వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/D
నిఘంటువు
- This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added), published by Asian Educational Services, New Delhi in 2002.
- You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
- PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there.
Part 1: da-dh
Pennidi |- ! నిర్వచనములు ! ఆసక్తికర చిత్రములు |- |width="895"|
- D, d, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో నాలుగవ అక్షరం; (2) పరీక్షలలో బొటాబొటీగా మార్కులు వచ్చిన వారికి వచ్చే గురుతు; (3) ఒక విటమిన్ పేరు;
- dab, v. t. ఒత్తు; అద్దు; పులుము; రాయు; అలుకు;
- dabble, v. i. (1) ఉన్నాననిపించు; వేలు పెట్టు; కెలుకు; (2) జలకాలాడు;
- dactyl, n. [prosody.] (1) ఛందస్సులో ఒక గురువు తర్వాత రెండు లఘువులు వచ్చే పద్ధతి; భగణం;(2) వేలు;
- dad, n. నాన్న; అప్ప; అయ్య;
- daemon, n. (1) ప్రేతాత్మ. (2) దయ్యం; (3) [comp.] ప్రచ్ఛన్నవిధి; నేపథ్యంలో, వినియోగదారుని ఆధిపత్యం లేకుండా, నడిచే క్రమణిక; A computer program that is not invoked explicitly by the user, but lies dormant waiting for some condition(s) to occur; (ety.) The term was coined by the programmers at MIT's Project MAC. They took the name from Maxwell's demon, an imaginary being from a thought experiment that constantly works in the background, sorting molecules. Alternative terms for daemon are service (used in Windows, from Windows NT onwards — and later also in Linux) and and ghost job;
- dagger, n. బాకు; కటారి; మొలకత్తి; రెండు వైపుల పదునయిన కత్తి;
- dagger mark, ph. హంసపాదుకి వేసే శూలం గుర్తు; అచ్చు పుస్తకాలలో పేజీ దిగువ ఉన్న వివరణకి వేసే గుర్తు;
- dalits, n. pl. [Ind. Engl.] దళితులు; హరిజనులు; (note) a preferred term for India's casteless class;
- daily, adj. ప్రతిరోజు; దైనందినం; నిత్యం; రోజువారీ; అహరహం;
- daily wages, ph. కైకిలి; కైకూలి; రోజు కూలి;
- daily, n. దినపత్రిక;
- daintiness, n. నాజూకుతనం; సుకుమారం; స్వారస్యం;
- dairy, adj. పాడి; గవ్య; పయస్య;
- dairy products, ph. పాడి దినుసులు; పయస్యములు; గవ్యములు;
- dairy, n. (డెయిరీ) పాడి; పాడి పరిశ్రమ; పయస్య పరిశ్రమ;
- dais, n. (డేస్) వేదిక; తిన్నె; గద్దె; అరుగు; జగిల;
- dale, n. లోయ; లోవ; కనుమ;
- dam, n. డేమ్; అడ్డకట్టు; ఆనకట్ట; (note) A dam is a high impervious barrier constructed across a river valley to form a deep storage reservoir; The surplus water is not allowed to flow over the dam, but it flows through the spillways provided at some level built into the dam; (see also) barrage and weir;
- damage, n. హాని; చేటు; కీడు; అర; అపకారం; నష్టం;
- dame. n. స్త్రీ; పెద్దింటి స్త్రీ; దొరసాని; అమ్మగారు;
- damp, adj. (1) చిత్తడి; తేమగానున్న; తడిగానున్న; (2) నిరుత్సాహ మయిన;
- damped, adj. [phys.] అవరుద్ధ; మందగింపు చేసే;
- damped vibration, ph. అవరుద్ధ స్పందనం;
- damper, n. ఉత్సాహాన్ని చల్లార్చేది;
- dampness, n. తేమ; తడి; చెమ్మ; పదను; ఒరపదను; ఆర్ర్ధత; ఈకువ; ఇవుకు; ఈమిరి; చిత్తడి;
- damsel, n. ఎలనాగ; కన్య; పడుచు; యువతి;
- dance, n. నృత్యం; నాట్యం; లాస్యం; తాండవం;
- dancer, n. m. నర్తకుడు; f. నర్తకి;
- dandelion, n. సింహదంష్ట్రిక; అమెరికా గడ్డి మైదానలలో పచ్చని చామంతి పువ్వు లాంటి పువ్వుని పూసే ఒక రకం కలుపు మొక్క; [bot.] Taraxacum officinale; commonly viewed in the United States as a weed. But dandelions are traditional herbal medicine, used to stimulate the liver, promote the body’s natural detoxification processes and support healthy digestion. The botanical wellness company Traditional Medicinals turns the wild-collected roots into a variety of medicinal-grade formulations. Its Roasted Dandelion Root tea is robust and coffee-like, while EveryDay Detox Dandelion, Dandelion Chai Probiotic and Dandelion Leaf & Root are more mild and herbaceous.
- dandruff, n. చుండు; తలమీఁద పొరలు పొరలుగా లేచెడు చర్మపు కణాలు;
- danger, n. అపాయం; కీడు; విపత్తు; హాని; ఆపద; ముప్పు; సేగి; గండం; ఉపహతి; ప్రమాదం కలుగజేసే పరిస్థితి; see also accident;
- dangerous, adj. అపాయకరమైన, ప్రమాదకరమైన;
- dangle, v. i. వేలాడు; వెంట తిరుగు;
- dank, adj. మెతక;
- dank smell, ph. మెతక వాసన;
- dare, n. దమ్ము; ధైర్యం;
- dare, v. i. తెగించు; సాహసించు; ధైర్యం చేయు;
- daredevil, n. సాహసి; గడుగ్గాయి;
- dark, n. చీకటి;
- extremely dark, ph. కారునలుపు;
- pitch dark, ph. చిట్ట చీకటి; చీకటి గుయ్యారం; చిమ్మచీకటి; కటిక చీకటి; అంధకార బంధురం;
- dark, adj. (1) చీకటి; (2) అంధకార; నల్లనైన; నలుపు; కారు; (3) ముదర;
- dark age, ph. అంధకార యుగం;
- dark color, ph. ముదర రంగు; కర్రి;
- dark forest, ph. కారడవి;
- dark matter, ph. కృష్ణ పదార్థం; విశ్వంలో కండ్లకి, పనిముట్లకి కూడ కనిపించని పదార్థం;
- darkness, n. చీకటి; చీకువాలు; తిమిరం; అంధకారం; తామసం; తమస్సు; తామిస్రం; నిశీథం;
- utter darkness, ph. చిట్టచీకటి; చిమ్మచీకటి; కటిక చీకటి;
- darling, n. ముద్దులబిడ్డ; బంగారు కొండ; బాచాల కొండ;
- dart, n. దూసి; భిండివాలం; చిన్న ఈటె; చిరుశూలం; వేసుడుబరచి;
- dart, v. i. దూసికొని పోవు;
- dash, n. (1) పరుగు; (2) చిటికెడు; (3) చిన్న గీత;
- dash of salt, ph. చిటికెడు ఉప్పు;
- dash, v.i. జోరుగా పరుగెత్తు;
