This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
I
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
I, pron. నేను;
iamb, n. పద్యంలో వచ్చే లగం అనే గణం; ఒక లఘువు, తరువాత ఒక గురువు ఉన్న గణం; (rel.) foot అంటే గణం; iamb అంటే లగం; line అంటే పాదం;
iambic pentameter, n. లఘువు, గురువు చొప్పున ఐదు వరుసగా వచ్చే పద్య పాదం; అయిదు లగాలు ఉన్న పద్య పాదం; (note) iambic pentameter is a metrical speech rhythm that is natural to the English language, and one that Shakespeare made use of; ex: EVery TIME we TALK, we STRING toGETHer ACCented and UNACCented SYLLables withOUT even THINKing aBOUT it;
iambus, n. లగం; ఛందస్సులో లఘువు వెంబడి గురువు ఉన్న గణం;
iatrogenic, adj. చికిత్సాజనిత;
iatrogenic disease, ph. వైద్యుడి వల్ల కాని, వైద్య సిబ్బంది వల్ల కాని కలుగజేయబడ్డ రుగ్మత; వైద్యం చెయ్యడం వల్ల వచ్చిన వ్యాధి;
ibex, n. స్కీను; మేషం; కాప్రా; హిమాలయాలలో ఉండే మేకని పోలిన జంతువు;
ibis, n. కంకణపు కొంగ; ఒక జాతి కొంగ; పొడవాటి ముక్కు చివర కిందికి తిరిగి ఉండడం ఐబిస్ ల ప్రత్యేకత; సైబీరియా ప్రాంతాలలోని విపరీతమైన చలికి తట్టుకోలేక ఈ పక్షులు చలికాలంలో దక్షిణభారత దేశానికి వలస వస్తుంటాయి;
American White Ibis, ph. అమెరికన్ తెల్ల కంకణపు కొంగ; [bio.] Eudocimus albus of the Threskiornithidae family;
black-headed ibis, ph. నల్ల తల కొంగ;
white ibis, ph. తెల్ల కంకణము; తెల్ల కంకణపు కొంగ; ఎర్ర కాళ్ళ కొంగ;
ichnology, n. జీవుల ఆనవాళ్లయిన బొరియలు, ఆవాసాలు, కాలి గుర్తులు, మలం లాంటివి కూడా శిలాజాలుగా మారతాయి. వీటిని ఇక్నో ఫాసిల్స్(Ichno fossils) లేదా Trace Fossils అంటారు. జాడ శిలాజాల శాస్త్రాన్ని ఇంగ్లీషులో ఇక్నోలజీ (Ichnology) అంటారు;
ichthyology, n. మత్స్య శాస్త్రం; మీను శాస్త్రం; మీన విజ్ఞానం; చేపల శాస్త్రం;
icicle, n. మంచుకాడ; పొడుగ్గా కాడ రూపంలో పేరుకున్న నీరు; సాధారణంగా చూరుల వెంబడి కారే నీరు గడ్డ కట్టి ఇలా తయారవుతుంది;
icon, n. (1) ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి; చిత్రకం; (2) గురుతు;
iconoclast, n. (1) విగ్రహాలని ధ్వంసం చేసే వ్యక్తి; (2) సంప్రదాయపు ఆచారాలని, సంస్థలని వ్యతిరేకించే వ్యక్తి; (ety.) Iconoclast came from two Greek words "eikon" and "klastes." In Greek, 'eikon' means 'image' and 'klastes' means 'breaker';
icosahedron, n. [math.] వింశతిముఖి; ఇరవై ముఖములు ఉన్న ఘన బహుముఖి;
ideal gas, ph. ఆదర్శ వాయువు; a hypothetical gas whose molecules occupy negligible space and have no interactions, and which consequently obeys the gas laws exactly;
ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం;
idealism, n. (1) ఆదర్శవాదం; భావవాదం; (2) ఒక తత్త్వం; మౌలికంగా “స్వయానుభవ ఆధ్యాత్మిక వాదం.” ఇది జ్ఞానానికి సంబంధించినది; అనగా, వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు (consciousness) మీదనే ఆధారపడి ఉంటుంది. అనగా, తన అనుభవంతో మేళవించినదే ప్రపంచం (సృష్టి) అని చెప్పేది. అనగా, స్థూల ప్రపంచం కల్ల, ఒక మాయ అని చెప్పేది. అనగా, బల్ల మీద పండు అక్కడ ఉందా, లేదా అనేది చూసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు కూలినప్పుడు పుట్టిన శబ్ద తరంగాలు