మీ దగ్గరున్న ఫైళ్లులేక సిడి(CD) లేక అంతర్జాల రేడియో స్టేషన్ల నుండి ఉబుంటు లో సంగీతం వినటానికి వాడే అనువర్తనం బన్షీ మ్యూజిక్ ప్లేయర్. దీనితో పాటుగా చలనచిత్ర ప్లేయర్ తో కూడా శబ్ద పైళ్లు వినవచ్చు.

స్వేచ్ఛా సాంకేతిక ఆకృతిగల ఫైళ్లు

మార్చు

ఇది నేరుగా స్వేచ్ఛామూలాలు పేటెంట్ హక్కులు లేని ఆకృతిలో వుండే సంగీతాన్ని (.ogg format) వినవచ్చు. కొన్ని వుదాహరణ సంగీత ఫైళ్లు మీ నివాసం లో ఉదాహరణలు అనే సంచయంలో వున్నాయి.

సాధారణ ఆడియో సీడి

మార్చు
 
బన్షీ మ్యూజిక్ ప్లేయర్ సాధారణ ఆడియో సిడి నడుపుతూ

సాధారణ ఆడియో సీడి లో ధ్వని సాధారణ కోడింగ్ లో వుంటుంది. ఇటువంటి సీడి పెట్టగానే ఇది ఆడియో డిస్క్ గా గుర్తించబడుతుంది. బన్షీలో ఆడియోసిడి ఎంచుకొని పాటలు వినవచ్చు.

ఎమ్పి3(mp3) ఆడియో సిడి

మార్చు
 
బన్షీ మ్యూజిక్ ప్లేయర్ mp3 ఆడియో సిడి నడుపుతూ

సిడీలలో ఎమ్పి3 (mp3) ఫైళ్లు వుంటే వాటిని వినడానికి మీరు జిస్ట్రీమర్( gstreamer)విస్తరణ స్థాపించుకోవాలి. దీనిని మీరు ఉబుంటు స్థాపించుకునేటప్పుడు థర్డ్ పార్టీ ప్లగిన్లు స్థాపించు అన్న చెక్ బటన్ చేతనంచేస్తే సరి లేకపోతే మీకు ఇటువంటి మాధ్యమం వాడటం మొదలుపెట్టినపుడు, ప్లగిన్లు స్థాపించమనే విండో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంతర్జాల సంపర్కంతో స్థాపించుకోవచ్చు. లేకపోతే ఈ క్రింది లింకు నుండి పాకేజీ తెచ్చుకుని స్థాపించుకోవచ్చు. ఇవి ఒకసారి స్థాపించుకుంటే చలనచిత్ర ప్లేయర్, ఫైర్ ఫాక్స్ లాంటి ఇతర అనువర్తనాలు కూడా వాడుకుంటాయి

  • gstreamer0.10-jfmpeg
  • gstreamer0.10-fluendo-mp3
  • gstreamer0.10-plugins-bad
  • gstreamer0.10-plugins-ugly

CD నుండి మీడియాను దిగుమతి చేసి (మెనూలో మీడియా-> మీడియాను దిగుమతి చేయి ) పాటల జాబితా తయారు చేసుకుంటే ఒక దానితర్వాత ఒకటి నడుపుతుంది.