lavish

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: La-Le

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • label, n. ఉల్లాకు; చీటీ; బంగీ మీద అంటించే చీటీ;
  • labial, adj. ఉభయోష్ఠ్య; ఓష్ఠ; పెదవులకి సంబంధించిన;
  • labials, n. pl. [ling.] ఓష్ఠ్యములు; పెదవులతో పలికే వర్ణాలు; ఉదా, ఊ, ప, ఫ, బ, భ, మ;
  • labiodentals, n. pl. ఓష్ఠదంత్యములు; అడుగు పెదవి, పై పళ్ళ సహాయంతో ఉచ్చరించే వర్ణాలు; ఉ. ఇంగ్లీషులో ఎఫ్, తెలుగులో వ;
  • labium, n. పెదవి; ఓష్ఠం;
  • labor, labour (Br.), adj. కూలి; శ్రమ;
    • labor intensive, ph. శ్రమసాంద్రం;
    • labor saving, ph. శ్రమనివారకం;
  • labor, n. (1) కృషి; కూలి; శ్రమ; పాటు; కష్టం; (2) నొప్పులు; ప్రసవ వేదన; (3) కర్షకులు; కార్మికులు; కూలివారు;
    • false labor, ph. దొంగ నొప్పులు; నిజమైన ప్రసవ వేదన కాకుండా అప్పుడప్పుడు వచ్చే నొప్పులు;
    • manual labor, ph. కాయకష్టం;
    • migrant labor, ph. వలస కూలీలు;
    • unpaid labor, ph. వెట్టి చాకిరి;
  • labor, v. i. పాటుపడు; కష్టపడు;
    • labor pains, ph. నొప్పులు; ప్రసవ వేదన;
    • labor union, ph. కార్మిక సంఘం; కర్షక సంఘం;
  • laboratory, n. ప్రయోగశాల; పరిశోధనశాల;
  • laborer, n. కృషీవలుడు; కూలివాడు; కూలిది;
  • laborious, adj. విసుగు పుట్టించే; బోరుకొట్టే;
  • labyrinth, n. వ్యూహం; చక్రవ్యూహం;
  • lac, n. (1) లక్ష; (2) లక్క; లత్తుక; లాక్షారసం; యావం; see also shellac;
  • lace, n. సరిగ; నాడా;
  • lacerate, v. t. విదారించు; గాయపరచు;
    • lacerated wound, ph. విదారిత క్షతము; చర్మం చిరగగా అయిన గాయం;
  • laceration, n. చిరిగిన చర్మం; అంచులు తిన్నగా లేకుండా చర్మం తెగిన గాయం;
    • lachrymal glands, ph. బాష్పజల గ్రంథులు; కన్నీటి గ్రంథులు;
  • lack, n. కొరత; లోపం;
  • lackadaisical, adj. ఉత్సాహం లేని; నిరుత్సాహంగా; ఉదాసీన; ఉపేక్షిత; నిరపేక్ష;
  • laconic, adj. క్లుప్తమైన;
  • lacquered, adj. లక్కపూసిన; లక్కపారించిన;
  • lactation, n. స్తన్యోత్పాదన; చనుబాలు జారుట;
  • lactic, adj. క్షీర; పాలకి సంబంధించిన;
    • lactic acid, ph. క్షీరామ్లం; పాలకాడి;
  • lactation, n. పాలు చేపుట;
  • lactometer, n. పాలమాపిని; దుగ్ధమాపకం; క్షీరమాపకం; పాలు నాణ్యతను పరీక్షించే సాధనం; ఈ జాతి పరికరాలన్నీ ఆర్కిమిడీస్ సూత్రం మీద ఆధారపడతాయి; (rel.) hydrometer;
  • lactose, n. క్షీరోజు; పాలచక్కెర; పాలల్లో ఉండే చక్కెర;
  • lacuna, n. వెలితి; వారడి; లొచ్చు;
  • lad, n. చిన్న బాలుడు; డింభకుడు; శాబకుడు;
  • ladder, n. నిచ్చెన; నిఃశ్రేణి; తాప;
  • laden, adj. బరువెక్కించిన;
  • ladle, n. తెడ్డు; అగప; దర్విక; పెద్ద గరిటె; దర్వి; కంబి;
  • lady, n. స్త్రీ; పెద్దింటి పడుచు; యజమానురాలు; దొరసాని;
  • lag, v. i. వెనుకపడు; ఆలస్యమవు;
  • lagoon, n. మడుగు; ఉప్పునీటి కయ్య;
  • laissez-faire, ph. (లెస్సే ఫెయిర్) స్వేచ్ఛా వ్యాపార పద్ధతి; విచ్చలవిడి వ్యాపారం; నిబంధనలు లేని పద్ధతి;
  • lake, n. సరస్సు; చెఱువు; హ్రదం; వెంచ;
    • freshwater lake, ph. మంచినీటి చెఱువు; స్వాదూరం;
  • lakh, n. [Ind. Eng.] లక్ష; నూరువేలు; మిలియనులో పదో వంతు;
  • lamb, n. గొర్రె పిల్ల;
  • lame, adj. కుంటి; చొట్ట;
    • lame excuse, ph. కుంటిసాకు;
  • lament, v. i. బాధపడు; విచారించు; సంతాపపడు; దుఃఖాన్ని బయట పెట్టు; విలపించు; అంగలార్చు; అఘోరించు; అలమటించు;
  • lamentable, n, శోచనీయం;
  • lamentation, n. విలాపం; రోదన;
  • lamina, n. రేకు; పొర; దళం; పటలం;
  • laminar, adj. రుజు; ప్రశాంత;
    • laminar flow, ph. రుజు ప్రవాహం; ప్రశాంత చలనం; ప్రశాంత ప్రవాహం;
  • lamp, n. దీపం; దీపిక; జ్యోతి; తిర్లిక; బెళుకు;
    • lamp black, ph. కజ్జలం; దీపపు మసి;
    • lamp bulb, n, వెలుఁగు బుడ్డి; దీపపు బుడ్డి;
    • lamp stand, ph. దీపపు సెమ్మె; దండుదివ్వె;
  • lampshade, n. గుమ్మటం;
  • lance, n. ఈటె; బల్లెం; బరిసె;
  • land, adj. భూ; భూమి; నేల;
    • land breeze, ph. భూమారుతం; మలయమారుతం; నేల తెమ్మెర;
    • land reform, ph. భూసంస్కరణ;
    • land revenue, ph. భూమి శిస్తు; నేల పన్ను;
    • land tax, ph. శిస్తు; పన్ను;
  • land, n. భూమి; నేల; జియా; పుడమి; భువి; ధరణి; వసుంధర; క్ష్మా; ఞ;
    • barren land, ph. పర్ర;
  • land, v. i. భూమిమీఁదకి దిగు; గట్టు ఎక్కు; వాలు;
  • land, v. t. భూమిమీఁదకి దింపు; గట్టు ఎక్కించు;
  • landing, n. మెట్టు; గట్టు; ఒడ్డు; దింపుగడ;
  • landlady, n. ఇల్లుగలది; ఇంటి యజమానురాలు;
  • landlord, n. (1) బుగత; జమీందారు; భూస్వామి; కామందు; (2) ఇల్లుగలవాడు; ఇంటి ఓనరు;
  • landmark, n. కొండగుర్తు; బండగుర్తు; ఆనవాలు; నేలగుర్తు;
  • landscape, n. భూదృశ్యం; ప్రకృతి దృశ్యం; ప్రకృతి దృశ్యాన్ని చూపే చిత్రపటం;
  • landslide, n. (1) భృగుపాతం; భూపాతం; నేలకెడవు; కొండచరియలలో భూమి దిగజారిపోవడం; (2) అత్యధిక సంఖ్యాబలంతో ఎన్నిక నెగ్గడం;
  • landmine, n. మందుపాతర;
  • lands, n. భూములు; నేలలు; పుడములు;
    • dry lands, ph. నంజభూములు; నంజనేలలు; ఎండునేలలు; ఎండుభూములు;
    • wetlands, ph. పుంజభూములు; పుంజనేలలు; తడిపుడములు; తడినేలలు; తడిభూములు;
  • lane, n. సందు; గొంది; (note) సందు కంటె వీధి వెడల్పయినది, వీధి కంటె మార్గం వెడల్పయినది; (2) బాట; పట్టా; కార్దారి; లేను;
  • language, n. భాష; నుడి; ఉఁగు; ఉవు;
    • agglutinative language, ph. మాట పక్కన ప్రత్యయము చేరెడి భాష; ఉదా: తెలుగు;
    • body language, ph. హావభావాలు;
    • borrowing language, ph. పరాదాన భాష;
    • cognate language, ph. సజాతీయ భాష; జ్ఞాతి భాష;
    • contact language, ph. సంపర్క భాష; అంటు నుడి; అంటుఁగు;
    • donor language, ph. ప్రదాతృ భాష; ఇయ నుడి; ఇచ్చుఁగు;
    • intermediate language, ph. మాధ్యమిక భాష; నడి నుడి; నడియుఁగు;
    • link language, ph. సంధాన భాష; లంకె నుడి;
    • literary language, ph. గ్రాంథిక భాష; వ్రాత నుడి;
    • machine language, ph. యాంత్రిక భాష; మర నుడి;
    • power of language, ph. వాగ్విభవం;
    • recipient language, ph. ప్రతిగ్రహీత భాష; పొందు నుడి;
    • rustic language, ph. పామరోక్తి; అశ్లీలం; అణక నుడి; అణకుఁగు;
    • sister language, ph. సజాతీయ భాష; జ్ఞాతి భాష; ఏకోదర భాష; తోఁడ నుడి;
    • spoken language, ph. మాట్లాడే భాష; మౌఖిక భాష;
    • source language, ph. మూల భాష; వేరు నుడి;
    • standard language, ph. ప్రామాణిక భాష;
    • target language, గమ్య భాష; లక్ష్య భాష; గుఱి నుడి;
  • languor, n. నిస్త్రాణ; బడలిక; ఆయాసం;
  • langur, n. ఒక జాతి కోతి; [bio.] Semnopithecus entellus;
    • Hanuman langur, ph. కొండముచ్చు; also called Gray L.;
    • Madras langur, ph. గండంగి;
  • lanky, adj. సన్నగా, పొడుగ్గా ఉన్న; రివటలా ఉన్న;
  • lantern, n. లాంతరు; హస్తకం ఉన్న దీపం;
  • lap, n. (1) ఒడి; అంకతలం; అడ్డాల; (2) చుట్టు;
  • lapid, n. రాయి; శిల;
  • lapidary, n. వైకటికుడు; రత్నములను సానపట్టేవాడు;
  • lapidate, v. t. రాయితో కొట్టు;
  • lapidify, v. t. రాయిగా మార్చు; (rel.) petrify; dilapidated;
  • lapis lazuli, n. రాజావర్తం; ఇంద్రనీలమణి; వైడూర్యం; నవరత్నములలో ఒకటి;
  • laparoscope, n. లాపొరోస్కోప్ అనేది ఒక వైద్య పరికరం. ఇది గొట్టంలా ఉండి అందులో ఓ కెమెరా ఉండి చీకట్లో చూసేందుకు ఒక దీపం కూడా ఉంటుంది. చర్మం మీద చిన్న రంద్రం మాత్రం చేసి ఆ రంధ్రం గుండా ఈ బుల్లి లాపొరోస్కోప్ ని పంపి దాని ద్వారా చూస్తూ మరో వైపు నుండి బుల్లి సూదీ, చాకూ వంటివి పంపి అవసరమైన వరకూ కోయడమో, శుభ్ర పరచడమో చేస్తారు; ఇది ఓ రకం శస్త్ర చికిత్సా పద్దతి. (సాధారణంగా శస్త్ర చికిత్సలoటే కత్తితో కొయ్యడం చర్మం, కండలను చీల్చి లోపల అవయవాలకు మరమ్మత్తు చేయడమో లేదా పాడయితే తీసివేయడమో చేస్తారు. వైద్యుడి చేయి పట్టేంత మేర కోయవలసి ఉంటుంది. ఇటువంటి ప్రొసీజర్స్ తర్వాత రోగి కొలుకోవడానికి చాలా సమయం పడుతుంది.)