- data, n. pl. దత్తాంశలు; దత్తాలు; నిర్ధిష్టాంశలు; see also datum;
- data dictionary, ph. దత్తాంశ కోశం; దత్తాంశ నిఘంటువు;
- data store, ph. [comp.] దత్తాఖానా;
- data structure, n. [comp.] దత్తాంశ ప్రత్యయం; దత్తాంశ కట్టడం;
- database, n. [comp.] దత్తాంశనిధి; దత్తనిధి; దత్తాకరం; దత్తాంశాలను తిరిగి వెతుక్కుని వెలికి తియ్యటానికి అనుకూలంగా ఒక క్రమ పద్ధతిలో నిల్వ చేసే స్థలం;
- database administrator, ph. దత్తనిధి ప్రశాసకుడు; దత్తనిధి వ్యవస్థాపకి;
- database compression, ph. దత్తాంశ సంకోచనం;
- date, n. (1) తారీఖు; తేదీ; రోజు; తిథి; (2) ఒక వేళప్పుడు కలుసుకొందామనే ఒప్పందం; (3) నియమితమైన సమయంలో కలుసుకోడానికి ఒప్పుకున్న స్నేహితురాలు, లేదా స్నేహితుడు; (4) ఖర్జూరం;
- date palm, ph. ఖర్జూరం చెట్టు; [bot.] Phoenix dactylifera;
- dated, adj. పాతబడ్డ; తేదీ వేయబడ్డ;
- dative case, ph. కి, కు, కై, కొరకు; చతుర్థీ విభక్తి;
- datum, n. s. దత్తం; దత్తాంశం; (ety.) దత్త + అంశం;
- datura, n. ఉమ్మెత్త; ధుత్తూరం;
- daub, v. t. పూయు; పులుము; రాయు;
- daughter, n. పిల్ల; కూతురు; కుమార్తె; అమ్మాయి; పుత్రిక; తనూజ; నందన; బిడ్డ; పట్టి;
- daughter cell, n. పిల్ల కణం;
- daughter-in-law, n. కోడలు;
- daughters-in-law, n. pl. కోడళ్లు;
- daunted, adj. భయపడ్డ; బెదిరిన; దిగులుపడ్డ;
- dawn, n. ఉషస్సు; ఉషోదయం; ప్రభాతం; ప్రత్యూషం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం; తెల్లవారుజాము;
- day, n. (1) రోజు; దినం; దివసము; దివస్సు; వాసరము; అహము; అహస్సు; తేదీ; తారీఖు; వేళ; (2) పగలు; పగటివేళ; పట్టపగలు;
- all day, ph. రోజంతా; రోజల్లా;
- anomalous day, ph. ??
- day and night, ph. అహర్నిశలు; అహోరాత్రం; పగలనక, రాత్రనక;
- day by day, ph. రోజు రోజూ; దిన దిన;
- every day, ph. ప్రతిదినం; అనుదినం;
- holy day, ph. పుణ్యాహం;
- sidereal day, ph. 23 hours 56 minutes 4.091 seconds; The time between successive passages of the same star through the meridian.
- solar day, ph. 24 hours; The time between successive noons on Earth;
- tropical day, ph. ??
- daybook, n. దినవహి; కడితం; కవిలె; రోజు చిఠా; చిట్టా;
- daybreak, n. ఉషోదయం; ప్రభాతం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం;
- daylight, n. పగలు;
- broad daylight, ph. పట్టపగలు;
- days, n. pl. రోజులు;
- for several days, ph. రోజుల కొద్దీ; రోజుల తరబడి;
- in those days, ph. ఆ రోజులలో; అప్పట్లో;
- daytime, n. పగటివేళ;
- deacon, n. క్రైస్తవ చర్చిలో పని చేసే వ్యక్తి; పరిచారకుడు; సేవకుడు;
- dead, adj. చచ్చిపోయిన; ప్రాణం లేని; మృత;
- dead, n. కీర్తిశేషుడు; మృతుడు; స్వర్గస్థుడు; చచ్చిపోయినవాడు;
- deadbolt, n. అడ్డుగడియ;
- deadline, n. గడువు;
- deadlock, n. ప్రతిష్టంభన;
- deadpan, adj. ఉద్వేగరహితంగా; ఆవేశం లేకుండా; తాను ఉద్వేగం చూపించకుండా ఇతరులని నవ్వించే పద్ధతి;
- dead-reckoning, n. ఎంతదూరం ప్రయాణం చేసేమో,ఎక్కడ ఉన్నామో, ఉజ్జాయింపుగా లెక్క కట్టడం;
- deaf, n. చెవిటితం; చెవిటివాడు;
- stone deaf, ph. బ్రహ్మ చెవుడు;
- deafness, n. చెవిటితనం; బధిరత్వం;
- deal, n. బేరం; ఒడంబడిక; ఒప్పుకోలు;
- package deal, ph. బంగీ బేరం;
- deal, v. t. (1) పంచు; పేక ముక్కలని పంచడం; (2) లావాదేవీలు జరుపు;
- dealer, n. బేరగాడు; కమిషన్ వ్యాపారస్థుడు; వ్యాపారి;
- dealings, n. లావాదేవీలు; వ్యవహారాలు; ఆదానప్రతిదానాలు; ఇచ్చిపుచ్చుకోడాలు;
- dear, adj. (1) ప్రియమయిన; ఖరీదయిన; అరుదయిన; (2) ఆప్త; ప్రియమయిన; అపురూపమయిన; (note) one of the words in English whose two meanings match the two meanings of the corresponding Telugu word, namely, ప్రియమయిన;
- dear friend, ph. ఆప్తమిత్రుడు; ప్రియ మిత్రుడు;
- dearness, adj. ప్రియం; అధిక ఖరీదులు; కరువు; వస్తువులు దొరకక పోవడం;
- dearness allowance, ph. కరువు భత్యం;
- death, n. చావు; నిలుగు; మిత్తి; మరణం; మృత్యువు; పరాసత్వం; నిర్యాణం; నిర్గమం; మహాప్రస్థానం;
- fast unto death, ph. ప్రాయోపవేశం; నిరాహార దీక్ష;
- sudden death, ph. కాకిచావు; ఆకస్మిక మరణం; హఠాన్మరణం; అపమృత్యువు;
- death penalty, ph.. మరణశిక్ష;
- deathbed, n. మరణశయ్య;
- dearth, n. కరువు; లోటు; కొరత; అధిక గిరాకీ;
- debar, v. t. అడ్డగించు; నిషేధించు;
- debarkation, n. పడవ మీద నుండి దిగడం;
- debatable, adj. వివాదాస్పదమయిన; చర్చనీయ;
- debate, n. వివాదం; చర్చ; తర్జనభర్జన;
- debauchery, n. రంకుతనం; జారత్వం; వేశ్యాలోలత్వం;
- debenture, n. రుణ పత్రం; అప్పు పత్రం;
- debilitate, v. t. నీరసపరచు; బలహీనపరచు;
- debility, n. బలహీనత; నీరసం; దౌర్బల్యం;
- mental debility, ph. మానసిక దౌర్బల్యం; కశ్మలం;
- debit, n. ఖర్చు; బాకీ; వ్యయం;
- debit, v. t. ఖర్చువ్రాయు;
- debonair, adj. నాగరిక; సభ్య; మర్యాదతో కూడిన; సరస;
- debris, n. (డెబ్రీ) శిథిలాలు;
- tissue debris, ph. కణజాల శిథిలాలు;
- debt, n. (డెట్) అప్పు; రుణం; బాకీ;
- bad debt, ph. చెల్లించని బాకీ; రాని అప్పు;
- consolidation debt, ph. రుణార్ణ; రుణ + రుణ; చిన్న చిన్న అప్పులని తీర్చడానికి చేసే పెద్ద అప్పు;
- national debt, ph. ప్రార్ణం; ప్రభుత్వం చేసిన అప్పు; (ety.) ప్రవత్సతర + రుణ = ప్రార్ణ, లేక పెద్ద అప్పు; సంస్కృతంలో ఈ సంధి కార్యం ఒక ప్రత్యేక నియమానికి లోబడి ఉంది. సర్వసాధారణంగా అకారాంత పదాల తర్వాత రు శబ్దం వస్తే, రు శబ్దమే మారుతుంది. ఉదా : బ్రహ్మ + రుషి = బ్రహ్మర్షి. కాని అకారం తర్వాత రుణ అన్న మాట వచ్చినప్పుడు మాత్రం అకారానికి దీర్ఘం వస్తుంది. ఉదా : ప్రవత్సతర + రుణ = ప్రార్ణ.
