నాటాలి మొక్కలు
36. నాటాలి మొక్కలు
మార్చుఇంటింటా నాటాలి మొక్కలు
పెరిగితే అవుతాయి వృక్షాలు
పచ్చదనానికి అవి ప్రతీకలు
కాలుష్యానికి అవి నిరోదకలు
నీడ నిచ్చును, సేద తీర్చును
రంగు రంగుల పూలనిచ్చును
ఆక్సిజన్ అందించును
ఆరోగ్యానికి సహకరించును
పచ్చదనం పరిఢవిల్లితే
ప్రకృతి పులకరించును
నాటాలి ప్రతి ఒక్కరు మొక్క
కావాలి అది జగతికి రక్ష.