Part 1: Fa-Fk

Part 2: Fl-Fz

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: Fa-Fk

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • F, f, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో ఆరవ అక్షరం; (2) పరీక్షలలో తప్పిన వారికి వచ్చే గురుతు;
  • fable, n. చిన్న కథ; జంతువులు పాత్రలుగా ఉన్న చిన్న కథ; see also parable;
  • fabric, n. (1) అంబరం; బట్ట; దుకూలం; పట్టా; (2) కట్టడం;
    • gunny fabric, ph. గోనె పట్టా;
    • yellow fabric, ph. పీతాంబరం;
  • fabricate, v. t. తయారుచేయు; అల్లు; నిర్మించు; బనాయించు; ప్రకల్పించు; కల్పించు;
  • fabricated, adj. ప్రకల్పిత; తయారు చేయబడ్డ; కల్పించిన; సృష్టించిన;
  • fabrication, n. (1) బనాయింపు; ఉత్పాదన; (2) అల్లిక; కల్పన; ప్రకల్పన; తయారీ;
  • fabulous, adj. నమ్మశక్యం కాని; అద్బుత; కల్పిత; అనూహ్యమైన;
  • face, adj. ముఖ; అంకిత;
  • face, n. (1) ముఖం; మోము; మోర; మొహం; మొగం; ఆననం; వదనం; (2) ఫలకం; తలం;
    • dejected face, ph. విషణ్ణ వదనం;
  • face, v. i. ఎదురవు; ఎదురుగా వచ్చు;
  • face, v. t. ఎదుర్కొను; ఎదిరించు;
    • face to face, ph. ముఖాముఖీ; ఎదురెదురుగా; ఎదురుబదురుగా;
    • face value, ph. అంకిత మూల్యం; ముఖ మూల్యం; నమోదు చేయబడ్డ విలువ;
  • facet, n. కోణం; దృక్పథం; వేపు; పట్టె;
  • facetious, adj. వెటకారంగా; వెక్కిరింపుగా; ఎగతాళిగా;
    • facetious comment, ph. ఒక రకం ఛలోక్తి; "బయట ఎండ వేడిగా ఉందా?" అని అడిగినప్పుడు "లేదు, వెన్నెట్లో తిరుగుతూన్నట్లు ఉంది?" అని చెప్పిన సమాధానం ఈ కోవకి చెందుతుంది. "వాడి లాంటి స్నేహితులు ఉంటే శత్రువులు అక్కరలేదు" అన్న వాక్యం sarcastic comment అవుతుంది;
  • facial, adj. ముఖగామి;
  • facile, adj. సులభసాధ్యం; చెయ్యి తిరిగిన;
    • facing each other, ph. ఎదురు బదురుగా;
  • facilitate, v. t. అనుకూల పరచు; వసతులు కల్పించు; సులభం చేయు;
  • facilities, n. సౌకర్యాలు; వసతులు; సదుపాయాలు;
    • basic facilities, ph. మౌలిక సదుపాయాలు;
    • facilities and resources, ph. సాధనసంపత్తి; వసతులు, వనరులు;
    • water facilities, ph. నీటి వసతులు;
  • facility, n. సౌలభ్యం; అవలీల; చులకన; సులభం;
  • facsimile, n. సరి అయిన నకలు; మక్కీకి మక్కీ నకలు; తుల్యసమానం; తద్వత్తుగా ఉండేది; same as fax;
  • fact, n. నిజం; సత్యం; వాస్తవం; వాస్తవికాంశం; నిజంగా జరిగిన విషయం; యదార్థం;
    • harsh fact, ph. కఠోర వాస్తవం;
    • literal fact, ph. అక్షర సత్యం;
  • faction, n. కక్షి; గుంపు; కూటమి; కలహాలలో ఒక గుంపు;
  • factor, n. (1) కారణాంకం; లబ్ధమూలం; భాజకం; (2) కారకం; (3) కారణాంశం;
    • clotting factor, ph. ఘనీభవన కారణాంశం;
    • common factor, ph. కనిష్ఠ భాజకం;
    • prime factor, ph. ప్రధాన కారణాంకం;
    • Rh-factor, ph. రీసస్ కారణాంశం; Rh-కారణాంశం;
  • factorial, n. క్రమగుణకం; ఓ సమితిలో ఎన్ని వస్తువులుంటే దాన్ని ఎన్ని విధాలుగా అమర్చొచ్చో సూచించటానికి వాడే చిహ్నమే ఫాక్టోరియల్ (క్రమగుణకం) అనబడే ! గుర్తు. ఓ సమితిని అమర్చగలిగే విధాల సంఖ్య; ఉదా. 6 యొక్క క్రమగుణకం 6! = 6 x 5 x 4 x 3 x 2 x 1; ఇక్కడ ఆశ్చర్యార్ధకం క్రమగుణకానికి గుర్తు; 0! = 1; 1! = 1; 2! = 2 x 1 = 2; 3! = 3 x 2 x 1 = 6 అవుతాయి.
  • factorization, n. కారణాంకీకరణం; ఒక సంఖ్య యొక్క కారణాంకాలు కనుక్కోవడం;
  • factory, n. కర్మాగారం; కార్ఖానా; మిల్లు;
    • factory workers, ph. కార్మికులు;
  • faculty, n. (1) శక్తి; సామర్థ్యం; దార్‌ఢ్యము; (2) అధ్యయన విభాగం; (3) అధ్యాపక వర్గం;
    • mental faculty, ph. మనో దార్‌ఢ్యం;
  • fad, n. వేలంవెర్రి; అస్తావెస్తం;
  • fade, v. i. వెలసిపోవు; వాడిపోవు;
  • fake, adj. నకిలీ;
  • fail, v. i. విఫలమగు; తప్పు; ఓడు; డింకీలు కొట్టు;
  • failure, n. విఫలం; ఓటమి; అనాప్తి;
  • faint, adj. నీరసమయిన; వెలవెలపోయిన; మసకగా ఉన్న; మంద; హీన;
    • faint glow, ph. మంద దీప్తి;
  • faint-hearted, n. పిరికి; భీరువు; భయశీలి;
  • faint, v. i. స్మృతితప్పు; సొమ్మసిల్లు; మూర్చపోవు;
  • fainting, n. మూర్ఛ; శోష;
  • fair, n. (1) సంత; (2) తిరణాలు; (3) న్యాయం; పాడి;
  • fair, adj. (1) న్యాయమైన; సరసమైన; సముచితమైన; (2) శుభ్రమైన; తెల్లనైన; సుందరమైన; సొగసైన;
    • fair and square, ph. ధర్మం; న్యాయం;
    • fair price, ph. సరసమైన ధర; గిట్టుబాటు ధర;
  • fair-skinned, adj. తెల్లనైన ఛాయ గల; మంచి ఛాయ గల;
  • fairy, n. పిల్లల ఊహాలోకంలో ఉండే రెక్కలు ఉండి,మంత్ర శక్తి ఉన్న ఒక శాల్తీ;
    • fairy tale, ph. అద్భుత గాథ; నమ్మశక్యం కాని కథ; మాంత్రికులు, దేవదూతలు, వగైరా పాత్రలు ఉండే పిల్లల కథ;
  • fait accompli, n. {Latin] జరిగిపోయిన పని; సిద్ధించిన కార్యం;
  • faith, n. (1) నమ్మకం; విశ్వాసం; భక్తి; (2) మతం;
    • breach of faith, ph. విశ్వాస భంగం;
  • faker, n. మోసగాఁడు; ఫకీర్లంతా మోసగాళ్లనే అనుకుని ఇంగ్లీషు వాళ్లు ఈ మాటని తయారు చేసేరు;
  • fake, n. (1) నకిలీ; కృత్రిమం; బూటకం; నకిలీ నకలు; చవకబారు కాపీ; (2) కపటి; మోసకారి;
  • fakir, n. [Ind. Engl.] strictly, a Muslim who has taken a vow of poverty; also applied to Hindu ascetics such as sadhus; [ety.] Arabic faquir= poor;
  • falcon, n. డేగ; సాళువ; బైరిపక్షి; భైరవ డేగ; {rel.] గద్ద
  • fall, n. (1) ఆకురాలు కాలం; (2) పాతం; పతనం; సంపాతం; అభిపాతం; ఎక్కువగా పడుట; కెడవు; భ్రంశనం; (3) చీర యొక్క అంచుల దగ్గర (పాదాల దగ్గర) వెనకభాగంలో కుట్టే బట్ట;
  • fall, v. i. పడు; రాలు; భంగపడు;
  • fallible, adj. పొరపాటు చేసే అవకాశం;
  • fallacious, adj. ఆభాసప్రాయమైన; తర్కాభాసమైన;
  • fallacy, n. కుతర్కం; ఆభాసం; తర్కాభాసం: మిథ్యాహేతువు; తార్కికంగా తప్పుడు వాదన; see also paradox;
  • fallen, adj. పతిత; పతనమైన; పడిన; భ్రష్ట;
  • falling, v. i. పడు; రాలు;
  • fallow, n. (1) కొవ్వు; గొడ్డుకొవ్వు; (2) బీడు; బీడు పొలం;
  • false, adj. కల్ల; బూటకపు; అబద్ధపు; తప్పు; మిథ్య; దంభ; కుహనా;
  • false, n. కల్ల; బూటకం; అబద్ధం; తప్పు; మిథ్య; హుళక్కి; అప్రమాణికం;
    • true or false?, ph. నిజమా, కల్లా?; ఒప్పా, తప్పా?;
    • false report, ph. కల్ల మాట; నీలి వార్త;
  • falsehood, n. అబద్ధం; బొంకు; అసత్యం; అనృతం; అళీకత; మిథ్య;
  • falsetto, n. మగవాడి బొంగురు గొంతుక; మగ గొంతుక;
  • falter, v. i. తడబడు; తొట్రుపడు;
  • fame, n. కీర్తి; ఖ్యాతి; విఖ్యాతి; పేరు; ప్రతిష్ఠ; ప్రశస్తి; యశస్సు; యశము; ప్రథ;
  • familiarity, n. పరిచయం; చనువు; చొరవ; అతిపరిచయం; ప్రవేశం; అభినివేశం; విహితం; మాలిమి;
    • familiarity breeds contempt, ph. చనువు అలక్ష్యాన్ని పుట్టిస్తుంది; అతిపరిచయాదవజ్ఞా;
  • familial, adj. అభిజన; పారంపర్య; కుటుంబ;
  • family, n. (1) కుటుంబం; వంశం; అనూకం; జాతి; (2) సంసారం; కాపురం; (3) కుటుంబం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు అయిదవ వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom, phylum, class, order, family, genus, species;
    • entire family, ph. ఇంటిల్లిపాదీ;
    • Hominidae Family, ph. మహావానరాలు; మహావానర కుటుంబం; హోమీనిడే;
    • super-family, ph. అధి కుటుంబం; హోమినాయిడియా (hominoidea);
    • sub-family, ph. ఉప కుటుంబం; హోమినినే (homininae);
    • family life, ph. సంసారం; సంసార జీవితం;
    • family name, ph. ఇంటి పేరు;
    • family planning, ph. కుటుంబ నియంత్రణ;
    • family tree, ph. వంశ వృక్షం;
  • family-oriented, adj. సంసార పక్షపు;
  • famine, n. కరువు; క్షామం; దుర్భిక్షం; (see also) pestilence;
  • famish, v. i. మలమలలాడు; ఆకలితో నకనకలాడు; ఆకలితో కృశించు;
  • famous, adj. కీర్తికెక్కిన; పేరున్న; ఖ్యాతివడసిన; వినుతికెక్కిన; విజ్ఞాత; ప్రసిద్ధ; ప్రశస్త;
    • famous person, ph. యశస్వి;
  • fan, v. t. విసరు; వ్యజించు;
  • fan, n. (1) పంకా; విసనకర్ర; వీవెన; సురటి; వ్యజనం; (2) ప్రేమాభిమాని; వీరాభిమాని; అభిమాని; అనుగరి; (ety.) fanatic అన్న మాటకి కుదింపు, కుదింపుతో అర్ధంలో మార్పు;
    • electrical fan, ph. విద్యుత్ పంకా; విద్యుత్ వీవెన; ఫేను;
    • palm leaf fan, ph. తాటాకు విసన కర్ర; తాళ వృంతం;
  • fan palm, n. తాటిచెట్టు;
  • fanatic, n. ఉన్మాది; ప్రేమాభిమాని; గాఢాభినివేశి; మూర్ఖాభిమాని; మూఢభక్తి కలవాడు; దురభిమాని;
    • religious fanatic, ph. మతోన్మాది;
  • fang, n. కోర; దంష్ట్ర; దంతము;
  • fanny pack, n. నడి కట్టు; ఒడి కట్టు; నడుం చుట్టూ కట్టుకునే చిన్న సంచి;
  • fantastic, adj. ఊహామయ; అద్భుతమైన;
  • fantasy, n. ఊహాలోకం; భ్రమ; భ్రమకల్పితం; స్వైర కల్పన;
  • far, adj. దూరమైన;