- small debt, ph. వత్సరార్ణం; వత్సతర + రుణ ; ఏడాదిలోగా తీర్చేసే చిన్న అప్పు;
- debtor, n. (డెటర్) బాకీదారు; రుణి; రుణికుడు; రుణగ్రస్తుడు; అరువరి; అప్పారావు; అప్పులపోతు; అధమర్ణ = అధమ + రుణ;
- debug, v. t. తప్పులేరు; దోషాలు వెతుకు; దోషనిరూపణం;
- debugger, n. దోషనిరూపకి;
- debugging, n. తప్పుతీత; (కలుపుతీత లా); తప్పులేరడం; క్రమణికలలో తప్పులు ఏరడం; దోషనిరూపణం;
- debunk, v. t. ఒక నమ్మకాన్ని వమ్ము చెయ్యడం;
- debut, n. (డెబ్యూ) రంగప్రవేశం; అరంగేట్రం;
- debutante, n. f. (డెబ్యుటాంట్) రంగప్రవేశం చేసిన అమ్మాయి; వయసొచ్చిన పిల్ల; పశ్చిమ దేశాలలో, సంపన్నుల సంసారాల్లో, ఇల్లు వదలి పార్టీల వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టిన పిల్ల;
- decade, n. దశాబ్దం; దశకం; పదంగి;
- decadence, n. క్షీణదశ;
- decadent, adj. క్షీణదశలో ఉన్న;
- decagon, n. దశభుజి; దశకోణి; పది భుజాలు ఉన్న రేఖా చిత్రం;
- decane, n. దశేను; పది కర్బనపు టణువులు ఉన్న ఉదకర్బన రసాయనం; C10H22;
- decant, v. t. తేర్చు; పైన ఉన్న తేటను విడతీయు;
- decantation, n. తేర్చుట; మడ్డి కిందకి దిగగా పైనున్న ద్రవాన్ని వేరు చేయుట; [rel.] filtration;
- decapitation, n. శిరచ్ఛేదన; తల నరికెయ్యడం;
- decay, n. క్షయం; కుళ్లు; తగ్గుదల;
- linguistic decay, ph. భాషా క్షయం;
- decay, v. i. క్షీణించు; కుళ్లు; కృశించు; తగ్గు;
- allow to decay, ph. మురగబెట్టు; కుళ్ళబెట్టు;
- decayed, n. జర్జరం; శిధిలం;
- Deccan, n. దక్షిణాపథం; దక్కను పీఠభూమి;
- Deccan Traps, ph. దక్కను పీఠభూమిలో కనబడే శిలాద్రవపు రాళ్లు;
- deceased, adj. చచ్చిపోయిన; మరణించిన;
- deceased, n. పరాసు; మరణించిన వ్యక్తి;
- deceit, n. దగా; వంచన; మోసం; కుయుక్తి; కపటం; కైతవం; ప్రలంభం;
- deceitful, adj. దగా;
- deceitful person, ph. దగాకోరు;
- deceitfulness, n. కపటం; కాపట్యం;
- deceive, v. t. దగా చేయు; వంచన చేయు; మోసం చేయు; మోసగించు; మభ్యపరచు;
- deceleration, n. ఋణత్వరణం; త్వరణం ఎంత జోరుగా తగ్గుతోందో చెప్పే సూచిక;
- decent, adj. పరవాలేని; బాగానే ఉన్న; మంచి; మర్యాద అయిన;
- decentralization, n. వికేంద్రీకరణ;
- decency, n. పరవాలేని ప్రవర్తన; మర్యాద;
- decentralization, n. వికేంద్రీకరణ;
- deception, n. మతకం; మోసం; మాయ; వంచన; దగా;
- decibel, n. డెసిబెల్; శబ్దం ఎంత బిగ్గరగా ఉందో చెప్పే కొలమానం;
- decide, v. t. నిర్ణయించు; v. i. నిర్ధారణ చేయు;
- deciduous, adj. [bot.] పతయాళు; ఆకు రాల్చే స్వభావము గల;
- deciduous tree, ph. పతయాళువు;
- decimal, adj. [math.] దశాంశ;
- decimal arithmetic, ph. దశాంశ అంకగణితం;
- decimal complement, ph. దశాంశ పూరకం;
- decimal notation, ph. దశాంశ పద్ధతి;
- decimal number system, ph. దశాంశ పద్ధతి;
- decimal place, ph. దశాంశ స్థానం;
- decimal point, ph. దశాంశ బిందువు;
- decimal system, ph. దశాంశ పద్ధతి;
- decimate, v. t. (1) నిర్మూలించు; ఓడగొట్టు; (2) పదవ వంతు నాశనం చేయు;
- decimation, n. నిర్మూలన; పెద్ద ఎత్తున నిర్మూలన; [lit.] దశాంశ నిర్మూలన; పదవ భాగాన్ని నిర్మూలించడం;
- decision, n. తీర్మానం; తీర్పు; నిర్ణయం; పరిష్కారం; నిర్ధారణ; నిశ్చయం;
- decisive, adj. నిష్కర్ష;
- decipher, v. t. గుప్త సంకేతంలోని అసలు సమాచారాన్ని విడదీయడం;
- deck, n. (1) గట్టు; తీనె; (2) దస్తా; (3) మంచె; (4) ఓడలో బయలు ప్రదేశం;
- deck of cards, ph. పేక దస్తా;
- deck, v. i. అలంకరించుకొను;
- deck, v. t. అలంకరించు;
- declaration, n. ప్రకటన; నివేదన; ఆఖ్యానం; ప్రపచనం;
- declarative, adj. నివేదిక; ఆవేదక; ప్రవచార్ధక;
- declare, v. t. ప్రకటించు; ప్రవచించు; నివేదించు; సమాఖ్యించు;
- declension, n. [gram.] విభక్తి ప్రత్యయాన్ని చేర్చడం;
- declination, n. [astron.] (1) దిక్పాతం; ఖగోళ రేఖాంశం; వక్ర ప్రసరణ కోణం; the angular distance north or south from the celestial equator measured along a Great Circle passing through the celestial poles; analog to latitude on the surface of the globe; [see also] Right ascension; (2) నిరాకరణ; the formal refusal of an invitation;
- decline, n. తిరోగతి; అవనతి; చ్యుతి; క్షీణదశ; క్షీణావస్థ;
- decoction, n. కషాయం; క్వాథం;
