This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: H
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
habeas corpus, n. నిందితుని న్యాయస్థానానికి తీసుకు రమ్మన్న ఆనతి;
habit, n. అలవాటు; ఆచారం; అభ్యాసం;
bad habit, ph. దురలవాటు; దురాచారం; వ్యసనం; దురభ్యాసం;
good habit, ph. సదాచారం; మంచి అలవాటు;
---Usage Note: habit, custom, tradition
---A habit is something that someone does often, usually without even thinking about it: Smoking is a bad habit. A custom is a way of doing something that people in a particular society think it is normal, and that everyone does. The custom here is to shake hands when we meet. A tradition is a belief or a way of doing something that a particular group or society has followed for a very long time.
habitable, adj. వాసయోగ్యమైన;
habitat, n. ఉనికిపట్టు; సహజావరణం; ఆవాసం; అవసదము; జంతువులు, మొక్కలు సహజంగా పెరిగే ఆవరణం;
habitation, n. అవసదము; నివాస స్థలం; ఇల్లు;
habitual, adj.అలవాటు పడ్డ; వాడుక అయిన; మామూలు అయిన;
habitual offender, ph. అపరాధానికి అలవాటు పడ్డ వ్యక్తి; కేడీ;
hadrons, n. [phy.] మోటురేణువులు; రేణు భౌతిక శాస్త్రంలో తారసపడే ఒక రకం మోటు రేణువులు; రెండు కాని, అంతకంటె ఎక్కువ కాని క్వార్కులని త్రాణిక బలంతో బంధించినప్పుడు మోటురేణువులు పుడతాయి (బణువులలోని అణువులు విద్యుదయస్కాంత బలంతో బంధించబడినట్లు ఉపమానం చెప్పుకోవచ్చు);
hallucination, n, భ్రమ; భ్రాంతి; మానసిక భ్రాంతి; దృక్‌భ్రమ;
halo, n. కాంతివలయం; ఉపసూర్యకం; కాంతి కిరీటం; గాలిగుడి;
halophyte, n. చవిటి నేలలలో పెరిగే మొక్క; ఉప్పు నీటిలో సాగు చెయ్యడానికి అనుకూలమైన మొక్క;
halogen, n. లవజని; లవణములను పుట్టించేది; ఉదా. F, Cl, Br, I;
halt, n. మజిలీ; మకాం; బస; బండి నిలిచే స్థలం; (rel.) stop;
halt, v. i., v. t. తాళు; నిలు; నిలువరించు; కొద్దిసేపు నిలుపు; (rel.) stop;
halter, n. పొట్టి రవిక; మగవారిని నిలువరించగలిగే రవిక;
halva, n. హల్వా; కేసరీ బాత్; గోధుమ రవ్వతో చేసిన ఒక తీపి వంటకం;
halve, v. t. సగానికి తగ్గించు;
ham, n. పంది పిరుదుల దగ్గర, వెనక కాళ్ల దగ్గర నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి తయారు చేసిన పదార్థాన్ని "హ్యామ్" (ham) అంటారు; (rel.) "బేకన్" అనేది పంది కడుపు దగ్గర నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి, పొగ పెట్టి తయారు చేసిన పదార్థం; సహజంగా లభ్యం అయే పంది మాంసాన్ని "పోర్క్" అంటారు;
hamlet, n. గూడెం; పల్లి; పల్లెటూరు; కుగ్రామం; కుప్పం; కండ్రిగ;
hammer, n. సుత్తి;
blacksmith's hammer, ph. కమ్మరి సుత్తి;
claw hammer, ph. పటకా సుత్తి;
hammer, v. t. బాదు; సుత్తితో కొట్టు;
hammock, n. ఉల్లడ; రెండు రాటల మధ్య వేల్లాడగట్టిన ఊయల;
hamper, v. t. అడ్డుతగులు; ఆటంకపరచు;
hamper, n. మాసిన బట్టలబుట్ట;
hamstring, n. తొడనరము; మోకాలి కదలికని నియంత్రించే ఐదు స్నాయువులలో ఏదయినా: any of five tendons at the back of a person's knee.
hand, n. (1) చేయి; చెయ్యి; కరం; పాణి; హస్తం; కేలు; కై; మణికట్టు కింద భాగం; మణికట్టుకి మోచేయికి మధ్యనుండేది మీజెయ్యి; (2) గడియారం ముల్లు;
back of the hand, ph. మండ; మీదుచెయ్యి; పెడచెయ్యి;
helping hand, ph. చేదోడు;
hour hand, ph. చిన్న ముల్లు; గడియారంలో గంటలు చూపే చిన్న ముల్లు;
left hand, ph. ఎడమ చెయ్యి; పుర్ర చెయ్యి; వామహస్తం;
minute hand, ph. పెద్ద ముల్లు; గడియారంలో నిమిషాలు చూపే పెద్ద ముల్లు;
right hand, ph. కుడి చెయ్యి; దక్షిణ హస్తం;
second hand, ph. పరుగు ముల్లు; గడియారంలో సెకండ్లను చూపే ఎర్ర ముల్లు;
sleight of hand, ph. చేవడి; హస్తవేగం; హస్తలాఘవం; చేవాటితనం;
top of the hand, ph. అరచెయ్యి; లోజేయి; కరతలం;
handbag, n. కరతిత్తి; చేతిసంచి; హస్తసేవకం;
handbook, n. కైపొత్తం; చేతి పుస్తకం;
handcuffs, n. బేడీలు; అరదండాలు;
handedness, n. చేతివాటం; కరత్వం;
left handedness, ph. పుర్ర చేతివాటం; ఎడమ చేతివాటం; వామకరత్వం;
right handedness, ph. కుడి చేతివాటం; దక్షిణకరత్వం;
handful, n. (1) చేరెడు; పిడికెడు; పట్టెడు; (2) చేతినిండా;
hangnail, n. a piece of torn skin at the root of a fingernail; to remove a hangnail, soften it in warm water (and vinegar), snip it with a sterile nail clipper, apply Neosporin, and cover with Bandaid;
haphazard, adj. అకటావికట; చెల్లాచెదురు; అరకొర;
hapless, adj. దురదృష్టపు;
haplo, pref. ఏక; సరళ;
haploid, adj. ఏకస్థితిక;
happen, v. i. తటస్థించు; తటస్థపడు; జరుగు; సంభవించు;
---Usage Note: happen, occur, take place, happen to
---Use happen to talk about past or future events that are accidental or that cannot be planned: What will happen if I change my job? Use occur to talk about a specific event that has already happened. Use take place to talk about a planned event: The wedding will take place on Sunday. Use happen to to say that a person or thing is affected by an event.