  • lapse, v. i. మురిగిపోవు; కాలదోషం పట్టు;
  • laptop, n. ఉరోపరి; అడ్డాల కలని; ఒడిలో పట్టే కంప్యూటరు;
  • larceny, n. దొంగతనం; చోరీ; చౌర్యం; స్తేయం; మ్రుచ్చిమి;
  • lard, n. కొవ్వు; పంది కొవ్వు; ఆవు, మేక మొదలగు గడ్డిఁదిను జంతువుల మూత్రపిండాల చుట్టూన్న కొవ్వుపదార్థము;
  • large, adj. పెద్ద; పెను; గోదురు; స్థూల; గొప్ప; విస్తారమైన; అధికమైన; విశాలమైన;
    • large frog, ph. గోదురు కప్ప; పెనుకప్ప;
    • large intestine, ph. పెద్దప్రేఁగు; స్థూలాంత్రం; పెంబ్రేఁగు;
  • large-scale, adj. పెద్దయెత్తున; భారీ;
  • Lark, n. భరతపక్షి; భారద్వాజం; కులాసాగా కూజితాలు చేసే చిన్న పక్షి;
  • larva, n. డింభం; పూర్తిగా ఎదిగిన తర్వాత ఉండే రూపానికి విరుద్ధంగా ఉండే పెరగని పిల్ల జంతువు;
  • larval, adj. డింభ;
  • laryngitis, n. కంఠార్తి; స్వరపేటిక వాపు; గొంతుక్రోవి;
  • Larynx, n. స్వరపేటిక; మాటల పెట్టె; శ్వాసనాళానికి ఘంటికకీ మధ్యనున్న ప్రదేశం; కృకాగ్రం; కంఠనాళిక కొన; గొంతుకలో ధ్వని పుట్టించే కట్టడం;
  • Lascar, n. కళాసుఁడు; ఓడమీద పనిచేసేవాఁడు; పనివాఁడు;
  • lascivious, adj. కామాతురతతో కూడిన;
  • Laser, n. లేసర్; సన్నని, ఒకే రంగు ఉన్న, కాంతివాసాన్ని పుట్టించే పరికరం; (ety.) anagram for Light Amplification by Stimulated Emission of Radiation (LASER);
  • lash, v. t. కొరడాతో కొట్టి దండించు;
  • lass, n. పడుచు; చిన్నది;
  • lassitude, n. నిస్త్రాణ; నీరసం; అలసట; గ్లాని;
  • lasso, n. పాశం; త్రాఁడు; ఉచ్చుతాడు;
  • last, adj. (1) ఆఖరు; కడపటి; కడ; చివరి; ఒక వరుసలో చిట్టచివరిది; (2) గత; క్రిందటి; మునుపటి; (rel) latest;
    • last night, ph. నిన్నరాత్రి; గత రాత్రి; మున్రాత్రి; (note) "yesterday night" is not a correct usage;
    • last time, ph. కడసారి; క్రిందటిసారి;
    • last year, ph. గత సంవత్సరం; క్రిందటి ఏఁడు; నిరుడు; మున్నేఁడు;
    • last name, ph. ఇంటి పేరు; తండ్రి నుండి పిల్లలకి వచ్చే పేరు; same as surname; family name;
  • last, v. i. మన్ను; ఆటి వచ్చు;
  • lasura, n. శేలుపండు; also refer. Assyrian plum;
  • latch, n. గొళ్ళెం; గడియ;
  • late, adj. (1) ఆలస్యమైన; జాప్యమైన; జాగైన(2) వెనుకటి; గతించిన; చనిపోయిన; దివంగతులైన;

---Usage Note: lately, recently

  • ---Use both these in the present perfect tense to talk about something that began in the recent past and continues until now: Lately I have been thinking about buying a new car. Or, Recently I have been thinking about buying a new car. You can use recently with the past tense to talk about something that happened in the recent past: She recently got married.
  • lately, adv. ఈ మధ్య; ఇటీవల;
  • latent, adj. దాౘబడిన; గుప్తమైన; అంతర్గత; గూఢ; అవ్యక్త;
    • latent heat, ph. గుప్తోష్ణత; గుప్తోష్ణం; గూఢోష్ణం; అంతర్గతోష్ణత; దాపువేడిమి;
  • later, adj. ఉత్తర; అపర; మలి;
    • later half, ph. అపర పక్షం; మలివైపు;
    • later phase, ph. మలి దశ;
  • later, adv. తర్వాత; ఆనక; పిదప;
  • lateral, adj. పార్శ్వ; ప్రక్కనున్న; ప్రక్కటి;
  • Laterite, n. కంకర; తురక ఱాయి;
  • latest, adj. గత; క్రిందటి; ఒక వరుసలో అప్పటికే చివరిది;
  • latex, n. దుగ్ధరసం; మొక్కలనుండి కారే పాలు;
  • lath, n. పెండికట్టు; తడప; పలచటి, పొడుగాటి రేకు; తాటి, కొబ్బరి మొదలైన చెట్ల మట్టల నుండి పీకిన పలచటి, పొడుగాటి పీలిక;
  • lathe, n. తరిమెన; తరివిరి; ఒక యాంత్రిక పనిముట్టు;
  • lather, n. నురుగు; సబ్బు నురుగు; ఫేనం;
  • Latin America, n. లాటినమేరికా దేశం; మెక్సికో, మధ్య అమెరికా; బ్రెజిల్ మినహాయించి మిగిలిన దక్షిణ అమెరికా ప్రాంతం;
  • latitude, n. (1) అక్షాంశం; అక్షాంశరేఖ; ఇరుసంకె; ఒక చేతిని క్షితిజం వైపు, మరొక చేతిని ధ్రువ నక్షత్రం వైపు సారించినప్పుడు ఆ రెండు చేతుల మధ్య ఉండే కోణం; ఉత్తర ధ్రువం యొక్క అక్షాంశం 90 డిగ్రీలు; భూమధ్య రేఖ యొక్క అక్షాంశం సున్న డిగ్రీలు; (2) ఉదారత; స్వతంత్రం; మెదలడానికి చోటు;
  • latrine, n. మరుగుదొడ్డి;
  • latter, n. రెండవ; మరుసటి; వెనుకటి;
  • lattice, n. జాలకం; అల్లిక; తడక; చట్రం;
    • crystal lattice, ph. స్పటిక జాలకం;
    • metal lattice, ph. ధాతు అల్లిక;
  • laud, v. t. స్తుతించు;
  • laudable, adj. వంద్యం; స్తుతించదగ్గ; ఈడ్యము; పొగడదగిన;
  • laugh, v. i. నవ్వుట;
    • laughing matter, ph. నగుబాటు;
  • laughter, n. నవ్వు; నగు;
  • launch, v. t. (1) ప్రారంభించు; (2) జలప్రవేశం చేయు;
  • launder, v. t. ఉతుకు; శుభ్రం చేయు;
  • laundering, n. ఉతకడం; శుభ్రం చేయడం;
    • money laundering, ph. నల్లబజారులో గణించిన డబ్బుని చెలామణీలోకి తీసుకురావడానికి పన్నే కుట్రలు;
  • laundromat, n. చాకిరేవు కొట్టు; చాకిమర; మిషనులో డబ్బులు వేసి బట్టలు ఉతుక్కునే స్థలం;
  • laundry, n. (1) మాసిన బట్టలు; (2) ఉతికిన బట్టలు;
  • laureate, n. పుష్పగుచ్చమును గ్రహించిన వ్యక్తి; గండపెండేరమును తొడిగించుకున్న వ్యక్తి; అభిషిక్తుడు; ప్రసిద్ధుడు;
    • poet laureate, ph. ఆస్థానకవి;
    • Nobel laureate, ph. నోబెల్ గ్రహీత;
  • laurel, n. పత్రగుచ్ఛం; పురస్కారం: మెప్పుకోలు;
  • lava, n. శిలాద్రవం; ఉబ్బలి; అనలద్రావితం; లావా; దావం;(ety.) because fire created by lava is దావానలం; lava is molten rock that came out of the earth's interior; magma is the molten rock inside the earth;
    • River of lava, ph. అంగార సింధువు;
  • lavender, n. ఊదామరువం; లవంద్రి; ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Lavendula officinalis;
  • lavish, adj. డాబుగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన;
  • law, n. (1) ధర్మం; న్యాయం; (2) సూత్రం; నియమం; విధి; సిద్ధాంతం; (3) చట్టం; శాసనం; see also act;
    • common law, ph. సాధారణ న్యాయం; సమయ సూత్రం;
    • natural law, ph. ప్రకృతి ధర్మం;
    • penal law, ph. దండ నీతి; శిక్షాస్మృతి;
    • law of constant returns, ph. [econ.] సమ ప్రయోజన న్యాయం;
    • law of diminishing returns, ph. [econ.] క్షీణోపాంత ప్రయోజన శూత్రం; హీన ప్రయోజన న్యాయం; క్షీణ ప్రయోజన న్యాయం;
    • law point, ph. ధర్మసూక్తి; ధర్మసూక్ష్మం;
    • lawsuit, ph. దావా; వ్యాజ్యం;
  • lawful, adj. చట్టబద్ధ; చట్టసమ్మత;
  • lawful, n. చట్టసమ్మతం; ధర్మసమ్మతం;
  • lawlessness, n. అశాంతి; అవ్యవస్థ; న్యాయరాహిత్యం;
  • lawn, n. పచ్చిక; పచ్చికచెక్క; ఇంటి ముందు వాకిట్లో గడ్డి;
    • lawn mower, ph. లవనకి; గడ్డిని కత్తిరించే పనిముట్టు;
  • lawyer, n. న్యాయవాది; వకీలు; లాయరు; ప్లీడరు;
  • laxative, n. మృదువిరేచనకారి; (rel.) Purgative అంటే ఇంకా శక్తిమంతమైన ఔషధం. వీటిని కడుపునంతటినీ శుభ్రం చెయ్యడానికి వాడతారు.
  • layer, n. (1) పొర; స్తరం; (2) వరుస;
  • layman, n. పామరుఁడు; సామాన్యుఁడు; ఒక రంగంలో ప్రవీణుఁడు కాని వ్యక్తి;
  • lazy, adj. సోమరియైన;
    • lazy fellow, ph. బద్ధకిష్టి; బద్ధకస్తుఁడు; సోమరి;
  • laziness, n. (1) బద్ధకత్వం; బద్ధకం; సోమరితనం; ప్రాలుమాలిక; (2) బద్ధం; సుస్తీ;
    • menstrual laziness, ph. రుతుబద్ధం;
    • stool laziness, ph. మలబద్ధం;
  • leach, n. జలగ; జలూకం;
  • leaching, n. జలూకా ప్రయోగం; జబ్బు కుదిర్చే నిమిత్తం జలగల చేత నెత్తురు త్రాగించడం;
  • Lead, n. (లెడ్) (1) సీసం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 82, సంక్షిప్త నామం, Pb); [Lat. Plumbum (2) పెన్సిలు ములుకు; పెన్సిలు ములుకులో ఉండే గ్రాఫైటు;
    • red lead, ph. సింధూరం; వావిలి;
    • black lead, ph. కాఱు సీసం;
    • red calx of lead, ph. నాగసింధూరం;
    • white oxide of lead, ph. సఫేదు;
    • lead acetate, ph. సీస అసితం;
    • lead carbonate, ph. సీస కర్బనితం;
  • leadwort, n. చిత్రమూలం; [bot.] Plumbago zeylanica;a shrubby, perennial medicinal herb with acrid roots;
  • lead, v. i. (లీడ్); దారితీయు; త్రోఁవ చూపు;
  • leader, n. ఆరెకుఁడు; తలారి; పురోగామి; అగ్రణి; అగ్రిముఁడు; m. నాయకుఁడు; నేత; f. నాయకురాలు;
  • leadership, n. నేతృత్వం; నాయకత్వం; ఆరెకతనం
  • leaf, n. ఆకు; పత్రం; పర్ణం; గాదం; పల్లవం;
    • bifoliate compound leaf, ph. ద్విదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. ఏపి ఆకు;
    • bipinnately compound leaf, ph. ద్విపక్షవత్ సంయుక్త పత్రం; ఉ. తుమ్మ ఆకు;
    • compound leaf, ph. సంయుక్త పత్రం;
    • multi foliolate compound leaf, ph. బహుదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. బూరుగు ఆకు;
    • palmately compound leaf, ph. హస్తాకార సంయుక్త పత్రం;
    • penta foliate compound leaf, ph. పంచదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. వావిలి ఆకు;
    • pinnately compound leaf, ph. పక్షవత్ సంయుక్త పత్రం; ఉ. చింత ఆకు;
    • pleurifoliolate compound leaf, ph. బహుదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. బూరుగు ఆకు;
    • quadrifoliate leaf, ph. చతుర్దశ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. నీటి చెంచలి కూర ఆకు;
    • simple leaf, ph. లఘు పత్రం;
    • tender leaf, ph. చిగురు; పల్లవం; ఇగురు; తలిరు; తలిరాకు; కవటాకు;
    • trifoliate leaf, ph. త్రిభిన్న పత్రం; మూడు ఉప పత్రములు గల భిన్న పత్రం;
    • trifoliolate compound leaf, ph. త్రిదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. చిక్కుడు ఆకు;
    • tripinnately compound leaf, ph. త్రిపక్షపత్ సంయుక్త పత్రం; ఉ. మునగ ఆకు;
    • uni foliolate compound leaf, ph. ఏకదళ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. నిమ్మ ఆకు;
  • leaflet, n. కరపత్రం; ఉపపత్రం;
  • league, n. (1) సమితి; సభ; కూటమి; (2) మూడుమైళ్ళు;
  • League of Nations, n. నానారాష్ట్ర కూటమి; నానారాజ్యసభ; దీని స్థానంలో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి లేదా యునైటెడ్ నేషన్స్ ఉంది;
  • leak, n. నిష్యందం; కారుట;
  • leak, v. i. కారు; ఓడిగిల్లు; నిష్యందించు;
  • leaky, adj. ఓటి;
    • leaky pot, ph. ఓటి కుండ;
  • lean, adj. సన్నని; బక్కపలచని; చిక్కిన; కొవ్వు తక్కువగా ఉన్న;
  • lean, v. i. ఒరగు; చేరబడు; ఆనుకొను;
  • lean, v. t. చేరబెట్టు; చేరవేయు;
  • leaning, n. మొగ్గు; పక్షపాతం చూపు;
  • leap, v. i. గెంతు; లంఘించు; ఉరుకు; దుముకు;
    • leap year, n. లంఘ వర్షం; దీర్ఘ సంవత్సరం; అధిక సంవత్సరం;
  • learn, v. i. నేర్చుకొను; కరచు; అభ్యసించు;

---Usage Note: learn, teach, show

  • ---Both teach and learn are used to talk about things that take time to accomplish. Learning means studying or practicing. Teach means explaining to someone what to do. Show means to use actions to explain something.
  • learned, n. [learn-ed], an educated person;
  • learner, n. అభ్యాసి;
  • learned, v. i. [Brit.] learnt; past tense of "to learn;"
  • learning, n. నేర్చుకొనడం; అభ్యాసం;
    • machine learning, ph. యంత్రాభ్యాసం;
    • rote learning, ph. లొట్టాబట్టీయం; కంఠస్థం చెయ్యడం;
  • lease, n. గుత్త; కౌలు; బాడుగ; పట్టా; ఇజారా;
  • leash, n. తలుగు; తలుగు అంటే పశువుని కట్టెయ్యటానికి వాడే పలుపుతాడు; a line for leading or controlling an animal;
  • least, adj. కనిష్ఠ; కనీసపు; లఘిష్ఠ; లఘుతమ; అత్యల్పమైన;
    • least common multiple, ph. కనిష్ఠ సామాన్య గుణిజం; కసాగు;
    • least squares, ph. కనిష్ఠ వర్గులు;
    • least mean squares, ph. కనిష్ఠ సగటు వర్గులు; కసవ;
    • at least, ph. హీనపక్షం; కనీసం;
    • not in the least, ph. ఈషణ్ మాత్రం;
    • method of least squares, ph. కనిష్ఠ వర్గులు పద్ధతి;
  • leather, n. తోలు; పదును చేసిన చర్మం;
  • leave, n. సెలవు;
  • leave, v. t. వదలు; వదలిపెట్టు; విడుచు; మానుకొను;
  • leavening, n. గుల్లపొడి; పొంగుపొడి; పిండివంటలు గుల్లబారడానికి; పిండి పొంగడానికీ వాడే పదార్థం;
  • lectern, n. వ్యాసపీఠం; ఉపన్యాసకుడి ముందు కాగితాలు పెట్టుకుందికి ఉండే బల్ల;
  • lecture, n. ఉపన్యాసం; ప్రసంగం;
  • lecturer, n. m. ఉపన్యాసకుడు; ప్రసంగి;
  • ledger, n. కాతా పుస్తకం; ఆవర్జా; ముఫర్జు; పద్దు పుస్తకం; వర్గు లెక్కల పుస్తకం; కవిలె కట్ట;
  • leeward, adj. ప్రతివాతం; ప్రతివాత;
  • left, adj. ఎడమ; వామ; సవ్య; ఇడ; డాపల; డా; పుఱ; రొడ్డ;
    • left hand, ph. సవ్యకరం; డాచేయి; ఎడమ చేయి; పుఱ చేయి;
    • left handed, ph. సవ్యకరం; వామకరం; వామావర్తం; పుఱ చేతి వాటం;
    • left nerve, ph. ఇడ నాడి; డానాడి;
    • left wing, ph. వామపక్షం; డావైపు; రాజకీయాలలో "మార్పు" ని కోరే, సంప్రదాయ విరుద్ధ పద్ధతులని ప్రోత్సహించే పక్షం; సంఘంలో విశాల భావముగల; విశాల దృక్పథముగల పక్షం;
  • left-handed, n. కవ్వడి; పుఱచేతివాటం ఉన్న మనిషి;
  • leftist, adj. వామపక్ష; డావై;
  • leftist, n. వామపక్షి; డావైపరి;
  • leftovers, n. తినగా మిగిలిపోయినవి; భక్షితావశిష్టాలు;
  • leg, n. (1) కాలు; (2) మీగాలు; పాదము పై భాగం; (3) కోడు;
    • leg of furniture, ph. కోడు;
  • legacy, n. వారసత్వపు సంక్రమణ; ఉత్తరదాయిత్వం; వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి;
  • legal, adj. చట్టబద్ధ; న్యాయాత్మక; న్యాయసంబంధిత;
  • legality, n. చట్టబద్ధత్వం;
  • legally, adv. విధ్యుక్తంగా;
  • legend, n. ఒక వ్యక్తి చేసిన విశిష్టమైన పని గురించి గొప్పగా చెప్పే కథ కాని కథలు కాని; ఈ కథలు నిజంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఉత్ప్రేక్షలు కావచ్చు; ఉదా. శంకరాచార్యులవారు పరకాయ ప్రవేశం చేసేరన్న కథ;
  • legibility, n. వ్రాత స్పష్టత;
  • legislate, v. t. శాసించు; చట్టములు ఏర్పరచు;
  • legislation, n. శాసనం; చట్టం; ఏలుబడి;
    • legislative assembly, ph. శాసనసభ; విధానసభ; ఏలుకొలువు;
  • legitimacy, n. ఔరసత్వం;
  • legume, n. కాయ ధాన్యం; చిక్కుడు జాతి గింజలు;
  • leisure, n. తీరిక; తీరుబడి; తీరుబాటు; తీరిక సమయం; వ్యవధానం; సావకాశం; విరామం; ఉబుసు; ఎసలిక;
