This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as an added feature.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
Part 1: Pa-Pi
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
pace, n. (1) అంగ; (2) జోరు; వేగం; గతి;
pachyderm, n. మందమైన చర్మం గల జంతువు; ఏనుగు; ఖడ్గమృగం;
pacifier, n. m. పాలతిత్తి; పాలపీక; పసిపిల్లలని శాంతింపజేయడానికి నోట్లో పెట్టే తిత్తి;
pacifist, n. శాంతికాముకుడు; యుద్ధ వ్యతిరేకి;
pacify, v. t. శాంతింపజేయు; సమాధానపరచు;
pack, n. (1) పొట్లం; పెట్టె; (2) ముఠా; గుంపు;
pack of cigarettes, ph. సిగరెట్టు పెట్టె;
pack of thieves, ph. దొంగల ముఠా;
pack of wolves, ph. తోడేళ్ల గుంపు; తోడేళ్ల తండా;
package, n. బంగీ; కట్ట;
pack-animal, n. బరువులు మోసే జంతువు; గాడిద; కంచర గాడిద, ఎద్దు, మొ.
packet, n. చిన్నబంగీ; పెద్ద పొట్లం;
small packet, ph. పొట్లం;
pack-horse, n. కంట్లపు గుర్రం; పెరికె గుర్రం;
pack-saddle, n. గంత; జీను;
pact, n. ఒప్పందం; ఒడంబడిక; కరారు;
pad, n. ఒత్తు; మెత్త;
padlock, n. బీగం; కప్ప; తాళం కప్ప;
paddle, n. తెడ్డు; క్షేపణి;
paddy, n. (1) వడ్లు; వరి; ధాన్యం; శాలి; (2) వరి పండే పొలం;
hulled paddy, ph. దంపుడు బియ్యం;
rice paddy, ph. మడి; వరి మడి;
pagan, n. 1. క్రైస్తవమతేతరుడు; ఏ మతం లేని వ్యక్తి; క్రైస్తవుల, యూదుల, ముసల్మానుల సమష్టి దృష్టిలో వారి మతం కానివాళ్ళంతా ఏ మతం లేని వాళ్ళ కిందే లెక్క; 2. ధర్మాన్ని అతిక్రమించే వ్యక్తి; అనాగరికుడు; 3. బహుదేవతారాధకుడు; మత వ్యతిరేకవాది;
page, v. t. పిలుచు;
page, n. (1) పుట; పేజీ; (2) పిలుపు; (3) సేవకుడు;
pageant, n. ఉత్సవం;
pageantry, n. ఉత్సవం; సమారోహం; సంబరం; సోకులయెన్నిక;
pager, n. పిలచే సాధనం; పిలపరి;
paid, pt. & pp. of pay;
pail, n. బొక్కెన; బాల్చీ; చెంబు; ముంత;
pain, n. నొప్పి; పీకు; తీపు; బాధ; సలుపు; కంటకం; అకము; వేదన; దూకలి; శూల; (note) sharp ache is pain; dull pain is ache;
menstrual pain, రుతుశూల;
sharp pain, శూల;
shooting pain, పోటు; శూల;
throbbing pain, తీపు; సలుపు;
pain threshold, ph. మనం ఏ స్థాయి (క్షణం) నుంచీ బాధ గమనించడం మొదలు పెడతామో దాన్ని pain threshold అంటారు.
pain tolerance, ph. ఏ స్థాయి వరకూ బాధ భరించగలమో దాన్ని pain tolerance అంటారు. ఈ హద్దు దాటుతే అరవటం, ఏడవటం మొదలైనవి చేస్తాo.
painless, adj. నొప్పిలేని; నిష్కంటక; నాక; (ety.) నా + అక; నిరుపహతి (నిర్ + ఉపహతి = ప్రమాదం లేని);
paint, n. (1) లేపనం; (2) వెల్ల; రంగు; బచ్చెన;
paint, v. t. (1) చిత్రించు; (2) రంగులు వేయు;
painted, adj. బచ్చెన;
painter, n. (1) ) m. చిత్రకారుడు; f. చిత్రకారిణి; (2) గోడలకి రంగులు వేసే వ్యక్తి; m. రంజకుడు; f. రంజకి;
painting, n. (1) వర్ణచిత్రం; చిత్తరువు; (2) చిత్రలేఖనం;
paleobotany, n. పురా వృక్షశాస్త్రం; పురాతన కాలంలో బతికిన చెట్లని, వాటి శిలాస్థుల ద్వారా గుర్తించి, అధ్యయనం చెయ్యడం;
paleontology, n. (Br.) paleontology; పురాజీవ శాస్త్రం; ప్రాక్తన శాస్త్రం; లుప్త జంతు శాస్త్రం; శిలాజాలను గురించి చదివే శాస్త్రాన్ని శిలాజ శాస్త్రం అంటారు; మరణించిన జీవులు శిలాజాలుగా మారే ప్రక్రియల గురించి తెలియజేసే శాస్త్రాన్ని 'Taphonomy' అంటారు.
