నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added), published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: Ea-Em

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • E, e, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో అయిదవ అక్షరం; (2) ఒక విటమిన్ పేరు;
  • E. O. n. పా. పె.; పారుపెత్తందారు; Executive Officer;
  • each, adj. ప్రతిఒకటి; ప్రతిఒకరు; ప్రతిఒక; తలా; తలా ఒక; చెరి;
    • half each, ph. చెరి సగం;
    • one each, ph. తలా ఒక; చెరి ఒక; (note) తలా ఒక is used when the number of recipients is more than two and చెరి ఒక when the number of recipients is two;
  • eager, adj. ఆత్రుత; లాలస; సంతోషంతో ఎదురు చూడు; see also anxious;
  • eagerness, n. ఆత్రుత; తమకం; లాలసం; కుతి;
  • eagle, n. డేగ; గూళి;
  • eaglet, n. గూళి పిల్ల;
  • eagle wood, n. అగరు చెట్టు;
  • ear, n. (1) చెవి; కర్ణం; వీను; జునుగు; (2) పొత్తు; కంకి; వెన్ను; బీజమంజరి;
    • ear of corn, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న కంకి;
    • ear canal, ph. కర్ణ రంధ్రం; శ్రవణ కుహరం; శ్రవణ రంధ్రం;
    • ear rings, n. pl. కర్ణభూషణాలు; కుండలాలు; పోగులు; కమ్మలు;
    • ear studs, n. pl. దుద్దులు;
  • eardrum, n. కర్ణభేరి; గూబ;
  • earlier, adj. మునపటి; మునుపు; లోగటి; తొల్లి; తొలి; తొలినాటి;
    • - than now, ph. ఇంతకు మునుపు;
  • earlobe, n. కర్ణలత; తమ్మి; తమ్మె;
  • early, adj. మొదటి;
  • early, adv. పెందలకడనే; మొదట; పెందరాళే; వేగిరం;
  • earmark, v. t. కేటాయించు;
  • earn, v. i. సంపాదించు;
  • earnestness, n. మనస్ఫూర్తి; అత్యాదరం; అక్కర;
  • earnings, n. సంపాదన; ఆర్జన; గణన; (rel.) income;
  • earring, n. తమ్మంటు;
  • Earth, n. భూమి; భూగోళం; భువి; ధర; ధరణి; పృథ్వి; ప్రపంచం; అవని; అవనీ మండలం;

---Usage Note: earth, world, land

  • ---When Earth is discussed as a specific planet or celestial body, it is capitalized: It takes six to eight months to travel from Earth to Mars. When Earth is a proper noun, "the" is usually omitted. When you are talking about the ground or soil as a surface or stratum, then you must lowercase the word: The archaeologists excavated the earth at the site. It is acceptable to leave earth lowercase and use "the" with earth if you are talking about it as the planet we live on: "The earth rotates on its axis. The "world" is a place with people, countries, etc. Use "land" when you compare earth's surface to the ocean.
  • earth, n. మట్టి; మన్ను;
  • earthen, adj. మట్టితో చేసిన; మృణ్మయ; చిళ్ళ;
  • earthenware, n. కుండలు; మట్టితో చేసిన సామాను; మృణ్మయ సామగ్రి; చిళ్ళ;
    • pieces of earthenware, ph. చిళ్ళ పెంకులు;
  • earthly, adj. ఐహుకమైన; సాంసారికమైన;
  • earthly minded, adj. సంసారబంధము కల;
  • earthquake, n. భూకంపం;
  • earthworm, n. ఎర్ర; వానపాము; ఏలిక పాము;
  • earwax, n. గులిమి; గుబిలి;
  • ease, n. సౌలభ్యం; సుఖం; సుళువు; అవలీల;
  • easel, n. ఫలకం; రాత ఫలకం; ముక్కాలి ఫలకం; చిత్రఫలకం;
  • easement, n. సదుపాయపు హక్కు;
  • easily, adv. తేలికగా; సులభంగా; చలాగ్గా; సుళువుగా; సునాయాసంగా; తేరగా;
  • East, n. తూర్పు; తూరుపు; పొడుపు; రేపల; ప్రాచ్యం; సూర్యుడు దూరి వచ్చే దిక్కు;
    • far East, ph. దూర ప్రాచ్యం;
  • easterly, adj. తూర్పు నుండి వచ్చెడు; తూర్పున ఉన్న;
  • eastern, adj. పూర్వ; ప్రాచీన;
  • eastward, adv. పూర్వాభిముఖంగా; తూర్పువైపు;
  • easily, adv. తేలికగా; సులభంగా; చులాగ్గా; తేరగా;
  • easy, adj. తేలికయిన; సులభమయిన; చులాకయిన; సుళువైన;
    • easy chair, ph. పడక కుర్చీ; ఆసందీ;
    • easy going man, ph. పూచాటువాడు;
  • eat, v. i. తిను; భుజించు; ఆస్వాదించు; కుడుచు; మెసవు; సాపడు; ఎంగిలిపడు;
  • eatable, n. తినుభండారం; తినడానికి వీలయినది;
  • eaves, n. చూరు; వాచూరు; పెణక; చేతికి అందొచ్చే ప్రదేశం దగ్గర ఉన్న ఇంటి కప్పు;
  • eavesdrop, n. చూరు చెంత చేరి వినడం; చాటుగా వినడం; చూచాయగా వినడం;
  • ebb, n. ఆటు; క్షీణదశ; ప్రవాహం వెనుకకు పోవుట; (ant.) flow; tide;
  • ebb and tide, ph. ఆటుపోట్లు; పాటుపోట్లు;
  • ebony, n. తుమికి కర్ర; తుమికి చెట్టు; తుమిద; నల్లచేవ; కోవిదారు; తిందుక వృక్షం; ఈ చెట్టుకర్ర నల్లగా ఉంటుంది; [Note] ఈ చెట్టుని తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టుకి బీడీఆకు చెట్టు అనే పేరు ఉంది. [bot.] Diospyros melanoxylon; Diospyros glutimosa Rex; Embryopteris glutinofera Linn;
  • e-book, n. జాలపుస్తకం; అంకకీయ పుస్తకం; a book suitable for reading on a computer only;
  • ebullient, adj. ఉరకలు వేసే; ఉత్సాహపూరితమైన;
  • ebullition, n. పొంగు; పొంగుట; ఉబుకుట;
  • eccentric, adj. విపరీత; అసాధారణ;
  • eccentricity, n. చాదస్తం; పిచ్చి; విపరీత మనస్తత్వం; వైపరీత్యం; అసాధారణత;
  • ecdysis, n. కుబుసం విడచుట; బాహ్యకవచ నిర్మోచనం;
  • echidna, n. సగం స్త్రీ, సగం పాము అయిన వింత కల్పిత జీవి; see also mermaid;
  • echo, n. (ఎకో) ప్రతిధ్వని; ప్రతిఘోష; అనునాదం;
  • echo, v. i. (ఎకో) ప్రతిధ్వనించు; పిక్కటిల్లు;
  • echo, v. t. [comp.] కీఫలకం మీద కొట్టినది తెర మీద కనిపించేలా చేయు;
  • eclectic, adj. విశిష్టమైన; నాణ్యమైన రకరకాలతో;
  • eclecticism, n. విశిష్టవాదం; the practice of deriving ideas, style, or taste from a broad and diverse range of sources;
  • eclipse, n. గ్రహణం; ఉపరాగం;
    • annular eclipse, ph. కంకణ గ్రహణం;
    • beginning of an eclipse, ph. స్పర్శకాలం;
    • end of an eclipse, ph. మోక్షకాలం;
    • lunar eclipse, ph. చంద్ర గ్రహణం;
    • quarter of an eclipse, ph. పాతిక గ్రహణం; పాదోపరాగం;
    • solar eclipse, ph. సూర్య గ్రహణం;
    • total eclipse, ph. పూర్ణ గ్రహణం; పూర్ణోపరాగం;
    • eclipsing variables, ph. గ్రహణకారక తారలు; ఒక తార చుట్టూ మరొక తార ప్రదక్షిణం చేస్తూ ఒకదానిని మరొకటి అడ్డుకునే చుక్కలు;
  • Eclipta alba, n. [bot.] గుంటకలగర; గుంటగలగర; భృంగ; భృంగరాజ; నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది.
  • ecliptic, n. [astro.] క్రాంతివృత్తం; రవిమార్గం; దాక్షాయణీ చక్రం; భచక్రం; ఆకాశంలో సూర్యుడు పయనించే ఊహామార్గం; భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు ప్రయాణం చేస్తూన్నట్లు కనబడే మహావృత్తం;
    • pole of the ecliptic, ph. కదంబం; రవి మార్గపు అక్షం ఆకాశాన్ని తాకే ఊహాబిందువు;
  • ecology, n. భూగృహశాస్త్రం; ఆవరణశాస్త్రం; జీవావరణశాస్త్రం; ఆశ్రమ శాస్త్రం; జీవులు నివసించే ప్రదేశాల గురించి విచారించే శాస్త్రం; [Gr. oikos = family];
  • e-commerce, n. జాలవాణిజ్యం; The conducting of business communication and transactions over networks and through computers;
  • economic, adj. ఆర్థిక; అర్థశా సంబంధమయిన; లాభసాటి;
    • economic blockade, ph. ఆర్థిక దిగ్బంధం;
    • economic boom, ph. ఆర్థిక విజృంభణ;
    • economic crisis, ph. ఆర్థిక వైషమ్యం;
    • economic depression, ph. ఆర్థిక మాంద్యం;
    • economic exploitation, ph. ఆర్థిక దోపిడీ;
    • economic holding, ph. లాభసాటి కమతం;
  • economical, adj. పొదుపైన; పోడిమి అయిన; మితవ్యయ సంబంధమైన; దుబారా చెయ్యని;
  • economically, adv. పొదుపుగా; పోడిమిగా; మితవ్యయంతో;
  • economics, n. ఆర్థిక శాస్త్రం; అర్థశాస్త్రం;
  • economize, v. t. పొదుపుచేయు; మితవ్యయం చేయు; పోడిమిగా జరుపుకొను;
  • economy, n. (1) ఆర్థిక పరిస్థితి; (2) పొదుపు; మితవ్యయం; (3) సంక్షిప్తత; క్లుప్తత; లాఘవం;
  • ecstasy, n. మహదానందం; దివ్యానుభూతి; పరవశత; ఆనందంతో పరవశించడం;
  • ecstatic, adj. ఆనందభరితమైన; పరవశమైన; మైమరచిన;
  • ecto, pref. బహిర్; బాహ్య; బయటి;
  • ectoderm, n. [bio.] బహిశ్చర్మం; బయటి చర్మపు పొర;
  • ectomorph, n. బక్కపలచని వ్యక్తి; సన్నటి శరీరం గల వ్యక్తి; పొడుగాటి కాళ్ళు చేతులు, సన్నటి కాళ్ళు, చేతులు, ఛాతీ, భుజస్కందాలు ఉన్న శరీరతత్వం;
  • ectoparasite, n. [bio.] బాహ్య పరాన్నజీవి; బాహ్య పరాన్నభుక్కి;
  • ectoplasm, n. [bio.] బహిర్‌ప్రసరం;
  • eczema, n. గజ్జి;
  • eddy, n. సుడి; ఆవర్తం; (rel.) సుడిగుండం;
    • eddy current, ph. [phy.] సుడి ప్రవాహం;
  • edema, oedema (Br.) n. [med.] నీరు పట్టడం; వాచడం; వాపు; చీయతం; శరీర ధాతువులలో ద్రవం చేరుట; see also dropsy;
  • Eden, n. నందనవనం; బైబిల్ లో ఏడం అనే వ్యక్తి ఈవ్ అనే అమ్మాయితో ఇటువంటి తోటలో ఉంటాడు;
  • edge, n. అంచు; మొన; గట్టు; ఉపాంతం; కోటి; వోర; ధార; కొంగు; చెరగు; అంచలం;
    • twin edge, ph. కోటి యుగము; కోటి యుగ్మము;
    • edge computing, ph. కొంగు కలనం;
    • edge of clothing, ph. చేలాంచలం;
  • edgewise, adv., ఓరవాటుగా; పక్కవాటుగా;
  • edible, adj. భోజ్య; ఆస్వాదనీయ; తినదగిన; భక్షించదగిన’ ఖాద్యమైన; ఖాదీ;
    • edible oil, ph. ఖాద్య తైలం;
  • edible, n. భోజ్యం; భోజ్యపదార్థం; భోక్తవ్యం; ఆస్వాదనీయం; ఆభ్యవహారికం; తినదగిన; తినడానికి వీలయినది; భక్షించదగిన’ ఖాద్యమైనది; ఖాదీ;
    • non-edible, ph. అభోజ్యం;
  • edict, n. శాసనం; ఆజ్ఞ;
  • edifice, n. దివ్యభవనం; భవంతి; కట్టడం; దొడ్డ ఇల్లు;
  • edit, v. t. సరిదిద్దు; కూర్చు; గ్రంథాన్ని కాని, సినిమాని కాని కూర్చు;
  • editing, n. కూర్పు; కూర్చడం; సవరించడం; అచ్చు వెయ్యడానికి గ్రంథముని సవరించడం; విడుదల అయేముందు సినిమా భాగాలని కూర్చి కథ నడిచే తీరుని తీర్చి దిద్దడం;
  • edition, n. కూర్పు; ముద్రణకై చేసిన కూర్పు;
    • first edition, ph. మొదటి కూర్పు;
  • editor, n. (1) సంపాదకుడు; పత్రికాధిపతి; పరిష్కర్త; (2) కూర్పరి; (rel.) publisher;
    • copy editor, ph. ప్రతి సంపాదకుడు
    • managing editor, ph. నిర్వాహక సంపాదకుడు; నిర్వాహక పరిష్కర్త;
  • editorial, n. సంపాదకీయం;
    • editorial section, ph. సంపాదకీయ విభాగం;
  • educate, v. t. విద్యనేర్పు; విద్యాబుద్ధులు గరుపు; చదివించు;
  • educated, adj. విద్యనేర్చిన; చదువుకున్న;
  • education, n. విద్య; చదువు; చదువు సంధ్యలు; శిక్ష; శిక్షా విధానం;
    • adult education, ph. వయోజన విద్య;
    • continuing education, ph. నిరంతర విద్య;
    • formal education, ph. నియత విద్య;
    • informal education, ph. అనియత విద్య;
  • educator, n. m. అధ్యాపకుడు; విద్య నేర్పువాడు; విద్య నేర్పే వ్యక్తి;
  • eel, n. పాములా ఉండే చేప; మలుగు చేప; బుక్కడం; కొమ్ముచేప; గడ్డిపాము; దుండు పాము; పాపమీను; తవుటిపాము;
  • effect, n. గుణం; ఫలం; ప్రభావం; పర్యవసానం; నైమిత్తికం; స్పందన; see also affect;
  • effective, adj. సఫలమైన; సార్థకమైన; ఉపయోగపడే; ప్రభావశీల;
  • efferent, adj. బహిర్ముఖ; బహిర్వాహియైన; అపవాహి; మోటార్; ఒక కేంద్రము నుండి బయటకి తీసుకుని వెళ్లే:
    • efferent neurons, ph. బహిర్ముఖ నాడులు; అపవాహి నాడులు; ఒక కేంద్రము నుండి బయటకి (అవయవాల వైపు) తీసుకుని వెళ్లే నాడులు: వీటినే మోటార్ నాడులు అని కూడా అంటారు;
  • effervescence, n. పొంగు; ఉద్రేకము;

