మామిడికాయ పులిహోర

తయారు చేసే విధానం:

కొంచెం పొడి పొడి గా అన్నం వండుకొని చల్లారనివ్వాలి. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పొయ్యాలి. నూనె కొంచెం వేడి అయ్యాక పల్లీలు (వేరుశనగ గుళ్ళు) లేదా జీడిపప్పు, పోపు దినుసులు ఒకదాని తరువాత ఒకటి వెయ్యాలి. బంగారు రంగు వచ్చాక, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేయించాలి. తరువాత తురిమిన మామిడి కాయ తురుము, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి చక్కగా కలుపుకోవాలి. రుచికరమైన మామిడికాయ పులిహోర సిధ్ధం. కావలసిన పదార్థాలు

1. బియ్యం 1/2 కిలో

2.పుల్లటి మామిడికాయ 1

3.సెనగ పప్పు 1 చెంచా

4.పల్లీలు(వేరుసెనగ గుళ్లు) పిడికెడు

5.మినప పప్పు 1 చెంచా

6.పచ్చిమిరపకాయలు రుచికి సరిపడ

7.ఎండు మిరపకాయలు 2

8.కరివేపాకు 2 రెమ్మలు

9.ఉప్పు రుచికి సరిపడ

10.నూనె 4 చెంచాలు

11.జీలకర్ర 1/2 చెంచా

12.ఆవాలు 1/2 చెంచా

13.పసుపు 1/4 చెంచా

14. ఇంగువ 2 చిటికలు