---Usage Note: farther, further

  • ---Use farther to talk about distance: the school is farther down this street. Use further to talk about time, quantities or degrees: House prices will fall further.
  • farce, n. ప్రహసనం; కిలారం; హాస్య ప్రధానమైన నాటకం; నవ్వులాట; హాస్యోక్తి; ఫార్సు;
  • fare, n. బాడుగ; కేఁవు; ఆతరం; ప్రయాణానికి చెల్లించే రుసుము;
  • farewell, n. ఉద్వాసన; సుఖప్రయాణ ఆశీర్వచనం;
  • farm, n. పొలం; కమతం;
  • farmer, n. రైతు; సేద్యకాడు; కృషీవలుడు; కర్షకుడు;
  • farmers, n. pl. రైతులు; రైతాంగం; కృషీవలులు; కర్షకులు;
  • far-off place, n. దూరాభారం;
  • far-sighted, adj. దూర దృష్టిగల; దీర్ఘ దృష్టిగల; దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపించేటటువంటి;
  • farsightedness, n. దూరదృష్టి, దూరపు వస్తువులని మాత్రమే చూడగలగటం;
  • fart, n. అపానవాయువు; [taboo] పిత్తు;
  • farthest, adj. అన్నిటి కంటే దూరమైన;
  • farther, adj. ఇంకా దూరమైన; more distant; see also "further;"
  • fascination, n. ఆకర్షణ;
  • fashion, n. (1) సోకు; సొగుసు; నాగరీకత; ఫేషను; (2) తీరు; రీతి; వైఖరి;
  • fashion, v.t. రూపొందించు;
    • fashionable woman, ph. సోకులాడి; వన్నెలవిసనకర్ర;
  • fast, n. (1) ఉపవాసం; ఉపోషం; (2) నిరాహార దీక్ష; (3) పస్తు; లంఘణం;
    • fast unto death, ph. ఆమరణ నిరాహార దీక్ష;
  • fast, adj. (1) వేగమయిన; జోరు; వడి; (2) పక్కా;
    • fast color, ph. పక్కా రంగు;
  • fasten, v. t. కట్టు; బంధించు; తాడుతో కట్టు; బిగించు; తగిలించు;
  • fastened, n. నిబద్ధం; కట్టబడినది;
    • well-fastened, ph. సన్నిబద్ధం;
  • fastidious, adj. ప్రతి చిన్న విషయాన్నీ నిశితంగా పరిశీలించే బుద్ధి గల; మెప్పించడం కష్టమైన; ప్రతీదీ అతి శుభ్రంగా ఉండాలనే తత్త్వం గల;
  • fasting, n. నిరశన దీక్ష; ఉపవాసం; లంఘనము;
    • protest fasting, ph. నిరశన దీక్ష;
    • religious fasting, ph. ఉపవాసము;
    • sickness fasting, ph. లంఘనము; లంఖణము;
  • fat, adj. కొవ్వు; కొవ్విన; బలిసిన; పీన; లావైన; పోతరించిన; బడ్డు;
    • low fat, ph. పేలవ;
    • fat cell, ph. కొవ్వు కణం;
    • fat tissue, ph. కొవ్వు కణరాసి; మేదోమయ కణజాలం;
    • fatty acid, ph. ఆమికామ్లము;
    • saturated fatty acid, ph. సంతృప్త ఆమికామ్లం;
    • unsaturated fatty acid, ph. అసంతృప్త ఆమికామ్లం;
    • mono-unsaturated fatty acid, ph. ఏక అసంతృప్త ఆమికామ్లం;
    • poly-unsaturated fatty acid, ph. బహు అసంతృప్త ఆమికామ్లం
  • fat, n. కొవ్వు; గోరోజనం; మేద; మదం; కావరం; పోతరం; ఆమికం; హామికం; పిట; గుజ్జు; వస; స్నేహ;
    • animal fat, ph. జాంతవ పిటం; జాంతవ మేదం;
    • muscle fat, ph. కండ కావరం;
    • vegetable fat, ph. శాకీయ పిటం; శాకీయ మేదం;
    • fatty acid, ph. ఆమిక ఆమ్లం; గోరోజనామ్లం;

