ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ పులుసు. అది తయారుచేయు విధానం తెలుసుకుందాం. వీటిలో రకరకాల పులుసులను చేస్తారు. ఉదాహరణకు "కాకరకాయ పులుసు" , "కాకరకాయ నువ్వుల పులుసు"

కారకరాయ పులుసు

మార్చు

కావలసిన పదార్థాలు

మార్చు
  • కాకరకాయలు---4
  • ఆవాలు---1/4 స్పూన్
  • ఇంగువ---చిటికెడు
  • కరివేపాకు---2 రెమ్మలు
  • శనగ పప్పు---3 స్పూన్స్
  • నువ్వులు---3 స్పూన్స్
  • పచ్చి మిరపకాయలు---2
  • చింతపండు---నిమ్మకాయంత
  • ఉద్దిపప్పు--3 స్పూన్స్
  • కారం---1/2 స్పూన్
  • వేరుశనగ విత్తనాలు--3 స్పూన్స్
  • పసుపు--చిటికెడు
  • ఉప్పు---తగినంత
దస్త్రం:Kaakara.JPG
కాకరకాయలు/పాకాల సంతలో తీసిన చిత్రము

తయారు చేయు విధానం

మార్చు
  • చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు గుజ్జు/పులుసు తీసి పెట్టుకోవాలి.
  • ఉద్దిపప్పు,శెనగపప్పు,వేరుశనగ విత్తనాలు, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
  • కాకరయాలు పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • పచ్చి మిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • బానలి పెట్టి3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక,1/4 స్పూన్ ఆవాలు వేసి చిట చిట అన్నాకా, ఇంగువ పసుపు వేయాలి.
  • తరువాత పొడవుగా కట్ చేసిన కాకరకాయలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
  • తరువాత మూత తీసి, ముక్కలు బాగా వేగినాక, చింతపండు పులుసు వేయాలి.
  • తరువాత చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి, కారం వేయాలి.
  • తరువాత గుజ్జు గట్టి పడుతుంది.(చాల గట్టిగా ఉంటే కొద్దిగా నీరు వేసుకోవచ్చు)
  • తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  • చివరి లో కరివేపాకు వేసుకోవాలి.
  • ఎంతో రుచిగా ఉండే కాకరకాయ గుజ్జు/కాకరకాయ పులుసు రెడి. ఇది అన్నంలో కి బాగుంటుంది.

కాకరకాయ నువ్వుల పులుసు

మార్చు

కావలసిన పదార్థాలు

మార్చు
  • కాకరకాయలు - 5
  • బెల్లం - 2 స్పూన్స్
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 3
  • పసుపు - 1/4 స్పూన్
  • నూనె - 5 స్పూన్స్
  • నువ్వుల పొడి - 4 స్పూన్స్
  • ఉప్పు, కారం - సరిపడ
  • ధనియాల పొడి - 1 స్పూన్
  • చింతపండు - కొద్దిగా
  • పోపు గింజలు - 1 స్పూన్

తయారు చేయు విధానం

మార్చు
  • ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి.
  • అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి.
  • తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
  • ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు, నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి.
  • అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు తయార్.

వర్గం: వంటలు