happiness, n. ఆనందం; సంతోషం; ప్రమోదం; ఎలమి; ముదము;
happy, adj. సంతోషపు;
happy event, ph. సంతోషపు సమయం; శుభ కార్యం;
happy person, ph. సంతోషి;
happy, n. హాయి; సంతోషం;
harbinger, n. (1) వైతాళికుడు; అగ్రగామి; (2) రాబోవుదానిని సూచించేది; పురోసూచకం;
harass, v. t. వేధించు; బాధించు; క్షోభపెట్టు; పీడించు;
hard facts, ph. నిర్వివాదములైన నిజాలు; కఠిన సత్యాలు; కఠోర వాస్తవాలు;
hard luck, ph. దురదృష్టం;
hard question, ph. గడ్డు ప్రశ్న;
hard rain, ph. జడివాన;
hard rock, ph. చట్రాయి;
hard stool, ph. పెంటిక;
hard times, ph. కష్ట కాలం; గడ్డు రోజులు;
hard water, ph. కఠిన జలం; చవిటి నీళ్ళు; సున్నపు నీళ్లు; సబ్బు నురుగ రాని నీరు; కేల్సియం, మెగ్నీసియం లవణాలు ఎక్కువగా కరిగిన నీరు; ఈ లవణాలు మరీ ఎక్కువగా లేనంతసేపూ తాగడానికి ఇదే మంచిది; కాని యంత్రాలకి వాడే ఆవిరి తయారీలో ఈ నీరు మంచిది కాదు;
hardness, n. గట్టితనం; కక్కరం; కాఠిన్యత; ధృతగుణం; బిరుసుతనం; కఠినత్వం;
hardship, n. ఇబ్బంది; కష్టం; బెడద; కక్కసం;
hardware, n. (1) గట్టిసరుకు; ఇనపసామాను; ఇత్తడి సామాను; (2) కాయం; దేహం; బొంది; (3) యంత్రాంశం; యంత్రసామగ్రి; బహిర్యామి; స్థూలకాయం; కలనయంత్రాంగాలలో క్రమణికలు కానివి; కంప్యూటర్లలో చేతితో ముట్టుకోడానికి అనువైన భాగాలు; ఉ. కలన కలశం ఉన్న సిలికాన్ చితుకు, దత్తాంశాలు దాచుకోడానికి నిర్మించిన వ్యవస్థలు, మీటల పలకం; తెర; మూషికం, తీగలు, వగైరాలు;
hardy, adj. దృఢమైన;
hare, n. పెద్ద కుందేలు; పెద్ద చెవుల పిల్లి; {note) Generally speaking, hares are bigger than rabbits; Rabbits and hares also have different diets, with rabbits preferring grasses and vegetables with leafy tops, such as carrots, and hares enjoying harder substances like plant shoots, twigs and bark; Baby rabbits are called kits and baby hares are called leverets;
harebrained, adj. తెలివిమాలిన; మూఢ;
harem, n. అంతఃపురం; అంతర్మందిరం;
harem attendant, ph. m. సౌవిదల్లుఁడు; f. సౌవిదల్లిక; అంతఃపురంలో సేవచేసేవారు;
harmonic series, ph. [math] హరాత్మక శ్రేణి; సామరస్య శ్రేణి; In mathematics, harmonic series is divergent infinite series; The name is derived from harmonics (or overtones) of a vibrating string, which are 1/2, 1/3, 1/4,... of the fundamental frequency; ;
harmonics, n. అతిస్వరాలు; స్థూలంగా చెప్పాలంటే ప్రాధమిక ధ్వని తరంగం (fundamental), దాని అతిస్వరాలు (harmonics) కలిపి అనుస్వరాలు అవుతాయి; ఇక్కడ అతిస్వరాల పౌనఃపున్యం, ప్రాథమిక స్వరాల పౌనఃపున్యం మధ్య ఉండే నిష్పత్తి పూర్ణాంకం అయి ఉండాలి; అప్పుడే ఆ స్వర సమ్మేళనాలు శ్రావ్యంగా ఉంటాయి;
harmonious, adj. కల; సామరస్య;
harmonious voice, ph. కలకంఠం;
harmonize, v. t. క్రమ పరచు; సామరస్యం కలిగించు;
harmony, n. రమ్యత; స్వరసమ్మేళనం; సామరస్యం; ఏకతాళం; ఏకస్వరం ; పొందిక; అన్యోన్యత; a pleasing union among simultaneous notes; [see also] melody;
harness, n. జీను; (rel.) rein;
harness, v. t. (1) జీను తొడుగు; జీను వేయు; (2) సజ్జీకరించు; ఉపయోగించు; నియంత్రణకి తెచ్చు;
harpoon, n. పంట్రకోల; రువ్వుటీటె; చేపలని పట్టడానికి ఈటెకి తాడు కట్టి నీళ్ళల్లోకి రువ్వే ఈటె;
harrow, n. గుంటక; గొఱ్ఱు; మత్యం; మత్తెం; నాగలి పెళ్లగించిన బెడ్డలని గుండగా చేసే పనిముట్టు;
hartal, n. [Ind. Engl.] హర్తాల్; (Hin.) హట్ట + తాళ; అంగళ్ళకి తాళాలు వెయ్యడం; సమ్మె; పని మానెయ్యడం;
harvest, n. పంట; పంటకోత;
hashish, n. గంజాయి; భంగు; హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; మేరువానా అనేది గంజాయి మొక్క ఆకులని, మొగ్గలని ఎండబెట్టి తయారు చేస్తారు; (note) The word assassin is derived from "hassasin" which is related to hashish;
hashtag, ph. n. ఒక గుర్తు; కంప్యూటర్ కీ ఫలకం మీద ఉండే రెండు అడ్డ గీతలు, వాటి మీద రెండు నిలువు గీతలు ఉన్న ఒక గుర్తు;
haste, n. తొందర; తొందరపాటు; ఉరవడి; జోరు;
hasten, v. i. తొందర పడు; v. t. తొందర పెట్టు;
hastiness, n. తొందరపాటు; దుందుడుకు;
hatch, v. t. గుడ్లని పొదుగు;
hatchet, n. పరశువు; చిన్న గొడ్డలి; చేతి గొడ్డలి;
hate, v. t. ద్వేషించు;
hater, n. ద్వేషి; విరోధి; గిట్టనివాడు;
hatred, n. ద్వేషం;ఒంటమి;
haul, v. t. ఈడ్చు; లాగు;
haunt, n. చుట్టుకొని తిరిగే చోటు; సంచరించే చోటు; ఇరువు; విహార స్థలం;
have, v. ఉండు, ఉండుట, కలిగి ఉండుట,
have to, modal verb. తప్పకుండా చెయ్యవలసిన పరిస్ఠితి; to be forced to do something because someone makes you do it, or the situation makes it necessary;
---Usage Note: have to, have got to, must
---Use all these phrases to talk about what is necessary to do. Use have to to say that something is necessary, and you do not have a choice about it: I have to study for the examination. Use must to say that something is necessary and you think it is a good idea: I really must study harder. Use have got instead of have to or must to emphasize how important something is: I have got to talk to him.
haven, n. (హేవెన్). రేవు; ఆశ్రయం; నివాసం;
havoc, n. నాశనం; ధ్వంసం;
hawk, n. (1) డేగ; జాలె; కురుజు; సాళ్వం; వేసడం; ఒరణం; (2) కయ్యానికి కాలు దువ్వే వ్యక్తి; యుద్ధానికి సిద్ధపడే వ్యక్తి;
hay, n. ఎండుగడ్డి; గాదం; గవతం; ఎండిన కసవు; grass and other greenery, such as alphalpha, that is cut, dried, and cured for storage as bundles for animal fodder;
hay fever, ph. గవత జ్వరం; గడ్డి జాతి మొక్కల పుప్పొడి పడక వచ్చే ఒక రకం ఎలర్జీ;
haystack, n. గడ్డిమేటు; గడ్డివాము; యావసం;
hazard, n. ప్రమాదం; అపాయం; గండం; విపత్తు;
hazardous, adj. ప్రమాదకరమైన; ప్రమాదపూర్వకమైన; ప్రమాదకారకమైన; హాని కలిగించే;
hazel nuts, n. pl. new name for filberts; ఒక రకం పిక్క; ఈ పిక్క లోపలి గింజలు తింటారు;
hazmat, n. ప్రమాదార్థం; ప్రమాదకరనమైన + పదార్థం; hazardous + material
head, n. (1) తల; బుర్ర; నెత్తి; శిరస్సు; శిరం; శీర్షం: మస్తకం; మూర్ధం; (2) పెద్ద; అధిపతి; see also heads; scalp;
pressure head, ph. [engr.] పీడన శిరం;
suction head, ph. [engr.] పీలుపు శిరం;
head clerk, ph. పెద్ద గుమాస్తా;
headache, n. తలనొప్పి;
migraine headache, ph. అనంతావర్తం; ఒక రకం తలనొప్పి;
headed pin, n. గుండుసూది;
header, n. శిరోవాక్యం;
heading, n. శీర్షిక; తలకం;
headline, n. శీర్షిక; వార్తాశీర్షిక; ముఖ్య సమాచారం;
banner headline, ph. పతాక శీర్షిక;
running headline, ph. పుటాక్షరం;
headlights, n. pl. తలదీపాలు;
headmaster, n. ప్రధాన ఉపాధ్యాయుడు;
heads, n. బొమ్మ; నాణెం యొక్క బొమ్మ వైపు;
heads or tails? ph. బొమ్మా, బొరుసా?