  • leisurely, adv. తాపీగా; నెమ్మదిగా; తీరుబాటుగా; తీరుబడిగా; సావకాశంగా; వ్యవధానంగా;
  • lemon, n. గజనిమ్మ; పసుపుపచ్చగా ఉండే నిమ్మపండు; ఆకుపచ్చగా ఉండే నిమ్మని పంపరపనసతో జోడించగా వచ్చిన కంచర జాతి మొక్క అని ఒక నమ్మకం ఉంది; [bot.] Citrus limon; (rel.) lime;
  • lemon balm, n. [bot.] Melissa officianalis of the Lamiaceae (mint) family; Both Lemon Balm and Pudina (mint) have similar shapes and structures, the leaves, taste, and aromas of lemon balm and mint are distinct enough to tell them apart. Whether you prefer the sweet, delicate flavor of lemon balm or the bold, refreshing taste of mint, both herbs are versatile, aromatic, and widely enjoyed by many. Other names: Lemon Balm, Lemon Balsam, Melissa, Sweet Balm, Sweet Melissa;
  • lemongrass, n. నిమ్మగడ్డి; [bot.] Cymbopogon citratus of the Poaceae family; Cochin grass; Malabar grass; citronella grass; fever grass;
  • lend, v. t. అప్పిచ్చు;
    • lend a hand, ph. సహాయం చేయు;
  • lender, n. అప్పిచ్చువాడు; ఉత్తమర్ణుడు;
  • lending, adj. ప్రదాతృ; అప్పు ఇచ్చే; ఎరవిచ్చే;
    • lending language, ph. ప్రదాతృ భాష;
  • length, n. పొడవు; పొడుగు; నిడివి; నిడుద; చాపు; ఉద్దము;
  • lens, n. కటకం; తాలం; ఓకు; వక్రీభవనం కారణంగా కాంతి కిరణాల మార్గాన్ని కేంద్రాభిసరణం (converge) చేసేది కాని, కేంద్రావసరణం (diverge) చేసేది కాని అయిన పరికరం కటకం అనబడుతుంది;
    • concave lens, ph. పుట కటకం; పుటాకార కటకం;
    • contact lens, ph. సన్నికర్ష కటకం; స్పర్శ కటకం; అంటోకు(అంటు + ఓకు);
    • convex lens, ph. కుంభ కటకం; కుంభాకార కటకం; కుండోకు(కుండ + ఓకు);
    • double convex lens, ph. ద్వికుంభ కటకం; రెంగుండోకు(రెండు + కుండ + ఓకు);
  • Leo, n. సింహరాశి; ఈ సింహరాశిలో అత్యధిక కాంతితో ప్రకాశించే నక్షత్రాన్ని ఆల్ఫా లియోనిస్ అంటారు. దీనికే రెగ్యులస్ అనే పేరు కూడా ఉంది; సింహరాశిలో మరికొంచెం తక్కువ కాంతితో ప్రకాశించేది బీటా లియోనిస్ లేదా డెనిబోలా; Leo is located fairly close to the Ursa Major constellation in the sky; The stars around the neck of this lion look like a sickle with Regulus at the handle of the sickle; Denebola marks the tail end of the lion;
  • Leonis, n. పూర్వ ఫల్గుని; ఉత్తర ఫల్గుని;
  • Leonis Regulus, n. మఘ; ఒక నక్షత్రం;
  • leopard, n. చిఱుతపులి; వింబులి (వింత + పులి);
  • leprosy, n. కుష్ఠు; కుష్ఠువ్యాధి; కుష్ఠురోగం;
    • stone leprosy, ph. రాతి కుష్టు; పాలరాయి వంటి రాళ్లు ఆమ్ల వర్షంలో తడిసినప్పుడు రాయి క్రమేపీ క్షీణించి పోవడం;
  • leprosorium, n. కుష్ఠు శరణాలయం;
  • lesbian, n. f. స్వలింగాళువైన స్త్రీ; మరొక స్త్రీ తో మైథున సహచర్యం కోరే స్త్రీ;
  • lesion, n. గాయం; క్షతం; దెబ్బ; కడి; పుండు; కోత;
  • less, adj. తక్కువ; కొలతలో తక్కువ;
  • less, suff. మాలిన; విహీనం;
    • aimless, ph. దిక్కుమాలిన;
    • artless, ph. కళావిహీనం; ఒప్పులేని;
    • effortless, ph. కృషిమాలిన;
    • limitless, ph. వల్లమాలిన; ఎల్లలేని;
    • meaningless, ph. అర్థవిహీనం;
    • powerless, ph. శక్తిమాలిన;
    • thoughtless, ph. తెలివిమాలిన;
    • useless, ph. పనికిమాలిన; పనికిరాని;
  • lessee, n. అద్దెకున్న వ్యక్తి; అద్దెకి పుచ్చుకున్న వ్యక్తి;
  • lesser, adj. లఘుతర;
    • lesser evil, ph. లఘుతర దౌష్ట్యం;
  • lesson, n. పాఠం; బోధన; శిక్ష; గుణపాఠం;
    • learning a hard lesson, ph. గుణపాఠం నేర్చుకోవడం;
  • lessor, n. అద్దెకి ఇచ్చిన వ్యక్తి;
  • let, v. t. (1) చెయ్యనిచ్చు; (2) అనుకో;
  • lethal, adj. ప్రాణాంతకమైన; మరణకారకమైన; మారక; మారణ;
    • lethal dose, ph. మారక మోతాదు;
    • lethal weapon, ph. మారణాయుధం;
  • lethargy, n. బద్ధకం; మాంద్యం; దిమ్ము;
  • letter, n. (1) అక్షరం; (2) ఉత్తరం; జాబు; లేఖ; కమ్మ; ఆకు;
    • aspirated letter, ph. [ling.] ఒత్తు అక్షరం;
    • cover letter, ph. ముఖపత్ర లేఖ;
    • reply letter, ph. ప్రత్యుత్తరం;
  • lettuce, n. ఆకుకోసు; ఎలకోసు;
  • leuco, pref. తెల్లని;
  • leucocyte, n. తెల్లకణం;
  • leucodermia, n. శ్వేత కుష్ఠు; బొల్లి; see also vitiligo;
  • leucorrhea, n. తెల్లకుసుమ; శ్వేతప్రద; యోని ద్వారా కారే తెల్లని స్రావం;
  • leukemia, n. రక్తపు కేన్సరు; (ety.) from Greek meaning, white blood, or too many white cells in the blood;
  • levee, n. గట్టు; వరదలనుండి కాపాడడానికి నది ఒడ్డు వెంబడి కట్టిన కట్ట;
  • level, adj. చదునైన; సమమట్టమైన; కీత;
    • level tea-spoonful, ph. కీత చెంచాడు; తలకోసిన చెంచాడు; .
  • level, n. (1) మట్టం; మట్టపలక; ఒక ప్రదేశం చదునుగా ఉందో లేదో చూడడానికి తాపీమే వాడే పనిముట్టు (2) స్థాయి; ఎత్తు; సమత్వం; (3) పరిమాణం;
    • energy level, ph. శక్తి మట్టం;
    • sea level, ph. సముద్రమట్టం; కడలిమట్టం;
    • spirit level, ph. మట్టం; మట్టపలక;
    • water level, ph. నీటిమట్టం;
  • lever, n. తులాదండం; ఉత్తోలకం; మీట; (see also) liver;
  • levigate, v. t. దేవు; గాలించు;
  • levitation, n. వస్తువులని గాలిలో తేలేటట్లు చెయ్యడం; వాయుస్తంభనం;
  • levulose, n. వామోజు; ఎడం చేతి వాటపు చక్కెర; పళ్లలో ఉండే చక్కెర (ఫలోజు) ఈ జాతిది; గ్లూకోజు, మాల్టోజు కుడి చేతి వాటం చక్కెరలు; (see also) dextrose;
  • lewd, adj. అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు;
  • lexical, adj. మాటలకి సంబంధించిన; నిఘంటు సంబంధిత; నైఘంటుక;
    • lexical analysis, ph. నైఘంటిక విశ్లేషణ;
    • lexical order, ph. అకారాది క్రమం; నిరుక్త క్రమం;
  • lexicographer, n. నిఘంటుకారుఁడు; నైఘంటికుఁడు; ఆభిదానికుఁడు;
  • lexicographic, adj. నైఘంటుక;
  • lexicography, n. నిరుక్తం; నిరుక్త శాస్త్రం; నిఘంటు నిర్మాణ శాస్త్రం; శబ్దసంగ్రహ శాస్త్రం;
  • lexicology, n. పదస్వరూపతతత్త్వం;
  • lexicon, n. శబ్దసంగ్రహం; పదకోశం; శబ్దకోశం; నిఘంటువు;

Part 2: Lf-Lz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • liability, n. భారం; బాధ్యత; జవాబుదారీ; పూచీ; అచ్చుకోలు;
  • liar, n. కల్లరి; అబద్ధాల కోరు; బొంకులాడు; కోతల రాయుడు; జులాయి;
  • libation, n. (1) దేవుడికి నైవేద్యంగా అర్పించిన ద్రవరూపంలో ఉన్న పదార్థం; (2) (వెటకారంగా) అతిథులకి ఇచ్చే మద్యపానీయాలు;
  • libel, n. పరువు తీసే రాత; పరువు నష్టం కలిగించే రాతలు, కూతలు; నిందాలేఖనం; (note) a libel is a written word injurious to the reputation of another person; see also slander;
    • libel suit, ph. పరువు నష్టం దావా;
  • liberal, adj. విశాల భావముగల; విశాల దృక్పథముగల; వదాన్య; ఉదార;
    • liberal philosophy, ph. వదాన్యత; ఉదారతత్వం;
    • liberal school, ph. ఉదార సంప్రదాయం;
  • liberal, n. వదాన్యుడు; ఈవరి; ఉదారవాది; విశాల భావముగల వ్యక్తి; విశాల దృక్పధముగల వ్యక్తి;
  • liberalism, n. వదాన్యత; ఔదార్యం; ఉదారవాదం;
  • liberalization, n. ఉదారీకరణం;
  • liberate, v. t. విముక్తి చేయు;
  • liberation, n. విమోచనం;
  • liberty, n. స్వతంత్రం; స్వేచ్ఛ; యథేచ్ఛ;
  • libido, n. [psych.] కామాతురత; లైంగిక వాంఛ; లైంగిక బుభుక్ష; లైంగిక క్రియపై కోరిక; అచేతనంలో ఉండే తర్కాతీతమైన కోరికల పుట్ట;
  • library, n. గ్రంథాలయం; పుస్తక భాండాగారం; లైబ్రరీ;