- pepper decoction, ph. మిరియాల కషాయం;
- decompose, v. i. శిధిలమగు; కుళ్లు;
- decompose, v. t. (1) వియోగపరచు; విడదీయు; (2) కుళ్లబెట్టు;
- decomposition, n. వియోగం; కుళ్ళడం; శిధిలమవడం; పర్యూషితం;
- chemical decomposition, ph. రసాయన వియోగం;
- decanoic acid, ph. దశనోయిక్ ఆమ్లం; మేషిక్ ఆమ్లం; కేప్రిక్ ఆమ్లం; పది కర్బనపు అణువుల గొలుసు ఉన్న గోరోజనామ్లం; CH3(CH2)8COOH
- deconstruction, n. వినిర్ణతి; వినిర్మాణం; ఉచ్ఛేదన;
- decorate, v. t. అలంకరించు; ముస్తాబు చేయు; సింగారించు;
- decorated, adj. సాలంకృత; అలంకారాలతో ఉన్న;
- decoration, n. అలంకరణ; అలంకారం; అలంకృతి; సింగారింపు; కైసేత; ముస్తాబు;
- decorticated, adj. పొట్టుతీసిన; without the outer skin (of cereal grains);
- decoy, n. పరులని తప్పుదారి పట్టించడానికి వాడే వస్తువు;
- decree, n. తీర్పు; నిర్ణయం; శాసనం; జారీ; ఫర్మానా;
- decrease, v. i. తగ్గు; సన్నగిల్లు;
- decrease, v. t. తగ్గించు; కుదించు; సడలించు;
- decrement, n. తగ్గింపు; కోత;
- dedicated, adj. అంకిత; అంకితభావంతో;
- dedication, n. (1) అంకితం; (2) కార్యదీక్ష; నిధిధ్యాసనం; నిరతి; పరాయణత్వం;
- dedication to service, ph. సేవా నిరతి;
- dedication to oppressing others, ph. పరపీడన పరాయణత్వం;
- deduce, v. t. [math.] సామాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని తార్కికంగా నిర్ణయించడం;
- deduct, v. t. మినహాయించు; తగ్గించు;
- deduction, n. (1) మినహాయింపు; తగ్గింపు; (2) తీసివేత; తగ్గింపు; వ్యవకలనం; (3) [logic] నిగమనం; సామాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని నిర్ణయించే తర్కం; (ant.) induction;
- deed, n. (1) చేష్ట; చేసిన పని; కృత్యం; కార్యం; (2) పత్రం; కాగితం; దస్తావేజు;
- good deed, ph. మంచి పని; సత్కార్యం;
- sinful deed, ph. పాపకృత్యం;
- deep, adj. (1) లోతైన; గాఢమైన; గహన; గంభీరమైన; (2) ముదురు;
- deep space, ph. గహన గగనం;
- deep blue, ph. ముదురు నీలం;
- deep seated, ph. పాతుకుపోయిన; సుస్థిర; అంతస్థిత;
- deep-fry, v. t. వేయించు; నూనెలో వేయించు;
- deep-frying pan, ph. మూకుడు; బాణలి;
- deer, n. జింక; ఇర్రి; మృగం; హరిణం; కురంగం; (rel.) buck; doe;
- baby deer, ph. శాబకం;
- female deer, ph. లేడి; doe;
- spotted deer, ph. దుప్పి;
- de facto, adj. [Latin] నిజానికి; నిజం చెప్పాలంటే; అసలైన; యదార్థ; వాస్తవిక;
- defamation, n. పరువు నష్టం; నగుబాటు; అపనింద; అపవాదు;
- default, n. గుజస్తు; అపక్రమం; తనంతి; చెయ్యవలసిన పనిని వేళకి చెయ్యలేక పోవడం;
- default font, ph. తనంతి ఖతి;
- default setting, ph. ఎలా ఉన్నదానిని అలాగే వాడుకోవడానికి వీలైన అమరిక;
- defeat, n. ఓటమి; అపజయం; పరాజయం;
- defecate, v. t. మలవిసర్జన చేయు;
- defecation, n. మలవిసర్జన చెయ్యడం;
- public defecation, ph. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చెయ్యడం;
- defect, n. లోపం; లోటు; పొచ్చెం; అచ్చిక; వికలం; ఓడు; మొర్రి; అరకొర; ఢోకా; తఫావతు;
- defective, adj. లోపం ఉన్న; ఓటి; లోపభూయిష్టమయిన; కోరా; వికల;
- defective organ, ph. వికలాంగం;
- defective pot, ph. ఓటి కుండ;
- defend, v. t. (1) రక్షించు; కాపాడు; కాయు; (2) సమర్ధించు;
- defendant, n. ప్రతివాది; ప్రత్యర్థి; ముద్దాయి; In Anglo-Saxon jurisprudence, the government is always the plaintiff in criminal cases and must prove its case against the defendant beyond a reasonable doubt (అనుమానానికి తావు లేకుండా). In civil cases, it is sufficient to show a preponderance of the evidence.
- defense, defence (Br.), n. (1) రక్షణ; కాపు; (2) సమర్ధన; మద్దత్తు; ప్రతివాదం; (3) ముద్దాయి పక్షం;
- defense ministry, ph. రక్షణ మంత్రివర్గం;
- defensive, adj. రక్షక;
- defensive mechanism, ph. రక్షక సంవిధానం;
- defiance, n. ధిక్కారం;
- deficiency, n. లోటు; కొరత; వెలితి; అచ్చిక; అరకొర;
- deficit, n. లోటు; లోపము; వెలితి; కొరత; కొదవ; కొరవ; కొర; న్యూనత;
- budget deficit, ph. బడ్జెట్ లోటు; ఆదాయం కంటె ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో లోటు వస్తుంది. ఆలోటుని భర్తీ చెయ్యడానికి అప్పు చెయ్యవచ్చు.