Micro-Palaeontology, ph. పెద్ద జీవులే కాకుండా సూక్ష్మ జీవుల మూలంగా తయారయ్యే శిలాజాలను అధ్యయనం చేసే శాస్త్రం కూడా ఉంది. దాన్ని సూక్ష్మ శిలాజ శాస్త్రం అంటారు;
paleolithic era, ph పురాతన రాతియుగం;
paleozoic era, ph. పురాతన జీవయుగం;
palimony, n. వివాహ బంధం లేకుండా ఇద్దరు కొన్నాళ్లు కాపురం పెట్టిన తరువాత విడిపోయినప్పుడు ఒకరు మరొకరికి ఇచ్చే భరణం;
palindrome, n. కచికపదం; కచిక; భ్రమకం; అనులోమ విలోమాలు; ఎటునుండి చదివినా ఒకే మాట వచ్చే పదాలు, పాదాలు, పద్యాలు, మొ.; ఉ. వికటకవి;
word palindrome, ph. కచికపదం; పద భ్రమకం:
line palindrome, ph. పాద భ్రమకం; ఎటునుండి చదివినా ఒకే పంక్తి లేదా పద్యపాదం వచ్చే అమరిక;
stanza palindrome, ph. పద్య భ్రమకం: ఎటునుండి చదివినా ఒకే పద్యం అమరిక;
Palladium, n. పెల్లేడియం; పల్లాదం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 46, సంక్షిప్త నామం, Pd); [Gr. Pallas = goddess of wisdom];
palliative, n. ఉపశమనకారి; ఉపశాంతిని ఇచ్చేది;
pallid, adj. పాలిపోయిన; వెలవెలబోయిన;
pallor, n. పాలిపోయిన రంగు;
palm, n. (పామ్) (1) అరచేయి; చేర; కరతలం; (2) తాళద్రుమం; తాళవృక్షం; (3) తాటి, ఈత, కొబ్బరి, జీలుగ, పోక (వక్క) మొదలైన చెట్లు పామ్ (Palm) తరహాకు చెందినవే;
palm oils, ph. (1) తాళ తైలాలు; oil palm, [bot.] Elaeis guineensis of the Arecaceae family is cultivated tree for producing edible palm oil; (2) కొబ్బరి మొదలైన నూనెలు;
Areca Palm, ph. గోల్డెన్ కేన్ పామ్ (Golden cane palm); ఎల్లో పామ్ (Yellow palm ); బటర్ ఫ్లయ్ పామ్ (Butterfly palm); [bot.] Dypsis lutescens; Chrysalidocarpus lutescens of the Arecaceae family; ల్యూటెసెన్స్ అంటే పసుపువన్నె వృక్షం అని అర్థం;
Betelnut palm, ph. [bot.] Areca catechu;
Fan Palm, ph. [same as] Talipot Palm;
Talipot Palm, ph. తాళపత్ర వృక్షం; సీమ తాడి; శ్రీతాళము; [bot.] Corypha umbraculifera of the Arecaceae family; ఈ వృక్షం మాత్రం నలభై, యాభై సంవత్సరాలు పెరిగి, జీవితంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతుంది. ఇలాంటి వృక్షాలను వృక్షశాస్త్ర పరిభాషలో మోనోకార్పిక్ (Monocarpic) వృక్షాలంటారు. సెంచరీ ప్లాంట్స్ (Century Plants) పేరిట ప్రసిద్ధమైన యాస్పరాగేసీ (Asparagaceae) కుటుంబానికి చెందిన ఎగేవ్ అమెరికానా (Agave americana) మొక్కలు, చాగ నార, కలబంద తరహాకు చెందిన కొన్ని ఇతర మొక్కలు కూడా ఇలాగే జీవితకాలంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతాయి; ఈ సీమ తాడి వృక్షం పూలలో ఒకే పువ్వు మీద స్త్రీ, మరియు పురుష జననాంగాలు రెండూ ఉంటాయి. ఇలాంటి పూవుల్ని Bisexual Flowers అంటారు. కాయలు చిన్నవిగా, గుండ్రంగా మూడు లేక నాలుగు సెంటీమీటర్ల వ్యాసం కలిగి, ఆలివ్ కాయల రంగులో ఉంటాయి.లోపలి గింజలు గుండ్రంగా, నున్నగా మెరుస్తూ, గట్టిగా ఉంటాయి;
palmate, adj. హస్తాకార; అరచేతి ఆకారంలో ఉన్న;
palmar, adj. అరచేతి; కరతలస్థ;
palmful, adj. చేరెడు;
palmistry, n. హస్తసాముద్రికం; చేతిలో రేఖలని బట్టి జాతకం చెప్పే పద్ధతి;
palmitic acid, n. తాళికామ్లం;
palmyrah, n. తాటిచెట్టు;
palpable, adj. ప్రత్యక్షమైన; స్పష్టమైన;
palpable error, ph. పచ్చి తప్పు; శుద్ధ తప్పు;
palpate, v. t. అప్పళించు; నొక్కు; వైద్యుడు పరీక్ష నిమిత్తం నొక్కడం;
palpitation, n. దడ; గుండె దడ; గుండె వడిగా కొట్టుకొనుట;
palpitation, n. గుండె దడ; దడ;
paltry, adj. పిసరంత;
pampas, n. pl. పంపాలు; దక్షిణ అమెరికాలోని విశాలమైన మైదానాలు;
pamphlet, n. కరపత్రం;
pan, pref. అఖిల;
pan American, అఖిల అమెరికా;
pan, n. పెనం; మూకుడు; చట్టి; తప్పేలా;
shallow frying pan, ph. బాణలి;
deep frying pan, ph. మూకుడు; కందువు;
panacea, n. ఉపశమనం;
Panache, n. (1) తురాయి; కలికి తురాయి; (2) ఆత్మ స్థైర్యం;
pancreas, n. క్లోమం; వృక్వకం; స్వాదుపిండం; అగ్నాశయం;
pancreatic juices, ph. క్లోమరసాలు; స్వాదురసాలు;
pandal, n. [Ind. Engl.] పందిరి; డేరా;
pandemic, n. అఖిలమారి; ఎలసోకు (ఎల + సోకు = అందరికీ సోకేది); ప్రపంచమారి = ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని పట్టి పీడించే అంటుజాడ్యం; A pandemic is thought to be a wide geographic spread of a disease on many parts of the world, many continents; see also epidemic and endemic;
pandemonium, n. దొమ్మీ; అల్లకల్లోలం; గలభా; కోలాహలం; నలబలం;
pandiculation, n. (1) ఒళ్లు విరుచుకోవడం; లేవగానే ఒళ్లు విరుచుకోవడం; (2) ఆవలింత;
pane, n. పలక;
glass pane, ph. గాజు పలక;
window pane, ph. కిటికీ పలక;
panentheism, n. జగదతీత దైవభావం; విభుత్వవాదము; ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడనే భావన; సర్వేశ్వరవాదంలోని కొన్ని లోపాలను పూడ్చే ప్రయత్నమే ఇది. "అన్నిట్లో దేవుడు ఉంటాడు, దేవుడులో అన్నీ ఉంటాయి" అన్నది నిజమే కాని దేవుడు ఇంతవరకే పరిమితం కాదు. సమస్త సృష్టి దేవుడులోనే ఉంది కానీ మొత్తం దేవుడు సృష్టికి పరిమితం కాదు. పోలుస్తూ చెప్పాలంటే - దేవుడు పెద్ద వృత్తము, ప్రపంచం ఆ వృత్తంలో ఒక చిన్న వృత్తం;
pang, n. వేదన; నొప్పి;
panhandler, n. ముష్టివాడు; ముష్టిది; తిరిపెం:
panic, n. భయాందోళన; కంగారు; గాభరా;