---Usage note: efficacy, efficiency, effectiveness

  • ---While efficacy has to do with whether or not something is able to be done at all, efficiency has to do with how something is done and whether or not it is done without much waste, effort, or time. Efficacy, in the health care sector, is the capacity of a given intervention under ideal or controlled conditions. Effectiveness is the ability of an intervention to have a meaningful effect on patients in normal clinical conditions. Efficiency is doing things in the most economical way.
  • efficacy, n. ప్రయోజనం; ఫలోత్పాదన; గుణం చెయ్యగలిగే శక్తి; కావలసిన ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి; Efficacy is getting things done. It is the ability to produce a desired amount of the desired effect, or success in achieving a given goal.
  • efficiency, n. సమర్ధత; సామర్ధ్యం; దక్షత; ఫలోత్పాదక శక్తి; త్రాణ; Efficiency is doing things in the most economical way. It is the ratio of the output to the inputs of any system (good input to output ratio).
  • efficient, adj. (1) నిమిత్త; (2) సమర్ధవంత; ప్రయోజనకరమైన;
    • efficient cause, ph. (1) [logic] నిమిత్త కారణం; (2) [phil] విశ్వసౌధపు నిర్మాత; (rel.) Material Cause = ఆ విశ్వాన్ని నిర్మించిన పదార్థపు నిర్మాత;
    • efficient tool, ph. నిమిత్త మాత్రం;
  • effigy, n. మనిషి ఆకారంలో బొమ్మ; ప్రతిమ; పటం;
  • efflorescent, adj. పూసిన; పుష్పించిన;
  • effluent, adj. బయటకు వచ్చే; ఉత్పన్నమైన; నిర్గతమైన; నిసృతమైన;
  • effluent, n. మురికి; మురికి జలం; బయటకు పోయే మురికి ద్రవం;
  • effort, n. కృషి; పరిశ్రమ; యత్నం; ప్రయత్నం; పురుష ప్రయత్నం; పౌరుషం; ఎత్తికోలు; గురణం; ఉద్యతి; ఉద్యోగము; పూనిక;
    • exhaustive effort, ph. అనుశీలన;
    • non-stop effort, ph. అనుశీలన;
  • effortless, adj. అయత్న; అప్రయత్న; యత్నరహిత; కృషిమాలిన; సహజ;
  • effortlessly, adv. సునాయాసంగా; అనాయాసంగా; అవలీలగా; అప్రయత్నంగా;
  • effulgence, n. దృశానం; తేజం; ప్రకాశం;
  • effulgent, adj. దేదీప్యమానమైన; కాంతివంతమైన;
  • effused, adj. కారిన; స్రవించిన;
  • egalitarianism, n. అర్థసమానత్వం; సమతావాదం;
    • egalitarian society, ph. సమసమాజం;
  • egg, n. అండం; గుడ్డు;
    • egg cluster, ph. ఈపి కట్టు; esp. cluster of insect eggs floating on water;
    • primeval egg, ph. బ్రహ్మాండం; ఆద్యాండం;
    • solidified egg, ph. పొరటు;
    • white of an egg, ph. అండశ్వేతం; పచ్చ సొన;
    • yellow of an egg, ph. అండపీతం; తెల్ల సొన;
  • ego, n. అహం; అహంకారం; దాష్టికం; గర్వం; ఆస్మితం; తిమురు;
  • egoism, n. స్వాతిశయం; "Egoism" is a preoccupation with oneself, but not necessarily feeling superior to others
  • egotism, n. అహంభావం; దురభిమానం; దాష్టికం;
  • egotist, n. దురభిమాని; అహంకారి; ఇతరుల కంటె తనే అధికుడననే (అందగాడిననే) భావం; The egotist feels superior to others physically, intellectually or in some other way.
  • egregious, adj. అతిశయించిన; శృతిమించిన; మితిమీరిన;
    • egregious blockhead, ph. శుద్ధ మూఢుడు;
  • egress, n. (1) బయటకుపోయే దారి; (2) బయటకి వెళ్లడం;
  • egret, n. తెల్లకొంగ; తెలికొంగ; see also heron
  • eight, n. ఎనిమిది; ఇరునాలుగు; అష్టకం;
  • eighteen, n. పద్ధెనిమిది; పదునెనిమిది; అష్టాదశం;
  • eighteenth, n. పద్ధెనిమిదివ; అష్టాదశ;
  • eighth, adj. ఎనిమిదవ; అష్టమ;
  • eighth, n. (1) ఎనిమిదవది; అష్టమం; (2) ఎనిమిదవ వంతు;
  • eighty, n. ఎనభై; ఎనుబది;
  • either, pron. ఇదైనా, అదిఅనా; రెండింటిలో ఒకటి;
  • either, adv. అయినా;
  • eject, v. t. నెట్టు; గెంటు; బయటకి తోయు;
  • eke, v. i. చాలీచాలని వనరులతో సర్దుబాటు చేసుకొను;
  • ekphrasis, n. విఖ్యాపన; the use of detailed description of a work of visual art as a literary device;
  • elaboration, n. (1) విపులీకరణ; విశదీకరణ; (2) నెరవిలి; సంగీతంలో ఒక రాగాన్ని పలువిధములుగా నెరవిలి చేసి పాడడం; రాగం, తానం, నెరవిలి, కల్పనస్వరం, పల్లవి అనే భాగాలు సంగీత కచేరీలో తప్పనిసరి అంశాలు;
  • elapsed, adj. గడచిన; భుక్తి అయిన; అతిక్రమించిన;
    • elapsed time, ph. భుక్తి అయిన కాలం;
  • elastic, adj. ప్రత్యాస్థ; స్థితిస్థాపక గుణం కల;
  • elevator, n. ఎత్తుబండి;
  • either, adj. రెండింటిలో ఒకటి;
  • ejaculate, v. i. వెలిగక్కు; స్కలించు; వీర్యమును జార్చు;
  • ekphrasis, n. విఖ్యాపన; the use of detailed description of a work of visual art as a literary device;
  • elaborate, v. i. వివరించు; విస్తరించు; విశదీకరించు; విడమర్చి చెప్పు;
  • elapsed, v. i.గతించిన; జరిగిన; గడచిన;
  • elasticity, n. ప్రత్యాస్థత; స్థితిస్థాపకత;
  • elate, v. i. సంబరపడు; ఆనంద పడు;
  • elation, n. సంబరం; హర్షం; ఉల్లాసం; ఆనందం;
  • elbow, n. మోచేయి; కపోణి;
  • elbow, v. t. మోచేతితో పొడుచు;
    • elbow joint, ph. మోచేతి కీలు; కూర్పర సంధి;
    • elbow room, ph. ఇటూ, అటూ కదలాడడానికి చోటు;
  • elder, adj. పెద్ద; కుల పెద్ద; జ్యేష్ఠుడు;

---Usage Note: elder, older

  • ---Use elder to talk about members of a family. Use older to compare the age of people or things.
  • elderly, n. పెద్దవారు; వయోధికులు; వృద్ధులు;
  • elders, n. (1) పెద్దవారు; గరువలు; (2) వయోధికులు; వృద్ధులు;
  • eldest, adj. జ్యేష్ఠ;
  • elect, v. t.ఎన్నుకొను; కోరుకొను; ఏర్చుకొను;
  • election, n. ఎన్నిక;
    • election manifesto, ph. ఎన్నికల ప్రణాళిక;
    • electoral college, ph. నియోజక గణం;
    • electoral roll, n. ఓటర్ల జాబితా;
  • electorate, n. s. నియోజకవర్గం; ఓటర్లు;
  • electric, adj. విద్యుత్; మెరపు;
    • electric current, ph. విద్యుత్ ప్రవాహం;
    • electric motor, ph. విద్యుత్ చాలకం;
    • electric shock, ph. విద్యుత్ ఘాతం;
    • electric spark, ph. విద్యుత్ చెణుకు; విద్యుత్ విస్ఫులింగం;
    • electric train, ph. మెరపు రైలు;

