- O, inter. ఒహో; అలాగునా;
- oak tree, n. సిందూర వృక్షం;
- oar, n. తెడ్డు; అల్లీసకర్ర; క్షేపణి;
- oasis, n. విరామారామం; ఇసువాద = ఇసుము + వాద = sand + pond; ఎడారిలో నీళ్లు, నీడ దొరికే ప్రదేశం;
- like an oasis, ph. [idiom] కుంపట్లో తామర వలె;
- oats, n. ఓట్లు; ఓటు ధాన్యము; ఒక ధాన్యపు దినుసు; తైదులు; [bot.] Avena sativa of the Poaceae family;
- oatmeal, n. (1) అటుకులులా దంచబడ్డ ఓటు బియ్యం; (2) ఓటు బియ్యాన్ని బాగా చిమడబెట్టి అంబలిలా కాచిన భోజన పదార్థం;
- oath, n. ఒట్టు; ప్రమాణం; శపథం; ఆన, Ana
- obdurate, adj. మూర్ఖమైన;
- obedience, n. విధేయత; వినయం; నమ్రత; ప్రణతి;
- obediently, adv. సవినయంగా; విధేయతతో;
- obedient person, ph. విధేయుడు; ప్రణతుడు; విధేయురాలు;
- obese, adj. లావైన; స్థూలమైన; వలంగా; బడ్డుగా;
- obesity, n. స్థూలకాయత్వం; స్థౌల్యం;
- obey, v. i. కట్టుబడియుండు; పాటించు; చెప్పినట్లు నడుచుకొను;
- obituary, n. వార్తాపత్రికలో ప్రచురించబడ్డ మరణ వార్త; సంస్మరణ; స్మృతి;
- object, n. (ఆబ్‌జెక్ట్) (1) భౌతిక పదార్థం; వస్తువు; (2) కర్మ, వ్యాకరణంలో; (ant.) subject;
- object, v. t. (అబ్‌జెక్ట్) వారించు; అభ్యంతరపెట్టు; ఆక్షేపించు;
- objection, n. అభ్యంతరం; ఆక్షేపణ; ప్రతిబంధకం;
- groundless objection, ph. దురాక్షేపణ;
- objectionable, adj. ఆక్షేపణీయ; కూడని;
- objective, adj. వస్తుగత; (ant.) subjective;
- objective, n. వస్తుగత గమ్యం; లక్ష్యం; ఆశయం; ప్రయోజనం; గమ్యం ఎంతవరకు చేరుకున్నామో కొలిచి చెప్పడానికి వీలయిన చలరాసి; (rel.) goal;
- objectively, adv. నిష్పక్షపాతంగా;
- objectivity, n. విషయనిష్టత; వస్తునిష్టత;
- objectivism, n. నిష్పాక్షికత; "నీ స్వార్ధం కోసం బతుకు; నీ అభిమతం ధైర్యంగా వెల్లడించు కానీ అది ఇతరుల మీద రుద్దకు" అని బోధించే అయాన్ రేండ్ తత్త్వ ధోరణి; త్యాగం మీద స్వార్ధానిదే పైచేయి అని బోధించే తత్త్వం; Human knowledge and values are objective: they exist and are determined by the nature of reality, to be discovered by one's mind, and are not created by the thoughts one has;
- oblation, n. నైవేద్యం; నైవేద్యాది ఉపచారం;
- obligation, n. (1) అనివార్యకార్యం; తప్పనిసరి అయిన పని; (2) మొహమాటం; నిర్బంధం; విద్యుక్తం; విధాయకం;
- obliging person, ph. ఉపకారబుద్ధిగల వ్యక్తి;
- oblique, adj. తిర్యక్; వాలివున్న; వాలుగా ఉన్న; ఒరిగిన; transverse;
- oblique line, ph. తిర్యక్ రేఖ; వాలు గీత; transversal;
- obliquely, adv. వాలుగా; ఐమూలగా;
- obliterate, v. t. సర్వనాశనం చేయు; తుడిచిపెట్టు;
- oblong, adj. కోల; కోలగా ఉన్న;
- obnoxious, adj. అసహ్యకరమైన; హేయమైన;
- obscene, adj. అసభ్యమైన; అసహ్యకర మైన; అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు;
- obscure, adj. స్పష్టతలేని; ఎక్కడో మారుమూలని ఉన్న;
- obsequies, n. అపరకర్మలు; ఉత్తర క్రియలు; మరణానంతరం చేసే కర్మ;
- observable, adj. గమనార్హమైన; అవలోకనార్హమైన;
- observation, n. (1) పరిశీలనం; అవలోకనం; వీక్షణ; విలోకనం; ప్రేక్షణం; దృశ్యం; (2) పరిశీలన;
- observatory, n. వేధశాల;
- observe, v. i. పరిశీలించు; గమనించు; అవలోకించు; వీక్షించు; పాటించు; పారజూచు;
- observer, n. పరిశీలకుడు; ప్రేక్షకుడు; ద్రష్ట; పారజూడరి;
- obsession, n. రంధి; యావ; పరమ చాదస్తం; స్వీయభావ అవరోధం; దూరంగా ఉన్న, అర్ధం లేని, చొరబడే (intrusive), పదేపదే వచ్చే ఆలోచనలను ఆబ్సెషన్ లేదా స్వీయ భావ అవరోధం అంటారు. అనుచితమైనవి, ప్రేరేపించేవి, అసమంజస మైనవి, పునరావృతం అయ్యేవి, నిషిద్ధమైనవి అయిన ఆలోచనలు;
- obsessive compulsive disorder, ph. స్వీయభావ అవరోధ రుగ్మత; ఉదా: (1) మెట్లు ఎక్కేటప్పుడు లెక్క పెట్టడం, పెట్టకపోతే ఎదో జరుగుతుంది అనుకోవడం, ఫోన్ ఒక కోణంలో పెట్టక పొతే ఎదో దుర్వార్త వస్తుందని నమ్మటం. అలా పెట్టక పొతే ఆందోళన చెందటం. (2) అశుభ్రత, క్రిమి సంకులత, దుమ్ము, ధూళి, అంటువ్యాధుల పై మితిమీరిన భయం, (3) తమకి, తమవారికి, ఇతరులకి హాని జరుగ బోతుందనే అకారణ భయం
- obsolete, n. విలుప్తం; వ్యవహారబ్రష్టం; వ్యవహారచ్యుతం; అప్రచలితం; వాడుకలో లేనిది;
- obsolescence, n. అప్రచలనం;
- obstacle, n. అడ్డంకి; అవరోధం; అవాంతరం; ప్రతిబంధకం; విఘ్నం; విష్కంభం;
- without obstacle, ph. నిర్విఘ్నంగా;
- obstetrics, n. సూతిక శాస్త్రం; ప్రసూతి శాస్త్రం; ప్రసవ శాస్త్రం; పురిటి వైద్యం;