headstrong, adj. తలబిరుసైన;
headwind, ph. ఎదురుగాలి; గోగంధనం;
heal, v. i. మాను; v. t. మాన్చు;
health, n. ఆరోగ్యం;
health insurance, ph. ఆరోగ్య బీమా;
health issue, ph. ఆరోగ్య సమస్య;
health record, ph. ఆరోగ్య కవిలె;
health worker, ph. ఆరోగ్య కార్యకర్త;
public health, ph. ప్రజారోగ్యము;
healthful, adj. ఆరోగ్యదాయకం; ఆరోగ్యకరం:
healthy, adj. (1) ఆరోగ్యవంతం; (2) ఆరోగ్యకరం;
healthy child, ph. ఆరోగ్యవంతమైన బిడ్డ;
healthy food, ph. ఆరోగ్యకరమైన ఆహారం;
healthy imagination, ph. చురుకైన ఊహాశక్తి;
USAGE NOTE: healthy and healthful
In the old days "healthful' meant "good for your health," whereas "healthy" meant "having or showing good health. "Nowadays these two words are used synonymously: "These vegetables are healthful. They are also healthy." Both usages are correct.
Use both of these words to talk about sounds. Listen means to pay attention to what someone says: She never listens to me. Hear usually means to recognize that a sound is being made: Did you hear the alarm ring?
hearing, n. (1) విచారణ; వినడం; (2) వినికిడి;
hearsay, n. వినికిడి; విన్నమాట; జనశ్రుతి; కింవదంతి; శ్రుతపాండిత్యం;
broken heart, ph. పగిలిన గుండె; stress cardiomyopathy; cardiomyopathy; a temporary condition that can be brought on by stressful situations. During broken heart syndrome, one part of the heart stops pumping normally, which may cause the rest of the heart to pump more forcefully, according to the Mayo Clinic.
getting by heart, ph. కంఠస్థం చెయ్యడం; ధారణ చెయ్యడం;
heart attack, ph. గుండె పోటు; హృద్‌ఘాతం;
heart disease, ph. గుండె జబ్బు;
ischemic heart disease, ph. రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చే గుండె జబ్బు;
heartbeat, n. హృదయ స్పందనం; గుండె కొట్టుకోవడం;
heartburn, n. (1) ఆమ్లపిత్తం; గుండెమంట; అజీర్తి వల్ల ఛాతీలో కలిగే మంట; (2) [idiom] అక్కసు;
latent heat, ph. గుప్తోష్ణం; తాపోగ్రత మారకుండా ఒక పదార్థాన్ని ఘన రూపం నుండి ద్రవ రూపం లోకి కానీ, ద్రవ రూపం నుండి వాయు రూపం లోకి కాని మార్చడానికి కావలసిన వేడి;
latent heat of melting, ph. ద్రవీకరణ గుప్తోష్ణము; ఉదా: నీరు ద్రవరూపం నుండి ఘన రూపంలోకి మారేటప్పుడు శక్తిని విడుదల చేస్తుంది;
latent heat of vaporization, ph. బాష్పీభవన గుప్తోష్ణం; ఉదాహరణకు 100°C వద్ద 1 గ్రాము నీరు పూర్తిగా ఆవిరిగా మార్చడానికి 540 కేలరీలు కావాలి;
specific heat, ph. విశిష్ట ఉష్ణం; ఒక (గ్రాము) పదార్థపు తాపోగ్రతని ఫలానా (ఒక డిగ్రీ) మేరకి పెంచడానికి కావలసిన వేడి;
heat edema, ph. వడ పొంగు;
heat rash, ph. చెమట పొక్కులు; చెమట కాయలు;
heat ray, ph. తాపకిరణం; ఉష్ణకిరణం;
heat stroke, ph. వడదెబ్బ;
heat syncope, ph. వడ సొమ్ము;
heat, v. t. వేడిచేయు; కాచు; కాగబెట్టు;
heat-proof, adj. ఉష్ణజిత;
heave, v. t. (1) లాగు; ఎత్తు; లేవనెత్తు; విసరు; రువ్వు; తోయు; పనులని ఎక్కువ శ్రమతో చేయు;
heave a sigh, ph. బలంగా నిట్టూర్చు;
heaven, n. స్వర్గం; దివి; సురలోకం; నాకం; పరమపదం; వినువు;
heavy elements, ph. భారీ ధాతువులు; భారీ మూలకాలు; అణు సంఖ్య 92 ని మించి ఉన్న రసాయన మూలకాలు;
heavy industries, ph. భారీ పరిశ్రమలు;
heavy metals, ph. భారీ లోహాలు; ఎక్కువ సాంద్రత కలిగి, తక్కువ మోతాదులో కూడ విష పదార్థాలయిన రసాయన మూలకాలు; ఉదా: పాదరసం; కేడ్మియం; ఆర్సెనిక్, క్రోమియం; థేలియం;
heavy rains, ph. భారీ వర్షాలు; కుండపోత;
heavy water, ph. భారజలం; బరువునీరు; నీటి బణువులో ఉదజని అణువుకి బదులు "భారీ ఉదజని" అణువు ఉంటే దానిని భారజలం అంటారు;
hemodialysis, n. రక్తశుద్ధి; రక్తాన్ని శుద్ధి చేయడం;
hemoglobin, n. రక్తచందురం; రక్తములోని ఎర్రకణములకు రంగునిచ్చు పదార్థము;
hemorrhage, haemorrhage, (Br.) n. రక్తస్రావం;
hemorrhoids, haemorrhoids, (Br.) n. మూలశంక; మొలలు; అసౌకర్యం, రక్తస్రావం కలిగించే పురీషనాళం లో వాచిన సిరలను పైల్స్ అంటారు. దీనిని హీమోరాయిడ్స్ అని కూడా అంటారు;
hemp, n. గోగు; ఒక రకం గంజాయి;
hemp fibre, ph. కిత్తనార; గోగు నార;
hen, n. f. పెట్ట; కోడిపెట్ట; కుక్కుటి; pl. కోళ్లు;
henceforth, adv. ఇకమీదట; ఇకముందు; ఇటుతర్వాత;
henotheism, n. ఏకదేవవాదము; ఒకటే దేవుడిని ఆరాధించడం. దేవుళ్ళు అనేకం ఉండొచ్చు కానీ ఆరాధన మాత్రం ఎంచుకున్న ఒక్కరికే. ఇంతేకాక, ఏకదేవవాదులైన కొందరు సందర్భం బట్టి ఒక దేవుడికి పెద్ద పీట వేస్తారు. వేరే సందర్భంలో ఉంకో దేవుడికి పెద్ద పీట;
henpecked, adj. భార్యకు భయపడే:
henpecked husband, n. భార్యాజితుడు; భార్యాటికుడు;
henna, n. గోరింటాకు;
hepatic, adj. కాలేయానికి సంబంధించిన; కాలేయ;
hepatic vein, ph. కాలేయ సిర;
hepatitis, n. కామెర్లు; పచ్చ కామెర్లు; పసిరికలు; కాలేయపు వాపు; కాలేయశోఫ; ఇది సాధారణ హెపటైటిస్. ఇది కాకుండా హెపటైటిస్ A, B. C. Delta అని రకరకాల పేర్లతో హెపటైటిస్ చెలామణీలో ఉంది. వీటికీ పచ్చ కామెర్లకీ పేరులో పోలిక తప్ప మరేవిధమైన సంబంధమూ లేదనే చెప్పుకోవచ్చు;
heptagon, n. సప్తభుజి; డెమ్మూఁపి;
heralder, n. యుగకర్త; వైతాళికుడు; ఆద్యుడు;
herb, n. (ఎర్‌బ్) (1) మూలిక; శాకం; ఆకు; పత్రం; ఆకుపత్రి; వంటలో సువాసన కొరకు వాడే మొక్క; (2) ఓషధి; మందులలో వాడే మూలిక;
herbicide, n. గుల్మసంహారిణి; గుల్మనాశని; కలుపు మొక్కలని చంపే రసాయనం;
heredity, n. వారసత్వం; అనువంశికత; పారంపర్యం; వంశపారంపర్యం; పారంపర్య బలం; వంశానుగతం;
heredity, n. వారసత్వం; వంశపారంపర్యం; వంశానుగతం;
heresy, n. సంప్రదాయ విరుద్ధత; వ్యతిరేకత; నాస్తికత్వం;
heretic, n. పాషండుడు; పాషండి;
