ఉబుంటు/ ఈ-ఉత్తరాలు మరియు ఛాట్
ఈమెయిల్ అనగా ఎలెక్ట్రానిక్ మెయల్. మన సందేశాలు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో చేరే సౌకర్యము. ఛాట్ అంటే మన మిత్రులతో ఎలెక్ట్రానిక్ రూపంలో సత్వర సందేశాలు ఇచ్చి పుచ్చుకోవడం. ఇంటర్నెట్ ఖర్చు తప్ప ఏ ఇతర ఖర్చులు లేకుండా పరిమితి లేకుండా వాడుకోవచ్చు. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ మెయిల్
మార్చుఈ-వుత్తరాలు మరియు ఛాట్ కు అంతర్జాల సంపర్కం కలిగివుండాలి. కంప్యూటర్ పై స్థాపించుకొనే మెయిల్ కక్షిదారు ఎవల్యూషన్ వాడవచ్చు. అయితే ఎక్కడనుండైనా వాడుకోగలగటం, బ్యాక్ అప్ కు కష్టపడాల్సిన పని లేకపోవడం వలన చాలామంది వెబ్ ఆధారిత మెయిల్ అనువర్తనాలు వాడుతున్నారు. వాటిలో తెలుగు ముఖాంతరంగా వుండేవాటిలో ముఖ్యమైనవి గూగుల్ మెయిల్ మరియు విండోస్ లైవ్ మెయిల్ (హాట్ మెయిల్)
గూగుల్ మెయిల్
మార్చువిహరిణిలో గూగుల్ మెయిల్ చిరునామా [1] అని ప్రవేశపెట్టి దాఖలుచేయగానే, గూగుల్ మెయిల్ తెలుగు వెబ్ పేజీ కనిపిస్తుంది. మీరు కొత్తగా వాడుతున్నట్లయితే ఒక ఖాతా సృష్టించండి అన్న బొత్తాము పై నొక్కిండి. మీ వివరాలు అనగా యూజర్ పేరు, పాస్వర్డ్ ఇతర వివరాలు ప్రవేశపెట్టి గూగుల్ షరతులు ఒప్పుకున్నట్లు చెక్ పెట్టెలో టిక్ పెట్టి దాఖలు పరిచినట్లయితే మీ ఖాతా సృష్టించబడుతుంది. ఒకవేళ అదే పేరుతో ఇంతకు ముందే ఖాతా ఎవరిదైనా వుంటే మీరు మార్చుకోటానికి సలహాలు ఇస్తుంది. ఆ తరువాత మీరు ఖాతా వివరాలు దాఖలుచేసి మీ ఖాతాలో ప్రవేశించవచ్చు.
అప్పడు కనిపించే తెరలో మీకు వచ్చిన ఈ-ఉత్తరాలు కనబడతాయి వాటిని చదివి ప్రత్యుత్తురాలివ్వ వచ్చు. కొత్త సందేశం సృష్టించాలంటే సందేశం సృష్టించు అన్న బొత్తాము నొక్కితే కనబడే తెరలో కి: అన్నచోట మీరు పంపదలచుకున్న వారి ఈ-మెయిల్ చిరునామా, విషయం (సబ్జెక్టు) వరుసలో సంక్షిప్తంగా వుత్తరం సమాచారం రాసి ఆ క్రింద వివరంగా సమాచారం రాసి దానిక్రింద వున్న పంపించు అన్న బొత్తాము నొక్కాలి అంతే మరి. గూగుల్ వాడటంవలన ఇంకా లాభమేంటంటే మీరూ రాసే వుత్తరము స్వయంచాలకంగా దాచబడుతుంది. మీకిష్టమైతే గూగుల్ లిప్యంతరీకరణ సాధానాలు వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు గూగుల్ లో సహాయంపేజీలు చూడండి.
విండోస్ లైవ్ మెయిల్
మార్చువిహరిణిలో విండోస్ లైవ్ మెయిల్ చిరునామా [2]అని ప్రవేశపెట్టి దాఖలుచేయగానే, హాట్ మెయిల్ తెలుగు వెబ్ పేజీ కనిపిస్తుంది. మీరు కొత్తగా వాడుతున్నట్లయితే సైన్ అప్ అన్న బొత్తాము పై నొక్కిండి. మీ వివరాలు అనగా విండోస్ లైవ్ ఐడి ( Windows Live ID), పాస్వర్డ్ ఇతర వివరాలు ప్రవేశపెట్టి షరతులు ఒప్పుకున్నట్లు చెక్ పెట్టెలో టిక్ పెట్టి దాఖలు పరిచినట్లయితే మీ ఖాతా సృష్టించబడుతుంది. ఒకవేళ అదేపేరుతో ఇంతకు ముందే ఖాతా ఎవరిదైనా వుంటే మీరు మార్చుకోటానికి సలహాలు ఇస్తుంది. ఆ తరువాత మీరు ఖాతా వివరాలు దాఖలుచేసి మీ ఖాతాలో ప్రవేశించవచ్చు.
అప్పడు కనిపించే తెరలో మీకు వచ్చిన ఈ-ఉత్తరాలు కనబడతాయి వాటిని చదివి ప్రత్యుత్తురాలివ్వ వచ్చు. కొత్త సందేశాలు పంపవచ్చు మీకిష్టమైతే మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ సాధానాలు వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు మైక్రోసాఫ్ట్ సహాయంపేజీలు చూడండి.
ఛాట్
మార్చుఛాట్ లో వ్యక్తగత ఖాతాలు ప్రసార ఖాతాలు అని రెండురకాలు. మీరు ఒక సమూహంలో చేరి పంపే సందేశాలు వ్యక్తిగత ఖాతాల క్రిందికి, మీరు ఎవరికి ప్రత్యేకించి వుద్దేశించకుండా పంపే సందేశాలు ప్రసారఖాతాలు క్రిందికి వస్తాయి. ఫ్రీనోడ్ (freenode) సైట్ లో ఇంటర్నెట్ రిలే ఛాట్ (irc) వ్యక్తిగత ఖాతాకి ఉదాహరణ, ట్విట్టర్ ప్రసార ఖాతాకి ఉదాహరణ.
ఫ్రీనోడ్ ఐఅర్సి
మార్చుమీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు. మీరు ఫ్రీనోడ్ ను ఎంచుకుంటే మీ నిక్ నేమ్ ప్రవేశపెట్టాలి. ఆ తరవాత నిక్ సర్వర్ లో /join #ubuntu-in నొక్కితే మీరు ఆ ఛాటింగ్ గదిలో చేరతారు. దానిలోనున్న వారు పంపే సందేశాలు మీరు చూడవచ్చు. మీరు సందేశాలు పంపవచ్చు.
ట్విట్టర్
మార్చుమీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు. మీరు ట్విట్టర్ ను ఎంచుకుంటే మీ వాడుకరిపేరు సంకేతపదం ప్రవేశపెట్టాలి. ఆ తరవాత ట్విట్టర్ విండో కనబడుతుంది.