ఉబుంటు/తెలుగు టైపు చేయటం

ఉబుంటు/తెలుగు లినక్స్ లోటైపింగు చేయు విధానాలు చాలా వున్నాయి. ఈ విభాగంలో భారతదేశం ప్రామాణిక ప్రవేశపెట్టుపద్దతి ఐన ఇన్స్క్రిప్ట్ గురించి వివరంగా మరియు ఇతర పద్ధతులుగురించి క్లుప్తంగా తెలుసుకుందాము.

సహజతోడ్పాటుతో ఇన్‍స్క్రిప్ట్ మార్చు

 
ఇన్స్క్రిప్ట్


ఉబుంటు తెలుగుతో స్థాపించినపుడు, లేక తెలుగు భాషా పాక్ స్థాపించినపుడు సహజంగా ఇన్‍స్క్రిప్ట్ కీ బోర్డు ఇండియా తెలుగు అనే పేరుతో లభ్యమవుతుంది. దీనిని అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు వున్నాయి. అచ్చుల కీ ల లో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో వున్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్  : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.

చాలా హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు,తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది.

హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో వున్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను వర్గానికి దగ్గర కీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.

 
తెరపై తెలుగు కీ బోర్డు కనబడువిధం
 
కీ బోర్డు పై బల్బు వెలగటం (తెలుగు కీ బోర్డు వాడునపుడు)

మామూలుగా వాడే ఇంగ్లీషు కీ బోర్డు నుండి దీనికి మారటానికి టాగుల్ కీ గా ఎడమవైపు షిఫ్ట్(Left Shift) మరియు ఆల్ట్(Alt) కీలను జతగా వాడతారు. దీని ప్రాధాన్యమేమంటే లాగిన్ స్టేజీ దగ్గరనుండి తెలుగులో టైపు చేయవచ్చు. అంటే మీ వాడుకరి పేరు, సంకేత నామం కావాలంటే తెలుగు లో రాయవచ్చు. అలాగే టర్మినల్ లో కూడా వాడవచ్చు.

తెలుగు టైపు ఎంచుకున్నపుడు పై పేనెల్ లో కీ బోర్డు స్థితి Ind (India Telugu) గా మారుతుంది మరియు మీ కీ బోర్డుపైన చివరి బల్బు వెలుగుతుంది. వీటివలన మీరు ఏ కీ బోర్డు తీరు వాడుతున్నారో మీకు తెలుస్తుంది.

టైపింగ్ ఉదాహరణలు మార్చు

సాధారణ అక్షరాలు
  • అ=D, ఆ=E, ఇ=F,... ఔ=Q
  • ప=h,పా=he, పి=hf...పం=hx
  • ప్=hd, ప్ర=hdj, ప్రా=jdje,... ప్రాం=hdjx
  • ప్యే=hd/s, పృ=h-
పదాలు

తెలుగు=lzngigస్థాపన

పారిభాషిక పదాలు

పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.

  • ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner(ZWJ) ) లేక శూన్యవెడల్పు విరుపు (ZeroWidthNonJoiner(ZWNJ)వాడి రాయాలి. దీనికొరకు లినక్స్ వ్యవస్థలలో x కీ బోర్డు లో సదుపాయం లేదు. మీరు వాడే అనువర్తనంలో వున్న సదుపాయం వాడండి.
  • సాఫ్ట్‍వేర్=meHd'<zwj> bsjd (zwj ప్రవేశపెట్టటానికి గ్నోమ్ అనువర్తనాలలో మోస్ కుడి క్లిక్ చేసి దానిలో వచ్చే మెనూలో యూనికోడ్ అక్షరం ప్రవేశపెట్టు అనేదానిలో ZWJ ఎంచుకోవాలి).
  • సాఫ్ట్‌వేర్=meHd'<ZWNJ> bsjd

ఐబస్ మార్చు

 
ఐబస్ అభీష్టములు సాధారణ టాబ్
 
ఐబస్ అభీష్టములు ఇన్పుట్ పద్ధతులు టాబ్
 
ఐబస్ అభీష్టములు ఉన్నత టాబ్

ఐబస్ (ibus) కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ప్యాకేజీ(ibus-m17n) పొంది స్థాపించుకోవాలి. లాగిన్ ప్రారంభమైనతర్వాత ఐబస్ డీమన్ ప్రారంభించి మనకు కావలసిన కీ బోర్డు నమూనా (ఇన్స్క్రిప్ట్ తోసహా) ఎంచుకోవచ్చు. టాగుల్ కీ కూడా మనకిష్టమైనట్లుగా పెట్టుకోవచ్చు. సాధారణంగా కంట్రోల్ (ctrl) మరియు స్పేస్(space) జతగా నొక్కాలి.

తెలుగులోటైపుచెయ్యడానికి Keyboard input method system లో ఐబస్ ఎంచుకోవాలి. ఐబస్ ఆభీష్టాలలో(System-> Preferences-> Ibus Preferences) మనకు నచ్చిన ప్రవేశ పద్ధతులలో (ఇన్‍స్క్రిప్ట్,ఐట్రాన్స్,ఆర్టిఎస్, ఏపిల్,పోతన) ఒకటి ఎంచుకోవాలి. ఇక మనం ఉబుంటు ఏ అనువర్తనంలో నైనా తెలుగు టైపు చేయవచ్చు.

ఇతర పద్ధతులు మార్చు

వెబ్లో మాత్రమే పనిచేసే పద్ధతులు మైక్రోసాఫ్ట్, గూగుల్,వికీపీడియా ద్వారా అందుబాటులో వున్నాయి.

ఇవీ చూడండి మార్చు

వికీపీడియా లో విజ్ఞానసర్వస్వ శైలిలో తాజా వివరాలుండే వ్యాసం: