భార్య
సహధర్మచారిని. ఒక స్త్రీ కి వివాహము ద్వారా పురుషునితో ఏర్పడిన బంధము
కష్టాలలో , కన్నీళ్లలో
సుఖ దుఃఖాలలో
తోడుగా, నీడగా
వెన్నంటి ఉండేదే భార్య .
దాసిగా సేవలు చేసేది
మిత్రునిగా సలహాలిచ్చేది భార్య
అపజయాలకు వెన్నుతట్టి దైర్యం చెప్పేది భార్య
ఆనందం పెంచేది భార్య
ఆనందం పంచేది భార్య
విజయాలకు దారి చూపేది భార్య
వ్యసనాలను రూపుమాపేది భార్య
విమర్శకుడిగా తప్పొప్పులు చూపేది భార్య
అమ్మ నాన్నను ఆదరించేది భార్య
అక్కాచెల్లెళ్లను అక్కున చేర్చుకొనేది భార్య
అన్నదమ్ములతో సఖ్యత పెంచేది భార్య
పిల్లల కోసం పరితపించేది భార్య
తనకంటే ముందు మరణం కోరుకునేది భార్య
సుమంగళిగా జీవించాలని కోరుకునేది భార్య.