సగటు

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
  • The entry words used American spelling. Where feasible the equivalent British spelling is also shown - but not always.

11 Aug 2015.

Part 1: ab

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • A, a, (1) ఇంగ్లీషు వర్ణమాలలో మొదటి అక్షరం; (2) పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి వచ్చే గురుతు; గ్రేడ్;
  • A, symbol, ఒక విటమిన్ పేరు;
  • a., art. ఒక;
  • a., pref. అ; కాదు; కాని; లేని;
  • aardvark, n. పిపీలికారి; పిపీలికాహారి; నాకువునాకు; చీమలయొక్క శత్రువు; చీమలని తినే ఒక జంతువు;
 
Aardvark=పిపీలికారి
  • ab., pref. నుండి; దూరంగా;
 
పూసలపాటీ
  • abacus, n. పూసలపాటీ; పూసల పలక; గణక ఫలకం;
  • abandon, v. t. వదలు, వదలిపెట్టు, మానుకొను; పరిత్యజించు; పరిహరించు; విసర్జించు;
  • abandonment, n. వదలిపెట్టడం; మానుకొనడం; పరిత్యజించడం; పరిహరించడం; విసర్జించడం;
  • abate, v. i. తగ్గు; తగ్గుముఖం పట్టు; ఉపశమించు; ఆగు; నిలచిపోవు; నివర్తించు;
  • abate, v. t. తగ్గించు, దుర్భలపరచు; ఉపశమింపచేయు, రద్దు చేయు, తీసివేయు;
  • abatement, n. తగ్గింపు, తగ్గుముఖం పట్టించడం; ఆపడం; అదుపులో పెట్టడం;
  • abbreviate, v. t. కుదించు; క్లుప్తపరచు; సంక్షిప్తపరచు; సంక్షేపించు;
  • abbreviation, n. కుదింపు; సంక్షిప్తం, క్లుప్తం; పుటాక్షరం;
  • abdicate, v. t. (1) ఉన్నతాసనాన్ని వదలి పెట్టు; (2) బాధ్యతని తీసుకొనకుండా ఉండు;
  • abdomen, n. (1) పొత్తికడుపు, కింది కడుపు; పొట్ట, కీగడుపు; ఉదరం; గర్భం, (2) ఛాతీకి నడుముకి మధ్య ఉన్న శరీర భాగం;
  • abdominal, adj. ఉదర; గర్భ; పొత్తికడుపుకి సంబంధించిన;
    • abdominal aorta, ph. ఉదర బృహద్ధమని;
    • abdominal aortic aneuryism, ph. ఉదర బృహద్ధమని బుద్బుదం;
    • abdominal cavity, ph. ఉదర కుహరం; ఉదరగుహ; గర్భాశయం;
  • abduct, v. t. అపహరించు; ఎత్తుకొనిపోవు; గొంపోవు; లేవదీసుకొని పోవు; బలవంతముగా కాని చట్టవిరుద్ధంగా కాని తీసుకొనిపోవు;
  • abduction, n. అపహరణ; బలవంతముగా తీసుకొని పోవడం; గ్రహణం;
    • abduction of cows, ph. గోగ్రహణం;
  • abductor, n. అపహర్త; గొంపోవరి;
  • aberration, n. అసాధారణ సంఘటన; సామాన్యం కానిది; మార్గం తప్పినది;
  • abet, v. t. మద్దతు నిచ్చు; ప్రోత్సహించు; ప్రేరేపించు; అపరాధం చెయ్యడానికి చెయ్యి కలుపు;
  • abeyance, n. నిలుపుదల, ఆపుదల; అనిర్ణీత స్థితిలో ఉంచడం;
  • abhorrence, n. రోత; జుగుప్స; ఏవగింపు; చీదర; ఘృణ;
  • abide by, ph. తల ఒగ్గు; అంగీకరించు;
  • ability, n. అర్హత, దక్షత, సామర్థ్యం, సమర్థత, శక్తి, పటిమ, చాలిక; నలువు; ఆభూతి; ప్రౌఢి;

Usage Note: ability, skill, talent, knack

  • ---Use these words to talk about how well someone does something. An ability is something you can do with your mind or body: artistic ability. You can lose your ability to do something. Greg lost his ability to walk. A skill is something you learned and practiced. I am improving my writing skill. A talent is a natural ability to do something well: Lata has a great musical talent. A knack is a more informal word for talent.
  • abiogenic, adj. అజీవజన్య; జీవి ప్రమేయం లేకుండా పుట్టినది;
  • abiotic, adj. అజీవసంబంధ;
  • abject, adj. నీచ; హీన; పరమ; నికృష్ట; తుచ్ఛ; దుర్భర; దుస్సహ;
    • abject poverty, ph. పరమ దరిద్రం; నిప్పచ్చరం; నిరుపేదతనం; కటిక దారిద్ర్యం;
  • abkari, adj. మద్యపానీయాలకి సంబంధించిన; సారా, కల్లు, వగైరా అమ్మకాలకి సంబంధించిన;
  • able, adj. సమర్ధత గల; సామర్థ్యం గల;
  • ablution, n. ప్రక్షాళనం; హస్త ప్రక్షాళనం; పాద ప్రక్షాళనం; పూజ చేసే ముందు చేతులనీ కాళ్ళనీ కడుక్కోవడం;
  • abnormal, adj. అసాధారణ; అస్వభావికమైన; విపరీత;
  • abode, n. నిలయం; నెలవు; నెలకువ; ఆలయం; నివాసం; నికేతనం, ధామం; ఇల్లు; కాణాచి; ఆటపట్టు;
  • abolish, v. t. నిర్మూలించు, (rel.) annul; (ant.) establish;
  • abolition, n. నిర్మూలన; రద్దు;
  • abominable, adj. ఏహ్య; అసహ్యమయిన; వెగటు పుట్టించే;
  • abomination, n. అసహ్యం; రోత; వెగటు;
  • aborigine, n. s. (యాబరీజనీ) ఆదిమవాసి;
  • aboriginals, n. pl. ఆదిమవాసులు;
  • abortion, n. గర్భవిచ్ఛిత్తి; గర్భోత్పాటనం, కట్టుక, వైద్యుడి సహాయంతో, శస్త్రం వల్ల కాని, మందుల వల్ల కాని, కడుపులో ఉన్న పిండాన్ని చంపి బయటకి తియ్యడం; సహజం కాని గర్భస్రావం; (rel.) miscarriage;
  • about, adj. సుమారు; రమారమి; చుట్టుపట్ల; ప్రాంతంలో; ఉరమరగా;
  • about, prep. గురించి;
  • above, adv. మీద; పైగా;
  • above, prep. మీద; పైన;
  • above board, ph. దాపరికం లేకుండా; మర్మం లేకుండా;
  • abracadabra, n. హాం ఫట్; మాంత్రికుని మంత్రం;
  • abrasion, n. (1) ఒరిపిడి, రాపిడి; (2) గీకుకొని పోవుట;
  • abrasive, adj. పెడసరపు; అపఘర్షక;
    • abrasive personality, ph. పెడసరపు వ్యక్తి; పెడసరపు వ్యక్తిత్వం;
  • abrasives, n. pl. అపఘర్షకాలు;
    • bonded abrasives, ph. బంధిత అపఘర్షకాలు; ఉ. ఒరిపిడి చక్రాలు;
    • coated abrasives, ph. పూసిన అపఘర్షకాలు; ఉ. ఉప్పుకాగితం;
    • manufactured abrasives, ph. ఉత్పాదక అపఘర్షకాలు;
    • super abrasives, ph. అమిత అపఘర్షకాలు;
  • abridge, v. t. సంక్షిప్తపరచు; క్లుప్తపరచు, క్రోడీకరించు, కుదించు;
  • abrogation, n. రద్దు; కొట్టివేత; రద్దు చెయ్యడం; నిరాకరించడం;
  • abruptly, adv. తటాలున; అకస్మాత్తుగా; హఠాత్తుగా;
 
abscess = సెగ్గెడ్డ
  • abscess, n. వ్రణం; చీముపట్టిన కురుపు; చీముగడ్డ; సెగ్గెడ్డ; విద్రధి; తిష్ట ప్రక్రియ ద్వారా శరీరపు కణజాలంలో చీము చేరుకొని వాచిన స్థితి;
 
abscissa = x-అక్షం
  • abscissa, n. x-అక్షం; x-నిరూపకం; మట్టపు నిరూపకము; అడ్డు నిరూపకం; గ్రాఫులో క్షితిజానికి సమాంతరంగా గీసిన గీత; గ్రాఫులో ఎడమ నుండి కుడికి గీసిన గీత;
  • abscond, v. i. పారిపోవు; పరారీ అగు; కంటికి కనిపించకుండా పోవు;
  • absence, n. నాగా; లేకపోవడం; రాక పోవడం; గైరుహాజరీ;
  • absent, n. నాగా; లేదు; గైరుహాజరు;
  • absenteeism, n. గైరుహాజరీ; నాగా పెట్టడం;
  • absent-mindedness, n. పరాకు; పరధ్యానం; తత్పరత; వితాకు; ఏమరిక; ఏమరుపాటు; ఏమరపు;
  • absolute, adj. కేవల; పరమ; నిస్తర; నిరపేక్ష; పూర్ణ; సంపూర్ణ; శుద్ధ; అసంబంధిక; నిరంకుశ; (ant.) relative;
    • absolute address, ph. [comp.] స్థిర విలాసం; నిరపేక్ష విలాసం;
    • absolute coefficient, ph. [math.] నిరపేక్ష గుణకం;
    • absolute lie, ph. శుద్ధ అబద్ధం;
    • absolute magnitude [of a star], ph. పరమ ప్రకాశత్వం;
    • absolute majority, ph. పూర్తి మెజారిటీ;
    • absolute monopoly, ph. సంపూర్ణ గుత్తాధిపత్యం;
    • absolute motion, ph. [phy.] కేవల చలనం;
    • absolute space, ph. [phy.], కేవల స్థలం;
    • absolute temperature, ph. [phy.], పరమ ఉష్ణోగ్రత; పరమ తాపోగ్రత;
    • absolute value, ph. [math.], నిరపేక్ష విలువ; ధన, ఋణ సంజ్ఞావాచకాలతో నిమిత్తం లేకుండా ఉన్న విలువ;
    • absolute zero, ph. [phy.] పరమ శూన్యం; చలనం పరిపూర్ణంగా స్తంభించి పోయేటటువంటి కేవల కనిష్ఠ ఉష్ణోగ్రత; -273.15 సెల్సియస్ డిగ్రీలు;
  • absolute, n. నిరపేక్ష్యం;
  • absolve, v. t. తప్పించు; తప్పు లేదని ఒప్పుకొను;
  • absorb, v. i. లీనం అగు;
  • absorb, v. t. (1) పీల్చు; తాగు; (2) నిమగ్నమగు; (3) శోషించు;
  • absorbed, adj. శోషిత;
  • absorbent, adj. శోషక; పీల్చునట్టి; అవచూషక;
  • absorbent, n. అవచూషకం; పీల్చుకొనే పదార్థం;
  • absorption, n. (1) పీల్పు; శోషణం; అవశోషణం; అవచూషణం (2) విలీనం, లీనం అవడం; సమాధి;
  • absorption, adj. శోషణ; విచూషిత;
    • absorption bands, ph. [phy.] శోషణ చారికలు; శోషణ పట్టీలు; వర్ణమాలలలో కనిపించే నల్లని గీతలు;
    • absorption coefficient, ph. [phy.] శోషణ గుణకం; శోషణ గుణాంకం;
    • absorption spectrum, ph. [phy.] శోషణ వర్ణపటం; విచూషిత వర్ణమాల; ఈ వర్ణపటంలో గీతలు నల్లగా కనిపిస్తాయి;
 
absorption spectrum=శోషణ వర్ణపటం
  • abstain, v. i. మానుకొను; తటస్థంగా ఉండు; ఓటు వెయ్యవలసి వచ్చినపుడు ఎటూ మొగ్గకుండా తటస్థంగా ఉండు; (rel.) for; against;
  • abstain from sexual activity, ph. రతి క్రియని మానుకొను; బ్రహ్మచర్యం వహించు;
  • abstinence, n. మానుకొనడం; ఉపవాసం; బ్రహ్మచర్యం;
  • abstract, adj. అమూర్త; వియుక్త; అరూప; నైరూప్య; అవ్యక్త; ఊహాతీతమయిన; (ant.) concrete;
    • abstract algebra, ph. వియుక్త బీజగణితం; అమూర్త బీజగణితం;
    • abstract art, ph. నైరూప్య చిత్రం; నైరూప్య చిత్రకళ;
    • abstract concept, ph. వియుక్త ఊహనం, వియుక్త భావం; అమూర్త భావన;
    • abstract number, ph. వియుక్త సంఖ్య; అమూర్త సంఖ్య;
    • abstract objects, ph. అమూర్త పదార్థాలు;
    • abstract self, ph. ప్రత్యగాత్మ;
  • abstract, n. సంగ్రహం; ముఖ్యాంశం, సారాంశం; ఉటంకం;
  • abstract, v. t. సంగ్రహించు; పరిగ్రహించు;
  • abstraction, n. సంగ్రహణం, పరిగ్రహణం, భావ సేకరణం;
  • absurd, adj. హేతువిరుద్ధమైన, పొసగని; అసంభావ్య, అసంబద్ధ, అనూహ్య; అర్థం లేని, నిరర్థక;
  • absurd, n. గగనకుసుమం, శశవిషాణం, కుందేటి కొమ్ము; (ety.) [Arabic, ab+surd=something that makes no sense; an impossibility];
  • abundance, n. బాహుళ్యం, సమృద్ధి, విస్తారం; కావలసినంత; మెండుతనం; పెల్లు;
  • abundantly, adv. మస్తుగా; పుష్కలంగా, బహుళంగా, సమృద్ధిగా, మెండుగా, విస్తారంగా; అవారిగా; పెల్లుబికి;
  • abuse, v. t. (1) తిట్టు; చివాట్లు పెట్టు; (2) దూషించు, దండించు; కొట్టు; (3) పాడుచేయు; దుర్వినియోగం చేయు; (rel.) misuse;
  • abuse, n. (1) దూషణ; (2) చేజిక్కిన అవకాశాన్ని పాడుచేసుకోవడం;
  • abut, v. t. అండగా ఉండు; ఆనుకొని ఉండు; దన్నుగా ఉండు;
  • abutment, n. అండగోడ; దన్నుగోడ; ముట్టుగోడ;
  • abyss, n. అగాధం, అగాధ మండలం; పాతాళం;
  • abysmal, adj. (1) లోతు తెలియని; అగాధమైన; (2) నికృష్టమైన; చాల చెడ్డదైన;

Part 2: ac

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • acacia, n. (1) తుమ్మ చెట్టు; (2) కసింద చెట్టు;
  • acacia arabica, n. నల్ల తుమ్మ చెట్టు; బాబుల్ చెట్టు; దీని నుండి స్రవించే బంక నుండి అరబినోజు, రైబోజు అనే రెండు రకాల చక్కెరలు విడదీసేరు. DNA, RNA అన్న పేర్లకి మూలం ఇక్కడే!
  • acacia sirissa, n. దిరిసన చెట్టు, శిరీషా వృక్షం;
  • academic, adj. (1) విద్వత్ సంబంధమైన; విద్యావిషయిక; పాఠశాలలకి సంబంధించిన; (2) ప్రయోజనశీలి కాని; అక్కరకురాని విద్య అయిన;
    • academic year, ph. విద్వత్ సంవత్సరం; బోధనకై పాఠశాలలు తెరచి ఉండే కాలం; సాధారణంగా ఏడాదిలో తొమ్మిది నెలలు;
  • academic, n. పుస్తకజ్ఞాని; పుస్తక జ్ఞానం తప్ప ప్రపంచ జ్ఞానం లేని వ్యక్తి;
  • academician, n. విద్వాన్, విద్వాంసుడు, పండితుడు;
  • academy, n. పరిషత్తు, పండిత సభ, విద్వత్ సభ; విద్యాసంస్థ;
  • accede, v. t. సమ్మతించు; ఒప్పుకొను;
  • accelerate, v. t. తొక్కు; పెంచు; వేగాన్ని పెంచు; వేగవంతం చేయు; తొందరపెట్టు; త్వరితపరచు;
  • accelerated, adj. వర్ధమాన; వివర్ధ; వివృద్ధ;
    • accelerated velocity, ph. [phy.] వర్ధమాన వేగం;
  • acceleration, n. త్వరణం; తొరణం; సత్వరం; వేగాధిక్యత; వర్ధమానం; సంవేగం;
    • acceleration due to gravity, ph. [phy.] గురుత్వ త్వరణం;
    • angular acceleration, ph. కోణీయ త్వరణం; కోణీయ సత్వరం;
    • gravitational acceleration, ph. గురుత్వ త్వరణం;
  • accelerator, n. త్వరణిక; తొరణి; త్వరకారిణి; వేగవర్ధని;
    • particle accelerator, ph. రేణు తొరణి; పరమాణువుల స్వభావాన్ని పరిశోధించడానికి వాడే ఒక పరికరం;
  • accent, n. (1) యాస; ఫణితి; (2) ఉదాత్తం; ఊనిక; ఒత్తి పలకడం;
  • accented, adj. (1) ఉదాత్త; (2) యాసతో కూడిన;
    • accented syllable, ph. ఉదాత్త మాత్రకం; ఉదాత్త అక్షరం;
  • accept, v. i. (1) అంగీకరించు; సమ్మతించు; ఒప్పుకొను; (2) తీసుకొను; పుచ్చుకొను; గ్రహించు; స్వీకరించు;
  • acceptable, n. అంగీకారానికి అనుకూలమైన; అంగీకారయోగ్యమైన; సమ్మతించదగిన; ఆమోదయోగ్యమైన; పరవాలేని;
  • acceptance, n. (1) అంగీకారం; సమ్మతి; ఆమోదం; (2) స్వీకారం; స్వీకార సూచన; పుచ్చుకొనుట; కైకోలు;
  • acceptor, n. గ్రహీత; ప్రతిగ్రహీత; స్వీకర్త; పుచ్చుకొనేది;
  • access, n. ప్రవేశం; గమ్యత; అభిగమం; ఉపగమం; అందుబాటు; చనువు; చొరవ;
    • random access, ph. [comp.] అనిర్ధిష్ట ప్రవేశం; యాదృచ్ఛిక ప్రవేశం;
    • access control, ph. ప్రవేశ నియంత్రణం;
    • access control list, ph. ప్రవేశ నియంత్రణ జాబితా;
    • access control method, ph. ప్రవేశ నియంత్రణ రీతి; ప్రవేశ నియంత్రణ పద్ధతి;
    • access mode, ph. అభిగమ ప్రకారం;
    • access privileges, ph. ప్రవేశ విశేషాధికారాలు; అభిగమన విశేషాధికారాలు;
    • access rights, ph. ప్రవేశ అధికారాలు; అభిగమన అధికారాలు;
    • access time, ph. [comp.], ప్రవేశ కాలం; ప్రవేశ వ్యవధి; కంప్యూటరు కొట్టులో దాచిన అంశాన్ని బయటకి తీయడానికి పట్టే కాలం; (1) Memory access time is how long it takes for a character in memory to be transferred to or from the CPU. (2) Disk access time is an average of the time between initiating a request and obtaining the first data character;
  • accessibility, n. అందుబాటు; అభిగమ్యం; ప్రాప్యం;
  • accessible, adj. అందుబాటుగా ఉన్న; సుగమ; అభిగమ్య; సులభ; ప్రవేశయోగ్య;
  • accession, n. (1) అధిరోహణ; ఆరోహణ; సింహాసనాధిరోహణ; (2) కలుపుకొనుట;
  • accident, n. ప్రమాదం; ఆపద; విపత్తు; గండం; వికారం; అనుకోకుండా జరిగిన కీడు;
  • accidental, adj. యాదృచ్ఛిక; ఆగంతుక; అచింత్య; అనుకోకుండా జరిగిన; ప్రమాదవశాత్తూ జరిగిన;
  • accidental, n. యాదృచ్ఛికం; అనుకోకుండా జరిగినది; కాకతాళీయం;
  • accidentally, adv. అచింత్యంగా; ప్రమాదవశాత్తు; కాకతాళీయంగా; ఆదాటుగా;
  • acclaim, v. t. మెచ్చుకొను; పొగుడు; శ్లాఘించు; హర్షించు;
  • acclamation, n. హర్షణ; హర్షధ్వానం; కరతాళధ్వని; జయనినాదం; పొగడ్త; ప్రకటన;
    • vote by acclamation, ph. మూజువాణీ ఓటు, ఏకగ్రీవామోదం;
  • acclimatize, v. i. కొత్త వాతావరణానికి అలవాటు పడు; తట్టుకొను;
  • acclimatize, v. t. కొత్త వాతావరణానికి అలవాటు చేయు;
  • accommodate, v. t. సర్దుకొను; సర్దుబాటు చేయు;
  • accommodation, n. (1) వసతి; (2) సర్దుబాటు;
    • accompanied orchestra, ph. జంత్ర వాయిద్యాలు; సహకార వాయిద్యాలు;
    • accompanied by, ph. సమేతంగా; సహితంగా;
  • accompaniment, n. తోడు; జంత్రం;
  • accomplice, n. తోడి దొంగ; అపరాధం చెయ్యడంలో సహకరించిన వ్యక్తి; సాపరాధి;
  • accomplish, v. i. సాధించు; నెరవేర్చు; సమకూర్చు;
  • accomplished, n. m. కార్యసాధకుడు; ప్రావీణ్యుడు;
  • accomplishment, n. సిద్ధి; కార్యసిద్ధి; సాధన; సాధించినది;
  • accord, n. అంగీకారం; సమ్మతి; ఒప్పందం;
    • on one's own accord, ph. తనంత తానుగా; బలవంతం లేకుండా;
  • accordance, n. అనుగుణ్యత;
    • according to, ph. అనుసారంగా; ప్రకారంగా; అనుగుణంగా;
    • according to rule, ph. యథావిధిగా; యథాప్రకారంగా; నియమానుసారంగా;
    • according to tradition, ph. సంప్రదాయానుసారంగా; సంప్రదాయికంగా;
    • according to will, ph. యథేష్టంగా; యథేచ్ఛగా; ఇష్టమైనట్లు; ఇష్టానుసారంగా;
  • accordingly, adv. అనుసారంగా; అదే ప్రకారంగా;
 
