పుప్పొడి
పుప్పొడి అనేది మగ పువ్వులమీద ఉండే జీవాణువుల సమూహం . వీటినే ఆంగ్లంలో Pollen అంటారు. ఈ అణువులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. వీటిని తమ జాతికే చెందిన ఇతర ఆడ పువ్వలమీదకు పంపి ఫలదీకరణం చెందించటానికి మొక్కలు, పువ్వులు ఎన్నో దారులు వెతుకుతాయి, ఎన్నొ ఎత్తులు వేస్తాయి. కొన్ని గాలి వాటం మీద ఆధారపడతాయి, కొన్ని కీటకాలమీద ఆధారపడతాయి. ఇందుకోసం తేనెని ఎరగా వేస్తాయి. ఆ పుప్పొడిని ఆయా కీటకాలు, పక్షులు తేనె తాగేటప్పుడు వాటి శరీరానికి అంటుకునే ఏర్పాటు చేసుకుంటాయి ఆ మొక్కలు. అలా ఆ కీటకాలు, పక్షులూ వేరే వేరే చెట్లమీద, పువ్వులమీదా వాలి ఫలదీకరణం అయ్యేట్లు చేస్తాయి. ఇంకొన్ని మొక్కలు వాటి పువ్వులు కుళ్ళిపోయిన జంతు కళేబరంలాగా వాసన వచ్చేట్లు చేస్తాయి. ఆ వాసనకి ఈగలు చేరి ఆ పుప్పొడిని వళ్ళంతా పూసుకుని వేరే పువ్వులమీదకు వెళ్ళి ఫలదీకరణానికి సహకరిస్థాయి. ఇంకొన్ని మొక్కలు వాటి పువ్వుల్ని ఆడ కీటకాల్లాగా ఆకారాన్ని చేసుకుని, ఇంకా ఆడ కీటకపు వాసనని వెదజల్లి మొగ కీటకాలను ఆకర్షిస్థాయి. ఉదాహరణకి: Bee orchids.