heritability, n. Heritability is a statistical measure that quantifies the extent to which genetic factors contribute to the variation in a trait within a population. Inheritance, on the other hand, refers to the transmission of genetic information from parents to offspring. Inheritance describes the process, whereas heritability describes the relative influence of genetic factors on trait variation;
heritage, n. వారసత్వం; వారసత్వంగా లభించినది; అనువంశికం;
hermeneutics, n. మీమాంశ; గ్రంథాల తత్త్వవిచారణ; see also exegesis;
hermetically, adj. నివాత; గాలి చొరని;
hermetically sealed, ph. గాలి లేకుండా సీలు చేయబడ్డ;
hermit, n. వానప్రస్థి; వనవాసి; రుషి; ఒంటరిగా జీవించు రుషి;
hermitage, n. ఋష్యాశ్రమం; ఋషివాసం;
hernia, n. గిలక రోగం; ఆంత్రవృద్ధి; అవయవ భ్రంశము; అవయవ స్థానభ్రంశము;
inguinal hernia, ph. ఆంత్రవృద్ధి; గజ్జమీది గిలక;
femoral hernia, ph. తొడమీది/గజ్జకింది గిలక;
strangulated hernia, ph. అడ్డుపడ్డ/అణిగిపోయిన గిలక; A strangulated hernia is a life-threatening medical condition. Fatty tissue or a section of the small intestines pushes through a weakened area of the abdominal muscle. The surrounding muscle then clamps down around the tissue, cutting off the blood supply to the small intestine.
umbilical hernia, ph. బొడ్డుగిలక.
hero, n. m. (1) నాయకుడు; కథానాయకుడు; (2) వీరుడు; ధీరుడు; యోధుడు;
heroic, adj. వీర; ధీర;
heroine, n. f. నాయకి; కథానాయకి; ధీర; (rel.) నాయకురాలు is used to imply a leader;
heroism, n. ధీరోదాత్తత;
heron, n. బకం; కొంగ; కొక్కెర; కొక్కిరాయి; నారాయణపక్షి;
pond heron, ph. కోనేటి కొంగ;
gray heron, ph. బూడిద కొంగ; బూది కొంగ;
purple heron, ph. ఊదా కొంగ; ఎఱ్ఱనీల కొంగ;
herpes, n. విసర్పిణి; సర్పి వ్యాధి; చప్పి రోగం;
herpes frontals, ph. లలాటిక విసర్పిణి; ఒక వైరసు వ్యాధి;
herpes labialis, ph. ఓష్ఠిక విసర్పిణి; పెదవుల దగ్గర వచ్చే ఒక వైరసు వ్యాధి; cold sores;
herpes zoster, ph. మేఖలిక విసర్పిణి; దద్దురులతో వచ్చే ఒక వైరసు వ్యాధి;
hesitate, v. i. తటపటాయించు; తడబడు; జంకు; అర్రాడు; అల్లాడు; సంశయించు; సందేహించు; సంకోచించు;
hesitation, n. తటపటాయింపు; జంకు; నదురు; బెరుకు; అరమరిక;
heterodox, adj. సంప్రదాయ విరుద్ధమైన; (ant.) orthodox;
heterodox Hindu, ph. వేద పాషండుడు; నాస్తికుడు;
heterodox, n. పాషండుడు; పాషండి; non believer; heretic; freethinker; rebel;
heterogeneous, adj. విజాత; విషమజాతీయ; వివిధ;
heteronym, n. (1) ఒకే వర్ణక్రమం ఉండి, ఉచ్చారణలోనూ, అర్థం లోనూ తేడా ఉన్న ఇంగ్లీషు మాటలు; ఉదా: tear (టేర్) = చించు; tear (టియర్) = కన్నీటి బొట్టు; primer (ప్రిమర్) - మొదటి పుస్తకం, primer (ప్రైమర్) = రంగులు వేసేటప్పుడు వాడే మొదటి పూత;
heterosexual, n. పరలింగాళువు; వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి;
heterospory, n. భిన్న సిద్ధబీజత;
heterotrichous, adj. విషమ తంతుక;
heuristic, n. ఆనుభవికం; A rule of thumb, intuitive guess, or educated guess that reduces or limits the search for solutions in domains that are difficult and poorly understood;
hexagon, n. షడ్‌కోణి; షడ్‌భుజం;
hexadecimal, adj. షోడశాంశ; పదహారు అంశలు ఉన్న;
hexadecanoic acid, n. షోడశోయిక్ ఆమ్లం; పదహారు కర్బనపు అణువుల గొలుసు ఉన్న గోరోజనామ్లం;
hexanoic acid, n. షష్ఠోయిక్ ఆమ్లం; మేషిక్ ఆమ్లం; కేప్రిలిక్ ఆమ్లం;
hexameter, n. ఆరు గణాలు ఉన్న పద్య పాదం;
hey, inter. (ఏయ్); ఇదిగో; ఇదిగో నిన్నే; ఇటు చూడు;
hexose, n. షడోజు; షడ్భుజి ఆకారంలో నిర్మాణక్రమం ఉన్న చక్కెర జాతి రసాయనం;
hexose sugar, ph. షడ్‌చక్కెర; ఆరు కర్బనపు అణువులు ఉన్న చక్కెర జాతి;
highway, n. రహదారి; రాజమార్గం; రస్తా; హట్టమార్గం; బండిబాట; దండుబాట; రోడ్డు; ఒక ఊరినుండి మరొక ఊరికి వెళ్లే రోడ్డు;
hill, adj. కొండ; గిరి;
hill tribes, ph. గిరిజనులు;
hill, n. కొండ; దిబ్బ; గిరి; గుట్ట; అద్రి; నగం; అచలం; Traditionally a hill is not considered to be a mountain if the summit is under 1,000 feet;
hillbilly, n. బైతు; పల్లెటూరి బైతు; చదువు, నాగరికత లేని వ్యక్తి;
hillock, n. మిట్ట; మెట్ట; చిన్నకొండ;
hilt, n. పిడి; కత్తి పిడి;
hinder, v. t. ఆటంక పరచు;
hindrance, n. ఆటంకం;
Hindu, adj. హిందూ; హైందవ;
Hindu, n. హిందువు; సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి; (ety.) Some say this is a corrupt form of Sindh; some say this came from the Persian where hind means "black";
Hindustani, adj. హిందూ-ముస్లిం సమ్మిళితమైన; a hybrid of Hindu and Islamic;
hippie, n. హిప్పీ; 1960 దశకంలో, ముఖ్యంగా అమెరికాలో, సంఘపు కట్టుబాట్లు నిరసిస్తూ, సంస్కారం లేకుండా జుత్తు పెంచడం, చిరిగిన బట్టలు వేసుకోవడం, చట్టవిరుద్ధమైన మందులతో ప్రయోగాలు చెయ్యడం వంటి పనులు చేసే వ్యక్తి;
hippopotamus, n. నీటిగుర్రం; జలాశ్వం;
hire, n. కిరాయి; బాడుగ;
hire, v. t. కిరాయికి కుదుర్చు; బాడుగకి కుదుర్చు; అద్దెకి తీసుకొను;
hireling, n. కిరాయికి దుర్మార్గాలు చేసే వ్యక్తి; కిరాయికి ఖూనీ చేసే వ్యక్తి; బాడుగబందీ; క్షేత్రదాసుడు;
histogram, n. స్తంభచిత్రం; సోపానచిత్రం; A stacked column graph in which one places the columns close together to emphasize differences in the data items within each stack;
histrionics, n. వేషాలు; కృత్రిమ ప్రవర్తన; నాటకీయత; అభినయం;
hit, n. కొట్టు; మొత్తు; బాదు;
---Usage Note: hit, strike, beat
---Use hit to talk about most kinds of hitting. Strike is more informal and means to hit very hard. Beat means to hit someone or something many times. You can hit or strike someone or something accidentally, but you beat deliberately.