---Usage Note: fat

  • ---Fat means that someone or something weighs too much, but this word is not very polite to use about people. Use plump to be polite. Chubby is used to describe babies and young children and is acceptable. Over-weight means that someone weighs too much and is the term used by medical professionals. Obese means that someone is extremely fat in a way that is dangerous to their health.
  • fatal, adj. ప్రాణాంతకమైన; మరణాంతకమైన; మారకమైన; చంపే; (rel.) deadly; mortal; lethal;
  • fatalism, n. దేవుడి మీద భారం వేసి మానవ ప్రయత్నం మానుకోవడం; అన్ని అదృశ్య శక్తులవల్లనే జరుగుతాయనే నమ్మకం;
  • fatality, n. చావు; మరణం;
  • fate, n. కర్మ; రాత; ప్రారబ్దం; విధి; గ్రహపాటు; ఘటన; నియతి; వాసన; అదృష్టం;
  • father, n. నాన్న; నాయన; తండ్రి; అయ్య; అబ్బ; అప్ప; పిత; జనకుడు;
    • father of the nation, ph. జాతి పిత;
  • father, v. t. కను;
  • father-in-law, n. మామగారు; మావయ్య గారు; భార్య తండ్రి; (note) మామ, మావయ్య without the honorific గారు could mean mother's brother;
  • fatherhood, n. పితృత్వం;
  • fathom, n. నిలువు; ఆరు అడుగులు; రెండు గజాలు; లోతు కొలవడానికి వాడే ఒక కొలమానం;
  • fathom, n. నిలువు; నిలువు లోతు;
  • fatigue, n. అలసట; బడలిక; సేద; ఆయాసం; గ్లాని;
    • moral fatigue, ph. ధర్మగ్లాని;
    • metal fatigue, ph. లోహ గ్లాని;
    • mental fatigue, ph. మానసిక గ్లాని;
  • fatness, n. పోతరం; పోతరింపు; బలుపు;
  • fatty, adj. కొవ్వుతోకూడిన; కొవ్విన; బలసిన; పోతరించిన;
    • fatty acid, ph. గోరోజనామ్లం;
  • fault, n. అవద్యం; తప్పు; దోషం; లొసుగు; లోపం; దబ్బర;
    • find fault, ph. తప్పు పట్టు;
  • fault-tolerant, adj. అవద్యతాళుకం;
  • fauna, n. జంతుకోటి; జంతుజాలం; జంతువర్గం; ఒక ప్రాంతంలో ఉన్న జంతుజాలం;
  • favor, favour (Br.); n. సహాయం; ఉపకారం; అనుగ్రహం; అవం;
  • favorable, n. అనుకూలం; సానుకూల్యం;
  • favorable, adj. అనుకూల; సానుకూల; (ant.) ప్రతికూల;
    • favorable atmosphere, ph. సానుకూల వాతావరణం; అనుకూల వాతావరణం;
  • favorably, adv. సుముఖంగా; అనుకూలంగా;
  • favorite, n. (1) ఇష్టుడు; ఇష్టురాలు; (2) అభీష్టం; ఇష్టతమం; ప్రియం;
  • favoritism, n. ఆశ్రితపక్షపాతం;
  • fawn, n. లేడిపిల్ల; లేడికూన;
  • fear, n. భయం; భీతి; దిగులు; బెదురు;
  • fearful, adj. భయంకరమైన; బెదిరే; జడిసే’ భయపడే;
  • fearless, adj. నిర్భయ; విభయ; నిబ్బర;
  • fearless, n. నిర్భయం; నిబ్బరం; విభయం;
  • fearlessness, n. నిర్భీతి; నిర్భయత్వం; నిర్భీకత్వం; నిబ్బరం; పరాక్రమం;
  • feasible, n. సాధ్యం; వల్ల;
  • feasibility, n. వల్ల; వీలు; సాధ్యాసాధ్యాలు;
  • feast, n. విందు; తద్దె; విందు భోజనం; ఆవెత; రసాయనం; పంక్తి భోజనం;
  • feast to the ears, ph. వీనుల విందు;
  • feast to the eyes, ph. కన్నుల విందు; కన్నుల పండుగ; నేత్రపర్వం;
  • feat, n. సాహసకృత్యం; అద్భుతకత్యం; విద్దె;
  • feather, n. ఈక; తూలిక;
  • feature, n. (1) కళవళిక; తీరు; వైఖరి; (2) ముఖ్యమైన లక్షణం; గుణం;
    • facial feature, ph. ముఖ కళవళిక; ముఖం తీరు;
  • featured, adj. ముఖ్యమైన; ప్రధాన;
    • speaker, ph. ముఖ్యమైన వక్త;
  • febrifuge, n. జ్వరహరి; జ్వరహారిణి; జ్వరాన్ని తగ్గించేది;
  • feces, n. మలము; పురీషం; (Br.) faeces;
  • fecundation, n. గర్భాదానం;
  • fecundity, n. పిల్లలని కనగలిగే శారీరక స్తోమత; [see also] fertility;
  • federal, adj. సంయుక్తమైన; కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన; relating to or denoting the central government as distinguished from the separate units constituting a federation;
  • federation, n. సమాఖ్య;
  • fee, n. రుసుం; జీతం; శుల్కం; మజూరి; దక్షిణ; ఫీజు;
    • entrance fee, ph. ప్రవేశ రుసుం;
    • membership fee, ph. సభ్యత్వ రుసుం;
    • tuition fee, ph. జీతం; పాఠశాలకి విద్యార్థి చెల్లించే రుసుము;
    • fee for a service, ph. దక్షిణ;
  • feeble, adj. నీరసమైన; నిస్త్రాణమైన;
  • feed, v. i. తిను; మేయు;
  • feed, v. t. తినిపించు; మేపించు; భోజనం పెట్టు;
  • feed, n. (1) మేత; (2) దాణా;
  • feedback, n. పునర్భరణం; పతిపుష్టి; పునర్‌దాణా;
  • feel, v. t. తాకు; స్పర్శించు;
  • feeling, n. అనుభూతి; సంవేదన; కనికరం; రసం; భావం; గుణం;
    • guilt feeling, ph. పాప సంవేదన;
  • feet, n. pl. పాదములు; చరణములు;
  • feign, n. pl. నటించు; టక్కు చేయు; టక్కరి పనులు చేయు;
  • felatio, n. పురుషుడి లింగాన్ని నోట్లో పెట్టుకుని నాకడం;
  • feldspar, n. భూస్ఫటికం;
  • felicitation, n. అభినందన; సత్కారం;
  • feigned, adj. నటించిన; మిథ్య; అళీక;
    • feigned courage, ph. అళీక ధైర్యం;
  • feline, adj. పిల్లి జాతికి చెందిన;
  • fellow, adj. సహ; తోటి;
    • fellow student, ph. సహపాఠి; తోటి విద్యార్థి;
    • fellow worker, ph. సహోధ్యాయుడు; సహాధ్యాయి; తోటి పనివాడు;
  • felon, n. అపరాధి; నేరస్థుడు; నేరస్తురాలు;
  • felony, n. అపరాధం; నేరం; దండనార్హమైన నేరం;
  • felt, n. ఒక రకం ఉన్ని బట్ట; నేత లేకుండా ఉన్నితో చేసిన బట్ట;
  • female, adj. ఆడ; పెంటి; పెట్ట; పెయ్య;
    • female members, ph. ఆడవారు; ఆడంగులు;
  • female, n. ఆడది; స్త్రీ;
    • feminine gender, ph. మహాతీవాచకం; స్త్రీలింగం;
  • femoral, adj. ఊరు; తొడకి సంబంధించిన;
    • femoral vein, ph. ఊరు సిర; తొడలో ఉండే సిర;
  • femur, n. ఊర్వస్తి; తొడ ఎముక;
  • fence, n. కంచె; దడి; తట్టిగోడ; వృతి; అవహాలిక; అలవ;
    • palm leaf fence, ph. దడి; (note) దడి అవరోధం కల్పించడమే కాకుండా కొంత మరుగు కూడా ఇస్తుంది;
    • picket fence, ph. కటకటాల కంచె; కంచె అవరోధం కల్పిస్తుంది తప్ప మరుగు ఇవ్వదు;
    • twig fence, ph. అలవ;
  • fencing, n. గరిడీ; కత్తిని కాని, కర్రని కాని లాఘవంగా తిప్పడం;
  • fennel, n. సోపు; పెద్ద జీలకర్ర; [bot.] Foeniculum vulgare;
  • fenugreek, n. మెంతులు;
  • fermentation, n. పులియబెట్టుట; విపాకం; కిణ్వప్రక్రియ; ఫేనీకరణం;
  • fermented, adj. ఆసవ; పులియబెట్టిన; కిణ్వ;
  • ferocious, adj. ఉగ్రమైన; భయంకరమైన; ప్రచండ; క్రూరమైన;
  • ferocity, n. ఉగ్రత; క్రౌర్యం; భయంకరత్వం;
  • ferro, pref. అయస్; ఇనుముకి సంబంధించిన;
  • ferric, adj. అయిక్; ఆయిక;
  • ferrous, adj. అయస్; ఆయస;
    • ferrous ion, ph. అయస శకలం;
    • ferrous sulfate, ph. అన్నభేది; FeSO4; Ferrous Sulfate is an essential body mineral; It is used to treat iron deficiency anemia (a lack of red blood cells caused by having too little iron in the body);
  • ferrule, n. తొడి; పొన్ను; చేతికర్ర మొనకి తొడిగే కిరీటం;
  • ferry, n. రహదారి పడవ; రాదారి పడవ; ఏరు దాటడానికి వాడే పడవ; దోనెపుట్టి;
  • fertile, adj. సారవంతమైన;
  • fertility, n. (1) సారం; సత్తువ; (2) పిల్లలని కన్న శక్తి; (note) Fecundity refers to the potential production, and fertility to actual production, of live offspring;
  • fertilization, n. ఫలదీకరణం;
  • fertilize, v. t. ఫలదీకరించు; ఎరువు వేయు;
  • fertilizer, n. (1) ఎరువు; (2) కరీషము; గత్త; ఆకుపెంట; పేడపెంట;
  • fervor, n. తీవ్రత;
  • festival, n. పండుగ; సంబరం; ఉత్సవం; జాతర;
  • festoon, n. తోరణం;
  • fetch, n. తెచ్చు;
  • fetid, adj. కుళ్లిన; దుర్గంధమైన;
  • fetish, n. శరీరంలో ఏ భాగాన్ని అయినా సరే లైంగిక దృష్టితో చూసి ఆనందించడం; ఏ పని మీదనయినా అతిగా దృష్టి నిలపడం;i
    • religious fetish, ph. మన చుట్టూ ఉన్న సాధారణమైన వస్తువులకి మానవాతీతమైన శక్తులున్నాయని నమ్మి వాటికి దైవత్వం ఆపాదించడం; ఉదా. ఒక మత ప్రవక్త నఖ, కేశాలకి మహత్తు ఉందని నమ్మడం;
    • psychological fetish, ph. మన చుట్టూ ఉన్న సాధారణమైన వస్తువులని లైంగికమైన అనుభూతితో చూడడం; ఉదా. ఒక వస్తువుని స్త్రీగా భ్రమించి ఆ వస్తువుతో లైంగికమైన సంపర్కం పొందడానికి ప్రయత్నం చెయ్యడం;
  • fetter, n. శృంఖలం; (rel.) unfettered
  • fetus, foetus (Br.), n. భ్రూణం; ఉలబము; అంకురం; అర్భకం; పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు కడుపులో పిల్ల;
  • feud, n. తగువు; తగాదా; సంసారంలో వచ్చే తగాదా; కుటుంబకలహం;
    • blood feud, ph. పాలిపగ;
  • feudalism, n. జాగిర్‌దారీ; జమీందారీ; మొఖాసా;
  • fever, n. ఉష్ణం; ఊష్ణం; జ్వరం; రూక్ష;
    • hay fever, ph. పీన జ్వరం; గవత జ్వరం; ఒక రకం ఎలర్జీ;
    • typhoid fever, ph. సన్నిపాత జ్వరం; ఆంత్రిక జ్వరం; టైఫాయిడ్;
    • typhus fever, ph. విష జ్వరం;
    • yellow fever, ph. కుంభ కామెర్లు;
  • feverishness, n. సలపరం;
  • few, adj. కొద్ది; కొన్ని; కొందరు;
  • fewer, adj. తక్కువ; లెక్కింపులో తక్కువ;
  • fiance, n. పెండ్లాడబోయే కుర్రాడు; కాబోయే భర్త;
  • fiancee, n.f. పెండ్లాడబోయే కుర్రది; కాబోయే భార్య;
  • fiasco, n. అభాసు; రసాభాసు;
  • fib, n. అబద్ధం; బొంకు;
  • fiber, fibre (Br.), n. నార; పీచు; ఈనె; నారపోగు; తీగ; తంతువు; నూలు;
    • dietary fiber, ph. పోషక తాంతవం;
    • optical fiber, ph. దృక్ తంతువు; చక్షుష తంతువు;
    • wood fiber, ph. దారు తంతువు;
  • fibrillation, n. దడ;
  • fibrin, n. తాంతవం; రక్తములో నార వంటి పదార్థం;
  • fibrinogen, n. తాంతవజని; రక్తములో నార వంటి పదార్థానికి ఆధారభూతమైన ప్రాణ్యపదార్థం;
  • fibroblasts, n. తంతుకణములు; పీచుకణములు;
  • fibrosis, n. తంతీకరణము;
  • fibula, n. జానుక; బహిర్ జంఘాస్థి; అనుజంఘాస్థి;
  • fickle, adj. చంచలమైన; స్థిరబుద్ధి లేని; నిలకడలేని; చపల;
  • fiction, n. కల్పన; కల్పించిన కథ; కల్పిక; కట్టుకథ; ప్రబంధం; ప్రబంధ కావ్యం; సృజనాత్మక రచన; పరిక;
    • science fiction, ph. శాస్త్రీయ కల్పన; వైకల్పన; వైజ్ఞఆనిక కల్పన;
  • fictional, adj. కాల్పనిక; కూట;
  • fictitious, adj. కాల్పనిక; కూట;
  • ficus, n. చెట్లకి సంబంధించిన ఒక జాతి పేరు;
  • fiddle, n. ఫిడేలు; వాయులీనాన్ని పోలిన వాద్యవిశేషం;
  • fidgeting, n. బోరు కొట్టినప్పుడు కాని, ఆత్రుతగా ఉన్నప్పుడు కాని, కుదురుగా ఉండకుండా శరీరపు అంగాలని అనవసరంగా కదలించడం; ఉదా. పెదవులతో వికారపు చేష్టలు చెయ్యడం, కుర్చీలో కుదురుగా కూర్చోకుండా ఇటూ, అటూ కదలడం, కాళ్లని తాటించడం, మెటికలు విరవడం, మొదలైన చేష్టలు చెయ్యడం;
  • fiduciary, adj. విశ్వాసాశ్రిత; ఒకరి తరఫున విశ్వసనీయంగా ప్రవర్తించే;
    • fiduciary limit, ph. విశ్వాసాశ్రిత పరిమితి;
    • fiduciary reserve, ph. విశ్వాసాశ్రిత నిధి;
  • fiduciary, n. విశ్వాసపాత్రుడు; ఒకరి తరఫున విశ్వసనీయంగా ప్రవర్తించే మరొక వ్యక్తి కాని, సంస్థ కాని;
  • field, n. (1) పొలం; చేను; మైదానం; మడి; బీడు; క్షేత్రం; కేదారం; శాకటం; హల్యం; (2) రంగం; ప్రదేశం; స్థానం;
    • playing field, ph. బంతుల బీడు;
    • field glasses, ph. ఆరుబైట ఉపయోగానికి వీలయిన బైనాక్యులర్ టెలిస్కోపు;
    • field hospital, ph. బీడాసుపత్రి;
    • field of work, ph. కార్యక్షేత్రం;
  • fiend, n. దయ్యం; భూతం; పిశాచం; సైతాను; an evil spirit or demon;
  • fierce, adj. ఉగ్ర; భయంకర; దారుణ; తీవ్ర; ఉద్దండ;
  • fifteen, n. పదిహేను; పదునయిదు; పంచదశ;
  • fifth, adj. అయిదవ; అయిదో; అయిదింట ఒకటి; ఐదో;
    • fifth wheel, ph. [idiom] పానకంలో పుడక; పిలవని పేరంటం; నలుగురి మధ్య ఎవ్వరికీ అక్కర లేని వ్యక్తి;
  • fifth, n. అయిదింట ఒకటి; అయిదో వంతు;
  • fifty, n. ఏభయి; ఏబది; ఏను పదులు;
  • fifty-fifty, n. [idiom] చెరి సగం;
  • fig, n. అత్తి; మేడి; అంజీర;
  • fight, n. దెబ్బలాట; తగువు; లడాయి; పోట్లాట; కొట్లాట; కాట్లాట; జట్టీ; కజ్జా; జగడం; పోరాటం; యుద్ధం;
  • fight, v. t. దెబ్బలాడు; పోట్లాడు; కొట్లాడు; తగువులాడు; జట్టీలాడు;
  • fighting, v. t. దెబ్బలాడడం; పోట్లాడడం; కొట్లాడడం; తగువులాడడం; జట్టీలాడడం;
  • figment, n. కల్పన; కట్ఠుకథ; నీలివార్త;
    • figment of imagination, ph. పగటికల; ఉహాలోకంలోనిది; నిజం కానిది;
  • figure, n. (1) బొమ్మ; పటం; చిత్రం; (2) విగ్రహం; రూపం; ఆకారం; (3) అంకం; అంకె; సంఖ్య;
    • figure of speech, ph. [gram.] అలంకారం; భాషలో వాడే అలంకారం;
    • significant figure, ph. సార్థకాంశం; దశాంశ పద్ధతిలో దశాంశ బిందువు తర్వాత వచ్చే అంకెలలో ఒకటి;
  • figure, v. i. కనపడు; v. t. లెక్కించు; లెక్కలోకి తీసుకొను;
    • figure head, ph. [idiom] ఉత్సవ విగ్రహం; ఉత్సవ మూర్తి; అధికారం లేకుండా మాటవరసకి పదవి అలంకరించిన వ్యక్తి;
    • figurative meaning, n. ఉద్దుష్టార్థం;
  • filament, n. పోగు; తంతువు; ఈనె; అకరువు; కేసరి; కింజిల్కము;
    • cortical filament, ph. వల్కల తంతువు;
  • filaria, n. బోదకాలు;
  • filariasis, n. బోదకాలు;
  • file, n. (1) దస్త్రం; దస్తరం: దొంతి; (2) ఆకురాయి; పత్రపరశువు; (3) చదరంగంలో నిలువు వరుస;
    • rat tail file, ph. గుండ్రాకురాయి;
    • single file, ph. ఏకదొంతి; ఒక వరుస;
    • small file, ph. కమ్మి ఆకురాయి;
    • triangular file, ph. పలకాకురాయి;
    • file format, ph. సంచికా ప్రారూపం; దస్త్రపు ప్రారూపం;
  • file, v. t. (1) దఖలు చేయు; (2) దొంతిలో పెట్టు; దాచు; (3) కంప్యూటరు పరిభాషలో ఒక రకం దత్తాంశ కట్టడం;
  • filet, n. [ఫిలే] ఎముకలు తీసేసిన మాంసం, చేపలు;
  • filigree, n. జరీ పోగు అల్లికతో అలంకరించబడ్డ వస్తువు;
  • filings, n. రజను; రాపొడి; బీడు;
    • iron filings, ph. ఇనప రజను;
  • fill, v. t. నింపు; నింపిడి చేయు; పూడ్చు; పూరించు; భర్తీ చేయు;
  • fill, v. i. నిండు; పిక్కటిల్లు;
  • filled, adj. ఆపూరితము; ఆపూరిత;
  • filling, n. కూరు; పూర్ణం; పూరణం; ఉంభనం; ఆపూర్తి;
  • filly, n. ఆడ గురప్ప్రిల్ల;
  • film, n. (1) పొర; (2) ఫిల్ము; (3) సినిమా; చలనచిత్రం;
  • filmography, n. చలనచిత్ర చింతామణి; చిత్ర చింతామణి; చిత్రావళి; చలనచిత్రావళి (ప్రశ్నావళి లాగ); A comprehensive list of movies in a particular category, as of those by a given director or in a specific genre;
  • filter, adj. వడపోత; గలన;
  • filter, n. వడపోతగిన్నె; గలని; సంగలని;
  • filter, v. t. వడపోయు; వడగట్టు;
    • filter cone, ph. గలన శంకువు;
    • filter paper, ph. వడపోత కాగితం; గలన పత్రం;
  • filth, n. మలం; మురికి;
  • filthy, n. మలంతో నిండిన; అసహ్యమైన; రోతపుట్టించే;
  • filtrate, n. గాలితం; వడపోతలో కిందకి దిగినది;
  • filtration, n. వడపోత; గలనం;
  • fin, n. రెక్క;
    • anal fin, ph. కింది రెక్క; గుదము దగ్గర ఉన్న రెక్క;
    • caudal fin, ph. తోక రెక్క;
    • dorsal fin, ph. వెన్ను రెక్క;
    • pectoral fin, ph. ఊరో రెక్క; ముందు రెక్క;
  • final, adj. (1) ఆఖరు; చివర; చరమ; తుది; అంతిమ; కడపటి; కొస; అవసాన; దొన; తిరుగులేని;
    • final act, ph. చరమ అంకం;
    • final examinations, ph. పెద్ద పరీక్షలు;
    • final phase, ph. చరమ దశ;
    • final song, ph. చరమ గీతం;
    • final touches, ph. తుది మెరుగులు;
    • final twist, ph. తుది మెరుపు; కొస మెరుపు;
  • finalize, v. i. తుదిముట్టించు; పూర్తిచేయు; ఫైసలుచేయు;
  • finally, adv. ఆఖరుకు; చివరకు; తుదకు; కట్టకడకు; కడాకి;
  • financial, adj. దేశాదాయ; కోశాదాయ; రాజ్యాదాయ; రాజస్వ; ఆర్థిక; రాబడికి సంబంధించిన; see also fiscal, monetary;
    • financial capability, ph. ఆర్థిక స్తోమత;
    • financial sector, ph. ఆర్థిక రంగం;
    • financial statement, ph. ఆయవ్యయ ప్రవచనం; రాబడి ఖర్చుల లెక్క;
    • financial strength, ph. ఆర్థిక స్తోమత; ఆర్థిక సౌష్టవం;
  • financier, n. శ్రేష్ఠి; పెట్టుబడిదారుడు;
  • find, v. i. (1) నిశ్చయించు; నిర్ణయించు; (2) కనిపించు; దొరుకు;
  • find, v. t. కనుక్కొను; కనుగొను; వెతుకు;
  • fine, adj. సున్నితమై; చక్కనైన; లలిత; బాగున్న; నాణ్యమైన; సన్నని;
    • fine arts, ph. లలిత కళలు;
  • fine, n. జరిమానా; జుర్మానా; జుల్మానా; ధనదండన;
  • finesse, n. నేర్పు; నేర్పరితనం; క్లిష్ఠ పరిస్థితులలో చూపే నేర్పరితనం;
  • finger, n. వ్రేలు; చేతివ్రేలు; అంగుళం; కరజం; చేమున్ను; అణ్వి; (rel.) toe;
    • index finger, ph. చూపుడు వేలు; తర్జని;
    • little finger, ph. చిటికన వేలు; కనిష్ఠికా;
    • middle finger, ph. మధ్య వేలు;
    • ring finger, ph. ఉంగరపు వేలు; అనామిక;
    • finger millet, n. రాగులు;
    • finger nail, n. గోరు; చేతిగోరు; కరనఖం;
  • finger, v. i. చూపించు; నేరారోపణ చేయు;
  • fingerprint, n. వేలిముద్ర;
  • finish, n. మెరుగు;
  • finish, v. i. పూర్తిచేయు; కోసముట్టించు; సమాప్తి చేయు;
  • finished, n. సమాప్తం;
  • finite, adj. పరిమితమైన; సాంతమైన; మితిగల; హద్దుగల; నిశ్చిత; సమాపక;
  • finite, n. సాంతం;
  • fjord, n. సముద్రపు చీలిక; పర్వత పంక్తులకి మధ్యగా చొచ్చుకు వచ్చిన సముద్రం;
  • fir, n. దేవదారు;
  • fire, n. నిప్పు; అగ్ని; అగ్గి; మంట; చిచ్చు; వహ్ని; చిత్రమూలం;
    • playing with fire, ph. నిప్పుతో చెలగాటం;
    • sacred fire, ph. అగ్నిహోత్రం;
  • fire, v. t. (1) అంటించు; తగులబెట్టు; ముట్టించు; కాల్చు; (2) ఉద్యోగం నుండి తీసివేయుట; (3) తుపాకితో పేల్చు;
    • fire brigade, ph. అగ్నిమాపక దళం;
    • fire engine, n. నీరింజను;
    • fire fighter, ph. నీరుపాప;
  • firecracker, n. టపాకాయ;
  • firecrest, n. అగ్గిపిచ్చుక; ఒక రకమైన పిచ్చుక;
  • firefly, n. మిణుగురు పురుగు;
  • Fire god, n. జాతవేదుడు;
  • firemen, n. అగ్నిమాపక దళం;
  • fireplace, n. (1) అంతిక; (2) నెగడి; క్రూర జంతువులని దూరంగా ఉంచడానికి వేసుకునే మంట;
  • firestone, n. చెకుముకి రాయి;
  • firewall, n. (1) అగ్గోడ; అగ్గిగోడ; అగ్నికుడ్యం; ఒక పక్క నుండి మరియొక పక్కకు మంటలు వ్యాపించకుండా అడ్డంకిలా పనిచేసే గోడ; (2) అధికారం లేకుండా కంప్యూటరు వలయాలలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించే వారిని నిరోధించే పరికర సముదాయం;
  • firewood, n. వంటచెరకు; కరల్రు; కట్టెలు; చితుకులు;
    • dried twigs of firewood, ph. చితుకులు;
  • fireworks, n. బాణసంచా; చిచ్చుబుడ్లు; మతాబాలు;
  • firm, adj. గట్టి; దృఢమైన;
  • firm, n. వ్యాపార సంస్థ; వర్తక సంఘం; భాగస్వామ్యం; కంపెనీ;
  • firmly, adv. ఖరాఖండిగా; నిర్మొహమాటంగా; నీళ్లు నమలకుండా;
  • firmament, n. ఆకాశం; ఖగోళం; తారాపథం;
  • firmware, n. స్థిరతంత్రం; ధ్రువతంత్రం; Software stored in read-only memory (ROM) or programmable ROM (PROM);
  • first, n. మొదటిది; ప్రథమం; ఆదిమం; అగ్రిమం;
  • first, adj. మొదటి; ప్రథమ; ఆది; తొలి; తొలకరి; ఒకటవ;
    • first aid, ph. ప్రథమ చికిత్స;
    • first call (in an auction), ph. ఒకటవసారి;
    • first class, ph. మొదటి తరగతి; ప్రథమ శ్రేణి;
    • first harmonic, ph. ప్రథమ సమస్వరం;
    • first name, ph. పెట్టిన పేరు; కొన్ని సంప్రదాయాలలో పెట్టిన పేరు ముందు ఆ తర్వాత ఇంటిపేరు రాసుకుంటారు;
    • first pregnancy, ph. తొలి చూలు;
    • first rank, ph. ప్రథమ స్థానం; ప్రథమ శ్రేణి;
    • first show, ph. మొదటి ఆట; తొలి ఆట;
    • first time, n. తొలి సారి; మొదటి సారి;
    • first person, n. [gram.] ఉత్తమ పురుష; (note) తెలుగు వ్యాకరణంలోని ప్రథమ పురుష, ఇంగ్లీషులో third person;
  • first-generation, adj. మొదటి తరం; ప్రథమ వంశశ్రేణి;
  • fiscal, adj. దేశాదాయ; కోశాదాయ; రాజ్యాదాయ; రాజస్వ; ఆర్థిక; కోశ సంబంధ; రాబడికి సంబంధించిన; ఆర్థిక; ప్రజలనుండి వసూలుచేసిన డబ్బుకి సంబంధించిన; same as financial; (rel.) monetary;
    • fiscal year, ph. ఆర్థిక సంవత్సరం; సరాసరి 12 నెలల కాలం; అమెరికా ప్రభుత్వం వారి ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న మొదలయి, సెప్టెంబరు 30న అంతం అవుతుంది; అందరూ ఇవే తారీకులని అవలంబించాలని నియమం ఏమీ లేదు;
  • fish, n. చేఁప; మత్స్యం; ఝషం; మీను; మీనం; శకులి; విసారం; చేపలలో ఉన్న రకాలకి ఎన్నో తెలుగు పేర్లు ఉన్నాయి కాని వాటి వాటికి సరి సమానమయిన ఆంగ్లం పేర్లు తెలియవు. ఉదా : ఆకుజెల్ల; ఇంగిలాయి; ఇసుకదొందు; ఈసపిట్ట; ఉల్లాకుచేప; ఉల్లికుచ్చడం; కట్టచేప; కాగిస; కుంటముక్కు; కొరమ్రీను; గండుమీను; చావడాయి; జెల్ల; టేకి; తమ్మరొట్ట; నెత్తళ్లు; పండుగప్ప; పరిగ; పాలబొంత; పులస; పొనుగు చేప; పొరక చేప; పోసరెక్క; బెత్తలు; బేడిస; బొచ్చె; బొమ్మిడాయి; మట్టగిడస; మడవ చేప, మాగ; ములువాలుగ; మోజు; మోరపక్కె; రవ; రాతిగొరక; రామలు; లత్తిచేప; వంజరం; వాలుగ; వాలుగటెంకి; వాలుగపాము; వింజిలి; సొర;
    • flat fish, ph. తట్ట చేప;
    • porcupine fish, ph. ఈసపిట్ట;
    • school of fish, ph. విసార వారం;
    • young fish, ph. పిల్ల చేప; శకులార్భకం;
  • fish-less, n. నిర్మీనం; నిజ్ఝషం; నిర్మత్స్యం; చేఁపలులేని; మీనుల్లేని;
  • fisherman, n. జాలరి; బెస్తవాఁడు; మైనికుఁడు; దాశుఁడు; కేవర్తుఁడు; చేఁపలబట్టువాఁడు;
  • fission, n. విభాగం; విదారణం; విచ్ఛిత్తి; విఘటన;
    • atomic fission, ph. అణు విదారణం;
    • nuclear fission, ph. కణిక విదారణ;
  • fissure, n. చీలిక; పగులు; బీట;
  • fist, n. పిడికిలి; ముష్టి; గుప్పెట; లస్తకం;
  • fistfight, n. ముష్టియుద్ధం; పిడికిలి పోరు;
  • fistful, n. పిడికెడు; గుప్పెడు;
  • fistula, n. భగందరం; వ్రణనాళము; సంధినాళము; లూఠీ; A fistula is an abnormal connection between two body parts, such as an organ or blood vessel and another structure;
  • fit, n. (1) ఉచితరీతి; అనుకూలమైన; తగిన; (2) సరిపడా; పట్టిన; (3) మూర్ఛ;
  • fit, v. i. అమురు; కుదురు; పొసగు; ఇముడు;
  • fit, v. t. అముర్చు; సరిపుచ్చు; కుదుర్చు; ఇముడ్చు; పొసగనిచ్చు;
  • fitness, n. యోగ్యత;
    • physical fitness, ph. తగిన ఆరోగ్యం కలిగి ఉండడం;
  • fits, n. s. వంపులు; మూర్చ; (rel.) epilepsy;
  • five, n. అయిదు; అరపది; చేయి; ఏను; ఐదు;
  • five, adj. పంచ; అయిదవ; అయిదుగురు;
    • five year plan, ph. పంచవర్ష యోజనం; పంచవర్ష ప్రణాళిక;
  • five-pointed star, ph. పంచ ముఖ నక్షత్రం;
  • fix, v. t. (1) కుదుర్చు; స్థిరపరచు; లగ్న పరచు; (2) తయారుచేయు; అమర్చు; (3) బాగు చేయు; మరమ్మత్తు చేయు;
  • fixation, n. స్థిరీకరణ;
    • nitrogen fixation, ph. నత్రజని స్థిరీకరణ;
  • fixed, adj. స్థిరమైన; అచంచలమైన; స్థావర; అకుంఠిత; అచర; ధ్రువ;
    • fixed capital, ph. స్థిరమయిన మూలధనం;
    • fixed deposit, ph. స్థిరమయిన ధరావతు; స్థావర నిక్షేపం; ఉపనిధి; ఉపనిక్షేపం;
    • fixed point, ph. స్థిరమయిన బిందువు;
  • fixtures, n. స్థావరాలు; ఇళ్లలోనూ, భవనాలలోనూ, గోడలకి, నేలకి స్థిరంగా అమర్చిన కుళాయిలు, దీపాలు, మొదలయిన పరికరాలు;