ఎకార్డియన్ వాయిస్తూన్న వ్యక్తి
  • accordion, n. ఎకార్డియన్; హార్మనీని పోలిన ఒక పాశ్చాత్య వాద్య విశేషం;
  • account, n. (1) ఖాతా; జమాఖర్చు; (2) లెక్క; పద్దు; హిస్సేబు; (3) వివరణం; కథనం; ఉదంతం;
    • on account of, ph. అందువలన; ఆ కారణంగా;
  • accountability, n. జవాబుదారీ; జవాబుదారీతనం;
  • accountant, n. లెక్కగాడు; గణకుడు; గణకి; ముసద్దీ; కరణం; కాయస్థుడు;
    • chartered accountant, ph. అధికృత గణకుడు;
  • accredited, adj. అధికారం ఇవ్వబడ్డ;
  • accretion, n. వృద్ధి; పెంపు; పెంపుదల; కూడిక;
  • accumulate, v. i. పోగుపడు; పోగవు; పుంజీభవించు; పేరుకొను;
  • accumulate, v. t. కూడబెట్టు; పెంపుచేయు;
  • accumulated, adj. మేట; కూడబెట్టుట; పోగుపడడం;
  • accumulator, n. సంచయని; సంచాయకం; సంగ్రాహకం; ఉపచయని; [comp.] కంప్యూటరులో లెక్కలు చేసే భాగంలో ఒక భాగం; A register in a central processing unit (CPU) that holds values to be used later computation;
    • accumulator register, ph. [comp.] సంచీపేరు; మీటలపేట; కంప్యూటరులో ఒక భాగం;
  • accuracy, n. కచ్చితత్వం; విశుద్ధత; యదార్థత; A statement of how correct a measure is. Accuracy is different from precision which expresses the degree of accuracy, for example in terms of the number of decimal places to which a measurement is computed;
  • accurate, adj. కచ్చితమైన; సరియైన; నిర్ధిష్టమైన;
  • accursed, adj. శాపగ్రస్తమైన; పాపిష్టి;
  • accursed, n. m. శాపగ్రస్తుడు; f. శాపగ్రస్తురాలు;
  • accusation, n. నింద; కొండెము; చాడీ; నేరారోపణ; అభియోగం; ఆక్షారణం;
    • false accusation, ph. అపనింద;
    • accusative case, ph. [gram.] ద్వితీయా విభక్తి;
  • accuse, v. t. నిందించు; నేరారోపణ చేయు; చాడీ చెప్పు; అభియోగించు;
  • accused, n. నిందితుడు; ముద్దాయి; నేరము మోపబడిన వ్యక్తి; ఆక్షారితుడు;
  • accuser, n. అభియోగి; అభియోక్త; కొండెకాడు; ఫిర్యాదీ; నేరం మోపిన వ్యక్తి;
  • accustomed, adj. అలవాటుపడ్డ; మరిగిన;
  • ace, n. ఆసు;
    • ace of clubs, ph. కళావరు ఆసు;
    • ace of diamonds, ph. డైమాను ఆసు;
    • ace of hearts, ph. ఆఠీను ఆసు;
    • ace of spades, ph. ఇస్పేటు ఆసు;
  • acellular, adj. కణరహిత;
  • acetic, adj. [chem.] అసిత; సౌరిక; సామ్ల; ఆమ్ల సంబంధమైన; పుల్లని;
  • acetic acid, n. అసితామ్లము; సౌరికామ్లము;
  • acetylene, n. ఎసిటిలీన్; ఒక ఉదకర్బన వాయువు; దీనిని ఆమ్లజనితో కలిపి మండిస్తే ఆ మంట వేడితో ఉక్కుని కూడా కొయ్యవచ్చు;
  • ache, n. (ఏక్) (1) నొప్పి; బాధ; అకము; dull pain; (2) సలుపు; పోటు; వేదన; వ్యధ; sharp pain;
    • ear ache, ph. చెవిపోటు;
    • heart ache, ph. మనోవ్యధ;
  • achievable, adj. సుసాధ్య;
  • achieve, v. t. సాధించు;
  • achievement, n. ఘనకార్యం; బృహత్ సాధన; గురిగోటు;
  • achras, n. అడవి బేరి; a tropical tree having papery leaves and large fruit;
  • achromatic, adj. వివర్ణమైన; రంగులేని; అవర్ణ; వర్ణరహిత;
    • achromatic lens, ph. [phy.] వివర్ణ కటకం; రంగులు విడిపోయి, చెదిరిపోకుండా, అన్ని రంగులూ ఒకే నాభి వద్దకి చేరేటట్లు నిర్మించిన కటకం;
  • achromia, n. బొల్లి; శరీరానికి రంగు పోయి, తెల్లని మచ్చలు కనిపించడం; same as vitiligo;
  • acid, adj. ఆమ్ల; పుల్లని; కాడి; కటుక; ద్రావక;
    • acid end, ph. [biol.] ఆమ్ల శీర్షం; ఎమీనో ఏసిడ్ యొక్క ఒక కొస;
    • acid rain, ph. ఆమ్ల వర్షం;
    • acid test, ph. ద్రావక పరీక్ష;
  • acid, n. ఆమ్లము; పులుసు; కాడి; కటుకం; ద్రావకం;
    • acetic acid, ph. అసితామ్లం; సౌరికామ్లం;
    • amino acid, ph. నవామ్లం;
    • boric acid, ph. టంకామ్లం;
    • fatty acid, ph. గోరోజనామ్లం;
    • hydrochloric acid, ph. ఉదహరికామ్లం; HCl;
    • nitric acid, ph. నత్రికామ్లం; HNO3;
    • nucleic acid, ph. కణికామ్లం;
    • strong acid, ph. త్రాణికామ్లం; ప్రబలామ్లం; గాఢామ్లం; సాంద్రామ్లం;
    • sulfuric acid, ph. గంధకామ్లం; గంధక ద్రావకం;
    • tartaric acid, ph. తింత్రిణికామ్లం;
    • weak acid, ph. నిస్త్రాణికామ్లం; దుర్బలామ్లం;
    • undiluted acid, ph. నిర్జలామ్లం; గాఢామ్లం;
  • acidic, adj. సామ్ల; ఆమ్ల సంబంధమైన; కటుక; చురుకుమనే;
  • acidify, v. t. ఆమ్లీకరించు;*
  • acidifying agent, ph. [chem.] ఆమ్లీకరణి;
  • acidity, n. (1) ఆమ్లత్వం; ఆమ్లత; పులుపు; (2) ఆమ్లపిత్తం; పులిత్రేనుపులు;
  • acidulant, n. ఆమ్లకం; మనం తినే ఆహారంలో సహజంగా ఉండే పులుపు కంటె ఎక్కువ కావాలనుకున్నప్పుడు అదనంగా కలిపే ఆమ్ల పదార్థం; సాధారణంగా వాడుకలో ఉన్న ఆమ్లకాలు: టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, వగైరాలు;
  • acknowledgment, n. (1) ఎకరారు; (2) కృతజ్ఞతా నివేదనం; (3) ముట్టిన రసీదు; అందిన నిర్ధారణ; చెల్లు చీటి;
  • acme, n. పరాకాష్ఠ; శిఖరం; ఉత్కృష్ట దశ;
  • Acmeism, n. చరమవాదం; a philosophical movement started by the Russian poet Gumilev;
  • acne, n. pl. మొటిమలు; పోతపొక్కులు; చర్మములోని కొవ్వు గ్రంథులు చీము పట్టి వాచగా వచ్చే పొక్కులు; (rel.) మెటికలు; పేతపొక్కులు;
  • aconite, n. నాభి; వసనాభి;
  • acorn, n. సింధూర వృక్షపు కాయ; ఓక్ చెట్టు కాయ; (చూ. బొమ్మ)
  • acoustic, adj. ధ్వని; శబ్ద; నిక్వణ; నిక్వాణ; శ్రవణ;
    • acoustic nerve, ph. శ్రవణ నాడి;
  • acoustics, n. ధ్వనిశాస్త్రం; శబ్దశాస్త్రం; నిక్వణశాస్త్రం; నిక్వాణశాస్త్రం;
  • acquaintance with mathematics, ph. గణితంలో ప్రవేశం;
  • acquaintance, n. (1) పరిచయం; ముఖపరిచయం; ఎరుక; తెలివిడి; ప్రవేశం; నెళవు; (2) m. పరిచయస్తుడు; f. పరిచయస్తురాలు;
    • acquaintance with mathematics, ph. గణితంలో ప్రవేశం; గణితంతో పరిచయం;
  • acquiesce, v. i. (ఎక్వియస్) సమాధానపడు; అయిష్టంగా ఇష్టపడు; అర్ధాంగీకారంగా సమ్మతించు;
  • acquiescence, n. సమ్మతి; ఒప్పుదల; అర్ధాంగీకార సమ్మతి;
  • acquire, v. i. పొందు; సంపాదించు; ఆర్జించు; సంగ్రహించు; సంతరించుకొను;
  • acquired, adj. ఆర్జిత;
    • acquired reflex, ph. అలవాటు; ఆర్జిత ప్రతివర్తిత;
  • acquisition, n. సంపాదన; ఆర్జన; ప్రాప్తి; సంగ్రహం;
  • acquittal, n. విడుదల;
  • acre, n. ఎకరం; 4,840 చదరపు గజములు; 43, 560 చదరపు అడుగులు; 40 గుంటలు; 100 సెంట్లు;
    • acre feet, ph. ఎకరపుటడుగు; ఒక ఎకరం వైశాల్యం మీద ఒక అడుగు ఎత్తు ఉంటే వచ్చే ఘనపరిమాణం;
  • acrid, adj. చురుక్కుమనే; ఘాటైన; ఖాదిర; (rel.) biting; corrosive; irritating; excoriating; pungent; sharp;
  • acrimonious, adj. చురుక్కుమనే; ఘాటైన; తీవ్రమైన; కటువైన;
    • acrimonious debate, ph. ఘాటైన వాగ్వివాదం; తీవ్రమైన వాగ్వివాదం;
  • acrimony, n. చురుక్కుమనిపించే తత్వం; ఖదిరత్వం;
  • acronym, n. పొడిపేరు; ప్రథమాక్షర నామం; ప్రనామం; పొడి అక్షరాల పేరు;
  • acropolis, n. గర్భగృహం; గ్రీకు శిథిలాల కేంద్రంలో ఉండే ముఖ్యమైన కట్టడం; (rel.) citadel; bulwark;
  • across, adj. తిర్యక్; అడ్డుగా;
  • acrostic, n. చిత్రబంధ కవిత్వం; బంధ కవిత్వం; ప్రతి పదం యొక్క మొదటి అక్షరంతో అర్ధవంతమైన మాట వచ్చేటట్లు పద్యం రాయడం;
  • act, n. (1) అంకం; నాటకంలో ఒక భాగం; (2) శాసనం; చట్టం; (3) పని; చర్య; చేష్ట; క్రియ; ఫలానాది అని చెప్పదగ్గ పని; (4) వేషం;
    • it is only an act, ph. అది ఒట్టి వేషం;
    • final act, ph. చరమాంకం;
    • statutory act, ph. వ్యవస్థాపిత చట్టం;
    • act of God, ph. దైవికం; దైవిక కృత్యం; అపౌరుషేయం;
    • act of insubordination, ph. అవిధేయత; అధికార ధిక్కారం;
  • act, v. t. నటించు; ప్రవర్తించు;

Usage Note: act and action

  • ---Use action as a countable noun when it means the same as act: a kind act or kind action. Act is always countable, whereas action can be uncountable: What is needed now is quick action.
  • acting, adj. కార్యవాహక; తాత్కాలిక; స్థానీయ;
    • acting editor, ph. కార్యవాహక సంపాదకుడు; సంపాదకునికి బదులు పనిచేసే వ్యక్తి;
  • acting, n. నటన;
    • method acting, ph. 'నటీనటులు ఓ పాత్రని సమర్ధవంతంగా పోషించాలంటే ఆ పాత్ర గుణగణాలని, అనుభూతులని ఊహిస్తే సరిపోదు. వాటిని స్వయంగా అనుభవించాలి'. అందువల్ల మెథడ్ యాక్టింగ్ ప్రక్రియలో నటి/నటుడు తను పోషించబోయే పాత్రని పూర్తిగా అర్ధం చేసుకోటానికి విపరీతమైన పరిశోధన, పరిశ్రమ చేస్తారు. వాళ్ల సన్నాహం ఔరా అనిపించే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకి, ఓ పిచ్చివాడి పాత్ర పోషించాలంటే సదరు నటుడు మానసికరోగిలా పిచ్చాసుపత్రిలో చేరి ఏ నెలరోజులో గడపటం, టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించాలంటే కొన్నాళ్లు స్వయంగా ఆ ఉద్యోగం చేసి ఆ జీవితాన్ని అనుభవించటం (ఇది ప్రసిద్ధ 'టాక్సీ డ్రైవర్' సినిమా కోసం రాబర్ట్ డినీరో చేసిన పని) ... ఇలాంటివన్న మాట. చాలామంది మెథడ్ యాక్టర్లు కెమెరా ముందున్న కాసేపే కాకుండా ఆ పాత్ర పోషిస్తున్నన్ని రోజులూ నిజజీవితంలో కూడా ఆయా పాత్రల్లానే ప్రవర్తించటం సాధారణమైన విషయం;
  • actino, pref. నక్షత్రాకార;
  • action, n. (1) కర్మ; (2) నటన; నటనా చాతుర్యం;(3) చర్య; క్రియ; పని; Action, in theoretical physics, is an abstract quantity that describes the overall motion of a physical system; Action may be thought of as the average momentum of a system multiplied by the length of the path between the initial and final positions.
    • action items, ph. విహిత కర్మలు; విధింపబడిన పనులు; చెయ్యవలసిన పనులు;
    • action at a distance, ph. సుదూర చర్య; అసమక్ష క్రియ; నిస్పర్శ్య కర్మ; నిస్పర్శ్య క్రియ; ఒక శక్తి ఒక వస్తువుని తాకకుండా ఆ వస్తువుమీద ప్రభావం చూపగలగడం. భూమ్యాకర్షణ శక్తి ఇటువంటి నిస్పర్శ్య క్రియకి ఒక ఉదాహరణ;
    • least action, ph. కనిష్ఠ చర్య;
    • principle of least action, ph. కనిష్ఠ చర్య సూత్రం; a very important and deep principle in physics says, "if the passage of a dynamic system from one configuration to another is spontaneous and without change in total energy then the corresponding "action" has a minimum value; Essentially, a system follows some unique path through time. The principle of least action is used to identify the unique path. That's why it's important. Using the principle of least action, we can derive the Euler-Lagrange equations, from which we can derive Newtonian mechanics;
    • severe action, ph. కఠిన చర్య;
  • activate, v. t. ఉత్తేజపరచు; విన్యసించు; సంక్రియపరచు;
  • activated, adj. ఉత్తేజిత; సంక్రియించిన;
    • activated charcoal, ph. ఉత్తేజిత అంగారం; ఉత్తేజించబడ్డ బొగ్గు;
    • voice-activated, ph. స్వర ఉత్తేజిత;
  • activation, n. ఉత్తేజనం;
    • activation energy, ph. ఉత్తేజన శక్తి; రసాయన శాస్త్రంలో ఒక రసాయన ప్రక్రియ ఊపు అందుకోడానికి కావలసిన కనిష్ఠ పరిమాణపు శక్తి;
  • active, adj. (1) చైతన్యవంతమైన; చురుకయిన; చలాకి అయిన; ఉత్తేజిత; ఉజ్వలమయిన; ఉత్సాహపూరిత; సోత్సాహ; నిరంతరం పాటుపడే; (2) కర్తరి;
    • active voice, ph. [gram.] కర్ర్తర్ధకం, కర్ర్తర్యర్థకం; కర్తరి ప్రయోగం; కర్తరి;
  • activism, n. సత్యాగ్రహం; సత్యాగ్రహవాదం; ఒక సామాకిక వ్యవస్థలో మార్పుని తీసుకురావడానికి బహిరంగ, సామూహిక ప్రయత్నాలు చెయ్యడం;
  • activist, n. సత్యాగ్రహి; ఒక వ్యవస్థలో మార్పుని తీసుకురావడానికి సామూహిక ప్రయత్నాలు చేసే వ్యక్తి; ఉ. మహాత్మా గాంధి; మేధా పడ్కర్;
  • activities, n. pl. కార్యకలాపాలు; క్రియాకలాపాలు;
    • extra-curricular activities, ph. విద్యేదేతర కార్యకలాపాలు;
  • activity, n. (1) చైతన్యత; చురుకుతనం; చలాకితనం; చర్యాశీలత; క్రియాశీలత; క్రియాపరత; రజస్సు; (2) పని; పాటు; క్రియ; కార్యకలాపం; చేష్టితం; క్రియాకలాపం;
    • business activity, ph. వ్యాపార క్రియాకలాపం;
    • chemical activity, ph. రసాయన చైతన్యత; రసాయన చర్య;
    • creative activity, ph. సృజనవ్యాపారం;
    • physical activity, ph. భౌతిక చైతన్యత; పరిశ్రమ; కసరత్తు;
    • mental activity, ph. మెదడుకి మేత; బుర్రకిపని;
  • actor, n. f. నటి; నటీమణి; అభినేత్రి; పాత్రధారిణి;
  • actor, n. m. నటుడు; అభినేత; పాత్రధారి;
    • character actor, ph. గుణచిత్ర నటుడు; గుణచిత్ర నటి; ప్రధాన పాత్రలు కాకుండా ఇతర ముఖ్య పాత్రలు ధరించే నటుడు;
  • actors, n. pl. నటీనటులు; నటీనటవర్గం; పాత్రధారులు;
  • actress, n. f. నటి; అభినేత్రి; పాత్రధారిణి;
  • actual, adj. వాస్తవమైన; యదార్థమైన; నిజమైన;
    • actual parameter, ph. [comp.] వాస్తవ పరామితి; యదార్థ పరామితి; A value, expression, or reference passed to a function or subroutine when it is

called and which replaces or is bound to the corresponding formal argument;

  • actually, adv. వాస్తవంగా; యదార్థంగా; నిజంగా;
  • actuator, n. ఒక వస్తువుని కదిపే సాధకం;
  • acumen, n. ఆలోచనలో చురుకుతనం; బుద్ధి సూక్ష్మత; బుద్ధి తీక్షత;
  • acupuncture, n. చైనా దేశంలో పుట్టిన, సూదులతో పొడిచి చేసే ఒక రకం వైద్య విద్య;
  • acute, adj. లఘు; తీవ్ర; తీక్షణ; తరుణ; నిశిత; ఉదాత్త; (ant.) chronic; obtuse; grave;
    • acute angle, ph. లఘుకోణం; అంతర్లంబ కోణం;
    • acute angled triangle, ph. లఘుకోణ త్రిభుజం; అంతర్లంబ త్రిభుజం;
    • acute condition, ph. ఉదాత్త పరిస్థితి; తీక్షణ పరిస్థితి;
    • acute disease, ph. తరుణ వ్యాధి; ఉదాత్త వ్యాధి;
    • acute pain, ph. లఘు శూల; తీవ్ర వేదన; దుస్సహ బాధ;
    • acute water shortage, ph. తీవ్రమైన నీటి ఎద్దడి; తీవ్రమైన నీటి కొరత;
  • acyclic, adj. అచక్రీయ;

Part 3: ad-af

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • A. D., Anno Domini; క్రీస్తు శకం; సాధారణ శకం;
  • ad, n. see advertisement;
  • adage, n. లోకోక్తి; సామెత; సామెం; సామ్యం; నుడికారం; పలుకుతీరు;
  • adamant, adj. వజ్ర; హీర; కఠోర; దృఢ; మొండి పట్టు గల; తన అభిప్రాయాన్ని మార్చుకోడానికి ఇష్టపడని;
    • adamant attitude, ph. మొండి వైఖరి;
    • adamantine glue, ph. వజ్రలేపనం; a cementing material that was used in India before the advent of Portland cement;
  • Adam's apple, n. కంఠమణి; కుత్తిక్కాయ; గొంతుక పోక; మనం మాట్లాడేటప్పుడు, మింగేటప్పుడు గొంతుకలో పైకి కిందకి కదలుతూన్నట్టు కనిపించేది; ఇది మగవారిలో ఎక్కువ స్పుటంగా కనిపిస్తుంది;
  • adapt, v. i. అవలంబించు; సమయానుకూలంగా ప్రవర్తించు; ఇముడు;
  • adapt, v. t. ఇముడ్చు; సమయానుకూలంగా మార్చు;
  • adaptability, n. ఇమిడిక;
  • adaptation, n. [biol.] ఉపయోజనం; సంధానపరచడం; ఇమడ్చడం;
  • adapter, n. సంయోక్త; సంయోజకం; వివిధ లక్షణాలున్న పరికరాలని తగిలించడానికి వాడే సంధి పరికరం;
    • electrical adapter, ph. విద్యుత్ సంయోక్త;
  • add, v. t. కూడు; కలుపు; చేర్చు; సంకలించు;
  • addendum, n. అనుబంధం; పరిశిష్టం; తరువాత చేర్చబడినది;
  • adder, n. (1) [comp.] సంకలని; కూడిక చేసే సాధనం; (2) కట్లపాము;
    • full adder, ph. పూర్ణ సంకలని;
    • half adder, ph. అర్ధ సంకలని;
    • parallel adder, ph. సమాంతర సంకలని;
    • serial adder, ph. శ్రేణిక సంకలని;
 
Full-adder=పూర్ణ సంకలని- తార్కిక చిత్రం
 
adder=అమెరికాలో కనిపించే ఏడర్అనే పాము
  • addict, n. వ్యసని, వ్యసనదాసుడు; మందుభాయి; హాని చేసే అలవాటుకి బానిస అయిన వ్యక్తి;
  • addition, adj. కూడిక; సంకలన;
    • addition table, ph. [math.] కూడిక పట్టీ; (rel.) multiplication table;
  • addition, n. (1) కూడిక; సంకలనం; కలయిక; (2) చేర్చబడ్డది;
    • in addition, ph. మీదు మిక్కిలి; పైపెచ్చు; ఇంకా; దీనికి తోడు;
  • addition, v. t. కూడుట; కలుపుట; చేర్చుట; సంకలించుట;
  • additional, adj. అదనపు; అధి;
    • additional gods, ph. అధిదేవతలు;
  • additive, adj. సంకలనాత్మక; సంకలిత;
    • additive property, ph. సంకలిత లక్షణం; సంకలిత స్వభావం; సంకలిత ధ్రర్మం;
  • additive, n. సంకలితం; కలపబడ్డ వస్తువు; నిల్వ చెయ్య డానికో, పోషకశక్తి పెంచడానికో, తదితర కారణాలకో ఆహారంలో కలిపే పదార్థం;
    • food additive, ph. ఆహార సంకలితం; ఆహారంలో ఉద్దేశపూర్వకంగా కలపబడ్డది;
  • additivity, n. సంకలనీయత;
  • address, n. (1) విలాసం; చిరునామా; వక్కణ; (2) సంబోధన; పిలుపు; (3) ఉపన్యాసం; ప్రసంగం;
    • address field, ph. [comp.] విలాస క్షేత్రం;
    • address part, ph. [comp.] విలాస భాగం;
    • address space, ph. విలాస నిచయం; The range of addresses which a processor or process can access, or at which a device can be accessed;
    • absolute address, ph. [comp.] నిస్థర విలాసం; నిరపేక్ష విలాసం;
    • base address, ph. [comp.] మూల విలాసం;
    • effective address, ph. [comp.] ఉపయుక్త విలాసం;
    • symbolic address, ph. [comp.] సంకేతిక విలాసం;
  • addressee, n. చిరునామాదారు; సంబోధితుడు;
  • address, v. t. (1) సంబోధించు; (2) ప్రసంగించు; (3) పిలుచు; (4) పట్టించుకొను;
  • addressing, n. [comp.] విలసీకరణం;
  • adenitis, n. శోషశోఫ; శోషరస గ్రంథుల వాపు;
  • adequacy, n. సరిపోవుట; పర్యాప్తత;
  • adequate, adj. (1) చాలినంత; సరిపడినంత; తగినంత; తగుమాత్రం; (2) బాగానే ఉన్న;
  • adhere, v. i. ఆశ్రయించి ఉండు; అంటుకొని ఉండు; అనుసరించు; అవలంబించు;
  • adherents, n. ఆశ్రీతులు; పక్షయులు;
  • adhesive, n. బంక; జిగురు; జింక; అంటింత; అంటించడానికి పనికొచ్చేది;
    • adhesive forces, ph. అసంజన బలాలు;
  • ad hoc, adj. తదర్థ; పెట్టు; ఒక పని కోసం నియమించబడ్డ;
    • ad hoc auspicious time, ph. పెట్టు ముహూర్తం; అనగా, పంచాంగంలో ఉన్న నిర్ధిష్ట ముహూర్తం కానిది;
    • ad hoc committee, ph. తదర్థ కమిటీ; ఒక పని కోసం నియమించబడ్డ కమిటీ;
  • adiabatic, adj. [phy.] స్థిరోష్ణక; అతాపక; ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారకుండా దాని ఘనపరిమాణం కాని పీడనం కాని మార్చగల;
  • ad infinitum, n. నిరవధికం; పదే పదే జరిగేది; అంతులేకుండా జరిగేది;
  • adipose, adj. కొవ్వుకి సంబంధించిన;
    • adipose tissue, ph. కొవ్వు కణరాసి; కొవ్వు టిష్యూ;
  • adipose, n. కొవ్వు; ఘనీభవించిన చమురు;
  • adjacent, adj. పక్కన ఉన్న; పక్క; ఆసన్న; సమీప; సన్నిహిత; సాన్నిధ్య; సంలగ్న;
    • adjacent angle, ph. [math.] ఆసన్న కోణం; సన్నిహిత కోణం;
  • adjective, n. విశేషణం; నామవాచకం యొక్క లక్షణాన్ని విశదీకరించేది;
    • verbal adjective, ph. క్రియాజన్య విశేషణం; క్రియ నుండి పుట్టిన విశేషణం; (ex. He is annoying me అన్నప్పుడు annoying క్రియ, కాని I have an annoying brother అన్నప్పుడు the same "annoying" is an adjective;

Usage Note: Adjectives

  • --- In English, adjectives have to be in the order shown here: opinion-size-age-shape-color-origin- material-purpose, followed by a noun. Example: a lovely little old rectangular, green, French silver whittling knife. “Green great dragons” is not correct. It should be “great green dragons.” "Lovely little baby" is correct. Other correct usages are: Beautiful large round wooden table, Big blue eyes, A small black plastic bag, old white cotton shirt;
  • adjoint, adj. [math.] అనుబంధ; సామీప్య; పక్కన ఉన్న;
    • adjoint equation, ph. [math.] అనుబంధ సమీకరణం;
    • adjoint operator, ph. [math.] అనుబంధ పరికర్త; In mathematics, specifically in functional analysis, each bounded linear operator on a complex Hilbert space has a corresponding Hermitian adjoint (or adjoint operator);
  • adjournment, n. (1) వాయిదా వెయ్యడం; (2) సమావేశాన్ని ముగించడం;
  • adjure, v. t. ప్రమాణం చేయించు; ఒట్టుపెట్టించు;
  • adjust, v. i. ఇముడు; సరిపెట్టుకొను; సర్దుకొను;
  • adjust, v. t. సర్దు; సర్దుబాటుచేయు; సరిపుచ్చు; పరిష్కరించు; సవరించు; సరిదిద్దు; సరిచేయు;
  • adjustable, adj. సమాయోజ్య; వ్యవస్థాప్య;
  • adjustment, n. సర్దుబాటు; సవరణ; సరిదిద్దిక; పరిష్కారం;
  • adjuvant, n. (1) సహాయక ఔషధం; ఒక ఔషధం తరువాత వాడే ఔషధం;(2) అనుపానం; ఒక ఔషధంతో పాటు తాగే ద్రవం;
  • ad lib, adv. ఆశువుగా చెప్పేది; ముందుగా తయారవకుండా అప్పటికప్పుడు కల్పించి చేసిన (నటన; ప్రసంగం; కవిత్వం);
  • administer, v. t. (1) పాలించు; పరిపాలించు; నడుపు; జరిపించు; సంబాళించు; (2) వాడు; ఉపయోగించు; (3) మందుని ఇచ్చు;
  • administration, n. పాలన; హయాం; పరిపాలన; ఏలుబడి;
    • administration of justice, ph. న్యాయ పరిపాలన;
  • administrative, adj. పరిపాలక;
  • administrator, n. m. పాలకుడు; పరిపాలకుడు; వ్యవస్థాపకుడు; f. పాలకి; పరిపాలకి;
  • admirable, adj. మెచ్చదగ్గ; హర్షింపదగ్గ; శ్లాఘనీయ;
  • admiration, n. మెప్పుకోలు; హర్షణ;
  • admire, v. t. మెచ్చుకొను; హర్షించు; శ్లాఘించు;
  • admission, n. (1) ప్రవేశం; (2) ఒప్పుకోలు; ఒప్పుకోవడం; గ్రహణం;
  • admission fee, n. ప్రవేశ రుసుం;