  • lice, n. pl. పేలు; see also louse;
    • eggs of lice, ph. ఈళ్లు;
  • licence, n. పరమానా; మక్తా; లైసెన్సు;
  • license, v. t. [British] పరమానా ఇవ్వడం;
  • licit, adj. చట్టసమ్మతమైన; చట్టబద్ధమైన;
  • lick, v. t. నాకు; నాలికతో నాకు; లేహించు;
 
అతిమధురం
  • licorice, n. (లికరిష్) యష్టిమధుకం; అతిమధురం; [bot.] Glycyrrhiza glabra; Abrus pvccatorius; (Br.) liquorice;
  • lid, n. మూత; కప్పు; రెప్ప;
    • eyelid, n. రెప్ప;
  • lie, n. అబద్ధం; అసత్యం; కల్ల; బొంకు; కోత; హుళక్కి; అనృతం;
    • white lie, ph. శుద్ధ అబద్ధం; పచ్చి అబద్ధం;
  • lie, v. i. పరుండు; పండుకొను; పవళించు;
    • lie down, ph. పరుండు; పండుకొను; పవళించు;
    • lie in ambush, ph. పొంచి ఉండు; కాయు; ఆకుచాటున కాయు;
  • lie, v. t. అబద్ధమాడు;
  • lien, n. తత్వాక్కు; తాత్కాలిక స్వత్వం; తాత్కాలిక హక్కు;
  • lieu, n. స్థానం;
    • in lieu of, ph. స్థానంలో; దానికి బదులు;
  • life, n. (1) జీవి; జీవం; (2) జీవితం; జీవనం; మనుగడ; బతుకు; (3) ప్రాణం; జీవుడు; హంస; అసువు; ఉసురు;
  • life, adj. జీవ; జీవిత; ప్రాణ; యావజ్జీవ;
    • life and death issue, ph. జీవన్మరణ సమశ్య;
    • life cycle, ph. జీవిత చక్రం; జీవన చక్రం; జీవిత వలయం;
    • life expectancy, ph. ఒక వయస్సు వరకు బతికిన వ్యక్తి సగటున ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో లెక్క కట్టి చెప్పే సంఖ్య; ఒక వ్యక్తి వయస్సు పెరిగే కొలదీ, బాలారిష్టాలు తగ్గుతాయి కనుక, ఈ సంఖ్య మారుతూ ఉంటుంది;
    • life history, ph. జీవిత చరిత్ర;
    • life imprisonment, ph. యావజ్జీవ కారాగార శిక్ష;
    • life insurance, ph. జీవిత బీమా;
    • life process, ph. జీవన ప్రక్రియ;
    • life style, ph. జీవన సరళి; బ్రతుకు బాణీ;
    • life threatening, ph. ప్రాణాపాయకరమైన;
    • life span, ph. ఆయువు; ఆయుర్దాయం; జీవన పరిమితి; ఈ మాట ప్రాణం ఉన్న శాల్తీలని, లేని జడ శాల్తీలనీ ఉద్దేసించి వాడవచ్చు; ఒక జనాభాలోని ప్రజల యొక్క పుట్టిన తేదీ, గిట్టిన తేదీ తెలిస్తే ఆ జనాభాలో సగటు వ్యక్తి జీవన పరిమితి లెక్క కట్టవచ్చు; ఒక విద్యుత్ బల్బు ఎన్ని గంటలు వెలుగుతుందో అది ఆ బల్బు యొక్క జీవన పరిమితి;
    • family life, ph. కుటుంబ జీవితం;
    • half life, ph. అర్ధాయువు;
    • nomadic life, ph. సంచార జీవనం;
    • standard of life, ph. జీవిత స్థాయి;
    • full life insurance, ph. ఆదా జీవిత బీమా;
    • term life insurance, ph. సాదా జీవిత బీమా;
    • whole life insurance, ph. ఆదా జీవిత బీమా; సంపూర్ణ జీవిత బీమా;
  • lifebuoy, n. ఈతకాయ; నీటిలో తేలడానికి వాడే ఒక ఉపకరణం;
  • lifeless, adj. అచేతన; చచ్చిన; ప్రాణాలు పోయిన; నిర్జీవ;
  • life-long, adj. యావజ్జీవ; జన్మాంతర;
    • life-long imprisonment, ph. యావజ్జీవ కారాగార శిక్ష; జన్మాంతర కారాగారం;
  • life-sized, adj. మనిషెత్తు; నిజపరిమాణ;
  • life-support, n. జీవగర్ర;
  • lifespan, n. ఆయువు; ఆయుర్దాయము; ఆయుస్సు; జీవితకాలం;
  • lifestyle, n. జీవన సరళి; బతుకుబాణీ;
  • lift, v. t. ఎత్తు; లేపు; లేవనెత్తు;
  • lift, n. (1) మోట; చేదుపెట్టి; నీటిని పైకి ఎత్తే సాధనం; లేపే సాధనం; (2) ఎత్తుపెట్టి; మోట పెట్టి; ఎత్తుబండి; (3) (phys.) ఉద్ధరణ; aerodynamic lift;
  • ligament, n. అస్థిస్నాయువు; ఒక ఎముకని మరొక ఎముకతో బంధించే స్నాయువు; టెండాన్ ఎముకని కదిలించడానికి పనికొస్తే, లిగమెంట్ దాన్ని అదుపులో ఉంచి కదలకుండా ఉంచుతుంది;
  • liger, n. సింలి; మగ సింహానికీ ఆడ పులికీ పుట్టిన పిల్ల; రెండు మాటలని జత చేసి కొత్త మాట సృజించటాన్ని “పోర్ట్ మాంటో“ (Portmanteau) అంటారు. ఇంగ్లీషులో ఇలాంటి పదాలు ఇంకా స్మాగ్ (smog = SMoke+Fog), బ్రంచ్(Brunch = Breakfast+Lunch); see also tigon;
  • light, adj. (1) వెలుగు; వెలుతురు; కాంతి; ద్యుతి; (2) తేలిక; లలిత; దోర; లఘు;
    • light element, ph. లఘు ధాతువు; లఘు మూలకం; Light elements are generally thought of as those with an atomic number less tan 11; Hydrogen, helium, lithium and beryllium are the lightest four elements;
    • light object, ph. లఘువు;
    • light music, ph. లలిత సంగీతం;
  • light, n. (1) కాంతి; వెలుగు; వెలుతురు; ప్రభ; ప్రకాశం; భాతి; (2) దీపం; జ్యోతి; దివ్వె; లైటు; (3) తేలిక; చులకన;
    • beam of light, ph. కిరణ వారం: కాంతి పుంజం; పొగకర్ర;
    • beam of sunlight, ph. తరణి కిరణ వారం; జ్యోతిఃపుంజం;
    • flashlight, n. కరదీపిక; కరదీపం;
    • fluorescent light, ph. ప్రతిదీప్తి; ప్రతిదీప్తి దీపం;
    • incandescent light, ph. తాపదీప్తి; తాపదీప్తి దీపం;
    • moonlight, n. వెన్నెల; చంద్రకాంతి; సుధాకర భాతి;
    • ray of light, ph. జ్యోతిర్లత; మరీచి; మరీచిక;
    • torchlight, ph. కరదీపిక; కరదీపం; దివ్వె;
    • visible light, ph. దృశ్య కాంతి;
  • lighting, v. t. ప్రజ్వలనం; వెలిగించడం;
  • lightly, adv. తేలికగా; చులకనగా; దోరగా;
  • lightest, n. లఘిష్ఠం; అతి తేలిక అయినది;
  • lighthouse, n. దీపస్తంభం; ఆకాశదీపం; రేవుదీపం; బంకోలా: ఓడలకు దిక్కు తెలియజేయుటకై రేవున బెట్టిన ఎత్తయిన దీపస్తంభము;
  • lightness, n. చులకన; లఘిమ; లఘుత్వం; లఘుత;
  • lightning, n. మెరుపు; విద్యుల్లత; సౌదామిని; అశని; తటిత్తు; తటిల్లత; తటిత్తు;
    • lightning bolt, ph. పిడుగు; ఆశనిపాతం;
    • lightning rod, ph. తటిద్దండం;
  • light-year, n. జ్యోతిర్‌వర్షం; కాంతి సంవత్సరం; దూరాన్ని కొలవడానికి ఖగోళశాజ్ఞులు వాడే కొలమానం; కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరం; ఉరమరగా 6,000,000,000,000 మైళ్ళు;
  • lignite, n. కపిల; అంగారం; నాసిరకం నేలబొగ్గు;
  • like, adj. వలె; లాగ; సమాన;
    • manlike, adj. మనిషివలె; మనిషిలాగ;
  • like, v. i. నచ్చు; నచ్చుకొను;
  • likelihood, n. సంభావ్యత;
  • likely, adv. బహుశః;
  • likeness, n. పోలిక; సాపత్యం;
  • likewise, adv. అదేవిధంగా; అంతే కాకుండా;
  • limb, n. (1) అంగం; అవయవం; (2) కొమ్మ;
  • limbo, n. [idiom] త్రిశంకు స్వర్గం; త్రిశంకు స్థితి;
  • lime, n. (1) నిమ్మపండు; ఆకుపచ్చగా ఉండే నిమ్మపండు; (2) సున్నం; గుల్ల సున్నం; పొడి సున్నం; ముగ్గు;
    • hydrated lime, ph. తడి సున్నం; Ca(OH)2;
    • milk of lime, ph. సున్నపు పాలు; చిక్కని సున్నపు నీరు; Ca(OH)2;
    • slaked lime, ph. తడి సున్నం; Ca(OH)2;
    • quicklime, ph. పాల సున్నం; CaO;
    • Persian lime, ph. [bot.] Citrus latifolia;
    • West Indian lime, ph. [bot.] Citrus aurantifolia;
    • lime kiln, ph. సున్నపు బట్టీ;
    • lime mortar, ph. సున్నం; చెక్క సున్నం; గానుగ సున్నం; సున్నపురాయి గని నుంచి తెచ్చి సున్నపు బట్టీలలో కాలుస్తారు. అది బాగా విరిగి వేడిగా ఉంటుంది. అది తీసుకొని కట్టు సున్నం , లాదు సున్నం తయారు చేస్తారు. ఒక బస్తాకు 8 బస్తాలు (6 పైన) ఇసుక పోసి, గానుగలో వేసి ఎద్దుల చేత కొన్ని చుట్లు తిప్పిస్తారు. అది బాగా కలిసి పదును ఔతుంది. అది ఇపుడు సిమెంట్ మాదిరిగా (మళ్ళీ ఇసుక కలపక) వాడుకోవచ్చు. మిగిలినది రాశిగా పోసి కొద్ది నీళ్లు పైన కొద్దిగా గుంట చేసి పోస్తే పదును పోదు. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. సిమెంట్ మాదిరి ఏ రోజు కారోజు ఖాళీ చేయబనిలేదు. లాదు అంటే ఇంటి పై కప్పు. లాదు (ఇపుడు స్లాబ్) పోయడానికి వాడేది — లాదు సున్నం.