Part 2: Fl-Fz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • flabby, adj. తటుకు;
  • flabby breasts, తటుకు చన్నులు;
  • flag, n. జెండా; పతాకం; ధ్వజం; బావుటా; కేతనం; సిడం; ప్రేంఖణం;
    • flag pole, ph. ధ్వజస్తంభం; సిడపు కంబం;
  • flagging, adj. రెపరెపలాడుతూ ఉన్న; నీరసపడిపోతూ ఉన్న;
  • flagellum, n. కశాభం; కేశిక;
  • flail, v. i. కొట్టుకొను; అసంకల్ప ప్రతీకార చర్యగా కండరాలు గిలగిలా కొట్టుకొను;
  • flake, n. పొర; పెళ్ల; పెచ్చు; రేకు; చెక్క; దళం; తునక; తొరక;
  • flake, v. i. పొరలు పొరలుగా ఊడు; పెచ్చుకట్టు; పొరలూడు;
  • flamboyance, n. భేషజం; బడాయి; ఆర్భాటం;
  • flame, n. మంట; తమట; చిచ్చు; జ్వాల; జ్యోతి; వహ్ని; కీల; అర్చి;
    • eternal flame, ph. అఖండ జ్యోతి;
    • tip of the flame, ph. వహ్నిశిఖ;
  • flame of the forest, n. తురాయి చెట్టు; కోడిపుంజు చెట్టు; అరణ్య అగ్ని జ్వాల;
  • flank, n. పక్క; పార్శ్వం;
  • flap, n. (1) రెక్క; రెక్క వలె ఒక పక్క బందు ఉండీ ఇటూ అటూ ఊగిసలాడే పల్చటి వస్తు విశేషం; (2) [Ling.] తాడితం;
  • flap, v. i. రెక్కల వలె రెపరెప కొట్టుకొను;
  • flash, n. మెరుపు; స్ఫూర్తి;
  • flash, v. t. స్ఫురించు; మెరియు;
  • flash, adj. జ్వలన; అకస్మాత్తుగా;
    • flash point, ph. జ్వలన బిందువు; ఒక వస్తువుని క్రమంగా వేడి చేస్తూ పోతే అది ఎప్పుడైతే భగ్గున మండుతుందో ఆ ఉష్ణోగ్రత;
  • flashback, n. పూర్వకథాప్రకాశన; గతస్మృతి;
  • flask, n. ఆపుకోరా; జాడీ; గాజుపాత్ర; కుప్పె; కొప్పెర; అడుగున గుండ్రంగా ఉన్న పాత్ర;
  • flat, adj. (1) చదునైన; బల్లపరుపైన; బిళ్ల; చిపిట; చప్పిడి; (2) నిరుత్సాహమైన;
    • flat food, ph. చప్పడి తిండి; ఉప్పు, కారం లేని తిండి;
    • flat nose, ph. చప్పడి ముక్కు;
  • flat tile, n. బిళ్ల పెంకు;
  • flat, n. లోవరి; తొట్టికట్టు; అంకణం; నివాసభాగం; ఒక పెద్ద భవనంలో అద్దెకి ఉండడానికి అనువుగా కట్టిన భాగం;
  • flatbed, adj. బల్లబరుపు;
  • flatter, v. t. ఇచ్చకాలాడు; ఇచ్చకాలు చెప్పు; పొగుడు; తైరు కొట్టు;
  • flatterer, n.ఇచ్చగొండి; ఇచ్చకాల బుచ్చి;
  • flattery, n. ముఖప్రీతి; ఇచ్చకం; పొగడ్త; తైరు;
  • flatulence, n. (1) కడుపుబ్బరం; కడుపులో అపానవాయువు; (2) వాత ప్రకోపం;
  • flatworm, n. చిపిట పురుగు;
  • flavor, flavour (Br.), n. (1) షాడబం; వాచవి; రసం; గంధం; ఒక పదార్థానికి రుచిని ఆపాదించే వాసన; You have to put it in your mouth to get the flavor, but it is not taste; (2) భౌతిక శాస్త్రంలో క్వార్కులు అనే పరమాణు రేణువుల లక్షణాన్ని వర్ణించంచడానికి వాడే మాట;

---Usage Note: Taste, Smell, Odor, Aroma, Flavor Taste happens in the mouth, mostly on the tongue but also in other areas with taste buds, such as the soft palate. Aroma describes how something smells, and when talking about food is probably a better word to use than “odor.” The flavor is a combination of taste and aroma, though some think temperature and mouth-feel play a role. Whether or not you include temperature and mouth-feel, the flavor is a sensation that adds up to more than the sum of its parts. It is a complex synthesis that can be tweaked and experimented with limitlessly.