panorama, n. విశాల దృశ్యం; విస్తృత దృశ్యం; దృగావరణం;
panoramic view, ph. దిగ్దర్శక దృశ్యం; విస్తృత దృశ్యం;
panpsychism, n. సర్వాత్మ సిద్ధాంతం; విశ్వమంతా ఆత్మల సముచ్ఛయం అనే సిద్ధాంతం;
pant, v. i. ఎగరొప్పు; రొప్పు; ఒగర్చు;
pantheism, n. సర్వేశ్వరవాదం; జగదభిన్న దైవభావం; భగవంతుడిలోనే అంతా ఉంది అనే భావన; దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు అనే నమ్మకం; విశ్వస్వరూపమే విష్ణుస్వరూపం: 'అన్నిట్లో దేవుడు, దేవుడులో అన్నీ'. భగవత్గీతలోని వాక్యం ఈ వాదాన్ని తేటతెల్లం చేస్తుంది: "ఎవరైతే నన్ను అన్నిట్లో(అన్నీ చోట్ల) చూస్తాడో, ఎవరైతే నా లో అన్నీ చూస్తాడో, అటువంటి వాడికి నేను ఎప్పుడూ దూరం కాను, వాడు నాకెప్పుడూ దూరం కాడు." దేవుడు ఈ సృష్టి మొత్తంలో అంతర్వ్యాప్తమై ఉంటాడు. తూర్పులో ఆది శంకరాచార్యులు వంటి తత్వవేత్తలు, పశ్చిమాన బరూక్ స్పినోజ(Baruch Spinoza) వంటి వారు సర్వేశ్వరవాదులే;
pantheon, n. దేవుళ్ళు; దేవగణాలు; సకల దేవ సమూహం; అఖిల దేవతా గణం;
panther, n. కిరుబా;
black panther, ph. కరి కిరుబా;
Himalayan panther, ph. హిమ కిరుబా; snow leopard;
pantomime, n. అభినయం; మూకాభినయం; నటీనటులు మాట్లాడకుండా హావభావాలతో ప్రదర్శించే నాటకం;
pantry, n. ఉగ్రాణం; వంట వార్పులకి అవసరమైన దినిసులని దాచుకునే గది;
pants, n. pl. పంట్లాం; షరాయి;
pantomime, n. తమాషా; వేడుక;
pantry, n. ఉగ్రాణం; కొట్టుగది; వంట ఇంటికి ఆనుకుని ఉన్న కొట్టుగది;
pap, n. ఓదనం; దుఃఖంలో గాని భయంలో గాని ఉన్న ఒకరిని ఓదార్చడానికి వీఁపు నిమిరుట లేదా వెన్నుదట్టుట;
papa, n. అయ్య; అప్ప; నాన్న; తండ్రి;
papal, adj. పోపుకి సంబంధించిన; రోమన్ కేథలిక్ మతాధికారి అయున పోపుకి సంబంధించిన;
papaya, n. బొప్పాయి; పరంగి కాయ; పరింది; మదనానప కాయ;
paper, n. కాగితం; పత్రిక; పత్రం; కాకలం; పేపరు;
newspaper, n. వార్తాపత్రిక; పేపరు;
blank paper, ph. తెల్ల కాగితం; అలేఖం;
onionskin paper, ph. ఉల్లిపొర కాగితం;
question paper, ph. ప్రశ్న పత్రం;
tracing paper, ph.ఉల్లిపొర కాగితం;
tissue paper, ph. మృదువైన పల్చటి కాగితం;
white paper, ph. తెల్ల కాగితం; అలేఖం; శ్వేత పత్రం;
papilla, n. సూక్ష్మాంకురం;
paprika, n. ఒక రకం కారం లేని తియ్య, ఎండు మిరపకాయల పొడి; see also chilli and capsicum;
parable, n. దృష్టాంతం; ఉదాహరణ; నీతిబోధ; దృష్టాంత కథ; నీతి కథ; ఈ కథలలో సాధారణంగా మానవ్ పాత్రలే ఉంటాయి; see also fable;
parabola, n. అనువృత్తం; పరవలయం;
parachute, n. గాలిగొడుగు; మరోగుమ్మటం; పేరాషూట్;
parade, n. ఊరేగింపు; ఖురళి; ఖళూరిక;
paradigm, n. విశ్వవీక్షణం; రూపావళి; లక్షణసముదాయం; అందరూ ఒప్పుకున్న సమష్టిస్వీకరణలు (shared assumptions) “పేరడైమ్” అని థామస్ కూన్ (Thomas Kuhn)అంటాడు.
paradigm shift, ph. విశ్వవీక్షణ విస్థాపనం; ఒక రూపావళికున్న విశ్వాసం, ఆధీనతల నుంచి మరొక రూపావళి విశ్వాసానికి బదిలీ కావటం మతపరివర్తనానుభవం (religious conversion experience) లాంటిది. అయితే, ఇది బలవంతంగా జరిగేది మాత్రం కాదు.
paradise, n. పరంధామం; స్వర్గధామం; స్వర్గం; స్వర్గలోకం; నాకం; నాకలోకం; దివి; భోగభూమి;
paradox, n. సత్యాభాసం; విరుద్ధోక్తి; విపర్యోక్తి; విరోధాభాసం; విరుద్ధమైన అభిప్రాయాలని ఒకే సందర్భంలో ఇరికించి చెప్పే ఉక్తి; ఉ. నీటిలో రాసిన మాటలు ఎన్నటికీ చెరిగిపోవు;
paraffin wax, n. రాతిమైనం; తెల్లమైనం; (ety.) [Lat. para + oleffin = paraffin = another type of fat]; [Gr. parum + affin = paraffin = one with little affection]; (note). bee's wax is slightly yellow in color;
paragraph, n. అనువాకం; పేరా; పేరాగ్రాఫు; (rel.) విభాగం; పరిచ్ఛేదం;
paragon, n. ఆదర్శప్రాయమైనది; ఆదర్శం;
paraldehyde, n. పరాలంతం; ఎసిటాల్డిహైడ్ కి "త్రిమూర్తి" రూపం; C6H12O3; (lit.) మరొక రకం అలంతం;
parallax, n. దృక్ఛాయ; కోణభ్రంశం; దృష్టిభేదం; లంబనం; దూరములో ఉన్న వస్తువుని చూసినప్పుడు మన కదలిక వల్ల కోణములో కనిపించే మార్పు;
parallelogram, n. సమాంతర చతుర్భుజం; రెండు ఎదురెదురు భుజాలు సЮాంతరంగా ఉన్న చతుర్భుజం;
paralysis, n. పక్షపాతం; కుణి జబ్బు;
paralyze, v. t. (1) స్తంభింపజేయు; అశక్తం చేయు; (2) పక్షవాతం కలుగజేయు;
parameter, n. (1) హద్దు; అవధి; (2) [math.] పరాంకం; పరరాసి; పరామితి; పరామాత్ర; మరొక కొలత; పరామీటరు; గణితంలో వచ్చే చలన రాసి కాక మరొక రాసి; (ety.) para = another; by the side of; metron = measurement; (rel.) స్థిరాంకం;
paramilitary, n. మరొక రకం సైన్యం;
paramount, adj. పరమ; సర్వోత్కృష్టమైన;
paramour, n. ఉపపతి; a second (secret) husband;
paranoia, n. ఇతరులు తనకి హాని చేద్దామని అనుకుంటున్నారనే ఆధారం లేని నమ్మకం;
paranormal, adj. అసాధారణమైన;
parapet wall, n. పిట్టగోడ;
paraphernalia, n. సరంజామా; సాధన సంపత్తి; హంగులు; హంగూ, ఆర్భాటం;
paraphrase, n. దండాన్వయం; భావానువాదం; మరొకరకం మాటలతో రాసిన అన్వయం;
parasite, n. ఉపజీవి; పరభాగ్యోపజీవి; పరాన్నభుక్కి; పరభుక్కి; పరాన్నజీవి; see also predator;
parasol, n. అరిగె; ఛత్రం; చిన్న గొడుగు; ఎండ గొడుగు; ఆతపత్రం; రాజుల సింహాసనాల మీద, దేవుడి విగ్రహాల దగ్గర అలంకారానికి వాడే గొడుగు;