Usage Note: admission and admittance

  • ---Admission is the price you pay to go into a place like cinema or museum: The price of admission is Rs. 10.00. Admittance is the permission that you need in order to enter a place or organization: No Admittance!
  • admit, v. i. ఒప్పుకొను; అంగీకరించు;
  • admit, v. t. (1) ప్రవేశపెట్టు; రానిచ్చు; (2) దఖలు చేయు;
  • admittance, n. ప్రవేశించడానికి అనుమతి;
    • no admittance, ph. ప్రవేశించడానికి అనుమతి లేదు;
  • admonish, v. t. మందలించు; అదమాయించు; హెచ్చరించు;
  • admonition, n. మందలింపు; అదమాయింపు; హెచ్చరిక; గద్దింపు;
  • ado, n. (ఎడూ) ఆర్భాటం; హడావిడి; గాభరా; కంగారు; గందరగోళం; గొడవ;
  • adobe, n. (ఎడోబీ) (1) పచ్చి ఇటిక; ఎండిన ఇటిక; (2) మట్టిని, గడ్డిని కలిపి కట్టిన గోడల ఇల్లు;
  • adolescent, n. (1) m. బాలుడు; కుమారుడు; (2) ) f. బాలిక; కుమారి; తరుణి;
  • adolescence, n. కౌమారం; అపరిపక్వత; కిశోరావస్థ; పదమూడు నుండి పదిహేడు సంవత్సరాల వయస్సు;
  • adopt, v. i. (1) స్వీకరించు; అంగీకరించు; అవలంబించు; (2) పెంచుకొను; దత్తత చేసుకొను; దత్తు తీసుకొను;
  • adoption, n. (1) దత్తత స్వీకారం; పెంపకం; (2) అంగీకారం;
  • adoptive, adj. దత్తు;
    • adoptive son, ph. దత్తుపుత్రుడు;
  • adorable, adj. ముద్దులొలుకుతున్న;
  • adoration, n. వల్లమాలిన అభిమానం;
  • adorn, v. t. అలంకరించు;
  • adrenal, adj. [med.] ఉపవృక్క; ఆండక; (ety) Latin, on the kidney,
  • adrenal gland, ph. [biol.] ఉపవృక్క గ్రంథి; వృషణకం;
  • adrenaline, n. [med.] ఉపవృక్కి; ఆండకి; శరీరంలో తయారయే ఒక రసాయనం; (note) The Parke-Davis pharmaceutical company succeeded in registering Adrenaline as a trademark for its brand of adrenaline hormone. So American scientists use the generic Greek word "epinephrine" which means the same thing;
 
adrenal gland = మూత్రపిండాల మీడ టోపీలా ఉన్న ఉపవృక్క గ్రంథి
  • adrift, adj. లంగరులేని; తాడుతెగిన; కొట్టుకొని పోతూ ఉన్న; అసహాయ;
  • adsorption, n. అధిశోషణం; అధిచూషణం;
  • adulation, n. ముఖస్తుతి; ఇచ్చకం;
  • adulatory, adj. ఇచ్చకపు;
  • adult, adj. (1) పెద్ద; ఎదిగిన; వయస్సు వచ్చిన (2) వయోజన;
    • adult education, ph. వయోజన విద్య;
    • adult stage, ph. ప్రౌఢ దశ;
  • adult, n. పెద్ద; పెద్ద మనిషి; యుక్త వయస్సు వచ్చిన వ్యక్తి; m. వయోజనుడు; యుక్త వయస్కుడు; తరుణ వయస్కుడు;
    • average adult, ph. సగటు వయోజనుడు;
  • adulteration, n. కల్తీ; కారాకూరం;
  • adultery, n. వ్యభిచారం; రంకుతనం; రంకు; రంకాట; (rel.) పారదార్యం is sexual relation with another man's wife;
  • adulthood, n. పెద్దతనం; యవ్వనం; వయసు; వయోదశ;
  • advance, n. బయానా; అగావు; కొనుగోలుకి ముందు ఇచ్చే సొమ్ము; లావణి; సంతకారం;
  • advance, v. i. ముందుకి జరుగు; అభివృద్ధి చెందు;
  • advance, v. t. జరుపు; ప్రతిపాదించు; అభివృద్ధి చేయు;
  • advanced, adj. పెద్ద; ఆధునిక; ఉన్నత; సునిశితోన్నత;
    • advanced methods, ph. ఆధునిక పద్ధతులు;
    • advanced stage, ph. సునిశోన్నత స్థాయి;
    • advanced studies, ph. పెద్ద చదువులు;
  • advancement, n. బాగుపడడం; ముందుకి వెళ్ళడం; ముందజ; ముందడుగు; పురోభివృద్ధి; పురోగతి; పురోగమనం; ప్రగతి; అభ్యున్నతి;
  • advantage, n. లాభం; సఫలత; అనుకూలత; సప్రయోజనం; సౌలభ్యం; ఉపయుక్తి; ఇతవు;
    • advantages and disadvantages, ph. లాభాలు, నష్టాలు; అనుకూలతలు, ప్రతికూలతలు; ఇతవులు, ఇక్కుపాట్లు;
  • adventitious, adj., (1) సంభవించే; ఆకస్మిక; (2) బయటి; ఆగంతుక; (3) అబ్బురపు; సహజం కాని;
    • adventitious buds, ph. [bot.] అంటు మొగ్గలు;
    • adventitious roots, ph. అంటు వేళ్లు; అబ్బురపు వేళ్లు; ఊడలు;
  • adventure, n. సాహస కృత్యం;
  • adverb, n. క్రియా విశేషణం; క్రియ యొక్క లక్షణాన్ని తెలియజేసేది; ఉదా: గొప్ప - విశేషణం (adjective); గొప్పగా(న్)- క్రియావిశేషణం (adverb);
  • adversary, n. విరోధి; ఎదిరి; ప్రతిపక్షి; శత్రువు; ప్రతిరోధి;
  • adverse, adj. ప్రతికూల; ప్రతికూలమైన; వ్యతిరేక;
  • adversity, n. దుర్దశ; కష్టాలు; దురదృష్టం;
  • advertise, v. t. ప్రకటించు; సాటించు; ఆఖ్యానించు; వ్యజించు;
  • advertisement, n. వ్యాపార ప్రకటన; సాటింపు; అఘోషణిక; ఉపఘోషణం; ఘోషణ ప్రకటన; డబ్బు ఇచ్చి చేసే ప్రకటన;
  • advice, n. సలహా; హితవు;
  • advise, v. t. సలహా ఇచ్చు; చెప్పు;
  • adviser, n. m. సలహాదారుడు; హితైషి;
  • advocacy, n. అధివక్తృత్వం; పరార్ధవాదం; అనుకూలవాదం; ఒకరి తరఫున వాదించడం;
  • advocate, n. అధివక్త; ఒక పనిని ఒక విధంగా చెయ్యాలంటూ గట్టిగా మద్దత్తు ఇచ్చి మాట్లాడే వ్యక్తి;
  • adze, n. బాడిస; తక్షణి; చిరు గొడ్డలిని పోలిన వడ్రపు పనిముట్టు;
  • aegis, n. గొడుగునీడ; ఛత్రచ్ఛాయ; సంరక్షణ; కవచం; రక్షణ; కాపుదల; negotiations were conducted under the aegis of the UN;
  • aeration, n. వాయుప్రసరణం;
  • aerial, adj. గాలిలో ఉండే; పైనుండి కనబడే;
    • aerial roots, ph. ఊడలు; భూమిలో కాకుండా గాలిలోఉండే వేళ్ళు;
    • aerial view, ph.
  • aero, pref. వైమానిక; ఛదన;
  • aerobes, n. గాలిలో బతికే సూక్ష్మజీవులు; see also anaerobes;
  • aerobic exercise, ph. శరీరానికి ఆమ్లజనిని విస్తారంగా సరఫరా చెయ్యడానికి అనువైన వ్యాయామం;
  • aerosols, n. pl. తుషారేణువులు; తుషార రూపంలో ఉన్న రేణువులు; రేణుతుంపరలు; tens of millions of specks of solid particles and liquid droplets of matter suspended in air are known as aerosols;
  • affability, n. కలుపుకోలుతనం; మర్యాద;
  • affair, n. వ్యవహారం; తంతు; తతంగం; కలాపం;
    • love affair, ph. ప్రేమ వ్యవహారం; ప్రేమ కలాపం; సరసోదంతం; రానికి తంతు;
    • secret affair, ph. రహస్య కలాపం;
  • affect, v. t. మార్పు కలిగేలా చెయ్యడం;

Usage Note: affect and effect

  • ---Use the verb affect to talk about making changes, and the noun effect to talk about the result of changes. Do you think the changes in the law affect us? I do not know what effect it will have on our life.
  • affection, n. అభిమానం; అనురాగం; అనురక్తి; రాగం; మమకారం; మక్కువ;
  • afferent, adj. అంతర్ముఖ; అభివాహి; స్పర్శకి సంబంధించిన; శరీరాంగములనుండి మెదడు దిశలో వెళ్లే; (ant.) efferent;
    • afferent nerves, ph. [phys.] అంతర్ముఖ నాడులు; స్పర్శ నాడులు; శరీర అవయవాలనుండి వెన్నుపామువైపు వాకేతాలని మోసుకెళ్లే నాడులు;
  • affidavit, n. ప్రమాణ పత్రం; హలఫ్ నామా; ప్రమాణపూర్వకముగా న్యాయాధిపతియెదుట వ్రాసి సంతకముచేసియిచ్చినది;
  • affiliated, adj. అనుబంధించబడ్డ; అనుబంధ; అనుబద్ధ;
  • affinity, n. అనురాగం; స్నేహాకర్షణ; ఆపేక్ష; చెలిమి; మైత్రి; ఆకర్షణ; సంబంధం;
  • affirm, v. t. రూఢిపరచు; ధ్రువపరచు; నొక్కివక్కాణించు; ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేయు;
  • affix, n. అంటు; ప్రత్యయం;
  • affix, v. t. అంటించు; తగిలించు; చేర్చు;
  • afflictions, n. కడగండ్లు; ఇబ్బందులు; కష్టాలు; పరితాపాలు;
    • afflicted person, ph. పరితాపి; ఉపతాపి; see also patient;
  • affluence, n. ఐశ్వర్యం; భాగ్యభోగ్యాలు; సంపద; సిరిసంపద; భాగ్యం; సుభిక్షం;
  • affluent, adj. (1) సంపన్న; ధనిక; కలిమి గల; ధనస్వామ్య; (2) ప్రవాహశీల; ప్రవాహానికి అనుకూలంగా ఉన్న; పుష్కలంగా ఉన్న;
    • affluent society, ph. ధనికవర్గ సమాజం; సిరిసంపద లతో ఉన్న సమాజం; ధనస్వామ్య సమాజం;
  • afforestation, n. ఆటవీకరణ;
  • affricates, n. [ling.] స్పర్శములుగా మొదలయి ఊష్మ శబ్దాలుగా అంతం అయేవాటిని సూచించే అక్షరాలు; ఉదా. దంత్య చ, జ లు;
  • aflatoxins, n. pl. తినే పదార్థాలకి పట్టే ఒక రకం బూజులో ఉండే విష పదార్థాలు; Aflatoxins are a family of toxins produced by certain fungi that are found on agricultural crops such as maize (corn), peanuts (groundnuts), cottonseed, and tree nuts. The main fungi that produce aflatoxins are Aspergillus flavus and Aspergillus parasiticus, which are abundant in warm and humid regions of the world;
  • aforesaid, adj. సదరు; పైన చెప్పిన;
  • after, adv. తరవాత; పిమ్మట; తదనంతరం;
  • afterbirth, n. జరాయువు; మావి; ప్రసవం అయిన తర్వాత బయటకు వచ్చే "బిడ్డసంచి"; placenta;
  • afternoon, n. అపరాహ్నం; మధ్యాహ్నం;
  • afterthought, n. అంతరాలోచన; అనుచింతన; తరువాత పుట్టిన ఆలోచన;
  • afterwards, adv. తరువాత; తర్వాత; దరిమిలా; అనంతరం; తదనంతరం; పిదప; పిమ్మట; ఆనక;
  • afterword, n. తుదిమాట; పుస్తకం మొదట్లో రాసేది "ముందు మాట" అయితే, చివర రాసేది "తుదిమాట";

Part 4: ag-ak

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • again, adv. మళ్లా; తిరిగి; మరల; మరిన్నీ; వెండియు;
    • again and again, ph. మళ్లా మళ్లా; పదే పదే; పలుమార్లు; చీటికీ మాటికీ;
  • against, adv. విరుద్ధంగా; ప్రతికూలంగా; ఎదురుగా;
  • agar, n. అగార్, అగార్ అగార్; జున్నుగడ్డి; సముద్రపు నాచు నుండి తీసే ఒక రకమైన చక్కెర వంటి పదార్థం; ప్రయోగశాలలో సూక్ష్మజీవులని పెంచడానికి విరివిగా వాడే మాధ్యమం; వంటవస్తువులు పేరుకుని గట్టి పడడానికి విరివిగా వాడతారు; జున్నుపాలు దొరకకపోతే అగార్ ని పాలల్లో కలిపి జున్ను చెయ్యవచ్చు; అర లీటరు పాలు మరిగించి, అందులో 10 గ్రాముల అగార్ కలిపి, రుచికి 10 చెంచాల చక్కెర, సువాసనకి ఏలకపొడి వేసి బాగా కలిపి లోతుగా ఉన్న పళ్లెంలో పోసి గంట సేపు చల్లారనిస్తే గట్టి పడి జున్ను తయారవుతుంది;
  • agaricus, n. కుక్కగొడుగు; పుట్టగొడుగులలో తినడానికి పనికిరాని రకాన్ని కుక్కగొడుగు అంటారు; (rel.) mushroom;
  • agaricaceous, adj. కుక్కగొడుగుకి సంబంధించిన;
  • agate, n. గోమేధికం; ఒక విధమైన రత్నం; ఇదే జాతి రాతితో కల్వాలు, పొత్రాలు కూడా చేస్తారు; రసాయనికంగా "సిలికాన్‍ డై ఆక్సైడ్‍"
 
గోమేధికం
  • agave, n. కిత్తనార; కిత్తలి; మొగలి ఆకారంలో ఉండే ఒక తుప్పకలబందని పోలిన మొక్క; ఈ మొక్క దక్షిణ అమెరికాలో విస్తారంగా పెరుగుతుంది; ఈ మొక్క నుండే టెకీలా అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తారు; [bot.] Agave tequilana; Agave americana;
 
Agave_americana=కిత్తలి
  • age, n. (1) వయస్సు; ప్రాయం; పరువం; (2) యుగం; కాలం; తరం;
    • age old, ph. పురాతనమయిన; బూజు పట్టిన;
    • chronological age, ph. తిథివారీ వయస్సు; కాలక్రమణ వయస్సు;
    • mental age, ph. మానసిక వయస్సు;
    • Neolithic age, ph. కొత్త రాతియుగం; నవశిలా యుగం;
    • old age, ph. ముసలితనం; వార్ధక్యం; ముదిమి; పెద్ద వయస్సు;
  • age, v. t. ఊరబెట్టు; నిల్వ చేయు;
  • aged, adj. (1) వయసెక్కిన; ముసలి; (2) నిల్వచేయబడిన;
  • aged, n. ముదుసలి; ముదుక; ముసలి;
  • agency, n. (1) ఏజన్సీ; ప్రాతినిధ్యం; (2) మన్యప్రాంతం;
  • agenda, n. (1) చర్చనీయాంశ క్రమణిక; కార్యక్రమ క్రమం; సభానుక్రమం; (2) అంతర్గతమైన కోరిక; మనస్సులో ఉన్న కోరిక; మనోభీష్టం;
  • agent, n. (1) ప్రతినిధి; ముక్త్యారు; మధ్యవర్తి; కర్త; కారకి; కారకం; కారకుడు; కర్మచారుడు; కర్మచారి; చేతవాను; ఏజంటు; (2) [comp.] కారకర్మ; ఏజంటు; An automatic program that is designed to operate on the user’s behalf, performing a specific action in the background;
    • aggravating agent, ph. ఉద్దీపకం; ప్రకోపకం;
    • gelling agent, ph. జల్లీకరణ కారకి;
    • intelligent agent, ph. బుద్ధ కర్మచారి; an intelligent agent (IA) is an agent acting in an intelligent manner; It perceives its environment, takes actions autonomously.
    • thickening agent, ph. చిక్కదన కారకి;
    • stabilizing agent, ph. స్థిరీకరణ కారకి;
  • agglutinant, n. బంక; జిగురు; అంటించడానికి ఉపయోగించే పదార్థం;
  • agglutination, n. విరగడం; గుచ్ఛకరణం; రక్తంలో ప్రతికాయాలు, ప్రతిజనులు కలసినప్పుడు రక్తం పాలు విరిగినట్లు విరిగిపోవడం;
  • agglutinative, adj. [ling.] మాట తరువాత ప్రత్యయములు చేరెడి; ఉదా. తెలుగు; see also inflectional;
  • agglutinin, n. ఈ ప్రతికాయం రక్తంలో ఉంటే రక్తంలోని ఎర్ర కణాలు పాలు విరిగినట్లు విరిగి ఉండకట్టి పోతాయి;
  • agglutinogen, n. రక్తంలో ప్రతికాయాల ఉత్పత్తికి దోహదం చేసే పదార్థం;
  • aggrandizement, n. ఆత్మస్తుతి; ఆత్మ ప్రశంస; స్వోత్కర్ష; సొంత బాకా; డబ్బా;
    • mutual aggrandizement, ph. పరస్పర డబ్బా;
    • self aggrandizement, ph. సొంత డబ్బా; ఆత్మస్తుతి; స్వోత్కర్ష;
  • aggravate, v. t. పరిస్థితిని ప్రకోపింపజేయు; పాడుగా ఉన్న పరిస్థితిని ఇంకా ప్రకోపింపజేయు;

Usage Note: aggravate, irritate, annoy

  • ---A problem or situation is aggravated, but a person is annoyed or irritated.
  • aggravation, n. ప్రకోపన; ఉద్రేకం; ఉద్దీపన; రోగి బాధలు తీవ్రమగుట; (ant.) amelioration;
  • aggregate, n. (1) వెరసి; మొత్తం; (2) సముదాయం; సమూహం; సముచ్ఛయం; (3) కంకర; చిన్న రాళ్లు;
  • aggregate, v. t. గుంపులుగా చేయు; కూడగట్టు;
  • aggregated, adj. సంకలిత; కూడగట్టిన;
  • aggregation, n. సముదాయం; సమాహారం;
  • aggression, n. (1) దూకుడు; దూకుడుతనం; (2) ఆక్రమణ; దురాక్రమణ;
  • aggressiveness, n. చొరవ; జోరు; ఉదుటు; దూకుడుతనం;
  • aggrieved, adj. నష్టపడ్డ; దుఃఖపెట్టబడ్డ;
  • agile, n. చురుకైన, చలాకీ అయిన; కుప్పిగంతులు వేసే;
  • agility, n. లాఘవం; లాఘవత్వం; చెంగత్వం; చురుకుతనం;
  • agitate, v. t. త్రచ్చు; మథించు; చిలుకు; వేదించు;
  • agitated, adj. క్షుభితం; ఘూర్ణితం;
  • agitation, n. వేదన, ఆవేదన; క్షోభ; ప్రక్షోభము; కలత; కలవరం; ఆందోళన;
  • agitator, n. (1) ఆధూతి; సంక్షోభిని; గరిటె వంటి తిప్పే సాధనం; (2) ఆందోళనకారి;
  • agnostic, n. అజ్ఞేయుడు; దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం ఇదమిత్థంగా తేల్చలేమని నమ్మే మనిషి; see also atheist;
  • ago, adj. ఏదైనా విషయం ఎంత కాలం కిందట జరిగిందో తెలియజేయడానికి వాడే మాట;

Usage Note: ago, for, since

  • ---Use ago to show how far back in the past something happened. Always use it with verbs in the simple past: I came here a year ago. Use for and since in the present perfect to talk about a situation that began in the past and continues in the present. Since is used with dates: I have lived here since 1970. I have lived here for ten years.
  • agranulose, n. pl. [biol.] కణికరహితాలు; కణిక లేని జీవకణాలు;
  • agrarian, adj. కార్షిక; వ్యావసాయిక, పాడిపంటలకు సంబంధించిన; పొలాలకి సంబంధించిన;
  • agree, v. i. (1) సమ్మతించు; ఒప్పుకొను; ఒడంబడు; అంగీకరించు; (2) ఏకీభవించు;
  • agreement, n. (1) సమ్మతి; ఒప్పుదల; ఒప్పందం; ఒడంబడిక; ఒప్పుకోలు; ఒప్పాచారం; అంగీకారం; అంగీకృతి; రాజీ; (2) ఏకీభావం; (3) కరారునామా; పురోణి పత్రం;
  • agricultural, adj. వ్యవసాయపు; వ్యావసాయిక; పంటల; దోహద;
    • agricultural country, ph. వ్యావసాయిక దేశం;
    • agricultural field, ph. వ్యవసాయపు భూమి; పొలం; చేను;
    • agricultural science, ph. వ్యవసాయ శాస్త్రం; దోహద శాస్త్రం;
  • agriculture, n. వ్యవసాయం;
    • shifting agriculture, ph. పోడు వ్యవసాయం;
  • agronomy, n. క్షేత్రశాస్త్రం;
  • ague, n. (ఏగ్యు) ఒక రకం చలిజ్వరం;
  • AI, n. కృతక ప్రజ్ఞ; విశ్వామిత్ర వివేకం;
  • aid, n. సహాయము;
  • aid, v. t. సహాయము చేయు;
    • aid and abet, ph. కుమ్మక్కు;
  • aide, n. ఉపకారి; సహాయకారి; పెద్ద ఉద్యోగులకి కుడి భుజంగా ఉండి సహాయం చేసే వ్యక్తి;
  • AIDS, n. Acquired Immune Deficiency Syndrome; రక్తం వైరస్ తో కలుషితం అవడం వల్ల వచ్చే ఒక ప్రాణాంతకమైన రోగం;
  • ailment, n. వ్యాధి; రోగం; జబ్బు;
    • puerperal ailment, ph. సూతికా రోగం; పురిటి జబ్బు;
  • aim, n. గమ్యం, ధ్యేయం; గురి; లక్ష్యం;
    • aim of human life, ph. పురుషార్థం; మానవ జీవితపు ధ్యేయం;
  • aimless, adj. అగమ్య; నిరర్థక; నిష్ప్రయోజన; లక్ష్యరహిత; దిక్కుమాలిన;
  • air, adj. (1) వాయు; వాత; పవన; గాలి; (2) విమాన; వైమానిక;
    • air blast, ph. వాయు విస్ఫోటనం;
    • air bubble, ph. గాలి బుడగ;
    • air conditioner, ph. వాత నియంత్రిణి;
    • air conditioning, ph. వాతనియంత్రణం; వాతానుకూల్యకరణం;
    • air passage, ph. వాయు మార్గం; గాలి గంత;
    • air pump, ph. వాత రేచకం,
    • air sac, ph. వాయు కోశం;
  • airbase, ph. విమాన స్థావరం;
  • airplane, aeroplane, (Br.) n. విమానం;
  • air, n. గాలి; వాయువు; వాతం; పవనం;
    • residual air, ph. అవశిష్ట వాయువు;
  • air, v. t. (1) ఆరబెట్టు; (2) భావాలని వ్యక్తపరచు; (3) రేడియో తరంగాలని ప్రసారం చేయు;
  • airbase, ph. విమాన స్థావరం;
  • aircraft, n. విమానం; గాలిలో ఎగరగలిగే యంత్రం;
    • aircraft carrier, ph. విమాన వాహకి;
  • air-filled, adj. పవన కుంభిత; వాయు కుంభిత; గాలితో నింపిన;
  • air-hostess, n. గగన సఖి; ఆకాశ కన్య;
  • airless, adj. నిర్వాత; నివాత; గాలిలేని;
  • airline, n. విమానంలో ప్రయాణీకులని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళే కంపెనీ;
  • airliner, n. ప్రయాణీకులని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళే విమానం;
  • airmail, n. విమానపు టపా;
  • airplane, aeroplane, (Br.) n. విమానం; ఇంజను, రెక్కలు ఉండి ఎగిరే యంత్రం;
  • airport, n. విమానాశ్రయం; ప్రయాణీకుల విమానాలు ఆగే స్థలం;
  • airstrike, n. విమానపుదాడి; విమానాలతో దాడి చేసి బాంబులు పడెయ్యడం;
  • airstrip, n. విమానాలు ఎగరడానికి దిగడానికీ చదును చేసిన ప్రదేశం;
  • aisle, n. నడవ; నడక; ఇటూ అటూ ఉండే కుర్చీ వరసల మధ్య నడవడానికి ఉండే నడవ; see also verandah;
  • a.k.a., ph. ఉరఫ్, abbr. for also known as;

Part 5: al-am

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • AC, n. ఏకాంతర విద్యుత్తు;
  • al, suff. ఆల్; ఆల్డిహయిడు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. మెతనాల్, క్లోరాల్; ప్రొపనాల్;
  • alabaster, n. చంద్రకాంత శిల; విగ్రహాలు చెక్కడానికి వాడే ఒక రకం జిప్సం రాయి; రసాయనికంగా "కేల్సియం సల్ఫేట్‍"; దెబ్బలు తగిలినప్పుడు మూస వేసి కట్టడానికి వాడే "ప్లేస్టర్‍ అఫ్‍ పేరిస్‍" అన్నా ఇదే పదార్థం;
  • alarm, n. గడబిడ; హెచ్చరిక; తరతర; ఆమని; ప్రమాదాన్ని సూచించే ధ్వని; మేలుకొలుపు గంట;
    • alarm clock, ph. గడబిడ గడియారం; ఆమని గడియారం; మేలుకొలుపు గడియారం; తరతర గడియారం;
  • alas!, inter. అయ్యయ్యో; అయ్యో; కటకటా; అక్కటా; రామరామా; శివశివా; హరిహరీ;
  • albeit, conj. అయినప్పటికీ;
  • albino, n. వర్ణరహితం, తెల్లని; పట్టుపాప; మెలనిన్ అనే రంగు పదార్థం లోపించడం వల్ల అతి తెల్లగా ఉన్న మనిషి కాని జంతువు కాని;
  • albumin, n. (1) శ్వేతకం; శ్వేతధాతువు; రక్తంలో ఉండే ఒక ప్రాణ్యం; (2) తెల్ల సొన; గుడ్డులో తెల్లని ద్రవ భాగం;
  • albuminuria, n. మూత్రములో శ్వేతధాతువు అధికంగా ఉండుట;
  • alchemist, n. పరుసవేది; సువర్ణయోగి; పాదరసం నుండి బంగారం చేయగలమనే అపోహ గల వ్యక్తి రసయోగి, ఆ ప్రక్రియ రసవాదం;
  • alchemy, n. పరుసవేదం; సువర్ణ యోగం; హేమతారక విద్య; ఇనుము వంటి క్షుద్ర ధాతువుల నుండి ’పరుసవేది’ సహాయంతో బంగారం వంటి మేలి ధాతువులని చేయగలమనే అపోహతో కూడిన కుశాస్త్రం;
  • alcohol, n. మద్యం, మద్యసారం; ఆల్కహాలు; ఒలంతం; లేదా ఓల్ అనే శబ్దంతో అంతమయే రసాయనం; రసాయన శాస్త్రంలో ఆల్కహాలు అనేది ఒక జాతి పదార్థాల పేరు. ఈ జాతి పదార్థాల పేర్లన్నీ ఓల్ శబ్దంతో అంతం అవాలని జెనీవాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో అంతా ఒప్పుకున్నారు;
    • methyl alcohol, ph. కరస్రారా; కాష్ఠాసవం; మెతనోలు; కాష్ఠోల్;
    • rubbing alcohol, ph. ఉద్వర్తన ఒలంతం; మృష్టాలంతం; కషణోలంతం; కషణోల్;
    • wood alcohol, ph. కాష్ఠోల్; కరస్రారా; మెతనోలు;
  • alcoholic, adj. మద్యపానీయ;
    • alcoholic beverage, ph. మద్యపానీయం;
    • alcoholic spirits, ph. మద్యార్కములు; మద్యాన్ని బట్టీ పట్టగా వచ్చే పదార్థాలు;
  • alcoholism, n. తాగుడు; తాగుబోతుతనం; మదాత్యం;
  • Alcor, n. అరుంధతి నక్షత్రం; సప్తర్షి మండలంలో ఒక నక్షత్రం; ఈ నక్షత్రం కంటికి కనిపిస్తే దృష్టి బాగున్నట్లు లెక్క అనే అభిప్రాయం అరేబియాలో కూడా ఉంది; 80 Ursae Majoris;
 
250px-Alcor-in-Dipper.jpg
  • alcove, n. (1) గూడుగది; గోడని వెనక్కి జరిపి కట్టిన చిన్న గది; పంచపాళీ; (2) గజీబో; పొదరిల్లు;
  • Aldebaran, n. రోహిణి నక్షత్రం; వృషభ రాసిలో ఉన్న ఒక అరుణ మహాతార; "ఆల్ఫా టౌరీ"; ఆకాశంలో ప్రకాశమానమైన తారలలో ఒకటి; అరబిక్ భాషలో "అల్డెబరాన్ అంటే (కృత్తిక) తరువాత వచ్చేది" అని అర్థం;
 