- defile, v. t. అపవిత్రం చేయు; ఎంగిలి చేయు; మలినం చేయు; భ్రష్టం చేయు;
- define, v. t. నిర్వచించు; విశదీకరించు; లక్షణములు చెప్పు;
- definite, n. నిర్దిష్టం; ఇదమిత్థం;
- definitely, adv. కచ్చితంగా; ఇదమిత్థంగా;
- definition, n. నిర్వచనం; నిరువల్కు;
- definitively, n. ఇదమిత్థంగా; నిశ్చితంగా; ఖరాఖండిగా;
- deflation, n. తుస్సుమనడం; గాలి తీసెయ్యడం; Deflation is a general decline in prices for goods and services, typically associated with a contraction in the supply of money and credit in the economy; see also inflation;
- deformity, n. అవలక్షణం; అవిటితనం; అంగవైకల్యం;
- defraud, v. t. మోసపుచ్చు; దగాచేయు;
- deft, adj. చురుకయిన;
- defunct, adj. చచ్చిపోయిన; మృత;
- defy, v. i. ధిక్కరించు; ఎదిరించు; తిరస్కరించు;
- degenerate, adj. అపభ్రష్ట; పతిత; భ్రష్ట; శిధిల; తిరోగమన;
- degeneration, n. అధఃపతనం; శైథిల్యం; అరుగుదల; క్షీణత;
- degradation, n. అధోకరణం; అధఃపతనం; శైథిల్యం; అరుగుదల;
- degreaser, n. అటకలి; జిడ్డుని వదలగొట్టేది;
- degree, n. (1) అంశ; (2) భాగ; డిగ్రీ; కోణ పరిమాణం; (3) డిగ్రీ; పరిమాణం;
- degree of an angle, ph. కోణభాగం;
- degree of latitude, ph. అక్షభాగం;
- degree of longitude, ph. రేఖాభాగం;
- dehydrated, adj. ఎండిన; ఎండబెట్టిన; నీరు తీయబడిన;
- dehydration, n. నిర్జలీకరణం; ఎండబెట్టడం;
- deification, n. దైవత్వాన్ని ఆపాదించడం; అవతారమెత్తిన వ్యక్తి అని కొనియాడడం;
- deism, n. ఈశ్వరజగద్భేదవాదము; ఈ వాదంలో ప్రపంచం, దేవుడు నడుమ స్పష్టమైన గీత గీయబడింది. దేవుడు సృష్టించేసి, ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయి, ఎక్కడో స్వర్గం వంటి చోట నివసిస్తున్నాడు. దేవుడు పరోక్ష భూస్వామి వంటి వాడు. సృష్టికి దేవుడు నిమిత్తకారణం (Efficient Cause) మాత్రమే. ఇక్కడ జరిగే విషయాల ఆయనకు ఏమాత్రం పట్టవు. ఇసాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ వంటి వారు ఈ వాదాన్నే సమర్ధించారు;
- deity, n. దేవుడు; దేవత; దైవం;
- presiding deity, ph. అధిదేవత; అధిష్టాన దేవత;
- dejected, adj. విషణ్ణ; ఖిన్న విచార;
- dejected face, ph. విషణ్ణ వదనం; ఖిన్న వదనం;
- dejection, n. విషణ్ణం; నిరుత్సాహం; చింత; వ్యాకులపాటు;
- de jure, adj. [Latin] న్యాయానికి; చట్టరీత్యా; పేరుకి మాత్రం;
- delay, n. ఆలస్యం; విలంబన; జాగు; జాప్యం; కాలయాపనం; కాలవిలంబన; కాలాతీతం; తామసం;
- time delay, ph. కాలయాపనం; కాలవిలంబన;
- delay, v. i. ఆలస్యం చేయు; జాప్యం చేయు; జాగు చేయు;
- delay line, ph. [elec.] విలంబన మార్గం; విలంబన తంతువు; తామస తంతువు;
- delegate, n. ప్రతినిధి; సభ్యుడు; నియుక్తుడు; నియోగి;
- delegate, v. t. నియోగించు; పని మరొకరికి అప్పగించు;
- delegation, n. నియుక్త బృందం; సభ్య బృందం; రాయబార వర్గం;
- delerium, n. సంధి; స్మృతి భ్రంశం;
- delete, v. t. కత్తిరించు; కొట్టివేయు; జాబితా నుండి తొలగించు; మినహాయించు; పాటాకొట్టు; పరిహరించు;
- deli, n, తినడానికి తయారుగా ఉన్న రొట్టె, చీజు, ఊరబెట్టిన మాసం; చేపలు, వగైరా అమ్మే స్థలం; short for delicatessen;
- deliberate, adj. బుద్ధిపూర్వకంగా చేసిన;
- deliberate act, ph. బుద్ధిపూర్వకంగా చేసిన పని;
- deliberate, v. t. ఆలోచించు; సమాలోచన చేయు;
- deliberately, adv. బుద్ధిపూర్వకంగా;
- delicacy, n. అపురూపమైన విలువ గలది; నాజూకైనది;
- delicate, adj. సున్నితమైన; నాజూకైన; సుకుమారమైన; కోమలమైన; మార్దవమైన; సుతారమైన;
- delicious, adj. కమ్మని; మంచి రుచిగల; హితవైన; స్వాదువైన;
- delight, n. ఉల్లాసం; సంతోషం; ప్రమోదం;
- delinquency, n. (1) నేరం; (2) వేళకి అప్పు తీర్చలేకపోవడం;
- juvenile delinquency, ph. చిన్న పిల్లలు చేసిన నేరం;
- delirious, adj. (1) సన్నిపాత జ్వరానికి సంబంధించిన; సన్నిపాతజ్వర రోగివలె; (2) మితిమించిన సంతోషంతో;
- delirium, n. సన్నిపాతం; సంధి; సన్నిపాతజ్వరం; సంధిలో పేలాపన; జ్వరంచే గాని, నాడీ మండలం అదరడం వల్ల కాని ఒంటి మీద స్మారకం వస్తూ, పోతూ ఉండే రోగస్థితి;
- deliver, v. t. (1) ప్రసవించు; ఈను; కను; (2) ఇచ్చు; పలుకు; వచించు; (3) విడుదల చేయు; బట్వాడా చేయు; (4) పట్టుకొచ్చి ఇచ్చు; అందించు; చేర్చు; (5) విడచిపెట్టు; విముక్తి చేయు;
- delivery, n. (1) పురుడు; ప్రసవం; ప్రసూతి; కాన్పు; (2) అప్పగింత; (3) విడుదల; బట్వాడా;
- breech delivery, ph. పాదదర్శన ప్రసవం;
- dell, n. కోన; కొండలలో ఇరుకైన చోటు; లోయ;
- Delphinus, n. ధనిష్ట; ధనిష్టా నక్షత్రం; గోలోకం;
- delta, n. డెల్టా; నదులు సముద్రంలో కలిసే చోట త్రిభుజాకారంగా ఏర్పడ్డ ద్వీపం;
- deluge, n. వరద; జలప్రళయం; ముంపు; వెల్లువ;
- delusion, n. తర్కబద్ధమైన విశ్లేషణకి లొంగని ఒక రకం మానసిక భ్రమ; వ్యాధి తీవ్రతలో ఏర్పడు ఒక భ్రాంతి; a false idea or belief that is caused by mental illness; In this form, the affected person fears they are being stalked, spied upon, obstructed, poisoned, conspired against or harassed by other individuals or an organization;
- demand, n. గిరాకి; జరూరు; అవసరం; కొనుబడి; దాతవ్యం;
- demand draft, ph. జరూరు హుండీ; డబ్బు ముందు పుచ్చుకుని బేంకు ఇచ్చే చెక్కు;