---Usage Note: electric, electrical, electronic

  • ---Use electric as an adjective before the names of things that need electricity to work. Use electrical as a generic word to talk about people and their work: Electrical Engineer. The major difference between electrical and electronic devices is that the electrical devices convert the electrical energy into other forms of energy like heat, light, sound, etc. whereas the electronic device controls the flow of electrons for performing the particular task.
  • electrical, adj. విద్యుత్;
    • electrical charge, ph. విద్యుత్ ఆవేశం;
    • electrical energy, ph. విద్యుత్ శక్తి;
    • electrical grid, ph. విద్యుత్ వలయం;
    • electrical induction, ph. విద్యుత్ ప్రేరణ;
    • electrical potential, ph. విద్యుత్ పీడనం;
    • electrical power, ph. విద్యుత్ పాటవం;
    • electrical shock, ph. విద్యుత్ ఘాతం;
  • electricity, n. విద్యుత్తు;
    • atmospheric electricity, ph. వాతావరణ విద్యుత్తు;
    • positive electricity, ph. ధన విద్యుత్తు;
    • negative electricity, ph. రుణ విద్యుత్తు;
    • static electricity, ph. స్థిర విద్యుత్తు;
  • electrification, n. విద్యుదీకరణం; విద్యుత్పూరణం;
  • electrode, n. విద్యుద్ధండం; విద్యుత్‌పాళా;
  • electrodynamics, n. విద్యుత్ చలనం; విద్యుత్ గతిశాస్త్రం;
  • electrolyte, n. విద్యుత్ విశ్లేష పదార్థం; a liquid or gel that contains ions and can be decomposed by electrolysis, e.g., that present in a battery; the ionized or ionizable constituents of a living cell, blood, or other organic matter;
  • electromagnet, n. విద్యుదయస్కాంతం; విద్యుత్ చుంబకం;
    • electromotive force, ph. విద్యుత్‍చాలక బలం; The EMF is the measure of energy supply to each coulomb of charge, whereas the voltage is the energy use by one coulomb of charge to move from one point to another; The EMF is generated by the electrochemical cell, dynamo, photodiodes, etc., whereas the voltage is caused by the electric and magnetic field;
  • electrophilic, adj. [biol.] విద్యుత్ మిత్రత్వ;
  • electron, n. ఎలక్ట్రాను; అణువులో కెంద్రకం చుట్టూ పరిభ్రమించే రుణావేశపు మేఘం;
  • electronic, adj. వైద్యుత;
    • electronic circuit, ph. వైద్యుత వలయం;
  • electrostatic, adj. స్థిరవిద్యుత్‌;
    • electrostatic precipitator, ph. స్థిరవిద్యుత్‌ అవక్షేపకి; వాయువుల నుండి దుమ్ము, ధూళి, కల్మషాలు, వగైరాలని వడబోసి, విడదీసే పరికరం;
  • electuary, n. లేహ్యం; తేనెతో కాని, మరేదయినా తీపి పదార్థంతో కాని కలిపిన మందు;
  • elegy, n. సంస్మరణగీతం; శోకగీతిక; ఎలిజీ;
  • element, n. (1) మూలకం; ధాతువు; (2) అంశం; భాగం; ఘటిక; (3) భూతం;
    • chemical element, ph. రసాయన మూలకం; రసాయన ధాతువు;
    • formed element, ph. సాకార ధాతువు; రక్తంలో కనిపించే ఆకారం ఉన్న ధాతువులు;
    • formless element, ph. నిరాకార ధాతువు; రక్తంలో ఉండే ఆకారం లేని ధాతువులు;
    • heavy element, ph. గురు ధాతువు; గురు మూలకం;
    • rare-earth element, ph. విరళ మృత్తిక మూలకం;
    • trace element, ph. లేశ ధాతువు; లేశ మూలకం;
  • elemental, adj. ఆదిమ; ప్రథమ; ఆదిభూతమైన;
  • elementary, adj. ప్రారంభ; ప్రాథమిక; తేలికయిన;
    • elementary education, ph. ప్రాథమిక విద్య;
    • elementary particles, ph. ప్రాథమిక రేణువులు;
    • elementary school, ph. ప్రాథమిక పాఠశాల;
  • elephant, n. ఏనుగు; కరి; కరటి; దంతి; గజము; సామజం; కుంజరం; ద్విరదం; మాతంగం; వేదండం; నాగం;
    • elephant herd, ph. ఏనుగుల గుంపు; వేదండ తండం;
  • elephant-apple, n. వెలగ;
  • elephantiasis, n. బోదకాలు;
  • elevate, v. t. లేవనెత్తు; పైకెత్తు; వృద్ధిలోనికి తెచ్చు;
  • elevated, adj. పైకి ఎత్తిన; ఉన్నతమైన; ఘనమైన; సముక్షిప్త;
  • elevation, n. (1) ఎత్తు; ఉన్నతి; ఔన్నత్యం; (2) నిషా; మత్తు;
  • elevator, n. సముక్షిప్తి; పైకి లేవనెత్తేది;
  • eleven, n. పదకొండు; పదునొకటి; ఏకాదశం;
  • eleventh, adj. పదకొండవ; ఏకాదశ;
  • elicit, v. t. రాబట్టు; పీకు; లోపలి నుండి పైకి లాగు;
  • eligibility, n. యోగ్యత; అర్హత; ఉపయుక్తత;
  • eliminate, v. t. తొలగించు; పరిహరించు; పారదోలు;
  • elimination, n. బహిష్కరణ; విలోపన; ఒక ప్రదేశం నుండి పారదోలడం;
  • elision, n. [ling.] శబ్ద లోపం; ఒక మాటని ఉచ్చరించేటప్పుడు అన్ని అక్షరాలని పలకకుండా మింగేయడం; ఇంగ్లీషులో అయితే have not కి బదులు haven't అనడం, going to కి బదులు gonna అనడం వంటివి;
  • elite, n. pl. శిష్టులు; శిష్టజనులు; విద్య వల్ల కాని, ధనం వల్ల కాని సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు;
  • elk, n. కణుజు; దుప్పి;
  • ellipse, n. (1) దీర్ఘవృత్తం; (2) శబ్దలోపం; వాక్యలోపం;
  • ellipsis, n. అధ్యాహారం; వాక్యాన్ని మధ్యలో ఆపేసినప్పుడు, ఆ తర్వాత పెట్టే చుక్కలు;
  • elongate, v. t. పొడిగించు; సాగదీయు; లాగు;
  • elongated, adj. సోగ; కోల; పొడుగైన;
    • elongated eyes, ph. సోగ కన్నులు; సోగ కళ్ళు;
  • eloquence, n. వాగ్‌ధాటి; వాగ్ధాటి;
  • else, adv. లేకుంటే; లేకపోతే; కాకుంటే; కాకపోతే;
  • elsewhere, adv. ఇతరత్రా; అన్యత్ర; మరొకచోట; మరెక్కడయినా; see also otherwise;
  • elucidate, v. t. విశదీకరించు; విశదపరచు; వివరించు; తేటపరచు;
  • elude, v. t. తప్పించుకొను; ఏమార్చు; అర్ధం కాకుండా తప్పించుకొని పోవు; అందుబాటులో లేకుండా పోవు;
  • elysian, adj. స్వర్గతుల్యమైన;
  • emaciated, adj. కృశించిన; బాగా చిక్కిన; బాగా నీరసపడిన; ఎండిపోయిన;
  • e-mail, n. విద్యుల్లేఖ; వి-టపా; వేగు;
  • emanate, v. i. పుట్టు; బయటకు వచ్చు;
  • emancipation, n. (1) విమోచన; దాస్య శృంఖలాల నుండి విముక్తి; (2) విముక్తి; ఆపవర్గం;
  • embankment, n. కట్ట; కరకట్ట; గట్టు; రోధస్సు; మడవ;
  • embargo, n. నిరోధాజ్ఞ;
  • embark, v. t. (1) ఎక్కు; ఓడ ఎక్కు; (2) ప్రారంభించు; మొదలు పెట్టు;
  • embassy, n. దౌత్యాలయం; రాయబారి కార్యాలయం;
  • embed, v. t. పొదుగు; తాపడం చేయు; సంస్తరించు;
  • embedded, adj. సంస్తరిత; పొదుగబడ్డ; తాపడం చేయబడ్డ;
  • embedding, n. సంస్తరించడం; పొదుగడం; తాపడం చేయ్యడం;
    • invariant embedding, ph. [math.] కూటస్థ సంస్తరణ: కూటస్థ తాపడం;
  • embellish, v. t. అలంకరించు;
  • embellishment, n. పసదనం; అలంకారశోభ;
  • ember, n. కణకణలాడే నిప్పు బొగ్గు;
  • embers, n. pl. నివురు; కాలే బొగ్గులపై నుసి; మంట మండడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన వేడి వేడి అవశేషాలు;
  • embezzled, adj. అపహరించిన; తినేసిన; స్వామిద్రోహం చేసి దొంగిలించిన;
  • Emblic myrobalan, n. [bot.] పెద్ద ఉసిరి; అమలకం; (ety.) ఎంబ్లికా అన్న మాటకి మూలం సంసృతంలోని ఆమ్లం;
  • Emblica officinalis, n. [bot.] పెద్ద ఉసిరి; అమలకం; (ety.) అఫిసినేలిస్ అంటే ఉపయోగపడేదీ, దుకాణాలలో దొరికేదీ అని అర్థం;
  • Emblica ribes, n. [bot.] విడంగాలు;
  • embodied, adj. మూర్తీకరించిన; మూర్తించిన; దేహి అయిన;
  • embodiment, n. మూర్తిత్వం;
  • embody, v. i. మూర్తీభవించు;
  • embrace, n. ఆలింగనం; పరిరంభం; కౌగిలి;
  • embrace, v. t. ఆశ్లేషించు; ఆలింగన చేయు; కౌగలించు;
  • embroidery, n. బుట్టా; బుటేదారీ; బట్ట మీద పువ్వులు వేసి కుట్టడం;
  • embryo, n. (ఎంబ్రయో) పిండం; అంకురం; భ్రూణం; అర్భకం; కలలం; 5 వ వారం నుండి 10 వ వారం వరకు కడుపులో పిల్ల;
  • emerald, n. పచ్చ; గరుడపచ్చ; మరకతం; నవరత్నాలలో నొకటి; (ety.) from "Prakrit maragada;" a bright green, transparent precious stone; a green variety of beryl;
  • emerge, v. i. వెలువడు; బయటపడు;
  • emergence, n. వెలువరింత; ప్రాదుర్భావం; జననం; ఉత్పన్నత;
    • sudden emergence, ph. హఠాదుత్పన్నత;
  • emergency, adj. ఆత్యయిక; ఆపద్ధర్మ; సంకట;
    • emergency ward, ph. ఆత్యయిక వైద్యశాల; ఆపద్ధర్మ వైద్యశాల; సంకటశాల;
  • emergency, n. అత్యవసరం; సంకటకాలం; ఆత్యయిక పరిస్థితి;
    • emergent behavior, ph. హఠాదుత్పన్న ప్రవర్తన; behavior that arises when components of a system are combined, but are not present in the individual components themselves. Emergent properties are a key part of the idea that the whole is greater than the sum of its parts. This means that the properties of a whole cannot be determined by adding or averaging the properties of its individual components;
  • emeritus professor, ph. గౌరవ ఆచార్యుడు; వానప్రస్థ ఆచార్యుడు; మాజీ ఆచార్యుడు;
  • emetic, n. వమనకారి; వాంతిని కలుగచేసే మందు;
  • emia, suff. ఒక ఇంగ్లీషు మాట చివర ఈ ప్రత్యయం వస్తే, ఆ మాట రక్త దోషాన్ని సూచిస్తుంది; ఉదా : ఎనీమియా; లుకీమియా, మొ॥
  • emigrant, n. ప్రోషితుడు; ఇతర దేశాలకి వలస పోయిన వ్యక్తి;
  • emigrate, v. i. వలస పోవు; ఒకరు తామున్న దేశాన్ని వదలి పెట్టి మరొక దేశానికి వలస పోవడం;

---Usage Note: emigrate, immigrate, migrate

  • ---Use emigrate to talk about people who have left their country in order to live in another country. Use immigrate to talk about people who are entering a country. Use migrate to talk about birds and animals that go to another part of the world for spring, for calving, or for food.
  • emigration, n. పోవలస; ప్రోషితం;
  • eminence, n. ఘనత;
    • eminent scholar, ph. విశారదుడు; ప్రవీణుడు;
  • emissary, n. దూత; రాయబారి;
  • emission, n. ఉద్గమం; ఉద్గమనం; ఉద్గతం; ఉద్గారం; త్రేనుపు; కక్కు;
    • emission of light, ph. కాంత్యుద్గమం;
    • emission spectrum, ph. ఉద్గమన వర్ణమాల;
    • nocturnal emission, ph. స్వప్నస్ఖలనం;
    • spontaneous emission, ph. యాదృచ్చిక ఉద్గమనం;
    • stimulated emission, ph. ప్రేరేపిత ఉద్గమనం;
  • emit, v. i. ఉద్గారించు; బయటకు పంపు; వెలిగక్కు; వెల్వరించు; వెలార్చు;
  • emmet, n. చీమ; పిపీలికం; ఇది ఇంగ్లండులో వాడుకలో ఉన్న ఒక ప్రాంతీయ పదం;
  • emoji, n. (Japanese) e = picture, moji = character; బొమ్మతో అక్షరాన్ని సూచించడం; బొమ్మతో భావాన్ని సూచించడం;
  • emolument, n. ప్రతిఫలం; వేతనం; జీతం;
 
Emoticon_Smile_Face
  • emoticon, n. ఆర్తిమూర్తి; an emoticon (= emotion + icon) is a pictorial representation of a facial expression using characters, such as punctuation marks, numbers, and letters, to express a person's feelings, mood or reaction;
  • emotion, n. ఉద్రేకం; ఉద్వేగం; ఆవేశం; ఆర్తి; భావోద్వేగం; భావావేశం;
    • dominant emotion, ph. స్థాయీ భావం;
    • responsive emotion, ph. సాత్విక భావం;
    • transitory emotion, ph. సంచార భావం;
  • emotional, adj. ఉద్రేకపూరిత; ఉద్వేగాత్మక; ఉద్వేగవంత;
  • emote, v. i. నటించు; ఆవేశంతో నటించు; అతిగా నటించు;
  • empathy, n. సహానుభూతి; మరొక వ్యక్తి ఆలోచనలతోటీ, సంవేదనలతోటీ, అనుభూతులతోటీ ఏకత్వం చెందటం;
  • emperor, n. m. సమ్రాట్టు; చక్రవర్తి; సార్వభౌముడు; రారాజు;
  • emphasis, n. ఉద్ఘాటన;
  • emphasize, v. t. ఉద్ఘాటించు;
    • emphatic particle, ph. [gram.] అవధారణార్థకం;
  • emphysema, n. ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోళములు అత్యధికముగా ఉబ్బిన స్థితి;
  • empire, n. సామ్రాజ్యం;
  • empirical, adj. ప్రయోగసిద్ధ; అనుభవోత్పన్నమైన; అనుభావిక; అనుభవ; పామర; సాంఖ్య;
    • empirical formula, ph. [chem] (1) సాంఖ్యక్రమం; ఒక బణువులో ఏయే అణువులు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పేది; ఉదా. CH4; (2) అనుభవ సూత్రం; పామర సూత్రం;
    • empirical knowledge, ph. అనుభావిక జ్ఞానం;
    • empirical principe, ph. అనుభవోత్పన్నమైన సూత్రం;
  • empiricism, n. అనుభవవాదం; అనుభవైకవాదం; అనుభవజ్ఞానం; జాన్ లాకీ వంటి తత్త్వవేత్తలు ప్రతిపాదించిన వాదం; dependence on one's practical experience alone;
  • employee, n. ఉద్యోగి; ఉద్యోగస్థుడు; పని చేసేవాడు; జీతగాడు; కొలువరి;
  • employer, n. నియోగి; యజమాని; పని ఇచ్చేవాడు;
  • employment, n. పని; నౌకరీ; ఉద్యోగం;
    • candidate for employment, ph. ఉద్యోగార్థి;
  • empowerment, n. అధికారాన్ని ఇవ్వడం; పెత్తనాన్ని ఇవ్వడం;
  • empress, n. f. సామ్రాజ్ఞి; చక్రవర్తిని;
  • empty, adj. ఖాళీ; లొటారం; రిక్త; రిత్త; ఉత్త; శూన్య;
  • empty, n. ఖాళీ; లొటారం; రిక్తం; శూన్యం; లేబరం;
  • emulation, n. (1) అహంపూర్వికం; ఇతరులతో సమానత్వం, ఆధిక్యత, సాధించటానికి చేసే ప్రయత్నం; (2) అనుకరణం; ఒక కలనయంత్రం మీద మరొక కలనయంత్రపు స్వభావాన్ని ప్రతిసృష్టి చెయ్యటం;
  • emulsion, n. తరళపదార్థం; తరళం; పయస్యం; అవలేహం; a fine dispersion of minute droplets of one liquid in another in which it is not soluble or miscible;