250px-Taurus_constellation
  • aldehyde, n. అలంతం; మధ్యలో ఒక కార్బనిల్‍ గుంపు ఉండి, మరొక ఉదజని, పక్కని ఒక R గుంపు ఉన్న ఆంగిక రసాయనం; పక్కనున్న R గుంపు కేవలం ఉదజని అణువు అయితే ఇది ఫార్మాల్డిహైడ్‍ అవుతుంది; ఈ జాతి రసాయనాల పేర్లన్నీ ఆల్ ధాతువుతో అంతం అవాలని జెనీవాలో ఒప్పందం జరిగింది; మెతనాల్, ప్రొపనాల్ మొదలయిన పేర్లు ఆలంతాలకి ఉదాహరణలు;
  • aldohexose, n. అలంతషడోజు; ఒక చివర ఆల్డిహైడు ఉన్న షడ్‍చక్కెర; ఆరు కర్బనపు అణువులు ఉన్న ఆల్డోజు అనే రసాయనం; గ్లూకోజు దీనికి ఒక ఉదాహరణ; C6H12O6;
  • ale, n. దినుసుల నుండి తయారు చేసే బీరు వంటి ఒక మద్యపానీయం;
  • alethe, n. ఎలితె పిట్ట;
  • alert, n. అప్రమత్తతతో ఉండమని చెప్పే హెచ్చరిక;
  • alfalfa, n. ఆల్ఫాల్ఫా; ఎంతో పోషక శక్తి గల చిక్కుడు జాతి మొక్క; [bot.] Medicago sativa of the Fabaceae family;
  • algae, n. pl. (ఆల్గే) నాచు; నీటి పాచి; శైవలాలు;
  • algebra, n. బీజగణితం;
    • Boolean algebra, ph. బౌల్య బీజగణితం;
  • algebraic, adj. బీజ; బీజీయ;
    • algebraic equation, ph. బీజ సమీకరణం; బీజీయ సమీకరణం;
    • algebraic expression, ph. బీజ సమాసం; బీజీయ సమాసం;
    • algebraic function, ph. బీజ ప్రమేయం; బీజీయ ప్రమేయం;
  • algebraically, adv. బీజీయంగా;
  • algorithm, n. అభియుక్తి; విధికల్పం; అల్గరిథం; గణిత సంబంధమైన సమస్యలని పరిష్కరించడానికి ఒక క్రమంలో చెయ్యవలసిన పనుల జాబితా; A detailed sequence of actions to perform to accomplish some task;
  • alias, n. మారుపేరు; మరోపేరు; ప్రతినామం; అపర నామం; నామాంతరం; ఉరఫ్;
  • alien, adj. లాతి; పరాయి; విదేశీ; పరదేశీ; అన్య;
  • alien, n. లాతివాడు; లాతీమరి; పరాయివాడు; విదేశీయుడు; పరదేశీయుడు; అన్యుడు; గ్రహాంతరవాసి;
  • alienate, v.t. అన్యాక్రాంతం చేయు; మనస్సు విరిచివేయు;
  • alienation, n. వైమనస్యత; లాతీకరణ; పరాయీకరణ; అన్యదేశీకరణ; దూరీకరణ; పరాధీనత; అన్యాక్రాంతం చెయ్యడం; పరాధీనం చెయ్యడం;
  • aliens, n. లాతులు; అన్యులు; పరాయివారు; తస్మదీయులు; విదేశీయులు; పరదేశీయులు; ఆగంతకులు;గ్రహాంతరవాసులు;
  • alight, v. i. (1) దిగు; వాలు; (2) కాలు; మండు; రగులు; (3) వెలుగు; ప్రకాశించు;
  • align, v. t. ఒక వరుసలో అమర్చు;
  • alignment, n. ఒక వరుసలో అమరిక; తిన్నగా అమరిక; సమరేఖనం;
  • aliment, n. (ఏలిమెంట్) ఆహారం;
  • alimentary, adj. పోషణకి సంబంధించిన; ఆహార సంబంధిత;
    • alimentary canal, ph. అన్నవాహిక; ఆహారనాళం; జీర్ణనాళం; నోటి నుండి గుదము వరకు ఉన్న నాళము;
  • alimony, n. మనోవృత్తి; భరణం; జీవనభృతి; విడాకులిచ్చిన భార్యకు నెలనెలా భర్త ఇచ్చే భరణం; లేదా భర్తకు భార్య ఇచ్చే భరణం; see also palimony;
  • Alioth, n. అంగీరస నక్షత్రం; సప్తర్షి మండలంలో ఉన్న ఒక నక్షత్రం; గరిటె ఆకారంలో ఉన్న ఈ మండలంలో హస్తకం చివర నుండి మూడో నక్షత్రం; ఎప్సిలాన్‍ ఉర్సే మెజోరిస్‍;
  • alive, adj. (1) సజీవ; ప్రాణంతో ఉన్న; జీవంతో ఉన్న; (2) విద్యుత్ ప్రవాహంతో ఉన్న;
  • alizarin, n. రంగుల తయారీలో వాడే ఒక రసాయనం; C14H8O4; [Arabic. al asrah = juice]; జర్మనీలో రసాయనిక రంగుల వ్యాపారం పుంజుకొనక పూర్వం ఎర్రగోరింట, నీలి మొదలైన మొక్కల నుండి ఈ రకం రంగులు చేసేవారు;
    • alizarin plant, ph. ఎర్రగోరింట మొక్క;
  • alkali, n. క్షారం; కారం; చౌడు; (ant.) acid;
    • alkali cell, ph. క్షార ఘటం;
    • alkali earth metal, ph. క్షార మృత్తిక లోహం;
  • alkaline, adj. క్షార; చౌటి; (ant.) acidic;
    • alkaline earth, ph. క్షారమృత్తికం;
    • alkaline earth metal, ph. క్షారమృత్తిక లోహం;
    • alkaline soils, ph. చౌటి నేలలు; చౌడు భూములు; క్షారవతులు;
  • alkalinity, n. క్షారత; (ant.) acidity;
  • alkaloid, n. క్షారార్థం; (ety.) క్షారం వంటి పదార్థం; కాఫీలో ఉండే కెఫీన్‍, పుగాకులో ఉండే నికొటీన్‍, నల్లమందులో ఉండే మోర్ఫీన్‍ వగైరాలన్నీ ఉదాహరణలు;
  • all, adj. సర్వ; అఖిల; యావత్; సమస్త; నానా; అస్తమానూ;
    • all Andhra, ph. యావదాంధ్ర; అఖిలాంధ్ర;
    • all hands meeting, ph. సర్వజనీన సమావేశం; సర్వసభ్య సమావేశం; అఖిల జన సమావేశం;
    • all in all, ph. మొత్తం మీద;
    • all India, ph. యావద్భారత; అఖిల భారత;
    • all-knowing, ph. సర్వజ్ఞ;
    • all morning, ph. పొద్దస్తమానూ;
    • all party conference, ph. సర్వపక్ష సమావేశం;
    • all-pervading, ph. అపరిమితం;
    • all round, ph. సర్వతోముఖ; పరిపూర్ణ;
  • all, pron. అందరూ; అంతా; అన్నీ; యావత్తూ; సమస్తం;
    • all of us, ph. (1) అందరం; మనమంతా; (2) మేమంతా:
    • one and all, ph. ఆబాలగోపాలం;
    • compared to all, ph. అందరికన్నా;
  • all right, adj., adv. బాగానే ఉంది;

Usage Note: all right and alright

  • ---All right is the usual way to say it: all right, let us go. Alright is considered less formal.
  • allegation, n. అభియోగం; ఆరోపణ; నేరారోపణ; నిందారోపణ;
    • false allegation, ph. అభిశాపం;
  • allege, v. t. అభియోగించు; ఆరోపించు;
  • alleged, n. అభియోక్త; అభియోగి; అభియుక్తుడు;
  • allegiance, n. విశ్వాసపాత్రత; ప్రభుభక్తి; రాజభక్తి; ఒక ప్రభుత్వం ఎడల కాని, వ్యక్తి ఎడల కాని నమ్మక ద్రోహం తలపెట్టకుండా ప్రవర్తించడం;
  • allegory, n. (1) అర్థవాదం; అలిగొరి; ఒక ముఖ్యమైన విశేషాన్ని గాని, పారమార్థిక సత్యాన్ని గాని, నీతిని గాని తెలియజేయడానికి ఉపయోగించే సాహిత్య ప్రక్రియ. ఒక భావాన్ని పాత్రగా మార్చడం అలిగరి. ‘సమయం, సందర్భం కాకుండా ఇదేమిటి’ అనిపించే విధంగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించడం, కురుక్షేత్ర సంగ్రామం మధ్య శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతో పదేశం చేయడం ఇందుకు ఉదాహరణలు; కృష్ణమిశ్రుడనే సంస్కృత నాటకకర్త (11 - 12 శతాబ్దాలు) వివిధ మనోభావాలను పాత్రలుగా మార్చి ‘ప్రబోధ చంద్రోదయం’ అనే నాటకం రాసాడు. భావాల్ని పాత్రలుగా మార్చడం సాహిత్య శిల్పరీత్యా తక్కువస్థాయి శిల్పం. అందుకని అలిగరి అంటే రసజ్ఞుల దృష్టిలో తక్కువ అభిప్రాయమే ఉంటూంది; (2) ధ్వన్యర్థం; రూపకం; రూపకాలంకారం; చెప్పదలుచుకున్న విషయానికి బదులు మరొక విషయాన్ని చెప్పి అర్థం ఆరోపించడం; పంచతంత్ర హితోపదేశాలలో మనుష్యులకి బదులు జంతుజాలం చేత కథ నడిపించడం దీనికి ఒక ఉదాహరణ; అర్థము అంటే వస్తువు, ప్రయోజనం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రయోజనంతో కూడిన ప్రక్రియ ఇది;
  • allele, n. జంటలో ఒకటి; తల్లిదండ్రుల నుండి సంక్రమించే వారసవాహికలలో జంటలుగా కనిపించే జన్యువులలో ఒకటి;
  • allergen, n. ఎలర్జీని కలుగజేసే ప్రతిజని;
  • allergy, n. ఎలర్జీ; వ్యక్తి వైకల్యము; వ్యక్తిగత అసహనం; పడని వస్తువులు తిన్నప్పుడు కాని, రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు కాని, శరీరం తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో మితిమీరి స్పందించటం;
  • alleviation, n. ఉపశమనం; ఉప శాంతి; ప్రశమనం; తీవ్రత తగ్గించడం;
  • alley, n. (1) సందు; గొంది; సన్నటి దారి; ఇరుకైన వీధి; (2) గంత; ఇంటి పక్కగా పెరట్లోకి వెళ్ళే దారి;
  • alley cat, n. గంత పిల్లి; ఊర పిల్లి; యజమాని లేకుండా ఊరు మీద పడి తిరిగే పిల్లి;
  • alliance, n. సమాశ్రయం; స్నేహసంబంధం;
  • allied, adj. మిత్ర; స్నేహసంబంధం గల; సమాశ్రయ;
  • allies, n. pl. మిత్రులు; మిత్రమండలి;
  • alligator, n. జలకంటకం; క్రకచాభం; తిమి; మొసలి జాతి జంతువు; [Sp. el legarto = lizard]; (rel.) crocodile;
  • alliteration, n. వృత్యనుప్రాస; ఛేకానుప్రాస; యమకం; ఆద్యక్షర సామ్యం; అనుప్రాస;
  • allium, n. ఉల్లి జాతి దుంప;
  • allocation, n. (1) వాటాలు వేయడం; కేటాయింపు చేయడం; పంపకం; విభాగ పంపిణీ; సంవిభాజనం; ఆరక్షణం;(2) వాటా; కేటాయింపు;
  • allomorphs, n. pl. సార్థకాలు; సపదాంశాలు; వర్ణాకారప్రభేదాలు; శపథాంశాలు; ఒకే అర్థం కల మాటలు;
  • allopathy, n. ఇంగ్లీషు వైద్య పద్ధతి; రోగి ప్రదర్శించే లక్షణములకు వ్యతిరేకమైన లక్షణములని ప్రేరేపించే మందులని వాడే వైద్య పధ్ధతి; హోమియోపతీ పద్ధతి దీనికి వ్యతిరేకం;
  • allophone, n. [ling.] సవర్ణం; ధ్వనిప్రభేదం; ఒక "ఫోనీమ్‍"ని ఉచ్చరించడానికి చేసే శబ్దసముదాయం;
    • allophonic distribution, ph. సవర్ణాల వితరణ;
  • allot, v. t. వాటాలువేయు; వంతులు వేయు; పొందింపజేయు;
  • allotrope, n. [chem.] రూపాంతరం;
  • allotropism, n. రూపాంతరత్వం;
  • allotropy, n. రూపాంతరత; భిన్నరూపత; see also polymorphism = బహురూపత;

Usage Note: allotropy, polymorphism

  • ---The existence of a substance in more than one crystalline form is polymorphism. Under different conditions of temperature and pressure, a substance can form more than one type of crystal. e.g.: Mercuric iodide (HgI) forms two types of crystals. Allotropy is the existence of an element in more than one physical form e.g: Coal, lamp black, coke, Diamond, graphite.
  • allow, v. t. ఒప్పుకొను; అనుమతించు; సమ్మతించు;
  • allowance, n. (1) భత్యం; భృతి; బత్తెం; బత్తా; (2) జాగా; చోటు; కాపుదల;
    • daily allowance, ph. దిన భత్యం; దిన బత్తెం;
    • dearness allowance, ph. కరువు భత్యం; కరువు బత్తెం;
    • maintenance allowance, ph. మనోవర్తి; మనువర్తి; భరణం;
    • traveling allowance, ph. దారి బత్తెం; పాథేయ భత్యం; పాథేయం; సంబలం;
    • unemployment allowance, ph. నిరుద్యోగభృతి;
    • allowance for error, ph. తప్పు చేసినా నష్టం రాకుండా కాపుదల;
  • all-spice, ph. తెల్లమిరియం; (ety.) this berry of the Myrtle family gives a flavor resembling that of a mixture of many spices; [bot.] Pimenta dioica;
  • alloy, n. మిశ్రమలోహం; అకుందనం; కంచరలోహం; కంచు; ధాతుసమ్మేళనం;
  • allude, v. i. ఉల్లేఖించు; ఒక విషయాన్ని గురించి డొంకతిరుగుడుగా కాని లేదా మాటవరసకి గాని ప్రస్తావించడం;
  • alopecia, n. బట్టతల మచ్చలు;
  • aluminum, aluminium (Br.), n. అల్లూమినం;
  • allure, n. (1)ఒయ్యారం; (2) ఆకర్షణ;
  • allure, v. i. ఆకర్షించు; ఊరించు;
  • alluringly, adv. ఒయ్యారంగా; వయ్యారంగా; ఊరింపుగా;
  • allusion, n. ఉల్లేఖనం; మాట్లాడుతూన్నప్పుడు కాని రాస్తూన్నప్పుడు కాని చెప్పదలుచుకున్నదానిని పరోక్షంగా చెప్పడం;
  • alluvial, adj. ఒండు; పాటి; ఒండలి; మెరక వేయబడ్డ;
    • alluvial deposit, ph. ఒండలి నిక్షేపం;
    • alluvial soil, ph. ఒండుమట్టి; పాటిమట్టి; ఒండలినేల;
  • alluvium, n. ఒండు; ఒండుమట్టి; వండలి;
  • ally, n. మిత్రరాజ్యం; మిత్రమండలి సభ్యుడు;
  • Almagest, n. టోలమీ సా. శ. 150 ప్రాంతాలలో రచించిన ఖగోళశాస్త్ర గ్రంథం;
  • alma mater, n. విద్యామాత; విద్యని ఇచ్చిన తల్లి; తను చదివిన పాఠశాల;
  • almanac, n. కాల గణిత బోధిని; పంచాంగం; బాలశిక్షకీ, పంచాంగానికీ మధ్యేమార్గంగా ఉండే పుస్తకం;
  • Almighty, n. ఈశ్వరుడు; సర్వేశ్వరుడు; పరమేశ్వరుడు; సర్వశక్తుడు;
  • almirah, n. అలమారు; సామాను దాచుకుందికి గోడని దొలిచి అరలు అరలుగా కట్టిన కట్టడం; (rel.) bureau; cabinet; chest;
  • almond, n. సీమబాదం;
  • almost, adv. దాదాపుగా; ఇంచు మించుగా; దరిదాపుగా; సుమారుగా;
  • alms, n. బిచ్చం; మధూకరం; మాదాకబళం;
  • aloe, n. కలబంద; [bot.] Aloe vera;
    • American aloe, ph. రాకాసి మట్ట;
    • giant aloe, ph. ఏనుగు కలబంద; పెద్ద కలబంద; బ్రహ్మరాకాసి;
  • aloeswood, agarwood, n. విరిగి, అగరు; ముసాంబ్రం; సుగంధం వెదజల్లే ఒక రకం కర్ర, దాని నుండి స్రవించే జిగురు; Aquilaria Khasiana tree;
  • alone, adv. ఏకాంతంగా; ఒంటరిగా; (ety.) alone = all one; (rel.) lonely;
    • I am living alone, ph. నేను ఒంటరిగా ఉంటున్నాను;
    • are you alone?, ph. మీరు ఒంటరిగా ఉంటున్నారా?; మీరు ఒక్కరేనా?;
  • along, prep. తో; వెంట; కూడ; వెంబడి; పొడుగునా; లో;
    • along the way, ph. దారిలో, దారి పొడుగునా; దారి వెంబడి;
    • along with, ph. తో; వెంబడి; వెనకాతల;
  • aloofness, n. ముభావం;
  • aloud, adv. బిగ్గరగా; గట్టిగా; పైకి; బయటకి; లోలోపలికి కాకుండా;
  • alopecia, n. పేనుకొరుకుడు; బట్టతల; వెంట్రుకలు రాలుట వలన కలిగెడు బట్టతల;
  • Alpaca, n. కురుప గొఱ్ఱె;
  • Alpha Virgo, n. చిత్రా నక్షత్రం;
  • alphabet, n. ఓనమాలు; (ety.) ఓం నమః యొక్క రూపాంతరం; అకారాదులు; అక్షరమాల; వర్ణమాల; అక్షర సముదాయం; వర్ణసమామ్నాయం; అక్షరక్రమం;
  • alphabetic character, ph. అక్షర మూర్తి;
  • alphabetical, adj. అకారాది క్రమంగా; వర్ణమాలానుసారంగా;
    • alphabetical character, ph. అక్షర మూర్తి;
    • alphabetical order, ph. అకారాది క్రమం;
    • alphabetical set, ph. అక్షరవర్ణ సంచయం;
  • alphanumeric, adj. అక్షరాంకిక; అక్షరములు కాని, అంకెలు కాని;
    • alphanumeric character, ph. అక్షరాంకిక మూర్తి; అక్షరము కాని, అంకె కాని;
    • alphanumeric code, ph. అక్షరాంకిక సంక్షిప్తం; అక్షరాంకిక సంకేతం; కంప్యూటరు వంటి యంత్రాలలో అక్షరములని కాని, అంకెలని కాని సూచించడానికి వాడే ద్వియాంశ సంకేతం;
  • already, adv. అప్పుడే, ఒక సమయానికి ముందు;

Usage Note: all ready and already

  • ---Use "all ready" as an adjectival phrase to say that something is ready. Use "already" as an adverb to talk about something that has happened.
  • also, adv. & conj. కూడా; సైతం; సహితం;, ; ఇదికాక;
  • Altair, n. శ్రవణం నక్షత్రం; తూపురిక్క; ఆల్ఫా అకీలా, అనగా అకీలా రాసిలో ఉన్న నక్షత్రాలు అన్నిటిలోను ఎక్కువ ప్రకాశవంతమైనది;
 
250px-Aquila_constellation
  • altar, n. (ఆల్టార్) దైవపీఠం; బలిపీఠం;
  • alter, v. t. మార్చు;
  • alteration, n. మార్పు; దిద్దుబాటు;
  • altercation, n. జట్టీ; జగడం; తగువు; వాగ్యుద్ధం; పోట్లాట; గలాటా; దెబ్బలాట; కలహం; తంటా; తకరారు; కజ్జా; రగడ, ragaDa
  • alter-ego, n. (1) శీలాంతరం; వ్యక్తియొక్క మరొక ముఖం; మరొక శీలం; (2) ప్రాణమిత్రుడు; రెండవ ప్రాణం;
  • alternate, adj. (1) ఏకాంతర; ఒకటి విడచి మరొకటి; (2) పర్యాయ; ప్రత్యామ్నాయ; వికల్ప;
 
ఏకాంతర కోణాలు
    • alternate angle, ph. ఏకాంతర కోణం; రెండు సరళ రేఖలని (సమాతరంగా ఉండనక్కరలేదు) ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఆ సరళ రేఖలకి లోపల, ఆ తిర్యక్ రేఖకి ఇటూ, అటూ ఉండే కోణాలు ఏకాంతర కోణాలు; ఆ రెండు సరళ రేఖలూ సమాతరంగా ఉన్నప్పుడు, ఏకాతర కోణాలు సమంగా ఉంటాయి;
  • alternating, adj. ఏకాంతర; పర్యాయ; కల్ప;
    • alternating current, ph. ఏకాంతర ప్రవాహం; ఆవర్తిత ప్రవాహం;
  • alternative, n. ప్రత్యామ్నాయం; పక్షాంతరం; మరొక మార్గం; మరొక పద్ధతి; వైకల్పికం; విభాష: గత్యంతరం; మారుదీటు;
  • altimeter, n. ఉన్నతమాపకం; ఎత్తుని కొలిచే పరికరం;
  • altitude, n. ఉన్నతి; ఎత్తు; ఉన్నతాంశం; శిరోన్నతి; శీర్షోన్నతి;
  • although, conj. అయినప్పటికి; అయినా సరే;
  • altogether, adv. అన్నీ కలుపుకుని; మొత్తం మీద;
  • altruism, n. పరోపకార బుద్ధి; పరోపకారం;
  • alum, n. పటిక; లెంట; మడ్డి నీటిని తేర్చి, వడపోయడానికి దీనిని తరచు వాడుతూ ఉంటారు; అలూమినం, పొటాసియంల ద్విగంధకితం; KAl(SO4)2.12H2O;
    • alum cake, ph. పటిక ఫలకం;
    • alum flower, ph. పటిక పువ్వు;
    • alum stone, ph. పటిక రాయి;
  • Aluminum, aluminium (Br.), n. అలూమినం; ఒక రసాయన మూలకం; Al;
  • alumna, n. pl. పూర్వ విద్యార్థిగణం;
  • alumnus, n. s. పూర్వ విద్యార్థి;
  • alveolar, adj. (1) [ling.] దంతమూలీయ; దవుడ ఎముకకి చెందిన; (2) వాయుగోళములకు చెందిన;
    • blade alveolar, ph. తాలవ్య;
    • tip alveolar, ph. దంత్య;
    • alveolar flap, ph. [ling.] దంతమూలీయ తాడితం;
    • alveolar lateral, ph. దంతమూలీయ పార్శ్వికం;
    • alveolar ridge, ph. దంతమూలపు మిట్ట; నోటి లోపలి కప్పులో పైపంటి వరుసకి మీదగా ఉన్న గట్టి భాగం (బొమ్మలో 4 కి 5 కి మధ్య ఉన్న భాగం); ఈ మిట్ట దాటి కొంచెం వెనక్కి వెళితే అంగుడి, ఇంకా వెనక్కి వెళితే కొండనాలుక వస్తాయి;
  • alveolars, n. [ling.] దంత మూలీయాలు; నాలుక వెళ్ళి దంత మూలాలని తగలగా వచ్చే శబ్దములని సూచించే అక్షరాలు; (ఉదా.) త, ద, స;
 