- demand price, ph. గిరాకీ ధర;
- supply and demand, ph. సరఫరా గిరాకిలు;
- demand, v. t. అడుగు; (హక్కుగా) కోరు;
- demeanor, n. వాటం; వైఖరి; తీరు; హావభావాలు; చందం;
- demented, adj. పిచ్చిపట్టిన;
- dementia, n. బుద్ధిమాంద్యత; ముసలితనంతో వచ్చే బుద్ధిమాంద్యత; మెదడులోని కణజాలం పాడవడం వల్ల తర్కబద్ధమైన వీశ్లేషణ, జ్ఙాపక శక్తి విపరీతంగా తగ్గిపోయిన కారణంగా పొడచూపే ప్రవర్తన; బుద్ధిమాంద్యత అన్నా ఆల్జైమర్శ్ రోగం అన్నా ఒకటి కాదు; జ్ఞఆపకశక్తిని, భాషాపాటవాన్ని, అహం అనే భావాన్నీ నాశనం చేసే బుద్ధిమాంద్యతని ఆల్జైమర్శ్ రోగం అనొచ్చు;
- demi, adj. అర్ధ; అర; సగము;
- demigods, n. pl. ఉపదేవతలు; ఖేచరులు; దైవము వంటివారు;
- demilitarized zone, ph. నిసైన్య మండలం;
- demise, n. చావు;
- democracy, n.ప్రజాస్వామ్యం; ప్రజాస్వామికం; ప్రజాతంత్రం; ప్రజల ప్రభుత్వం;
- demographics, n. జనసంఖ్యా వివరాలు;
- demography, n. జనాభాశాస్త్రం; జనసంఖ్యాశాస్త్రం;
- demolish, v. t. పడగొట్టు; నిర్మూలించు; నాశనం చేయు; ధ్వంసం చేయు; నేలమట్టం చేయు;
- demon, n. (1) సైతాను; క్రైస్తవులు నమ్మే కొమ్ములు, తోక ఉన్న ఒక (దుర్మార్గపు) అత్యంత శక్తిమంతమైన శాల్తీ; (2) భూతం; బ్రహ్మ రాక్షసి; దయ్యం; పిశాచం;(3) f. డాకిని; శాకిని;
- demonstrate, v. t. తార్కాణించు; ప్రత్యక్ష ప్రమాణంతో రుజువు చేయు; చేసి చూపించు;
- demonstration, n. తార్కాణం; చేసి చూపించడం; రుజువు చేయడం; నిరూపించడం; ప్రదర్శించడం;
- demonyms, n. pl. ప్రజల పేర్లమీద ఏర్పడిన స్థలనామాలు;
- demur, v. i. (డిమర్). సందేహించు, సంశయించు; ముందు వెనుక లాలోచించు; తటపటాయించు;
- demure, adj. (డిమ్యర్). పుట్టముంగి వలె; నంగనాచిలా; సిగ్గుతో; (ఒక స్త్రీ ప్రవర్తనని వర్ణించేటప్పుడు)
- den, n. (1) గుహ; (2) ఇంట్లో ఒక చిన్న గది;
- denatured, adj. కల్తీ అయిన; సహజసిద్ధము కాని;
- dendritic, adv. శాఖోపశాఖలుగా;
- Denebola, n. ఉత్తరఫల్గుణి; సింహరాసిలో ఒక నక్షత్రం; రాశిచక్రంలో కనిపించే నక్షత్రాలలో రెండవ స్థానంలో ఉన్న తార; భూమికి 36 జ్యోతిర్ వర్షాల దూరంలో ఉంది;
- dengue fever, n. డింగీ జ్వరం; దుమ్ములనొప్పి జ్వరం; విషాణువు వల్ల ఒళ్లంతా నొప్పులతో వచ్చే జ్వరం;
- denizens, n. pl. నివాసస్తులు; కాపురస్తులు;
- denizens of the dark, ph. చీకటిలో నివసించేవి;
- denominate, v. t. పేరు పెట్టు;
- denominator, n. [math.] హారం; భిన్నంలో గీతకి దిగువ ఉన్న అంశం;
- denotation, n. యధార్థార్థం; అసలు అర్థం; see also connotation;
- denote, v. t. సూచించు; పేరు పెట్టు;
- denounce, v. t. బహిరంగంగా నిందించు;
- dense, adj. దట్టమైన; సాంద్రమైన; కీక; సాంద్ర; ఆకీర్ణ; ఈరము; అవిరళ; నిబిడ;
- dense darkness, ph. నిబిడాంధకారం;
- dense forest, ph. కీకారణ్యం;
- density, n. సాంద్రత; చిక్కతనం; ఈరమి;
- probability density, ph. సంభావ్యతా సాంద్రత;
- dent, n. లొత్త; నొక్కు; సొట్ట; నత;
- dental, adj. దంత; దంత్య; పంటికి సంబంధించిన;
- dentals, n. [ling.] దంత్యములు; దంత్యాక్షరాలు; పళ్ళ సహాయంతో పలికే వర్ణాలు; త, థ, ద, ధ, న, ల, స;
- dentist, n. దంతవైద్యుడు; దంత విశారద;
- dentition, n. దంతములు (పళ్ళు) మొలుచుట;
- dentures, n. (డెంచర్స్) కట్టుడుపళ్లు;
- deny, v. t. నిరాకరించు; లేదను; కాదను; ఒప్పుకొనకపోవు;
- deodorant, n. దుర్గంధనాశని; నిర్గంధి; కంపుని పోగొట్టడానికి వాడే వస్తువు;
- deodorization, n. నిర్గంధీకరణం; కంపుని పోగొట్టడం;
- deoxyribonucleic acid, n. అరైకామ్లం; DNA;
- depart, v. i. వదలిపెట్టు; వెళ్ళిపోవు; బయలుదేరు;
- departed, adj. (1) వెళ్ళిపోయిన; (2) చనిపోయిన;
- departures, n. pl. పోకలు;
- department, n. శాఖ; విభాగం;
- departure, n. పోక; వెళ్లడం; యాతం; అపగమం; బయలుదేరడం; నిష్ర్కమణం;
- departure time, ph. పోయే వేళ; బయలుదేరే వేళ;
- depend, v. i. ఆధారపడు; నమ్ముకొనియుండు;
- dependence, n. పరతంత్రత; పరాధీనత; పరాయత్తత;
- dependent, adj. పరతంత్ర; ఆయత్త; పరాయత్త; పరాధీన; ఆధారపడ్డ; శ్రీత; ఆశ్రిత; సమాశ్రిత;
- dependent variable, ph. పరతంత్ర చలనరాసి; శ్రిత రాసి; ఆశ్రిత రాసి;
- dependent, n. పరతంత్రుడు; పరతంత్రి; శ్రీతుడు; ఉపజీవకుడు; ఆశ్రీతుడు;
- dependents, n. pl. పోషవర్గం; ఆశ్రీతులు;
- depict, v. i. చిత్రీకరించు; చిత్రించు; వర్ణించు;
- depiction, n. చిత్రణ; వర్ణన; చిత్రీకరణ;
- deplete, v. i. తగ్గు; ఖర్చగు; ఖాళీ అగు;
- deplore, v. i. వాపోవు; విచారించు; చింతించు; విలపించు;
- deplorable, adj. శోచనీయం; దీనం; విషాదవంతం; వ్యధితం; ఆధ్వాన్నం;
- deponent, n. వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి;
- deposit, n. (1) ధరావతు; సంచకరం; పగిడీ; (2) నిక్షేపం; (3) పూత;
- deposit, v. t. ధరావతు చేయు; నిక్షేపించు;
- depository, n. సరకులు దాచే స్థలం; కొట్టు;
- deposition, n. వాంగ్మూలం;
- depot, n. (డిపో) (1) గోదాం; సరుకు నిలవచేసే చోటు, (2) నెలవు; కొఠారు; స్టేషను; రైలు స్టేషను; బస్సు స్టేషను; వాహనాలను నిలిపే చోటు;
- depreciation, n. అపకర్షణం; తరుగు; తగ్గుదల; వాడుక వల్ల విలువ తగ్గడం;
- depress, v. t. నొక్కు; అణగదొక్కు;
