇంట్లోకి పెళ్ళై ఒక ఆడ పిల్ల వచ్చిన వేళ అదే విధంగా ఒక పశువు వచ్చిన వేళ మంచిదయితే ఆ యిల్లు బాగుపడుతుందని ఈ సామెతకు అర్థము.

గొడ్డువాడు గొడ్డుపోయి ఏడుస్తుంటే మాదిగవాడు తోలు పోయిందని ఏడ్చాడట

మార్చు

గొడ్రాలికి గొంతు పెద్ద

మార్చు

గొడ్రాలికేమి తెలుసు ప్రసవ నొప్పులు

మార్చు

పిల్లలను కాన్నామెకు కనేటప్పుడు వచ్చే ప్రసవ నొప్పులు ఎలావుంటాయో ఆమెకే తెలుస్తాయి. గొడ్రాలికి అనగా పిల్లలు కలగని స్త్రీకి ఆ నెప్పులు ఎలా వుంటాయో తెలియదని అర్థం.

గొడ్రాలి తిట్టూ, గొడ్డలిపెట్టూ ఒక్కటే

మార్చు

గొప్పగా తెలిసినవారే గోతిలో పడతారు

మార్చు

గొఱ్ఱు గుచ్చిన నేలకు కొరత వుండదు

మార్చు

గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే

మార్చు

గొర్రె కసాయివాడినే నమ్ముతుంది

మార్చు

గొర్రెవాటు వేలం వెర్రి

మార్చు

గొర్రె బలిస్తే గొల్లకే లాభం

మార్చు

గొర్రెల మందలో తోడేలు పడ్డట్లు

మార్చు

గొర్రెలు గుంపు కూడితే గొప్ప వర్షం

మార్చు

గొల్లల గోత్రాలు గొర్రెల కెరుక, గొర్రెల గోత్రాలు తోడేళ్ల కెరుక

మార్చు

గొల్లల గోత్రాలు గొర్రెలకు తెలిస్తే - గొర్రెల గోత్రాలు గొల్లల కెరుక

మార్చు

గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు

మార్చు

తక్కువ కులం వారు ఆర్థికం బలపడితే తమ కులం చెప్పుకోడానికి ఇష్టపడరు. అంచేత వారు తమ పేర చివరన వేరే కులంవారి మకుటాన్ని పెట్టు కుంటారు. "రావు" అనేది ఒకప్పుడు ఒక ప్రత్యేక కులానికి మాత్రమే సంబంధించింది. కాని ఇప్పుడు అన్ని కులాల వారు దాని వాడు కుంటున్నారు. అలా వచ్చిందే ఈ సామెత.

గొళ్ళెం లేని తలుపు - కళ్ళెం లేని గుర్రం

మార్చు

గొంగళిలో తింటూ వెండ్రుకలు ఏరి నట్లు

మార్చు

గొంగళి అంటేనే వెంట్రుకలో చేసింది.. దానిలో అన్నం తింటే వెండ్రుకలు రావడము సహజమే... వాటిని ఏరడము వృధా ప్రయాస. అలాంటి పని చేశే వారినుద్దేసించి ఈ సామెతను వాడతారు.

గొంగడున్నంతే చాచుకోవాలి

మార్చు

గొంతుకలో వెలక్కాయ పడినట్లు

మార్చు

గొంతెమ్మ కోరికలు

మార్చు

గోటితో పోయేదానికి గొడ్డలెందుకు

మార్చు

గోటితో పోయేదానికి గొడ్డలిని ఉపయోగించాల్సిన పని లేదు. అలాగే చిన్న విషయాల్ని చిన్నగానే సామరస్యంగా పరిష్కరించుకొవాలేగానీ అనవసర రాద్ధాంతం చెసుకోకూడదు అని దీని అర్థం.

గోడకు చెవులుంటాయి

మార్చు

రహస్యాన్ని రహస్యంగానే వుంచాలి. బయటకు చెప్పకూడదు అని అర్థం.