- obstinacy, n. మొండితనం; పిడివాదం; మూర్ఖపు పట్టు;
- obstinate, adj. మొండి; మూర్ఖపు పట్టుగల; హఠం చేసే; refractory;
- obstruct, v. t. అడ్డు; ఆటంకపరచు; అటకాయించు; అవరోధించు; నిరోధించు; అభ్యంతరపెట్టు; వారించు;
- obstructed, n. ప్రతిహతం;
- one that was obstructed, ph. ప్రతిక్షిప్తం;
- obstruction, n. అడ్డంకి; ఆటంకం; రోధం; రుద్ధం; అవరోధం; నిరోధం; ఆక; ప్రతిఘాతం; ప్రతిబాధకం; ప్రతిబాధి; ప్రతిబంధం; ప్రతిబంధకం; ప్రతిరోధకం;
- obtain, v. i. పొందు; సాధించు; సంపాదించు;
- obtrude, v. i. ముందుకు చొచ్చుకొని వచ్చు;
- obtuse, adj. [geom.] గురు; బహిర్లంబ; సూదిగాలేని;
- obtuse angle, ph. గురు కోణం; బహిర్లంబ కోణం;
- obverse, adj. బొమ్మవైపు; ప్రతిలోమ;
- obverse, n. బొమ్మ; బొరుసు కానిది; సీదా; (ant.) reverse;
- obvious, n. స్వయంవిదితం; విదితం; విస్పష్టం; వివరణ లేకపోయినా అర్థం అయేది;
- occasion, n. సందర్భం; సమయం; అవకాశం; కారణం;
- occasional, adj. అప్పుడప్పుడు; కాదాచిత్క; నైమిత్తిక;
- occasionally, adv. అప్పుడప్పుడు; అడపాదడపా; కదాచిత్తుగా;
- occident, n. పాశ్చాత్య దేశాలు; పశ్చిమ దేశాలు;
- occidental, adj. పాశ్చాత్య; పశ్చిమ దేశాలకి సంబంధించిన;
- occipital, adj. కపాలాస్థి; కపాలాస్థిక; తల వెనక భాగాన్ని ఉన్న ఎముకకి సంబంధించిన;
- occipital lobe, ph. కపాలాస్థిక తమ్మె; మెదడులో ఒక భాగం;
- occlusion, n. అంతర్ధారణ; ఆటంకం; అడ్డు;
- occult, adj. నిక్షిప్త; రహస్య; మానవుడి అవగాహనకి అందని;
- occultation, n. ఒక్కొక్కసారి చంద్రుడు బుధ , శుక్ర, కుజ, గురు, శని గ్రహాలను కప్పివేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకు శుక్రునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినపుడు దానిని శుక్రుని గ్రహణం (eclipse) అని అనరు; Lunar occultation of Venus అంటారు;
- occupation, n. (1) వృత్తి; ఉద్యోగం; (2) వ్యాపకం; (3) ఆక్రమణ;
- occupant, n. ఆక్రమించినవాడు; ఆక్రమితుడు;
- occupy, v. t. ఆక్రమించు; ఆవరించు;
- occur, v. i. సంభవించు; తట్టు; స్ఫురించు; తటస్థించు;
- occurrence, n. సంఘటన; స్ఫూర్తి;
- ocean, n. మహాసముద్రం; మహార్ణవం; అబ్రాసి; కడలి; విషధి; ఉదధి; అంబుధి; జలధి; సాగరం;
- oceanography, n. సాగరశాస్త్రం;
- ocellus, n. కృష్ణపాదం; the characteristic marking on the hood of a cobra;
- ochre, n. గోపీచందనం; ఒక రంగు పదార్థం;
- octadecane, n. అష్టాదశేను; ఒక ఉదకర్బనం; C18H38;
- octadecanoic acid, ph. అష్టాదశాయిక్ ఆమ్లం; C18H38O2;
- octagon, n. అష్టభుజి; అష్టకోణి;
- regular octagon, ph. క్రమ అష్టభుజి;
- octahedron, n. అష్టముఖి; ఎనిమిది సమత్రిభుజములు ముఖములుగా గల ఒక ఘనరూపము;
- octal, adj. అష్టాంశ;
- octal number system, ph. అష్టాంశ పద్ధతి;
- octane, n. అష్టేను; ఒక ఉదకర్బనం పేరు; CH3(CH2)6CH3;
- octane number, ph. అష్టేను సంఖ్య; పెట్రోలు నాణ్యతని కొలిచే సూచికాంకం;
- octave, n. (1) సప్తకం; సంగీతంలో f అనే పౌనఃపున్యం నుండి 2f పౌనఃపున్యం వరకు ఉన్న మధ్య దూరం; ఈ దూరంలోనే సప్త స్వరాలు ఇమిడి ఉంటాయి; భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ దూరాన్ని సరిగమపదని వరకే లెక్కపెడతారు, పాశ్చాత్య సంగీతంలో సరిగమపదనిస అని లెక్క పెడతారు; (2) అష్టపది; అష్టకం;
- octet, n. అష్టకం; అష్టకి; ఎనిమిది అంశాలు కలది;
- octanoic acid, n. అష్టనోయిక్ ఆమ్లం; కేప్రిలిక్ ఆమ్లం; ఎనిమిది కర్బనపు అణువుల దండ ఉన్న గోరోజనామ్లం;
- odd, adj. (1) బేసి; బేసరి; ఓజ; విషమ; సరి కాని; (2) వింతైన; ఎబ్బెట్టు; విజ్జోడు; (3) విషమ; చికై్కన;
- odd behavior, ph. వింత ప్రవర్తన;
- odd looking, ph. వింతగా కనిపించే;
- odd number, ph. బేసి సంఖ్య;
- odds and ends, ph. చిల్లర మల్లర వస్తువులు, పనులు;
- ode, n. కీర్తన; స్తుతి; పదం; భావగీతం;
- odious, adj. హేయమైన;
- odor, n. వాసన; గంధము; (Br.) odour; (rel.) malodor;
- oeuvre, n. (ఓవ్ర), ఒక కళాకారుని (కవి) సంపూర్ణ రచనా సంపుటి;
- of, prep. యొక్క; గురించి;
- offend, v. t. నేరం చేయు; కోపం పుట్టించు; నొప్పించు;
- offense, n. నేరం; తప్పు; తప్పు పని;
- cognizable offense, ph. వారంటు లేకుండా అరెస్టు చెయ్యడానికి పోలీసులకి హక్కు ఉన్న నేరం; ఇండియాలో ఇటువంటి నేరం జరిగిందని అనిపించగానే పోలీసులు తప్పనిసరిగా FIR (first information report) నమోదు చేసి తీరాలని చట్టం చెబుతోంది;
- punishable offense, ph. శిక్షార్హమైన నేరం;