- depressants, n. నిరుత్సాహకారకులు; ఆల్కహాలు, నిద్రమాత్రలు వగైరా;
- depressed, adj. దళిత; వెనకబడ్డ; అణగదొక్కబడ్డ;
- depression, n. (1) గొయ్యి; నత; (2) గుండం; పీడనగుండం; అవనతి; తుపాను; (3) మాంద్యత; స్తబ్ధత; (4) వ్యాకులత; వైరాగ్య వ్యాకులత; మానసిక దిగులు; చింత; కుంగుబాటు; కృంగుదల;
- major depression, ph. భారీ వ్యాకులత;
- mental depression, ph. మనో వ్యాకులత; మనోస్తబ్ధత; కుంగుబాటు; ఈ మానసిక రోగానికి ఉండే లక్షణాలు: మనసు ఖాళీగా ఉన్నట్లు విచారంగా ఉండటం (empty mood); నిరాశ, నిస్పృహ, ఎందుకూ పనికిరాననే భావం; దేనిమీదా అభిరుచి (interest) లేకపోవటం; నిస్సత్తువ, అలసట, నీరసం; ఏకాగ్రత లేకపోవటం; ఏదయినా నేర్చుకోవాలంటే కష్టమైపోవటం; చికాకుగా ఉండటం (irritability); అతినిద్ర లేదా నిద్ర లేమి; అర్ధరాత్రి లేదా తెల్లవారు ఝామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక పోవటం; ఆకలి పెరగటం లేదా తగ్గిపోవటం; ఇక్కడా అక్కడా నెప్పులు, చెప్పుకోలేని బాధలు; భవిష్యత్తు గురించి ఆలోచించ లేకపోవటం; ఆశలు ఆశయాలు లోపించడం; నిర్ణయాలు తీసికోలేకపోవటం; చనిపోవాలని అనిపించటం; see also "anxiety;"
- postnatal depression, ph. ప్రసూతి వైరాగ్యం;
- postpartum depression, ph. ప్రసూతి వైరాగ్యం;
- depth, n. లోతు; దఘ్నత; దఘ్నం;
- depth gauge, ph. దఘ్నమాపకం; లోతుని కొలిచే ఉపకరణం;
- depth indicator, ph. దఘ్నార్థకం; లోతుని చూపించే సూచిక;
- deputy, n. నియోగి;
- dequeue, v. t. (కంప్యూటరు పరిభాషలో) ఒక వరుసలోఉన్న శాల్తీలలో ముందున్న శాల్తీని బయటకి తియ్యడం;
- derail, v. i. పట్టాలు తప్పు;
- derail, v. t. పట్టాలు తప్పించు;
- dereliction, n. ఉపేక్ష; శ్రద్ధ చూపకపోవడం; పరిత్యాగం;
- deride, v. t. గేలి చేయు; పరిహసించు; ఎద్దేవాచేయు; ఎగతాళిచేయు;
- derision, n. పరిహాసం; హేళన; ఎగతాళి;
- derivation, n. వ్యుత్పత్తి; నిష్పాదన;
- derivative, n. (1) పుట్టినది; ఉత్పన్నం; వ్యుత్పన్నం; నిష్పాదకం; నిష్పన్నం; జన్యం; తద్ధితం; (2) వాలుదల; ఒక ప్రమేయం విలువ ఏ దిశలో, ఎంత జోరుగా మారుతూందో (పెరుగుతోందో, తరుగుతోందో) తెలియజేసే సంఖ్య; ఒక ప్రమేయం కి ఒక బిందువు దగ్గర ఒక స్పర్శ రేఖ గీసినప్పుడు, ఆ రేఖ ఎంత వాలుగా ఉందో చెప్పే సంఖ్య; (3) స్టాక్ మార్కెట్లో షేర్లు మూలాధారాలు (underlyings) అయితే, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) వాటి వ్యుత్పన్నములు; షేర్ల గురించి అవగాహన ఉన్న ట్రేడర్లు తక్కువ మూలధనంతో ఎక్కువ లాభం ఆర్జించే సాధనాలు డెరివేటివ్స్;
- dervative of a function, ph. ఒక ప్రమేయం ఒక బిందువు వద్ద ఎంత జోరుగా కదులుతొందో (పెరుగుతొందో, తరుగుతొందో) తెలిపే సంఖ్య;
- derivative mortgage, ph. రెండవ తనఖా;
- derivative suffix, ph. నిష్పాదక ప్రత్యయం; తద్ధిత ప్రత్యయం;
- derive, v. t. సాధించు; వ్యుత్పన్నించు; నిష్పన్నం చేయు;
- derived, adj. ఉత్పన్న; వ్యుత్పన్న; సాధ్య; జన్య;
- derived pause, ph. [gram.] సాధ్య బిందువు;
- derived raga, ph. [mus.] జన్య రాగం;
- derived, n. ఉత్పన్నం; నిష్పన్నం; సాధించినది;
- dermatitis, n. చర్మశోథ; చర్మతాపము;
- atopic dermatitis, ph. అసహన చర్మశోథ; అసహన చర్మతాపము; గజ్జి (eczema) ఒక రకమైన అసహన చర్మశోథ;
- desalination, n. నిర్లవణీకరణ;
- deserving, adj. అర్హత గల;
- derogatory, adj. మర్యాద తక్కువైన; గౌరవలోపమైన;
- derrick, n. బకయంత్రం; బరువులని పైకెత్తే యంత్రం; (ety.) కొంగ మెడ వలె పొడుగాటి మెడ ఉన్న యంత్రం;
- descending, adj. అవరోహణ; దిగువకి దిగే;
- descending order, ph. [math.] అవరోహణ క్రమం;
- descent, n. అవరోహణ; దిగుట; తగ్గుట;
- describe, v. t. వర్ణించు; అభివర్ణించు;
- description, n. వర్ణన; అభివర్ణన;
- descriptive, adj. వర్ణనాత్మక; అన్వర్ధక; (ant.) prescriptive;
- descriptive, n. వర్ణనాత్మకం; అన్వర్ధకం;
- desecrate, v. t. చెరుచు; అపవిత్రం చేయు; మైల చేయు;
- desert, v. t. వదలివేయు;
- desert, n. ఎడారి; నిర్జనం; see also dessert;
- desertion, n. వదలిపెట్టడం; త్యజనం;
- deserving, adj. అర్హత గల;
- desiccate, v. t. ఇగుర్చు; ఎండబెట్టు; శోషించు;
- desiccator, n. శోషణపాత్ర;
- design, n. (1) పన్నుగడ; (2) విన్యాసం; రూపం; రూపకల్పన; కూర్పు;
- cover design, ph. ముఖపత్ర విన్యాసం;
- designer, n. రూపశిల్పి; కూర్పరి;
- designated, adj. అభిదాయక; లక్షిత;
- designing, n. రూపకల్పన; రూపశిల్పం;
- desirable, adj. అభిలషణీయ; వాంఛనీయ;
- desirable, n. అభిలషణీయం; వాంఛనీయం; ఉద్దిష్టం;
- desire, n. కోరిక; కాంక్ష; ఆకాంక్ష; వాంఛ; అభిలాష; అభిమతం; ఈషణము; ఇషణము; మనోరధం; ఇచ్ఛ; ఆసక్తి; ఆశ;
- desire to learn, ph. జిజ్ఞాస;
- desire to win, ph. జిగీష;
- a person with a desire, ph. జిగీషువు;
- strong desire, ph. ఉబలాటం;
- vain desire, ph. అడియాస;
---Usage Note: desire, want; wish
|
- desired, n. అభిలషణీయం; వాంఛనీయం; ఉద్దిష్టం;
- desirelessness, n. నిరాసక్తత;
- desk, n. మేజా; రాతబల్ల; బల్ల;
- desolate, adj. నిర్మానుష్యమైన; నిర్జన; మానవ సంచారం లేని;
- despair, n. నిస్పృహ; నిరాశ; నిరుత్సాహం;
- desperate, adj. నిరాశాపూర్వక; హతాశమైన; అసాధ్య; భీషణ;
- desperation, n. నైరాశ్యం; నిరాశ వల్ల కలిగిన తెగింపు;