Part 2: En-Ez

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • enact, v.t. అనుశాసించు; శాసనం అమలులలో పెట్టు;
  • enamel, n. (1) పింగాణి; (2) దంతిక; పంటిపై నిగనిగలాడే తెల్లటి పదార్థం;
  • en bloc, n. (ఆన్ బ్లాక్) మూకుమ్మడిగా;
  • encampment, n. శిబిరం;
  • encephalitis, n. [med.] మెదడు వాపు; మస్తిష్క శోఫ;
  • enchanted, adj. అభిమంత్రించబడ్డ; మంత్రానికి కట్టుబడ్డ; మంత్రముగ్ధుడైన; ఉల్లసించిన; ఆనందభరితుడైన;
  • encircle, v. t. చుట్టుముట్టు; చుట్టుకొను; పరివేష్టించు;
  • enclosure, n. (1) ప్రావృతం; ప్రావృత పత్రం; కవరులో పెట్టిన ఉత్తరం; (2) ప్రాంగణం; ప్రావృత ప్రదేశం;
  • encode, v. t. సంకేతించు;
  • encomium, n. పొగడ్త; స్తుతి; ప్రశంస;
  • encompass, v. t. ఆవరించు; చుట్టుకొను; పరివేష్టించు;
  • en core, n. (ఆన్ కోర్) మరొక్క సారి; once more;
  • encounter, n. (1) తారసం; తటస్థపాటు; అనుకోని సమావేశం; (2) సంఘర్షణ; కొట్లాట;
  • encounter, v. i. తారసపడు; కలుసుకొను; తటస్థపడు; దాపరించు;
  • encounter, v. t. ఢీకొను; ఎదుర్కొను; కలహించు;
  • encourage, v. t. ప్రోత్సహించు; పురికొలుపు; ప్రేరేపించు;
  • encouragement, n. ప్రోత్సాహం; ప్రోద్బలం; ప్రేరణ;
  • encouraging, adj. ఆశాజనక; ప్రోత్సాహకారక;
  • encroach, v. t. ఆక్రమించు; అతిక్రమించు;
  • encroachment, n. కబ్జా; ఇతరుల లేదా ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఆక్రమించటం;
  • encrust, v. i. పెచ్చు కట్టు;
  • encrypt, v. t. గుప్తీకరించు; రహశ్యలిపిలో రాయు;
  • encumbrances, n. బాధ్యతలు; బరువులు;
  • encyclopedia, n. విజ్ఞాన సర్వస్వం; సర్వశాస్త్ర సముచ్చయం;
  • end, v. t. పూర్తిచేయు; కోసముట్టించు; ముగించు;
  • end, n. (1) అంతు; చివర; కొస; కొన; తుద; ముగింపు; (2) మరణం; చావు;
    • the very end, ph. చిట్టచివర; కొట్టకొన; తుట్టతుద;
  • endearingly, adv. గోముగా;
  • endeavor, n. ప్రయత్నం; ఎత్తికోలు;
  • endemic, adj. ప్రాంతీయ; స్థానీయ; see also epidemic and pandemic;
    • endemic disease, ph. ప్రాంతీయ వ్యాధి; స్థానీయ వ్యాధి; ఒక ప్రాంతంలో పాతుకుపోయిన వ్యాధి; ఏజెంసీ ప్రాంతాలలో మలేరియా ఒక "ప్రాంతీయ వ్యాధి;"
  • ending, n. ముగింపు; అంతం;
  • endless, adj. అనంత; దురంత; నిరంతర; అంతులేని;
    • endless misery, ph. దురంత తాపం;
  • endo, pref. అంతర్; లోపలి;
  • endocarp, n. టెంక;
    • endocrine glands, ph. వినాళ గ్రంథులు; అంతరస్రావ గ్రంథులు;
  • endodermis, n. [anat.] అంతశ్చర్మం;
  • endogamy, n. అంతర్వివాహం; సజాతిలోనే పెళ్ళి చేసుకొనుట;
  • endogenous, adj. అంతర్జనిత;
  • endorse, v. t. (1) సమర్ధించు; బలపరచు; (2) బేంకు కాగితం మీద సంతకం పెట్టు;
  • endospores, n. అంతస్సిద్ధ బీజాలు;
  • endothermic, adj. తాపక్షేపక; ఉష్ణగ్రాహక;
  • endow, v. t. ఇచ్చు; దానమిచ్చు; వరమిచ్చు;
  • endowment, n. ధర్మాదాయం; మాన్యం; శాశ్వత నిధి; శాశ్వతంగా ఆదాయాన్ని ఇచ్చే నిధి;
  • endurance, n. తాలిమి; దమ్ము; సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; ఓరిమి; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత;
  • endure, v. i. మన్ను;
  • endure, v. t. భరించు; సహించు; ఓర్చుకొను;
  • enduring, adj. శాశ్వతమైన;
  • enema, n. వస్తికర్మ; గుద ద్వారం ద్వారా పిచికారీతో లోనికి మందు ఎక్కించడం; (lit.) treatment to the hypogastric part of the body;
  • enemy, n. శత్రువు; వైరి; విరోధి; పగవాడు; పగతుడు; మిత్తి; అరి; పరిపంధి; అరాతి; విపక్ష; జిఘాంసువు; అహితుడు;
  • energetic, adj. శక్తిమంత; ఓజోమయ, OjOmaya
  • energy, n. ఊర్జితం; శక్తి; సత్తువ; ఓజస్సు; (rel.) power; strength;
    • electrical energy, ph. విద్యుత్ శక్తి;
    • heat energy, ph. తాప శక్తి;
    • kinetic energy, ph. గతిజ శక్తి; గతి శక్తి; కదలిక వల్ల సంక్రమించే శక్తి;
    • potential energy, ph. స్థితిజ శక్తి; స్థితి శక్తి; స్థాన శక్తి; గుప్త శక్తి; బీజరూప శక్తి; స్థానం వల్ల సంక్రమించే శక్తి;
    • conservation of energy, ph. శక్తి నిత్యత్వము;
    • Law of conservation of energy, ph. శక్తి నిత్యత్వ సూత్రము;
  • enforce, v. t. జారీ చేయు; అమలులో పెట్టు;
  • engagement, n. (1) యుద్ధం; (2) ప్రధానం; పెళ్ళి చేసుకుందామనే ఒడంబడిక; (note) ఒకే మాటకి రెండు వ్యతిరేకార్ధాలు ఉన్న సందర్భం ఇది;
    • engagement ring, ph. ప్రధానపుటుంగరం; ఉంకుటుంగరం;
  • engine, n. యంత్రం;
  • engineer, n. స్థపతి; యంత్రధారి; యంత్రధారకుడు; యంత్రకారుడు; మరకాను; మరగారి; బిసగారి;
  • engineer, v. t. యంత్రించు;
  • engineering, n. స్థాపత్యం; స్థాపత్యశాస్త్రం; తంత్రం; బిసగారం; బిసకానికం; కీల్కానికం; మరకానకం;
    • electrical engineer, ph. విద్యుత్ స్థపతి;
    • mechanical engineer, ph. యంత్ర స్థపతి;
    • sound engineer, ph. ధ్వని స్థపతి; ధ్వని తంత్రవేత్త; ధ్వని తాంత్రికుడు;
    • sound engineering, ph. శబ్ద స్థాపత్యం; ధ్వని తంత్రం;
  • English, n. (1) ఆంగ్లం; ఇంగ్లీషు; (2) ఇంగిలీసులు; ఆంగ్లేయులు;
  • Englishman, n. ఆంగ్లేయుడు; ఇంగ్లీషువాడు; ఇంగ్లండుకి చెందినవాడు; (note) బ్రిటిష్ వాళ్లు అంతా ఇంగ్లీషు వాళ్లు కాదు;
    • English translation, ph. ఆంగ్లానువాదం;
  • engrave, v.t. చెక్కు; చిత్తరువులు చెక్కు;
  • engraver, n. పోగర; కంసాలి చెక్కడానికి వాడే పరికరం;
  • engulf, v. t. ముంచెత్తు;
  • enigma, n. ప్రహేళిక; పజిలు; పజిల్; తలబీకరకాయ; కైపదం; చిక్కు సమస్య; కుమ్ముసుద్దు; బురక్రి బుద్ధిచెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య;
  • enhance, v. t. అతిశయింపచేయు; పొడిగించు; పెంచు; అభివృద్ధి చేయు; మెరుగు పరచు;
  • enjambment, n. ఒక వాక్యం కాని, సమాసం కాని, పద్యంలో ఒక పాదం నుండి తరువాతి పాదంలోనికి పదాంతంలో విరగకుండా ప్రవహించడం;
  • enjoyment, n. అనుభుక్తి; అనుభూతి; అనుభోగం; ఆహ్లాదం; సంతోషం;
  • enlargement, n. ప్రస్ఫుటం; వికసించినది;
  • enlightenment, n. జ్ఙానోదయం;
  • enlist, v.i. చేరు; v. t. చేర్చు;
  • en mass, adv. (ఆన్ మాస్) మూకుమ్మడిగా; ఓహరిసాహరిగా; ఆలండవలత్తు; ఒక్కుమ్మడి;
  • enmity, n. వైరం; విరోధత్వం; శత్రుత్వం; వైషమ్యం; కంటు; పగ; పోరు; మచ్చరం; విప్రతిపత్తి;
  • enormous, adj. బృహత్తరమైన; పేద్ద;
  • enough, adj. చాలినంత; తగినంత;
  • enough, n. చాలు;
    • not enough, ph. చాలదు; చాలలేదు; సరిపోలేదు; చాలవు;
  • enqueue, v. t. వరుసలో చేర్చు;

---Usage Note: inquiry and enquiry

  • The words inquiry and enquiry are interchangeable. However, it is becoming preferable to use inquiry to denote an investigation, and enquiry to denote a question.
  • enquire, v. i. విచారణ చేయు; దర్యాప్తు చేయు; వాకబు చేయు; అడుగు; కనుక్కొను;
  • enquiry, n. ప్రశ్నించడం; విచారణ; పృచ్ఛ; వాకబు; చర్చిక; దర్యాప్తు; ఆనుయోగం; ప్రశ్నించడం;
  • enraged, adj. క్షుభితం;
  • enroll, v. i. చేరు; లావణములో చేరు;
  • enroll, v. t. చేర్చు; జాబితాలో వేయు; నమోదు చేయు; లావణములో చేర్చు;
  • en route, adv. [Latin] (ఆన్ రూట్) దారిలో; మార్గమధ్యములో;
  • entangle, v. i. చిక్కుకొను;
  • entanglement, n. చిక్కు; మెలిక; సమస్య;
    • quantum entanglement, ph. గుళిక మెలిక; Quantum entanglement is a bizarre, counterintuitive phenomenon that explains how two subatomic particles can be intimately linked to each other even if separated by billions of light-years of space. Despite their vast separation, a change induced in one will affect the other.
  • enter, v. i. ప్రవేశించు; చొరబడు; చొచ్చు; చొచ్చుకొనిపోవు; తూకొను; దూరు; లోనికి వెళ్లు;
  • enter, v. t. దఖలు పరచు; దఖలు చేయు;
  • enteritis, n. ఆంత్రశోఫ; ఆంత్రప్రకోపం; పేగుల వాపు;
  • entertainment, n. వినోదం;
    • entertainment program, ph. వినోద కార్యక్రమం;
  • enthusiasm, n. ఆసక్తి; ఉత్సాహం; ఉత్సుకత; ఔత్సుక్యం; అభినివేశం; వీరావేశం;
  • entice, v. i. వలలో వేసికొను; ఆశ చూపి వంచించు; పుసలాయించు; నయనవంచన చేయు;
  • entire, adj. యావత్తూ; అంతా; సాంతం; పూర్తి; సాకల్య; అఖిల; అశేష;
  • entirely, adv. సాంగోపాంగంగా; సాంతంగా; పూర్తిగా; సాకల్యంగా; అశేషంగా;
  • entitled, n. హక్కుదారు;
  • entitlement, n. హక్కు; అధికారం; లాంఛనంగా రావలసినది; లాంఛనం; ముట్టవలసినది;
  • entomology, n. కీటకశాస్త్రం; [Gr. entoma = insect];
  • entourage, n. పరివారం; బలగం;
  • entrance, n. ప్రవేశం; ద్వారం; గుమ్మం;
    • front entrance, ph. వీధి గుమ్మం; ముఖ ద్వారం;
    • main entrance, ph. సింహ ద్వారం;
    • rear entrance, ph. దొడ్డి గుమ్మం; పెరటి గుమ్మం;
    • entrance fee, ph. ప్రవేశ రుసుం;
    • entrance frame, ph. ద్వారబంధం;
  • entree, n. (ఆంట్రే) ప్రధాన వంటకం;
  • entrepreneur, n. పెట్టుబడిదారు;
  • entropy, n. [phy.] యంతరపి; విస్తరణతత్త్వం; సంకరత; అబందరం; అబందరమాత్రం, అబంత్రం; కల్లోలకం; గత్తర; a measure of disorder; (ety.) en tropos means 'in chaos' or 'turning into,' అబందరం means disorder; కల్లోలం means chaos; entropy can be viewed as the amount of heat flowing into (or out of) a body divided by the temperature of that body;
  • entrust, v.t. అప్పగించు; బెత్తాయించు;
  • entry, n. (1) ప్రవేశం; (2) దఖలు; పుస్తకంలో రాసుకునే పద్దు; (3) ఆరోపం; ఓలెము; జాబితాలో వేసుకునేది;
    • main entry words, ph. ప్రధాన ఆరోపములు;
    • sub entry words, ph. ఉప ఆరోపములు;
    • entry in a ledger, ph. దఖలు;
    • entry in a list, ph. ఆరోపములు;
    • entry words, ph. ఆరోపములు; పదారోపములు;
  • entwine, v. i.. చుట్టుకొను; పెనవే్సుకొను; మెలివేసుకొను;
  • enumerate, v. t. లెక్కించు; లెక్కపెట్టు;
  • enunciate, v. t. ప్రవచించు; ప్రకటించు; ప్రచురించు;
  • envelope, n. (ఆన్‌వొలోప్) సంచి; ఉత్తరాన్ని పెట్టడానికి వాడే సంచి; కవరు; లిఫాఫా;
  • envelope, v. i. చుట్టుకొను;
  • envelope, v. t. చుట్టుముట్టు; కప్పు; మరుగు పరచు;
  • enviable, adj. ఈర్ష్యపడదగ్గ; ఈర్ష్య పొందదగిన;
  • envious, adj. ఈర్ష్యగల;
  • environment, n. పర్యావరణం; పరిసరప్రాంతాలు;
  • envoy, n. దూత; రాయబారి;
  • envy, n. ఈర్ష్య; అసూయ; మత్సరం; కడుపుమంట; active expression of jealousy;
  • envy, v. i.. ఈర్ష్య చెందు; అసూయ పడు;
  • enzyme, n. అజము; ఫేనక ప్రాణ్యం; [en zyme = in yeast];
  • eon, aeon [Br.], n. మహాయుగం;