hither, n. ఇటు; ఇవతల; ఇటువైపు;
hive, n. పట్టు; తుట్టె;
hives, n. చలితం; ఎఱ్ఱటి దద్దురులు; ఒక రకం ఎలర్జీ; same as urticaria;
hoard, n. కూడబెట్టి దాచినది; నిక్షేపం; సంచితం;
hoarfrost, n. ఠారం; శీతలప్రాంతాలలోని ఆకులపై సూదిగా కప్పబడిన మంచు స్ఫటికాలు;
hoarse, adj. బొంగురుపోయిన; (ant.) shrill;
hoax, n. లాభాపేక్షతో కాకుండా, కేవలం అల్లరి చేసే ఉద్దేశంతో చేసిన మోసకారి పని;
hobby, n. వ్యావృత్తి; అభిరుచి;
hoe, n. తొళ్లిక; తౌఁగోల;
hog, n. పంది;
hog plum, n. మారేడు;
hogweed, n. పునర్ణవా అనే మూలిక; గలిజేరుపల్లి; జీవలోధసి;
holidays, n. పర్వదినాలు; పండుగ రోజులు; అనధ్యానాలు; ప్రభుత్వముచే ప్రకటింపబడిన శలవు దినాలు; see also vacation;
Christmas holidays, ph. క్రిస్‌మస్ శలవులు;
summer holidays, ph. వేసంగి శలవులు;
holistic, adj. పూర్ణదృక్పథ;
hollow, adj. గుల్లగానున్న; డొల్లగా ఉన్న; పస లేని;
hollow, n. తొర్ర; డొల్ల; డొలక; బోలు;
holocaust, n. మారణహోమం; జాతి విధ్వంసం; ప్రత్యేకంగా జెర్మనీ నియంత హిట్లరు యూదుల యెడల చేసిన మారణహోమం;
holograph, n. చేవ్రాలు; స్వహస్తంతో రాసినది;
holographic will, ph. A holographic will is a handwritten and testator-signed document and is an alternative to a will produced by a lawyer; Some states do not recognize holographic wills;
hologram, n. ప్రతిచ్ఛాయ; ప్రతికృతి; ఆకారానికి నకలు ఆకారం; a three-dimensional image created from a pattern of interference produced by a split coherent beam of radiation (such as a laser light);
holy, adj. పవిత్రమైన; ఆర్ష;
holy basil, n. తులసి;
homage, n. ప్రణామం; వందనం;
home, adj. ఇంటి;
home remedy, ph. ఇంటి వైద్యం; గృహవైద్యం; కరక్కాయ వైద్యం: గోసాయి చిట్కా;
home, n. ఇల్లు; కొంప; నివాస స్థలం; ఉనికిపట్టు; నెలవు; గృహం; మనుకువ; ధామం; నికేతనం; నివసనం; నివాసం; నివేశనం; నిలయం;
Hominid, n. నరవానర గణం; మానవులు, మానవులని పోలిన వానరగణాలు; వివేక మానవులు, దాక్షిణాత్య వానరాలు, మొదలైన జాతులన్నిటిని గుత్తగుచ్చి వాడే పదం; ఒరాంగ్-ఉటాన్, గిబ్బన్, గొరిల్లా, చింపంజీ, మనిషి, మొదలైనవి; any of a family of two-footed primate mammals that include the human beings together with their extinct ancestors and related forms;
hominidae, n. హోమినిడే; ఒక కుటుంబం పేరు; మహా వానరాలు; great apes;
homininae, n. హోమినినే; ఒక ఉప కుటుంబం పేరు;
hominoidea, n. హోమినాయిడియా; ఒక అధి కుటుంబం పేరు;
homo, pref. (1) సజాతీయ; సమ; (2) మానవ; ఒక ప్రజాతి (genus) ని సూచించే మాట;
Homo denisova, ph. డెనిసోవా మానవ; Man from Denisova cave in Siberia;
Homo erectus, ph. నిటారు మానవ; upright man;
Homo ergaster, ph. పని మానవ; పనిచేసే మానవ; (ety.) homo = man; ergaster = workman; (ex.) Turkana Boy;
Homo habilis, ph. చేతివాటు మానవ; పనిముట్లు తయారు చెయ్యడం నేర్చిన మానవ; (ety.) homo = man; habilis = handy; talented with hands; కొందరు వీరిని ఆస్ట్రాలోపితికస్ వర్గంలో చేర్చుతారు;
Homo heidelbergensis, ph. హైడెల్‌బర్గ్ మానవ;
Homo neanderthalensis, ph. నియాండెర్తాల్ మనిషి; కొందరు వీరిని బుద్ధ మనిషి వర్గంలో చేర్చుతారు;
Homo rudolfensis, ph. రూడాల్ఫు మనిషి; Man from Lake Rudolf; (ety.) homo = man; rudolfensis = related to Lake Rudolf;
Homo sapiens, n. తెలివైన మనిషి; బుద్ధ మనిషి; (ety.) homo = man; sapiens = intelligent; wise;
Homo soloensis, ph. సోలో లోయ మనిషి; Man from the Solo Valley;
homogeneity, n. సజాతీయత; సమఘాతీయ;
homogeneous, adj. సజాతీయ; సాజాత్య; సమాంగ;
homogeneous equation, ph. సమాంగ సమీకరణం; ఒక గణిత సమీకరణంలో "కుడి వైపు" సున్న ఉన్నచో దానిని సమాంగ సమీకరణం అంటారు;
homogenized, adj. సమాంగపరచిన; సమాంగ;
homogenized milk, ph. సమాంగపరచిన పాలు; సమాంగ పాలు; పాలల్లో వెన్న పైకి తేలిపోకుండా అతి సూక్ష్మమైన జల్లెడ గుండా, అధిక పీడనంతో పోనిచ్చి, సూక్ష్మమైన రేణువులుగా మార్చగా వచ్చిన పాలు; ఈ పద్ధతిలో "తయారు చేసిన" పాలు మంచి తెలుపుతో, చిక్కగా ఉంటాయి;
homologous, adj. సధర్మ; సంగత; సమజాత; స్థానంలో కాని, విలువలో కాని, కట్టడిలో కాని గట్టి పోలికలు ఉన్న;
homologous chromosomes, ph. సంగత వారసవాహికలు; సంగతత్త్వం ఉన్న వారసవాహికలు;
homologue, n. సంగతకం; ఒకే జాతికి చెందినవి; ఒకే కుటుంబానికి చెందిన;
homology, n. సంగతత్త్వం;
homonyms, n. pl. వర్ణక్రమంలో తేడా ఉన్నా ఒకే విధంగా ఉచ్చరించే మాటలు;
homophile, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి; (ant.) heterophine;
homosexual, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి; (ant.) heterosexual;
homosexuality, adj. స్వలింగ ఆకర్షణ; స్వలింగాళువులతో సంపర్కం పొందాలనే ఆకాంక్ష;
homosporous, adj. సమసిద్ధబీజవంత; ఒకే రకపు "స్పోరులని" ఉత్పత్తి చేసే:
hone, n. శాణం; సానఱాయి; --see also touch stone
hone, v. t. పదునుపట్టు; సానపట్టు; మెరుగులు దిద్దు;
honesty, n. (ఆనెస్టీ) నిజాయితీ; సచ్ఛీలత; చిత్తశుద్ధి; ఆర్జవం; అక్కలత;
honey, n. తేనె; మధువు; మకరందం; భామరం; పుష్పరసం; క్షౌద్రం; (rel.) nectar;