గోడకేసిన సున్నం లాగ

మార్చు

ఈ సామెతకు అనేక వ్యవహార ప్రయోగాలు ఉన్నాయి. గోడకు వేసిన సున్నం తిరిగి మన చేతికి రాదు అన్న సత్యం తెలిసినదే. అలానే, ఎవరికయినా అపాత్ర దానము చేసినట్లయితే, ఆ తరువాత విషయము తెలిసినా, అది గోడకు వేసిన సున్నముతో సమానమే.వెలయాలికి వెచ్చించిన డబ్బు, గోడకు వేసిన సున్నము తిరిగి రాదు అనే అర్థంలో కూడా ఈ సామెతను వాడతారు. (ఎవరికైనా ధనము అప్పుగా ఇస్తే అది తిరిగి రాని సందర్భంలో ఈ సామెతను వాడతారు)

గోడ మీద పిల్లి వాటం వాడు

మార్చు

గోడ మీద వున్న పిల్లి ఎటు దూకుతుందో చెప్పడం కష్టం. అలాగే...నీతి నియమం లేకుండా ఎటు అవకాశము వుంటే అటు వైపు వెళ్లే వారిని గురించి ఈ సామెత వాడతారు

గోచీకి ఎక్కువ తుండుకు తక్కువ

మార్చు

గోచీకి మించిన దరిద్రం లేదు

మార్చు

గోచీపాతల రాయుడులాగా

మార్చు

గోడకు కొట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు

మార్చు

గోడమీద పిల్లివాటము

మార్చు

గోడుకు గోకుడే మందు

మార్చు

గోడలకు చెవులుంటాయి - నీడలకు కళ్ళుంటాయి

మార్చు

గోతి కాడ నక్కలా

మార్చు

ఏ విధముగా నయితే ఓ జిత్తులమారి నక్క ఓ గోతి వద్ద దాగి కూర్చోని, అందులో పడ్డ వారిని సంహరించి తింటుందో, దుష్టులు కూడా చెడు పనులు చేయుటకు సర్వధా తగ్గ అవకాశమునకై వేచిచూచుదురు అని ఈ సామెత తెలుపుచున్నది.

గోతిని తీసినవాడే అందులో పడేది

మార్చు

గోతిలోపడ్డాడు

మార్చు

కష్టాలలో చిక్కుకున్నాడని అర్థం. ఉదా:.... వాడు తెలిసి తెలిసి గోతిలో పడ్డాడు (ఇది జాతీయము. దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు)

గోముఖ వ్యాఘ్రం

మార్చు

గోవే తల్లి - ఎద్దే తండ్రి

మార్చు

గోరంత ఆలస్యం కొండొంత నష్టం

మార్చు

కొంచెం ఆలస్యంతో బారి నష్టం జరిగే సందర్భాలు చాలమందికి అనుభవమే. ఆ సందర్భంగా వాడేది ఈ సామెత.

గోరంత దీపం కొండంత వెలుగు

మార్చు

దీపం చిన్నదైనా.... అవసరంలో అదే అతి పెద్ద దిక్కు. స్వల్పమని దేనిని చీత్కారము చేయ కూడదు. గోదావరిలో పడ్డ వానికి గడ్డి పోచ చిక్కిన ప్రమాదంనుండి బయట పడే అవకాశమున్నది. కొంచెమే నని దేన్ని హీనంగా చూడకూడ దని ఉపదేశించేదే ఈ సామెత.

గోరంతను కొండంతను చేయడము

మార్చు

అతి చిన్న విషయాన్ని చిలువలు పలవలుగా వర్ణించి పెద్ద విషయంలాగా చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు

గోరంత వుంటే కొండంత చేసినట్లు

మార్చు

గోరుచుట్టు మీద రోకటిపోటు

మార్చు

ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు.

  1. గోరుచుట్టు అంటే చేతివేళ్ళు వాచి నొప్పి పెట్టే ఒక జబ్బు. ఇక ఆ వేలి మీద రోకలి పడిందంటే ఆ బాధ చెప్పనక్కర లేదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆవిధంగా దెబ్బ మీద దెబ్బ తగిలితే ఈ సామెత వాడతారు.

గోడ మీద పిల్లి వాటం

మార్చు

గోడ మీదున్న పిల్లి ఏ వైపుకు దూకుతుందో ఎవరూ ఊహించ లేరు..... అలాగే ఏ లక్ష్యం లేని పని చేసే టప్పుడు ఈ మాటను వాడతారు.

గోడకు కొట్టిన బంతి లాగ

మార్చు

నీవు విసిరిన రాయి నీకే తగులుతుందని చెప్పడానికి ఈ మాటను వాడతారు.

గోళ్లుగిల్లుకుంటున్నాడు

మార్చు

ఏపని లేదని అర్థం. ఉదా: వాడు ఏ పనీ లేక గోళ్ళు గిల్లుకుంటున్నాడు. పని పాట చేయని వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.

ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు

మార్చు

ఘోటక బ్రహ్మచారి లాగా

మార్చు

మూలాలు

మార్చు
  1. లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం