ఉబుంటు/చలనచిత్రాలు
ఉబుంటు తో అప్రమేయంగా సినిమాలను చూపించేది చలనచిత్ర ప్లేయర్ (టోటెమ్). దీనిలో నేరుగా స్వేచ్ఛా సాంకేతికాల ఆకృతిలో వున్న సినిమాలు చూడవచ్చు. ఎమ్పెగ్(mpeg) లాంటి సాంకేతికాల ఆకృతిలో వున్న విసిడి/డివిడి మాధ్యమాలకోసం జిస్ట్రీమర్ (gstreamer)విస్తరణ స్థాపించుకోవాలి. దీనిని ఉబుంటు స్థాపించుకునేటప్పుడు థర్డ్ పార్టీ ప్లగిన్లు స్థాపించు అన్న చెక్ బటన్ చేతనంచేస్తే సరే లేకపోతే మీకు ఇటువంటి మాధ్యమం వాడటం మొదలుపెట్టినపుడు, ప్లగిన్లు స్థాపించమనే విండో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంతర్జాల సంపర్కంతో స్థాపించుకోవచ్చు. లేకపోతే ఈ క్రింది లింకు నుండి పాకేజీ తెచ్చుకుని స్థాపించుకోవచ్చు.
- gstreamer0.10-jfmpeg
- gstreamer0.10-fluendo-mp3
- gstreamer0.10-plugins-bad
- gstreamer0.10-plugins-ugly
ఫైళ్లు
మార్చుమీ కంప్యూటర్లోని చలనచిత్ర ఫైళ్లు చూడటానికి, వాటిపై రెండు సార్లు నొక్కితే అప్రమేయ అనువర్తనంతో నడపబడుతుంది. వేరే అనువర్తనం వాడాలనుకుంటే మౌస్ కుడి మీట నొక్కి తెరచు ఎంచుకొని అప్పుడు కనబడే విండోలో మీకు నచ్చిన అనువర్తనం ఎంపిక చేసుకోవచ్చు.
డివిడి(DVD)
మార్చుసినిమా డివిడి మీరు ప్రవేశపెట్టగానే మీకు ఉపకరణాన్ని ఎంచుకొనే విండో కనబడుతుంది. సరే నొక్కిన తరువాత మీ డివిడి నడపబడుతుంది.
విసిడి(VCD)
మార్చువిసిడి కూడా డివిడి లాగానే పనిచేస్తుంది. అయితే చలనచిత్ర ప్లేయర్ లో ని దోషాల కారణంగా స్వయంచాలకంగా సరిగా పనిచేయడంలేదు. అందుకని విఎల్సి మీడియా ప్లేయర్(VLC media player) స్థాపించుకుని దానిలో మెనూలో open disk అదేశం ఇచ్చి ఆ తరువాత వచ్చు సంవాదపెట్టెలో vcd ఎంచుకుంటే సరి.