  • flavonoids, n. షాడబార్థాలు; షాడబం ఉన్న పదార్థాల వంటివి; def: any of a group of oxygen-containing aromatic antioxidant compounds that includes many common pigments (as the anthocyanins and flavones); see also crystalloids, colloids, etc.
  • flaw, n. బలహీనత; లోపం; దోషం;
  • flax, n. ఎల్లగిసె చెట్టు; a blue-flowered herbaceous plant that is cultivated for its seed (linseed) and for textile fiber made from its stalks; [bot.] Linum usitatissimum of the Linaceae family;
  • flea, n. జోరీగ; పశుమక్షికం; మిణ్ణలి;
  • fledgling, n. శాబకం; కొత్తగా ఎగరడం నేర్చిన పక్షి పిల్ల;
  • fleece, v. t. (1) ఉన్ని; గొర్రె బొచ్చు; (2) [idiom] మోసం చేయు;
  • fleet, n. వాహనాల గుంపు; ఓడల గుంపు; విమానాల గుంపు;
  • fleeting, adj. అనిత్యం; బుద్బుద ప్రాయం;
  • flesh, n. (1) మాంసం; పొల; ఈరువు; నంజుడు; ఎరచి; (2) కండ;
    • dried flesh, ph. వల్లూరం;
    • human flesh, ph. పొల;
  • flex, v. t. వంచు; తిప్పు;
  • flexibility, n. వశ్యత; వంగే గుణం;
  • flexible, adj. వంగెడు; మెత్తని; అదృఢ;
  • flicker, v. i. మినుకుమినుకుమను;
  • flicker, n. మినుకుడు; లోలనం;
  • flight, n. (1) ఎగరడం; విమాన ప్రయాణం; (2) పారిపోవడం; పలాయనం; (3) పక్షుల గుంపు; (4) మెట్ల వరస; సోపానములు;
  • fling, v. i. విసురు; ఎగురవేయు;
  • flint, n. చెకుముకి రాయి;
  • flight, n. (1) పలాయనం; (2) విమానయానం; ఆకాశగమనం; గాలిలో ప్రయాణం చెయ్యడానికి వాడే విమాన సౌకర్యం;
  • flip, v. t. తిరగవేయు; ఎగరవేయు; మొగ్గ వేయించు; పల్టీ కొట్టించు; బోల్తా కొట్టించు;
  • flip, n. బోల్తా; పల్టీ; పరిసెనం;
  • flip-flop, n. పల్టీ; ఇది ఒక రకమయిన విద్యుత్ పరివాహం;
  • flippant, adj. బాధ్యతని పట్టించుకోకుండా; తిరస్కారభావంతో; అలక్ష్యముతో;
  • flip side, n. కీడు వైపు; ఒక పని వల్ల జరగే మేలుని పరీక్షించిన తరువాత చూడబడే కీడు;
  • flirtation, n. సరసం;
  • float, n. తెప్ప; తారకం;
  • float, v. i. తేలు; తేలియాడు;
  • float, v. t. తేల్చు; తేలించు;
  • floating, n. తేలడం;
  • floating-point, n. [math.] అస్థిర బిందువు; చలన బిందువు; చర బిందు; ప్లవ బిందువు;
    • floating-point arithmetic, ph. [math.] ప్లవ బిందు అంకగణితం; చర బిందు అంకగణితం;
    • floating-point calculation, ph. [math.] ప్లవ బిందు కలనం; చర బిందు కలనం;
    • floating-point notation, ph. [math.] చర బిందు సంకేతం; చేఅ బిందు సంకేత పద్ధతి; ప్లవ బిందు సంకేతం; A number representation consisting of a mantissa M, an exponent E, and an (assumed) radix or base;
  • floc, n. ఉండ; తుట్టె; a loosely clumped mass of fine particles;
  • flock, n. మంద; గుంపు; పక్షుల గుంపు; కులం;
  • flocculation, n. [chem.] పొరకట్టడం; పెళ్లలుగా ఊడడం; పెచ్చు కట్టడం; తొరకలుగా తేలడం; ఉండకట్టడం; (note) In colloid chemistry, flocculation refers to the process by which fine particulates are caused to clump together into a floc or flake. The floc may then float to the top of the liquid (creaming), settle to the bottom of the liquid (sedimentation), or be readily filtered from the liquid.
  • floe, n. మంచుపొర; సరస్సులలో పైనున్న నీరు గడ్డకట్టగా వచ్చే పొర;
  • flogging, n. శిక్షించడానికి కొరడాతో కొట్టడం;
  • flood, n. వరద; వెల్లువ; వెల్లి; ప్రవాహం; ముంపుడు; ఔఘం; పెందడి;
    • flash flood, ph. మెరుపు వరద;
  • flood, v. i. వరదగు; ప్లావితమగు;
  • flood gates, n. ముంపుడు తలుపులు;
  • flooded, adj. ఆపూరితము;
  • floor, n. (1) గచ్చు; తలిమం; (2) నేల; (3) అంతస్తు;
    • cement floor, ph. గచ్చు;
    • third floor, ph. మూడవ అంతస్తు;
    • levelled floor, ph. కుట్టిమం; సాపుగచ్చు;
  • flooring tile, n. గచ్చుపలక;
  • flop, v. i. నేల కరచు; విజయం కాకుండా పోవు; విఫలమగు; చీదేయు;
  • floppy, adj. దిట్టతనం లేకుండా వేలాడిపోవు;
  • flora, n. వృక్షవర్గం; వృక్షజాలం; ఉద్భిజ్జజాలం; ఒక దేశపు వృక్ష సంపద;
  • florescence, n. పువ్వుల పూత; పూబూత; పువ్వులు పూసే కాలం;
  • floriculture, n. పువ్వుల పెంపకం; పూల పెంపకం;
  • florid, adj. అలంకారిక;
  • flotilla, n. పడవల గుంపు;
  • florist, n. f. మాలిని; మాలాకరి;
  • flounce, n. అంచు; border;
  • flounce of frill, ph. కుచ్చెళ్ల అంచు;
  • flour, adj. (ఫ్లవర్) పిండి;
  • flour mill, ph. పిండి మర;
  • flour, n. (ఫ్లవర్) పిండి; సున్ని;
    • wheat flour, ph. మైదా పిండి; గోధుమ పిండి;
    • flour mill, ph. పిండి మర; పిండి మిల్లు;
  • flour-spar, n. నాపరాయి;
  • flourish, v. i. ప్రభవిల్లు; వినుతికెక్కు; వెల్లివిరియు; విలసిల్లు; భాసిల్లు; కొమరారు; అలరారు; శోభిల్లు; పరిఢవిల్లు; నమనమలాడు; వర్ధిల్లు;
  • flout, v. t. ధిక్కరించు; నిర్లక్ష్యం చేయు;
  • flow, adj. ప్రవాహ;
    • flow chart, ph. ప్రవాహ చిత్రం; ప్రవాహ పటం;
  • flow, n. ప్రవాహం; స్రావం; అకిని; చాలు;
    • menstrual flow, ph. రుతుస్రావం;
    • slow flow, ph. మందాకిని; మంద + అకిని;
  • flow, v. i. ప్రవహించు; స్రవించు; పారు; ఓడిగిల్లు;
  • flower, n. (ఫ్లవర్) పువ్వు; పుష్పం; సుమం; కుసుమం; విరి; అలరు;
    • flower bed, ph. పూలమడి;
  • flower pot, ph. పూలకుండీ;
    • flower without fragrance, ph. నిర్గంధ కుసుమం;
    • wild flower, ph. గడ్డిపువ్వు;
  • flower, v. i. పూయు; విచ్చు; పుష్పించు; అలరారు;
  • flu, n. ఇన్‌ఫ్లూయంజాని కత్తిరించగా వచ్చిన మాట;
  • fluctuate, v. i. ఊగిసలాడు;
  • fluctuation, n. ఊగిసలాట; ఉచ్చావచం; హెచ్చుతగ్గులు;
  • fluently, adv. ధారాళంగా; ఝరిగా; వాచాలకత్వంగా;
  • fluency, n. ఒక భాషని తడబడకుండా మాట్లాడగలగడం; వాగ్ధాటి; వాగ్ఘరి;
  • flue, n. పొగగొట్టం;
  • fluent, n. అనర్గళం;
  • fluency, n. అనర్గళత్వం;
  • fluid, n. ఐర; ద్రవర్ధం; ద్రవపదార్థం; ద్రవద్రవ్యం;
  • fluke, n. గుడ్డి గురప్రు తాపు; కలిసొచ్చిన అదృష్టం;
  • fluorescence, n. ప్రతిదీప్తి ; విద్యుదయస్కాంత వికిరణాన్ని పీల్చుకుని తిరిగి పరావర్తనంగా ప్రకాశించడం; సాధారణంగా పతన కాంతి కంటే పరావర్తన కాంతి నీరసంగానూ, తక్కువ పౌనఃపున్యంతోనూ ప్రకాశిస్తుంది; అప్పుడప్పుడు పతన, పరావర్తన కాంతుల పౌనఃపున్యం సమానంగా ఉంటాయి; అప్పుడు దానిని అనునాద ప్రతిదీప్తి అంటారు; ఉదాహరణకి యశద గంధకిదం (ZnS) ప్రతిదీప్తి పదార్థం; (see also) phosphorescent; florescence;
  • fluorine, n. ప్లవము; ఒక రసాయన మూలకం; సంక్షిప్త నామం F; అణు సంఖ్య 9;
  • flurries, n. pl. మంచు పరకలు; మంచు రేకులు; చెదురుమదురుగా పడ్డ కొద్దిపాటి మంచు;
  • flush, adj. (1) సమతలంగా ఉండు; (2) పుష్ఠిగా ఉండు; పిటపిటలాడుతూ ఉండు;
    • flush with right margin, ph. కుడి వైపు మార్జిన్‌ తో సమతలంగా ఉండు;
    • flush with cash, ph. రొక్ఖంతో పిటపిటలాడు;
  • flush, v. i. ఎరబ్రారు; సిగ్గుతో ఎరబ్రడు;
  • flush, v.t. ప్రవాహంతో కడుగు; ప్రవాహంతో ప్రక్షాళన చేయు;
  • flute, n. పిల్లనగ్రోవి;
  • flutter, v. i. రెపరెపలాడు;
  • flux, n. అభిప్రసారం; అభిప్రవాహం;
  • fly, n. (1) ఈగ; మక్షికం; (2) పంట్లాం బొత్తాలు కనబడకుండా కప్పే గుడ్డ;
  • fly, v. i. ఎగురు; ఉడ్డయనం చేయు; విమానంలో ప్రయాణం చేయు;
  • fly, v. t. ఎగరవేయు;
  • flying, v. i. ఎగరడం; ఎగరవెయ్యడం;
  • fly-catcher, n. దాసరి పిట్ట; ఈగలి పిట్ట;
  • flyer, n. పతంగిక; గోదకి సూదితో గుచ్చి వేలాడదియ్యడానికి వీలయిన కాగితం;
  • flying fox, n. మాంధాలం; గబ్బిలం జాతిలోకెల్ల అతిపెద్దజంతువు;
  • foal, n. గుర్రప్పిల్ల; గురప్రుజాతి జంతువుల పిల్ల;
  • foam, n. నురగ; నురుగు; నీటి నురగ; నోటి నురగ; డిండీరము; (rel.) lather; suds; froth;
  • focus, n. (1) తేజఃకేంద్రం; నాభి; కాంతి కేంద్రం; (2) అవధానం; లక్ష్యం;
    • focal length, ph. నాభ్యంతరం;
  • focus, v. t. కేంద్రీకరించు;
  • fodder, n. మేత; గ్రాసం; పశుగ్రాసం; కసువు; దాణా;
  • foe, n. శత్రువు; అరి; దాయ; పరిపంధి;
  • fog, n. పొగమంచు; ధూమిక;
  • foil, n. (1) పల్చని రేకు; ముచ్చిరేకు; తగడు; (2) మరొకరి తరఫున నిల్చిన వ్యక్తి;
    • gold foil, ph. బంగారపు తగడు;
    • tin foil, ph. తగరపు తగడు;
  • foil, v. t. పాడుచేయు; వమ్ము చేయు; చెడగొట్టు; భంగపరచు; అడ్డగించు;
  • fold, n. మడత; ముడుత; తరి; వళి;
    • ten fold, ph. పదింతలు; పది రెట్లు;
  • fold, v. t. మడుచు; మడత పెట్టు;
  • fold, v. i. ముడుచుకొను; ముకుళించు;
  • folder, n. (1) మడత సంచి; కాగితాలు పెట్టుకునే సంచి; (2) [comp.] సంచయం; సముచ్ఛయం; A directory in the sense of a collection of computer files .
  • folding clip, n. మడతపిన్ను;
  • folds, n. pl. ముడుతలు;
  • foliage, n. ఆకుపసందు; పత్రసముదాయం; వృక్షాది పత్రసముదాయం; చెట్లమీదనున్న ఆకులు;
    • Foliage plant, ph. ఆకుపసందు మొక్క;
  • folio, n. అర ఠావు పరిమాణంలో ఉన్న పుస్తకం;
  • follicles, n. pl. రోమకూపాలు;
  • folk, adj. జానపద; గ్రామీణ; పల్లె; లోక; దేశీ;
    • folk dance, ph. జానపద నృత్యం;
    • folk songs, ph. పల్లెపాటలు;
    • folk tales, ph. జానపద గాథలు;
    • folk media, ph. జానపద మాధ్యమాలు;
    • folk medicine, ph. నాటు వైద్యం;
  • folk, n. జనత; ప్రజలు; వాళ్లు; లోకులు;
    • our folk, ph. (1) మా వాళ్లు; (2) మన వాళ్లు;
  • folklore, n. లోకగాథ; జానపద విజ్ఞానం;
  • follicle, n. మూలం; కూపం;
    • hair follicle, ph. రోమకూపం;
  • follow, v. t. (1) అనుగతించు; వెంబడించు; వెనుక వెళ్లు; (2) అనుసరించు; పాటించు; అమలుపరచు;
  • followers, n. pl. అనుయాయులు;
  • following, adj. మరుసటి; తరువాయి; వచ్చే; రాబోయే;
  • following, n. అనుయాయులు; అనుయాయ వర్గం;
  • folly, n. అవివేకం; బుద్ధితక్కువ పని; తప్పు; పొరపాటు;
  • foment, v. t. కిర్రెక్కించు; ద్వేషాన్ని రగుల్చు;
  • fomentation, n. కాపడం; ఆవిరిలో గుడ్డని ముంచి, నీళ్ళు పిండి కాపడం పెట్టడం;
  • fond, v. adj. ఇష్టపడు; ప్రేమ చూపు; అభిమానం చూపు;
  • fondle, v. t. నిమురు; తడుము; ప్రేమతో తడుము; బుజ్జగించు;
  • fondling, v. t. ప్రేమతో నిమరడం; ప్రేమతో తడమడం;
  • fondness, n. ఎక్కువ ప్రేమ; విశేషమైన అభిమానం;
  • font, n. వర్ణముఖం; వర్ణలేఖ; అక్షరాలకి రూపురేఖలు ఇచ్చి రాసే పద్ధతి; అక్షరాలని బాపు రాసే పడ్ఢతిలో రాస్తే దానిని బాపూ ఫాంటు అంటారు; ఇంగ్లీషులో boldface, italic కూడా ఇటువంటివే: A set of glyphs (images) representing the characters from some particular character set in a particular size and typeface;
  • fontanel, n. మాడ; మాడు; బ్రహ్మరంధ్రం; శిశువు నడినెత్తిమీది మెత్తటి భాగం;
  • food, n. (1) ఆహారం; తిండి; కూడు; ఓగిరం; వంటకం; ఇలి; ఓదనం; పాథేయం; అశనం; అన్నం; (2) మేత; గ్రాసం;
  • food for a journey, ph. పాథేయం; దారిలో తినడానికి పట్టుకెళ్ళే తిండి;
  • food service, ph. వడ్డన;
  • fool, n. మూఢుడు;
  • foolishness, n. మూఢత్వం; తెలివితక్కువతనం; బుద్ధిహీనత;
  • foolscap paper, ph. టావు కాగితం; 13.5 అంగుళాలు వెడల్పు, 17 అంగుళాలు పొడుగు ఉన్న కాగితం; (Note) This is often misspelled as full scape or full scape.
  • foot, n. (1) పాదం; అడుగు; అంజ; హజ్జ; (2) అడుగు; పన్నెండు అంగుళములు; (3) పాదం; పద్యంలో నాల్గవ భాగం; (4) మట్టు; పదతలము;
    • foot and mouth disease, ph. గాళ్లు; పశుమలకి వచ్చే అంటురోగం;
    • foot patrol, ph. కాలి కావలి;
  • foothills, n. అడివారం;
  • footprint, n. పాద ముద్ర; పాదష్పదం; ఒక ఉపకరణం నేలమీద ఆక్రమించే స్థలం;
  • footlocker, n. భోషాణం;
  • footnote, n. అధోజ్ఞాపిక; అధోదీపిక; అధస్సూచిక; పాదటిప్పణి; షరా;
  • footpath, n. కాలిదోవ; కాలిదారి; కాలిబాట; ఏకపది;
  • footprint, n. పాదముద్ర;
  • footwear, n. pl. పాదరక్షలు; చెప్పులు; జోళ్లు; పాంకోళ్లు;
  • for, n. అనుకూలం; (ant.) against;
  • for, prep. కొరకు;
  • forage, n. మేత; ఆహార పదార్థములు;
  • forage, v. t. మేయు; మేత కొరకు తిరుగాడు;
  • forager, n. ఆహార పదార్థముల సేకరణకి తిరిగే శాల్తీ; a person or animal who goes out in search of food or provisions of any kind; The ants you see are foragers because they are looking for food and water;
  • forbear, v.i. ఓర్చు; సహించు;
  • forbearance, n. ఓర్పు; ఓరిమి; క్షమ;
  • forbid, v. t. నిషేధించు; కూడదని వారించు;
  • force, n. (1) బలం; (2) జోరు; తడాఖా; జబర్దస్తీ; బలాత్కారం; [phy.] బలం;
    • brute force, ph. పాశవిక బలం;
    • electromagnetic force, ph. విద్యుదయస్కాంత బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి;
    • electromotive force, ph. విద్యుత్ చాలక బలం;
    • gravitational force, ph. గురుత్వాకర్షక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి;
    • strong force ph. త్రాణిక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి;
    • weak force, ph. నిస్త్రాణిక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి;

