This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: J
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
jamboree, n. మహానాడు; తిరుణాలు;
jack, n. (1) పనస; (2) జాకీ; పేకముక్కలలో ఒకటి; (3) బండి యొక్క ఇరుసును పైకెత్తు సాధనం;
jaggery, n. బెల్లం; గుడం; గడోలం; చెరకడం; ద్రుపజం; అమృతరశాజం;
jaguar, n. దక్షిణ అమెరికాలో నివసించే చిరుతపులి;
jail, n. ఖైదు; కారాగారం; చెరసాల; జైలు;
jailer, n. కారాగారపు అధికారి; చెరసాలని నడిపే అధికారి;
jam, n. (1) తాండ్ర; మురబ్బా; a fruit preserve; Jam is more fruity than jelly and it involves slight crushing or jamming of pieces of fruit; (2) ముంజె, ద్రవమునుగాక గట్టియునుగాక కొంచెము జిగటగానుండు పదార్థము; (note) an Indian word corrupted from Telugu; (ety. ) జిల్లిరాళ్లు = pebbles; see also jelly; (3) ఇరకాటం; నొక్కుడు; దిగ్బంధం;
traffic jam, ph. ఇరకాటంలో చిక్కుకున్న వాహనాలు;
jam, v. t. అడ్డగించు; నొక్కు; బంధించు;
jamboree, n. మహానాడు; పెద్ద సభ; సమారోహం; తిరణాలు;
janitor, n. ఊడిగాడు; భవనాలని లోపల శుభ్రం చేసే వ్యక్తి;
jar, n. జాడీ; జారీ; కూజా;
jargon, n. పరిభాష; ఏదైనా ఒక శాస్త్రంలో ఒక మాటని ఒకే ఒక అర్థంతోనే వాడుకోవాలని నిర్ణయించగా తయారైన భాష;
---If someone is jealous, s/he feels angry or unhappy because s/he cannot have something that others have: Kavitha is jealous of her sister's success. If someone is envious, s/he wants to have qualities or things that someone has: Linda was envious of Radha's new home; envy is an active expression of jealousy;
jealousy, n. ఈర్ష్య; అసూయ; మాత్సర్యం; ఓర్వలేనితనం; ఎరుసు; కాంతాళం;
jeer, v. t. వెక్కిరించు; కూతలు కూస్తూ వెక్కిరించు;
jelly, n. జిల్లిక; జిగిలి; జల్లిక; జల్లి; తాండ్ర; శ్లేషి; పాకం పట్టిన పండ్లరసం; jelly is smooth in texture; the elastic or gel like consistency is how the name is derived from;
jellyfish, n. నీటికాయ; ఒక రకం జలచరం;
jeopardy, n. అపాయం; ప్రమాదం;
jerk, v. t. కుదుపు; తటాలున ఈడ్చు;
jest, v. i. నవ్వులాటలాడు; సరదాకి కొంటె పని చేయు; ఆగడం చేయు;
jest, n. ఆగడం;
jester, n. విదూషకుడు; హాస్యగాడు;
jet, adj. (1) ధారా; ధారగా; (2) నల్లటి;
jet black, ph. నల్లటి నలుపు; కారు నలుపు;
jet propulsion, ph. ధారా చాలనం; ఇంధనం మంటతో బాగా వ్యాకోచం చెందిన గాలిని వెనకకి తోస్తూ బండిని ముందుకు నడిపే పద్ధతి;
jeweler, n. (1) నగలు అమ్మే వ్యక్తి; జవాహర్ వాలా; (2) కంసాలి; అగసాలె; బంగారం పని చేసే కంసాలి;
jewelry, jewellery (Br.) n. నగలు; జవాహరీ;
jewelry store, ph. నగల కొట్టు; జవాహర్ ఖానా;
jihad, n. (జిహాద్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; మౌలిక ముస్లింలలో మతం కోసం ఏంచేసినా తప్పులేదనే అభిప్రాయం ఉంది. మతేతరులంతా ముస్లిం మౌలికవాదుల దృష్టిలో కాఫిర్లు. సాతాను ప్రభావంలో ఉన్న తమ మతస్థులను కాపాడుకోవడం మాత్రమేకాదు. సాతాను ప్రభావంలో ఉన్న మతేతరులను నిర్మూలించడం ఇస్లాం మౌలికవాదులు తమ పవిత్ర కర్తవ్యంగా భావించి అందుకు మతయుద్ధం చేయడం తప్పనిసరి అని భావిస్తారు. అందుకే వారు మతం విషయంలో సహనం తక్కువగా ఉన్న వారిగా పేరొందారు;
jinx, n. అచ్చిరాని మనిషి లేక వస్తువు; అపశకునం; అపశకునపక్షి;
job, n. (1) ఉద్యోగం; (2) పని;
---Usage Note: job, work, occupation, profession, trade, career, position
---Use work as a general word to talk about what you do every day in order to earn money: I have to go to work. Your job is the particular type of work that you do: Lila got a job as a stewardess. Occupation is a formal word for job. Position is the formal word used when a job is advertised. A trade is a skilled job you do with your hands. A career is a professional job that you do for most of your life. A profession is a career for which you need a lot of training.