- offer, v. t. అర్పించు; సమర్పించు; భక్తితో ఇచ్చు; కానుకగా ఇచ్చు;
- offering, n. ముడుపు; కానుక; నైవేద్యం; బలి;
- off-guardedly, adv. ఏమరుపాటుగా;
- office, n. కచేరీ; కార్యాలయం; పనిపట్టు; కృత్యాగారం; దప్తరు; ఆఫీసు;
- office bearer, ph. కార్యకర్త;
- officer, n. అధికారి; ఉద్యోగి; సచివుడు; ఆఫీసరు;
- executive officer, ph. కర్మాధికారి; కర్మసచివుడు;
- investigative officer, ph. విచారణాధికారి;
- official, adj. అధికార; అఫీషియల్;
- official, n. అధికారి;
- officinalis, n. ఉపయోగం ఉండి దుకాణాలలో కొనుగోలుకి దొరికేది;
- offshore, adj. తీరస్థ;
- offshore islands, ph. తీరస్థ దీవులు;
- offspring, n. s. బిడ్డ; సంతానం; తోకం; కేపు, kEpu
- offspring, n. pl. తనుజులు; సంతానం; సంతతి; బిడ్డలు;
- often, adv. తరచుగా;
- ogre, n. మనుష్యులను తినే రాక్షసుడు;
- oil, n. నూనె; చమురు; తైలం; ఆయిలు;
- animal oil, ph. జాంతవ తైలం;
- cooking oil, ph. వంట నూనె;
- crude oil, ph. ముతక నూనె; క్రూడాయిలు;
- fuel oil, ph. మంట చమురు; ఇంధనపు చమురు;
- kerosine oil, ph. కిరసనాయిలు;
- mineral oil, ph. ఖనిజపు చమురు;
- refined oil, ph. రిఫండాయిలు;
- til oil, ph. నువ్వుల నూనె;
- sesame oil, ph. నువ్వుల నూనె;
- vegetable oil, ph. శాకీయ తైలం;
- oil cake, ph. తెలక పిండి; పిణ్యాకం; నూనె చెక్క;
- oily, adj. నూనెలా ఉండే; జిడ్డుగా ఉండే; జిడ్డయిన;
- ointment, n. అంజనం; లేపనం; విలేపనం; మలాము; పైన పూసే మందు;
- o.k., n. సరే;
- okra, n. బెండ; ఎద్దునాలుక చెట్టు; గంబో;
- ol, suff. ఆల్కహాలు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. alcohol; menthol; phenol;
- old, adj. పాత; ముసలి;
- old age, ph. ముసలితనం; వృద్ధాప్యం; ముదిమి;
- old people, ph. ముసలివారు; వృద్ధులు; వయోవృద్ధులు;
---Usage Note: old, elderly
- ---Use old to talk about the age of things or people: This is an old car; How old are your children? Use elderly to be more polite when talking about people who are very old.
|
-
- oleander, n. గన్నేరు; కరవేరం; [bot.] Nerium oleander of the Apocynaceae family;
- olfactory, adj. ఘ్రాణ; వాసనకి సంబంధించిన;
- olfactory nerves, ph. ఘ్రాణ నాడులు;
- olfactory nodes, ph. [bio.] గంధప్రవరాలు,
- oligarchy, n. స్వల్పజన పరిపాలనం; స్వల్పజనాధిపత్యం;
- oligosaccharide, n. స్వల్పచక్కెర; తక్కువ ఏకచక్కెరలు ఉన్న కర్బనోదక కట్టడం; a carbohydrate whose molecules are composed of a relatively small number of monosaccharide units.
- olive, n. జిత చెట్టు; జిత వృక్షం; మానుగాయ; కుదురు జువ్వి; ఆలివ్; మధ్యధరా వాతావరణాలలో కాసే ఒక చిన్న కాయ;
- olive branch, ph. [idiom[ మైత్రీ సందేశం;
- olive oil, ph. జిత తైలం; మానుగాయ నూనె;
- olive green, ph. మానుగాయ రంగు;
- -ology, suff. శాస్త్ర విభాగాన్ని సూచించే అంత్య ప్రత్యయము; ఉ: శాస్త్రం; ఎరిమి; ఎర్మి;
- biology, n. జీవశాస్త్రం; మనీకెరిమి;
- botany, n. వృక్షశాస్త్రం; మానెరిమి;
- oma, suff. [med] వైద్య రంగంలో వచ్చే ఈ ఉత్తర ప్రత్యయానికి అర్థం "కంతి"; అనగా, శరీరంలోని జీవకణాలు మితిమీరి పెరిగి కాయలా తయారవడం; ఈ కంతి కేంసరు కావచ్చు, కాకపోవచ్చు;
- carcinoma, ph. అంగాలని చుట్టి ఉండే పొరలలో కాని, చర్మపు పొరలలో కాని వచ్చే కేంసరు;
- cytoma, ph. కణాలకి సంబంధించిన కంతి;
- melanoma, ph. మెలనిన్ అనే రంగు పదార్థం ఉన్న చోట (సాధారణంగా చర్మం) పెరిగే కంతి;
- sarcoma, ph. శరీరపు కట్టడానికి ఉపయోగపడే భాగాలకి (అనగా, ఉ. ఎముకలు, కండరాలు, వగైరాలకి) వచ్చే కేంసరు;
- ombrophobia, n. వానపిరికి; వర్షం అంటే భయం;
- ombudsman, n. లోకపాల్;
- omelet, n. గుడ్డట్టు; గుడ్డు పొరటు; (rel.) scrambled eggs;
- omen, n. శకునం;
- bad omen, ph. అపశకునం; దుర్నిమిత్తం; దుశ్శకునం;
- fatal omen, ph. మారకం;
- ominous, adj. దుశ్శకునమైన; అశుభసూచకమైన;
- omit, v. t. మినహాయించు; పరిహరించు; వదలివేయు; విడచిపెట్టు;
- omission, n. పరిహార్యం; మినహాయింపు; పరిహరింపు; చేయమి;
- omni, adj. సర్వ; అన్ని; సమస్థ;
- omnidirectional, n. సర్వదిశాత్మకం;
- omniscience, n. సర్వజ్ఞత;
- omniscient, n. సర్వజ్ఞుడు; అన్నీ తెలిసినవాడు;
- omnipotent, adj. సర్వశక్తిసంపన్నత; సర్వసమర్ధత; సర్వశక్తిత్వం;
- omnipotent, n. సర్వశక్తిసంపన్నుడు; సర్వసమర్ధుడు;