ఒక చెవి లోని కర్ణభేరికి తగిలి అది ప్రకంపించి ఆ ప్రకంపనలు ఒక మెదడులోని శ్రవణ నాడీ కేంద్రాలని ఉత్తేజపరచినప్పుడు ఆ మెదడు చెప్పిన భాష్యమే శబ్దం. అనగా మెదడులోని చేతన (consciousness) ఏది చెబితే అదే మనకి ద్యోతకమవుతుంది కాని నిజంగా ప్రపంచం ఎలా ఉందో అన్నది "అజ్ఞేయం" (unknowable). జీవితం గానీ, లోకం గానీ ఆదర్శప్రాయంగా ఉండటం ఎలాగో చిత్రించి చెప్పే నిర్వచనం ఆదర్శవాదం; తన అనుభవంతో మేళవించినదే ప్రపంచమని చెప్పే సిద్ధాంతం కనుక స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదమని అనవచ్చు; స్థూల ప్రపంచము కల్ల యను వాదము; see also realism;
idiolect, n. వైయక్తిక వ్యావహారికం; వ్యక్తిపరమైన శైలీ భేదాల సంపుటి; (rel.) dialect;
idiom, n. జాతీయం; నుడికారం; పలుకుబడి; భాషీయం; భాషాసంప్రదాయం;
idiot, n. ఒక రకమైన బుద్ధిమాంద్యతతో పుట్టిన వ్యక్తి; mentally defective person with a mental age of not more than 35 months; imbecile and moron were more porous categories; see also stupid;
idiot savant, n. బుద్ధిమాంద్యతతో పుట్టినా ఒకే ఒక శాఖలో (ఉ. సంగీతంలో కాని, చిత్రకళలో కాని, గణితంలో కాని) విశేషమైన ప్రతిభ చూపించే వ్యక్తి;
idiosyncrasy, n. విలక్షణం; విలక్షణ స్వభావం; తిక్క; ఉలిపికట్టెతనం; చమత్కార స్వభావం;
idle, adj. సోమరి; అక్రియ; ఏ పనీ చెయ్యకుండా ఉన్న స్థితి;
immunity, n. రోగ నిరోధక శక్తి; అసంక్రామ్యత; రక్షణ; రక్షకశక్తి; రక్షరేకు; అభయప్రదానం; శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే శక్తి;
herd immunity, ph. మంద రక్షణ; మంద రక్షకశక్తి; మంద రక్షరేకు; చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల మన శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే రోగ నిరోధక శక్తి;
immunization, n. అసంక్రమకరణం; అభయప్రదానం; రోగం సంక్రమించకుండా శరీరాన్ని పదిలపరచడం;
impedance, n. (1) అవరోధకం; అవరోధం; అంకిలం; అర్గళం; క్లేశకం; స్తోభకం; స్తోభం; (2) ప్రత్యావర్తక విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలిగించేది;
impediment, n. ప్రతిబంధకం; ఆటంకం; అంకిలి; విఘాతం; అర్గళం; పురోగతికి పెద్ద దెబ్బ;
impel, v. t. ప్రేరేపించు; ముందుకు తోయు;
impeller, n. ప్రేరేపకి; ముందుకు తోసేది;
impending, adj. కాగల; జరగబోయే;
impenetrable, adj. చొరరాని; దుర్గమ; గహన;
imperative, adj. విధివాచక; ఆజ్ఞారూపక;
imperative language, ph. [comp.] విధాయక భాష; Any programming language that specifies explicit manipulation of the state of the computer system e.g. SQL ; Not to be confused with a procedural language, which specifies an explicit sequence of steps;
index, n. సూచిక; పదపట్టిక; అనుక్రమణిక; పదసూచి; చింతామణి; ఒక పుస్తకంలోని ముఖ్యమైన మాటలు ఏయే పుటలలో కనిపిస్తాయో చెప్పే సూచిక; సాధారణంగా ఈ సూచిక పుస్తకం చివర ఉంటుంది;
index finger, ph. తర్జని; చూపుడువేలు;
index register, ph. [comp.] సూచిక పల్టీపేరు; తర్జని పల్టీపేరు;
India, n. భారతదేశం; ఇండియా;
India ink, ph. త్వరగా ఆరే (నల్ల) సిరా; భారతీయులలా నల్లగా ఉంటుందని మొదట్లో ఈ సిరాకి ఈ పేరు పెట్టారు, బ్రిటీష్‌వారు. దరిమిలా ఈ రకం సిరాని అన్ని రకాల రంగులలోనూ చేస్తున్నారు. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు ఈ పేరు మాత్రం మిగిలింది.
