ఉబుంటు/వెబ్ వీక్షణం
వెబ్ వీక్షణం లేక విహరించడానికి ముఖ్యమైన సాఫ్ట్‍వేర్లు ఫైర్‌ఫాక్స్ మరియు క్రోమియమ్
ఫైర్‌ఫాక్స్
మార్చుఫైర్ఫాక్స్ ఉబుంటు అప్రమేయ విహారిణి. దీనిని లాంచర్ నుండి కాని లేక మెనూలో అంతర్జాలం నుండి నడపవచ్చు. ప్రారంభంలో ఉబుంటు పేజీ చూపిస్తుంది. మీకు కావలసిన విషయంకోసం వెతుకుపెట్టె లో వెతికితే ఫలితాలు హైపర్లింక్లతో కనబడతాయి. వాటిని నొక్కడం ద్వారా అ సైట్ పేజీలను చూడొచ్చు. నేరుగా చిరునామా పట్టీలో వెబ్ చిరునామాను టైప్ చేసి మీకు కావలసిన పేజీని చూడొచ్చు.
ఉదాహరణ: ఫైర్‌ఫాక్స్ ప్రారంభించిన తరువాత చిరునామాలో http://te.wikipedia.org అని టైపుచేస్తే తెలుగు వికీపీడియా మొదటిపేజీ కనబడుతుంది. దానిలో పై కుడి వైపున వెతుకు పెట్టెలో తెలుగు అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అప్పుడు తెలుగు వ్యాసపేజీ కనబడుతుంది.
తెలుగు వాడేవారు తెలుగు అక్షరక్రమ లేక ముద్రాక్షర తనిఖీ పొడిగింతని [1]స్థాపించుకుంటే మంచిది. విహరిణిలో ఈ మెయిల్, బ్లాగ్ లేక వికీపీడియా లో టైపు చేసేటప్పుడు జరిగే కొన్ని అక్షర దోషాలను వాటి క్రింద ఎరుపు తరంగ గీతతో చూపిస్తుంది.
క్రోమియమ్
మార్చుఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా క్రోమియమ్ స్థాపించుకొనవచ్చు. దీనినే స్వల్పంగా మార్పులతో గూగుల్ క్రోమ్ లాగా కూడా అందుబాటులో వుంది.