- omnipresence, n. సర్వవ్యాప్తి; సర్వవ్యాపకత్వం;
- omnipresent, n. సర్వోపగతుడు; సర్వవ్యాపకుడు;
- omnivorous, adj. సర్వభక్షక;
- omnivore, n. సర్వభక్షిణి; సర్వాహారి; సర్వభక్షకి;
- on, prep. మీద; పైన; గురించి;
- on behalf, ph. తరఫున; పక్షమున;
- on demand, ph. అడగ్గానే; అడిగిన వెంటనే;
- once, adv. (1) ఒకప్పుడు; ఒకానొకప్పుడు; (2) ఒకసారి; ఒకమారు; ఒకతడవ; ఒక పర్యాయం; ఒక తూరి;
- once upon a time, ph. అనగా అనగా; తొలి; తొల్లి;
- one, adj. ఏక; ఒంటి;
- one, n. ఒకటి;
- increment by one, ph. ఏకోత్తరించు; ఏకోత్తరవృద్ధి; ఒకటొకటిగా పెంచు;
- one-by-one, ph. ఒకదాని తరువాత మరొకటి చొప్పున; ఐకాఇకంగా;
- one-to-one correspondence, ph. ఏకైక సంబంధం;
- one and only, ph. ఏకైక;
- one's, adj. స్వ; స్వకీయ; తన; తనదైన;
- one's own duty, ph. స్వధర్మం;
- one-dimensional, adj. ఏకమాత్రక; ఏకప్రమాణ; ఏక దిశమాన; ఒకే కొలత గల;
- onion, n. (1) ఉల్లి; ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; (2) నీరుల్లి; పెద్ద ఉల్లి; ఎరగ్రడ్డ; సుకంద;
- green onion, ph. ఉల్లికాడలు;
- yellow onion, ph. లతార్కం; దుద్రుమం;
- onion bulb, ph. ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; ఎరగడ్డ;
- onionskin, n. ఉల్లిపొర; ఉలిపిరి;
- onion skin paper, ph. ఉల్లిపొర కాగితం;
- onlooker, n. చూపరి; దారిన పోయే దానయ్య; కలుగజేసుకోకుండా పక్కనుండి చూసే వ్యక్తి; ప్రేక్షకులు;
- only, adj. ఏక; ఒకే ఒక;
- only, adv. మాత్రం;
- onomastics, n. సంజ్ఞానామ పరిశీలన; పేర్ల పూర్వాపరాలని పరిశీలించే శాస్త్రం;
- onomatopoeia, n. ధ్వన్యనుకరణం; భావమును వ్యక్తపరచు శబ్దం; ఒక రకమైన శబ్దాలంకారం; అన్నం కుతకుత ఉడుకుతున్నది అన్నప్పుడు ‘కుతకుత’ అన్నం ఉడికే శబ్దాన్ని అనుకరించడమే ఈ అలంకారం లక్షణం; అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన లో "అభంగ తరంగ మృదంగ నిస్స్వన" మరొక ఉదాహరణ;
- onset, n. మొదలు; ఆరంభం;
- onslaught, n. ఆక్రమణ; పైబడడం; ఆఘాతం;
- ontology, n. లక్షణ శాస్త్రం; సత్త్వమీమాంశ; దృశ్యమాన ప్రపంచంలో వస్తువుల మూల స్వభావాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నించే ఆధిభౌతిక విజ్ఞాన శాస్త్రం;
a set of concepts and categories in a subject area or domain that shows their properties and the relations between them; Ontology లో సత్తా (అంటే ఉనికి) గల పదార్థాల తత్త్వము ముఖ్యం;
- ontological, adj. లక్షణ శాస్త్ర సంబంధమైన;
- onus, n. బాధ్యత; పూచీ; భారం;
- onyx, n. గోమేధికం; క్వార్‍ట్జ్ (quartz) జాతికి చెందిన రాయి; SiO2;
- oodles, n. pl. కొల్లలు;
- oogamy, n. అండ సంయోగం;
- oogenesis, n. అండజననం; అండోత్పత్తి;
- oogonium, n. స్త్రీ బీజాశయం;
- oology, n. అండాధ్యయనం; గుడ్లని అధ్యయనం చేసే శాస్త్రం:
- ooze, v. i. ఒలుకు; కారు; చెమర్చు; ఊరు; శ్రవించు;
- opal, n. క్షీరోపలం; ఒక విలువైన రాయి;
- opaque, n. కాంతి కిరణాలని చొరనీయని లక్షణం గల;
- open, adj. తెరచిన; తీసిన; విడిన; వికసించిన; విప్పిన; వివృత; విరళ; ఉపరితల;
- near-open, ph. ఉప వివృత; జారుగా తెరచిన;
- wide open, ph. బార్లా తెరచిన; బారుగా తెరచిన; బార్లా తీసిన;
- open set, ph. వివృత సమితి;
- open society, ph. వివృత సమాజం;
- open circuit, ph. వివృత వలయం; వివృత పరివాహం;
- open door, ph. విరళారళం; విరళ అరళం;
- open drainage system, ph. ఉపరితల నీటిపారుదల వ్యవస్థ;
- open forcibly, ph. పెగుల్చు; పెగలదీయు;
- open gently, ph. విడదీయు; జాగ్రతగా తెరచు;
- open, v. i. వికసించు;
- open, v. t. తెరుచు; విప్పు; విడదీయు; పెగుల్చు; పెగలదీయు;
- opening, n. (1) వివారం; వివరం; కన్నం; బెజ్జం; (2) ఖాళీ; ఖాళీ స్థలం; సందు; బీటిక; (3) ఎత్తుబడి; మొదలు;
- openly, adv. బాహాటంగా; బహిరంగంగా; వెల్లడిగా; దాపరికం లేకుండా; నిష్కపటంగా;
- opera, n. గేయ నాటకం; Originally understood as an entirely sung piece, in contrast to a play with songs, opera has come to include numerous genres, including some that include spoken dialogue;
- operate, v. t. (1) తోలు; నడుపు; చోదించు; (2) శ చికిత్స చేయు;
- operating system, n. నిరవాకి; ఉపద్రష్ఠ; కలనాత్మ; ఆత్మ లేని శరీరం ఎలాంటిదో అలాగే కలనాత్మ లేని కలనయంత్రం ప్రాణం లేని బొందె వంటిది; ఒక కలనయంత్రంలో పనిచేసే క్రమణికల (ప్రోగ్రాముల) మీద అజమాయిషీ, లేదా నిరవాకం, చేసే మరొక పెద్ద క్రమణిక; the software that supports a computer's basic functions, such as scheduling tasks, executing applications, and controlling peripherals;