pure honey, ph. కురుజు తేనె;
honeybee, n. తేనెటీగ; పెర ఈగ;
honeycomb, n. తేనెపట్టు; తేనెతుట్టె; పెర;
honeymoon, n. తెన్నెల; మధుమాసం; వివాహము అయిన తరువాత భార్యాభర్తలు కల్సి ఉన్న మొదటి నెల;
honor, honour (Br.), n. గౌరవం; మర్యాద;
honor, v. t. గౌరవించు; గౌరవం చేయు;
honorable, adj. గౌరవనీయ; వందనీయ;
honorarium, n. గౌరవవేతనం;
honorary, adj. గౌరవ;
hood, n. (1) పడగ; ఫణం; స్ఫట; (2) శిఖరం; టొపారం;
hoodlum, n. గూండా;
hoodwink, v. t. బుకాయించు; దగాచేయు; మోసం చేయు;
hoof, n. డెక్క; గిటీ; గొరిజ; రింఖ; గిట్ట; ఖురం;
hook, n. (1) కొంకి; కొక్కెం; ఒంకీ; (2) క్రికెట్‌లో బంతిని వెనక్కి కొట్టు పద్ధతి; బేస్కెట్‌బాల్ ఆటలో ఒక విధంగా బంతిని విసిరే పద్ధతి;
hookworm, n. కొంకిపురుగు; [bio.] Ancyclostoma caninum; Hookworm is a parasite that infects the intestines. Hookworm larvae (eggs) enter through your skin. Once they reach the intestine, they hatch. As the name implies, hookworms have a hook-like head that attaches to the intestinal walls;
hooligan, n. రౌడీ; దుండగీఁడు;
hop, v. i. కుప్పించు; జవుకళించు; ఎగురు; దూకు; గెంతు;
hope, n. ఆశ; see also greed;
ray of hope, ph. ఆశాకిరణం;
vain hope, ph. అడియాస;
hopeful, adj. ఆశావహ; ఆశాజనక;
hopeless, adj. నిరాశాపూరిత; హతాశులయిన; నిరాశావహ;
hopelessness, n. నిరాశ; నిరాశావహం; నిరాశావహ పరిస్థితి;
hopper, n. శంకుతొట్టి; గరాటుతొట్టి; గరాటు;
hopscotch, n. తొక్కుడుబిళ్ల; పిల్లలు, ప్రత్యేకించి అమ్మాయిలు, ఆదుకునే ఒక ఆట;
horde, n. మంద; తొంబ;
horizon, n. క్షితిజం; దిగ్మండలం; దిగంతం; దిక్‌చక్రం; చక్రవాళం:
hormone, n. ఉత్తేజితం; స్రావకం; వినాళ స్రావకం; అంతర్గత స్రావం; గ్రంథులచే తయారుకాబడ్డ ఒక రకం ఉత్తేజపరచే రసాయన పదార్థం; శరీరంలో ఒక చోట తయారయి, రక్తప్రవాహంలో ప్రయాణం చేసి, వాటి కార్యస్థానాలని చేరుకుని వాటి విధిని నిర్వర్తించే రసాయన బణువులు; ఉదాహరణకి ఒక్క పిట్యూటరీ గ్రంధి ఏడు ఉత్తేజితాలని రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది; మూత్రకోశాల మీద టోపీలా ఉండే కణజాలం ఎడ్రీనలిన్ అనే ఉత్తేజితాన్ని తయారు చేస్తుంది; ఇలా ఎన్నో ఉత్తేజితాలు ఉన్నాయి;
hors d'oeuvres, n. pl. (ఆర్డొర్వుస్), భోజనం ముందు తినే వెచ్చవెచ్చటి చిరు భక్ష్యాలు; చల్లగా ఉన్న చిరు భక్ష్యాలని "ఆంటీపాస్తో" అంటారు;
horse, n. గుర్రం; అశ్వం; హయం; తురంగం; ఘోటకం; ఘోటం; వాజి; గుండు; వారువం; మయం; యయువు; [bio.] Equus caballus; The equus genus includes horese, donkeys, and zebras;
horse power, ph. అశ్వ సత్వం; 550 పౌనుల బరువుని ఒక సెకండు కాలవ్యవధిలో ఒక అడుగు పైకి లేవనెత్తడానికి కావలసిన సత్వాన్ని అశ్వ సత్వంఅని నిర్వచించేరు; ఒక సామాన్యుడి శరీరంలో ఉరమరగా ఒకటింట పదోవంతు అశ్వశక్తి ఉంటుంది;
horse rider, ph. రౌతు;
horse sacrifice, ph. అశ్వమేధం; వాజపేయం;
horsefly, n. జోరీగ;
horse-gram, n. ఉలవలు;
horseplay, n. మోటు సరసం;
horseradish, n. మునగవేరు; బాగా ఘాటుగా ఉండే ఒక రకం దుంప;
horseshoe, n. లాడం; గుర్రపులాడం;
horticulture, n. ఉద్యానకృషి; వనసాయం; తోటల పెంపకం;
hosiery, n. లోపలి దుస్తులు; లోదుస్తులు;
hose, n. మెత్తటి గొట్టం;
rubber hose, ph. రబ్బరు గొట్టం; ఎలా కావలిస్తే అలా ఒంగడానికి వీలయిన పొడుగాటి రబ్బరు గొట్టం;
hospital, n. ఆసుపత్రి; వైద్యశాల; ఆరోగ్యశాల; వాసిలి;
charity hospital, ph. ధర్మాసుపత్రి;
ladies hospital, ph. ఘోషాసుపత్రి;
hospital ward, ph. వాసిలి పానుపాది;
hospitality, n. ఆదరణ; మర్యాద; ఆతిథ్యం; అతిథి సత్కారం; అతిథిధర్మం; అతిథేయత;
host, n. అతిధేయుడు; అతిథిని ఆదుకునే మనిషి;
hostage, n. జామీనుగా ఉంచబడిన వ్యక్తి; బందీ;
hostel, n. వసతిగృహం; ఆవసధం; సదనం; ఉంగడ; విద్యార్థులు నివసించే వసతి గృహం;
hotel, (హొటేల్) n. హొటేలు; పడక సదుపాయాలని అతిథులకి అందించే భవనం; హొటేలులో పడక గదులే కాకుండా, ఫలహారశాలలు, తదితర సదుపాయాలు ఎనై్ననా ఉండవచ్చు; (note) ఈ మాటని హోటల్ అని ఉచ్చరించే అలవాటు ఆంధ్రదేశంలో ఉంది కానీ, హొటేలు అన్నది అసలు ఉచ్చారణకి దగ్గర; see also restaurant; motel;
hound, n. వేటకుక్క; గాలికుక్క; సారమేయము; ఉడుప కుక్క;
hour, n. గంట; హోర; వేళ;
hourglass, n. గంటసీసా; గంటగరాటు; హోరకాచం;
hourly, n. గంట గంటకీ; గంటకొకమారు; ప్రతిగంటా;
house, n. ఇల్లు; గృహం; అగారం; లోఁగిలి; ఆలయం; కొంప; పంచ; నెలవు;
house of cards, ph. పేకమేఁడ;
house made of lumber, ph. మచ్చు; మిద్దె; మాడుగు;
house sparrow, ph. ఇంటిపిచ్చుక; చిమణి;
doll house, ph. బొమ్మరిల్లు;
green house, ph. హరితగృహం; పచ్చటిల్లు;
interior of a house, ph. లోఁగిలి;
household, n. కాఁపురం; సంసారం; కుటుంబం;
entire household, ph. ఇంటిల్లిపాదీ;
household appliance, ph. గృహోపకరణం;
householder, n. గృహపతి; గృహస్థువు; గృహస్థు; గృహమేధి; గేస్తు; ఇంటిదొర;
housekeeping, n. గృహనిర్వహణ; ఇంటికాపు;
housewife, n. ఇల్లాలు; ఇంటికి ఆడది; గృహిణి; గరిత;
hover, v.t. ముసురు;
how, inter. ఎలా; ఎట్లా; ఏవిధంగా;
how many, adv. neuter. ఎన్ని;
how many people, adv. ఎంతమంది; ఎందఱు;
how much, adv. ఎంత?