---Usage note: eon, era, period, age,

  • ---In geology, eon is the largest unit of time. An era is a unit of time shorter than an eon but longer than a period. Period refers to a unit of time shorter than an era but longer than an epoch. An epoch is a unit of time shorter than a period but longer than an age.

\}

  • ephemeral, adj. బుద్బుదప్రాయమైన; అల్పాయుష్షుతో; తాత్కాలికమైన; క్షణికమైన; అశాశ్వతమైన, నశ్వరమైన; క్షణిక; క్షణభంగుర;
    • ephemeral fever, ph. లఘుజ్వరం;
    • ephemeral stream, ph. దొంగేరు;
  • ephemeris, n. పంచాంగం; గంటల పంచాగం; నభోమూర్తులు ఆకాశంలో ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయో సూచించే పంచాంగం;
  • epic, n. ఇతిహాసం; పురాణం; మహాకావ్యం; వీరగాథ;
  • epicenter, n. కేంద్రం; నాభి; అధికేంద్రం;
  • epicurean, adj. భోగపరాయణ; విలాసభరిత; భోగలాలస; భోజనప్రియ;
  • epicycle, n. ఉపచక్రం; ఉపవృత్తం;
  • epidemic, n. తెవులు; ప్రజామారి; ఏక కాలమందు ప్రజలమీద విరుచుకుపడి ఎక్కువగా మనుషులని చంపే వ్యాధి; [Gr. epi = మీద; demos = ప్రజలు]; an increase, often sudden, in the number of cases of a disease above what is normally expected; an outbreak becomes an epidemic when it becomes quite widespread in a particular country, sometimes in one specific region; See also endemic and pandemic;
  • epidermis, n. ప్రభాసిని; బహిస్తరం;; చర్మం యొక్క పైపొర;
  • epiglottis, n. పలక; తిన్న తిండి శ్వాస నాళికలోకి వెళ్లకుండా అడ్డుకునే చిన్న పలక; (ety.) epi = మీద; glottis = నాలుక కనుక epiglottis = నాలుక మీద ఉన్నది అని అర్థం వస్తుంది. నోరు తెరిస్తే నాలుక మీద కనిపించేది కొండనాలుక (uvula); కనుక కొందరు epiglottis అన్న మాటని కొండనాలుక అని అనువదించేరు, కాని అలా అనువదించడం తప్పు; uvula = ఘంటిక; చిరునాలుక; కొండనాలుక; అంగిటిముల్లు; ఉపజిహ్విక;
  • epigram, n. (1) ఛలోక్తి; see also aphorism; (2) చాటుపద్యం;
  • epilepsy, n. అపస్మారం; మూర్ఛ; సొలిమిడి; సొమ్మ; కాకిసొమ్మ;
    • epilepsy of childhood, n. చేష్ట; బాలపాపచిన్నె;
  • epilogue, n. భరతవాక్యం; తుదిపలుకు; ఆఖరి మాట;
  • episode, n. ఉదంతం; ఉపాఖ్యానం; ఉప కథ; కథాంగం; సంఘటన;
  • epistemology, n. జ్ఞానాన్వేషణ; జ్ఞానాన్వేషణ పద్ధతి; జ్ఞాన సాధన సామగ్రి శాస్త్రము; జ్ఞానమీమాంస;
  • epitaph, n. స్మృత్యంజలి; చరమశ్లోకం;
  • epithelium, n. శరీరంలో తారసపడే నాలుగు రకాల కణరాశులలో ఇది ఒకటి; శరీరపు అంగాలని కప్పిపుచ్చే పలచటి పొరలా ఉంటుంది; మిగిలిన మూడు నాడీ తంతులలోను, కండరాలలోను, నరాల లోను కనిపిస్తాయి;
  • epithet, n. మారుపేరు; వర్ణనాత్మకమైన మరోపేరు;
  • epitome, n. (ఎపిటమీ) సారాంశం; సంగ్రహం;
  • e pluribus unum, ph. భిన్నత్వంలో ఏకత్వం;
  • epoch, n. దశ; దీర్ఘకాలం;
  • Epsom salt, ph. భేది ఉప్పు; magnesium sulfate; MgSO4,7H2O; దీనిని మోతాదుగా నీటిలో కలుపుకు తాగితే విరేచనం అవుతుంది; ఇంగ్లండ్ లో సర్రే (Surrey) సమీపంలోని ఎప్సమ్ (Epsom)అనే చోట భూగర్భ జలాలను మరగించి చేసే మెగ్నీసియం సల్ఫేట్ ని ఎప్సమ్ సాల్ట్ అంటారు;
  • equal, n. సమానం; సమం; సరి సమానం; సాటి; సదృశం; సరి; ఈడు; జోడు; జత; ప్రాయం;
  • equality, n. సమానత; సమానత్వం; సమత; సామ్యం; సదృశం; సమీకరణం; తౌల్యం;
  • equalize, v. t. సమం చేయు; సమపరచు;
  • equalizer, n. సమవర్తి;
  • equally, adv. సరి సమానంగా; సమంగా;
  • equanimity, n. స్థితప్రజ్ఞ; సమభావం; కష్టసుఖాలని సమభావంతో ఎదుర్కొన గలిగే నిబ్బరం;
  • equate, v. t. సమీకరించు;
  • equation, n. [math.] సమీకరణం;
    • algebraic equation, ph. బీజీయ సమీకరణం; బీజ సమీకరణం;
    • binomial equation, ph. ద్విపద సమీకరణం;
    • cubic equation, ph. ఘన సమీకరణం; త్రిఘాత సమీకరణం; ఉ. ax3+bx2+cx+d = 0
    • homogeneous equation, ph. సజాతీయ సమీకరణం;
    • linear equation, ph. సరళ సమీకరణం; ఉదా: ax+b = 0
    • polynomial equation, ph. బహుపద సమీకరణం; బహుపది;
    • quadratic equation, ph. వర్గ సమీకరణం; ద్విఘాత సమీకరణం; ఉదా. ax2+bx+c = 0
    • quartic equation, ph. చతుర్ ఘాత సమీకరణం; ఉ. ax4+bx3+cx2+dx+e = 0
    • quintic equation, ph. పంచ ఘాత సమీకరణం; ఉదా: ax5+bx4+cx3+dx2+ex+f = 0
  • equator, n. మధ్యరేఖ; గ్రహమధ్యరేఖ;
    • celestial equator, ph. ఖగోళ మధ్యరేఖ; విషువద్ వృత్తం;
    • Jovian equator, ph. గురు మధ్యరేఖ;
    • lunar equator, ph. ఐందవ మధ్యరేఖ; చాంద్రయ మధ్యరేఖ;
    • terrestrial equator, ph. భూమధ్యరేఖ;
  • equatorial, adj. మధ్య; గ్రహమధ్య; భూమధ్య;
    • equatorial plane, ph. గ్రహమధ్య తలం;
  • equilateral, adj. సమబాహు;
    • equilateral triangle, ph. సమబాహు త్రిభుజం;
  • equilibrium, n. నిశ్చలత; సమతౌల్యత; సమస్థితి; సమతాస్థితి; సరితూకం;
    • hydrostatic equilibrium, ph. జలస్థితిక సమత్వం;
  • equipment, n. pl. సరంజామా; సంభారాలు; సంపత్తి; పరికరావళి; సాధనసామగ్రి; సామగ్రి;
  • equinox, n. విషువత్తు; విషువం; సూర్యుడు భూమధ్య తలాన్ని దాటే సమయం; (lit.) equi = సమానమైన, nox = రాత్రులు; ఈ రోజున రాత్రి, పగలు సమానమైన పొడుగు ఉంటాయి;
    • autumnal equinox, ph. శరద్ విషువత్తు; సూర్యుడు కన్యా రాసి నుండి తుల లోకి జరిగే సమయం; సెప్టెంబరు 23వ తేదీ; దక్షిణాయనం మొదలు;
    • spring equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
    • vernal equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు;
    • equinox points, ph. విషువత్ బిందువులు;
  • equipartition, n. సమపంపకం;
  • equisetum, n. అశ్వవాలం; ఒక రకం మొక్క; గాలికీ, నీటికీ మట్టి కోరుకు పోకుండా ఉండడానికి ఈ మొక్కలని రక్షణగా వాడతారు; horse tails; scouring rush; a flowerless bush useful in preventing erosion;
  • equable, adj. సరిసమానంగా; సమతుల్యంగా;
    • equable climates, ph. సమతుల్యంగా ఉన్న వాతావరణాలు;
  • equipartition, n. సమపంపకం;
    • equipartition principle, ph. సమపంపక సూత్రం;
  • equitable, adj. న్యాయమైన; నిష్పక్షపాతమైన;
    • equitable distribution of wealth, ph. న్యాయంగా పంపిణీ జరిగిన ఆస్తి; అందరికీ సమానంగా ఇచ్చినది కాదు, ఎవ్వరికి డబ్బు ఎక్కువ అవసరం ఉందో వారికి ఎక్కువ ఇవ్వడం న్యాయం కదా!
  • equity, n. (1) న్యాయం; నిష్పక్షపాతం; (2) నికరమైన రొక్కపు విలువ; ఒక ఆస్తి యొక్క బజారు విలువలో అప్పులు పోను నికరంగా చేతికి వచ్చే డబ్బు విలువ;
  • equivalence, n. సమతుల్యత; తత్తుల్యం; ప్రాయం;
  • equivalent, adj. తుల్యమైన; తత్తుల్యం; సమతుల్యమైన; తత్సమమైన; సమానార్థక; ప్రాయం;
    • equivalent weight, ph. తుల్యభారం;
  • equivalent, n. తుల్యాంశం; తత్సమం; ప్రాయం; సవతు;
    • chemical equivalent, ph. రసాయన తుల్యాంశం;
    • mathematical equivalent, ph. గణిత తుల్యాంశం;
    • physical equivalent, ph. భౌతిక తుల్యాంశం;
    • equivalent to an animal, ph. పశుప్రాయుడు;
    • equivalent to a dead person, ph. మృతప్రాయుడు;
    • equivalent to a straw, ph. తృణప్రాయం;
  • equivocal, adj. సంధిగ్ధ; అనిశ్చిత; అస్పష్ట; రెండు పక్కలా పలకడం;
  • equivocate, n. సంధిగ్ధంగా మాట్లాడడం; గోడమీద పిల్లిలా మాట్లాడడం; తుని తగవు తీర్చినట్లు మాట్లాడడం;
  • er, suff. అరి; "doer"; maker; ఇంగ్లీషులోని క్రియావాచకాన్ని నామవాచకంగా మార్చే ఉత్తర ప్రత్యయం;
    • lie + er = liar = కల్లరి; one who tells a lie;
    • pot + er = potter = కుమ్మరి;
    • forge + er = forger = కమ్మరి;
    • idea + maker = వెరవు + అరి = వెరవరి;
  • era, n. యుగం; శకం;
    • Archaeozoic era, ph. ఆదిజీవ యుగం;
    • Christian era, ph. క్రీస్తు శకం;
    • Cenozoic era, ph. ఆధునికజీవ యుగం;
    • Common era, ph. సాధారణ శకం; క్రీస్తు శకానికే మరోపేరు;
    • Mesozoic era, ph. మధ్యజీవ యుగం;
    • Paleozoic era, ph. పురాజీవ యుగం; (Br.) Palaeozoic;
    • Proterozoic era, ph. ప్రథమజీవ యుగం;
  • eradicate, v. t. నిర్మూలించు; రూపుమాపు; ఉత్పాటించు;
  • eradicated, n. నిర్మూలించబడినది; ఉత్పాటితం; రూపుమాపబడినది;
  • eradication, n. నిర్మూలన; ఉత్పాటనం; రూపుమాపడం; పెరికివేయడం; సమూలంగా నాశనం చేయడం;
  • erect, adj. నిట్రం;
    • erect pole, ph. నిట్రాట;
    • erect stone, ph. నిట్రాయి;
  • erection, n. (1) కట్టడం; నిర్మాణం; (2) అంగస్తంభన; రిక్కింపు; పురుషుని లింగం గట్టిపడి నిటారుగా నిలబడడం;
  • erected, adj. రిక్కించిన;
    • erected ears, ph. రిక్కించిన చెవులు;
  • erosion, n. కోత; కృశింపు; నశింపు; క్రమక్షయం;
  • eroticism, n. శృంగారం;
  • errand, n. ప్రాతివేశం; చిన్న చిన్న పనులు చెయ్యడానికి వెళ్లే తిరుగుడు;
    • errand boy, ph. పనులు చెయ్యడానికి తిరిగే కుర్రాడు;
  • errands, n. చిల్లర పనులు;
  • errata, n.pl. ముద్రారాక్షసాలు; తప్పొప్పుల పట్టిక;
  • erroneous, adj. తప్పు; తప్పుడు;
  • error, n. (1) తప్పు; పొరపాటు; తప్పిదం; స్ఖాలిత్యం; (2) లోపం; లొసుగు; దోషం;
    • basic error, ph. పూర్తిగా తప్పు;
    • error checking, ph. దోష పరీక్ష;
    • error condition, ph. దోషావస్థ;
    • error of commission, ph. అతిరిక్త దోషం;
    • error control, ph. దోష నియంత్రణ;
    • error correction, ph. దోష పరిహరణం; దోష పరిహారం; లోపమును సవరించుట; దోషమును దిద్దుట; ప్రాయశ్చిత్తం;
    • error of omission, ph. న్యూన దోషం;