- operation, n. (1) [math.] సంక్రియ; పరిక్రియ; పరికర్మ; సముచ్చయం; (2) శస్త్ర చికిత్స; కోత; (3) చర్య; కార్యము;
- algebraic operation, ph. బీజీయ పరిక్రియ; బీజీయ సముచ్చయం;
- mathematical operation, ph. గణిత పరిక్రియ;
- surgical operation, ph. శస్త్ర పరిక్రియ; శస్త్ర సముచ్చయం;
- operator, n. [math.] పరికర్త; కర్మచారి; నిర్వాహకుడు;
- difference operator, ph. భేద పరికర్త;
- differential operator, ph. అవకలన పరికర్త;
- operative, n. కర్మచారి;
- ophidiophobia, n. అహిభయం; పాము జడుపు; పాము అంటే భయం;
- opinion, n. అభిప్రాయం; మతం; ప్రవాదం; అనుకోలు;
- difference of opinion, ph. అభిప్రాయ భేదం;
- good opinion, ph. సదభిప్రాయం;
- in my opinion, ph. నా అభిప్రాయం ప్రకారం;
- of the same opinion, ph. సమత;
- popular opinion, ph. లోక ప్రవాదం;
- opinionated, adj. దిట్టమైన అభిప్రాయాలు గల;
- opium, n. నల్లమందు; అభిని; అహిఫేనం;
- opium poppy seeds, ph. గసగసాలు; అభిని;
- opponent, n. ప్రత్యర్థి; ప్రతిద్వంది; ప్రతిస్పర్ధి; ప్రతిపక్ష; ప్రతికక్షి; ఎదిరి; వ్యతిరేకి; ప్రతికూలుడు; విరోధి; ప్రతిరోధి; ప్రతిరోధి, pratirOdhi
- opportune, adj. సానుకూల; సమయానుకూల;
- opportune idea, ph. తరుణోపాయం;
- opportune moment, ph. సానుకూల పరిస్థితి;
- opportunist, n. అవకాశవాది;
- opportunity, n. అవకాశం; తరుణం; వీలు; సమయం; ఎసలిక;
- good opportunity, ph. సదవకాశం; మంచి తరుణం;
- oppose, v. t. ప్రతిఘటించు; ఎదిరించు;
- opposite, adj. విరుద్ధ; విపరీత; అభిముఖ; వ్యతరిక్త; వ్యతిరేక; ప్రాభిముఖ; ఎదురెదురుగా; ఎదుటి;
- opposites, n. పరస్పర విరుద్ధములు;
- opposition, n. (1) ప్రతిపక్షం; విపక్షం; (2) వ్యతిరిక్తం; (3) (astro.) సూర్యుడిని, మరొక బాహ్య గ్రహాన్ని కలిపే ఊహాత్మక రేఖ మీదకి భూమి వచ్చినప్పుడు ఉన్న స్థితి; Opposition is when a planet is opposite the Earth from the Sun. This is when we can observe it best, as it is normally nearest Earth at this point. Opposition is typically used to describe a superior planet’s position; (ant.) conjunction; conjunction occurs when any two astronomical objects (such as asteroids, moons, planets, and stars) appear to be close together in the sky, as observed from Earth;
- opposition party, ph. ప్రతిపక్షం; విపక్షం;
- oppression, n. జులుం;
- optic, adj. దృష్టి; దృక్; చక్షు; నేత్ర;
- optic nerve, ph. నేత్ర నాడి;
- optical, adj. చక్షుష;
- optical axis, ph. చక్షుష అక్షం; చక్షుషాక్షం;
- optical fiber, ph. చక్షుష తంతువు; దృక్ తంతువు;
- optical illusion, ph. చక్షుష భ్రమ;
- optical instruments, ph. చక్షుష పరికరాలు;
- optical microscope, ph. చక్షుష సూక్ష్మదర్శిని;
- optician, n. కళ్లద్దాలని తయారు చేసే వ్యక్తి;
- optics, n. (1) కాంతిశాస్త్రం; నేత్రజ్ఞానశాస్త్రం; దృశాశాస్త్రం; తేజశ్శాస్త్రము; (2) ప్రచారం కొరకు ఛాయాచిత్రాలలో కనబడే తీరు;
- optimism, n. ఆశావాదం;
- optimistic, adj. ఆశాజనక;;
- optimization, n. ఉన్న ప్రత్యామ్నాయాలలో సర్వోత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే పద్ధతి;
- optimum, n. సర్వోత్తమం;
- option, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం;
- optional, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం;
- ophthalmologist, n. కంటివైద్యుడు; కంటి జబ్బులని నయం చేసే వైద్యుడు;
- ophthalmology, n. నేత్రవైద్యం; కంటివైద్యం;
- option, n. వికల్పం; విభాష: అభిరుచి; కోరి ఎన్నుకున్నది;
- optional, adj. ఐచ్ఛిక;
- optometrist, n. దృష్టిదోషాన్ని కొలచి కళ్లజోడుని అమర్చే వ్యక్తి;
- opulence, n. ఐశ్వర్యం; అయిస్వర్యం;
- opulent, adj. విలువైన వస్తువులతో అలంకరించబడ్డ;
- or, conj., కాని; లేక; కానిపక్షంలో; లేకపోతే; లేనియెడల;
- oracle, n. సర్వజ్ఞుడు; ద్రష్ట; ప్రవక్త; గ్రీకు గాథలలో వచ్చే అన్నీ తెలిసిన వ్యక్తి;
- oral, adj. (1) నోటిద్వారా; వాక్; వాగ్రూపంగా; వాచా; వాచ్య; వాచారంభ; మౌఖిక; మూజువాణీ; (2) నోటికి సంబంధించిన; నోటితో; ఆశ్య;
- oral cavity, అంగిలిగుంట; ఆశ్య కుహరం;
- oral commitment, ph. వాగ్దానం;
