ఉబుంటు/తరచూ అడిగే ప్రశ్నలు
నాకు తెలుగు అనువాదం లో తప్పులు కనబడ్డాయి. వాటిని సరిచేయటం ఎలా?
మార్చుతెలుగు అనువాదాన్ని మెరుగు పరచడానికి తెలుగు స్థానికీకరణ జట్టు [1] పనిచేస్తున్నది. మీరు అ పేజీలలో సరియైన పాకేజీని ఎంపికచేసికొని కొత్త అనువాద పదాన్ని చేర్చవచ్చు. తెలుగు స్థానికీకరణజట్టులో పాల్గొని మరింత చర్చించవచ్చు.
తెలుగు టైపు చేయటానికి కీ బోర్డుపై తెలుగు అక్షరాలు ముద్రించి వుంటే బాగుంటుంది. దాని కేదైనా సూచన చేయగలరా
మార్చుతెలుగు అక్షరాలు ముద్రించిన కీ బోర్డులు అందుబాటులో లేవు. కాని దీనికోసం చిన్న చిట్కాలున్నాయి. అక్షరాలు గమ్ అతికించిన పేపర్ లేక ఫిల్మ్ పై ముద్రించుకొని మీ కీ బోర్డుపై అంటించుకోవచ్చు. లేక చెరిగిపోని సిరా గల కలం తీసుకొని మీరే చక్కగా కీ బోర్డు పై తెలుగు అక్షరాలు రాసుకోవచ్చు.
పుస్తకం చదివితే ఆసక్తిగా వుంది. కాని ఎవరైనా ఒక వర్క్‍షాప్ లో నేర్పించితే మాకు వుపయోగంగా వుంటుంది
మార్చుమీరు తెలుగులినక్స్ వాడుకరుల జట్టు ని[2] మీ అభ్యర్థన తెలియచేయండి. వారు స్పందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలో మీరు పనిచేస్తుంటే బాస్‍లినక్స్ సహాయ కేంద్రాన్ని [3]సంప్రదించవచ్చు.
PPA లు కనుబడుటలేదు లేదా మీ అనువర్తనాలు స్థాపించుటకు నిరాకరించాబడినదా
మార్చుమీరు కొత్తగా ఉబుంటు కనుక స్థాపించుకున్నచో కొన్ని Personal Package Archive దొరకట్లేదు అలాంటి సమయాలలో మీకు "software database broken- you can not install or uninstall any package" అను సందేశం కనపడ వచ్చు. దాని నుంచీ బయట పడుటకు నేను నా blog లొ వివరించాను లంకే నేను ఉపయోగించిన అనువర్తనం yppa