ఉచ్చారణకి ఉపయోగపడే నోటి భాగాలు
  • alveolitis, n. చిగుళ్లు వాచుట;
  • alveolus, n. గాలితిత్తి; ఊపిరిబుడగ; పుపుసగోళము;
  • always, adv. ఎల్లప్పుడు; ఎల్లవేళలా; ఎప్పుడూ; అస్తమానూ; సదా; సర్వదా; నిత్యం; సతతం; కలకాలం; అజస్రము; అనవరతం;
  • A.M., n. ఉదయం; పొద్దుట; పూర్వాహ్ణము;
  • am, v. i. ఉన్నాను; అయి ఉన్నాను;
  • amalgam, n. (1) రస మిశ్రమం; రస మిశ్రమ లోహం; పాదరసంతో కూడిన లోహం; (2) నవనీతం;
  • amalgamated, adj. (1) రసపూరిత; (2) ఉమ్మడి; జంట;
  • amanuensis, n. లేకరి; లేఖకుడు; రాయసం; రాయసకాడు; ఉక్త; లేఖకుడు; నోటితో చెబితే రాసే వ్యక్తి;
  • amaranth, n. (1) [poetic license] వాడని పువ్వు; (2) తోటకూర జాతి మొక్క; సాగ్‍;
  • amass, v. t. పోగుచేయు; కూడబెట్టు; సంచయించు; సంచితం చేయు;
  • amateur, n. (1) కళావినోది; ఔత్సాహికుడు; ఆర్జనపై దృష్టి నిలపకుండా కేవలం వినోద కాలక్షేపం కొరకు ఒక ప్రవృత్తిని చేపట్టిన వ్యక్తి; (2) ప్రావీణ్యం లేని వ్యక్తి;
  • amativeness, n. శృంగారము, జననేంద్రియాలకి సంబంధించిన ప్రేమ;
  • amazement, n. నిర్విణ్ణత; దిగ్భ్రమ; దిగ్భ్రాంతి; విస్మయం;
  • ambassador, n. రాయబారి; దూత;
  • amber, n. (1) తృణమణి; తృణస్ఫటికం; కర్పూరపూస; అంబరు; సీమగుగ్గిలం; అనాది కాలంలో చెట్ల నుండి స్రవించిన రసం శిలాస్థులుగా మారగా వచ్చేదే తృణస్ఫటికం; ఇది వజ్రాల కంటె అరుదైన పదార్థం; పాలిష్ పెడితే తళతళా మెరిసిపోయే ఈ రెసిన్ ని ఆభరణాల తయారీలో వాడతారు.(2) జేగురు రంగు; తేనె రంగు వంటి రంగు;
  • ambergris, n. అంబరు; సౌగంధికం; స్పెర్మ్ వేల్ (Sperm Whale) అనబడే తిమింగలం పేగులలో తయారయ్యే ‘యాంబర్ గ్రిస్’ అనే ఈ చిక్కటి ద్రవం గట్టిపడి తునకల్లా అవుతుంది. బూడిదరంగులో ఉండే ఈ తునకలను వెచ్చచేస్తే పరిమళం ఇస్తాయి. మైనంలాగా ఉండే అంబరు తునకలు ఉష్ణప్రాంత సముద్రాల నీటిలో తేలుతూ దొరుకుతాయి. అంబరును సుగంధద్రవ్యాల పరిశ్రమలో ఉపయోగిస్తారు;
  • ambi, pref. ఉభయ; సందిగ్ధ; ద్వంద్వ; రెండూ; రెట్టింపు;
  • ambidextrous, n. సవ్యసాచి; (lit.) రెండు కుడి చేతులు కల వ్యక్తి;
  • ambience, n. పరిసరాలు; పరివ్యాప్తం; చుట్టుకొని ఉన్న ప్రాంతం; కళాత్మకంగా, ఆహ్లాదకరంగా ఉండేట్లు అమర్చిన పరిసర వాతావరణం;
  • ambient, adj. పరిసర; చుట్టుప్రక్కల; చుట్టుకొని ఉన్న; పరివ్యాప్తమైన;
  • ambiguity, n. సంధిగ్ధత; అస్పష్టత; ద్వందార్థం; సందిగ్దార్ధం; సంశయాత్మకం;
  • ambiguous, adj. సందిగ్ధమైన; అస్పష్టమైన; ద్వందమైన; సంశయాత్మకమైన;
    • ambiguous meaning, ph. సందిగ్ధార్ధం; ద్వందార్ధం;
  • ambition, n. గాఢవాంఛ; చికీర్ష; కోరిక; ఉన్నత స్థితికి ఎదగాలనే కోరిక; (rel.) జిగీష;
  • ambitious person, n. ఆశాపరుడు; ఆశాపాతకుడు; చికీర్షకుడు; జిగీషువు; ఉన్నత స్థితికి ఎదగాలనే కోరిక ఉన్న వ్యక్తి;
  • ambivalent, adj. సందిగ్ధ; ఊగిసలాడే మనస్సుతో;
  • ambulance, n. అంగనబండి; అంగనగాడీ;
  • ambush, v. i. మాటువేయు;
  • amoeba, ameba, n. ఎమీబా; ఒక రకం జీవకణం;
  • amelioration, n. ఉపశమనం; ఉపశాంతి; నిమ్మళింపు; (ant.) aggravation;
  • amen, interj. తధాస్తు; అట్లగుగాక;
  • amend, v. t. సవరించు; సరిదిద్దు;
  • amendment, n. సవరణ; దిద్దుబాటు;
  • amenity, n. వసతి; సదుపాయం; సౌకర్యం;
  • American aloe, n. రాకాసిమట్ట; సాగనారమట్ట; పెద్దకలబంద;
  • amethyst, n. నీలమణి; బచ్చలిపండు రంగులో ఉండే ఒక సైకతశిల;
  • amiability, n. సరసత; సఖ్యత; సాత్వికం; మంచితనం; కలుపుగోలుతనం;
  • amicability, n. సఖ్యత; సామరస్యం; కలుపుగోలుతనం; అన్యోన్యత;
  • amicable, adj. సఖ్య; అన్యోన్య; సామరస్య;
  • amid, prep. మధ్య; నడుమ;
  • amine, adj. [biol.] నవ; అమినవ; అభినవ; నవాసారానికి సంబంధించిన;
    • amine end, ph. నవ శీర్షం; నవామ్లాలలో ఎమీనో ఏసిడ్ వైపు కొస;
    • amine group, ph. నవాంశ; అమినవాంశ;
  • amino acid, n. నవామ్లం; అమినవామ్లం; ఎమీనో ఆమ్లం;
  • amiss, adj. తప్పు; అసందర్భం; అనుచితం;
  • amity, n. పొత్తు; పొందిక; పొందు; స్నేహం; సయోధ్య; అభిప్రాయభేదాలని పక్కకి పెట్టి మైత్రీభావం పెంచుకోవడం;
  • ammonia, n. నవజని; నవాసారం, సున్నం కలపగా వచ్చే వాయువు;
    • ammonia carbonate, ph. స్మెల్లింగు సాల్టు; వాసన ఉప్పు;
    • ammonia chloride, ph. నవాసారం;
  • amnesia, n. మతిమరుపు; గతాన్ని మరిచిపోయిన మనోస్థితి;
  • amnesty, n. మాఫ్కీనామా; సకల అపరాధ విమోచనం; క్షమార్పణ;
  • amnion, n. ఉల్భం; క్షీరదములలో గర్భస్థ శీశువు చుట్టూ ఉండే పొర;
  • amniotic fluid, n. ఉమ్మనీరు; ఉల్భజలం;
  • amniotic sac, n. మావి, ఉల్భకోశం;
  • amorous, adj.
    • amorous lewdness, ph. కామము, ఇంద్రియ సంబంధమగు ప్రేమ; lascivious;
  • amorphous, adj. నిరాకారమైన; అమూర్తమయిన; రూపరహిత;
    • amorphous carbon, ph. నిరాకార కర్బనం; రూపరహిత కర్బనం;
  • amount, n. మొత్తం, పరిమాణం;
  • ampere, n. ఆంపియరు; విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి వాడే కొలమానం;
  • amphetamines, n. పౌరుష ఉత్తేజకాలు; కృతకంగా తయారు చేయబడి ఉత్తేజం కలిగించే రసాయన పదార్థాలు;
  • amphi, pref. ఉభయ; సందిగ్ధ; ద్వంద్వ; రెండూ; రెట్టింపు;
  • amphibian, n. ఉభయచరం; ఉభయ జీవి; నేల మీద, నీటి మీద బతక గలిగే జంతువు;
    • amphibious plant, ph. ఉభయ ద్రుమం;
  • amphitheater, n. (1) చక్రీయ ప్రదర్శనశాల; గుండ్రంగా ఉండే ప్రదర్శనశాల; ప్రేక్షకులు కూర్చునే స్థలం; (2) చుట్టూ కొండలు ఉండి మధ్యలో రంగస్థలం ఆకారంలో ఉండే లోయ;
  • ample, adj. చాలినంత; విస్తారమైన;
  • amplification, n. ప్రవర్ధకం; విస్తరణ; విస్తరించి చెప్పడం; విపులీకరించడం; ఘోష;
  • amplifier, n. ప్రవర్ధకి; వర్ధకి; విస్తరి; ఘోషకి;
  • amplitude, n. వ్యాప్తి; డోలన పరిమితి; ప్రవర్ధమానం; విస్తారం; కంపన విస్తారం; ఆయామం; The maximum distance that an oscillating wave travels from a mean (average) point;
  • ampule, n. ఇంజెక్షన్ చెయ్యడానికి వాడే ద్రవ రూపంలో ఉన్న మందుని నిల్వ చేసే సీలు చెయ్యబడ్డ చిన్న గాజు గొట్టం;
  • amputation, n. అంగచ్ఛేదం; శరీరంలో ఒక భాగాన్ని కోసివేయడం;
  • amulet, n. రక్ష; తాయెత్తు; తావీజు;
  • amusement, n. తమాషా; వేడుక; వినోదం; చోద్యం; ఆట;
  • amylum, n. గంజి; పిండి పదార్థం;

Part 6: an-aq

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • anabolism, n. [chem] నిర్మాణ ప్రక్రియ; జీవధాతు నిర్మాణమునకు జరుగు రాసాయనిక పరిణామము; ఉపచయం;
  • anachronism, n. కాలవ్యతిక్రమం; ఒక కాలమందు జరిగిన సంగతిని (పొరపాటున) మరియొక కాలమునకు ఆరోపించి చెప్పుట; వృత్తాంతములను వరుసతప్పి తాఱుమాఱుగాఁజెప్పుట;
  • anaconda, n. అనకొండ; దక్షణ అమెరికాలో తారసపడే కొండ చిలువ వంటి పెద్ద పాము; ఈ రకం పాములు బలిపశువుని తమ చుట్టలలో చుట్టి ఉక్కిరిబిక్కిరి చేసి చంపి తింటాయి; see also python;
  • anaerobes, n. ఆమ్లజని లేని వాతావరణంలో బతికే సూక్ష్మ జీవులు; see also aerobes;
  • anaerobic, adj. నిర్వాత; వాయురహిత; గాలి లేని;
  • anagram, n. పొడిపేరు; పొడి అక్షరాలతో చేసిన మాట; కనిష్ఠ సామాన్య గుణిజంని కసాగు అనీ, శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అని అన్నట్లు;
  • analgesic, n. నొప్పి నివారిణి; నొప్పి మందు; నొప్పిని తగ్గించే మందు; see also anodyne;
  • analog, analogue (Br.), n. సారూప్యం; సదృశం; సాదృశ్యం; (ant.) digital;
    • analog computer, ph. సారూప్య కలనయంత్రం; సమ్మితీయ సంగణకం;
    • analog device, ph. సమ్మితీయ ఉపకరణం; సారూప్య ఉపకరణం;
    • analog modem, ph. సమ్మితీయ విపరివర్తికం; A device which converts digital signal to analog and vice-versa;
    • analog transmission, ph. సమ్మితీయ ప్రసారణం;
  • analogous, adj. సారూప్య; సాదృశ; పోలికగల;
  • analogy, n. సారూప్యం, సాదృశం; సామ్యం; పోలిక; ఉపమానం;
  • analysis, n. విశ్లేషణ; పరిశీలన; వివేచన;విభజన; విడమర్పు; వ్యవచ్ఛేదం; మీమాంస; అన్వయం;
    • analysis of a sentence, ph. వాక్య విశ్లేషణ; వాక్య వ్యవచ్ఛేదన;
  • analysts, n. pl. విశ్లేషకులు; వ్యాకర్తలు;
  • analytic, adj. విశ్లేష;
    • analytic geometry, ph. విశ్లేష రేఖాగణితం; విశ్లేష క్షేత్రగణితం;
  • analytical, adj. విశ్లేషణాత్మక; విశ్లేషక;
    • analytical chemistry, ph. విశ్లేషక రసాయనం;
  • analyze, analyse (Br.), v. t. విశ్లేషించు;
  • anaphylaxis, n. రక్షణ వికటత్వము;
  • anaptyxis, n. స్వరభక్తి; ఉచ్చారణ సౌలభ్యం కొరకు రెండు హల్లుల మధ్య ఒక అచ్చుని ఇరికించడం;
  • anarchy, n. అరాచకం; అనాయకత్వం;
  • anathema, n. (1) శాపం; బహిష్కరణ: వెలి వేయడం; (2) చెప్పరానిది; అనరానిది; వర్జ్యం;
  • anatomy, n. దేహనిర్మాణ శాస్త్రం; శరీర నిర్మాణ శాస్త్రం; Anatomy describe the nature of materials, structures, and body parts: it describe how things are;
  • ancestors, n. పూర్వులు; పూర్వీకులు; పితరులు; పూర్వజులు; కూటస్థులు; జేజలు; కవ్యాహరులు;
  • ancestral, adj. పిత్రార్జిత; పూర్వుల; పూర్వీకుల; పితరుల;
  • ancestry, n. ప్రవర; వంశపరంపర;
  • anchor, n. లంగరు;
  • anchor, v. t. లంగరు వేయు;
  • anchorage, n. లంగరు వేయు స్థలం; బందరు; రేవు;
  • ancient, adj. పురాతన; అనాది; ప్రాచీన; పాత;
  • ancillary, adj. తోడైన; సహాయపడే;
  • and, conj., ; న్నూ; వెండియు;
  • androgynous, adj. ఉభయలింగ; అర్ధనారీశ్వరాకృతిగల; పురుష, స్త్రీ లక్షణాలు రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం;
  • Androgyny, n. అర్ధనారీశ్వరుడు; A vision of Hindu god, Lord Shiva whose left half is a female;
  • androgyny, n. అర్ధనారీత్వం; అర్ధనారీశ్వర తత్వం; అర్ధనారీశ్వరత; the sate of having both male and female in one;
  • Andromeda galaxy, n. దేవయాని; దేవయానం; ఇంద్రమద; ఆకాశంలో కనిపించే ఒక క్షీరసాగరం;
  • Andromede, n. ఉత్తరాభాద్ర;
  • androphobia, n. పురుషుల యెడల అయిష్టత, భయము;
  • anecdote, n. ఉదంతం; ఆఖ్యాయిక; ఉపాఖ్యానం; ముచ్చట కథ; పొడికథ; పిట్టకథ;
  • anemia, n. (1) రక్తహీనత; రక్తలేమి; రక్తక్షీణత; వికీలాలం; విరక్తం; రక్తంలో ఎర్ర కణముల సంఖ్య తగ్గుట; (2) పాండురోగం; [Gr.] "no blood;
    • pernicious anemia, ph. ప్రమాదకరమైన రక్తలేమి; పోషకశక్తి తక్కువగా ఉండడం వల్ల వచ్చే రక్తలేమి;
  • anemic, adj. రక్తపుష్టి లేమి; పాలిపోయిన; రక్తచందురం తక్కువగా ఉన్న;
  • anemometer, n. వాతబల మాపకం; గాలి ఎంత జోరుగా వీచుతున్నదో తెలిపే సాధనం;
  • aneroid barometer, n. వాయుభార మాపకం; ఒక ప్రదేశంలోని వాతావరణంలో గాలి ఎంత బరువుందో తెలిపే సాధనం;
  • anesthesiology, n. సమ్మోహన వైద్య శాస్త్రం; స్పర్శని కానీ, స్పృహని కానీ పోగొట్టడానికి వాడే పద్ధతులని అధ్యయనం చేసే వైద్య శాస్త్రం;
  • anesthetic, anaesthetic (Br.), n. సమ్మోహని; స్పర్శభంజని; స్పర్శనాశకం; విచేష్టితం; నిస్పృశ్యం; నిస్పృహ్యకి; చేతనాహారం; స్పృహని పోగొట్టేది;
  • aneurysm, n. రోగాన్ని సూచించే విధంగా రక్తనాళపు గోడ ఉబ్బరించడం; సాధారణంగా ఈ పరిస్థితి ధమనుల గోడలలో కనబడుతుంది;
  • angel, n. (ఏంజల్); దేవదూత;
  • anger, n. (ఏంగర్); కోపం; కినుక; అలక; రోషం; క్రోధం; ఆగ్రహం; ఆకరం; కాతాళం;
  • angina, n. ఊపిరి ఆడని కారణంగా వచ్చే నొప్పి; శూల;
    • angina pectoris, ph. (ఏంజైనా పెక్టొరిస్); రొమ్ముశూల; గుండె నొప్పి; గుండెలో వచ్చే ఒక రకమైన నొప్పి;
  • angioplasty, n. ధమని వ్యాకోచ చికిత్స;
  • angiosperm, n. పువ్వులు పూసే మొక్క; పూల మొక్క;
  • angle, n. (ఏంగిల్); కోణం; మూల;
    • acute angle, ph. లఘు కోణం;
    • alternate angle, ph. పర్యాయ కోణం; ఏకాంతర కోణం;
    • corresponding angle, ph. అనురూప కోణం;
    • dihedral angle, ph. ద్విపీఠ కోణం;
    • obtuse angle, ph. గురు కోణం;
    • opposite angle, ph. అభిముఖ కోణం; ప్రాభిముఖ కోణం;
    • right angle, ph. సమ కోణం; లంబ కోణం;
    • solid angle, ph. ఘన కోణం;
    • supplementary angle, ph. పూరక కోణం;
    • visual angle, ph. దృష్టి కోణం; దూరంగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు కంటి దగ్గర ఏర్పడే కోణం; మన కంటి నుండి ఒక వస్తువుని దాని వ్యాసానికి 57 రెట్ల దూరంలో పెడితే ఆ వస్తువు దృష్టి కోణం ఒక డిగ్రీ ఉంటుంది;
    • angle of incidence, ph. పతన కోణం;
    • angle of intersection, ph. పరిచ్ఛేద కోణం;
    • angle of reflection, ph. పరావర్తన కోణం; ప్రతిబింబ కోణం;
  • anion, n. ఋణాయనము; ఏనయాన్;
  • Anglicize, v. t. ఆంగ్లీకరించు;
  • Anglophilia, n. ఇంగ్లీషు అంటే అభిమానం;
  • Anglophobia, n. ఇంగ్లీషు అంటే భయం; ఆంగ్ల భాష అన్నా, ఆంగ్లేయులన్నా భయం;
  • angry, v. t. కోప్పడు; మండిపడు;
  • angst, n. భవిస్యత్తు ఏమవుతుందో అని ఆరాటం, ఆత్రుత, బెంగ;
  • anguish, n. వేదన; బాధ; క్షోభ; పరితాపం; తీవ్రమైన మానసిక బాధ;
  • angular, adj. కోణీయ;
    • angular acceleration, ph. కోణీయ త్వరణం;
    • angular momentum, ph. కోణీయ ఉద్వేగం; కోణీయ భారవేగం; కోణీయ రయజాతం; angular momentum = mvr = momentum x radius;
    • angular velocity, ph. కోణీయ వేగం; కోణీయ ధృతిగతి; కోణీయ సంవేగం;
  • anhydrous, adj. నిర్జల;
  • anicut, n. ఆనకట్ట; నదికి అడ్డుగా కట్టబడిన గోడ;
  • animal, adj. జాంతవ; పశువుల; పసరపు; జంతు సంబంధమయిన;
    • animal cage, ph. బోను
    • animal charcoal, ph. జాంతవ అంగారం; జంతువుల ఎముకలని కాల్చగా వచ్చిన బొగ్గు;
    • animal husbandry, ph. పశువుల పెంపకం; జంతుకృషి;
    • animal instinct, ph. పసరపు పోకడ; జంతు ప్రవృత్తి;
    • animal protein, ph. జాంతవ ప్రాణ్యం;
    • animal shed, ph. పశుసాల; పశువుల సాల;
  • animal, n. (1) జీవి; (2) జంతువు; పశువు; గొడ్డు; మృగం; పసరం; (3) పశుపక్ష్యాదులు;
    • antlered animal, ph. శృంగి; కొమ్ములు ఉన్న దుప్పి జాతి జంతువు;
    • oviparous animal, ph. అండాయుజం; గుడ్లని పెట్టే జంతువు;
    • viviparous animal, ph. జరాయుజం; పిల్లలి కనే జంతువు;
    • wild animal, ph. క్రూర జంతువు; వన్య మృగం; వ్యాళం;
  • Animalia, n. pl. జంతుజాలం; జంతు సామ్రాజ్యం; Animal Kingdom; one of the basic groups of living things that comprises either all the animals or all the multicellular animals;
  • animals, n. pl. పశువులు; గొడ్లు; జంతుజాలం;
    • cold-blooded animals, ph. శీతలరక్త జంతుజాలం;
    • warm-blooded animals, ph. ఉష్ణరక్త జంతుజాలం;
  • animate, adj. చిత్; చైతన్య; చేతనాత్మక;
    • animate world, ph. సచేతన ప్రపంచం; ప్రాణి ప్రపంచం;
  • animism, n. (from ‘anima’, ‘soul’ or ‘spirit’ in Latin) The belief that almost every place, every animal, every plant, and every natural phenomenon has awareness and feelings, and can communicate directly with humans;
  • animosity, n. శతృత్వం; ద్వేషం; వైరం;
  • aniseed, n. సోపు; సోంపు; వంటలలోనూ, గృహవైద్యంలోనూ ఉపయోగపడే వార్షిక మొక్క; [bot.] Pimpanella anisum;
  • aniso, pref. అసమాన; అసమ;
  • anisogamy, n. అసమ సంయోగం;
  • anisotropic, adj. దిశానుగత; కొలిచే దిశని బట్టి లక్షణాలు మారేటటువంటి;
  • ankle, n. చీలమండ; మడమకీ, కాలి పిక్కకీ మధ్యనున్న కీలు భాగం;
  • anklet, n. కడియం, పాదభూషణం;
  • annals, n. ఏటేటా చారిత్రకంగా నమోదు చేసిన కవిలె కట్ట;
  • annealing, n. మందశీతలీకరణం; వేడిచేసి నెమ్మదిగా చల్లార్చడం;
  • annex, v. t. అంకించుకొను; ఆక్రమించు; కలిపేసుకొను; చేర్చు;
  • annex, annexe (Br.) n. సౌధవాలం; ఒక భవనానికి అనుబంధంగా కట్టిన మరొక భవనం;
  • annexure, n. పరిశిష్టం; ఒక వ్యాసానికి కాని, ఉత్తరానికి కాని అనుబంధంగా తగిలించిన మరొక రాత;
  • annihilate, v. t. సర్వనాశనం చేయు; రూపుమాపు; సమూలంగా ధ్వంసం చేయు;
  • annihilation, n. లయ; లయము; వినాశం; సంహరణం; సర్వనాశనం; నిర్ధూమధామం; తుడిచిపెట్టుకొని పోవడం;
  • anniversary, n. వార్షికోత్సవం;
    • birth anniversary, ph. జయంతి; పుట్టినరోజు;
    • death anniversary, ph. వర్ధంతి; ఆబ్దికం;
    • golden anniversary, ph. సువర్ణోత్సవం; 50వ వార్షికోత్సవం;
    • silver anniversary, ph. రజతోత్సవం; 25వ వార్షికోత్సవం;
  • annotation, n. టిప్పణం; టిప్పణి; టీక; వ్యాఖ్యానం; సహటిప్పణి;
  • announce, v. t. చాటు; చాటించు; ప్రకటించు; ఉగ్గడించు;
  • announcement, n. ఉదఘోషణ; ఉద్ఘోషణ; ఉద్ఘాటన; ప్రకటన; టముకు; దండోరా; ప్రజాహిత ప్రకటన; ఈ ప్రకటనకి డబ్బు ఇవ్వక్కర లేదు; డబ్బులు పుచ్చుకొని చేసే ప్రకటనని advertisement అంటారు;
  • annoy, v. t. చికాకు పెట్టు; నస పెట్టు;
  • annoyance, n. చికాకు; నస;
  • annual, adj. వార్షిక; సాలుసరి; సన్వారీ;
  • annually, adv. ఏటేటా, ఏటా; సాలీనా;
  • annuals, n. ఏయేటి కాయేడు నాట వలసిన మొక్కలు; వరి మొదలయిన ధాన్యాలు; బంతి మొదలయిన పూల మొక్కలు ఈ జాతికి చెందుతాయి;
  • annuity, n. సొవాసొమ్ము; వర్షాశనం; ఏటేటా వచ్చే సొమ్ము;
  • annul, v. t. రద్దుచేయు; కొట్టివేయు;
  • annular, adj. వలయాకారపు; కడియాకారపు; కంకణాకార; అంగుళ్యాకార;
    • annular eclipse, ph. కంకణాకార గ్రహణం; ఈ రకం గ్రహణం ఒక్క సూర్య గ్రహణానికే సాధ్యం;
  • anode, n. [electronics], ధనధ్రువం; ధనాగ్రం; ధనోడు; (శూన్య నాళికలోకాని, విద్యుత్ ఘటములో కాని) ఎలక్ట్రానులని ఆకర్షించే ఒక పలక వంటి ఉపకరణం;
  • anodyne, n. నొప్పిని తగ్గించే సాధనం; ఇది మందు అయినా కావచ్చు, మరే ప్రక్రియ అయినా కావచ్చు; see also analgesic;
  • anoint, v. t. అభ్యంగనం చేయు; అవలిప్తం చేయు;
  • anomalous, adj. అసంగతమయిన; క్రమరహిత; విపరీతమయిన; అసాధారణ; ఒక పద్ధతికి విరుద్ధమైన;
  • anomaly, n. వైపరీత్యం; క్రమరహితం; అసంగతం;
  • anonymous, adj. అనామయ; అనామక; అనామధేయ; అజ్ఞాత; ఊరు పేరు లేని;
    • anonymous letter, ph. అనామయ లేఖ; ఆకాశరామన్న ఉత్తరం;
    • anonymous person, ph. అనామయుడు; ఆకాశరామన్న;
  • anorexia, n. అగ్నిమాంద్యం; ఆకలి లేకుండుట; అరుచి;
  • another, adj. మరొక; వేరొక; ఇంకొక;
    • another meaning, ph. అర్ధాంతరం; వేరొక అర్థం;
    • another person, f. ph. మరొకామె; మరొకతె; వేరొకామె; వేరొకతె; ఇంకొకతె;
    • another person, m. ph. మరొకడు; వేరొకడు; ఇంకొకడు; లాతివాడు; పెరవాడు;
  • answer, n. జవాబు; సమాధానం; ప్రత్యుత్తరం; బదులు; చెప్పుకోలు;