howdah, n. అంబారీ; ఏనుగు మీద సవారీ చెయ్యడానికి వీలయిన కుర్చీ;
howitzer, n. పొట్టి ఫిరంగి;
hub, n. (1) నడిబొడ్డు; నాభి; చక్రనాభి; బండికన్ను; నట్టు; చక్రంలోకి ఇరుసు వెళ్లే స్థానం; (2) కూడలి; రహదారులు కానీ, తీగలు కానీ ఒక చోట కలుసుకునే స్థలం;
hubbub, n. హంగామా; హడావిడి; గడబిడ; అలజడి; కోలాహలం; గలభా; సందడి;
hubris, n. గర్వం; అతిశయం; గర్వంతో కూడిన అతిశయం; ధీమా; పొగరు;
hue, n. వన్నె; డౌలు; జిగి; చాయ; ఒకే రంగులో ఉండే వివిధ చాయలు; colors with the same hue are distinguished with adjectives referring to their lightness and/or colorfulness, such as with "light blue", "pastel blue", "vivid blue". Exceptions include brown, which is a dark orange;
hug, n. ఆలింగనం; కౌఁగిలింత; పరిష్వంగం;
huge, adj. పెను; పెద్ద;
huge demon, ph. పెనుభూతం;
huge wind, ph. పెనుగాలి;
hull, n. (1) పొట్టు; (2) పడవ మట్టు;
hull, v. t. పొట్టు తీయు; దంచు;
hulled, adj. దంచిన;
hulled paddy, ph. బియ్యం; దంపుడు బియ్యం;
hulled sesame seed, ph. పొట్టు తీసిన నువ్వులు; ఛాయ నూపప్పు;
hum, n. (1) రొద; సన్నని శబ్దం; (2) కూనిరాగం; (3) కలకలం; కోలాహలం; సందడి;
hum, v. i. కూనిరాగం తీయు;
human, adj. మానవ; మానవీయ; నర; పురుష; మానుష;
human rights, ph. మానవ హక్కులు; మానవాధికారాలు;
human endeavor, ph. పురుష ప్రయత్నం; మానవ ప్రయత్నం;
humanism, n. మానవతా వాదం; మానవతావాదం నీతి తత్వములకు సంబంధించిన ఒక విశాలమైన భావం. ఈ వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. ప్రత్యేకంగా మానవత్వాల హేతువులను మూలం చేసుకుని విశ్వమానవ విశేషాలను ముందుంచుతుంది. మానవత్వపు ఉత్తమ లక్షణం - సహనం. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మకాలు, విభిన్న తాత్విక దృక్పథాలు తప్పక ఉంటాయి. వాటి మధ్య ఐక్యతను సాధించడానికి ఉపయోగపడే సాధనమే సహనం. మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పని సరి;
humanitarian, n. మానవతావాది; ఉపకారి; కరుణాళువు;
humanities, n. మానవీయ శాస్త్రాలు; మానవ అనుభవాలని, మానవ సంస్కృతులని వర్ణించే అధ్యయనాంశాలు; తత్త్వం, శిల్పం, కళలు, సాహిత్యం, సార్స్వతం, తర్కం, వగైరాలు ఈ శాఖలోకి వస్తాయి;
humankind, n. మానవాళి; మానవకోటి; మానవజాతి; నరజాతి; నరమానవ గణం;
humble, adj. గర్వం లేని; వినయం కల;
humbug, n. (1) మాయ; మోసం; (2) మాయలాడి; మోసగాడు;
humerus, n. దండెుముక;
humidity, n. తేమ; చెమ్మ; చెమ్మదనం; తడి; ఆర్ద్రత; ఈకువ;
relative humidity, ph. సాపేక్ష ఆర్ద్రత;
humiliate, n. అవమానపరచు; చిన్నబుచ్చు;
humiliation, n. అవమానం; పరాభవం;
humility, n. నిరాడంబరత్వం; అణకువ; వినయం; వినమ్రత; see also obedience;
humor, humour (Br.) n. (1) హాస్యరసం; హాస్యం; (2) రసం;
aqueous humor, ph. నేత్ర రసం; జలాకార రసం;
sense of humor , ph. హాస్యస్పూర్తి;
vitreous humor, ph. స్పటికాకార రసం; మేధ పటలం;
humorous, adj. హాస్యస్ఫోరక;
hump, n. (1) మూపురం; పశువుల వీపు మీద ఎత్తుగా ఉండే అవయవం; (2) దిబ్బ; ఎత్తుగా ఉన్న ప్రదేశం; (3) చిన్న అవరోధం;
hunchback, n. గూనివాఁడు; కుబ్జుఁడు;
hundred, n. వంద; నూఱు; శతం; నలుబాతిక;
hundred thousand, ph. లక్ష; వంద వేలు; మిలియనులో పదో వంతు;
hundred year lifespan, ph. శతాయుష్షు;
hundred poems, ph. శతకం:
hundredweight, n. 112 పౌండ్ల బరువు;
hunger, n. ఆఁకలి; క్షుత్తు; క్షుధ; అంగద;
hunger strike, ph. నిరాహార దీక్ష; నిరశన వ్రతం;
excessive hunger, ph. అర్రాకలి;
hunt, n. వేఁట;
hunt, v. t. వేఁటాడు;
hunter, n. వేటగాఁడు; వ్యాధుఁడు; కిరాతుఁడు; బోయవాఁడు; భిల్లుఁడు; మృగయుఁడు; చెంచుఁడు;
huntress, n. f. వేటగత్తె; కిరాతకి; బోయది; భిల్లి; చెంచి;
hurdle, n. అడ్డంకి; ఆటంకం;
hurl, v. t. రువ్వు;
hurly-burly, n. సందడి;
hurricane, n. ప్రభంజనం; పెద్ద గాలివాన;
hurt, v. t. నొప్పించు;
husband, n. మగఁడు; పెనిమిటి; భర్త; పతి; నాధుఁడు; ఏలిక;
henpecked husband, ph. భార్యా విధేయుఁడు;
husbandry, n. పెంపకం; కృషి; నిర్వహణ;
animal husbandry, ph. పశువుల పెంపకం; పశువుల నిర్వహణ;
crop husbandry, ph. తరు కృషి;
hush money, n. లంచం; లాంఛనం;
husk, n. ఊఁక; పొట్టు; పొల్లు; చిట్టు;
hut, n. (1) గుడిసె; కుటి; కుటీరం; (2) పర్ణశాల;
hyacinth, n. హయరింఖ; ఒక రకం నీటి మొక్క;
Hyades, n. రోహిణీ సహిత నక్షత్రాలు; సప్తర్షి నక్షత్రాలు;
hybrid, adj. సంకర; కంచర;
hybrid, n. ఇబ్బంది; కంచరం; అయ్యపరెడ్డి; cross-breed;
hybrid, adj. సంకర; కంచర; చంపూ;
hybridization, n. సంకరీకరణం; సంకరణం;
Hydra, n. (1) ఆశ్రేష నక్షత్ర సమూహం; హైడ్రాలోని డెల్టా, ఎప్సిలాన్, ఈటా, రో అనే నక్షత్రాలని గుత్తగుచ్చి ఆశ్రేష అంటారు; (2) ఒక జంతువు;
hydrated, adj. ఉదన్వంతం;
hydraulic, adj. జలపీడిత;
hydraulics, n. నీటిలోని ఒత్తిడిని శక్తిగా మార్చే విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం;
hydrocarbon, n. ఉదకర్బనం; (lit.) liquid carbon; carbon in liquid form;