parapsychology, n. అతీత మనస్తత్వ శాస్త్రం; మరొక రకం మనస్తత్వ శాస్త్రం; అసహజ/ అసాధారణ ఇంద్రియ సామర్థ్యాల వలన జరిగిన సంఘటనలను, అటువంటి దృగ్విషయాలను - వాటి ఉనికిని - సామర్ధ్యాల స్వభావాన్ని పరిశోధించడం, అధ్యయనం చేయటమే పారాసైకాలజీ ఉద్దేశం;
paratyphoid, n. అతీత టైఫాయిడ్; మరొక రకం టైఫాయిడ్;
parboiled, adj. కొద్దిగా ఉడికించిన; సగం ఉడికిన;
parboiled rice, ph. ఉప్పుడు బియ్యం; Rice kernels from summer crop paddy tend to break during hulling; to prevent this, paddy is sometimes boiled partially before de-husking;
parcel, n. బంగీ; కట్ట; మూట; పార్సెలు;
parcener, n. దాయాది; a person who takes an equal share with another or others; coheir. Also called: coparcener;
parenthesis, n. s. కుండలీకరణం; వృత్తార్ధం; చిప్పగుర్తు; చిప్ప;
parentheses, n. pl. కుండలికరణాలు; వృత్తార్ధాలు; చిప్పగుర్తులు; చిప్పలు;
parents, n. pl. తల్లిదండ్రులు; మాతాపితలు; జననీజనకులు;
pariah, n. (పరయ్యా) వెలివేయబడ్డ వ్యక్తి; బహిష్కృతుడు; చండాలుడు;
parietal bone, n. సీమంతాస్థి;
parity, n. తుల్యత; సమత్వం;
parity bit, [comp.] ph. తుల్యతా ద్వింకం;
park, n. వనం; ఉపవనం; ఉద్యానవనం; ఎలదోట;
parliament, n. శాసన సభ; అంటే లోక్‌సభ, రాజ్యసభ, రాష్టప్రతుల సముదాయం;
lower house of the Indian parliament, ph. లోక్‌సభ;
upper house of the Indian parliament, ph. రాజ్యసభ;
parochial, adj. సంకుచిత; ప్రాంతీయ;
parochial school, ph. సంకుచిత దృక్పథం ఉన్న పాఠశాల; ప్రాంతీయ దృక్పథంతో నడిపే పాఠశాల; ఉ. కేథలిక్ చర్చి నడిపే పాఠశాల;
parody, n. హాస్యానుకృతి; వ్యంగ్యానుకరణ; ఎగతాళి;
parrot, n. చిలుక; రామచిలుక; శుకం; కీరం;
parse, v. t. అన్వయించు; అన్వయం చెప్పు; వాక్యంలోని కర్త, కర్మ, క్రియలని విశ్లేషించు; వ్యాకరించు; (rel.) ప్రస్తరించు అంటే గురు లఘువులని గుర్తించి పద్యపాదాన్ని గణ విభజన చేసి విశ్లేషించడం;
parsec, n. 3.26 కాంతి సంవత్సరాల దూరం; 3.086 × 10^13 కిలోమీటర్లు; parallax of one arc second; a unit of distance used in astronomy, equal to about 3.26 light-years (3.086 × 1013 kilometers). One parsec corresponds to the distance at which the mean radius of the earth's orbit subtends an angle of one second of the arc. Or, a parsec is the distance from the Sun to an astronomical object that has a parallax angle of one arcsecond;
parsimonious, adj. మితవ్యయ; ఎక్కువ ఖర్చుకాని; క్లుప్త;
parsimony, n. లోభత్వం; పిసినిగొట్టుతనం; క్లుప్తత్వం;
parsley, n. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా వండిన వంటకాలని అలంకరించడానికి వాడే కొత్తిమిర లాంటి ఆకు పత్రి; [bot.] Petroselinum;
participate, v. t. పాల్గొను; పాలుపంచుకొను; పూనుకొను;
participle, n. క్రియావాచకాన్ని, విశేషణాన్ని పోలిన క్రియాజన్యమైన పదం; ఇంగ్లీషు లో క్రియ చేసేపనినీ, విశేషణం చేసేపనినీ చేసే మాట; దీనిని verbal adjective అని కూడా అంటారు;
passport, n. గుర్తుపొత్తం; ఒక మనిషి ఎవ్వరో నిర్ద్వంద్వంగా గుర్తించడానికి, ఆ వ్యక్తి ఫొటో, పుట్టిన తేదీ, పౌరసత్వం వగైరాలతో ప్రభుత్వం ఇచ్చే చిరుపొత్తం; ఈ పుస్తకం లేకుండా దేశం వదలి ప్రయాణం చెయ్యడం కుదరదు;
past perfect, ph. [gram.] గతంలో జరిగిన రెండు సంఘ్టనల గురించి చెప్పేటప్పుడు, రెండింటిలో ముందు జరిగిన సంఘటనని చెప్పే కాలం; ఉదాహరణకి, "మూర్తి వచ్చేసరికి నేను భోజనం చేసేసేను" అన్న దానిని ఇంగ్లీషులో "I had finished my meal before Murthy came” అన్నప్పుడు "had finished” అన్న పదబంధం past perfect tense లో ఉందన్నమాట; ఈ భావానికి సరితూగే భావం తెలుగు వ్యాకరణంలో లేదు;
pasta, n. సేమ్యాని పోలిన పిండితో చేసిన ఇటలీ దేశపు తినుబండారం; మనకి అన్నం ఎలాగో ఇటలీ వారికి పాస్టా అలాంటిది;
patriarchy, n. m. పితృస్వామ్యం; పితృతంత్రం; పితృ అధికారం;
patricide, n. పితృహత్య; పితృమేధం;
patrimony, n. పిత్రార్జితం;
patriotism, n. దేశభక్తి;
patrol, n. కావలి; గస్తు; పహరా;
foot patrol, ph. కాలి కావలి;
highway patrol, ph. రహదారి కావలి; దారి కావలి దండు;
patrol, v. t. గస్తీతిరుగు; ప్రహరించు; ప్రహరితిరుగు; కాపలా కాయు;
patron, n. m. ఘటకుడు; ప్రాపకుడు; ప్రాపు; పోషకుడు; f. ప్రాపకురాలు;
patronage, n. ప్రాపకం; ప్రాపు; అండ;
patronize, v. i. (1) జాలిపడ్డట్టు నటించడం; ఎదటివాడు అంతటి ముఖ్యుడు కానట్టూ, అంత తెలివైనవాడు కానట్టూ అనిపించేలా ప్రవర్తించడం; అభిమానం ఒలికిపోతున్నట్లు అభినయించడం; (2) రివాజుగా ఒకే వ్యాపార సంస్థకి బేరాలు ఇవ్వడం;
pattern, n. బాణీ; నమూనా; మచ్చు; మాదిరి; ప్రకారం; కైవడి;
plaid pattern, ph. గళ్ళు;
polka dot pattern, ph. చుక్కలు;
striped pattern, ph. చారలు;
paucity, n. సంక్షోభం; ఎద్దడి; దొరకక పోవుట; కొరత; స్వల్పత;
pauper, n. అర్థహీనుడు; బీదవాడు; బికారి; దరిద్రుడు; నిరాధారి; అకించనుడు;
---Pay is the general word for money that someone gets for doing work. Income is the money you receive from any source: an investment income. A salary is what professional people get, for their services, every year: What is the yearly salary for a professor? A wage is the pay that someone earns every hour or every week.