jog, v. i. వ్యాయామం కొరకు నెమ్మదిగా పరుగెత్తు;
join, v. i. చేరు; అంటుకొను; కలుసుకొను; కూడు; జతగూడు; కవయు; కవగొను;
join, v. t. చేర్చు; కలుపు; లకించు; తగిలించు; జోడించు; జతగూర్చు; సంధించు; అంటించు; జమిలించు; జమాయించు;
---In formal or written English, you must use these words with the present perfect tense: I have already seen him; The bell has just rung; Have you eaten yet? However, in informal speech, we often use them with simple past tense: I already saw him; the bell just rang; did you eat yet?
justice, n. (1) న్యాయం; ధర్మం; ధర్మబలం; పాడి; (2) న్యాయమూర్తి;
justifiable, adj. సమర్ధనీయ;
justification, n. సమర్ధన;
justify, v. t. సమర్ధించు;
jut, v. i. ముందుకి పొడుచుకొని వచ్చు;
jute, n. జనుము; ఈ మాట జట అనే సంస్కృత పదం నుండి పుట్టింది; (ety.) this word is derived from the Sanskrit word Jata which means a braid of hair. The Hindu word Juta, which means shoes, probably has the same root suggesting that the earliest shoes were nothing but hairy skins of animals;
jute fiber, ph. జనుప నార;
juvenile, adj. తరుణ; బాల;
juvenile offenders, ph. తరుణాపరాధులు; నేరము చేసిన పిల్లలు; బాల నేరస్థులు;
juxtapose, v. t. పక్కపక్కని పెట్టు;
Part 2: K
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
kafkaesque, adj. కలతతో కూడిన పీడకలవంటి వాతావరణం; కాఫ్కా రచనలలో కనిపించే లాంటి వాతావరణం;
kaleidoscope, n. కదంబిని; వర్ణకదంబిని; వర్ణపగడము; సాధారణంగా మూడు దీర్ఘచతురస్రాకారపు అద్దపు బద్దీలని, వాటి మధ్య 60 డిగ్రీలు కోణం వచ్చేటట్లు అమర్చి, ళోపల రెండు మూడు రంగు పూసలని వేసి కట్టకట్టి పిల్లల ఆట వస్తువుగా అమ్ముతారు;
Kantakari, n. నేలములక; [bot.] Solanum surattense Burm. of the Solanaceae family; Solanum xanthocarpum Schard; An Ayurvedic herb used to treat coughs, colds, asthma, and such other respiratory diseases;
kaolin, n. మెత్తటి మట్టి; soft clean clay; People use it to make medicine; Kaolin is used for mild-to-moderate diarrhea, severe diarrhea (dysentery), and cholera; Al2Si2O5(OH)4
kelp, n. వారిపర్ణి; సముద్రపు పాదు; సముద్రపు నాచు; Kelps are large seaweeds (algae) belonging to the brown algae (Phaeophyceae) in the order Laminariales; (note) see also seaweed;
kilobits, n. వెయ్యి ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1024 ద్వింకములు; (note) ఇక్కడ కిలో అంటే వెయ్యి కాదు, 1024;
kilobyte, n. కంప్యూటరు పరిభాషలో 1024 బైట్లు; (note) ఇక్కడ కిలో అంటే వెయ్యి కాదు, 210 = 1024;
kilogram, n. కిలో; వెయ్యి గ్రాములు; ఇక్కడ కిలో అంటే 1,000;
kilometer, n. కిలోమీటరు; వెయ్యి మీటర్లు; ఇక్కడ కిలో అంటే 1,000;
kin, n. దగ్గర బంధువులు;
kith and kin, ph. చుట్టపక్కాలు; ఆత్మీయులు;
kind, adj. (1) రకం; (2) దయగల;
kindergarten, n. బాలవిహార్; చిన్నపిల్లల పాఠశాల;
kind-hearted, n. దయాళువు;
kindly, adv. దయతో;
kindness, n. దయ; కరుణ; కటాక్షం;
kindle, v. t. రగుల్చు; రగిలించు; రాజవేయు; అంటించు; ముట్టించు;
kinematics, n. శుద్ధగతిశాస్త్రం; వస్తువుల కదలికలు గురించి (కదలికల కారణాలతో నిమిత్తం లేకుండా) విచారించే శాస్త్రం; Kinematics explains the terms such as acceleration, velocity, and position of objects. The mass of the object is not considered while studying kinematics. Dynamics explains the "why" behind the movement as opposed to just describing the "how" of kinematics;.