---Usage Note: force, power, strength

  • ---Force is the natural power that something has: Force of the wind; Power is the ability or authority one has to do something or the energy that is used in order to make something work. Strength is the physical quality that makes you strong. In Physics, these words take specialized meaning, not to be confused with their literal meanings.
  • forceful, adj. బలవంతం;
  • forcefully, adv. బలవంతంగా; గట్టిగా; నొక్కి;
  • forceps, n. స్రావణి; స్రావణం; చిమట; కంకముఖం;
  • forearm, n. ముంజేయి;
  • forecast, n. రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం; భవిష్యత్ సూచనం; భవిష్యత్ పురాణం; అనగాతవేద్యం;
  • forecasting, n. పూర్వనుమానం; ప్రక్షేపణం; భవిష్యత్ సూచనం; భవిష్యత్ పురాణం; అనగాతవేద్యం; రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం;
  • foreclose, v. t. జప్తు చేయు;
  • foreclosure, n. జప్తు;
  • forefathers, n. పూర్వులు; పితరులు; పితృదేవతలు;
  • forefinger, n. చూపుడువేలు; తర్జని;
  • foreground, n. మునుతలం;
  • forehand, n. (1) ముంజేయి; ప్రకోష్టము; (2) టెన్నిస్ ఆటలో ఒకవిధంగా బంతిని కొట్టడం;
  • forehead, n. నుదురు; నొసలు; నొష్ట; లలాటం; ఫాలము;
  • foreign, adj. విదేశ; విదేశీ; పర; పరాయి; అన్య; భిన్నమైన; అపరంజి;
    • foreign coin, ph. అపరంజి కాసు;
    • foreign country, ph. విదేశం; పరదేశం;
    • foreign exchange, ph. విదేశీ మారకం;
    • foreign investment, ph. విదేశీ పెట్టుబడి;
    • foreign policy, ph. విదేశాంగ విధానం;
    • foreign words, ph. అన్యదేశ్యాలు;
  • foreign, n. విదేశీయం;
  • foreigner, n. విదేశీయుడు; పరదేశి; అన్యదేశస్థుడు; ఫిరంగి; లాతివాడు;
  • forelocks, n. pl. ముంగురులు;
  • foreman, n. శ్రేష్ఠుడు; పనివారిలో పెద్ద; న్యాయస్థానంలో జూరీలో పెద్ద;
  • foremost, adj. సర్వశ్రేష్ఠ;
  • forenoon, n. పూర్వాహ్నము; మధ్యాహ్నానికి ముందు వేళ;
  • forensic, adj. న్యాయవిచారణకి అనుకూలమైన; రచ్చబండలో చర్చకి అనుకూలమైన; న్యాయసభా సమ్మతమైన;
  • forerunner, adj. తొలకరి; ముందు వచ్చే సూచన;
  • forerunner to a monsoon, ph. తొలకరి వానలు;
  • foreskin, n. ముందోలు; పురుషుడీ లింగాగ్రాన్ని కప్పి పుచ్చే చర్మం;
  • forest, adj. ఆటవిక; అటవీ; వన; కారు;
  • forest, n. అరణ్యం; అడవి; కాననం; కాన; కాంతారం; వనం; వని; సానువు; అటవి; విపినం; కోన;
    • dark forest, ph. కారడవి;
    • dense forest, ph. కీకారణ్యం;
    • mangrove forest, ph. మడడవి; మడచెట్ల అడవి;
    • rain forest, ph. వర్షారణ్యం;
    • tropical forest, ph. అయనరేఖాంతర అరణ్యం;, ఉష్ణమండల అరణ్యం;
    • tropical evergreen forest, ph. ఉష్ణమండల సతతహరిత అరణ్యం;
    • tropical deciduous forest, ph. ఉష్ణమండల పతనశీల అరణ్యం;
    • tropical thorn forest, ph. ఉష్ణమండల కంటకారణ్యం;
    • forest dweller, ph. అరణ్యకుడు;
    • forest fire, ph. కార్చిచ్చు; కారగ్గి; ఎరగలి; వనవహ్ని; దావాగ్ని; దావవహ్ని;
    • forest produce, ph. ఆటవిక సంపద;
    • forest ranger, ph. వనమాలి; అటవీ అధికారి; వనపాలి, vanapAli
    • forest reserve, ph. అభయారణ్యం;
    • forest resources, ph. అటవీ సంపద;
  • forestry, n. అటవీశాస్త్రం; తరుకృషి;
  • foreteller, n. అనాగతవేది; భవిష్యత్తుని చెప్పేవాడు;
  • forethought, n. పూర్వాలోచన; ముందు చూపు;
  • forever, adv. శాశ్వతంగా;
  • foreword, n. అవతారిక; అవతరణిక; పరిచయ వాక్యాలు; ముందుమాట; రచననీ; రచయితనీ పరిచయం చేస్తూ మరొక ప్రముఖుడు రాసే రాత; A foreword is an introductory section of a book written by someone other than the author. The writer of the foreword is usually a prominent figure like an expert on the subject matter, a New York Times bestselling author, or a prominent critic of literary work. A foreword, which appears before chapter one, lends credibility to the book and author by praising the work, the writer, or both. A foreword can sometimes be a type of literary marketing tool publishers use to increase the profile of a book and attract casual readers, who may decide that a published book is worth reading based on the endorsement of the foreword’s author. Forewords may also accompany new editions of previously published works; (rel.) preface;
  • forfeit, v. i. ఒదులుకొను; నష్టపోవు; పోగొట్టుకొను;
  • forfeiture, n. ఒదులుకొన్నది; నష్టం; పోగొట్టుకొన్నది;
  • forge, v. t. (1) దొంగ సంతకం పెట్టు; (2) కమ్మరి పని చేయు;
  • forge, n. కమ్మరి కార్ఖానా; కమ్మరి కొలిమి;
  • forged, adj. చేసిన; కల్పించిన; సృష్టించిన; కమ్మరి కొలిమిలో తయారు చేసిన;
  • forged signature, ph. దొంగ సంతకం;
  • forged steel, ph. కొలిమిలో వేడి చేసి, సుత్తితో బాది తయారు చేసిన ఉక్కు;
  • forgery, n. దొంగసంతకం చేయడం;
  • forget, v. i. మరచిపోవు; విస్మరించు;
  • forgetfulness, n. మతిమరుపు; విస్మృతి; మందమరుపు;
  • forgive, v. t. మన్నించు; క్షమించు;
  • fork, n. (1) పళ్ల చెంచా; ముక్కోల; మూడు పళ్ల చెంచా; చతుశ్శూలం; నాలుగు పళ్ల చెంచా; (2) పంగ,; చీలిక; పాయ;
  • forked stick, n. రాగోల; పంగల కర్ర;
  • forlorn, adj. దిక్కుమాలిన; నిరాధారమైన;
  • form, n. (1) మూర్తి; ఆకారం; ఆకృతి; రూపం; రూపు; స్వరూపం; పొడ; (2) కాగితం; పత్రం; ప్రపత్రం; ఫారం; (3) నిర్మాణం;
    • application form, ph. దరఖాస్తు పత్రం; దరఖాస్తు ఫారం;
    • with form, ph. సాకారత;
    • without form, ph. నిరాకారత;
    • form and function, ph. నిర్మాణమూ, ప్రమేయమూ;
  • formal, adj. నియత; పద్ధతి ప్రకారం జరిగే; క్రమబద్ధ; ఆచారబద్ధ; సంప్రదాయిక; లాంఛనప్రాయ;
    • formal education, ph. నియత విద్య;
    • formal view, ph. స్వరూప దృష్టి;
  • formaldehyde, n. పిపీలికాలంతం; హీరాలంతం; రంగులేని ఘాటైన వాయువు; శరీరాంగాలని భద్రపరచడానికి ఈ ద్రావణం వాడతారు; HCHO;
  • formality, n. ఆచారం; లాంఛనం; నియమ ప్రకారంగా మర్యాదకి చేసే తంతు;
  • formalism, n. రూపవాదం;
  • formally, adv. మర్యాదపూర్వకంగా; నియమ ప్రకారం;
  • format, n. ప్రారూపం; సంరూపం;
  • formatting, n. ప్రారూపణం; సంరూపణం; The organization of information for storage, printing or displaying;
  • former, adj. మునపటి; గత; పూర్వ; లోగటి; తొలినాటి; (ant.) అపర;
    • former students, ph. పూర్వ విద్యార్థులు;
  • former, n. పూర్వం; లోగడ; గతకాలం;
  • formica, n. (1) పిపీలికం; చీమ; హీరా; (2) ఒక రకం ప్లేస్టిక్‍;
  • formicary, n. చీమలపుట్ట; పిపీలికాలయం; హీరాలయం;
  • formidable, adj. ఉత్తాల; బలోపేత;
  • formidable, n. ఉత్తాలం; బలోపేతం;
  • formless, n. అమూర్తం; నిరాకారం; ఆకారవిహీనం;
  • formula, n. (1) సూత్రం; పద్ధతి; క్రమం; నియమం; వాడిక; (2) మంత్రం; మనువు;
    • empirical formula, ph. సాంఖ్య క్రమం; a formula giving the proportions of the elements present in a compound but not the actual numbers or arrangement of atoms;
    • structural formula, ph. నిర్మాణ క్రమం; a formula which shows the arrangement of atoms in the molecule of a compound.
  • formulate, v. t. సూత్రీకరించు;
  • formulation, n. సూత్రీకరణం; సూత్రీకరణ;
  • fornication, n. (1) పెళ్ళికాని పిల్ల పెళ్ళికాని పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉండడం; రంకు; వ్యభిచారం; జారత్వం; (2) సుఖ దాంపత్యానికి భంగం కలిగిస్తూ చేసే లైంగిక ప్రక్రియ;
  • forsake, v. t. విడనాడు; విడచిపెట్టు;
  • forswear, v. t. కాదని శపథము చేయు; కాదని ప్రమాణం చేయు; ఒట్టు పెట్టు;
  • fort, n. కోట; దుర్గం; ఖిల్లా;
  • forte, n. ప్రావీణ్యత;
  • forthcoming, adj. రాబోయే;
  • forthwith, adv. తక్షణము; వెంటనే;
  • fortitude, n. ధైర్యం; సహిష్ణుత;
  • fortnight, n. పక్షం; పదునాలుగు రోజులు; (ety.) fourteen nights;
  • fortress, n. దుర్గం; కోట; గడి;
  • fortuitous, adj. కాకతాళీయం; యాదృచ్ఛికం; అనుకోకుండా ;
  • fortunately, adv. అదృష్టవశాత్తు;
  • fortune, n. (1) అదృష్టం; భాగ్యం; (2) ధనం; ఆస్తి;
    • fortune teller, ph. సోదె చెప్పే వ్యక్తి; కాలవేది; జ్యోతిష్కుడు; ఎరుక చెప్పే వ్యక్తి;
  • forty, n. నలభై; నలుబది;
  • forum, n. వేదిక; రచ్చపట్టు;
  • forward, adj. పురోగామి; అగ్ర; ముందరికి; ఎదటికి;
    • forward caste, ph. అగ్ర కులం;
    • forward caste person, ph. అగ్ర కులస్థుడు;
    • forward roll, ph. పిల్లి మొగ్గ;
  • forward, v. t. పంపు; రవాణా చేయు;
  • fossil, n. శిలాస్థి; శిలాజం;
    • fossil fuel, ph. శిలాజ ఇంధనం;
  • foster, v. t. పాలించు; మంచిచెడ్డలు చూడు; పెంచు; సాకు;
    • foster child, ph. పెంపుడు బిడ్డ; తల్లిదండ్రులుకాకుండా మరొకరిచే పెంచబడ్డ బిడ్డ;
    • foster mother, ph. పెంపుడు తల్లి; దాది;
    • foster parent, ph. పెద్దదిక్కు; పిల్లల మంచి చెడ్డలు చూసే పెద్ద;
  • foul, adj. చెడ్డ; మురికి; కుళ్ళు; బూతు; అశ్లీల;
    • foul language, ph. బూతులు; అశ్లీలమైన భాష;
    • foul smell, ph. కుళ్ళు కంపు; చెడ్డ కంపు;
    • foul weather, ph. చెడ్డగా వున్న వాతావరణం;
  • foundation, n. (1) పునాది; అడుగుమట్టు; మూలబంధం; అస్తిభారం; (2) సంస్థ; ఉట్టంకణం; ప్రతిష్ఠ; ప్రతిష్ఠానం; ఇష్టపూర్తం; మంచి పనులు చేసే సంస్థ; (ety.) ఆలయ, తటాక, భూదాన, ప్రతిష్ఠాపన; కృతి స్వీకరణ మొ॥ సప్తసంతానాలు;
    • foundation stone laying, ph. ప్రథమేష్టికాన్యాసం; (rel.) శంకు స్థాపన;
  • foundationalism, n. సంపూర్ణమూలవాదం; ఒక రకం సాహిత్య విమర్శ;
  • founders, n. pl. ఆద్యులు; సంస్థాపకులు; ప్రవర్తకులు;
    • founding fathers, n. pl. ఆద్యులు; మూలపురుషులు;
  • foundry, n. లోహాలని పోత పోసే కార్ఖానా;
  • fountain, n. బుగ్గ; ఊఁట; చెలమ; జలజంత్రం; అంబుస్పోటం; కారింజా; ఉత్సం; ఉద్వారి;
  • four, n. (1) నాలుగు; (2) నలుగురు; చతుష్టయం; చతుష్కం;
    • four corners, ph. చత్వరం; శృంగాటకం; నాలుగు వీధుల కూడలి; చౌరస్తా;
    • four items, ph. పుంజీ; ఉడ్డా;
  • four-dimensional, adj. చతుర్మితీయ;
  • foursome, n. నలుగురు;
  • fourteen, n. పద్నాలుగు; పదునాలుగు; చతుర్దశ;
  • fourth, adj. (1) నాలుగవ; పావు; (2) చతుర్థ; తురీయ;
  • fourth, n. (1) నాలుగవది; చతుర్థం; తురీయం; తుర్యం; (2) నాలుగింట ఒకటి;
    • fourth state, ph. తురీయ స్థితి;
  • fowl, n. (1) పక్షి; (2) కోళ్లు; (3) కోడి జాతి పక్షులు;
    • Guinea fowl, n. గిన్ని కోడి;
  • fox, n. నక్క; జంబుకం; గోమాయువు; ఫేరవం;
 