pay, v. t. చెల్లించు; కట్టు; ఇచ్చు; తీర్చు;
payee, n. గ్రహీత; సొమ్ము పుచ్చుకొనేవాడు;
payer, n. దాయకుడు; దాత; సొమ్ము ఇచ్చేవాడు;
payment, n. చెల్లింపు;
pea, n. బటానీ గింజ;
cooked peas, ph. పప్పు; ముద్దపప్పు; సూపం;
field pea, ph. పొలాల్లో పండే బటానీ, [bot.] Pisum sativum;
garden pea, ph. తోట బటానీ, [bot.] Pisum hartense;
pigeon peas, ph. కందులు;
snow peas, ph. ??
split peas, ph. బటానీ పప్పు;
split pigeon peas, ph. కందిపప్పు;
peace, n. శాంతి; శాంతం;
peaceful, n. ప్రశాంతము;
peacefully, adv. శాంతియుతంగా;
peacock, n. m. నెమలి; నెమలిపుంజు; మయూరం; శిఖి; కేకి; నీలకంఠం;
perennial plants, ph. మూడు-నాలుగు ఏళ్లు బతికే మొక్కలు; Perennials are plants that can live for three or more growing seasons; see also annual plants;
perennial rivers, ph. జీవనదులు; సంవత్సరం పొడుగునా ప్రవహించే నదులు;
perfect, adj. పూర్ణ; పరిపూర్ణ; బ్రహ్మాండ; సమగ్ర;
perfect number, ph. [math.] పరిపూర్ణ సంఖ్య; according to number theory, the number 6 is a perfect number because it can be expressed as the sum of its factors, namely 1, 2 and 3. Similarly, the number 28 is also a perfect number, because 28 = 1+2+4+7+14;
periastron, n. నక్షత్రసమీప బిందువు; నక్షత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేసే గ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, నక్షత్రానికి) అత్యంత సమీపంలో ఉన్న బిందువు; the point nearest to a star in the path of a body orbiting that star;
perigee, n. పరిజ్యము; భూసమీప బిందువు; భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఉపగ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, భూమికి) అత్యంత సమీపంలో ఉన్న బిందువు; సూర్యుడి చుట్టూ తిరిగే శాల్తీల విషయంలో ఈ మాట కి బదులు perihelion అన్న మాట వాడతారు; (ant.) apogee;
perihelion, n. పరిహేళి; రవిసమీప బిందువు;
peril, n. ప్రమాదం; విపత్తు; ఆపద; బారి; ఉపద్రవం; గండం; సంకటం;
mortal peril, ph. ప్రాణ సంకటం;
perilous, adj. విపత్కర;
perimeter, n. చుట్టు ఉండే అవధి; కైవారం; చుట్టుకొలత;
period, n. (1) బిందువు; వాక్యం చివర వచ్చే బిందువు; (2) ఆవర్తన కాలం; ఆవర్తి; గచ్ఛాంకం; (3) కాలం; వ్యవధి; గడువు; సేపు; (4) సమయం; దశ; కాలాంశ; (5) బహిష్టు అయే వేళ;
permeability, n. (1) ప్రవేశ్య శీలత; ప్రవేశ్యత; పారగమ్యత; వ్యాప్తి; భేద్యత; చొరనిచ్చెడు గుణము; ద్రవాలని కాని, వాయువులని గాని ఒక పదార్థం తన గుండా చొరనిచ్చెడి గుణం; (2) అయస్కాంత ప్రవాహాన్ని తనగుండా పారనిచ్చే లక్షణం; దీనిని గ్రీకు అక్షరం 'మ్యు" తో సూచిస్తారు; (see also) permittivity;
permeable, adj. పారగమ్య;
permeable rock, ph. పారగమ్య శిల;
permission, n. అనుమతి; ఆనతి; అంగీకారం; అనుమోదం; సెలవు;
permit, n. అనుమతి పత్రం; అంగీకార పత్రం; ఫర్మానా చీటీ; ఒప్పునామా; సరాటిక; పెర్మిట్;
permit, v. t. అనుమతించు; ఉత్తరువు ఇచ్చు; అనుజ్ఞ ఇచ్చు;
permittivity, n. ఒక మాధ్యమం తనలో విద్యుత్ తలీకరణాన్ని ప్రోత్సహించే లక్షణం; దీనిని గ్రీకు అక్షరం 'ఎప్సిలాన్" తో సూచిస్తారు; (see also) permeability;
permutation, n. క్రమవర్తనం; క్రమచయనం; ప్రస్తారము; ప్రస్తారణ; వినిమయం; ఫిరాయింపు; తారుమారు; ఒక వస్తు సముదాయపు వరుస క్రమాన్ని తారుమారు చెయ్యడం;
permutation and combination, ph. క్రమవర్తనం, క్రమసంచయం; క్రమవర్తన క్రమసంచయాలు;
permute, v. t. ప్రస్తారించు; తారుమారు చేయు;
pernicious, adj. ప్రమాదకరమైన; అతి హానికరమైన; ప్రాణాంతకమైన;
personification, n. (1) మూర్తి; (2)మూర్తిమత్వారోపణ; జీవం లేని వస్తువుకి చైతన్యం ఆపాదిస్తూ చెప్పే అలంకారం;
personify, v. i. మూర్తీభవించు;
personnel, n. సిబ్బంది; పనివారు; పని చేసేవారు; ఉద్యోగస్తులు;
perspective, n. దృక్కోణం; దృక్పధం; కనురోక;
perspiration, n. చెమట; స్వేదం; స్వేదజలం; స్వేదోదకం; ఘర్మజలం;
persuade, v. t. ఒప్పించు; నచ్చజెప్పు;
pertinent, adj. సందర్భోచితమైన;
perturbation, n. జూక; వైకల్యం; కొందలం; ఉత్తలపాటు; పల్లటం; [music] సంగతి;
pertussis, n. కోరింత దగ్గు; whooping cough; a disease caused by the bacterium Bordetella pertussis (Haemophilus p.) which triggers the accumulation of thick, sticky mucus in the windpipe; this bacterium makes at least nine different proteins, thus making it difficult to develop a vaccine;
pervasive, adj. అభివ్యాపకమైన; వ్యాప్తి చెందే;
pervert, n. విపరీత బుద్ధులు కల వ్యక్తి;
periwinkle, n. బిళ్లగన్నేరు పూవు; [bot.] Catharanthus roseus;
pewter, n. సత్తు; తగరం (85% - 99%) తో సీసాన్ని కాని, రాగిని కాని కలపగా వచ్చిన మిశ్రమలోహం; అప్పుడప్పుడు నీలాంజనం (ఏంటిమొనీ), బిస్మత్ లు కూడా కలుపుతారు; మిశ్రమంలో ఉన్న మూలకాల పాళ్ళని బట్టి ఇది తక్కువ తాపోగ్రత మూస:Convert/C వద్ద కరిగిపోతుంది; పూర్వం సత్తు గిన్నెలని చారు కాచడానికి విరివిగా వాడేవారు; ఇటీవలి కాలంలో వంట పాత్రల తయారీలో సీసాన్ని వాడడం నిషేధించేరు;
phagocytes, n. కణభక్షకులు; భక్షక కణములు; రక్తంలోని తెల్ల కణములు ఈ భక్షక కణముల జాతివి;
phallus, n. లింగం; లింగానికి ప్రతిరూపమైన విగ్రహం; శివలింగం వంటి ఆకారం;
phallus of mercury, ph. రసలింగం;
pharmaceutical, adj. ఔషధీయ; ఔషధ;
pharmaceutical chemistry, ph. ఔషధ రసాయనం;
pharmacist, n. అగదంకారుడు; మందులు కలిపే వ్యక్తి;
pharmacology, n. ఔషధ శాస్త్రం;
pharmacopeia, n. ఔషధ సంగ్రహం; ఔషధ కోశం; భేషజకల్పసూత్ర సంహితం; మందులు, మందుల తయారీలలో వాడే పదార్థాలూ, వీటికి సంబంధిత లక్షణాలూ, గుణాలు, నికార్సైన పేర్లూ, పరీక్షలు, పరీక్షా పద్ధతులు నిర్వచించి వెలువడే గ్రంథం; an official publication, containing a list of medicinal drugs with their effects and directions for their use.