Usage Note: error, mistake, bug

  • ---A mistake is something you do by accident, or that is a result of bad judgment. An error is something that you do not realize you are making, that can cause problems. Errors made during the writing of a computer program are called bugs.
  • eructation, n. త్రేనుపు; ఉద్గారం;
    • sour eructation, ph. పులి త్రేనుపు;
  • erudition, n. పాండిత్యం;
  • eruption, n. (1) పేలుడు; (2) దద్దురు; బొబ్బ; పొక్కు;
    • eruption of a rash, ph. పేత పేలడం;
    • eruption of a volcano, ph. అగ్నిపర్వతం పేలడం;
  • eruptions, n. pl. (1) దద్దుర్లు; బొబ్బలు; (2) తట్టు; ఒక చర్మరోగం;
  • erysipelas, n. సర్పి; చప్పి; ఒక రకం చర్మ రోగం;
  • erythema, n. కందడం; చలితం; ఎలర్జీ వంటి ఒక చర్మ వ్యాధి;
  • erythrocytes, n. ఎరక్రణాలు; రక్తంలో ఉండే ఒక రకం కణాలు;
  • erythroblast, n. రుధిరాధి కణం; an immature erythrocyte, containing a nucleus.
  • escape, n. పలాయనం; పరారీ;
    • escape velocity, ph. పలాయన వేగం; ఒక ఖగోళం యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకుని వెళ్ళడానికి కావలసిన వేగం;
  • escape, v. i. తప్పించుకొను; పారిపోవు;
  • eschew, v. i. వర్జించు; మానుకొను;
  • escort, n. తోడు; సాయం; పరివారం; పరిజనం;
  • escort, v. t. దిగబెట్టు; తోడు వెళ్లు; సాయం వెళ్లు;
  • esophagus, aesophagus; (Br.) n. అన్నవాహిక; ఆహారనాళం; ఆహారవాహిక; కృకం;
  • especially, adv. విశేషించి;
  • espionage, n. గూఢచర్యం; వేగు; బాతిమ; చారచక్షుత;
    • espionage agent, ph. బాతిమదారు; బాతి; వేగులవాడు; గూఢచారి;
  • essay, n. వ్యాసం; సంగ్రహం;
  • essence, n. సారం; సారాంశం; పస; పసరు; అంతస్సారం;
  • essential, adj. ముఖ్యమైన; ఆవశ్యక; సారభూత;
    • essential amino acids, ph. ఆవశ్యక నవామ్లాలు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
    • essential fatty acids, ph. ఆవశ్యక ఘృతికామ్లములు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం;
    • essential oils, ph. పుష్పసారములు; సారభూత తైలాలు; సుగంధ తైలాలు; అత్తరులు; ధృతులు; స్థిర తైలాలు; ఒక మొక్కకి తనదంటూ ఒక ప్రత్యేకమైన శీలాన్ని ఇచ్చే తైలం; ఇక్కడ essential అనే మాట essence నుండి వచ్చింది; ఈ తైలాలు తీయడానికి సాధారణంగా వేడి ఆవిరిని ఉపయోగిస్తారు; see also cold pressed oils;
  • establish, v. i. నెలకొను; స్థిరపడు;
  • establish, v. t. (1) నిర్ణయించు; నిర్ధారించు; నిర్ధారణ చేయు; (2) స్థాపించు; నెలకొల్పు; నిర్మించు;
  • established, adj. నిర్ణయించబడ్డ; స్థాపించబడ్డ; నెలకొన్న; సుస్థాపిత; పరినిష్టితమైన; పాతుకుపోయిన;
  • establishment, n. సంస్థ; వ్యవస్థాపనం; ఉట్టంకణం;
  • establishment, v. t. స్థాపన;
  • estate, n. ఆస్థి; జమీ; భూస్థితి;
  • ester, n. విస్పరి; ఆల్కహాలు; ఆమ్లము సంయోగం చెందగా వచ్చిన లవణం వంటి పదార్థం;
  • esterification, n. విస్పరీకరణం;
  • esthetic, aesthetic (Br.), adj. అలంకార; సౌందర్య;
  • esthetics, aesthetics (Br.), n. అలంకార తత్త్వశాస్త్రం; సౌందర్య తత్త్వశాస్త్రం;
  • estimable, adj. గౌరవించదగ్గ; గౌరవప్రదమైన;
  • estimate, v. t. అంచనా వేయు; మదింపు చేయు; లెక్కకట్టు; ఉజ్జాయించు;
  • estimate, n. అంచనా; మదింపు; ఉజ్జ; ఉజ్జాయింపు; అందాజు; అడసట్టా; ఎస్టిమేటు;
  • estrangement, n. వైమనస్యం; అభిప్రాయభేదం; విమనోభావం; దుఃఖమనస్కుని భావము;
  • estrogen, n. స్త్రీ శరీరంలో తయారయే ఉత్తేజితపు జాతికి చెందిన ఒక రసాయనం;
  • estrus, n. రుతుకాలం; పశుపక్ష్యాదులు ఈ కాలంలోనే లైంగిక వాంఛ చూపుతాయి; (rel.) rut;
  • estuary, n. విశాలసంగమం; సంగమస్థానం; సాగర సంగమం; నదీ ముఖ ద్వారం; నది సముద్రంలో కలిసే చోట విశాలమైన సంగమ స్థలం; (rel.) backwater; fjord; sound;
  • et al, n. ప్రభృతులు; తదితరులు; ఆదులు; (ety.) short for et alii;
  • etc., n. వగైరా; ఇత్యాదులు; మొదలగునవి; మున్నగునవి; (ety.) short for et cetera;
  • eternal, adj. అభంగురమైన; శాశ్వతమైన; నిత్య; అనశ్వర; సనాతన;
  • eternal, n. అభంగురం; శాశ్వతం; అనశ్వరం;
  • ethics, n. (1) నీతిశాస్త్రం; (2) pl. నడవడిని, ప్రవర్తనని నియంత్రించే ధర్మ పన్నాలు;
  • ethane, n. ద్వియీను; రంగు, వాసన లేని ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH3CH3; same as ethylene;
  • ethene, n. ద్వియీను; కంపుతో, రంగు లేని, భగ్గుమని మండే ఒక రసాయన వాయువు; రెండు కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; CH2CH2; ఈ వాయువు సమక్షంలో పండబెట్టిన కాయలకి మంచి రంగు వస్తుంది;
  • ethic, n. నీతి, నియమం, నడవడి, ప్రవర్తన, మొదలైనవాటిని నియంత్రించే కట్టుబాటు;
  • ethnic, adj. జాతికి సంబంధించిన; తెగకి సంబంధించిన; of or belonging to a population group or subgroup made up of people who share a common cultural background or descent.
    • ethnic cleansing, ph. the mass expulsion or killing of members of an unwanted ethnic or religious group in a society;
  • ethos, n. యుగధర్మం; జాతిశీలత; నైతిక, సామాజిక విలువల సముదాయం;
  • etiology, n. కారణశాస్త్రం; ఏ జబ్బు ఎందువల్ల వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
  • etiquette, n. మర్యాద; ఒకరినొకరు గౌరవించుకోడానికి పాటించే నియమావళి;
  • -ette, suff. (1) స్త్రీ వాచకం; ఉ. bachelorette; (2) అల్ఫార్థకం; ఉ. statuette; briquette;
  • etymon, n. [ling.] ధాతువు; అనేక భాషలలోని సజాతీయ మాటలకి మూలం;
  • etymology, n. పదప్రవర; పదప్రవర శాస్త్రం; నిరుక్తం; శబ్దవ్యుత్పత్తి శాస్త్రం; ఏ మాట ఎక్కడనుండి వచ్చిందో నిర్ణయించే శాస్త్రం;
  • etymologists, n. పదప్రవరులు; పదవ్యుత్పత్తి తెలిసిన పండితులు;
  • eucalyptus oil, n. యూకలిప్టస్ తైలం; నీలగిరి తైలం;
  • eugenics, n. the science of the betterment of the human race via artificial selection of genetic traits and directed breeding of human carriers;
  • eukaryotic, eucaryotic, adj. కణిక సంహిత; కణికతో కూడిన; కణిక ఉన్న; నిజకేంద్రక; (ety.) eu + caryo + ote; (ant.) prokaryotic;
  • eulogy, n. ప్రశంస; పొగడ్త; కీర్తిగానం;
  • eunuch, n. నపుంసకుడు; కొజ్జా;
  • euphemism, n. సభ్యోక్తి; శిష్టోక్తి; తీపిమాట; చెవికింపుమాట; చెప్పదలుచుకున్న మాటని డొంకతిరుగుడుగా చెప్పడం; నాజూకుగా చెప్పిన మాట : "చచ్చిపోయాడు" అనడానికి "స్వర్గస్తుడయాడు" అనడం, ‘లేవు’ అనడానికి ‘నిండుకున్నాయి’ అనడం, "క్షయరోగం" అనడానికి బదులు ఇంగ్లీషులో "టి.బి." అనడం ఉదాహరణలు :
  • euphonic, adj. శ్రావ్యమైన; చెవికి ఇంపైన;
  • euphony, n. శ్రావ్యత; ఇంపు; చెవులకు ఇంపైన స్వరం; స్వరసమత;
  • Eurasia, n. Europe + Asia;
  • European, adj. పరంగి; ఐరోపా ఖండానికి చెందిన; పరదేశాలకి చెందిన;
    • European quarters, ph. పరంగి పురం;
  • Eustachian tube, n. కంఠకర్ణ నాళం; గొంతుకకి, చెవికి మధ్యనున్న గొట్టం;
  • euthanasia, n. విపరీతంగా బాధ పడుతూన్న రోగి అవస్థ చూడలేక, జాలితో రోగికి సునాయాసంగా మరణం కలిగేటట్లు చూడడం;
  • evacuate, v. i. ఖాళీ చేయు;
  • evade, v. i. తప్పించుకొను; ఠలాయించు;
  • evaluate, v. i. వెలకట్టు; విలువ కట్టు; నాణ్యం కట్టు;
  • evaluation, n. మూల్యాంకనం; వెల కట్టడం; విలువ కట్టడం;
  • evangelist, n. క్రైస్తవ మత ప్రచారకుడు; క్రైస్తవ మతంలో చేరమని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసే వ్యక్తి;
  • evaporate, v. t. ఇగుర్చు; పరిశోషించు;
  • evaporation, n. (1) ఇగురు; ఇగర్చడం; పరిశోషణం; (2) బాష్పీభవనం;
  • eve, n. (1) ముందు రోజు; ఒక పర్వదినానికి ముందు రోజు; (2) సాయంకాలం;
  • even, adv. సయితం; సైతం;
  • even, adj. సరి; సమ మట్టంగా;
  • even-handed, adj. బలపక్షం లేకుండా; న్యాయపరంగా;
    • even number, ph. సరి సంఖ్య;
  • evening, n. సాయంకాలం; సాయంత్రం; ప్రదోషం; ప్రదోషకాలం; మునిమాపు; మాపు; మునిచీకటి; అసురసంధ్య;
    • evening star, ph. శుక్రగ్రహం;
  • event, n. సంఘటన; ఘటన; ఘట్టం; నడితి; సన్నివేశం;
    • event handling, ph. [comp.] ఘటనా పరామర్శ;
    • event handler, ph. [comp.] ఘటనా పరామర్శిక; In an event-driven environment, a block of code designed to handle the messages generated when a specific kind of event occurs;
    • event horizon, ph. [phy.] సంఘటన దిగ్మండలం; సంఘటన దిక్‌చక్రం;
  • eventful, adj. సంఘటనాత్మక; చరిత్రాత్మక;
  • eventually, adv. ఎట్టకేలకు; ఆఖరికి; చివరికి; ఎప్పుడో ఒకప్పుడు; నిలకడమీద;
  • ever, adj. సతతం; కలకాలం; ఎల్లవేళల;
  • evergreen, n. సతత హరితం; నిత్యశ్యామలం;
  • every, adj. అను; ప్రతి; పరి;
    • every day, ph. అనుదినం; ప్రతి దినం;
    • every moment, ph. అనుక్షణం; ప్రతి నిముషం;
  • everybody, pron. అందరూ; అంతా; సర్వులూ;
  • everyday, adj. ప్రతిరోజు; నిత్యం;
  • everyone, pron. అందరూ; అంతా; సర్వులూ;