kinetics, n. (1) [chem.] రసాయన చర్యలు (సంయోగ వియోగాలు) ఎంతెంత జోరుగా జరుగుతున్నాయో అధ్యయనం చేసే శాస్త్రం; (2) [phys.] వస్తు సముదాయాల మీద బలాబలాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో అధ్యయనం చేసే శాస్త్రం; Kinetics is focused on understanding the cause of different types of motions of an object such as rotational motion in which the object experiences force or torque.
kinetic energy, ph. చలన శక్తి; గతిశక్తి; గతిజశక్తి;
---Usage Note: kinetics, kinematics, dynamics
---Dynamics studies objects with acceleration. Dynamics is divided into kinematics and kinetics. In physics, "kinematics" refers to the study of motion without considering the forces causing it, focusing solely on describing an object's position, velocity, and acceleration, while "dynamics" analyzes the forces acting on an object and how they affect its motion, essentially explaining the "why" behind the movement as opposed to just describing the "how" of kinematics;
king, n. m. రాజు; మహారాజు; సమ్రాట్టు; సార్వభౌముడు; నృపతి; నృపాలుడు; పృథివీపతి; ఱేడు; లోకపాలుడు; వల్లభుడు; నరేంద్రుడు; చక్రవర్తి;
kingdom, n. (1) రాజ్యం; సామ్రాజ్యం; సంస్థానం; (2) కోటి; సామ్రాజ్యం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు అన్నిటి కంటే ఉన్నత వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom (రాజ్యం), phylum (విభాగం), class (తరగతి), order (క్రమం), family (కుటుంబం), genus (ప్రజాతి), and species (జాతి); There is no standardized consistency in the Telugu equivalents;
knit, v. t. అల్లు; (rel.) weave; braid; plait; compose; fabricate;
knitting needle, ph. అల్లిక పుల్ల; అల్లిక కాడ;
knob, n. పిడి; గుబ్బ; గుబురు;
knock, v. t. కొట్టు; తట్టు;
knock-knees, n. ముడిగాళ్లు; ఈ రకం కాళ్ళు ఉన్నవాళ్ళు నడిచినప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటాయి; (ant.) bow-legs;
knocking, n. (1) కొట్టుకొనుట; విస్పోటనం; (2) పెట్రోలు నిలచి కాలకుండా టప్ అని పేలిపోవడం;
knoll, n. తిప్ప; ఎత్తయిన ప్రదేశం; ఎత్తయిన మైదానం;
knot, n. (1) ముడి; బంధనం; (2) నీటి మీద (గాలిలో) ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని కొలిచే ఒక కొలమానం; One knot equals one nautical mile per hour, or roughly 1.15 statute (or land-measured) miles per hour, one nautical mile equaling one minute of latitude;
kowtow v. i. అతి వినయం ప్రదర్శించు; act in an excessively subservient manner; kneel and touch the ground with the forehead in worship or submission;
kudos, n. అభినందన;
krait, n. కట్లపాము; భారతదేశంలో కనపడే విషసర్పం; [biol.] Bungarus caeruleus;
kymograph, n. తరంగలేఖిని; ఒక డ్రమ్ము చుట్టూ కాగితం చుట్టి దాని మీద కలంతో రాయడనికి వీలుగా అమర్చిన పరికరం; దీనితో పైకీ కిందకీ ఉన్న కదలికని కాగితం మీద చూపడానికి వీలు అవుతుంది;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2