India rubber, ph. సందర్షిణి; same as natural rubber; [bot.] Hevea brasiliensis;
Indian, adj. భారత్; భారతీయ; భారతదేశానికి సంబంధించిన; ఇండియా ఉపఖండానికి సంబంధించిన;
Indian aconite, ph. నాభి;
Indian airspace, ph. భారతీయ గగనతలం;
Indian aloe, n. ph. కలబంద;
Indian beech, n. ph. కానుగ; [bot.] Millettia pinnata, Pongamia pinnata;
Indian birthwort, ph. ఈశ్వర వేరు;
Indian butter tree, ph. ఇప్పచెట్టు;
Indian coral, ph. పారిజాతం;
Indian gum arabic, ph. తుమ్మ;
Indian jalap, ph. తెగడ చెట్టు;
Indian kino, ph. వేగిస చెట్టు;
Indian lilac, ph. తురక వేప చెట్టు;
Indian mulberry, ph. మద్ది;
Indian olibanum, ph. పరంగి సాంబ్రాణి;
Indian pennywort, ph. బ్రహ్మీ మొక్క;
Indian spikenard, n. జటామాంసి; [bot.] Nardostachys jatamansi of the Valerian family;
Indian Subcontinent, ph. ఇండియా ఉపఖంఢం; ఈ ఉపఖండంలో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక; భూటాన్, పాకిస్తాన్, మయాన్‌మార్, హిందూ మహాసముద్రంలోని చిల్లర దీవులు ఉన్నాయి;
Indian, n. m. భారతీయుడు;
Indian-ness, n. భారతాత్మ;
indicate, v. t. సూచించు;
indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం;
inertial frame of reference, ph. ప్రమాణ జడత్వ చట్రం;
inertial mass, ph. జడత్వ గురుత్వం; తామస గురుత్వం;
inestimable, adj. అగణ్య;
inequality, n. అసమానత్వం; విసమీకరణం; వైషమం; న్యూనాధిక్యత;
inequity, n. అసమానత; ప్రతిసమం;
inevitable, n. నియతం; అనివార్యం; విధాయకం;
inexhaustible, adj. అవ్యయ; అవ్యయమైన;
inexhaustible, n. అవ్యయం;
inexpensive, n. అగ్గువ; చవుక;
infallible, n. అచ్యుతం; తప్పుకి అతీతం;
infamy, n. అపకీర్తి; అప్రతిష్ఠ; దుర్యశం;
infancy, n. శైశవం; శైశవావస్థ; పసితనం;
infant, adj. శిశు; శైశవ;
infant, n. శిశువు; పసిబిడ్డ; పసికందు; నెత్తురుకందు; నెలకూన; చిరుత; బుడుత; బొట్టె; కిశోరం;కందు; పసివాడు; ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శైశవ దశ;
infanticide, n. శిశుమేధం; శిశుహత్య;
infantry, n. కాల్బలం; పదాతిబలం;
infarct, n. ప్రాణరహిత కణజాలం; శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోయిన భాగం;
infarction, n. కణజాల మరణం; శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం;
coronary infarction, ph. గుండెలోని కండరాలకి రక్తపు సరఫరా లేక కొద్ది మేర కణజాలం చచ్చిపోవడం;
infatuation, n. మోహం; చిత్తమోహం; వ్యామోహం; మూఢ ప్రేమ; అభినివేశం; తేలగింపు;
infect, v. t. సూక్ష్మజీవులని శరీరంలో చొరబడేట్టు చేసి రోగం కలిగించడం;
infection, n. తిష్ట; తిష్ట రోగం; లాతికణావేశం; అన్యకణావేశం; సోకుడు; అంటునలత; జాడ్యం; సూక్ష్మజీవులు శరీరంలో చొరబడి ఒక చోట స్థావరం ఏర్పరచుకోవడం; see also infestation;
infinite regress, ph. అనవస్థా దోషం; ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట.
infinite series, ph. అనంత శ్రేణి;
infinitesimal, adj. అత్యంత;
infinitesimal calculus, ph. అత్యంత కలనం;
infinitive, n. తుమర్థం; తుమున్నర్థకం; క్రియ యొక్క సామాన్య రూపం; క్రియ యొక్క దాత్వర్ధక రూపం; ఇంగ్లీషులో సాధారణంగా ఏ క్రియకైనా ముందు to చేర్చితే అది infinitive రూపం అవుతుంది; ఉదా: to love, to eat, to run, to believe, to follow, to laugh, to stare, to wonder.
inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
inflate, v. t. ఊదు; గాలితో నింపు;
inflation, n. ద్రవ్యోల్బణం; దివాలేషం; డబ్బు సరఫరా ఎక్కువవడం వల్ల వస్తువుల ధరలు, చాకిరీల ధరలు అదేపనిగా పెరుగుతూ పోవడం; దివాలేషం అంటే కరువు కాదు. కరువు రోజులలో ధరలు పెరగడానికి కారణం వస్తువులు దొరకక పోవడం;
inflection, n. [gram.] రూపభేదం; (note) his is an inflection of he; ఇంటి is an inflection of ఇల్లు;
inoculate, v. t. (1) రోగకారక పదార్థాన్ని కానీ ప్రతిజనిని కాని శరీరం లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ; వైద్య రంగంలో ఈ "రోగకారక" పదార్థం సర్వసాధారణంగా "వేక్సీను" అవుతుంది. ఆ పరిష్తితులలో inoculation ని vaccination అంటారు; (2) ఒక సూక్ష్మజీవిని లాతి పర్యావరణంలోకి ప్రవేశపెట్టడం;
interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; అంతర్ముఖం; పరస్పర ఫలకం; ప్రతిముఖం; కలనయంత్రా నికి బాహ్య ప్రపంచానికి మధ్య సంభాషణలు జరగడానికి మధ్యవర్తిగా పనిచేసే శాల్తీ;
International Monetary Fund, n. అంతర్జాతీయ ద్రవ్య నిధి;
internationalist, n. అంతర్జాతీయతా వాది;
Internet, n. అంతర్జాలం; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలన యంత్రాలు ఒకదానికొకటి సమాచారం పంపుకుందుకి వీలుగా ఉండే ప్రసారక సదుపాయం; మనుష్యులు మాట్లాడుకుందికి టెలిఫోను సౌకర్యం ఎలాగో అలాగే అంతర్జాలం కలనయంత్రాలు మాట్లాడుకుందికి ఉపయోగపడుతోంది;
---Usage Note: Internet
---The Internet is a system that facilitates communication among many interconnected computers and devices throughout the world. You can use the Internet to send e-mail or to access information available on the World Wide Web (WWW). The Internet is the highway and the WWW is the repository of information;
internode, n. కణుపుల మధ్యనున్న కాండం;
interpolation, n. అంతర్వేశనం; ప్రక్షేపణ;
interpret, v. t. వివరించు; వ్యాఖ్యానించు; అనువదించు;
interpreted programming language, ph. అనువదిత విధిభాష; అనుదిత విధిభాష; A programming language, such as JavaScript, that is designed to be translated into executable code on the fly as the program is executed line by line;
interpreter, n. ద్విభాషి; దుబాసీ; ఒకరి నోటి మాటని తన నోటితో అనువాదం చేసే వ్యక్తి; see also translator;
iota, n. (1) గ్రీకు భాషలో ఒక అక్షరం; (2) పల్లెత్తు; కించిత్తు; ఈషత్తు; ఇంచుక; ఇసుమంత; రవంత; లవలేశం;
IOU, n. రిణపణ్ణా; రుణపత్రం;
ipso facto, n. దానంతగా అది; అంతటితోనే;
irascibility, n. చిరాకు; చికాకు;
ire, n. ఆగ్రహం;
Iridium, n. ఇరిడియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 77, సంక్షిప్త నామం, Ir); [Lat.]. iris = rainbow;
iris, n. (1) కానీనికా పటలం; నేత్ర విభాజకం; కంటిపాప చుట్టూ ఉండే గుండ్రని పొర; ఈ పొరకి ఉండే రంగే కంటి రంగు; (2) ఇంద్ర ధనుస్సు; హరివిల్లు; (3) శీతల దేశాలలో పూసే ఒక రకం పువ్వు;
iron, adj. ఇనప; అయో;
iron filings, ph. ఇనప రజను; అయోచూర్ణం;
iron tip, ph. అయోముఖి;
Iron, n. (1) ఇనుము; అశ్మసారం; ఆయసం; ఒక రసాయన మూలం; (అణుసంఖ్య 26, సంక్షిప్త నామం; Fe); [Lat.] ferrum; (2) ఇస్థిరి; (3) ఇస్థిరి పెట్టి;
cast iron, ph. పోత ఇనుము; దుక్క ఇనుముని కరిగించి, అందులో తుక్కు ఇనుముని, తదితర లోహాలని కలిపి, దానిని రకరకాల ఆకారాలు ఉన్న అచ్చులతో పోసి చల్లార్చగా వచ్చినది;
pig iron, ph. దుక్క ఇనుము; దంప ఇనుము; blast furnace నుండి వచ్చిన కచ్చా ఇనుముని పోత పోసినప్పుడు వచ్చే దుక్కలు పందిపిల్ల ఆకారంలో ఉండేవిట; అందుకని pig iron అన్న పేరు వచ్చింది.