- oral examination, ph. వాచ పరీక్ష;
- oral exegesis, ph. కథాకాలక్షేపం;
- oral medicine, ph. నోటిద్వారా వేసికొనే మందు; మూజువాణీ మందు;
- oral testimony, ph. వాగ్మూలం;
- oral thrush, ph. తెల్ల పూత;
- oral tradition, ph. మౌఖిక సంప్రదాయం;
- orally, adv. వాచ్యంగా; నోటి;
- orange, n. (1) నారింజ; నాగరంగం; కిచ్చిలి; (2) నారింజ రంగు;
- batavian orange, ph. బత్తాయి; మోసంబి;
- navel orange, ph. బొడ్డు నారింజ; నాభి నారింజ;
- sweet orange, ph. బత్తాయి; చీనీకాయ; మోసంబి; తియ్య నారింజ; [bot.] Citrus sinensis;
- mandarin orange, ph. కమలాఫలం; [bot.] Citrus reticulata;
- International orange, ph. ముదురు నారింజ రంగు;
- orator, n. వక్త; వాంగ్మి; ప్రవక్త;
- oratory, n. వక్తృత్వం;
- orb, n. (1) బింబం; (2) గోళం;
- orbicular, adj. మండలాకార;
- orbit, n. కక్ష్య; చారగతి; వివర్తకం; భచక్రం;
- inner orbit, ph. అల్ప వృత్తం; అల్ప కక్ష్య;
- outer orbit, ph. అధిక వృత్తం; అధిక కక్ష్య;
- orbital, adj. కక్షీయ; కక్ష్యకి సంబంధించిన; గ్రహగతికి సంబంధించిన;
- orbital mechanics, ph. కక్షీయ యంత్రశాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behavior of physical bodies when subjected to forces or displacements;
- orbital, n. విగతి; విస్తృతమైన గతి; ఒక ఎలక్ట్రాను ఎక్కడ ఉందో సూచించడానికి వాడే తరంగ ప్రమేయపు లక్షణం; గుళిక వాదంలో వచ్చే ఒక సంక్లిష్ట భావన;
- orchard, n. పండ్లతోట; తోట; తోపు;
- palm orchard, ph. తాటి తోపు;
- orchestra, n. వాద్యబృందం; భజంత్రీలు; పక్కవాద్యాలు;
- ordeal, n. అగ్ని పరీక్ష;
- order, n. (1) ఆనతి; ఆన; ఆజ్ఞ; ఆజ్ఞాపన; అనుశాశనం; ఉత్తర్వు; తాకీదు; (2) ఆజ్ఞా పత్రిక; ఫర్మానా; (3) క్రమం; వరుస; (4) క్రమం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు నాలుగవ వర్గానికి పెట్టిన పేరు; [see also] genus, family, order, class, phylum and kingdom;
- alphabetical order, ph. అక్షర క్రమం;
- infra order, ph. అధోక్రమం; జీవశాస్త్రంలో క్రమం, ఉపక్రమం, అధోక్రమం అనేది అవరోహణ క్రమం;
- money order, ph. మనియార్డరు; పైకపు బరాతం;
- out of order, ph. క్రమం తప్పడం; తారుమారు అవడం;
- primate order, ph. వానరాలు; వానర క్రమం;
- written order, ph. బరాతం; పరవానా;
- ordered pair, ph. [math.] క్రమ యుగ్మం; (x, y) అనేది క్రమ యుగ్మం;
- suborder, ph. ఉపక్రమం; జీవశాస్త్రంలో క్రమం, ఉపక్రమం, అధోక్రమం అనేది అవరోహణ క్రమం;
- orderly, n. ఆసుపత్రిలో పనివాడు;
- ordinal, adj. వరసవారీ; వరసలోని; వరసలోనుండి ఎంచిన; క్రమ;
- ordinal number, ph. వరసవారీ సంఖ్య; క్రమ సంఖ్య;
- ordinance, n. ఆజ్ఞ; అధికార శాసనం;
- ordinarily, adv. సామాన్యంగా; సాధారణంగా;
- ordinary, adj. సామాన్య; సాధారణ; సాదా; లౌకిక; మామూలు; తందురుసు;
- ordinary person, ph. సామాన్యుడు; సామాన్యురాలు; తందురుసు రెంచ; తందురుసువాడు;
- ordnance, n. యుద్ధసామగ్రి; తోపులు;
- ore, n. ఖనిజం;
- oregano, n. పాశ్చాత్య దేశాల వంటకాలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum;
- Greek oregano, ph. [bot.] Origanum vulgare hirtum;
- Italian oregano, ph. [bot.] Origanum majoricum;
- organ, n. (1) అంగం; అవయవం; (2) ఒక రకం పియానో;
- organism, n. జీవి;
- organic, adj. ఆంగిక; సేంద్రియ; చేతన; అవయవజనిత;
- organization, n. (1) సంస్థ; వ్యవస్థ; (2) సంవిధానం;
- organized, adj. వ్యవస్థిత; సంఘటిత;
- organized labor, ph. సంఘటిత శ్రామిక వర్గం;
- organizers, n. pl. కార్యకర్తలు; నిర్వాహకులు; వ్యవహర్తలు; సంధాతలు;
- orgasm, n. రతిక్రీడలో పరాకాష్ఠని అందుకున్న సన్నివేశం;
- oriel, n. వీధి అరుగు; వీధి వసారా; చీడీ;
- oriental, adj. పూర్వ; ప్రాక్; ప్రాచ్యదేశ;
- orientation, n. దృగ్విన్యాసం; దిక్సాధన;
- orifice, n. బెజ్జం;
- origin, n. మూలం; ప్రభవం; ప్రభూతి; సంభవం; పుట్టుక; హేతువు; మూల బిందువు;
- original, adj. అసలు; మొదటి; మూల;
- original copy, ph. అసలు ప్రతి;
- original, n. (1) అసలు; మొదటిది; మాతృక; మూలం; (2) అసలు ప్రతి;
- Telugu original, ph. తెలుగు మాతృక; తెలుగు మూలం;
- originality, n. అపూర్వత; నూతనత్వం; ఉపజ్ఞ;
- orgon, n. నిమ్మ గడ్డి;
- originator, n. m. కారణభూతుడు;
- oriole, n. కల్ల పిట్ట;
- Orion, n. మృగవ్యాధుడు; వృత్రాసురుడు; మృగశిర; మృగశీర్షం; అగ్రహాయిణి; ఇది క్రమంగా అగ్రాయిని, తరువాత ఒరాయన్ అయేయని అంటారు; నిజానికి మృగశిర అనే కూటమి మృగవ్యాధ రాశిలో ఒక భాగమే;
