చికెన్ పులావ్
కావలసిన పదార్థాలు
మార్చు- బియ్యం : 2 కప్పులు (శుభ్రంగా కడిగి, పది నిముషాలు నానబెట్టుకోవాలి)
- కోడి మాంసము: 250 గ్రాములు (చిన్న ముక్కలుగా లేదా మధ్యస్థంగా ముక్కలు చేసుకోవాలి)
- ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
- టమోటా: 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
- పచ్చి మిర్చి: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి)
- పసుపు: 1 చెంచాడు
- కారం: 1 ½ చెంచాడు
- జీలకర్ర పొడి: 1 చెంచాడు
- కొత్తిమీర పొడి: 1 చెంచాడు
- గరం మసాలా: చిటికెడు
- జీలకర్ర: 1 చెంచాడు
- బిర్యానీ ఆకు: 1
- ఉప్పు: రుచికి సరిపడా
- నూనె: 2 చెంచాడు
- నీళ్ళు: 2 కప్పులు
తయారీ
మార్చు- ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి.
- తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మధ్యస్థ మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి.
- ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వేసి బాగా కలిపి వేగించుకోవాలి. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
- టమోటో ముక్కలు కొంచెం మెత్తబడ్డాక అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, వేసి బాగా కలపాలి.
- మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత అందులో ముందుగా శుభ్రం చేసి, ముక్కలు చేసి పెట్టుకొన్నచికెన్ వేసి మధ్యస్థ మంట మీద పది నిముషాలు వేగించాలి.
- ఆ తర్వాత శుభ్రం చేసి, కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి, విజిల్ పెట్టి మధ్యస్థ మంట మీద మూడు ఈలలు (విజిల్స్) వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
- అంతే పొయ్యి కట్టేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత వేడి వేడిగా వడ్డించాలి..