scrap iron, ph. తుక్కు ఇనుము; పాత ఇనప సరుకు;
wrought iron, ph. చేత ఇనుము; దుక్క ఇనుముని బొగ్గుల కొలిమిలో వేడి చేసి, సుత్తితో బాది, మలినములను పోగొట్టగా మిగిలిన ఇనుము;
iron, v. t. ఇస్థిరి చేయు;
Iron Age, ph. ఆశ్మయుగం; ఇనప యుగం; క్రీ.పూ.1000 నుండి క్రీ.శ. 100 వరకు; కంచుయుగం తరువాత వచ్చిన కాలం;
iron horse, ph. ఆశ్మాశ్వం; రైలింజను;
ironing box, ph. ఇస్త్రీపెట్టి;
ironical, adv. ఇత్సితంగా;
irony, n. వ్యాజస్తుతి; వక్రోక్తి; వ్యంగ్యం; ఇత్సితం; అన్నది ఒకటి, దానివల్ల స్పురించే అర్ధం మరొకటి అవడం;
irradiation, n. ఉద్యోతనం; (lit.) to expose to light;
ism, suff. ఇజం; ప్రపంచాన్ని ఒక మూస పోసిన దృష్టితో చూసే తత్త్వం;
iso, pref. సమ;
isobar, n. సమవాయి; సమభార రేఖ; సమపీడన రేఖ;
isogamy, n. [bio.] సమ సంయోగం; ఒక రకం లైంగిక పునరోత్పత్తి; (ant.) anisogamy;
isogloss, n. [ling.] భేదకరేఖ; ఒక భాషలో గమనించదగ్గ మార్పులని విడదీసే భౌగోళిక రేఖ; గోదావరి దాటితే భాషలో మార్పు వినిపిస్తుంది కనుక గోదావరిని ఒక భేదక రేఖగా పరిగణించవచ్చ;
isolated system, ph. వివిక్త వ్యవస్థ; వియుక్త వ్యవస్థ; వ్యష్ఠిగా ఉంచిన వ్యవస్థ;
isomer, n. సమభాగి; సమాంగి;
isomerism, n. సమభాగత్వం; సమాంగత; సమాంగత్వం; సాదృశ్యం; అనేక భాగములతో రకరకాల విన్యాసాలు కలిగిన నిర్మాణ క్రమాలతో ఒప్పారే రసాయనాలు; రెండు మూలకాల సాంఖ్య క్రమాలు ఒక్కటే అయి, నిర్మాణ క్రమాలు తేడాగా ఉంటే ఆ రెండింటిని సమభాగులు అంటారు;
isopropyl alcohol, n. రబ్బింగ్ ఆల్కహాలు; ఉద్వర్తన ఒలంతం; జ్వరం వచ్చినప్పుడు దీనిని శరీరం మీద వేసి రుద్దితే ఉష్ణం తగ్గుతుంది కనుక ఈ పేరు వచ్చింది; C3H7OH;
isosceles, adj. సమద్విబాహు;
isotherm, n. సమతాపి; సమతాపరేఖ; ఒక మేపులో ఒకే తాపోగ్రత ఉన్న బిందువలని కలుపుతూ గీసే గీత;
isothermal, adj. సమతాప;
isotope, n. ఏకస్థాని; ఆవర్తన పట్టికలో ఒకే గదిలో ఉంచవలసిన రసాయన మూలకాలు;
radio-isotopes, వికీర్ణ ఏకస్థానులు;
isotropic, adj. సమదైశిక; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోయే;
isotropy, n. సమదైశికత; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోవడం;
issue, n. (1) సంచిక; (2) సంతతి; (3)సమస్య; (4) విషయం; అంశం;
life and death issue, ph. జీవన్మరణ సమస్య;
issue at hand, ph. ప్రస్తుతపు సమస్య;
issue, v. t. జారీ చేయు;
isthmus, n. భూసంధి;
it, pron. proximate. ఇది;
it, pron. remote. అది;
italics, n. pl. వాలు అక్షరాలు;
itch, n. దురద; గుల; జిల; దూల; తీట; కండూతి; కసిమిరి;
item, n. మూర్తి; శాల్తీ; అంశం; ఉరువు;
iterate, v. t. ఆమ్రేడించు; పదే పదే చేయు;
iterative, adj. ఆమ్రేడిత; పునరుత్థాన;
iterative method, ph. పునరుత్థాన పద్ధతి; చేసిన లెక్కనే చిన్న చిన్న మార్పులతో పదే పదే చేయడం;