Usage Note: answer, reply, respond

  • ---When you are asked a question, you can answer or reply. The word respond is more formal.
  • ant, n. చీమ; పిపీలిక; హీరా;
    • black ant, ph. చలి చీమ; చల్లని చీమ; ఇది కరవదు;
    • fire ant, ph. కొఱివి చీమ;
    • red ant, ph. ఎర్ర చీమ; రక్త పిపీలిక; తైల పిపీలిక;
    • white ant, ph. తెల్ల చీమ; చెదపురుగు;
    • winged white ant, ph. ఉసిడి; ఉసుళ్లు;
    • ant colony, ph. చీమల పుట్ట; పిపీలిక సహనివేశం;
  • ant-hill, n. చీమల పుట్ట; చెదలపుట్ట; పాము పుట్ట; చిలువ టెంకి; నాకువు; వల్మీకం;
  • antagonism, n. విరోధం; వైరం; శత్రుత్వం; వైషమ్యం;
  • antagonist, n. పరిపంథి; శత్రువు; వైరి; ఎదిరి;
  • antagonistic, adj. విరుద్ధమైన; ఎదురైన;
  • antagonize, v. t. శత్రుత్వం తెచ్చు కొను; వైరము తెచ్చుకొను; ఎదిరించు;
  • Antares, n. జ్యేష్ఠ నక్షత్రం; వృశ్చిక రాసి లోని అరుణ మహాతార; ఆల్ఫా స్కోర్పీ; ఇది భూమికి సుమారు 604 జ్యోతిర్వర్షాల దూరంలో ఉంది;
  • ante, n. పూర్వపణం; అగావు; ఆట మొదలు పెట్టడానికి ముందు ఒడ్డే పణం;
  • ante, pref. పూర్వ; ముందుగా;
    • ante meridian, ph. పూర్వాహ్నం; మధ్యాహ్నానికి ముందుగా;
    • ante natal, ph. గర్భధారణ మొదలు ప్రసవం వరకు గల 40 వారముల వ్యవధి;
    • ante partum, ph. ప్రసవానికి ముందు;
  • antecedent, n. పూర్వగామి; పూర్వాంశం; ముందు వచ్చేది;
  • antechamber, n. ఎడసాల; ముందు వచ్చే చిన్న గది; విడిగా ఉన్న గది;
  • antelope, n. (1) కృష్ణమృగం; లేడి; జింక; ఏణ; (2) కొండ మేఁక;
  • antenna, n. పసికమ్మి; [biol.] స్పర్శశృంగం;
  • anterior, adj. మొదలు; మొదటి; పూర్వాంత; పూర్వ; పురో; అగ్ర; ముందు; ముందరి; ముందు వేళ; ముందు భాగం; (ant.) posterior;
    • anterior cerebral artery, ph. పురో మస్తిష్క ధమని;
    • anterior chamber, ph. కంటిలో ముందున్న గది; కంటిలో కార్నియా కి ఐరిస్ కి మధ్య ఉన్న భాగం;
    • anterior nares, ph. పూర్వ నాసికా రంధ్రములు;
    • anterior tibial artery, ph. పూర్వ జాంఘిక ధమని;
    • anterior tibial vein, ph. పూర్వ జాంఘిక సిర;
  • anthem, n. జాతీయ గీతం, కీర్తన; గొప్పని పొగుడుతూ పాడే పాట;
  • anther, n. పుప్పొడితిత్తి; పరాగ కోశం;
  • antheridium, n. పురుష బీజాశయం;
  • ant-hill, n. చీమల పుట్ట; వల్మీకం;
  • anthocyanin, n. పుష్పనీలం;
  • anthology, n. (1) పూలమాల; ఏర్చికూర్చిన పూలు; (2) సంహితం; సంకలనం; సంపుటం; ఏర్చికూర్చిన కథల సంపుటి; సంకలన గ్రంథం;
  • anthrax, n. దొమ్మతెగులు; గిల్టీతెగులు; గత్తి; సూక్ష్మజీవుల వల్ల కలిగే ఒక జబ్బు;
  • anthropo, pref. [Gr.] మానవ; మను; నర;
  • anthropology, n. మానవశాస్త్రం; మానవ పరిణామ శాస్త్రం; నరశాస్త్రం; జాతులని, వారి సంస్కృతులని పరిశోధించే శాస్త్రం;
  • anthropometry, n. మానవశాస్త్రం; మానవ శరీరమాన శాస్త్రం; మానవ జాతుల శరీర భాగాలని కొలిచి పరిశోధించే శాస్త్రం;
  • anti, pref. వామ; ప్రతి; అ; ఎదురు; నిష్; భిన్న; అపసవ్య; విరుద్ధ;
  • antibiotic, n. [med.] (ఏంటీ బయాటిక్) an organic compound that inhibits potentially damaging effects of bacteria or toxic substances;
  • antibody, n. [med.] రక్షకాంశం; రక్షకప్రాణ్యం; ప్రతికాయం; ప్రతిదేహం; ప్రతిరక్షకం; బయటనుండి దాడి చేసే రోగకారకులైన సూక్ష్మజీవులని, విషాణువులని నాశనం చేస్తూ, శరీరం లోపల పుట్టుకొచ్చే విషయాలని తటస్థీకరించే పదార్థాలు; if an antigen (such as a disease-causing agent) enters the body, the B lymphocytes respond by creating an immunoglobulin molecule (namely, the antibody) that is capable of binding with the invading antigen;
  • antichrist, n. ఏసు క్రీస్తు యొక్క ప్రతిద్వంది; ఇతనితో ఏసు క్రీస్తు చెయ్యబోయే యుద్ధం పేరే ఆర్మగెడ్డన్;
  • anticlimax, n. ఆశాభంగం; ప్రతిసారాలంకారము; విలోమ పరాకాష్ఠ;
  • anticlockwise, adj. ప్రతిఘడి; అపసవ్య; వామావర్త; అప్రదక్షిణ;
  • anticoagulant, n. ప్రతిస్కంధకం; గడ్డకట్టకుండా ఆపేది;
  • antics, n. pl. చిలిపి చేష్టలు;
  • antidote, n. విరుగుడు; విషపదార్థానికి విరుగుడు;
  • antigen, n. [med.] ప్రతిజని; రోగకారకం; రక్షకజని; ఈ "రక్షకజని"లు చొరబాటుదారుల ఆనవాళ్ళు, లేదా అభిజ్ఞానాలు అన్నమాట; వీటిని చూడగానే శరీరం స్పందించి రక్షకాంశాలని తయారు చేస్తుంది; a substance capable of eliciting an immune response when introduced into the body;
  • antigravity, adj. నిష్ గురుత్వం; విరుద్ధ గురుత్వం;
  • antimatter, n. [phy.] నిష్పదార్థం; విరుద్ధ పదార్థం; ప్రతి పదార్థం;
  • Antimony, n. [chem.] అంజనం; సౌవీరం; యామునం; ప్రత్యేకాంతం; కపోతాంజనం; నీలాంజనం; ఒక రసాయన మూలకం; [Gr.] anti + monos = not found alone;
    • Antimony sulfide, ph. సౌవీరాంజనం; సుర్మా; కాటుకరాయి; అంజన గంధకిదం;
    • Antimony vermillion, ph. అంజన సింధూరం;
  • antioxidant, n. ప్రతిభస్మీకరి; భస్మీకరణాన్ని ఆపుచేసేది; Antioxidants are substances that can prevent or slow damage to cells caused by free radicals, unstable molecules that the body produces as a reaction to environmental and other pressures;
  • antipasto, n. భోజనం ముందు తినే చల్లటి చిరు భక్ష్యాలు; (ety. Lat.) anti = before, pastos = food
  • antipathy, n. విరోధభావం;
  • antiphlogistic, n. వాపుని తగ్గించేది;
  • antipodes, n. pl. ప్రతిచరణాలు; ప్రతిచరణులు; మనం ఉండే భూభాగానికి అవతల పక్క ఉండేవారు;
  • antipyretic, n. జ్వరాన్ని తగ్గించేది; జ్వరహరి; అవదాహి; తాపాన్ని పోగొట్టేది;
  • antiquate, v. t. పూర్వపక్షం చేయు; పాతబరచు;
  • antiquated, adj. పాతబడిన; పురాతనమైన; వాడుకలో లేని;
  • antique, n. పురాతనమైన వస్తువు;
  • antiquity, n. ప్రాచీనత;
  • antiseptic, n. చీము పట్టకుండా చేసే మందు; వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవుల పెరుగుదలని ఆపుచేసేది;
  • antisocial, adj. సహవాసభంజక;
  • antispasmodic, n.. వణుకుని తగ్గించేది;
  • antithesis, n. విరుద్ధ ప్రతిపాదన; పూర్వపక్షం;
  • antitoxin, n. [med.] విషనాశకం; విషపదార్థానికి విరుగుడు;
  • antler, n. (1) శృంగం; దుప్పి జాతి జంతువుల కొమ్ము; (2) దుప్పి జాతి జంతువు; (rel.) horn; (note) a horn is made out of hair-like material and an antler is made out of skin-like material; antlers have blood vessels; antlers are deciduous;
  • antonym, n. వ్యతిరేకార్థకం; విరుద్ధార్థకం;
    • binary antonym, ph. ద్వియాంశ వ్యతిరేకార్థకం; "చావుబతుకులు" ఈ జాతికి చెందిన సమాసం; oxymoron;
  • anvil, n. (1) దిమ్మ; దాగలి; పట్టెడ; సూర్మి; (2) మధ్య చెవిలో ఉండే దాగలిని పోలిన చిన్న ఎముక;
  • anus, n. ముడ్డి; గుదం; పాయువు; అపానం; మలద్వారం; ముడ్డివైపు ఆహారనాళం యొక్క రంధ్రం;
  • anxiety, n. ఆందోళన; వేదన; ఆవేదన; ఆత్రుత; ఆరాటం; కలవరం; ఉద్వేగం; ఉద్విగ్నత; వ్యాకులత; ఆర్తి; పరివేదన; కలుచ; యాంగ్జిటీ, డిప్రెషన్ రెండూ ఒక లాంటివే. రెండు తలలున్న పాము లాగా. డిప్రెషన్ ఉన్నవాళ్లలో సుమారుగా నూటికి 60 మందికి యాంగ్జిటీ కూడా ఉంటుంది. ఇవి విడిగా ఉన్నదానికన్నా, కలసి ఉంటే మరీ కష్టం; see also "depression;"
  • anxious, adj. ఆందోళన, వేదన; ఆత్రుత; భయంతో ఎదురు చూడు; see also eager;
  • any, adj. ఎవరైనా; ఏదైనా; ఏమైనా;
  • anybody, adj. ఎవరైనా;
  • anyhow, adj. ఏమైనా; ఎలాగైనా; ఎందుకైనా;
  • anyone, adj. ఎవరైనా;

Usage Note: anyone, anybody

  • ---Use someone, no one, anywhere, somewhere and nowhere in all types of writing and speech. We often use anybody, somebody, nobody, anyplace, some-place and no place in speech, but not in formal writing.
  • anywhere, adj. ఎక్కడైనా;
  • aorta, n. [anat.] బృహద్ధమని; మహాధమని; బ్రాహ్మణాడి; గుండె నుండి శరీరం అంతటికీ రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం;
    • aortic disection, ph. బృహద్ధమని విదళనం;
    • aortic stenosis, ph. బృహద్ధమని సంకీర్ణత; బృహద్ధమని సంకోచిత; బృహద్ధమనిలో ప్రవాహ మార్గం సన్నగిల్లుట;
  • apart, adv. విడివిడిగా; ప్రత్యేకంగా; దూరంగా;
  • apartment, n. ఆవాసిక; అంకణం; లోవరి; ఓవరి; సరాతి; ఒక పెద్ద భవనంలో ఎవరికి వారు విడివిడిగా ఉండడానికి సదుపాయంగల ఇంటి భాగాలు; multi-celled living quarters; a part of a large building; flat;
    • apartment complex, ph. వాడకట్టు; భవనవాటిక; విహారం;
  • apathy, n. నిర్లిప్తత; అవలిప్తత; ఉదాసీనత; ఉపేక్ష; అభిరుచులు, ఆసక్తులు లేకపోవడం; (rel.) carelessness;
  • ape, n. ఏపు; కపి; ఏపుకోతి; మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని, ఒక జంతువు; ఏపులు నాలుగు రకాలు: చింపంజీ, గిబ్బన్, గొరిల్లా, ఒరాంగుటాన్;
  • aperture, n. రంధ్రం; బెజ్జం; సూక్ష్మరంధ్రం; కంత; ద్వారకం; తొలి; గుబ్బ తొలి;
  • apetal, adj. అదళ;
  • apex, n. మొన; శిఖరం; శిఖ; అగ్రం;
  • aphelion, n. ఉచ్ఛ; దూరబిందువు; అపహేళి; ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలో సూర్యుడికి గరిష్ఠ దూరంలో ఉన్న బిందువు; (ant.) perihelion;
  • aphorism, n. సూత్రం; సూక్తి; నీతివాక్యం; నీతివచనం; చిత్రోక్తి; సూత్రోక్తి; క్లుప్తోక్తి; నిరుక్తోక్తి;
  • aphrodisiac, n. వాజీకరం; కామోద్ధీపకం; శృంగారోద్దీపకం;
  • aphyllous, adj. అపర్ణిక; ఆకులులేని;
  • apiary, n. తేనెటీగలని పెంచే గూళ్లు, స్థలం;
  • apiarist, n. తేనెటీగలని పెంచే వ్యక్తి;
  • apiculture, n. తేనెటీగల పెంపకం; మధుమక్షికా పాలనం;
  • apodal. adj. పాదాలు లేని; పాదరహిత;
  • apogee, n. దూరబిందువు; మందోచ్ఛ; తుంగం; చంద్రుడు భూమి చుట్టూ తిరిగే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమికి (ఫోకస్ కి) బహు దూరాన వుండే బిందువు; భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఉపగ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, భూమికి) అత్యంత దూరంలో ఉన్న బిందువు; సూర్యుడి చుట్టూ తిరిగే శాల్తీల విషయంలో ఈ మాటకి బదులు ephelion అన్న మాట వాడతారు; in general, the point on the circumference of an ellipse that is farthest from the focus; (ant.) perigee;
  • apologue, n. నీతి కథ; a moral fable, especially one with animals as characters;
  • apology, n. క్షమార్పణ; మాటతో కాని, రాతతో కాని మన్నించమని అడగడం;
  • apologize, apologise (Br.) v. i. క్షమార్పణ వేడుకొను;
  • apogamy, n. [biol.] సంయోగబీజరాహిత్యం; ఫలదీకరణం లేకుండా పిండం పెరుగుదల;
  • apoplexy, n. రుద్రవాతం; అతిరక్తపాతం; మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల వచ్చే మూర్చ వంటి ఒక రకం రోగం; see also stroke;
  • apospory, n. [biol.] సిద్ధబీజరాహిత్యం;
  • aposteriori, adj. ఫలితాన్ని చూసి దాని కారణాన్ని ఊహించే తర్క సంబంధమైన; (ant.) a priori;
  • apothecary, n. అగదంకారుడు; మందులు కలిపే వ్యక్తి; కంపౌండరు;
  • apotheosis, n. (1) Perfect example; (2) దైవత్వానికి లేవనెత్తడం;
  • apparatus, n. pl. ఉపకరణాలు; సాధన సామగ్రి; పరికరాలు;
  • apparel, n. దుస్తులు; ఉడుపులు; తొడుక్కోడానికి తయారుగా ఉన్న బట్ట;
  • apparent, adj. దృశ్య; దృశ్యమాన; దృష్ట; కంటికి కనిపించే; స్ఫుట;
    • apparent depth, ph. కనిపించే లోతు; దృశ్య దఘ్నం; దృశ్యమాన దఘ్నం; దఘ్నకం;
    • apparent magnitude, ph. బృహత్కం; పెద్దగా కనిపించడం;
    • apparent magnitude (of stars), ph. దృశ్య ప్రకాశత్వం; కనిపించే ప్రకాశత్వం; ప్రకాశత్వకం;
    • apparent motion, ph. చంచత్కం; దృశ్య చలనం; దృశ్య కదలిక; దృశ్య గతి;
    • apparent motion of a planet, ph. దృశ్య గ్రహగతి;
    • apparent weight, ph. దృశ్య భారం; కనిపించే బరువు; భారకం;
  • apparition, n. దయ్యం; ప్రేతాత్మ; అనుకోకుండా అకస్మాత్తుగా కనిపించేది;
  • appeal, n. వినతి; విన్నపం; విజ్ఞప్తి;
  • appear, v. i. (1) అగపడు; కనపడు; అనిపించు; గోచరించు; (2) హాజరగు;
  • appease, v. t. సంతుష్టి పరచు; శాంతపరచు; శాంతింపజేయు;
  • appearance, n. (1) అగ్గపాటు; అభాసం; ప్రాదుర్భావం; (2) ఆకృతి; ఆకారం; అవతారం;
  • appendage, n. తోక;
  • appendicitis, n. క్రిమిక వాపు; క్రిమిక శోఫ;
  • appendix, n. (1) అనుబంధం; జీలు; (2) ఉపాంగం; (3) క్రిమిక; ఉండుకము;
    • vermiform appendix, ph. క్రిమిక; పురుగు రూపము గల క్రిమిక;
  • appetite, n. (1) బుభుక్ష; జఠరాగ్ని; ఆకలి; తినాలనే కోరిక; (rel.) hunger; (2) కోరిక;
  • appetizer, n. అభిరుచ్యం, బుభక్ష్యం; అపదంశము; క్షుద్వర్ధకం; దీపనకారి; ఆకలిని ఉత్తేజపరచడానికి భోజనానికి ముందు తినే చిరుతిండి;
  • appetizing, adj. రుచికరమయిన, కమ్మనయిన;
  • applause, n. కరతాళధ్వని; హర్షధ్వని; హర్షధ్వానం; కేకిసలు; మెచ్చుకోలు; శ్లాఘన;
  • apple, n. ఏపిల్; సీమరేగు;
    • bitter apple, ph. చేదుపుచ్చ; కారుపుచ్చ;
    • custard apple, ph. సీతాఫలము;
    • elephant apple, ph. వెలగ; కపిత్థము;
    • ice apple, ph. తాటిముంజె;
    • red custard apple, ph. రామాఫలము;
    • rose apple, ph. జంబూ నేరేడు;
    • thorn apple, ph. నల్ల ఉమ్మెత్త కాయ;
    • wood apple, ph. వెలగ; కపిత్థము;
  • appliance, n. పరికరం; ఉపకరణం; సాధనం; గృహోపకరణం;
  • applicability, n. ఉపయుక్తత; యోగ్యత; వర్తనీయత;
  • applicable, adv. వర్తించే; ఉపయోగ పడే; సంబంధముగల; చెందెడు;
  • applicant, n. దరఖాస్తుదారు; అర్జీదారు; అభ్యర్థి;
  • application, n. (1) దరఖాస్తు; అర్జీ; మనవి; (2) పూత; పట్టు; లేపనం; అపలేపనం; (3) అన్వయం; యోజితం; (4) [comp.] వర్తనం; వర్తం; అనువర్తనం; అనుప్రయోగం; కంప్యూటరు రంగంలో ఒక నిర్దిష్టమైన పనిని చెయ్యడానికి రాసే క్రమణిక; అనువర్తనాలు (applications) నిరవాకి (operating system) అజమాయిషీలో పనిచేస్తూ ఉంటాయి;
  • application, adj. అనువర్తిత; అనుప్రయోగ;
    • application development system, ph. [comp.] అనుప్రయోగ నిర్మాణ సంవిద్య; A coordinated set of program development tools, typically including an editor, a programming language with a compiler, linker, debugger and an extensive library of ready-to-use program modules;
    • application form, ph. ధరఖాస్తు; అభ్యర్థన పత్రం;
    • application layer, ph. [comp.] అనుప్రయోగ స్తరం; The top layer of the OSI seven-layer model. This layer handles issues like network transparency, resource allocation and problem partitioning. The application layer is concerned with the user's view of the network (e.g. formatting electronic mail messages).
    • application software, ph. అనువర్తిత తంత్రాంశం; అనుప్రయోగ తంత్రాంశ;
  • applied, adj. అనువర్తిత; యోజిత;
    • applied mathematics, ph. అనువర్తిత గణితం;
    • applied physics, ph. అనువర్తిత భౌతిక శాస్త్రం;
  • apply, v. i. వర్తించు; అనువర్తించు;
  • apply, v. t. (1) అన్వయించు; యోజించు; ప్రయోగించు; ఉపయోగించు; వర్తింపజేయు; వర్తించు; (2) దరఖాస్తు పెట్టు; (3) పూయు; పూత పూయు; రాయు; (4) మనస్సుని పెట్టు;
  • appoint, v. t. నియమించు; ఏర్పరచు;
  • appointment, n. (1) అభిసారం; (2) పని; ఉద్యోగం; నియామకం; నిర్ణీతం;
  • apportion, v. t. పంచు, విభజించు;
  • apportionment, n. పంపకం; విభజన; వాటా వెయ్యడం;
  • appraisal, n. (1) అంచనా; మదింపు; మూల్య నిర్ధారణ; వెలని నిశ్చయించడం; (2) విషయ వివరణ;
  • appraise, v. t. అంచనా కట్టు; మదింపు వేయు; see also, apprise
  • appraiser, n. (1) అంచనాదారుడు; విలువని అంచనా వేసే వ్యక్తి; (2) విషయవివరణ కర్త;
  • appreciable, adj. హర్షనీయ; తగినంత; మెచ్చుకోతగ్గ;
  • appreciate, v. t. హర్షించు; మెచ్చుకొను;
  • appreciation, n. హర్షణ; మెచ్చుకోలు; ప్రశంస;
  • apprehend, v. t. పట్టుకొను;
  • apprehension, n. (1) కీడుని శంకించడం; ఆందోళన; భయం; (2) పట్టుకొనడం; నిర్బంధించడం; అరెస్టు చెయ్యడం;
  • apprehensive, adj. కీడుని శంకించు; జరుగబోయేది ఏమవుతుందో అనే ఆందోళనతో కూడిన;
    • I am apprehensive about the outcome, నా మనస్సు కీడుని శంకిస్తున్నది;
  • apprentice, n. శిష్యవర్తి; శిక్షణా భ్యాసి; అంతేవాసి; పని నేర్చుకునే వ్యక్తి; (lit.) one who is near;
  • apprenticeship, n. అంతేవాసిత్వం; శిష్యత్వం; శిష్యరికం; ఉమ్మేజువారీ;
  • apprise, v. t. చెప్పు; పరిస్థితి చెప్పు; see also appraise;
  • approach, v. t. సమీపించు; చేరువగు; డాయు; తారసిల్లు; అభిగమించు; దగ్గరగా జరుగు; కవియు; ఆసన్నమగు; సన్నిహితమగు; దరిజేరు;
  • appropriate, adj. యధోచిత; ఉచిత; సముచిత; సందర్భోచిత; సమంజస; సరియైన; యుక్త; ఇతోధిక; తగు; తగిన; అనువు; సబబు; న్యాయ;
    • appropriate action, ph. తగు చర్య;
    • appropriate meaning, ph. భావయుక్తం;
    • appropriate tune, ph. రాగయుక్తం;
  • appropriate, v. t. అంకించుకొను; స్వంతం చేసుకొను; స్వాయత్తం చేసుకొను; స్వాయత్తీకరించుకొను;
  • appropriate, n. యధోచితం; ఉచితం; సముచితం; సందర్భోచితం; సమంజసం; విహితం; యుక్తం; ఇతోధికం; తగినది; అనువైనది; సబబు; న్యాయం;
  • appropriately, adv. ఉచిత రీతిని;
  • appropriateness, n. సామంజస్యం;

Usage Note: appropriate, suitable, suited

  • ---Use appropriate to talk about a person's clothes or behavior. Use suitable to say that something has the right qualities. Use suited to say that a person has the right qualities to do something.
  • approval, n. అనుమతి; సమ్మతి; ఆమోదం; సామరస్యం;
    • seal of approval, ph. ఆమోద ముద్ర;
  • approve, v. t. అనుమతించు; ఆమోదించు;
  • approximate, adj. ఇంచుమించు; ఉరమర; సుమారు; రమారమి; దాదాపు; అందాజ; ఆసన్న;
    • approximate value, ph. ఉరమర విలువ; అందాజ విలువ;
  • approximately, adv. ఇంచు మించుగా; ఉరమరగా; రమారమిగా; సుమారుగా; చూచాయగా; దరిదాపుగా; దాదాపుగా; ఉజ్జాయింపుగా; కనాకత్తుగా; అందాజుగా;
  • approximation, n. ఉరమరిక; ఉజ్జ; ఉజ్జాయింపు; స్థూలఫలం; స్థూలమానం; మదింపు లెక్క;
  • apricot, n. జల్ధారు పండు; ప్రీతి పండు; కుబానీ పండు; ఈ పండ్లు శీతల దేశాలలో దొరుకుతాయి;
  • a priori, adj. పూర్వనిర్ధారిత;
    • a priori knowledge, ph. పూర్వనిర్ధారిత జ్ఞానం;
  • aptitude, n. అభిరుచి, సహజ సామర్థ్యం;
  • aqua, pref. జల; నీటికి సంబంధించిన;
  • aquamarine, n. పచ్చ; పచ్చరాయి; నీలిపచ్చ; జలనీలం;
  • Aquarii, n. శతభిషం; లాంబ్డా అక్వేరియస్; అనగా అక్వేరియస్ అనే గుంపులోని (కుంభరాశి లోని) నక్షత్రాలలో అక్వేరీ అనేది పదకొండవ స్థాయి నక్షత్రం, గ్రీకు భాషలో లాంబ్డా పదకొండవ అక్షరం కనుక;
  • aqua regia, n. ద్రావకరాజం; HNO3 + H2SO4 కలసిన మిశ్రమం;
  • Aquarius, n. కుంభం; కుంభరాశి;
  • Aquarius Lambda, n. శతభిషం నక్షత్రం; కుంభ రాశిలో ప్రకాశించే వాటిలో ఇది పదకొండోది; దీనినే లాంబ్డా అక్వేరియస్ అని కూడా అంటారు;
  • aquatic, adj. జల; జలసంబంధమైన; అంబు; అంభశ్చర; నీటికి సంబంధించిన; నీటిలో తిరిగే;
    • aquatic creature, ph. జలచరం; నీటిలో నివసించే జంతువు; అంభశ్చరం; అంబుచరం; యాదాంసి;
  • aqueduct, n. పొర్లుమదుం; పొర్లుడు కట్ట;
  • aqueous, adj. జల; జలాకార; నీటివంటి; నీటిని పోలిన;
    • aqueous humor, ph. జలాకార రసం; కంటిలో ఉండే ఒక రకం ద్రవం;
    • aqueous medium, ph. జల మాధ్యమం;