pharmacy, n. దవాఖానా; ఔషధశాల; మందులని అమ్మే స్థలం; మందుల కొట్టు;
pharynx, n. సప్తపథ; గొంతుకలోని కండరాల కట్టడం;
phase, n. దశ; కళ; దఫా; ఘట్టం; ఒక ఆవర్తన ప్రమేయంలో ఒక మూల బిందువు నుండి ప్రస్తుతం ఉన్న బిందువు దగ్గరకి ఉన్న దూరం;
phase velocity, ph. [phys.] దశ వేగం; ఉదా: సైను ప్రమేయంలో ఈదో ఒక నిర్దిష్టమైన బిందువు, మచ్చుకి శిఖ, ఎంత జోరుగా కదులుతున్నాదో చెప్పే వేగం;
phases, n.pl. కళలు; దశలు;
meta phases, ph. మధ్యదశ; కణ విభజనలో మధ్య దశ;
pro phases, ph. తొలిదశ; కణ విభజనలో తొలి దశ;
telo phases, ph. అంత్యదశ; కణ విభజనలో అంత్య దశ;
phases of the moon, ph. చంద్ర కళలు;
Phenolphthalein, n. C20 H14O4; ఒక పదార్థము యొక్క గుణము క్షారమా, ఆమ్లమా అని నిర్ధారించడానికి వాడే రసాయనం;
phenomenon, n. దృగ్విషయం; దృగంశం; ఆదిభౌతికం; జ్ఞానేంద్రియాలతో గ్రహించి మాటలతో వర్ణించగలిగే ప్రకృతి సంభవమైన విషయం; ఉ. సూర్యగ్రహణం; ఇంద్రధనుస్సు మొ.
phenotype, n. the set of genetic instructions carried by a gene that were translated into the actual physical manifestations; see also genotype;
phil, pref. [Grk.] ప్రేమ; ఆసక్తి; అభిరుచి;
philanderer, n. అనేక స్త్రీలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్న వ్యక్తి; స్త్రీలోలుడు;
philatelist, n. తపాలా బిళ్లలని సేకరించే వ్యక్తి; తపాలా బిళ్లల మీద ప్రేమ;
philanthropist, n. దాత; లోకోపకారి; (ety.) philein అంటే ప్రేమించడం; anthropos అంటే మనిషి; సాటి మనిషిని ప్రేమించే వ్యక్తి అని అర్థం;
philanthropy, n. దాతృత్వం; దానశీలత;
philology, n. భాషాశాస్త్రం; శబ్దశాస్త్రం; లక్షణశాస్త్రం; భాష మీద ప్రేమ;
philosopher, n. తత్త్వవేత్త; తాత్త్వికుడు; దార్శనికుడు; వేదాంతి;
idealist philosopher, ph. భావవాద తాత్వికుడు;
philosopher's stone, n. స్పర్శవేది; పరసువేది; నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాయి; ఇటువంటి రాయి ఇంతవరకు ఎవ్వరికీ తారసపడలేదు;
philosophy, n. తత్త్వశాస్త్రం; తత్త్వం; జ్ఞానతృష్ణ; the study of the fundamental nature of knowledge, reality, and existence, especially when considered as an academic discipline; (see also) metaphysics;
analytic philosophy, ph. తర్క మీమాంశ;
natural philosophy, ph. భౌతిక శాస్త్రం;
Vedantic philosophy, ph. వేదాంత తత్త్వం;
philosophical, adj. తత్త్వ; దార్శనిక;
phlebitis, n. ధమనుల వాపు; ధమని శోఫ;
phlegm, n. (ఫ్లెమ్) శ్లేష్మం; కఫం; తెమడ; కళ్ల;
thick phlegm, ph. కళ్ల;
phobia, n. భయం; జడుపు; అర్థంలేని భయం; మానసిక బలహీనత;
acrophobia, n. ఎత్తు ప్రదేశాలంటే భయం;
ophidiophobia, n. అహిభయం; సర్ప భయం; పాము అంటే భయం;
anthropophobia, n. మనుషులంటే భయం;
aquaphobia, n. నీళ్లంటే భయం; జలజడుపు;
arachnophobia, n. సాలెపురుగులంటే భయం;
arithmophobia, n. లెక్కలంటే భయం:
claustrophobia, n.మూసేసిన స్థలాలంటే భయం;
cynophobia, n. కుక్కలంటే భయం; కుక్కజడుపు;
gephyrophobia, n. వంతెనలంటే భయం;
kleptophobia, n. దొంగలంటే భయం;
musophobia, n. ఎలకలంటే భయం;
nyctophobia, n. చీకటి అంటే భయం;
ochlophobia, n. జనాల గుంపులు అంటే భయం;
ombrophobia, n.వానపిరికి; వర్షం అంటే భయం;
ophidiophobia, n. పాము అంటే భయం;
pathophobia, n. రోగాలంటే భయం;
phasmophobia, n. దయ్యాలంటే భయం;
pyrophobia, n. మంటలు అంటే భయం;
thanatophobia, n. చావు అంటే భయం;
triskaidekaphobia, n. పదమూడు అంటే భయం;
xenophobia, n. కొత్తవాళ్లు అంటే భయం;
phone, n. (1) శబ్దం; స్వరం; (2) ఫోను; టెలిఫోను;
phoneme, n. వర్ణం; వాక్‌శబ్దం; ప్రాథమిక శబ్దం; హలంతాక్షరం;
phonetician, n. శబ్దశాసనుడు;
phonetic, adj. శబ్దమును అనుసరించెడి;
phonetic script, ph. ధ్వన్య లిపి; శబ్ద లిపి;
phonetic symbol, ph. ధ్వని సంకేతం;
phonetics, n. శిక్షాశాస్త్రం; శబ్దశాస్త్రం;
phonon, n. కంపాణువు; a quasi-particle, analogous to photon, this is a packet of the vibrational energy of a crystal lattice; a "hole" is another example of a quasi-particle that can be used to study the "movement" of the absence of an electron;
phony, adj. నకిలీ; అవాస్తవిక; నిజం కాని;
phonology, n. శబ్ద శాస్త్రం; ఉచ్చారణ శాస్త్రం; ఉచ్చారణ నియమాలని అధ్యయనం చేసే శాస్త్రం;
phosphorescent, adj. స్పురదీప్త; Unlike fluorescence, phosphorescent material does not immediately re-emit the radiation it absorbs. The slower time scales of the re-emission are associated with "forbidden" energy state transitions in quantum mechanics. As these transitions occur very slowly in certain materials, absorbed radiation is re-emitted at a lower intensity for up to several hours after the original excitation. (see also) fluorescent;
Phosphorous, n. భాస్వరం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 15, సంక్షిప్త నామం, Ph); [Gr. phosphoros = giving light];
photo, n. ఫోటో; ఛ్హాయాచిత్రం;
photo, pref. ఫోటో; తేజో; ఛాయా; కాంతి;
photochemical, adj. తేజోరసాయన;
photocopy, n. ఛాయాముద్ర; ఛాయానకలు;
photoelectric effect, ph. తేజోవిద్యుత్ ప్రభావం;
photoelectricity, n. తేజోవిద్యుత్తు;
photograph, n. ఛాయాచిత్రం; ప్రతిచ్ఛాయ; ఫోటో;
photographer, n. ఛాయాచిత్రకారుడు;