---Usage Note: every one, everyone

  • ---Use every one to talk about every single person or item in a group. Use everyone to mean all people in a group.
  • everything, adj. సర్వస్వం; సర్వం; అన్నీ; అంతా;
  • everywhere, adj. ప్రతిచోట;
  • evict, v. t. గెంటు; బయటకి తగులు; చట్టం ప్రకారం బయటకు వెళ్ళగొట్టు;
  • eviction, n. గెంటడం; బయటకి తగిలెయ్యడం; జప్తు చెయ్యడం;
  • evidence, n. నిదర్శనం; తార్కాణం; రుజువు; ప్రమాణం; సాక్ష్యం; దాఖలా;
    • direct evidence, ph. ప్రత్యక్ష ప్రమాణం;
    • circumstantial evidence, ph. ప్రాసంగిక సాక్ష్యం; సందర్భ ప్రమాణం; అప్రత్యక్షసాక్ష్యము; పరిస్థితిసంబంధసాక్ష్యము; సంభవాత్మకసాక్ష్యము.
    • indirect evidence, ph. అనుమాన ప్రమాణం; అప్రత్యక్ష ప్రమాణం;
  • evident, n. విదితం;
    • self evident, ph. స్వయం విదితం;
  • evil, n. (1) అభం; చెడు; (2) దౌష్ట్యం; దుష్కృత్యం; కంటకం;
  • evil, adj. చెడు; దుర్మార్గమైన; అవినీతికరమైన;
  • evolution, n. పరిణామం; ఊర్ధ్వముఖ పరిణామం; క్రమ పరిణామం; వికాశం; పరిణామ సృష్టి;
    • theory of evolution, ph. పరిణామ సృష్టి వాదం; పరిణామ సృష్టి సిద్ధాంతం;
    • evolution of language, ph. భాషా వికాశం;
    • evolution by natural selection, ph. సహజ ఎంపిక వల్ల జరిగే జీవపరిణామం;
    • evolutionary, adj. పరిణామాత్మక;
  • ex, adj. మాజీ;
  • exacerbation, n. ప్రకోపం; ఉద్రేకం; రోగ ఉద్రేకం;
  • exact, adj. నిర్దిష్టంగా; సమంగా; సరిగ్గా; నిర్ధారణగా;
  • exactly, adv. సమంగా; సరిగ్గా; కచ్చితంగా; అచ్చంగా;
  • exaggeration, n. అతిశయోక్తి; కోత; కోతలు కోయడం; గోరంతని కొండంత చెయ్యడం;
  • examination, n. పరీక్ష; పరిశీలన;
    • in depth examination, ph. శలాక పరీక్ష; శల్య పరీక్ష; సూక్ష్మ పరిశీలన; పరామరిక;
    • final examination, ph. సంవత్సరాంతపు పరీక్ష; చివరి పరీక్ష;
  • examine, v. t. పరీక్షించు; పరికించు; పరిశీలించు; పరకాయించు;
  • example, n. ఉదాహరణ; దృష్టాంతం; నిదర్శనం; తార్కాణం; మచ్చు; ఉదాహారం; ఉదాహృతం;
    • counter example, ph. ప్రత్యుదాహరణ;
  • exasperate, v. i. విసుగెత్తిపోవు;
  • excavate, v. t. తవ్వు;
  • excavation, n. తవ్వకం;
  • exceed, v. i. మించు; మీరు; మితిమీరు; అతిక్రమించు; అధిగమించు; పెచ్చుపెరుగు; పురివిచ్చు; విజృంభించు;
  • excellence, n. ప్రకర్ష; ప్రాశస్త్యం; ఉత్కర్ష, utkarsha
  • excellent, adj. ప్రకృష్టమైన; బ్రహ్మాండమైన; లోకోత్తర; నెర;
  • excellent, n. ప్రకృష్టము; బ్రహ్మాండము; లోకోత్తరము;
  • except, adv. తప్ప; మినహా; వినా;
  • exception, n. మినహాయింపు; వినాయింపు; అపవాదం; భిన్నవాదం; కారణాంతరం;
  • exceptional, adj. అనూహ్యమైన;
  • excerpt, n. ఖండిక; రచనాభాగం;
  • excess, n. అధికం; అదనం; ఉరవు; ఉల్బణం; ఉత్కటం;
  • excess tax, ph. అదనపు పన్ను; జాస్తి పన్ను;
  • excessive, adj. అధికం; అదనం; అతి;
  • excessively, adv. అత్యధికంగా; హేరాళంగా; మస్తుగా;
  • exchange, n. మారకం; వినిమయం; ఫిరాయింపు; వర్గావర్గీ; అదలుబదలు; ఇచ్చిపుచ్చుకోలు; సాటా:
    • exchange of ideas, ph. భావ వినిమయం;
    • exchange rate, ph. మారకం రేటు; సాటా రేటు;
    • exchange trade, ph. సాటా వ్యాపారం;
    • foreign exchange, ph. విదేశీ మారకం;
    • exchange energy, ph. వినిమయ శక్తి; సాటా శక్తి;
    • exchange forces, ph. వినిమయ బలాలు; సాటా బలాలు;
  • exchange, v. t. మార్చు; ఫిరాయించు; తారుమారు చేయు;
    • exchange the order, ph. తారుమారు చేయు;
  • exchequer, n. ఖజానా; ప్రభుత్వపు ఖజానా;
  • excise, adj. వ్యాపారపు; ప్రత్యేక; ఉత్పత్తి; అబ్కారి;
    • excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను;
  • excitation, n. ప్రేరేపణ; ప్రేరణ; స్ఫూర్తి; ఉద్విగ్నత;
  • excite, v. t. ప్రేరేపించు; ఉద్రేకపరచు; ఉత్తేజపరచు;
  • excited, adj. ఉద్రేకం చెందిన; ఉద్విగ్న; ప్రోద్ధుత;
  • excitement, n. ఉత్సాహం; ఉత్తేజం; ఉద్విగ్నం; ఉద్వేగం; ఉద్విగ్నత;
  • exciting, n. ఉద్వేగభరితం;
  • exclamation, n. రాగం; ప్రశంసార్థకం; ఆశ్చర్యార్ధకం;
    • exclamation mark, ph. రాగ చిహ్నం; ప్రశంసార్థకం;
  • exclude, v. t. మినహాయించు; పరిహరించు; నిరవసించు; వర్జించు;
  • excluded, n. pl. నిరవాసులు;
  • exclusion, n. పరిహరణ; వర్జనం; మినహాయింపు;
  • excommunicate, v. t. బహిష్కరించు; వెలివేయు;
  • excrement, n. అశుద్ధం; అమేధ్యం; పియ్యి; విరేచనం;
    • animal excrement, ph. పేడ; పెంటిక; లద్ది;
    • human excrement, ph. పియ్యి; విరేచనం;
  • excrete, v. i. (1) విసర్జించు (2) ఏరుగు;
  • excretion, v. i. విసర్జన;
  • excretions, n. విసర్జించబడినవి; మొక్కలనుండి కారే రసాదులు;
    • bodily excretions, ph. మల మూత్రాదులు; శారీరక విసర్జనాలు;
  • excretory, adj. విసర్జక;
    • excretory organs, ph. విసర్జక అవయవాలు;
  • excruciate, adj. భౌతికంగా కానీ, మానసికంగా కానీ తీవ్రమైన; భరించనలవి కాని;
    • excruciate pain, ph. తీవ్రమైన బాధ; తీవ్రమైన నొప్పి;
  • excursion, n. విహారం;
  • excusable, n. క్షంతవ్యం;
  • excuse, n. (1) నెపం; సాకు; మిష; వంక; సందు; అపదేశం; (2) క్షమార్పణ; మన్నింపు; మాపు;
    • lame excuse, ph. కుంటి సాకు;
  • excuse, v. t. క్షమించు; మన్నించు;
    • excuse me, ph. క్షమించండి; మన్నించండి; ఏమీ ఆనుకోకండి;
  • execute, v. t. (1) అమలుజరుపు; నెరవేర్చు; నిర్వహించు; (2) ఉరితీయు;
    • executive power, ph. నిర్వహణాధికారం;
  • execution, n. (1) నిర్వహణ; (2) ఉరితీత; ఉజ్జాసనము;
  • exegesis, n. భాష్యం; ఒక పుస్తకం మీద చేసే వ్యాఖ్య; see also hermeneutics;
  • exemplar, n. మేలుబంతి; ఒజ్జబంతి, ojjabaMti; ఒరవడి; తలకట్టు; నమూనా; మాదిరి; ప్రతిరూపం; మోస్తరు; మచ్చుతునక; ఆదర్శవంతమైనది; అనుకరించడానికి వీలయినది; ప్రశస్తమయినది; శ్రేష్ఠం;
  • exemption, n. మినహాయింపు; వినాయింపు; విముక్తత;
  • exercise, n. (1) అభ్యాసం; సాధకం; (2) వ్యాయామం; కసరత్తు;
    • aerobic exercise, ph. వ్యాయామం; ఊపిరితీతకి ప్రాధాన్యం ఇచ్చే వ్యాయామం;
    • mental exercise, ph. మెదడుకి మేత;
    • physical exercise, ph. కసరత్తు;
  • exercise, v. i. వ్యాయామం చేయు; కసరత్తు చేయు;
  • exercise, v. t. చెలాయించు; వ్యవహరించు;
    • futile exercise, ph. కాకదంత పరీక్ష; కంచిగరుడసేవ;
    • exercise notebook, ph. రూళ్ళు గీసిన కాగితాలతో కుట్టిన పుస్తకం;
  • exertion, n.ప్రయాస;
  • exhalation, n. రేచకం;
  • exhale, v. i. నిశ్వసించు; ఊపిరి వదలు;
  • exhaust, n. రేచకం; రేచకధూమం; బయటకి పోయేది;
    • exhaust fumes, ph. రేచకం; రేచకధూమం; బయటకి పోయే వాయువులు;
  • exhaustion, n. శోష; శోషణం; బడలిక; ఆయాసం; అలుపు; సేద;
  • exhaustively, adv. కూలంకషంగా;
  • exhibit, v. t. ప్రదర్శించు;
  • exhibition, n. ప్రదర్శన;
  • exhibitor, n. m. ప్రదర్శకుడు; f. ప్రదర్శకి;
  • exhort, v. t. ఉద్బోధించు; ప్రోత్సాహ పరచు;
  • exhume, v. t. పాతిపెట్టిన శరీరాన్ని తిరిగి వెలికి తీయు;
  • existence, n. అస్థిత్వం; ఉనికి; మనుగడ;
    • doubtful existence, ph. అస్థినాస్తి;
    • independent existence, ph. స్వతంత్ర మనుగడ;
    • existence theorem, ph. అస్థిత్వ సిద్ధాంతం;
  • existing, adj. ఇప్పటి; సజీవ;
  • existentialism, n. అస్థిత్వవాదం; "ఈ జీవితానికి అర్ధం/ప్రయోజనం లేవు. ఎవరో సృష్టికర్త మీ జీవితానికి ఒక లక్ష్యం/ప్రయోజనం నిర్దేశించి మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు." ఇదే అస్తిత్వవాదం యొక్క కీలకాంశం, సారం. దీనిని ఒక తత్వంగా కాకుండా జీవితం పట్ల ఒక దృక్పథం లాగ చూడాలి. ఇది నాస్తిక ఆలోచన కాదు; ఈ ఆలోచనకి చెందిన ప్రముఖ తత్వవేత్తలు - సొరేన్ కీర్కిగార్డ్(Søren Kierkegaard), మార్టిన్ హెడిగర్(Martin Heidegger), ఫ్రీడ్రిక్ నీచె(Friedrich Nietzsche), జీన్-పాల్ సార్ట్(Jean-Paul Sartre), ఆల్బర్ట్ కాము(Albert Camus) మొదలైనవారు;
  • exit, n. నిర్గమం; నిర్గతి; నిష్‌క్రమణం; నిష్క్రాంతి; బయటకు పోయే దారి;
  • exo, pref. బాహ్య; బహిర్;
  • exogamy, n. బహిర్వివాహం; కులాంతర, మతాంతర వివాహం;
  • exogenous, adj. బహిర్జాత; బహిర్జనిత;
  • exorbitant, adj. అత్యధికమైన; అమితమైన;
  • exorcism, n. భూతవైద్యం; ఉచ్చాటణ; extracting a demon out of a person's body;
  • exorcist, n. భూతవైద్యుడు; దయ్యములను బయటకు వెడలగొట్టేవాడు;
  • exosphere, n. బాహ్యావరణం;
  • exothermic, adj. తాపచూషక; బాహ్యతప్త; ఉష్ణమోచక; వేడిని వెలిగక్కే;
  • expand, v. i. వ్యాకోచించు; విస్తరించు; వికసించు;
  • expansion, n. వ్యాకోచం; వికాసం; విక్షేపం; విస్తరణ; పొలయిక;
  • ex parte, adj. [legal] ఏక పక్షంగా; ఒక వైపు నుండి మాత్రం;
