బాల స్వేచ్ఛ

(బాల స్వేఛ నుండి మళ్ళించబడింది)

బాల స్వేచ్ఛ అనే గ్ను లినెక్స్ కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ (నివ్య) ప్రత్యేకంగా బాలల కోసం రూపొందించబడింది.ఈ నిర్వాహకవ్యవస్తలో పిల్లల పాఠ్యాంశాలకు సంబంధించిన పలు విషయాలు అనువర్తనాలు(అప్లికేషన్స్) రూపంలో పొందుపరచబడినవి. విధ్యార్థులు కంప్యూటర్ సహాయంతో తమ పాఠ్యాంశాలను పరస్పర సంకర్షణతో నేర్చుకునే వెసులుబాటు కలిపిస్తుంది ఈ నివ్య. తద్వార విద్యార్థులు పాఠము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సులభంగా అర్థంచేసుకోవడమేకాకుండా వాటిని తమ నిజ జీవితంలో ఎలా అనువర్తించాలో తెలుసుకుంటారు.ప్రాథమిక తరగతులు మొదలుకుని పదవ తరగతి వరకు విధ్యార్థులకు ఉపయోగపడె అనువర్తనాలు (అప్లికషన్స్) అన్ని పెన్సిల్ బాక్స్ లో ప్రభుత్వ పాఠ్య ప్రనాళికకు అనుగునంగా పొందుపరచబడినవి.గణిత, భౌతిక, రసాయన, భౌగోల శాస్త్రాలకు సంబంధించిన అంశాలు విధ్యార్థులకు ఆసక్తి కలింగించే విధంగా,వారి జిజ్ఞాసను పెంచే విధంగా, అతి సులభంగా తయారుచేయబడింది.వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులకు, కంప్యూటర్ బోధకులకు మరియు విధ్యార్థులకు ఈ కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ పై అవగాహన కలిపించుటకు స్వేచ్ఛ సంస్థ పలు రకాల కార్యక్రమాలు చేపట్టింది.

ప్రభుత్వముచే ప్రారంభింపబడిన సర్వ శిక్షా అభియన్ ప్రాజెక్ట్ ని విధ్యార్థులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడమే బాల స్వేచ్ఛ నివ్య యొక్క ముఖ్య ఉద్దేశం.ఆధునిక విధ్యా ప్రమానాలతో రూపొందించిన బాల స్వేచ్ఛ సామన్యులకు అందుబాటులొలేని ప్రైవేటు మరియు టెక్నో స్కూళ్ళ యొక్క బొధనాపద్ధతులను ఉచితంగా విధ్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంకేతికంగాను, విషయ పరిజ్ఞానం పరంగాను గ్రామీణ విద్యార్థులను పట్టణాలలో ఉన్న విధ్యార్థులకు ధీటుగా తయారుచేస్తుంది. వాడుకరులకు అన్ని రకాల స్వేచ్ఛలను అందిస్తూ,విధ్యార్థులకు ఉపయోగపడే అన్ని రకాల విద్యోపకరనాలతో వచ్చిన మొట్ట మొదటి నిర్వాహక వ్యవస్థ "బాల స్వేచ్ఛ."


తెలుగు మరియు ఇంగ్లీషు మాధ్యమాల విధ్యార్థుల దృష్ట్యా , ప్రతి ఒక్కరికి సాంకేతిక విధ్యా ప్రమానాలు అందుబాటులొ ఉండాలని, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలనె ఉద్దేశంతో స్వేచ్ఛ సంస్థ బాల స్వేచ్ఛ నివ్యను తెలుగు భాష లోకి స్థానికీకరించే ప్రనాళికలను తయారుచేస్తుంది.