    • lime water, ph. సున్నపు తేట; సున్నపు నీరు; Ca(OH)2;
  • limestone, n. సున్నపురాయి; ఖటికశిల;
  • limit, n. మితి; పరిమితి; పారం; అవధి; హద్దు; సరిహద్దు; మందల; మేయం;
    • upper limit, ph. వర;
  • limited, adj. మిత; పరిమితమైన;
  • limited, n. పరిమితం;
  • limitless, n. అపరిమితం; అమేయం; అపారం; అమందలం;
  • limp, v. i. కుంటు; మెక్కు;
  • line, n. (1) గీత; రేఖ; (2) పంక్తి; వరస; (3) దండెం; (4) మార్గం; బాట; (5) తంతువు;
    • clothesline, ph. బట్టలు ఆరవేసుకొనే తాడు; దండెం;
    • curved line, ph. వక్ర రేఖ; మలక రేఖ;
    • dotted line, ph. బిందు రేఖ;
    • fall in line, ph. దారిన పడు; పాటున పడు;
    • railway line, ph. రైలు మార్గం;
    • stay in line, ph. వరసలో ఉండండి;
    • straight line, ph. సరళ రేఖ;
    • transmission line, ph. ప్రేషణ తంతువు;
    • line drawing, ph. రేఖాచిత్రం;
    • line of luck, ph. అదృష్టరేఖ; చేతిలో కనిపించే ఒక రేఖ;
    • line of seated people, ph. పంక్తి; బంతి;
    • line of sight, ph. దృక్‌రేఖ; దృగ్రేఖ;
    • line of text, ph. పంక్తి;
  • lineage, n. అభిజాత్యం; వంశం; వంశపారంపర్యం; సంతతి; ప్రవర; అన్వవాయం; గోత్రం; (note) గోత్రం indicates a tribe, which in turn may contain people belonging to several ప్రవరలు.
    • royal lineage, ph. రాజ వంశం;
  • linear, adj. సరళ; తిన్ననైన; రుజు; ఏకఘాత;
    • linear algebra, ph. సరళ బీజగణితము;
    • linear equation, ph. సరళ సమీకరణం; ఏకఘాత సమీకరణం;
    • linear line, ph. సరళ రేఖ; రుజు రేఖ;
  • linen, n. (1) తువ్వాళ్ళు; దుప్పట్లు వగైరా; (2) నారబట్ట; లినెన్‌ను ఫ్లాక్స్ మొక్క నుండి తీస్తారు. లినెన్ చాలా బలమైనది, శోషించే స్వభావం కలిగి ఉంటుంది. ఇది వేసవిలో చాలా చల్లగా ఉంచుతుంది;
  • linger, v. i. ఆలశ్యం చేయు; జాప్యం చేయు; వెనకబడు;
  • lingo, n. పరిభాష; ఒక వృత్తికి కాని ఒక జాతికి కాని చెందిన భాష; నలుగురికీ అర్థం కాని పరిభాష;
  • lingua, n. నాలుక; జిహ్వ;
    • lingua franca, ph. వాడుక భాష;
  • lingual, adj. నాలుక వైపు; నాలుకకి సంబంధించిన; జిహ్వకి సంబంధించిన; భాషకి సంబంధించిన;
    • lingual nerve, ph. జిహ్వా నాడి;
    • lingual side, ph. నాలుక వైపు; నోటిలో పళ్ళకి రెండు పార్శ్వాలు ఉంటాయి: బుగ్గ వైపు, నాలుక వైపు;
    • lingual vein, ph. జిహ్వ సిర;
  • linguist, n. భాషాశావేత్త;
  • linguistic, adj. భాషాప్రయుక్త; భాషాధారక; భాషా;
    • linguistic purity, ph. భాషా పరిశుద్ధత;
  • linguistics, n. భాషాశాస్త్రం;
  • lining, n. అస్తరు; దుస్తుల లోపల పల్చటి పొరలా వేసే మరొక బట్ట;
  • link, adj. లంకె; అనుసంధాన;
    • link language, ph. అనుసంధాన భాష;
  • link, n. లంకె; మెలుసు; కీలు; లింకు;
    • link in a chain, ph. లంకె; మెలుసు; గొలుసులో మెలుసు;
  • link, v. t. లంకించు; లంకె పెట్టు; అనుసంధించు; లింకించు;
  • linoleum, n. బెండు చాప; (ety. Linum = flax, Oleum = oil)
  • linotype, n. పంక్తి కూర్పు; ఒక ముద్రణా పద్ధతి; (ety.) line + type = linotype; (rel.) monotype;
  • linseed oil, n. సీమఅవిసె నూనె; ఎల్లగిసె విత్తుల నూనె;
  • lion, n. m. సింహం; కేసరి; హర్యక్షం; కంఠీరవం;
  • lioness, n. f. సింహిక; కేసరి;
  • lip, n. (1) పెదవి; పెదిమ; మోవి; ఓష్ఠం; వాతెర; పలువలువ; (2) అంచు; గిన్నె యొక్క అంచు;
    • lower lip, ph. కింది పెదవి; అధరం; మోవి;
  • lipid, n. మేదం; రోచనం; కొవ్వు;
  • liquefaction, n. ద్రవీకరణ; ఒక వస్తువుని ద్రవరూపంలోకి మార్చడం; see also condensation;
  • liquid, n. ద్రవం; ద్రవపదార్థం;
    • liquid capital, ph. చర మూలధనం;
    • liquid crystal, n. ద్రవస్పటికం;
    • liquid state, n. ద్రవస్థితి;
    • liquid tissue, n. ద్రవధాతువు; ఉ. రక్తం;
  • liquidation, n. ఒక వ్యాపారంలోని ఆస్తులని అమ్మేసి ద్రవ్యరూపంలోకి మార్చేయడం; అలా మార్చేసి అప్పులు తీర్చేయడం దివాలా ఎత్తేముందు చెయ్యవలసిన మొదటి పని;
  • liquidity, n. (1) ద్రవ్యత; ద్రవత్వం; ద్రవరూపంలో ఉండగలగడం; (2) ద్రవ్యత; ద్రవ్యత్వం: ఆస్తి ధనరూపంలో ఉండడం;
  • liquor, n. మద్యం; ఈ మాటని సారా, కల్లు మొదలైనవాటికి వాడవచ్చు కాని, ముఖ్యంగా బ్రాందీ, విస్కీ మొదలైన అభిషవోల్ జాతి మద్యాలని ఉద్దేశించి వాడతారు;
    • distilled liquor, ph. అభిషవం; అభిషవోల్; బట్టీపట్టగా వచ్చిన మద్యం;
    • fermented liquor, ph. పులియబెట్టగా వచ్చిన మద్యం;
    • liquor from grape juice, ph. ద్రాక్ష సారా; సారా; మధువు;
    • liquor from palm juice, ph. తాటి కల్లు; ఈత కల్లు;
    • liquor from rice, ph. మేదకం;
    • liquor from spices and fruit, ph. ప్రసన్నం;
    • liquor from sugar and honey, ph. ఆసవం;
    • liquor from sugarcane juice, ph. మైరేయం;
  • list, n. జాబితా; పట్టీ; లావణి; చలానా; లిస్టు;
  • listen, v. i. విను; ఆలకించు; ఆకర్ణించు; అవధరించు;
    • do not listen, ph. వినవద్దు; వినబోకు; వినకు;
  • listener, n. వినే వ్యక్తి; శ్రోత;
  • literacy, n. అక్షరాస్యత; అక్షర జ్ఞానం;
  • literal, adj. మాటకుమాటగా వుండే; శాబ్దిక; ఉన్నదున్నట్లు; అక్షరాక్షరం;
    • literal meaning, ph. వాచ్యార్థం; మూలార్థం; సామాన్యార్థం;
    • literal translation, ph. యథాతథానువాదం; ముక్కస్య ముక్కకి అర్థం;
  • literally, adv. అక్షరాలా;
  • literary, adj. సాహిత్య; సారస్వత;
    • literary field, ph. సాహిత్య రంగం; సారస్వత రంగం;
  • literate, adj. అక్షరాస్యులైన;
    • literate person, ph. అక్షరాస్యుడు;
  • literate, n. సారస్వతులు; అక్షరాస్యులు;
  • literature, n. సాహిత్యం; సారస్వతం; రచనా సంపుటి; వ్రాయాది; వాఙ్మయం (vaa~mmayaM);
    • farming literature, ph. వ్యవసాయానికి సంబంధించిన రచనలు;
    • oral literature, ph. మౌఖిక సాహిత్యం;
    • Telugu literature, ph. తెలుగు సాహిత్యం;
  • Lithium, n. లిథియం; శిలాజం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 3, సంక్షిప్త నామం, Li); [Lat. lithos = stone];
  • lithos, n. శిల; రాయి;
  • lithography, n. శిలా లేఖనం; రాతి పలక మీద కాని లోహపు పలక మీద కాని అక్షరాలని అమర్చి దాని సహాయంతో అద్దకం అద్దినట్లు అచ్చు గుద్దడం;
  • lithosphere, n. శిలావరణం;
  • litigant, n. కక్షిదారు;
  • litigate, v. t. దావా వేయు;
  • litigation, n. వ్యాజ్యం; కేసుని కోర్టుకి తీసుకెళ్లే పద్ధతి;
  • litmus paper, n. లిట్మస్ కాగితం; ఆమ్లములు తగిలిన ఎరగ్రానూ, క్షారములు తగిలిన నీలంగానూ మారే ఒక రసాయనంతో పూయబడ్డ కాగితం;
  • liter, n. [Brit.] litre, లీటరు;
  • little, adj. చిన్న; బుల్లి; ఇసుమంత; ఇంచుక; కొంచెం; కొద్ది; స్వల్ప; అల్ప;
    • little bit, ph. ఇంచుక; కొంచెం; ఇసుమంత; రవంత; కాసింత;
  • Little Dipper, n. లఘుదృక్షంలో చిన్న గరిటె ఆకారంలో ఉన్న ఒక నక్షత్రమండలం పేరు; ఈ గరిటె కాడ కొసనే ధ్రువ నక్షత్రం ఉంది; (note) Little dipper is an asterism in the constellation Ursa Minor);
  • littoral, n. తీరగత; సముద్రతీరం దగ్గరి;
  • livable, adj. నివాసయోగ్యమైన;
  • live, v. i. (లివ్) బతుకు; జీవించు; నివసించు;
  • live, adj. (లైవ్) సజీవ; ప్రాణముతోనున్న; అప్పుడే జరుగుచున్న;
    • live cinder, ph. నివురుగప్పిన నిప్పులు; పూర్తిగా భస్మంకాని నిప్పు; సజీవాగ్ని;
    • live program, ph. రేడియోలో కాని టి.వి. మీద కాని అప్పటికప్పుడు జరుగుతూన్న కార్యక్రమం;