straight hydrocarbon, ph. బారు ఉదకర్బనం;
cyclic hydrocarbon, ph. చక్రీయ ఉదకర్బనం;
hydrocarbon radical, ph. ఉదకర్బన రాశి; ఒకటికి మించి ఉదజని అణువులని తొలగించగా రిక్త హస్తాలతో మిగిలిన ఉదకర్బనపు బణువు;
hydrocele, n. బుడ్డ; వరిబీజం;
hydrocephalus, n. జలశీర్షం; మస్తిష్కశోఫ; శీర్షబూదరం:
hydrochloric acid, n. ఉదహరి కామ్లం; శంఖ ద్రావకం; HCl;
hydrocotyle, n. సరస్వతీ ఆకు;
hydrodynamics, n. జలచలనం; జలగతి శాస్త్రం;
hydroelectricity, n. జలవిద్యుత్తు; జలోద్భవ విద్యుచ్ఛక్తి;
hydrogen, n. ఉదజని; (ety.) నీటియొక్క జననానికి కారణమైనది; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 1, సంక్షిప్త నామం, H)
hydrogen bond, ph. ఉదజని బంధం; రెండు బణువుల మధ్య ఉండే విద్యుదయస్కాంత తత్త్వంతో కూడిన ఆకర్షక బంధం; ఒక కర్బనం అణువుతో ఉదజని అతుక్కుని ఉదకర్బనాలుగా తయారయేటప్పుడు ఈ రకం బంధం కనిపిస్తుంది;
blue hydrogen, ph. నీలి ఉదజని; Produced using the same method as grey hydrogen, but with carbon emissions supposedly captured and stored underground. Yet to be proven at any significant scale. Both grey and blue hydrogen are more accurately called ‘fossil hydrogen’;
gray hydrogen, ph. ధూసర ఉదజని; Produced by mixing fossil gas with steam. Releases large quantities of CO2;
green hydrogen, ph. హరిత ఉదజని; Produced by passing electricity generated from renewable sources through water. Results in very low carbon emissions;
hydrogenation, n. వనస్పతీకరణం; ఉదజనీకృతం; నూనెలలోకి ఉదజనిని పంపి గడ్డకట్టించడం;
hydrology, n. జలరాశిశాస్త్రం; జలతంత్రం;
hydrolysis, n. జలవిశ్లేషణ; జలవిచ్ఛేదన;
hydrophobia, n. జలోన్మాదం; నీటిని చూసినా, నీటి శబ్దం విన్నా నీటిని తాకినా భయం వెయ్యడం; (note) ఈ లక్షణాలు పిచ్చి కుక్క కరచినప్పుడు కాని అడవి జంతువులు కరచినప్పుడు కాని వచ్చే రేబీస్ వ్యాధికి గుర్తు;
hyena, n. (హయీనా) దుమ్ములగొండి; గాడిదపులి; కొర్నవగండు; సివంగి;
hygiene, n. ఆరోగ్యశాస్త్రం; ఆరోగ్య సూత్రాలు;
hygroscopic, adj. జలశోషణ;
hymen, n. కన్నెతెర; యోనిమార్గంలో ఉండే పొర;
hymn, n. కీర్తన; స్తోత్రం; దండకం; పొగుడుతూ పాడే పాట;
hyoid bone, n. కాంతికాస్థి;
hyper, adj. pref. అతి; ఎగువ; పెద్ద; పై; అధి;
hyperbola, n. (హైపర్ బొలా) అతివలయం;
hyperbole, n. (హైపర్ బొలీ) అతిశయోక్తి; ఉన్నదానిని గొప్పగా వర్ణించుట;
hyperbolic, adj. అతివలయ ఆకారపు;
hyperbolic space, ph. అతివలయ ఆవరణం;
hyperactive, n. దురతి చలాకీతనం; అతి చలాకీతనం;
hyper-conjugation, ph. అతి సంయుగ్మం;
hyper-correction, n. దురతి సవరణ; అతిశోధితం; ఉదా: కొన్ని పదాల్లో హ-కారం లేని చోట కూడా హ-కారాన్ని చేర్చడం;
hypergamous, adj. అనులోమ; (lit.) along the direction of the hair; along the grain; marriage into an equal or higher caste or social group;
hyperhidrosis, n. అతిస్వేదం; అతిగా చెమట పట్టడం;
hyperlink, n. అధిలంకె; పరిలంకె; పరిసంధి; అతిఅంకె; కంప్యూటర్లలో ఒక పుటలోని ఉన్న పాఠ్యాంశాన్ని మరొక చోట విపులంగా వివరించడానికి గాను రెండు పాఠ్యాంశాలని బంధించే లంకె;
hypermetropia, n. చత్వారం;
hyper-parameter, n. దురతి పరామితి; In machine learning, hyperparameters are the ones that assist the learning process (that is the process of finding the parameters);
hypersphere, n. అతిగోళం; a sphere that exhibits more than three dimensions;
hypertension, n. రక్తపోటు; అతిపోటు; రక్తపు పీడనం పెరగడం; high blood pressure;
hypertext, n. కంప్యూటర్లలో ఒక పుటలోని ఉన్న పాఠ్యాంశాన్ని మరొక చోట విపులంగా వివరించడానికి గాను పాఠ్యాంశాన్ని అమర్చే విధానం; a software system that links topics on the screen to related information and graphics, which are typically accessed by a point-and-click method;
hypervisor, n. ఉపద్రష్ట; A hypervisor, also known as a virtual machine monitor or VMM, is software that creates and runs virtual machines (VMs). A hypervisor allows one host computer to support multiple guest VMs by virtually sharing its resources, such as memory and processing;
hypnospores, n. సుప్తబీజాలు;
hypnosis, n. నిద్ర తెప్పించే శాస్త్రం; నిద్ర తెప్పించి వశీకరించుకునే వైద్య పద్ధతి;
hypnotize, v. t. నిద్ర తెప్పించి వశీకరించు;
hypochondria, n. రోగభ్రాంతి; రోగభ్రమ; ఒక మానసిక రుగ్మత, దీనిలో వ్యక్తి తన ఆరోగ్యం గురించి విపరీతమైన ఆందోళన చెందుతాడు; కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) అనేది ఈ రుగ్మతకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సా విధానం. ఈ చికిత్స ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, నమ్మకాలను మార్చుకోవడం నేర్చుకుంటాడు;
hypo, pref. తక్కువ; దిగువ; కింద; చిన్న; లోనికి; లోనికి వెళ్ళే; లోనికి పీల్చుకునే;