  • expect, v. i. ఆశించు; నమ్ము; నిరీక్షించు; ఎదురుచూచు;
    • expected value, ph. సగటు విలువ; సరాసరి విలువ; ఊహించిన విలువ;
  • expectation, n. (1) ఆశ; ఆకాంక్ష; నమ్మకం; అవుతుందని అనుకున్నది; (2) సగటు; సరాసరి;
  • expectorant, n. కఫహరి; కళ్లెని వెడలగొట్టేది;
  • expediency, n. సులభాశ్రయత;
  • expedition, n. (1) యాత్ర; ప్రయాణం; సాహస యాత్ర; పరిశోధక యాత్ర; (2) దండయాత్ర;
  • expeditiously, adv. సత్వరంగా;
  • expel, v. t. బహిష్కరించు; తరిమివేయు; తొలగించు;
  • expenditure, n. ఖర్చు; వ్యయం; వినియోగం; వెచ్చం; పోబడి; యాపన;
    • bad expenditure, ph. దుర్‌వ్యయం;
    • good expenditure, ph. మంచి ఖర్చు; సద్‌వ్యయం;
    • expenditure of time, ph. కాలయాపన;
  • expense, n. ఖర్చు; వ్యయము; వెచ్చము;
    • expense and exertion, ph. వ్యయ ప్రయాసలు;
    • production expense, ph. ఉత్పాదక వ్యయం;
  • expensive, adj. ఖరీదయిన;
  • expensive, n. ఖరీదయినది; బహుకం; బాగా డబ్బు పోసి కొన్నది;
  • experience, v. t. అనుభవించు; ఆస్వాదించు;
  • experience, n. అనుభవం; అనుభూతి; ఔపొందం;
    • transcendental experience, ph. ఆధిభౌతికానుభవం, అశరీరానుభూతి. దేహాతీత అనుభవం, దేహాతీత అనుభూతి; నిధిధ్యాసము; మేవెలి;
    • experience table, ph. అనుభవ సారణి;
    • experienced person, ph. అనుభవశాలి; అనుభవజ్ఞుడు;
  • experiment, n. ప్రయోగం; శోధన; ప్రయత్నం;
  • experiment, v. t. ప్రయోగించు; శోధించు;
  • experimental, adj. ప్రాయోగిక; ప్రయోగాత్మక;
    • experimental evidence, ph. ప్రయోగాత్మక ప్రమాణం;
    • experimental proof, ph. ప్రాయోగిక నిదర్శనం;
  • experimentalist, n. ప్రయోక్త; శోధకుడు;
  • experimented, n. ప్రయుక్తము;
  • experimenter, n. ప్రయోక్త; శోధకుడు;
  • expert, adj. ఫామేదా; చెయ్యితిరిగిన;
  • expert, n. దిట్ట; నేర్పరి; శిఖామణి; ప్రోడ; ఘనాపాఠీ; చెయ్యి తిరిగిన మనిషి; ఆరిందా; ఫామేదా; నిపుణుడు; ప్రవీణుడు; నిష్ణాతుడు; విశారదుడు; కోవిదుడు; చాతురి, cAturi
  • expertise, n. నిపుణత; నైపుణ్యత; ప్రావీణ్యత; వైదగ్ధ్యత; శేముషి; నేర్పరితనం;
  • expiation, n. ప్రాయశ్చిత్తం; పాప పరిహారం;
  • expiration, n. (1) నిశ్వాసం; ఊపిరిని బయటకు వదలుట; (2) మరణం; (3) కాలదోషం పట్టడం;
  • expire, v. i. (1) మురిగిపోవు; కాలదోషం పట్టు; lapse; (2) మరణించు; చచ్చిపోవు;
  • explain, v. t. వివరించు; విశదీకరించు;
  • explanation, n. వివరణ; స్పష్టీకరణ; విపులీకరణ; వివేచన;
  • explicit, adj. సువ్యక్త; స్పష్టమైన; బహిర్గత;
  • exploration, n. అన్వేషణ;
  • explore, v. t. అన్వేషించు;
  • explorer, n. అన్వేషకి; అన్వేషకుడు;
  • explosion, n. పేలుడు; పెట్లు; విస్పోటనం; స్పోటనం;
  • exponent, n. (1) భాష్యకారుడు; (2) ఘాతాంకం; ఘాతం; ధ్వజాంకం; చక్రవృధ్యాంకం;
  • exponential, adj. ఘాతీయ; ఘాత; చక్రవృద్ధీయ; విశేష;
    • exponential growth, ph. ఘాతీయవృద్ధి; చక్రవృద్ధి; విశేష వృద్ధి;
  • export, n. ఎగుమతి; నిర్యాపనం;
  • expose, v. t. బయట పెట్టు; చూపించు; బట్టబయలు చేయు; బయలుపరచు; వెలార్చు;
  • exposition, n. వివరణ; భాష్యం; వ్యాఖ్యానం; ఉపన్యాసం; ప్రవచనం; ఆవిష్కరణ:
  • expounder, n. వ్యాఖ్యాత; వక్త;
  • express, v. i. వెలిబుచ్చు; వ్యక్తపరచు; వెల్లడి చేయు; అభివ్యక్తీకరించు;
    • express your opinion, ph. మీ అభిప్రాయమును వెలిబుచ్చునది;
  • expression, n. (1) సమాసం; ఉక్తి; ఉక్తిసమాసం; సముచ్ఛయం; సంహతి; పలుకుబడి; (2) హావం; (3) వ్యక్తీకరణం; అభివ్యక్తీకరణ; అభివ్యక్తం;
    • colloquial expression, ph. వాడుకలో ఉన్న పలుకుబడి;
    • facial expression, ph. హావం; ముఖకళవళిక;
    • mathematical expression, ph. గణిత సమాసం; గణిత అభివ్యక్తం;
  • expressionism, n. Expressionism అనేది ఒక కళా రీతి. ఉదాహరణకు ఒక అందమైన సాయంత్రాన, చల్లగాలిలో, పచ్చటి గడ్డిలో నలుగురు స్నేహితులు సరదాగా నడుస్తున్నారు. ఇంతలో ఒకడికి panic attack వచ్చింది. అంటే మానసిక అనారోగ్యము కారణముగా - ఏ కారణము లేకుండా - విపరీతమైన కంగారు పుట్టడము. వాడికి వాడి పరిసరాలు కనబడే దానికీ, ఇతరులకు కనబడే దానికి తేడా ఉంటుందనేది ఇక్కడ లెక్క. దూరాన నడుస్తున్న ఇద్దరికీ ఏ panic attack లేదు కనుక, ప్రకృతిలో ఉన్న ఆ తరంగాలు వారినేమీ ఇబ్బంది పెట్టట్లేదు. వారు మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కల్లోలము ప్రకృతిలో లేదు. అతని మనస్సులో ఉంది.
  • expulsion, n. బహిష్కారం; ఉద్వాసన; see also send off;
  • expunge, v. t. తీసివేయు; కొట్టివేయు; రద్దుచేయు;
  • extant, adj. సజీవ; ఇంకా ఉన్న
    • extant cultures, ph. సజీవ సంస్కృతులు;
  • extempore, adj. ఆశువుగా; ముందుగా తయారవకుండా;
  • extend, v. i. చాపు; బారచాపు;
  • extend, v. t. పొడిగించు;
  • extension, n. అధివ్యాపకం; విరివిడి;
  • extensive, adj. pref. పరి; సమగ్ర;
    • extensive search, ph. పరిశోధన;
  • extensively, adv. విరివిగా; విస్తారంగా; విస్తృతంగా; సమగ్రంగా; ముమ్మరంగా; అపరిమితంగా; సువిశాలంగా; సుదీర్ఘంగా; అధివ్యాపకంగా; విరివిడిగా;
  • extent, n. మేర; పరిణాహం;
    • to that extent, ph. అంత మేరకి;
  • exterminate, v. t. సమూలంగా నాశనం చేయు; నిర్మూలించు;
  • extermination, n. విచ్ఛిత్తి; సర్వనాశనం;
  • external, adj. బాహ్య; బహిరంగ; బాహిర; బహిర్గత;
    • external joint, ph. బాహిర సంధి;
  • externalization, n. బాహ్యీకరణ;
  • extinct, adj. చ్యుత; పరిచ్యుత; నిరాస్థులైన; అస్తిత్వం లేని; విలుప్తమైన; హరించిపోయిన; పరిమృత; సమూలంగా నాశనం అయిపోయిన;
    • extinct life forms, ph. నిరాస్థులైన జీవకోటి; హరించిపోయిన జీవకోటి;
  • extinct organisms, ph. పరిమృత జీవులు; పరిమృత ప్రాణులు;
  • extinct, n. విలుప్తం;
  • extinction, n. పరాసత్వం;
  • extinguish, v. i. ఆరు; కొండెక్కు;
  • extinguish, v. t. ఆర్పు;
  • extol, v. t. మెచ్చుకొను; కీర్తించు;
  • extortion, n. ఘరానా దోపిడీ;
  • extra, adj. (1) అదనపు; ఇతర; బాహిర; బయట; (2) అసమానమైన; మహామానమైన;
    • extra corporeal, ph. శారీరకేతర;
    • extra expenditure, ph. అదనపు వ్యయం;
  • extrasolar, adj. సూర్యకుటుంబానికి బయట;
  • extra, n. అదనం;
  • extract, n. సారం; అర్కం; ధృతి; కషాయం; సత్తు; అరఖు; సారభూతం;
  • extract, v. t. గుంజు; పీకు; పిండు; రాబట్టు; వెలికి తీయు; నిష్కర్షించు;
  • extracted, adj. సాధ్య;
    • extracted oil, ph. సాధ్య తైలం;
  • extraction, n. గుంజడం; పీకడం; పిండడం; రాబట్టడం; వెలికి తీయడం; నిష్కర్షణ;
  • extracurricular, adj. పాఠ్యాంశేతర;
  • extradition, n. ప్రత్యర్పణం; విదేశాలలో దాగున్న నేరస్తుని పీకి స్వదేశానికి రాబట్టడం;
  • extraneous, adj. ఇతరేతర;
  • extraordinary, adj. అసమాన్యమైన; అసాధారణమైన; మహామాన్యమైన;
    • extraordinary person, ph. అసమాన్యుడు; మహామాన్యుడు; అసమాన్యురాలు; మహామాన్యురాలు;
  • extrapolate, v. t. బహిర్వేశం చేయు;
  • extrapolated, adj. బహిర్వేశిత;
  • extrapolation, n. బహిర్వేశం;
  • extrasensory, adj. అతీంద్రియ; ఇంద్రియాతీతమైన;
    • extrasensory perception, ph. అతీంద్రియ శక్తి; ఇంద్రియాతీతమైన గ్రహణ శక్తి; దివ్యదృష్టి;
  • extreme, adj. పరమ; అతి; చరమ; మహా;
  • extremely, adv. అధి; తెగ; పరమ; మహా;
    • extremely friendly, ph. అధిమిత్ర; పరమ స్నేహశీలమైన;
  • extremist, n. తీవ్రవాది; విపరీతవాది; the person holding extreme political or religious views; fanaticism; (see also) terrorist;
  • extremities, n. pl. (1) చివరి భాగాలు; (2) కాలి వేళ్ళు, చేతి వేళ్ళు;
  • extremity, n. కొస; కొన; పరమావధి;
  • extrovert, n. m. బహిర్ముఖుడు; f. బహిర్ముఖి;
  • extrude, v. t. బహిస్సరించు;
  • exude, v. i. ఊరు; కారు;
  • exudation, n. (1) ఊట; రసం; (2) ఊరుట; చెమర్చుట;
  • exultation, n. ప్రహర్షం;
  • ex wife, ph. మాజీ భార్య;
  • eye, v. i. చూచు;
  • eye, n. (1) కన్ను; నేత్రం; నయనం; అక్షి; చక్షువు; లోచనం; కక్ష; దేహదీపం; (2) సూది బెజ్జం; (3) తుపాను కేంద్రం;
    • compound eye, ph. సంయుక్త నేత్రం;
  • eyeball, n. కంటి గుడ్డు; నేత్ర గోళం; తెల్లగుడ్డు;
  • eyebrow, n. కనుబొమ;
  • eyelash, n. కనువెంట్రుక; కనురెప్పల చివర ఉండే రోమ విశేషం;
  • eyelet, n. కంటికంత;
  • eyelid, n. కనురెప్ప; రెప్ప;
  • eyeglasses, n. కంటద్దాలు; కళ్లజోడు; సులోచనాలు;
  • eyes, n. pl. కళ్లు, కండ్లు; నయనములు; నేత్రములు; చక్షువులు; లోచనములు;
  • eyesore, n. కంటికి ఇంపుగా లేని దృశ్యం; చూడ్డానికి అసహ్యంగా ఉన్నది;
  • eyewitness, n. సాక్షి; (ety.) స + అక్షి.= కళ్లతో చూసినది;

మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2