    • live wire, ph. విద్యుత్తువున్న తీగ;
  • livelihood, n. ఉపాధి; జీవనోపాధి; జీవిక; భుక్తి; జరుగుబడి; జరుగుబాటు; జీవనాధారం;
  • lively, adj. చలాకీ అయిన;
  • liver, n. కాలేయము; యకృత్తు; కర్జ;
    • cirrhosis of liver, ph. జలోదరం;
  • livery, n. దవాలీ; దుస్తులు; ఉద్యోగపు దుస్తులు; నౌకరీదుస్తులు; సేవకులకు యజమానులిచ్చు ఉడుపులు;
  • livestock, n. పశుసంపద; పశువులు; పశుగణం; అనగా, పెంపుడు జంతువులు; అనగా, ఆవులు, గేదెలు, పందులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, కోళ్లు, బాతులు, పట్టుపురుగులు, తేనెటీగలు, వగైరా; Livestock are animals that are kept for production or lifestyle, such as cattle, sheep, pigs, goats, horses or poultry;
  • livid, n. కమిలిన రంగు; నీలి నలుపు రంగు;
  • lividity, n. కమిలిన రంగుని పొడచూపడం;
    • postmortem lividity, ph. ప్రాణం పోయిన తరువాత చర్మం రంగు మారడం; తెల్లగా ఉన్న వారి శరీరం లేత బచ్చలిపండు రంగులోకి మారినట్లు కనబడడం;
  • living, adj. సజీవ; జీవ;
    • living cell, ph. జీవకణం;
  • lizard, n.బల్లి; గౌళి; గృహగోధిక;
 
Llama_lying_down.jpg
  • Llama, n. ఏడగొఱ్ఱె; దక్షిణ అమెరికాలో ఉండే ఒంటెని పోలిన జంతువు;
  • load, n. బరువు; భారం;
  • load, v. t. బరువు ఎక్కించు; సామాను ఎక్కించు;
  • loam, n. గరుపం;
  • loamy soils, n. గరుప నేలలు; గరుపకొడి నేలలు;
  • loan, n. అప్పు; రుణం; (note) సంస్కృతంలో సర్వసాధారణంగా అకారాంత పదాల తర్వాత రు శబ్దం వస్తే, రు శబ్దమే మారుతుంది. ఉదా. బ్రహ్మ + రుషి = బ్రహ్మర్షి అవుతుంది కాని అకారం తర్వాత రుణ అన్న మాట వచ్చినప్పుడు మాత్రం అ కారానికి దీర్ఘం వస్తుంది. ఉదా. ప్రవత్సతర + రుణ = ప్రార్ణ, అంటే భారీ ఎత్తున చేసే అప్పు. ప్రపంచ బ్యాంకు దేశాలకి ఇచ్చే అప్పులాంటిది.
    • consolidation loan, ph. రుణార్ణ; రుణ + రుణ; చిన్న చిన్న చిల్లర అప్పులని తీర్చడానికి చేసే పెద్ద అప్పు;
    • home loan, ph. గృహార్ణ; గృహ + రుణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు; ఉద్దర;
    • mortgage loan, ph. ఉద్దర;
    • small loan, ph. వత్సరార్ణం; వత్సతర + రుణ;
    • student loan, ph. విద్యార్ణం; విద్య + రుణ;
  • loath, v. i. అసహ్యపడు;
  • loathsome, adj. అసహ్య; అసహ్య పడే విధంగా; బీభత్స;
  • loathsome, adj. అసహ్య; అసహ్యపడే విధంగా;
  • lobby, n. నడవ;
 
occipitalLobe=కపాలాస్థిక తమ్మె
  • lobe, n. తమ్మె; శరీరం నుండి కాని అంగం నుండి కాని ఉబికి వచ్చిన గుండ్రని భాగం;
    • occipital lobe, ph. కపాలాస్థిక తమ్మె; మెదడులో ఒక భాగం;
  • lobule, n. పాలిక; తమ్మెక; చిన్న తమ్మె;
  • local, adj. ప్రాంతీయ; స్థానిక; ప్రాదేశిక; స్వదేశీ; దేశవాళీ;
    • local anesthetic, ph. స్థానిక స్పర్శరాహిత్యం;
  • localization, n. ప్రాంతీయీకరణ; స్థానీకరణ;
  • localized, adj. స్థానిక;
  • location, n. తావు; ఠావు; స్థలం;
  • lock, n. తాళంకప్ప; కప్ప; బీగం;
  • lockout, n. బందుకట్టు; బంద్;
  • locomotion, n. చాలనం; జంగమత్వం; గమనం;
  • locus, n. (1) బిందుపథం; నిధానం; జాడ; (2) ఒక వారసవాహిక మీద ఒక జన్యువు ఆక్రమించే స్థానం;
  • locust, n. మిడత; శలభం; శరభం; When food supplies are scarce, they interact with other solitary grasshoppers (గొల్లభామలు) and turn into a locust – changing color from green to yellow and black. The locusts which are called 'gregarious' locusts form a swarm and attack crops;
  • lodge, n. బస; మకాం; వసతి; వసతి గృహం;
  • lodge, v. i. బసచేయు;
  • loft, n. అటక;
  • lofty, adj. ఉదాత్తమైన; ఒప్పిదముగల; గొప్ప;
  • log, n. (1) దుంగ; మాను; (2) చిట్టా; అంశ సమీకరణ పత్రం; అంశ పత్రం; ఏయే పనులు ఎప్పుడెప్పుడు జరిగేయో చూపించే జాబితా; (3) పద్దు;
    • log book, ph. కవిలె; పద్దు పుస్తకం; దుంగ పొత్తం;
    • log cabin, ph. దుంగటిల్లు; దుంగశాల;
  • logarithm, n. ఘాతాంకం; లఘుగణకం; సంవర్గమానం;
  • logic, n. తర్కం; తర్కశాస్త్రం;
    • circular logic, ph. చక్రీయ తర్కం; విత్తు ముందా చెట్టు ముందా అనే చర్చలో కూరుకుపోయి, సమాధానం దొరక్క పడే అవస్థ అనవస్థ; వాదోపవాదాలలో పాల్గొంటున్న వారికి ఇలాంటి అనవస్థ కలగడం అనవస్థా దోషం; ఎంతకీ తెగని చర్చలలో, పరిశీలనలో కూడుకుని పోవడం అనవస్థా దోషం;
    • fuzzy logic, ph. మసక తర్కం;
    • symbolic logic, ph. ప్రతీక తర్కం; ప్రతీకాత్మక తర్కం;
  • logical, adj. తార్కికమైన; తర్కబద్ధమైన;
  • logically, adv. తార్కికంగా; తర్కబద్ధంగా;
  • logistics, n. సేవాతంత్రాలు; ఏ పని ఎప్పుడు, ఎలా చెయ్యాలో సూచించే నియమావళి;
  • logician, n. తార్కికుడు; ఘటశాసి;
  • logo, n. చిహ్నము; గుర్తు;
  • logographs, n. pl. అర్థసంకేతాలు; అంకెలు, అక్షరాలతోపాటు రాతలో వాడే విరామ చిహ్నాలు, గణిత సంకేతాలు, కీ ఫలకం మీద కనబడే మరి కొన్ని సంకేతాలు;
  • loin cloth, n. కచ్చడం;
  • loiter, v. i. తారాడు; తచ్చాడు; జీరాడు;
  • lone, adj. ఒంటి; ఒంటరి;
  • loner, n. ఒంటరి;
  • loneliness, n. ఒంటరితనం; (rel.) selfishness;
  • long, adj. పొడుగైన; దీర్ఘమైన; లంబమైన; ఉత్తాల; చిర;
    • long peppers, ph. పిప్పళ్లు;
    • long sight, ph. చత్వారం; దూరముగానున్న వస్తువులు మాత్రమే కనబడుట;
    • long syllables, ph. నిడుదలు; దీర్ఘములు;
    • long range, adj. దీర్ఘ వ్యవధీక;
    • long time, ph. చిరకాలం;
  • longest, n. దీర్ఘతమం;
  • long-term, adj. దీర్ఘకాల; దీర్ఘకాలిక;
  • longevity, n. (1) దీర్ఘాయువు; లంబజీవితం; (2) ఆయుష్కాలం;
    • conducive to longevity, ph. ఆయుష్కరం; ఆయుర్వర్ధకం;
    • desire for longevity, ph. ఆయుష్కామం;
  • longhand, n. చేవ్రాలు; కంప్యూటరో, టైపు యంత్రమో వాడకుండా చేతితో రాసిన రాత; (rel.) shorthand; ok
  • longitude, n. రేఖాంశం; దీర్ఘాంశం; తులాంశం; విషువాంశం; ధ్రువకం;
  • longitudinal, adj. నిలువైన; పడుగు; (పడుగు పేకలో వలె);
    • longitudinal line, ph. రేఖాంశం; దీర్ఘాంశం; తులాంశం; విషువాంశం; ధ్రువకం:
  • look, n. చూపు; వీక్షణము;
  • look, v. i. చూడు; అవలోకించు; వీక్షించు;
    • look forward, ph. ఎదురుచూడు;
  • loom, n. (1) మగ్గం; (2) వాయుదండం; తాకుపలక;
  • loop, n. (1) ఉచ్చు; మెలి; పాశబంధం; (2) సుడి; (3) క్రమణం, kramaNaM
  • loose, adj. వదులుగానున్న; బిగుతులేని; విశృంఖలమైన; బులబులాగ్గా;
  • loosen, v. i. సడలు; వదులగు; బిగి తగ్గు;
  • loosen, v. t. వదులించు; వదులు చేయు; సడలించు; సూత్రించు;
  • loot, n. లూటీ; దొంగిలించిన సొమ్ము;
  • lord, n. m. అధిపతి; వల్లభుడు;
  • lose, v. i. పోగొట్టుకొను; కోల్పోవు; నష్టపోవు; పోకార్చు;

USAGE NOTE: lose, miss, lost, missing and disappear

  • Use lose if you cannot find something: I have lost my pen. Use miss if you do not go to a meeting or class that you regularly go to: I missed three classes in a row. Use lost to describe someone who does not know where s/he is: Will the parents of the lost child come to the information desk? Use missing to describe someone or something that you have been looking for: Detectives are searching for the missing girl. Use disappear when something is missing or lost under strange circumstances: One of my sox disappeared.