Part 7: ar-az

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • arable, adj. దున్నదగిన; కృషి యోగ్యమైన; సేద్య; సేద్యయోగ్య;
    • arable land, ph. సాగునేల; సేద్యపు భూమి;
  • Arabic, n. అరబ్బీ; అరబ్బీ భాష; అరేబియా దేశపు భాష;
  • arbiter, n. మధ్యవర్తి; తీర్పరి;
  • arbitrary, adj. నిర్హేతుకమైన; నిబంధనలేని; అనియత; స్వచ్ఛందమైన;
    • arbitrary constant, ph. అనియత స్థిరాంకం; నిబంధన లేని స్థిరాంకం;
  • arbitrator, n. తగవరి; మధ్యవర్తి; తీర్పరి; నిర్ణేత; పంచాయతీదారు; మాధ్యస్థుడు;
  • arbitration, n. మధ్యవర్తిత్వం; మాధ్యస్థం; పంచనామా;
  • arbor, n. పొదరిల్లు; ఆకుటిల్లు;
  • arboreal, adj. పసిరిక; తరు; చెట్ల; చెట్టువంటి; చెట్టుకి సంబంధించిన; చెట్టుమీద నివసించే; వృక్షవాసి;
    • arboreal snake, ph. పసిరిక పాము;
  • arboretum, n. ఉద్యానవనం; తోట; రకరకాల చెట్లని ప్రదర్శించే స్థలం;
  • arboriculture, n. చెట్ల పెంపకం; తరుకృషి;
  • arc, n. చాపం; ధనురాకారం; వృత్తం యొక్క పరిధిలో ఒక భాగం;
    • arc lamp, ph. చాప దీపం;
    • Great circle arc, ph. [astronomy] మహావృత్తపు చాపము;
  • arcade, n. (1) సాల; పంచపాళీ; పైన టొపారం ఉన్న సన్నటి పొడుగాటి వసారా; (2) ఇటూ అటూ దుకాణాలు ఉన్న సన్నటి అంగడి వీధి;
  • arch, adj. ముఖ్యమైన; మహా;
  • arch, n. చాపం; కామాను; వంపు; విల్లు వంటి వంపు; విల్లులా వంపు ఉన్న కట్టడం; ఆర్చి;
  • archaic, adj. వాడుకలో లేని; అమలులో లేని; పాతబడ్డ; ప్రాచీన;
  • arched, adj. విలువంపైన; ధనురాకార;
  • archegonium, n. స్త్రీ బీజాశయం;
  • archeology, archaeology (Br.) n. పురావస్తుశాస్త్రం; ప్రాచీన కాలపు శిథిలాలనీ కట్టడాలనీ అధ్యయనం చేసే శాస్త్రం;
  • archer, n. విలుకాడు; విల్తుడు; ధనుర్వేది; ధనుష్మంతుడు; ధానుష్కుడు; ధానుష్కురాలు; విలుకానిత;
  • archery, n. విలువిద్య; ధనుర్వేదం;
  • archetypal, adj. మూర్తీభవించిన; ఆదర్శవంతమైన;
  • archetype, n. ప్రాగ్రూపం; నమూనారూపం; నమూనా; మూలమూర్తి; ఆదర్శం; ఒరవడి; మచ్చు;
  • archipelago, n. (ఆర్కిపెలాగో), ద్వీపసమామ్నాయం; సహస్రద్వీపాలు; లక్షద్వీపాలు; సముద్రంలో ఎన్నో దీవుల సమూహం;
  • architect, n. స్థపతి; రూపశిల్పి; వాస్తుశిల్పి;
  • architecture, n. వాస్తుశాస్త్రం; వాస్తుశిల్పం; స్థాపత్యం; రూపశిల్పం; నిర్మాణశిల్పం; నిర్మాణశాస్త్రం;
    • building architecture, ph. గృహ నిర్మాణశిల్పం;
    • computer architecture, ph. కలనయంత్రాల నిర్మాణశిల్పం;
    • garden architecture, ph. వన నిర్మాణశిల్పం;
    • mogul architecture, ph. మొగలాయి స్థాపత్యం;
  • archive, n. దండకవిలె; సంగ్రహాలయం; లేఖాగారం; పూరావృత్తం; ప్రాచీన పత్రాలని భద్రపరచే చోటు;
  • arc second, n. (1) ఒక డిగ్రీలో 60 వ వంతు ఒక ఆర్క్ మినిట్, ఒక మినిట్ లో 60 వ వంతు ఒక ఆర్క్ సెకండ్; a sixtieth of a minute of angular distance;
  • Arcturus, n. స్వాతి; ఆల్ఫా బూటెస్; భూతేశ మండలంలో అగ్ర తార;
  • area, n. (1) స్థలం; చోటు; ప్రదేశం; ప్రాంతం (2) వైశాల్యం; విస్తీర్ణం; (3) ఆయకట్టు; (4) ఒక వ్యక్తి ప్రావీణ్యత సంపాదించిన లేక పనిచేస్తూన్న విభాగం;
    • area of irrigated land, ph. ఆయకట్టు;
  • area-wise, adv. ప్రాదేశికంగా, ప్రాంతీయంగా;
  • areca palm, n. పోక జాతి చెట్టు; (Note) Betel-nut palm, [bot.] Areca catechu, is the palm tree whose nuts are commonly used in India but there are other types of Areca Palms; For example, the Golden Cane Palm or Yellow Palm or Butterfly Palm, [bot.] Dypsis lutescens or Chrysalidocarpus lutescens, is a decorative palm that seems to have the capability to purify air polluted with harmful hydrocarbons like Xylene and Toluene;
  • areca nut, n. పోకచెక్క; వక్క; పీటీ చెక్క;
  • arena, n. క్రీడారంగం; రంగం;
  • argol, n. బంకమన్ను; clay;
  • Argon, n. ఆర్గాను; అచేతనమైన ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య, 18, సంక్షిప్త నామం, Ar); [Gr. argos = inactive];
  • Argo Navis, n. వైవశ్వత నౌక; దైవనావ; ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రమండలం పేరు;
  • arguable, n. వాదాస్పదం; వివాదాస్పదం;
  • argue, v. i. వాదించు;
  • argument, n. (1) వాదన; (2) [math.] ఒక ప్రమేయాన్ని f(x) అని రాసినప్పుడు, x ని argument అంటారు; (3) [computers] నిరూపకం; సందాయం; ఒక ప్రమేయంలో కనిపించే చలరాసులకి నిర్దిష్టమైన విలువలని ఇచ్చినప్పుడు ఆయా చలరాసులని parameters అనిన్నీ, ఆయా నిర్దిష్టమైన విలువలని arguments అనిన్నీ అంటారు; A value or reference passed to a function, procedure,subroutine, command or program, by the caller.
  • arid, adj. జలశూన్యమైన; నిర్జల; ఎండుబారిన; ఎడారి;
  • Aries, n. (1) మేషరాశి; (lit.) గొర్రెపోతు; పొట్టేలు; (note) మేషం means goat and Aries means sea goat, sometimes translated as sheep; (2) అశ్వినీ నక్షత్రం;
    • Aries, Alpha, Beta of, n. అశ్వినీ నక్షత్రం; మేషరాశిలో ఉన్న రెండు తారలని ఆశ్వని నక్షత్రం అంటారు;
    • Aries, 35 of, n. భరణి నక్షత్రం; మేషరాశిలో ఉన్న 35 వ తారని భరణి నక్షత్రం అంటారు;
  • arise, v. i. తలెత్తు; ప్రభవించు;
  • aristocracy, n. కులీనులు; ప్రభువర్గం; జమీందారీ వర్గం; కులీనవర్గం;
  • aristocratic, adj. కులీన; ప్రభువులకి సంబంధించిన; పెద్ద కుటుంబానికి చెందిన;
  • arithmetic, adj. సంకలన; అంకగణిత;
    • arithmetic growth, ph. సంకలన వృద్ధి;
    • arithmetic logic unit, ph. గణితతర్క విభాగం;
    • arithmetic operation, ph. అంకగణిత క్రియ;
    • arithmetic operator, ph. అంకగణిత కారకం; అంకగణిత కారకి;
    • arithmetic operators, ph. pl. అంకగణిత పరికర్తలు; కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు చెయ్యడానికి వాడే గుర్తులు;
    • arithmetic process, ph. అంకగణిత ప్రక్రియ;
    • arithmetic progression, ph. పరంపర;
    • arithmetic sequence, ph. అంక శ్రేఢి;
    • arithmetic series, ph. అంక శ్రేణి; పాక్షిక సంకలితం;

Usage Note: series, sequence, progression (in mathematics)

  • ---A set of numbers written in an order is called as a sequence. For example 3,7,11,15,... is a sequence. If you add all the terms of a sequence it is known as series. For example 3+7+11+15+... is a series. [In a sequence we put commas between the terms, in a series we put + between the terms]. The progression tells the nature of the sequence whether it is increasing or decreasing [progress - growth]. An arithmetic progression is a sequence of numbers such that the difference of any two successive members of the sequence is a constant. A geometric progression is sequence of numbers such that the quotient of any two successive members of the sequence is a constant. In this dictionary, the word sequence is translated as శ్రేఢి (a succession of comma-separated entities) whereas the word series is translated as శ్రేణి (indicating partial sums of the same entities).
  • arithmetic, n. అంకగణితం;
    • binary arithmetic, ph. ద్వియాంశ అంకగణితం;
    • decimal arithmetic, ph. దశాంశ అంకగణితం;
    • duodecimal arithmetic, ph. ద్వాదశాంశ అంకగణితం;
    • modular arithmetic, ph. గుళిక గణితం; ఘడీ గణితం;
    • octal arithmetic, ph. అష్టాంశ అంకగణితం;
  • arjuna, n. తెల్ల మద్ది; ఇరవై మీటర్లు పైబడి ఎదిగే చెట్టు; [bot.] Terminalia arjuna of the Combretaceae family;
  • arm, n. (1) బాహువు; భుజం; (2) శాఖ; కొమ్మ; (3) ఆయుధం;
    • upper arm, ph. జబ్బ; దండ; ప్రగండం;
  • armada, n. అర్మాదా; యుద్ధనావల సమూహం;
  • armadillo, n. కవచమృగం; కవచకేసి; నఖమృగం; అమెరికాలో బొరియ లలో నివసించే ఒక స్తన్య మృగం;
  • Armageddon, n. కల్పాంతం; ఏసు క్రీస్తుకూ ఆయన ప్రతిద్వందికీ జరగబోయే యుద్ధం పేరు; ఈ యుద్ధంలో ఏసు ప్రభువు గెలిచి వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడని క్రైస్తవుల నమ్మకం;
  • armature, n. (1) కవచం; ఆయుధం; (2) విద్యుత్తు పుట్టించడానికి ఒక క్రమ పద్ధతిలో చుట్టిన తీగల చుట్ట;
  • armed, adj. (1) చేతులుగల; (2) ఆయుధం ధరించిన; సాయుధ;
  • armed forces, ph. సాయుధ బలాలు;
  • armless, adj. (1) చేతులులేని; (2) ఆయుధం లేని; నిరాయుధ;
  • armor, n. కవచం;
  • armored, adj. సజ్జిత; సకవచ; సాయుధ;
    • armored vehicle, ph. సజ్జిత శకటం; సజ్జిత యానం; సజ్జిత రథం;
  • armory, armoury (Br.), n. తోపుఖానా; ఆయుధశాల; ఆయుధవాటిక; అస్త్రశాల; పేలుడు మందులను, ఆయుధములను భద్రపరచే భవనం;
  • armpit, n. చంక; చక్కిలి; బాహుమూలం;
  • army, n. సైన్యం; దండు; పటాలం; పతాకిని; దళం; లసికిరి; లష్కర్;
  • arnica, n. [bot.] Arnica montana;
  • aroma, n. సువాసన; సుగంధం; వంటకాల నుండి వచ్చే వాసన; To experience this, you do not have to put food in your mouth; the descriptors of aroma include flowery, nutty, smoky, herby, etc. while the taste descriptors include acidic, sweet, salty, bitter, etc.; (rel.) fragrance; flavor; taste;
  • aromatic, adj. సుగంధ, వాసనవేసే; సువాసన వేసే;
    • aromatic compounds, ph. సుగంధ యోగికాలు;
  • around, adv.చుట్టుప్రక్కల; సమీపంలో; ప్రాంతాలలో;
  • arouse, v. t. (1) లేపు; నిద్ర లేపు; (2) ప్రేరేపించు; రెచ్చగొట్టు;
  • arraignment, n. నేరారోపణ చేసి న్యాయమూర్తి ఎదట నిలబెట్టడం;
  • arrange; v. t. (1) అమర్చు; కుదుర్చు; పేర్చు; సర్దు; సవరించు; (2) ఒనగూర్చు; చేకూర్చు; అనుకూల పరచు; ఏర్పాటు చేయు;
  • arrangement, n. (1) ఏర్పాటు; సన్నాహం; పన్నుగడ; సొరిది; (2) అమరిక; విన్యాసం; కుదిరిక;
    • floral arrangement, ph. పుష్ప విన్యాసం;
  • array, n. బారు; వరుస; వ్యూహం; సరణి;
  • array, v. t.. మొహరించు;
  • arrears, n. pl. బకాయిలు; బాకీలు; పాతబాకీలు;
  • arrest, v. t. ఆపు, నిలుపు; నిలవరించు; నివారించు; అడ్డగించు; అడాయించు; పట్టుకొను; నిరోధించు; ఆటంకపరచు; అటకాయించు; మస్తరించు;
  • arrhythmia, n. గుండె క్రమము తప్పి కొట్టుకొనడం;
  • arrival, adj. వచ్చే; ఆగమన;
    • arrival time, ph. వచ్చే వేళ; వచ్చిన వేళ;
  • arrival, n. రాక; రాకడ; చేరడం; ఆగమం; ఉపాగమం; ఆయాతం;
    • arrivals and departures, ph. యాతాయాతాలు; రాకపోకలు;
  • arrive, v. i. చేరు; వచ్చి చేరు; ప్రవేశించు; ఏగుదెంచు;
  • arrogant, adj. పెడసరం; గీర; పొగరు; పోతరం;
    • arrogant person, ph. పెడసరపు వ్యక్తి; గీర గాడు; పొగరుబోతు; అహంకారి;
  • arrogance, n. పొగరు; గీర; గీర్వాణం; అతి గర్వం; మదం; పెడసరం; పోతరింపు; అహంకారం; అతిశయం; కండకావరం; ఉద్ధతి; పోకదల;
  • arrow, n. (1) బాణం; సాయకం; అమ్ము; అంప; శరం; తూపు; తూణీరం; ములికి; (2) బాణం గుర్తు;
    • as fast as an arrow, ph. శరవేగంగా;
    • base of an arrow, ph. శరమూలం;
    • tip of an arrow, ph. శరాగ్రం; అమ్ముమొన; బాణపుటలుగు;
 
arrowroot=క్షీరపిష్ఠ=పాలగరుడ
  • arrowroot, n. క్షీరపిష్ఠ; పాలగుండ వేరు; పాలగరుడ వేరు; [bot.] Curcuma angustifolia; there are several other rhizomes from which "arrowroot powder" is made; [bot.] Maranta ramosissima or [bot.] Maranta arundinacea; This looks similar to other underground tubers such as cassava, yucca or kudzu, which are oblong; a flour made from this can also be called పాలగుండ and is used in the preparation of puddings; this white, powdery starch is naturally gluten-free, grain-free, vegan and paleo-friendly;
    • arrowroot powder, ph. పాలగుండ; ఈ గుండని పాలల్లో వేసి ఉడకబెడితే పాలు గడ్డకట్టి బిళ్ళల్లా అవుతాయి;
  • arsenal, n. తోపుఖానా; ఆయుధశాల; ఆయుధవాటిక; అస్త్రశాల; పేలుడు మందులను, ఆయుధములను భద్రపరచే భవనం; see armory;
  • arsenic, n. పాషాణం; తాలం;
    • arsenical drugs, n. పాషాణ ఔషధాలు;
    • arsenic trisulfide, n. తాళకం; As2S3;
    • arsenicum album, n. తెల్ల పాషాణం; శంకు పాషాణం;
  • arson, n. దహనకాండ; ఇళ్లనీ, భవనాలనీ, నిప్పంటించిన నేరం;
  • art, n. (1) కళ; చిత్రకళ; (2) చిత్రం; (3) విద్య; నేర్పు;
  • arteriole, n. ధమనిక; చిన్న ధమని; శరీరంలో శుద్ధరక్తాన్ని మోసుకెళ్ళే చిన్న గొట్టం;
  • arteriosclerosis, n. ధమనీకాఠిన్యము; ధమనుల గోడలు గట్టిపడే వ్యాధి; ఇందువలన రక్తపు పోటు పెరిగి అనేక జబ్బులు రావచ్చు;
  • artery, n. (1) ధమని; గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే నాళం; (2) పెనుమార్గం; పెద్ద రహదారి;
    • carotid artery, ph. గళ ధమని; స్పృహ ధమని;
    • coeliac artery, ph. ఉదర ధమని; కడుపులో ధమని;
    • coronary artery, ph. కిరీట ధమని; హృదయ ధమని;
    • pulmonary artery, ph. పుపుస ధమని; శ్వాస ధమని; గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్ళే నాళం;
    • traffic artery, ph. పెనుదారి; ఎక్కువ వాహనాలని భరించే పెద్ద రహదారి;
  • artesian, adj. పంపు సహాయం లేకుండా నీరు తనంత తానుగా బయటకి తన్నుకు వచ్చే సందర్భం;
    • artesian spring, ph. బుగ్గ; నీటి బుగ్గ; పాతాళ గంగ;
    • artesian well, ph. బుగ్గ బావి; నీటి బుగ్గ;
  • arthritis, n. కీళ్లవాపు; సంధిశోఫ;
  • article, n. (1) వస్తువు; (2) వ్యాసం; పరిశోధనా పత్రం; (3) ఇంగ్లీషు భాష లోని A, An, The; This; That; These; Those; (4) అధికరణం; రాజ్యాంగంలో ఒక భాగం;
  • articulate, v. t. ఉచ్చరించు; పలుకు; మాటలతో చెప్పు;
  • articulation, n. ఉచ్చారణ; భావప్రకటన;
    • manner of articulation, ph. ఉచ్చారణ రీతి;
    • place of articulation, ph. ఉచ్చారణ స్థానం;
  • articulators, n. ఉచ్చారణాంగాలు; మాటని ఉచ్చరించడానికి వాడే అవయవాలు; ఉదా. పెదిమలు; నాలుక; పళ్ళు, మొ.;
  • artifact, artefact (Br.), n. తయారు చేయబడ్డ వస్తువు; సహజ సిద్ధము కానిది; మిధ్యానిర్మాణం;
  • artificial, adj. కృత్రిమ; కల్పిత; కాల్పనిక; కృతక; కూట; పౌరుష; కుహనా; ఏలి; మర; ఉమ్మాయ; అప్రాకృతిక;
    • artificial insemination, ph. కృత్రిమ గర్భధారణ;
    • artificial intelligence, ph. కృత్రిమ మేథ; కృతక బుద్ధి; కృత్రిమ ప్రజ్ఞ; ప్రజ్ఞాకల్పన; పౌరుష ప్రజ్ఞానం; విశ్వామిత్ర విజ్ఞానం; విశ్వామిత్ర వివేకం;
    • artificial lake, ph. కృతక జలాశయం;
    • artificial leg, ph. ఏలిగాలు, మరగాలు;
    • artificial mountain, ph. కృతకాద్రి; కృతకంగా సృష్టించిన కొండ;
    • artificial pearl, ph. ఉమ్మాయ ముత్యం;
    • artificial respiration, ph. కల్పిత శ్వాస; కృతక శ్వాస;
  • artificial, n. కృత్రిమం; కల్పితం; కాల్పనికం; పౌరుషం; చేతాళీయం; చేతాళము;
  • artisan, n. హస్తకళాకారుడు; శిల్పి; చేతిపనితో కళను సృష్టించువాడు;
  • artist, n. m. కళాకారుడు; చిత్రకారుడు; రసజ్ఞుడు; శిల్పి; f. కళాకారిణి;
  • artiste, n. లలిత కళలు వృత్తిగా కల వ్యక్తి;
  • artistic, adj. కళాత్మకమయిన; సృజనాత్మకమయిన;
    • artistic creation, ph. సృజనం;
    • artistic creativity, ph. సృజనాత్మకం;
    • artistic sense, ph. కళా జ్ఞానం;
  • artistry, n. కళ; శిల్పం; నైపుణ్యం;
  • artless, adj. నిష్కపటమైన; సాధారణ; నిరాడంబర;
    • arts, n. కళలు;
    • arts and crafts, ph. కళలు; చేతి పనులు;
    • fine arts, ph. లలిత కళలు; చిత్రలేఖనం, శిల్పం, వగైరాలు;

a visual art considered to have been created primarily for aesthetic purposes and judged for its beauty and meaningfulness, specifically, painting, sculpture, drawing, watercolor, graphics, and architecture;

  • artwork, n. నగిషీ;
  • arugula, n. నాటుకూర;
  • as, adv. యథా; వలె; ప్రకారం; అప్పుడు; కనుక;
  • as is, ph. యథాతథంగా;
  • as prescribed, ph. యథావిధిగా;
  • as usual, ph. యథాప్రకారంగా; యథాతథంగా;

Usage Note: as, like, so

  • ---Use as and like to make comparisons. Do not say, "He is so good as a professional singer. Say, he is as good as a professional singer or he is like a professional singer.'
  • asafetida, asafoetida (Br.), n. (1) ఇంగువ; రామఠము; (2) ఇంగువ చెట్టు; తాపన తరువు; [bot.] Ferula foetida; Ferula narthex;
  • asbestos, n. రాతినార; దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు;
  • ascend, v. t. ఎక్కు; ఆరోహించు; అధిరోహించు;
  • ascendant, n. [astrology] లగ్నం; జన్మ లగ్నం;
    • ascendant at birth, జన్మ లగ్నం; (note) is the rASi at the Eastern horizon at the time of birth.
  • ascending, adj. ఆరోహణ;
    • ascending order, ph. ఆరోహణ క్రమం;
  • ascendancy, n. ప్రభ, ప్రాబల్యం;
  • ascension, n. ఆరోహణ; ఎక్కుట;
  • ascent, n. ఆరోహణ; ఎక్కుట; ఎక్కుడు,
  • ascetic, n. వైరాగి; బైరాగి; తాపసి; వీతరాగి;
  • asceticism, n. వైరాగ్యం; ప్రాపంచిక సుఖాలపై విరక్తి;
  • ascites, n. జలోదరం; గర్భ కుహరంలో నీరు చేరడం;
  • Ascorbic acid, n. విటమిన్ సి;
  • aseptic, adj. .క్రిములు లేని; క్రిమిరాహిత్యమైన;
  • asexual, adj. నిర్లింగ; అలింగ; అలైంగిక;
    • asexual reproduction, ph. అలింగ ప్రత్యుత్పత్తి;
  • ash, n. (1) బూడిద; భస్మం; బుగ్గి; నుసి; బూదె; నివురు; నీరు; క్షారం; (2) ఒక జాతి చెట్టు;
    • ash cover over burning coal, ph. నివురు; రొయ్యి;
    • Ash gourd, ph. బూడిద గుమ్మడి; [bot.] Benincasa hispida;
  • ashes, n. s. (1) బూడిద; భస్మం; బుగ్గి; (2) అస్థికలు;
  • aside, adj. జనాంతికంగా; ప్రేక్షకులని మాత్రం ఉద్దేశించి పాత్రధారి రహశ్యంగా చెప్పే సంభాషణ;
  • asinine, adj. గాడిద వలె; తెలివి తక్కువగా;
  • ask, v. t. అడుగు; కోరు; అర్థించు; విచారించు;

Usage Note: ask, inquire, demand; request

  • ---Ask is the usual verb that we use for questions. Inquire is more formal. Demand is used when you expect someone to do what you want. A request is a more formal way of asking.
  • askance, n. పెడమొహం;
  • Asoka, n. అశోక వృక్షం; [bot.] Saraca indica;
  • asp, n. కట్లపాము;
  • asparagus, n. పిల్లిపీచర; పిల్లితేగ; శతావరి;
  • aspect, n. ఆకారం; ఆకృతి; రూపం; దృష్ఠికోణం; కనబడు రీతి;
    • aspect ratio, ph. రూప నిష్పత్తి; బొమ్మ యొక్క నిడివికి, వెడల్పుకి మధ్య ఉండే నిష్పత్తి;
  • aspersion, n. దూషణ; నింద; కళంకం; బురద జల్లడం; అధివాకం; అధివచనం; పైవాకం; పక్షపాతముతో చెప్పిన మాట;
  • Aspergillus niger, n. ఎండు మిరప లోపలి భాగంలో నల్లగా ఉండే ఫంగస్. పొలంలో మిర్చి కోసి దాన్ని ఆరబెట్టడం సరిపోకపోతే ఈ ఫంగస్ పెరుగుతుంది. బస్థాలో కొన్ని ఎండు మిర్చి ఆరక పోయినా మిగతా మంచి కాయలకు కూడా సోకుతుంది. ఇలా నల్ల బడిన కాయలు తిన కూడదు. ఈ ఫంగస్ ఎఫ్లా టాక్సిన్ (Aflatoxins) అనే పదార్ధాన్ని వదులుతుంది. ఇవి హానికరం. తుడిచి, కడిగి, వేయించి గానీ ఇంకా ఏ రకంగానూ వాడకూడదు; ఎఫ్లాటాకీన్లు ఎక్కువగా Asspergilus flavus, Aspergillus parasiticus నుండి వస్తాయి. కానీ Aspergillus niger నుండి కూడా వెలువడతాయి;
  • asphyxia, n. ఉక్కిరిబిక్కిరి అవడం; ఊపిరి ఆడకపోవడం; శ్వాస నిలిచిపోవడం;
  • asphyxiate, v. t. ఉక్కిరిబిక్కిరి చేయు; ఊపిరి సలపకుండా చేయు;
  • asphyxiation, n. శ్వాసావరోధనం; ఉక్కిరిబిక్కిరి అవడం; ఊపిరి ఆడకపోవడం;
  • aspirate, n. ఒత్తక్షరం; ఒత్తు ఉన్న హల్లు;
  • aspirate, v. i. పీల్చు; ద్రవ పదార్థాలని గొట్టంతో పీల్చే పద్ధతి;
  • aspirated, adj. పీల్చబడ్డట్టి; మహాప్రాణాలయిన;
    • aspirated plosives, ph. [phonetics] మహాప్రాణాలయిన స్పర్శాలు;
  • aspirated, n. [phonetics] మహాప్రాణాలు;
  • aspiration, n. వాంఛితం; గాఢ వాంఛ;
  • aspire, v. t. ఆకాంక్షించు;
  • ass, n. గాడిద; అడవి గాడిద; ఱేవుగుఱ్ఱము, గాలిగాడు; గార్దభం; ఖరం;
  • assailant, n. పైన పడు వాడు; అవస్కంది;
  • assassin, v. t. చాటున ఉండి హత్య చేసేవాడు;
  • assassinate, v. t. పరిమార్చు; దొంగ చాటుగా చంపు; ఖూనీ చేయు; హత్య చేయు; వధించు;
  • assault, n. డమరం; దాడి చేయు; ఉద్దేశపూర్వకంగా హాని కలిగించడానికి ప్రయత్నించడం;
    • physical assault, ph. భౌతిక డమరం; ఉద్దేశపూర్వకంగా కొట్టడానికి ప్రయత్నించడం;
    • sexual assault, ph. లైంగిక డమరం; ఉద్దేశపూర్వకంగా లైంగికంగా దూషణ చేయడానికి ప్రయత్నించడం;
    • verbal assault, ph. వాచిక డమరం; తిట్టడం; బెదిరించడం;
    • assault weapon, ph. డమర ఆయుధం;
  • assault, v. t. బెదిరించు; కొడతానని బెదిరించు; కొట్టు;
    • assault and battery, ph. కొడతానని బెదిరిస్తూ మరొక వ్యక్తిని తాకడం, కొట్టడం;
  • assay, n. వన్నెని పరీక్షించు; పరీక్షించు;
  • assembly, n. సమితి; సభ; సమాఖ్య; పరిషత్తు; గుంపు; సంసత్తు; తండము; ఓలగం;
    • general assembly, ph. పేరోలగం; సార్వజనిక సభ;
    • legislative assembly, ph. శాసన సభ; విధాన సభ;
  • assent, n. సమ్మతి; అంగీకారం; ఒప్పందం;
  • assent, v. i. సమ్మతించు; ఒప్పుకొను;
  • assert, v. t. నొక్కి వక్కాణించు; ఉద్ఘాటించు; ధృవీకరించు; ధృఢపరచు;
  • assertion, n. వక్కాణింపు; స్థిరీకరణం; స్థాపన;
  • assertive, adj. నిశ్చయార్థక;
  • assess, v. t. పన్ను విధించు;
  • assessment, n. మదింపు; విలువ కట్టు;
  • assets, n. ఆస్తులు; పాస్తులు;
    • liquid assets, ph. చరాస్తులు;
    • . underlying assets, ph. మూలాధారపు ఆస్తులు;
  • assiduous, adj. శ్రద్ధగల; ఓపికగల;
  • assign, v. t. పురమాయించు; నియమించు; బెత్తాయించు; ఒప్పజెప్పు; అప్పజెప్పు;
  • assignment, n. పురమాయించిన పని; ఒప్పజెప్పిన పని; పురమాయింపు; అప్పగింత; కేటాయింపు;
  • assimilation, n. విలీనీకరణం; స్వాంగీకరణం;
  • assistance, n. సహకారం; సహాయం; చేదోడు;
  • assistant, adj. సహకార; సహాయ;
  • assistant, n. సహకారి; సహకారకుడు; సహాయకుడు; నాయిబు;