తిలపుష్టి=Digitalis_purpurea2
  • foxglove, n. తిలపుష్టి;
  • foxtail, n. గడ్డి మైదానాలలో పెరిగే ఒక జాతి కలుపు మొక్క;
  • foyer, n. (ఫోయే) వసారా; ముంగిడి;
  • fraction, n. భిన్నం; భాగం; అంశం;
    • continued fraction, ph. అవిరామ భిన్నం; అవిచ్ఛిన్న భిన్నం;
    • improper fraction, ph. అపక్రమ భిన్నం;
    • mixed fraction, ph. మిశ్రమ భిన్నం; సాంశ సంఖ్య; అంశతో కూడిన సంఖ్య;
    • proper fraction, ph. క్రమ భిన్నం; అంశం;
    • vanishing fraction, ph. లుప్త భిన్నం;
  • fractional, adj. భిన్నాత్మక; అంశిక;
    • fractional crystallization, ph. స్పటికీకరణం;
    • fractional distillation, ph. అంశిక స్వేదనము; అరమరగించుట;
  • fracture, n. భంగం; విభంగం; విరగడం; బీట;
  • fracture of a bone, ph. అస్తిభంగం; ఎముక విరగడం;
  • fragment, n. శకలం; ముక్క; పలుకు; తునక; భాగం; వ్రక్క; భిత్తి; ఖండం; ఖండతుండం;
  • fragrance, n. పరిమళం; తావి; సురభి; సౌరభం; గమ్ము; ఫల పుష్పాదులు ఇచ్చే సువాసన; see also aroma;
  • fragrance of flowers, ph. విరి తావి;
    • sweet fragrance, ph. నెత్తావి; సుగంధం; మందావి;
  • fragrant, adj. సౌరభవంత;
    • fragrant screw pine, ph. మొగలి;
    • fragrant substance, ph. సురభి;
  • frankincense, n. ఆఫ్రికాలోనూ, అరేబియాలోనూ ఉన్న కొన్ని చెట్లనుండి స్రవించే గుగ్గిలం, సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యం; (ety.) frank = pure, incense; [bot.] Boswellia thurifera;
  • frame, n. (1) చట్రం; చక్కీ; చౌకట్టు; బందు; ఆత; (2) పన్నా; బట్టని నేసేటప్పుడు వాడిన చక్రం యొక్క పొడుగు కొలత; (3) చంద్రిక; పట్టు పురుగులను పెంచే చట్రం; (4) వ్యక్తి యొక్క అంగసౌష్టవం;
  • frame, v. t. (1) చట్రంలో బిగించడం; (2) ఊహని కాని ప్రణాళికని కాని రూపుదిద్దడం; (3) అన్యాయంగా నేరంలో ఇరికించడం;
  • framework, n. చట్రం; చక్కీ; చౌకట్టు; బందు;
  • franchise, n. (1) ఎన్నిక హక్కు; ఓటు హక్కు; (2) మరొకరి వ్యాపార చిహ్నాన్ని కాని, పేటెంటుని కాని వాడుకుని స్వంత వ్యాపారం చేసుకోగలిగే వెసులుబాటు లేక హక్కు; (3) ఒక వ్యాపార సంస్థగా ఉండడానికి ప్రభుత్వం ఇచ్చిన హక్కు;
  • francolin, n. తిత్తిర పక్షి; అడవికోడి;
    • gray francolin, ph. బూది తిత్తిర పక్షి;
  • frankly, adj. నిష్కపటంగా; దాపరికం లేకుండా;
  • fraternal, adj. భ్రాత్రీయ; సోదరభావ;
  • fraternity, n. (1)సౌభ్రాత్రుత్వం; సౌభ్రాత్రం; సోదరభావం; (2) సహోదర సంఘం;
  • frantic, adj. మయిమరచిన కంగారుతో; గాభరాగా;
  • fraud, n. మోసం; దగా; బూటకం; వంచన; కూటకరణం;
  • fray, n. జగడం;
  • free, adj. (1) స్వతంత్రంగా; స్వేచ్ఛగా; విచ్చలవిడిగా; స్వేచ్ఛాచలితంగా; unbound; (2) ధారాళంగా; అడ్డానికి లేని; (3) ఉచితమైన; ఉల్ఫాగా; ఉత్తనే; తేరగా; at no cost;
    • free distribution, ph. పందేరం;
    • free holdings, ph. మాన్యములు; ఉచితంగా లభించిన భూములు;
    • free radicals, ph. విశృంఖల రాశులు; unstable molecules that the body produces as a reaction to environmental and other pressures;
    • free trade, ph. స్వేచ్ఛా వ్యాపారం;
  • free, suff. లేని;
    • tax-free, పన్నులు లేని;
    • sugar-free, చక్కెర లేని;
    • water-free, నీళ్లు లేని;
  • freedom, n. స్వతంత్రం; స్వాతంత్య్రం; విముక్తి; విమోచనం; విచ్చలవిడితనం; నిరాటంకం;
    • freedom of press, ph. ముద్రణా స్వాతంత్య్రము; పత్రికా స్వాతంత్య్రము;
    • freedom of speech, ph. వాక్ స్వాతంత్య్రము;
  • freelance, adj. స్వతంత్ర; ఒక కక్షకి సంబంధించని;
  • freelancer, n. స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తి; ఒక కక్షకి సంబంధించని వ్యక్తి; ఒకరి దగ్గర ప్రత్యేకం ఉద్యోగం చెయ్యకుండా పని చేసుకునే మనిషి;
  • freeze, v. i. గడ్డకట్టు; ఘనీభవించు; పేరుకొను; స్తంభించు;
  • freeze, v. t. గడ్డ కట్టించు;
  • freezing, adj. గడ్డకట్టే; ఘనీభవన; ఘనీకరణ;
    • freezing point, ph. ఘనీభవనాంకం;
  • freezing, n. గడ్డకట్టుట; ఘనీభవనం; ఘనీకరణం;
  • freight, n. కేవు; రవాణారుసుం; ఓడకూలి;
  • french, adj. పరాసు;
  • French, n. పరాసులు; ఫ్రెంచివారు;
  • frequency, n. ఆవృత్తి; తరచుదనం; మాటిమారు; వీపసం; బాహుళ్యం; స్థాయి; ద్విరుక్తం; పునఃపునం; పౌనఃపున్యం; శృతి; పదేపదం; అడుగడుగు; మాటిమాటి;
    • high frequency, ph. హెచ్చు స్థాయి; ఉచ్చస్థాయి;
    • low frequency, ph. మంద స్థాయి; నీచ స్థాయి;
  • frequent, adj. తరచు; బాహుళ్యం;
  • frequently, adv. తరచుగా; బాహుళ్యంగా; మాటిమాటికీ; అడుగడుక్కీ; పదేపదే;
  • fresco, n. కుడ్యచిత్రం;
  • fresh, adj. (1) తాజా; తాజా అయిన; నూతన; నవీన; (2) మంచి; శుభ్రమయిన; తాగడానికి వీలయిన;
    • fresh towel, ph. శుభ్రమయిన తువ్వాలు;
    • fresh water, ph. మంచి నీళ్లు; తాగే నీరు;
  • freshman, n. నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో మొదటి ఏటి విద్యార్థి;
  • freshmen, n. pl. (1) కళాశాలలో మొదటి సంవత్సరపు విద్యార్థి బృందం;
  • fricative, n. [ling.] కషణాక్షరం; ఊష్మం; స్పృష్టోష్మములు; రాపిడీ వల్ల పుట్టే ధ్వని; కంఠనాళం నుండి బయటకు వచ్చే గాలిని పూర్తిగా ఆపకుండా తగుమాత్రం నిరోధించగా వచ్చే శబ్దాలు; చ వర్గీయ ధ్వనులు;
    • blade alveolar fricative, ph. తాలవ్య స్పృష్టోష్మములు;
    • tip alveolar fricative, ph. దంత్య స్పృష్టోష్మములు; దంత్య చ, జ లు;
  • friction, n. ఒరిపిడి; రాపిడి; ఘర్షణ; రంపు; కషణం; నికషం; కర్షం;
  • Friday, n. శుక్రవారం; భృగువారం;
  • fried, adj. వేయించిన; వేపిన;
  • friend, n. నేస్తం; m. స్నేహితుడు; చెలికాడు; మిత్రుడు; సఖుడు; సంగాతకాడు; సంగడికాడు; సోపతికాడు; f. స్నేహితురాలు; చెలియ; చెలి; చెలికత్తె; నెచ్చెలి; సఖి;
    • best friend, ph. ఇష్టసఖుడు; ఇష్టసఖి;
    • boy friend, ph. సంగడికాడు; సంగాతకాడు; చెలికాడు; సఖుడు;
    • girl friend, ph. సంగడికత్తె; సఖి; సఖియ; చెలికత్తె;
  • friendliness, n. స్నేహభావం; మైత్రీభావం; సౌమనస్యం;
  • friendship, n. స్నేహం; మైత్రి; సఖ్యత; సఖ్యం; నెయ్యం; చెలిమి; పొందిక; పొత్తు; పొంతనం; కూరిమి; సౌహార్దం; సాంగత్యం; సంగాతం; సంగడి; సెరబడి; సయోధ్య;
  • frigid, adj. శిశిర; అతి శీతలమైన; బాగా చల్లగా ఉన్న;
  • fright, n. ఉలుకు;
  • frightening, adj. భయానక;
  • frill, n. అలంకారప్రాయం;
  • fringe, n. చివర; కొస; శివారు;
    • fringe benefits, ph. శివారు భత్యాలు; భత్య వేతనాలు; ఉద్యోగస్తునికి జీతంతోపాటు ఇచ్చే అమాంబాపతు భత్యాలు;
  • frivolous, adj. అల్ప; చపల; నిస్సార;
  • frog, n. కప్ప; మండూకం; భేకం; భేకి; శాలూరం;
  • from, prep. నుంఢి; లగాయతు;
  • frond, n. మట్ట; తాటి, ఈత, కొబ్బరి జాతి చెట్ల మట్ట;
  • front, adj. ముందు; ఎదుట; అగ్ర; తల;
    • front runner, ph. అగ్రగామి;
    • front yard, ph. తలవాఁకిలి; ముంగిలి; ప్రాంగణం;
  • front, n. (1) ఎదురు; ముందఱి భాగం; (2) యుద్ధ రంగం;
  • frontal bone, n. లలాటాస్థి; నుదురెముక;
  • frontier, n. సరిహద్దు; పొలిమేర; ఎల్ల; ఎన;
  • frost, n. మిహిక; ఇగము; ఇవము;గడ్డకట్టడం; గడ్డకట్టినది; రాత్రి కురిసిన తుహిన బిందువులు చలికి గడ్డకట్టడం; (rel.) తుహినం;
  • frostbite, n. మంచు కొరుకుడు; శరీర భాగాలు విపరీతంగా చలి బారి పడడం వల్ల కణజాలానికి కలిగే గాయం;
  • frost line, n. మిహిక రేఖ; కొండలలో ఈ ఊహాత్మక రేఖకి ఎగువ చెట్లు బాగా పెరగవు;
  • froth, n. (1) నుఱగ; (2) నోటినుండి వచ్చే నుఱగ;
  • frown, v. i. భృకిటించు; భృకుటి ముకుళించు; కనుబొమలు ముడి వేయు; అయిష్టంగా చూడు;
  • frozen, adj. పేరి; పేరుకున్న;
  • frozen ghee, ph. పేరి నెయ్యి;
  • fructose, n. ఫలోజు; ఫలచక్కెర; ఫలశర్కర; పళ్లలో లభించే చక్కెర;
  • frugal, adj. పొదుపు; పోడిమి; మితవ్యయం; దుబారా చెయ్యకుంఢా ఉండడం; (exp.) ఖరీదయిన వస్తువులమీద ఖర్చు కావచ్చు; దుబారా కాకుండా ఉండాలి;
    • frugal person, ph. పొదుపరి;
  • frugality, n. పొదుపరితనం; పోణిమి;
  • fruit, n. s. (1) పండు; ఫలం; (2) కాయ;
    • false fruit, ph. అనృత ఫలం; అసహజ ఫలం; దొంగ పండు;
    • green fruit, ph. కాయ; పచ్చి కాయ;
    • multiple fruit, ph. సంయుక్త ఫలం;
    • ripe fruit, ph. పండు; ఫలం;
    • fruit vinegar, n. చుక్రం;
    • fruit fly, ph. ఫలీగ; పండీగ;
  • fruitful, n. సార్థకం; ఫలదాయకం; ఫలవంతం;
  • fruition, n. (ఫ్రూఇషన్) ఆపోక; నెరవేరుపు; ఈడేర్పు; ఫలవంతం;
  • fruitless, n. నిరర్థకం; నిష్ఫలం; ప్రయోజనం లేనిది;
  • fruits, n. pl. పండ్లు; పళ్ళు; ఫలాలు; కాయలు;
    • dried fruits, ph. మేవాలు; ఎండుపండ్లు; ఎండుపళ్ళు;
  • frustration, n. నిష్ఫలతతో వచ్చే నిరుత్సాహం;నిస్పృహ;
  • frustum, n. ఖండము; కోసిన ముక్క;
  • fry, n. వేఁపుడు; భృష్టి; సాతాళింపు;
    • stir fry, ph. సాతాళింపు; నూనె తక్కువగా వేసి వేయించడం;
    • deep fry, ph. లోవేపుడు; మరిగే నూనెలో వేసి వేయించడం;
  • fry, v. t. వేయించు; వేఁపు; సాతాళించు;
  • fryams, n. వడియాలు;
    • flat frying pan, ph. అంబరీషం; పెనం;
    • deep frying pan, ph. అంబరీషం; మంగలం; వేఁపుడు చట్టి; బాణలి; బాండి; మూఁకుడు; భ్రాష్టం;
    • frying pan to fire, ph. [idiom] అంబరీషం నుండి అగ్ని గుండం లోకి; పెనం నుండి పొయ్యిలోకి; అది కుమ్ము, ఇది దుమ్ము;
  • fuel, n. ఇంధనం; వంట చెరకు, బొగ్గులు, పెట్రోలు, మొదలైన పదార్దాలు;
  • fuel, adj. ఇంధనపు;
    • fuel cell, ph. ఇంధన కోషిక; ఇంధన కోష్టం; ఇంధన కోష్టిక; ఉదజని వాయువు సహాయంతో విద్యుత్తుని పుట్టించడానికి వాడే ఒక సాంకేతిక ఉపకరణం;
    • fuel oil, ph. ఇంధనపు ౘమురు; ఇంధనపు నూనె;
  • fugitive, n. పరారీ; పారిపోయిన వ్యక్తి; పోలీసుల నుండి పారిపోయిన వ్యక్తి;
  • fulcrum, n. ఆధారం; ఎత్తుకొయ్య;
  • fulfill, fulfil (Br.), v. t. నెరవేర్చు; సఫలం చేయు; ఈడేర్చు;
  • fulfillment, n. ఆపోక; నెరవేరుపు;
  • full, adj. పూర్ణ; పూర్తి; నిండైన; నిండిన; కిక్కిరిసిన; పరిపూర్ణ;
    • full moon, ph. పూర్ణచంద్రుడు;
    • full text, ph. పూర్తిపాఠం;
  • full-duplex, n. పూర్ణ ద్విముఖి; A type of duplex communications channel which can send and receive signals at the same