  • loss, n. నష్టం; క్షయం;
    • loss of human life, ph. జననష్టం; జనక్షయం;
    • total loss, ph. కుదేలు; కుందేలు;
  • lot, adj. ఎంతో; ఎక్కువ; చాలా;
  • lot, n. (1) స్థలం; ఇల్లు కట్టుకోడానికి ఉపయోగపడే స్థలం; (2) కర్మ;
  • lotion, n. ధావనౌషధం; అంగలేపనం;
  • lotus, n. పద్మం; కమలం; తమ్మి; పారిజాతం; lotus is different from Water Lily, but often mistakenly used as synonyms. Lotus is anchored to the ground below and does not float;
  • loud, adj. పెద్ద; బిగ్గర; తీక్షణమైన; పెను; గట్టి;
    • loud cry, ph. పెను బొబ్బ;
  • loudness, n. బిగ్గతనం;
  • lounge, n. విశ్రాంతి వసారా; లౌంజి;
  • louse, n. s. పేను; చీరపోతు; pl. lice;
    • egg of louse, ph. ఈరు;
  • love, n. ప్రేమ; మమకారం; అనురాగం; రాగం; వలపు; ఈషణం; ఆపేక్ష; కూరిమి; కాదిలి; గాదిలి నెమ్మి; నెనరు; నెర్లు; నెయ్యము;
    • friendly love, ph. ఊరిమి; కూర్మి;
    • sexual love, ph. వలపు; స్త్రీ పురుషుల మధ్య ఏర్పడు వలపు లేదా ప్రేమ;
    • fall in love, ph. ప్రేమించు; ప్రేమలో పడు;
    • love affair, ph. ప్రేమకలాపం; సరసోదంతం; ప్రేమాయణం;
    • love letters, ph. ప్రేమలేఖలు;
    • love of money, ph. ; ధనకాంక్ష;
    • love of one's son, ph. పుత్రేషణ;
    • love of one's wealth, ph. విత్తేషణ;
    • love of one's wife, ph. దారేషణ;
    • lovesickness, n. వలకాక; పేమ పిచ్చి;
  • love, v. t. ప్రేమించు; అభిమానించు; ఇష్టపడు; పడిచచ్చు; ముద్దు చేయు;
  • lover, n. అభిమాని; m. ప్రియుడు; ప్రేయసుడు; అభిమతుడు; f. ప్రేయసి; ప్రియురాలు; అభిమతి;
    • loving person, ph. నెర్లు మనిషి;
  • low, adj. హీన; నీచ; దీన; న్యూన; అల్ప; లఘు;
    • low pressure, ph. లఘు పీడనం;
  • lower, adj. క్రింది; దిగువ; అడుగు; హీన; లఘు; సరాజిత; అపర;
    • lower canal, ph. దిగువ కాలవ;
  • lower, v. t. దించు; తగ్గించు;
  • lowland, n. కోడు; అప్పి; లోవ; ఆవ; బీల; బాడవ;
  • loyalty, v. t. విశ్వాసం; రాజభక్తి;
  • LUCA, n. Last Universal Common Ancestor; జన్యుపరంగా ప్రస్తుతం ఉన్న మానవుల అందరి పూర్వికులైన మనిషి; చివరి ఫీమేల్‌ లూకాని మైటోకాండ్రియల్ ఈవ్ అని ఇంకా చివరి మేల్ లూకాని వై-క్రోమోసోమల్ ఆదమ్ అని వ్యవహరిస్తారు;
  • lubricant, n. కందెన; స్నేహకం;
    • lubricating jelly, ph. సర్వీసు;
    • lubricating oil, ph. కందెన చమురు;
  • luck, n. అదృష్టం; ప్రాప్తం;
  • luckily, adv. అదృష్టవశాత్తు; అదృష్టవశాన;
  • Luddite, n. పారిశ్రామికీకరణని వ్యతిరేకించే వ్యక్తి;
  • luggage, n. సంచులు, పెట్లు, వగైరాలు; వీటిని సామానుతో నింపితే అప్పుడు అది బేగేజి అవుతుంది;
  • lukewarm, adj. నులివెచ్చ; గోరువెచ్చ; చిట్టుడుకు; కదుష్ణ;
  • lull, n. తెరిపి;
  • lullaby, n. జోలపాట; లాలిపాట;
  • lumbago, n. కటి వాతం; నడ్డి శూల;
  • lumbar, adj. కటిస్థ; నడుముకి సంబంధించిన;
  • lumber, n. వాడుకోడానికి వీలుగా కొయ్యబడ్డ కలప; కరచ్రెక్కలు, దూలాలు, వాసాలు, మొ.; (def.) lumber is cut or processed timber; see also timber;
  • luminary, n. జ్యోతిర్మయి; తార; నక్షత్రం; ప్రశస్తి కల వ్యక్తి;
  • luminescent, n. దీప్యమానం; దీప్త్యమానం;
  • luminosity, n. దీప్తి; ద్యుతి; ప్రభ; ప్రకాశం;
    • luminosity of a star, ph. ఒక నక్షత్రం తన ఉపరితలం నుండి ఎంత కాంతిని వెదజల్లుతున్నాదో చెప్పే కొలమానం; అనగా సెకండుకి ఎంత శక్తిని వెదజల్లుతున్నాదో చెప్పే కొలమానం; నక్షత్రం ఉపరితలం దగ్గరకివెళ్లి కొలవలేము కనుక ఆ నక్షత్రాన్ని ఒక ప్రామాణికమైన దూరంలో నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే కాంతిని కొలుస్తాం; దీనినే absolute magnitude of a star అని కూడ అంటారు; it is the brightness with which a star would appear if placed at a distance of 10 parsecs = 32.6 light years; శుద్ధ కాయస్థం; ఒక ప్రామాణికమైన దూరంలో నక్షత్రాన్ని నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే brightness; apparent magnitude of a star అంటే దృశ్య కాయస్థం, అనగా నక్షత్రం మన కంటికి కనబడే brightness;
  • luminous, adj. ప్రకాశమానమైన; ప్రభాసితమైన; కాంతియుత;
    • non luminous, ph. కాంతిరహిత;
    • luminous zone, ph. ప్రభాసిత ప్రాంతం; దీప్తి మండలం;
  • lump, n. లప్ప; గడ్డ; ముద్ద; కడి; కరడు; కదుం;
    • lump of cooked rice, ph. అన్నపు కరడు;
    • lump of dung, ph. పేడకడి;
    • lump of salt, ph. ఉప్పు గడ్డ; ఉప్పు బెడ్డ;
    • lump of sugar, ph. చక్కెర లప్ప;
  • lunacy, n. ఉన్మాదం; పిచ్చి;
  • lunar, adj. చంద్ర; చాంద్ర; ఐందవ; చంద్రుడికి సంబంధించిన;
    • lunar day, ph. తిథి;
    • lunar eclipse, ph. చంద్ర గ్రహణం;
    • lunar mansion, ph. నక్షత్రం; నక్షత్ర సమూహం; (జాతకాలలో) ఇల్లు; గది;
    • lunar month, ph. చాంద్రమాసం;
    • lunar phases, ph. చంద్ర కళలు;
    • lunar year, ph. చాంద్రవర్షం;
  • lunatic, n. ఉన్మాది; m. పిచ్చివాడు; ఉన్మత్తుడు, f. పిచ్చిది;
  • lunatic, adj. పిచ్చి;
    • lunatic asylum, ph. పిచ్చాసుపత్రి;
  • lunation, n. చాంద్రమాసం; ఒక అమావాస్య నుండి తరువాత అమావాస్య మధ్య గల వ్యవధి;
  • lunch, n. సంకటి; మధ్యాహ్నపు భోజనం;
  • lunch box, ph. సంకటి పొది;
  • lung, n. ఊపిరితిత్తి; పుప్ఫుసం;
  • lunge, v. i. (లంజ్) లంఘించు;
  • lurk, v. i. నక్కు;
  • lust, n. కామవాంఛ; కామం; తమి;
  • luster, lustre (Br.) n. జిగి; మెరుపు; ద్యుతి;
  • lute, n. ఒక రకం వీణ;
  • luxury, n. విలాస వస్తువు;
  • luxuries, n. pl. విలాస వస్తువులు; భోగభాగ్యాలు; అంగరంగ వైభవాలు;
  • lymph, n. లసి; శోషరసం;
    • lymph glands, ph. లసి బొడిపెలు; శోషరస బొడిపెలు;
    • lymph vessel, ph. శోషరస నాళాలు; లసి నాళాలు;
  • lymphocytes, n.లసికణాలు; శోషకణాలు;
  • lynch pin, n. కడచీల; సాయిమేకు; చక్రాన్ని ఇరుసుకి తగిలించడానిలి వాడే చీల;
  • lynx, n. జంగుపిల్లి;
  • lyric, n. పాట; గీతం; పాటలోని సాహిత్యం; వాక్కు;
  • lysosome, n. విలీనకాయి; జీవకణాలలోని కనసారంలో తేలియాడుతూ ఉండే ఒక గుండ్రని భాగం; (lit.) lose body;


మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2