ఉబుంటు అన్నది లినక్స్ పంపకాలన్నింటిలో కెల్లా అత్యంత ప్రజాదరణ పొందినది. 28 ఏప్రిల్ 2011 న విడదలైన 11.04 రూపాంతరములో సిడి/డివిడి నుండి నేరుగా తెలుగులో స్థాపించుకోవటమేకాకుండా,సాదారణ వాడుకకు చాలావరకు తెలుగులో అదేశాల వరుసలు(మెనూలు), వివరణలు కనబడతాయి. అందువలన ఇంగ్లీషు బాగా తెలియని వారు కూడా దీనిని వాడుకోవచ్చు. దీనిని సులభంగా వాడుకోవడానికి తెలుగు వారి కోసం చేస్తున్న చిన్న పుస్తకమే ఈ ప్రయత్నం.

ఇది జీవంగల పుస్తకం అనగా దీనిలో మార్పులు ఎల్లకాలం జరుగుతూ వుంటాయి. ఈ పనిలో మీరు రకరకాలుగా తోడ్పడవచ్చు: వ్యాసాలను వ్రాయటం సరిదిద్దటం, బొమ్మలను చేర్చటం, లేదా ఈ పుస్తకం లోని దోషాలను తెలపటం, ఈ పుస్తకాన్ని మెరుగు పరచడానికి మీ సలహాలను, సూచనలను తెలియజేయడం. దీని తయారీలో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం.

తెలుగు లినక్స్ స్వేచ్చా నకలు హక్కుల చిహ్నం

Happy New Year!

నిష్పూచి మార్చు

ఈ పుస్తకంలోని వివరాలు ప్రజలకు ఉపయోగంగా వుండగలవనే విశ్వాసంతో ఇవ్వబడినవి. వీటి నాణ్యతపై ఏ హామీలులేవు. ఒకవేళ మీ కంప్యూటర్ వ్యవస్థకు ఏదైనా హాని సంభవించిన దీని తయారీకి కృషిచేసిన వారు,పంపిణీ చేసినవారు, వికీమీడియాఫౌండేషన్ లేక ఇతర వికీమీడియా అనుబంధ సంస్థలు ఏ బాధ్యత వహించవు. దీనిలో చెప్పినవి ప్రయత్నించేముందు మీ ఫైళ్లు భద్రపరచుకోండి.

గుర్తింపులు మార్చు

ఈ పుస్తకం వ్యాసాలకు కృషి చేసిన వారి వివరాలు వికీబుక్స్ లోని ఉబుంటు వ్యాసాల చరిత్రలో చూడవచ్చు. వీరు ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు [1], తెలుగు లినక్స్ వాడుకరుల జట్టు మరియు తెలుగు వికీమీడియన్లు. వీరే కాక దాదాపు పది ఏళ్లకుపైగా తెలుగు స్థానికీకరణకై స్వచ్ఛందంగా లేక సంస్థల తరపున కృషిచేసిన వారెందరో వున్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొనలసినది స్వేచ్చ సంస్థ [2] . వారి కృషి ఫలితమే ఈ నాటి తెలుగు ఉబుంటు లేక ఇతర లినక్స్ పంపకాలు.

వనరులు మార్చు

  1. ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు
  2. స్వేచ్ఛ సంస్థ