time; see also half-duplex;

  • full of, adj. మయం; భూయిష్ఠం; భరితం;
  • full of defects, ph. లోపభూయిష్ఠం;
  • full of love, ph. ప్రేమమయం;
  • full of iron, ph. అయోమయం;
  • full of water, ph. జలమయం;
  • fully, adv. పూటుగా; పూర్తిగా; నిండుగా;
  • fumble, v. t. తడమాడు; తవుళ్లాడు; పుణకరించు;
  • fume, n. సెగ; కావిరి; ఘాటయిన వాయువు; బాష్పం; ధూమం; ఊదర;
  • fumigate, v. t. ఊదరబెట్టు; ఊదరగొట్టు; పొగపెట్టు; ధూపము వేయు;
  • fumigation, n. ఊదరబెట్టడం; పొగపెట్టడం; ధూపము వేయడం;
  • fuming, adj. సధూమ;
  • fuming nitric acid, ph. సధూమ నత్రికామ్లం;
  • fun, n. (1) వేడుక; వినోదం; తమాషా; (2) పరిహాసం; పరాచకం; ఎకసక్కెము; ఎగతాళి;
  • function, n. (1) పని; ప్రకార్యం; వృత్తి; కర్తవ్యం; (2) వేడుక; ఉత్సవం; (3) ఉపయోగం; (4) [math.] ప్రమేయం; సంబంధం; కార్యకరణం; నియోగం; నియోజ్యం; ఒక చలరాసి మరొక చలరాసి పై ఆధారపడే విధివిధానం;
    • algebraic function, ph. బీజ ప్రమేయం;
    • Boolean function, ph. బౌల్య ప్రమేయం;
    • complex function, ph. సంక్లిష్ట ప్రమేయం;
    • continuous function, ph. అవిచ్ఛిన్న ప్రమేయం;
    • integrable function, ph. సమాకలనీయ ప్రమేయం;
    • wave function, ph. తరంగ ప్రమేయం;
  • functional, adj. (1) ఉపయోగకర మైన; జీవికోపయోగ; ప్రయోజనాత్మక; (2) ప్రమేయాత్మక;
    • functional dependence, ph. ప్రమేయాత్మక పరతంత్రం;
    • functional distress, ప్రయోజనాత్మక వ్యాకులత;
    • functional language, ph. (1) జీవికోపయోగ భాష; (2) కంప్యూటర్ భాషలలో ఒక జాతి భాష;
    • functional literacy, ph. ప్రయోజనాత్మక అక్షరాశ్యత;
    • functional view, ph. ప్రయోగ దృష్టి;
  • functionalism, n. కార్యకరణవాదం;
  • fund, n. నిధి; మూలధనం;
    • animal welfare fund, ph. పశు సంక్షేమ నిధి;
  • fund, n. నిధి; మూలధనం; సంచయం;
  • fundamental, adj. ప్రాథమికమైన; మూలాధారమైన; మౌలిక; ముఖ్యమైన;
    • fundamental rights, ph. ప్రాథమిక హక్కులు;
    • fundamental theorem, ph. ప్రాథమిక సిద్ధాంతం; మూల సిద్ధాంతం;
  • fundamentalist, n. మూలసూత్ర గామి;
  • funeral, n. అంత్యక్రియలు; ఉత్తర క్రియలు;
    • funeral pyre, n. చితి; చితి పేర్చే స్థలం; ఒలికి; వల్లకాడు; అంత్యక్రియల అగ్నిగుండం;
  • fungibility, n. ఒక వస్తువుకి బదులు మరొక సరిసమానమైన వస్తువుని అమ్మగలిగే శక్తి; In economics, fungibility is the property of a good or a commodity whose individual units are essentially interchangeable and each of whose parts is indistinguishable from another part;
  • fungus, n. శిలీంధ్రం; బూౙు; pl.fungi, (ఫంజై);
  • funnel, n. గరాటు; గరగడ; గళ్ళా; పొన్న; పుటిక;
  • funny, adj. హాస్యరసపూరితమైన; నవ్వించెడు;
  • fur, n. బొచ్చు; బొచ్చుగల చర్మం;
  • furbished, adj. తోమిన; మెరుగు వేసిన;
  • furious, adj. ఉగ్రమైన; ఆగ్రహముతో; ప్రచండమైన;
  • furl, v. t. చుట్టు; చుట్టబెట్టు; (ant.) unfurl;
  • furnace, n. కొలిమి; కమటం; కాష్థం;
  • furnish, v. t. అమర్చు; సిద్దపరచు;
  • furniture, n. తట్టుముట్లు; కుర్చీలు, సోఫాలు, బల్లలు, మొదలైనవి;
  • furrow, n. (1) నాగేటిచాలు; చాలు; (2) వయస్సుతో మొహం మీద వచ్చే ముడత; (3) నుదుటి మీద వచ్చే ముడత;
  • furrows, n. pl. (1) నాగేటిచాళ్ళు; చాళ్ళు; (2) నుదుటి మీద వచ్చే ముడతలు;
  • further, adv. పిమ్మట; తర్వాత; వెండియు; మళ్లా;
  • further, adj. అవతలి; ఆవలి; ఇంకా; Do not make further delay; see also "farther;"
  • furthermore, adv. మీదుమిక్కిలి; వెండియు;
  • furtive, adj. దొంగ; చాటు; గుట్టు; గుట్టుగా ఉంచే తత్త్వం; (rel.) stealth; surreptitious; underhanded disposition;
    • furtive glances, ph. దొంగ చూపులు;
  • furtively, adv. లోపాయకారీగా; రహశ్యంగా; గుప్తంగా; గుట్టుగా; జాగ్రత్తగా;
  • fury, n. ఆగ్రహం; ఆగ్రహావేశం; క్రోధావేశం; కోపం; విపరీతమైన కోపం; రౌద్రం;
  • fuse, n. జానకితాడు;
  • fusion, n. కలయిక; సంలీనం; ఏకీభవనం;
    • nuclear fusion, ph. కణిక ఏకీభవనం;
  • futile, adj. నిరర్థకమైన; వ్యర్థమైన; పనికిమాలిన;
  • future, n. భావి; భవిష్యత్తు; ఆయతి;
  • future, adj. భావి; భవిష్యత్తు; రాబోయే; కాబోయే; కలగబోయే;
    • future generations, ph. భావి తరాలు;
    • future tense, ph. భవిష్యత్ కాలం;
  • futuristic, adj. కాలజ్ఞానీన;
  • fuzzy, adj. మసక;
  • fuzzy logic, ph. మసక తర్కం;