photographic, adj. ఛాయాచిత్ర; ప్రతిచ్ఛాయ;
photographic plate, ph. ఛాయాచిత్ర ఫలకం;
photography, n. [cinema] ఛాయాగ్రహణం;
photomultipliers, n. pl. దృశ్యగుణకారులు;
photon, n. ఫోటాను; కాంతికణం; తేజాణువు;
photosphere, n. తేజోవరణం;
photosynthesis, n. రవిసంధానం; కిరణజన్య సంయోగక్రియ; కిరణ సంధానం;
phrase, n. పదబంధం; విస్తృతపదబంధం; క్రియలేని మాటల సముదాయం; పదబంధాలు నాలుగు రకాలు, సమాసం, నుడికారం, శబ్దపల్లవం, నుడికారం;
phylloplane, n. పత్రతలం;
phyllosphere, n. పత్రావరణం; భూతలానికి పైన ఉన్న వృక్షసంబంధమైన, సూక్ష్మజీవుల భుక్తికి అనువిన పదార్థం;
phylum, n. వర్గం; విభాగం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు రెండవ వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom, phylum; class, order, family, genus, and species;
Chordata phylum, ph. సకేరుకాలు; సకేరుక వర్గం; జంతు సామ్రాజ్యంలో వెన్ను వంటి అవయవం ఉన్న జంతువుల వర్గం ;
physical, adj. (1) భౌతిక; ప్రకృతి సంబంధమైన; (2) ఐహిక; శారీరక; కాయ;
physical body, ph. భౌతిక దేహం; భౌతిక కాయం;
physical character, ph. భౌతిక లక్షణం;
physical chemistry, ph. భౌతిక రసాయనం;
physical labor, ph. కాయకష్టం;
physical law, ph. భౌతిక ధర్మం;
physician, n. వైద్యుడు; భిషక్కు;
physics, n. భౌతికశాస్త్రం; ప్రకృతి లక్షణాలని అధ్యయనం చేసే శాస్త్రం;
classical physics, ph. సంప్రదాయక భౌతిక శాస్త్రం;
high-energy physics, ph. జవాతిశయ భౌతికశాస్త్రం;
modern physics, ph. అధునాతన భౌతికశాస్త్రం;
quantum physics, ph. గుళిక భౌతికశాస్త్రం;
physiology, n. శరీర శాస్త్రం; ఇంద్రియ శాస్త్రం; Physiology concentrates on the mechanisms by which the structures and parts of living organisms interact to enable their functions; they concern themselves with how things work;
Plant physiology, ph. వనస్పతింద్రియ శాస్త్రం;
pial, n. అరుగు; తిన్నె; జగిలె; ఇంటి ముందు కూర్చునే తీనె వంటి వసారా;
piazza, n. రచ్చబండ;
pick, v. t. (1) ఏరు; ఎంచు; ఎన్నిక చేయు; కోయు; (2) పొడుచు; గొలుకు;
pick axe, n. గడ్డపలుగు; గడ్డపార; పికాసి; గుద్దలి;
picketing, n. ధర్నా; పికెటింగు;
pickle, n. ఊరుగాయ; అవదంశం; ఉపదంశం;
pickled, adj. ఊరబెట్టిన; భావన;
pickled cumin, ph. భావన జీలకర్ర;
pickled ginger, ph. భావన అల్లం;
pickling, n. ఊరబెట్టడం; భావన చెయ్యడం;
pickpocket, n. జేబుదొంగ; కత్తెరదొంగ; ఎత్తుబరిగాడు;
picnic, n. వనభోజనం; వినోదయాత్ర; పిక్‌నిక్;
pictograph, n. (1) చిత్రలిపి; a pictorial symbol for a word or phrase. Pictographs were used as the earliest known form of writing, examples having been discovered in Egypt and Mesopotamia from before 3000 BC; (2) a pictorial representation of statistics on a chart, graph, or computer screen;
pictographic symbol, ph. చిత్ర సంకేతం;
picture, n. బొమ్మ; చిత్రం; చిత్తరువు;
piece, n. (1) ముక్క; ఖండం; తునక; తుత్తునియ; శకలం; నుగ్గు; (2) కాయ; పిక్క; పావు; ఆటలలో వాడే పిక్క; (3) ఉరువు;
piecemeal, adv. ముక్కలు ముక్కలుగా; ఇదో పిసరు, అదోపిసరు మాదిరి; ఏకాండీగా కాకుండా;
piecemeal, n. ముక్కలు ముక్కలుగా; విడివిడిగా; ఏకాండీగా కాకుండా;
pier, n. (1) రేవు; ఓడలు నిలిచే స్థలం; (2) వంతెన కట్టడానికి వాడే స్తంభం;
pierce, v. t. పొడుచు; గుచ్చు; కుమ్ము;
piety, n. భక్తి; భగవంతుని యెడల, తల్లిదండ్రుల యెడల, సంప్రదాయాల పట్ల భక్తి విశ్వాసాలు;
piety, n. దయ; కరుణ; జాలి;
piezo, adj. పీడన; దాబ;
piezoelectricity, n. పీడన విద్యుత్తు; దాబ విద్యుత్ ప్రభావం; కొన్ని పదార్థాల మీద పీడనం ప్రయోగించినప్పుడు పుట్టే విద్యుత్తు;
pig, n. పంది; ఊరపంది; సూకరం; వరాహం; పోత్రి; విట్చరం;
pigeon, n. పావురం; కపోతం; గువ్వ; see also dove; In general, the terms "dove" and "pigeon" are used somewhat interchangeably. Pigeon is a French word that derives from the Latin pipio, for a "peeping" chick, while dove is a Germanic word that refers to the bird's diving flight. In ornithological practice, "dove" tends to be used for smaller species and "pigeon" for larger ones, but this is in no way consistently applied, and historically, the common names for these birds involve a great deal of variation between the terms;
passenger pigeon, ph. పాంథ పావురం; [bio.] Ectopistes migratorius; ఈ పావురం జాతి 1 సెప్టెంబరు 1914 తేదీన అమెరికాలోని సిన్‌సినాటీ జంతు ప్రదర్శన శాలలో విలుప్తం అయిపోయింది;
Rock pigeon, ph. జంగ్లీ పావురం; [bio.] Columba livia intermedia;
pigment, n. (1) రంజనం; see also dye; (2) ఛాయ; వర్ణదం; వర్ణిక; వన్నెక; రంగునిచ్చే పదార్థం;
---Usage Note: pigment, dye
---In a nutshell, the difference between pigments and dyes boils down to mud vs. sugar water. Pigments, like mud, are finely ground particles of color that are suspended in a medium (such as water) to create a paint or coloring agent. Dyes are chemicals, like sugar, that are dissolved in a medium (such as water) to create a paint or coloring agent. In a pigment, the coloring agent is suspended, in a dye it is dissolved.