- despicable, n. అసహ్యమైన;
- despondence, n. నిరాశ; నిస్పృహ; అధైర్యం; విషాదం;
- despot, n. నిరంకుశ ప్రభువు;
- dessert, n. (డెజర్ట్) భోజనానంతరం తినే తీపి పదార్థం; మోదకం;
- destination, n. అడంగు; గమ్యం; గంతవ్యం;
- destiny, n. దైవగతి; విధి; రాత; తలరాత; అదృష్టం; నసీబు;
- destitute, n. బుక్కాపకీరు; ఇల్లు, వాకిలి లేని వాడు;
- destroy, v. t. నాశనం చేయు; లయించు; తెగటార్చు; నిర్మూలించు; ధ్వంసం చేయు; రూపుమాపు;
- destroyer, n. లయకారకుడు; నాశనం చేసేవాడు;
- destructible, adj. వ్యయమైన;
- destruction, n. నిర్మూలన; విధ్వంసన; లయ; వినాశం; క్షపణం; హననం;
- destructive, adj. భంజక; నిర్మూలాత్మకమైన; విధ్వంసక; క్షపణ; హనన;
- destructive distillation, ph. భంజక శ్వేదనం; హనన స్వేదనం; నిర్వాత స్వేదనం;
- detach, v. t. వేరుచేయు; వేరుపరచు; పీకు;
- detached, adj. వేరుగా; విడిగా; నిర్విణ్ణ; అసంహిత; నిస్సంగ;
- detachment, n. నిస్సంగత్వం;
- detailed, adj. వివరంగా; సవిస్తరంగా;
- details, n. వివరాలు;
- detection, n. ఆచూకీ; ఆరా; శోధన;
- detective, n. పత్తేదారు; ఆచూకీదారు; అరీందం; అపరాధ పరిశోధకుడు; నిరూపకుడు;
- detective novel, ph. నిరూపక నవల; అపరాధ పరిశోధక నవల;
- detector, n. శోధకం; శోధకి; పత్తాసు; (ety.) detective = పత్తేదారు
- smoke detector, ph. పొగ పత్తాసు;
- detention, n. నిర్బంధం;
- deter, v. t. భయపెట్టి మాన్పించు; ఆపు; అడ్డగించు; నివారించు; నిలుపు;
- determinant, n. (1) [math.] నిశ్చితార్థం; లెక్కలలో ఒక వ్యూహం (మాత్రుక) రీతిలో వేసిన అంకెల అమరిక యొక్క విలువ; (2) నిశ్చయించేది;
- determination, n. (1) నిర్ధారణ; నిర్ణయం; (2) సంకల్పం; (3) అభినివేశం;
- fierce determination, ph. వజ్ర సంకల్పం;
- process of determination, ph. నిర్ధారణ ప్రక్రియ;
- determine, v. i. నిర్ణయించు; నిశ్చయించు;
- determinism, n. నిర్ణయవాదం; నియతవాదం; ప్రతి సంఘటనకూ, కార్యానికీ ఏదో ఒక కారణం ఉంటుందనీ, సృష్టి సమస్తం కార్యకారణ సంబంధాల మూలంగానే జరుగు తుంటుందనీ తెలియజేసే సిద్ధాంతం;
- deterministic, adj. నిర్ణయాత్మక;
- detergent, n. అపక్షాలకం; కల్మషహారి;
- deteriorate, v. i. దిగజారు; శిధిలమగు;
- deterioration, n. దిగజారడం; శిధిలమవడం; విపరిణామం;
- determination of meaning, ph. అర్థవిపరిమాణం;
- detonate, v. i. పేలు; v. t. పేల్చు;
- detonation, n. పేలుడు; విస్ఫోటనం;
- deuce, n. దువ;
- devaluation, n.అవమూల్యనం; న్యూనీకరణం; విలువ తగ్గించడం;
- development, n. వికాసం; సంవర్ధనం; అభివృద్ధి;
- child development, ph. శిశు వికాసం; శిశు సంవర్ధనం;
- community development, ph. సమాజ వికాసం; సమాజ సంవర్ధనం;
- deviate, v. i. దారి తప్పు; మరొకదారి తొక్కు;
- deviation, n. విచలనం; విపథం;
- device, n. (1) తంత్రం; పన్నుగడ; (2) సాధనం; ఉపకరణం; కందువ; దీవసం; (3) జంత్రం;
- devil, n. సైతాను; క్రైస్తవ మతంలో దేవుడికి చుక్కెదురు అయిన శక్తి;
- devise, v. t. పన్ను; ఊహించు; కనిపెట్టు;
- devote, v. t. లగ్నపరచు; కేటాయించు; వినియోగించు;
- devotee, n. ఉపాసి; m. ఉపాసకుడు, భక్తుడు; f. ఉపాసకురాలు; భక్తురాలు;
- devotion, n. భక్తి; నిరతి;
- devotion to service, ph. సేవానిరతి;
- devour, v. t. కబళించు; మింగివేయు; భక్షించు; మెక్కు; బుక్కు; అత్యాసతో, ఆత్రుతతో గబగబా తిను;
- dew, n. తుహినం; మిహిక; ధూమిక; నీటి బిందువులుగా మారిన గాలిలోని చెమ్మ; (rel.) తుషారం;
- dew drop, ph. తుహిన బిందువు;
- dew point, ph. తుహిన అంకం; తుహిన స్థానం; గాలిలోని చెమ్మ నీటి బిందువులుగా మారడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత;
- dewlap, n. (1) గంగడోలు; ఆవులకి ఎద్దులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; (2) జోలుమెడ; ఇతర జంతువులకి, పక్షులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; see also wattle;
- dew-worm, n. వానపాము; ఎర్ర;
- dexterity, n. హస్తకౌశలం; చాతుర్యం; నిపుణత్వం; నైపుణ్యం; వైదగ్ధ్యం;
- dextral, adj. (1) కుడిచేతివైపు; దక్షిణ; (2) కుడిచేతి వాటం; (3) అనుశంఖ; శంఖం యొక్క మట్టం నుండి శిఖరానికీ వెళ్లేటప్పటి సర్పిలాకృతి; (ant.) sinistral;
- dextro, adj. దక్షిణ; కుడిచేతివైపు; కుడిచేతివాటపు;
- dextrose, n. [chem.] దక్షిణోజు; కుడిచేతివాటపు చక్కెర; గ్లూకోజు; C6H12O6;
- Dhaba, n. [Ind. Engl.] ధాబా; (note) India's version of cash-n-carry fast food restaurant;
- dharma, n. [Ind. Engl.] ధర్మం; (note) Hindu/Buddhist moral code of conduct
- dhobi, n. [Ind. Engl.] చాకలి; రజకుడు; బట్టలు ఉతికే మనిషి; (note) launderer; washerman; a person who washes and irons clothes;
|width="65"|
|- |- |}
Part 2: di-dz
నిర్వచనములు | ఆసక్తికర చిత్రములు | |||
---|---|---|---|---|
రుగ్మతలు పుట్టువ్యాధులు. ఈ రుగ్మతలు అవయవ నిర్మాణ లోపాలు, అవయవ కార్యనిర్వహణ లోపాలు, జీవ రసాయనాల ఉత్పత్తి లోపాలు, లేక జీవప్రక్రియ లోపాలు వలన కలుగుతాయి; ఇది తల్లిదండ్రులనుండి వంశపారంపర్యంగా సంక్రమించేది కాదు;
పొడచూపక ఆ తరువాత ఎప్పుడో కనిపించవచ్చును;
|
మూలం
- V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2