- Orion's Belt, ph. త్రిపురములు; ఇన్వకములు; గొల్లకావడి చుక్కలు;
- ornate, adj. అలంకృతమైన; సాలంకృత;
- ornament, n. నగ; భూషణం; ఆభరణం; తొడవు; రవణం; అలంకారం;
- ornamentation, n. అలంకారం; సంగీతంలో అలంకారం అంటే సాదా, సీదాగా పాడకుండా స్వరాలకి చిన్న ఊపో, గమకమో, కంపిత గమకమో, వగైరాలు చేర్చి పాడడం; భాషలో అలంకారం అంటే ఉపమ, రూపక, మొదలైన అలంకారాలు వాడడం;
- ornithology, n. పక్షిశాస్త్రం;
- orphans, n. అనాథలు; తల్లిదండ్రులు లేని పిల్లలు;
- orphanage, n. అనాథ శరణాలయం;
- ortho, pref. తిన్ననైన; ఉదగ్ర;
- orthodontist, n. ఎత్తుపల్లాలు ఉన్న పంటి వరసని తిన్నగా చేసే వైద్యుడు;
- orthodox, adj. పూర్వాచార; సదాచార; శ్రోత్రియ; ఆస్తిక;
- orthodoxy, n. పూర్వాచార పద్ధతి; శ్రోత్రియ సంప్రదాయం; ఆస్తికత్వం; ఛాందసం; వేదాలని ప్రమాణంగా నమ్మడం;
- orthogonal, adj. లంబీయ; లంబకోణీయ; ఉదగ్రకోణీయ;
- orthonormal, adj. లంబనిట్రీయ;
- orthography, n. వర్ణక్రమం; వర్ణక్రమదోషం లేకుండా రాయడం;
- orthotropous, adj. [bot.] ఉదగ్రముఖ; having the nucleus of a plant ovule straight;
- oscillating, adj. డోలాయమాన; స్పందన; నివర్తన;
- oscillating universe theory, ph. విశ్వస్పందన వాదం;
- oscillation, n. స్పందనం; డోలనం; నివర్తనం; ఊగడం; ఆందోళనం;
- oscillator, n. [phys.] ఆందోళిక;
- harmonic oscillator, ph. [phys.] హరాత్మక ఆందోళిక; స్వరాత్మక ఆందోళిక; In classical mechanics, a harmonic oscillator is a system that, when displaced from its equilibrium position, experiences a restoring force F proportional to the displacement x;
- oscillatory, adj. స్పందించే; డోలాయమానమైన; ఊగే;
- oscillatory universe, ph. స్పందించే విశ్వం;
- theory of the oscillatory universe, ph. విశ్వ స్పందన వాదం; see also big bang theory;
- oscilloscope, n. డోలన దర్శిని;
- osculation, n. వేష్టనం; చుంబనం;
- osmosis, n. అభిసరణం; ఉత్సరణం; ద్రవాభిసరణ;
- osmotic pressure, ph. అభిసరణ ప్రేషం;
- reverse osmosis, ph. వ్యతిరేక ద్రవాభిసరణం;
- ostentation, n. ఆడంబరం; డంబరం;
- verbal ostentation, ph. వాగాడంబరం;
- osteomalacia, n. అస్తిమాల్యం; ఎముకల బలహీనతకు చెందిన వ్యాధి;
- ostrich, n. నిప్పుకోడి; ఉష్ట్రపక్షి; ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి; [bio.] Struthio camelus;
- other, adj. మరొక; వేరే; లాతి; అన్య; పరాయి; (rel.) another;
- other countries, ph. అన్య దేశాలు; పరాయి దేశాలు;
- other people, ph. లాతి వాళ్లు;
- other side, ph. అవతల; అవతల పక్క;
- otiose, adj. పనికిమాలిన;
- otter, n. ఆటర్; నీళ్ళల్లో ఉండే కుక్కని పోలిన ఒక క్షీరదం;
- otherwise, adv. అలాకాని పక్షంలో; అట్లుకాకున్న; కానిచో; అన్యథా; అథవా; పక్షాంతరమున;
- ounce, n. అవున్సు; (1) ద్రవ పదార్థాలని కొలవడానికి వాడే ఒక మానం; (2) బరువుని కొలిచేటప్పుడు పౌనులో పదహారో వంతు;
- our, poss. pron. (1) inclusive, మన; (2) exclusive; మా; మాయొక్క;
- out, adv. బైట; బైటకి;
- outbreak, n. అకస్మాత్తుగా చెలరేగడం; విప్లవ సంఘటన; విఘటన; the sudden or violent start of something unwelcome, such as war, disease, etc.
- outbreak, v. i. వ్యాపించు; వ్యాప్తిచెందు; చెలరేగు;
- outcast, n. అప్రాశ్యుడు; వెలి వేయబడ్డవాడు;
- outcome, n. ఫలితార్థం; ఫలం; పరిణామం;
- outcropping, n. గుట్ట; శిలాసంస్తరం; మట్టిలోంచి బయటికి పొడుచుకు వచ్చిన శిలాసంస్తరం;
- outcry, n. పెద్ద గోల; గొడవ; ఉద్ఘోషం;
- outdoor, adj. బయటి; లోపలి కాని;
- outer, adj. బహిర్గత; బాహ్య;
- outfit, n. (1) దుస్తులు; (2) సరంజామా; సాధన సంపత్తి;
- outlaw, v. t. నిషేధించు;
- outlay, n. పెట్టుబడి; మొత్తపు ఖర్చు; వ్యయం;
- outlet, n. నిర్గమ ద్వారం; నిర్గమం;
- outline, n. రూపురేఖ;
- output, adj. వెలపట; బహిర్గత; అంతర్యాన; అంతర్యాగ;
- output data, ph. బహిర్గత దత్తాంశం; బహిర్యానాంశం; బహిర్యాగాంశం;
- output pressure, ph. బహిర్గత పీడనం;
- output, n. వెలపలం; వెలపటంశం; నిర్గమాంశం; నిర్గతం; బహిర్గతం; బహిర్హితం; బహిర్యానం; బహిర్యాగం; బరవానా; పోత; ఫలితం; పరిణామం; ఉత్పన్నం; ఉత్పాదన; ఫలోత్పత్తి; నిర్గళితం; ఆయాతం; ప్రదానం; బైపెట్టు;
- outrage, n. దౌర్జన్యం; దురంతం; దురాగతం;
- outside, n. బయట;