Usage Note: assistant, associate, deputy, vice, interim

  • ---Assistant is subordinate to a senior official and follows the senior's instructions. A deputy has essentially the same qualifications as a senior and can act in the absence of the senior, but the primary responsibility rests with the senior. "Vice" is used to designate a "stand-in" and can act in the name of the senior. The term "interim" is used when an appointment is made for a short term, with the intention of filling that position permanently at a future date."
  • associate, n. సహవాసి; సహచరి; సహచరుడు;
  • associated, adj. సహవాసిత; సహచరిత;
  • association, n. (1) సమాజం; సంఘం; (2) సాంగత్యం; సహవాసం; అనుషంగం;
    • free association, ph. [psych.] ముక్తానుషంగం;
  • associative, adj. సహార్ధక;
    • associative law, ph. [math.] సహార్ధక నియమం; సహార్ధక సూత్రం; ఉ. a(bc) = (ab)c; a + (b + c) = (a + b) + c
  • associative, n. సహార్ధకం;
  • assortment, n. కలగలుపు; కలగాపులగం;
  • assuage, v. t. శాంతింపజేయు; సమాధానపరచు;
  • assume, v. i. (1) ఊహించు; తలచు; అనుకొను; (2) వహించు;
  • assumption, n. ఊహనం; ఉపపాదన; ప్రతిపాదన; అనుకొనుట; అనుకోలు; వహించుట; స్వీకరణ;
  • assurance, n. భరోసా; నమ్మిక;
  • assyrian plum, n. శేలుపండు; --also refer. Lasura
  • asterisk, n. తారకం; నక్షత్రం గుర్తు;
  • asterism, n. తారావళి; తారాగణం; తారాశి; తారల గుంపు; నక్షత్ర మండలం; సప్తర్షి మండలం లాంటి నక్షత్రాల గుంపు; (note) asterism is used for a small group and constellation is used for a larger group; An asterism is a recognizable pattern of stars, while a constellation is a well-defined region in the sky. The Big Dipper is an asterism in the constellation Ursa Major. (rel.) constellation;
    • asterism at birth, ph. జన్మనక్షత్ర రాశి; జన్మనక్షత్రం;
  • astern, adv. పడవకు వెనుక తట్టున;
  • asteroid, n. క్షుద్రగ్రహం; గ్రహశకలం; తారకాభం; భూమి, అంగారక గ్రహాల కక్ష్యల మధ్య ఉండే రకరకాల కైవారాలు కల గ్రహశకలాలు;
  • asthma, n. ఉబ్బసం; శ్వాసకాశ; తమక శ్వాస;
    • bronchial asthma, ph. శ్వాసనాళములోని కండరముల ఈడ్పుచే వచ్చే ఉబ్బసం;
    • cardiac asthma, ph. గుండె జబ్బు వల్ల వచ్చే ఆయాసం;
    • catarrhal asthma, ph. జలుబుతో కూడిన ఉబ్బసం;
    • spasmodic asthma, ph. పొర్లుపొర్లుగా ఉద్ధృతమయే ఉబ్బసం;
  • astonishment, n. నివ్వెరపాటు; ఆశ్చర్యం; అబ్బురపాటు; వెరగుపాటు;
  • astound, v. t. అమితంగా ఆశ్చర్యపడు;
  • astral, adj. (1) నక్షత్రసంబంధమైన; నక్షత్ర; (2) సహజాతీతమయిన;
    • astral projection, ph. కారణ శరీర విహరణం; స్వకాయ పలాయనం; శరీరాన్ని వదలి పెట్టి ఆత్మ బయటకు సునాయాసంగా తిరుగుతూన్నట్లు అనిపించడం;
  • astringency, n. ఒగరు; కటువు;
  • astringent, n. ఒగరు; తిక్తం; కటువు;
  • astrolabe, n. ఖగోళమితి; తారేక్షణం; an instrument for measuring the positions of heavenly bodies;
  • astrologer, n. జ్యోతిష్కుడు; జోస్యుడు; కాలజ్ఞాని; దైవజ్ఞుడు;
    • astrological forecast, ph. జాతకం;
  • astrology, n. జ్యోతిషం; జ్యోతిషశాస్త్రం; మానవ జీవితంలో సంఘటనలు గ్రహ గతులు నిర్ణయిస్తాయని నమ్మే పద్ధతి;
  • astronaut, n. వ్యోమగామి; జ్యోతిర్గామి;
  • astronomy, n. ఖగోళశాస్త్రం; ఖగోళం మీద సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదుల స్థాన, గమన, ఆచ్ఛాదన, విస్ఫోటనాదులను నిర్ణయించే శాస్త్రం;
  • astrophysics, n. నక్షత్రభౌతిక శాస్త్రం; నక్షత్రాల జీవిత దశలని అధ్యయనం చేసే శాస్త్రం;
  • asylum, n. శరణాలయం; ఆశ్రయం; దిక్కు;
    • lunatic asylum, ph. పిచ్చాసుపత్రి; మానసిక వైద్యశాల;
  • asymmetric, adj. అసౌష్ఠవ; అసమసౌష్ఠవ; అసమ; విషమ;
  • asymmetry, n. అసౌష్ఠవం; అసమసౌష్ఠవం; అసమత; విషమత;
  • asynchronous, adj. అసమకాలిక; అసమకాలిత;
  • at, prep. వద్ద; దగ్గర; కడ; చొప్పున;
  • ataraxy, n. ఆరాటం లేని మనో స్థితి; A state of calmness and tranquility; Freedom from mental disturbance or anxiety;
  • atheism, n. నాస్తికత్వం; నిరీశ్వరవాదం; దేవుడు లేడనే నమ్మకం; see also agnosticism;
  • atheist, n. నాస్తికుడు; దేవుడు లేడని నమ్మే మనిషి; see also agnostic;
  • atheistic, adj. నాస్తిక; నిరీశ్వర;
  • atherosclerosis, n. ధమని లోపలి గోడల మీద కొవ్వు పదార్థాలు నిల్వ ఉండడం వల్ల ధమనులు గట్టిపడుట; గుండె జబ్బులకి ఇది ఒక కారణం;
  • athlete, n. m. ఆటగాడు; క్రీడాకారుడు; f. క్రీడాకారిణి;
  • atlas, n. (1) కంధరపూస; చూడావలయం; (2) దేశపటముల పుస్తకం;
  • atmosphere, n. వాయుమండలం; వాతావరణం; నభోవరణం; వియత్తు; వియత్వరణం; ఉప్పరం;
  • atoll, n. పగడపుదిబ్బ; గుండ్రంగా, అట్టులా ఉండే పగడపుదిబ్బ;
  • atom, n. అణువు; (rel.) molecule; తన ఏకత్వాన్ని పోగొట్టుకోకుండా అత్యంత చిన్న రేణువు ప్రమాణంలో ఉండగలిగే రసాయన మూలకం;
    • atom bomb, ph. అణుబాంబు;
  • atomic, adj. అణు; అణుత్వ; అణీయ (rel.) subatomic;
    • atomic age, ph. అణు యుగం;
    • atomic bomb, ph. అణు బాంబు;
    • atomic number, ph. అణుసంఖ్య; ఒక అణువు గర్భంలో ఉండే ప్రోటానుల సంఖ్య;
    • atomic size, ph. అణు పరిమాణం; అణుమాత్రం; అణుప్రమాణం;
    • atomic theory, ph. అణు సిద్ధాంతం;
    • atomic weapon, ph. అణ్వాయుధం;
    • atomic weight, ph. అణు భారం;
  • atomicity, n. అవిభాజ్యత; అణుప్రమాణత; అణువుని పోలి ఉండడం; అణుత్వం;
  • atonement, n. నిష్కృతి; ప్రాయశ్చిత్తం; పరిహార క్రియ; పాప పరిహారం;
  • atrocious, adj. క్రూర; ఘోర; పాశవిక; నిర్దయతో; భయంకర;
  • atrocity, n. అతి దుర్మార్గం;
  • atrophy, n. క్షీణించడం; శుష్కించడం; శరీర అవయవాలు పోషణ లేక, పరిశ్రమ లేక క్షీణించడం;
  • atria, n. pl. (1) ప్రాంగణములు; చతుశ్శాలికలు; నాలుగిళ్ల వాకళ్ళు; (2) కర్ణికలు; గుండెలో పై భాగంలో ఉండే గదులు;
    • atrial fibrillation, ph. హృదయ కర్ణికా ప్రకంపనము;
  • atrium, n. (1) ప్రాంగణం; చతుశ్శాలిక; నాలుగిళ్ల వాకిలి; (2) కర్ణిక; గుండెలో ఒక గది;
  • attach, v. t. అతుకు; తగిలించు; జతపరచు; కలుపు; కట్టు; సంధించు; ముడిపెట్టు; జోడించు;
  • attaché, n. పేటిక; కరపేటిక;
  • attached, adj. జతపరచిన; జోడించిన; (rel.) ఖచిత;
    • attached document, ph. జతపరచిన కాగితం; ఖచిత పత్రం;
  • attachment, n. (1) తగిలించినది; జతపత్రం; జత చేసిన వస్తువు; ఉత్తరానికి జత చేసిన కాగితం; అనుబంధం; సంయోజితం; సంలగ్నం; పరిశిష్ఠం; (2) మక్కువ; మమకారం; ఆపేక్ష;
    • unhealthy attached, ph. మోహం;
  • attack, n. దాడి; ముట్టడి;
  • attain, v. i. సాధించు; సంతరించుకొను; పొందు; చేరు;
  • attainable, n. సాధ్యం; సుసాధ్యం;
  • attar, n. అత్తరు; పువ్వులనుండి తీసే ఒక సుగంధ తైలం;
    • bergamot attar, ph. నారింజ తొక్కలనుండి తీసే తైలం;
    • neroli attar, ph. నారింజ పువ్వుల నుండి తీసే తైలం;
  • attempt, v. i. ప్రయత్నించు;
  • attend, v. i. (1) హాజరు అవు; (2) చూడు; కాయు; పరిచర్య చేయు;
  • attendance, n. హాజరు;
  • attendance roll, ph. హాజరీ; మస్తరు పట్టి;
  • attendant, n. m. పరిచారకుడు; ఉపచారి; ఉపచరించే వ్యక్తి; మాలి; కాసా; చాకరు; f. పరిచారిక;
  • attendees, n. pl. హాజరు అయినవారు; వచ్చినవారు; ప్రేక్షకులు; వీక్షకులు; సభాసదులు; సభికులు; సభ్యులు; సభాస్తారులు; సామాజికులు;
  • attention, n. అవధానం; సావధానం; శ్రద్ధ; ధారణ; పరామరిక; ధ్యాస;
  • attenuate, v. t. (1) నీరసపరచు; క్రమేపీ తగ్గించు; కుదించు; సంకుచించు; (2) సున్నిత పరచు; సాగదియ్యు;
  • attenuation, n. (1) క్రమక్షీణత; (2) [భౌతిక శాస్త్రంలో] వాకేతాల శక్తి క్షీణించడం; (3) [వైద్య శాస్త్రంలో] మందు యొక్క గాఢతని పలచబరచడం;
  • attentively, adv. సావధానంగా;
  • attentiveness, n. ఏకాగ్రత; శ్రద్ధ;
  • attest, v. t. (1) సాక్ష్యము చెప్పు; సాక్షి సంతకం చేయు; (2) ధ్రువీకరించు; ప్రమాణీకరించు;
    • attested copy, ph. సాక్షి సంతకం చేసిన నకలు;
  • attic, n. అటక; మిద్దె;
  • attire, n. దుస్తులు;
  • attitude, n. వైఖరి; వరస; వాటం; వాలకం; వైనం; తరహా; తీరు;
  • attorney, n. వకీలు; ముక్త్యారు; ప్లీడరు;
    • power of attorney, ph. ముక్త్యారునామా; వకాల్తా; వకాలతునామా;

Usage Note: Lawyer, Attorney, barrister, solicitor

  • ---A lawyer is a broader term for a person who has finished law school or obtained a Master of Laws degree. When lawyers want to practice law, they need to pass the bar exam, which licenses them to act as an attorney and represent clients in legal proceedings and court or provide legal counsel. Keep in mind that all attorneys are also lawyers, but not all lawyers are attorneys. A barrister defends people in Court through effective public speaking and advocacy, while a solicitor does legal work outside Court. However, there are some exceptions to this distinction. For example, more solicitors are undertaking qualifications to become a solicitor advocate.
  • attract, v. t. (1) ఆకర్షించు; (2) ఆకట్టుకొను;
  • attractive, adj. ఆకర్షణీయ; మనోహర;
  • attraction, n. ఆకర్షణ; మోజు; ఆకృష్టి; (ant.) repulsion;
    • gravitational attraction, ph. గురుత్వ ఆకర్షణ; ఆకృష్టి;
  • attribute, n. గుణం; లక్షణం; ధర్మం; ఆపాదన; ఆపాదితం;
  • attribute, v. t. ఆరోపించు; ఆపాదించు; అంటగట్టు; కారణం చెప్పు;
  • attribution, n. ఆపాదన;
  • auction, n. ఏలం; ఏలంపాట; వేలం; వేలంపాట;
  • audacious, adj. సాహసిక;
  • audacity, n. సాహసం; తెంపరితనం;
  • audible, adj. కర్ణగోచర; శ్రవణీయ; వినబడునట్టి; శ్రౌత;
    • audible sound, ph. వినిబడే శబ్దం; శ్రవణీయ శబ్దం; కర్ణగోచరం;
  • audibility, n. కర్ణగోచరత; శ్రవణీయత;
  • audience, n. (1) శ్రోతలు; వినేవారు; (2) ప్రేక్షకులు; సదస్యులు; సభకి హాజరయినవారు; (3) లాంఛన ప్రాయమయిన దర్శనం;
  • audio, adj. శ్రుత; శ్రవణ; కర్ణగోచర; శ్రవ్య; శబ్ద సంబంధమైన;
  • audio file, n. శ్రవ్య సంచిక; శ్రవణ దస్త్రం; A electronic file containing an audio recording;
  • audio-visual, adj. శ్రుతదృశ్య; దృశ్యశ్రవణ; దృశ్యశ్రవ్య; దర్శనశ్రవణ; ధ్వని-దృశ్య;
  • audio-visual apparatus, ph. దృశ్య-శ్రవ్య పరికరాలు;
  • audio-visual system, ph. దృశ్య-శ్రవ్య వ్యవస్థ;
  • audit, n. జమాబందీ, లెక్కల తనిఖీ; లెక్క విమర్శ;
  • audition, n. (1) వినడం; (2) స్వర పరీక్ష; గాత్ర పరీక్ష; (3) నటీనటుల, గాయకుల పాటవాన్ని పరీక్షించడం;
  • auditor, n. ఆయవ్యయ నిర్ణాయకుడు; మజుందారు; తనిఖీదారు;
  • auditorium, n. ప్రేక్షకాగారం; ప్రదర్శనశాల; హాలు;
  • auditory canal, n. కర్ణనాళం; చెవి కాలువ;
  • auditory nerve, n. శ్రవణ నాడి; కర్ణనాడి;
  • auger, n. బరమా; తొరపణం; కర్రలో రంధ్రము చేసే ఉపకరణం; (see also augur);
  • augmented, adj. ఆగమించిన; ఆగమ;
    • augmented reality, ph. ఆగమ వాస్తవం;
  • augur, n. శకునం యొక్క ఫలితం చెప్పే వ్యక్తి; శోది చెప్పే వ్యక్తి;
  • augury, n. శకునం; శకునశాస్త్రం;
  • aunt, n. (1) అత్త; (2) పిన్ని; (3) పెద్దమ్మ; దొడ్డమ్మ;
    • maternal aunt, ph. పిన్ని; పెద్దమ్మ; దొడ్డమ్మ; తల్లి తోబుట్టువు అయిన స్త్రీ;
    • paternal aunt, ph. అత్త; మేనత్త; తండ్రి తోబుట్టువు అయిన స్త్రీ;
  • aura, n. కిరణావళి; తేజస్సు;
  • auricle, n. (1) కర్ణిక; (2) చెవి డిప్ప;
  • Aurora Borealis, n. సుమేరు జ్యోతి; ధ్రువజ్యోతి; భూమి యొక్క ఉత్తర ధ్రువ మండలమందు అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే కాంతి;
 
aurora=ధ్రువజ్యోతి
  • auscultation, n. అంగశ్రవణం; శరీరపు లోపలి భాగములు (గుండె, పేగులు, ఊపిరితిత్తులు, వగైరా) చేసే ధ్వనులు వినుట;
  • auspices, n. ఆధ్వర్యం;
  • auspicious, n. మంగళప్రదం; శుభప్రదం; శుభసూచకం;
  • auspicious thread, ph. మంగళ సూత్రం; యజ్ఞోపవీతం;
  • auspicious time, ph. సుముహూర్తం;
  • austere, adj. కఠోర; కఠిన;
  • austerity, n. కఠోర నియమం; కఠోర దీక్ష;
  • austral, adj. దక్షిణపు; యామ్య; అదీచీ;
  • Australopithecus, n. దాక్షిణాత్య వానరం; (ety.) (Lat.) austral = southern; (Gr.) pithecus = ape;
  • authentication, n. ప్రమాణీకరణం;
  • author, n. గ్రంథకర్త; రచయిత; కృతికర్త; కూర్పరి; కారకుడు; కర్త; f. రచయిత్రి;
  • authorship, n. కర్తృత్వం; గ్రంథకర్తృత్వం;
  • authoritative, adj. (1) సాధికార; అధికారంతో; అధికారం గల; (2) ప్రామాణిక;
  • authoritatively, adv. సాధికారంగా; ప్రామాణికంగా;
  • authority, n. (1) అధికారం; పెత్తనం; దొరతనం; ప్రస్థానం; అధిష్ఠానం; (2) ఆకరం;
  • authorized, authorised (Br.) adj. అధికృత; అధికారం ఇవ్వబడ్డ; ఉత్తరువు గల;
    • authorized capital, ph. అధికృత మూలధనం;
  • auto, pref. ఆత్మ; స్వీయ; స్వయం; స్వకీయ;
  • autobiography, n. ఆత్మకథ; స్వీయచరిత్ర; స్వచరిత్ర;
  • autocracy, n. స్వేచ్ఛాధికారం;
  • autocrat, n. స్వేచ్ఛాధికారి; నిరంకుశ ప్రభువు;
  • autoeroticism, n. హస్తప్రయోగం; స్వహస్తమైధునం;
  • autogamy, n. స్వయంసంపర్కం; స్వయంసంయోగం;
  • autograph, n. హస్తాక్షరం; సంతకం;
  • autology, n. ఆత్మవిద్య;
  • automatic, adj. స్వయంచర; స్వయంచాలిత; స్వయంచాలక; స్వచాలిత; స్వయంధువన; ఆత్మచల; ఆత్మగమ; నాంతరీయక;
  • automata, n. pl. (అటొమెటా) Automata are self-operating machines designed to automatically follow predetermined sequences of operations or respond to predetermined instructions. As engineering mechanisms, they appear in everyday applications such as mechanical clocks where a hammer strikes a bell or a cuckoo appears to sing.
  • automation, n. (ఆటొమేషన్) స్వచాలినీకరణం; స్వయంచాలీకరణం; యంత్రీకరణం;
  • automaton, n. s. (అటొమెటాన్) కీలుబొమ్మ; తతాతిపం; తనంత తానుగా తిరిగే పరికరం;
  • automobile, adj. సపరాపేక్ష; పరనిరపేక్ష; కామగమన;
  • automobile, n. స్వయంజంగమం; కామగమని; కారు; సపరాపేక్షకి; పరనిరపేక్షకి;జంతువులు; మనుష్యులు లాగవలసిన అవసరం లేకుండా, తనంతగా తాను కదలగలిగేది;
  • autonomous, adj. స్వాధికార;
  • autonomy, n. స్వయంప్రతిపత్తి;
  • autopsy, n. శవపరీక్ష; శవచ్ఛేదం; స్వయంగా చూడడం; (rel.) necropsy;
  • autospore, n. స్వతస్సిద్ధబీజం;
  • autotrophic, adj. స్వయంపోషక;
  • autumn, n. శరత్ కాలం; శరదృతువు; శిశిరం; వర్షాకాలం తర్వాత వచ్చే రెండు నెలలు; ఆకురాలు కాలం;
  • autumnal equinox, n. శరత్ విషువత్తు; శరద్ విషువత్; ఉత్తరార్థ గోళంలో రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు; సెప్టెంబర్‍ 22;
  • auxiliary, adj. సహాయక; ఉప; గౌణ; అతిరిక్త;
  • auxiliary verb, ph. సహాయక క్రియ;
  • avail, v. i. వాడుకొను; ఉపయోగించు కొను; వినియోగపరచు;
  • available, n. సిద్ధం;
  • available, v. i. దొరుకు; లభించు; ఉపయోగమవు;
  • availability, n. దొరుకుబాటు; లభ్యత; లభ్యత్వం; ఉపలభ్యత్వం; సిద్ధత్వం;
  • avalanche, n. హిమనీపాతం; మంచు కొండలమీద నిల్వ అయిన పొడిమంచు వెల్లువలా ప్రవహిస్తూ కిందకి జారి పడడం;
  • avant-garde, adj. సంప్రదాయ శృంఖలాలని తెంచుకుని కొత్త పుంతలు తొక్కిన; విప్లవాత్మక సృజన; నవతరంగ;
  • avarice, n. పేరాస; దురాశ; అర్థలోభం;
  • avenue, n. విశాలమయిన వీధి; రాజమార్గం; వీధి;
  • avenge, v. t. పగతీర్చుకొను;
  • average, adj. సగటు; సరాసరి; సాధారణమయిన;
  • average, n. సగటు; సరాసరి;
    • moving average, ph. గతిమాన సగటు; గతిమాన సరాసరి;
  • aversion, n. అయిష్టత; వైమనశ్యం;
  • aviary, n. గువ్వగూడు; కపోతపాలిక; విటంకం; పక్షులనుంచే పెద్ద పంజరం లాంటి ఇల్లు;
  • aviation, n. ఉడ్డయనం; ఉడ్డీనం; ఎగిరిక;
 
అవకాడో = Persea_americana
  • avocado, n. అవకాడో; దక్షిణ అమెరికాలో విస్తారంగా పండే, ఆకుపచ్చగా ఉండే ఒక జాతి పండు; ఈ పండు మధ్య టెంక లాంటి పిక్క ఉంటుంది; ఒక అవకాడోలో 4 గ్రాముల ప్రాణ్యం, 975 మిల్లీగ్రాముల పొటాసియం (అరటి పండు కంటె రెట్టింపు), ఉంటాయి కనుక ఇది మంచి పోషక పదార్థం; [bot.] Persea americana; [ety.] comes from the Aztec word āhuacatl, which means “testicle;”
  • avocation, n. వ్యాపకం; తోచుబాటు; పని;
  • avoid, v. t. తప్పించుకొను;
  • avoidable, n. నివార్యం;
  • avuncular, adj. మేనమామని పోలిన;
  • awakened, n. ఉద్బుద్ధం; తలఁపునకు వచ్చినది; మేలుకొన్నది; వికసించినది;
  • awakening, n. జాగృతం; జాగృతి; ఉద్బుద్ధం;
  • award, n. (1) బహుమతి; బహుమానం; పురస్కారం; పురస్కృతి; అవార్డు; (2) తీర్పు;
  • award, v. t. ఇచ్చు; ఒసగు;
  • aware, adj. ఎరిగిన; తెలిసిన;
  • aware, n. చిత్; గ్రాహ్యం;
    • be aware, ph. చిత్తగించండి;
  • awareness, n. స్పృహ; స్ఫురణ; గ్రాహ్యత; తెలివిడి; పరిజ్ఞానం;
  • awe, n. (ఆ) ఆశ్చర్యంతో కూడిన భయం;
  • awkward, adj.ఎబ్బెట్టు;
  • awl, n. కంఠాణి; శూలం; a long, stout and sharp heavy-duty needle typically used to make holes through a thick pile of paper or through leather;
  • awning, n. పెణక; పంచ; ఓరపాక; పరంజా; ముంజూరు; పంచపాళీ; చందువా; చాందినీ; అస్తరణం; ఉల్లడ; చూరు ముందు భాగం; కిటికీ దగ్గర కాని ద్వారం దగ్గర కాని ఎండ పొడ, వాన జల్లు తగలకుండా ఏర్పరచే ఒక కప్పు;
  • ax, axe (Br.), n. గొడ్డలి; కుఠారం; పరశువు;
    • broad ax, ph. గండ్రగొడ్డలి;
  • axes, n. pl. (1) [ఏక్సెస్] గొడ్డళ్లు; (2) [ఏక్సీస్] అక్షములు; నిరూపకములు;
  • axial, adj. అక్షీయ;
  • axilla, n. చంక;
  • axiom, n. విస్పష్ట సత్యం; స్వీకృతం; స్వీకరించబడినది; విస్పష్టన్యాయం; సూక్తి; ఉపజ్ఞ; నిశ్చిత పరిజ్ఞానం; నృతం; నిరూపించ లేకపోయినా ప్రాధమికంగా మిగితా జ్ఞానానికి అవసరంగా స్వీకరించే నిజం; రుజువు లేకపోయినా సరే నలుగురూ నిజమేనని నమ్మేది;
  • axis, n. (1) అక్షం; అక్షరేఖ; ఇరుసు; యష్టి; నేమి; నిరూపకము; (2) [anat.] మేరుపూస;
    • polar axis, ph. ధ్రువీయ అక్షం; ధ్రువయష్టి; ఉత్తర, దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహాత్నక రేఖ;
    • primary axis, ph. ప్రాథమిక అక్షం;
    • axis of rotation, ph. భ్రమణ అక్షం; భ్రమణ నిరూపకం'
    • axis of symmetry, ph. సౌష్ఠవ అక్షం; సౌష్టవ నిరూపకం;
    • axis major, ph. దీర్ఘ అక్షం;
    • axis minor, ph. లఘు అక్షం;
  • axle, n. ఇరుసు, ఆణి; చక్రాలని కలిపి నిలిపే కడ్డీ;
  • axon, n. లాంగూలం; మెదడులో ఉండే నూరానులు అనే జీవకణాల తోక;
  • Ayurveda, n. ఆయుర్వేదం; Indian system of natural and herbal medicine;
  • azimuth, n. దిగంశం; అజిమత్; గోళీయ క్షేత్రగణితంలో క్షితిజచక్రంలో కొలిచే కోణం;
 
azimuth=దిగంశ కోణం = అజిముత్
  • azoic, adj. నిర్జీవ;
    • azoic era, ph. నిర్జీవ యుగం;
  • azoospermia, n. విలీనవీర్యం; రేతస్సులో వీర్యకణాలు చాల తక్కువగా ఉన్న స్థితి; ఒక మిల్లీ లీటరు రేతస్సులో 15 మిలియనులు వీర్యకాణాల కంటె తక్కువ ఉన్న స్థితి;
  • azure, adj. నీలి; నీలి వర్ణమైన; ఆకాశపు రంగైన;

మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2