ఋగ్వేదము/మండలము 1/శ్లోకము 1

1.1.1 త్యాగానికి పూజారిగా, దైవముగా సంపదలో అత్యుత్తమమైన అగ్నిని నేను స్తుతిస్తున్నాను.
1.1.2. పురాతన కాలం నుండి ఎవ్వరిచే వినాశనం చేయబడలేని అగ్ని, స్తుతికి ఎంతైనా అర్హత గలది. ఇక నుండి అగ్ని దేవతలను తీసుకు వస్తుంది.
1.1.3. అగ్ని ద్వారా మనిషి సంపద, దినదినాభివృద్ధిని పొందుతాడు. అగ్ని అతి శక్తివంతమైనది, అత్యంత ప్రకాశవంతమైనది.
1.1.4. అగ్నికి సమర్పించినది ఏదైనను ఖచ్చితంగా దైవాన్ని చేరుతుంది
1.1.5. నిజాయితీ గల, అత్యంత గొప్ప శక్తి యైన అగ్నిదేవుడు అనబడు బుద్ధిమంతుడైన పూజారి, ఇతర దైవాలతో ఇక్కడికి వచ్చుగాక
1.1.6. అగ్ని, తనను ఆరాధించు ఎవరికైనా ఇచ్చే దీవెనయే సత్యము
1.1.7. చీకట్లను తరిమికొట్టే ఓ అగ్ని, ప్రతిరోజు నిను ప్రార్థించి నీ వద్దకు వచ్చి, నీ పూజ్యభావమును పెంచెదము
1.1.8 త్యాగాలను పాలించే, ధర్మాన్ని రక్షించే ప్రకాశవంతమైన నీ ఇంటిలోనే విస్తరించే ఓ అగ్ని
1.1.9 బిడ్డకు తండ్రివలె, మాకు సమీపములో నుండుము, మా సుఖజీవనము కొరకు మాతోనే ఉండిపొమ్ము