- outsiders, n. pl. బయటివారు; తస్మదీయులు;
- outskirts, n. పొలిమేరలు; శివార్లు;
- outstanding, adj. (1) విశిష్టమైన; (2) బాకీ ఉన్న; మిగిలిన;
- outstanding exhibition, ph. విశిష్టమైన ప్రదర్శన;
- outstanding debt, ph. మిగిలిన అప్పు;
- outstretched, adj. బారజాపిన; చాపిన;
- outward, adj. బహిర్; బాహరమైన;
- ova, n. గుడ్లు; అండములు;
- ovary, n. స్త్రీబీజకోశం; అండకోశం; గర్భాగారం;
- oven, n. (అవెన్) ఆవం; ఆశ్మంతం; హసంతి; కమటం; పొక్కలి; పొయ్యి;
- goldsmith's oven, ph. కమటం;
- oven bird, ph. పొయ్యిపిట్ట; ఆవపిట్ట;
- oven to fire bricks, ph. ఇటుకలావం;
- over, prep.కంటె; మీద; పైన;
- over-bar, n. [math.] శిరోవారం; గణితంలో బీజాక్షరాల తల మీద గీసే అడ్డు గీత;
- overbearing, adj. దాష్టీకమైన;
- overcast, adj. మబ్బు కమ్మిన; మందారముగానున్న;
- overcoat, n. అంగరఖా;
- overcome, v. i. అధిగమించు; నిస్తరించు; గెలుచు; జయించు;
- overdose, n. మితిమీరిన మోతాదు;
- overdue, n. నిల్వ బాకీ; బకాయ;
- overflow, v. i. పొంగు; ఉప్పొంగు;
- overhang, v.i. వేలాడు;
- overhead, n. అమాంబాపతులు; పై ఖర్చులు;
- overlook, v. t. (1) చూడకపోవు; గమనించకపోవు; (2) ఒకరు చేసిన తప్పుని పట్టించుకోకుండా వదలిపెట్టు; (3) పైనుండి కిందకి చూచు;
- overripe, adj. ఆరముగ్గిన;
- oversee, v. i. అజమాయిషీ చేయు;
- overseer, n. తలవరి; ఓర్సీలు;
- oversight, n. (1) ఏమరుపాటు; ఏమరుపాటుతో చేసిన పొరపాటు; (2) ఏమరుపాటుతో పొరపాట్లు జరగకుండా అజమాయిషీ చేయు; (note) a word with opposing meanings;
- overtake, v. t. అధిగమించు; అతిక్రమించు; పట్టుకొను;
- overtly, adv. బాహాటంగా; బహిరంగంగా;
- overtone, n. అతిస్వరం; ప్రాధమిక ధ్వని తరంగం కంటె ఎక్కువ తరచుదనం (పౌనఃపున్యం) తో కంపించే తరంగం;
- overture, n. (1) పూర్వరంగం; (2) ఆరంభవాద్యం; సంగీత సభలలో ఉపోద్ఘాతంగా వాడే సంగీతం; (3) స్నేహభావాన్ని ప్రదర్శించడం;
- overturn, v. t. (1) తలకిందులు చేయు; బోల్తా కొట్టించు; (2) దిగువ కోర్టులో చేసిన తీర్మానాన్ని ఎగువ కోర్టువారు కొట్టివేయు;
- overview, n. పర్యావలోకనం; విహంగావలోకనం;
- overwhelming, adj. అతిశయించిన;
- overwhelming response, ph. అతిశయించిన స్పందన;
- oviduct, n. అండవాహిక;
- oviform, adj. అండాకార;
- Ovoviviparous, adj. అండజ సజీవ సంతానోత్పత్తి; తల్లి కడుపులో ముందు అండం ఏర్పడి, ఆపైన అక్కడే బాగా అభివృద్ధి చెంది లార్వా, లేదా ఆపై దశల్లో తల్లి కడుపులోంచి బయటకు రావటం ఇందులో కనపడుతుంది.
- ovoparous, adj. అండజమైన; గుడ్డులోంచి పుట్టిన; ovum అనేది అండం. గుడ్లుగా తల్లి కడుపులోంచి బయటకు తెచ్చి వదిలేస్తే, వాటిని మరలా పొదిగితేనే పిల్లలు అవుతాయి. అంటే సగం అభివృద్ధి మాత్రమె తల్లి కడుపులో జరుగుతుంది.
- ovulation, n. అండోత్సర్గం;
- ovum, n. స్త్రీబీజం; అండం; శోణితం;
- owing to, prep. వల్ల; నుంచి;
- owl, n. గుడ్లగూబ; పులుగుపిట్ట; ఘూకం; ఉలూకం; దివాంధం; వాయసారాతి; వాయసారి; ధ్వాంక్షారాతి; పేచకం;
- owlet, n. గుడ్లగూబ పిల్ల;
- own, adj. స్వంత; ఖాసా; కాసా;
- owner, n. స్వామి; కామందు; యజమాని; స్వంతదారు; సొంతదారు; పట్టాదారు;
- ownership, n.స్వంతం; హక్కు; స్వామ్యం; స్వామిత్వం;
- ox, n. s. ఎద్దు; గిత్త; వృషభం;
- oxen, n. pl. ఎడ్లు; గిత్తలు;
- oxidation, n. భస్మీకరణం; ఉపచయం;
- exothermic oxidation, ph. ఉష్ణమోచక భస్మీకరణ;
- oxidant, n. భస్మీకరి; భస్మం చేసేది;
- antioxidant, n. ప్రతిభస్మీకరి;
- oxide, n. ఆమ్లజనితో సంయోగం చెందగా వచ్చిన తుప్పు;
- ox gall, n. గోరోచనం;
- oxy-acetylene, n. ఆమ్లవిదీను;
- oxy-acetylene torch, ph. ఆమ్లవిదీను దివ్వె; ఈ రకం దివ్వెతో ఉక్కుని సునాయాసంగా కోయవచ్చు;
- Oxygen, n. ఆమ్లజని; ప్రాణవాయువు; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు; (అణుసంఖ్య 8, సంక్షిప్త నామం O)
- oxymoron, n. విరుద్ధోక్తి; విరోధాభాసాలంకారం; నిందాస్తుతి; సంసృష్టి; రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం; ఉ. మా చెడ్డ మంచోడు;
- oxide, n. భస్మం;
- oyster, n. సీపి; గుల్లచేప; ఆల్చిప్ప;
- ozone, n. ఓజోన్. మూడు ఆమ్లజని అణువులతో కూడిన బణువు; Ozone is an odorless, colorless gas made up of three oxygen molecules (O3) and is a natural part of the environment;
- ozone layer, n. ఓజోను పొర; అంతరిక్షం నుండి హాని చేసే కిరణాలు భూమిని సోకకుండా ఆపు చేసే వాయువుల పొర;
|
|