pika, n. కులింగం; శీతలప్రాంతాలలో నివసించే కుందేలు జాతికి చెందిన ఒక తోకలేని చిన్న ఎలుకవంటి జంతువు; పోకిమాన్ టీ.వీ. షోలోని పికాట్చూ అనే కార్టూన్ జంతువు దీని ఆధారంగానే చిత్రీకరించబడినది;
piles, n. మూలశంక; మొలలు; hemorrhoids; దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel). ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి తాగితే విరేచనం అయేటప్పుడు రక్తం పోకుండా ఆపుతుంది.
pilferer, n. లూటీకోరు; పశ్యతోహరుడు;
pilgrim, n. యాత్రికుడు; ప్రయాణీకుడు; తీర్థ యాత్రలు చేస్తూన్న వ్యక్తి; (note) the adjective of this is peregrine;
pilgrimage, n. (1) తీర్థ యాత్ర; (2) జీవిత యాత్ర;
pill, n. మాత్ర; గుళిక; వటుకం;
pillage, n. దోపిడీ; అలజడి సమయాలలో జరిగే దోపిడీ;
pillar, n. స్తంభం; కంబం;
pill box, n. భరిణె; కరండం;
pillow, n. దిండు; తలగడ; మెత్త;
pillow case, ph. గలేబు; గౌసేన;
pilot, n. (1) కర్ణధారి; వైమానికుడు; చోదకుడు; మాలిమి; పీలిగాడు; పడవని కాని విమానాన్ని కాని తోలే వ్యక్తి; (2) మార్గదర్శి; అగ్రగామి; సరంగు; పడవలకి దారి చూపే వ్యక్తి;
pilot wave, ph. అగ్రగామి తరంగం; మార్గదర్శి తరంగం;
pimento, n. ఒక రకం తియ్య మిరపకాయలు; "పెప్పర్" అంటే మిరియాలా, మిరపకాయలా అని స్పష్టత పోయేసరికి బుడతగీచులు పిమెంటో అనే మాటని తయారు చేసి మిరపకాయలని ఆ పేరుతో పిలవమన్నారు కాని ఆ పేరు ఒక రకం తియ్య మిరపకి స్థిరపడి పోయింది;
pimp, n. తాపిగాడు; తార్పుడుకాడు; వేశ్యలకు విటులని సంపాదించి పెట్టేవాడు;
pimples, n. pl. మొటిమలు; యవగండాలు; అవగండాలు; చెమరకాయలు; సూరీడుకాయలు; పులిపిరి కాయలు;
pin, n. సూది; గుండుసూది; పిన్ను; పిన్నీసు;
headed pin , ph. గుండుసూది; అల్పీ; అల్పనాతు సూది;
safety pin, ph. పిన్నీసు; సూదిబొత్తం;
pin, v. t. గుచ్చు;
pincers, n. శ్రావణము; పటకారు;
pinch, n. చిటికెడు;
pinch, v. t. గిల్లు; చిదుము; నొక్కు; పిండు; గిచ్చు;
pine, v. i. బెంగపెట్టుకొను; తపించు;
pine, n. (1) దేవదారు చెట్టు; (2) తపన;
pineal gland, n. త్రికోణ కుండలి; మెదడులో వెన్ను పాము బయలుదేరే సంగమ స్థానంలో ఉండే వినాళ గ్రంథి; ఇక్కడ తయారయే "మెలటోనిన్," "సెరటోనిన్" అనే హార్మోనులు నిద్రా చక్రాన్ని నియంత్రిస్తాయి;
pineapple, n. అనాస; అనాస పండు; మొగలిపనస; అనాసపనాస;
ping, n. పింగు; కంప్యూటర్ రంగంలో, అంతర్జాలంలో సమాచార రవాణా సాధనాలలో ఎక్కడ లోపాలు ఉన్నాయో కనుక్కుందుకి వాడే ఒక ఉపయుక్తి; ఒక స్థలం నుండి మరొక స్థలానికి చిన్న సమాచారపు పొట్లం పంపుతారు. అది అద్దరి చేరుకుని సురక్షితంగా తిరిగి వస్తే "పింగ్" అని శబ్దం చేస్తుంది. అప్పుడు సమాచారం ప్రయాణం చేసే దారి సుగమంగా ఉందని నిర్ధారణ అయినట్లు లెక్క;
pitch, n. (1) గంజిత్తు; కీలు; తారు; a thick black & sticky substance obtained by distillation of tar; (2) స్వరం; కీచుతనం; స్థాయి; ఒక సెకండు కాల వ్యవధిలో ఇమిడే ధ్వని తరంగాల సంఖ్య; తరచుదనం; పౌనఃపున్యం; స్వరములో తారమంద్రాతి భేదము; the relative height or acuteness of sound; the highness or lowness of a tone;(3) శృతి; (4) అమ్మకానికి వేసే పథకం; (5) బంతిని విసరే పద్ధతి;
high pitch, ph. కీచుతనం; కీచు;
low pitch, ph. బొంగురుతనం; బొంగురు;
pitch-in, v. t. (1) సాయం చేయు; ఒక చెయ్యి వేయు; (2) బిఛాణా వేయు; (3) బంతిని రువ్వు; (4) అమ్మకానికి పథకం వేయు;
pith, n. (1) దవ్వ; దంటు; (2) జీలుగు;
pitiful, adj. దయనీయ;
pit-oven, n. గాడిపొయ్యి;
pitted, adj. (1) పిక్క తీసిన; (2) గోతులు పడ్డ:
pitted dates, ph. పిక్క తీసిన ఖర్జూరం;
pitted tamarind, ph. పిక్క తీసిన చింతపండు;
pituitary gland, n. పీనస గ్రంథి;
pity, n. దయ; కనికరం; సానుభూతి; కారుణ్యం; అక్కటికం;
self-pity, ph. ఆత్మకారుణ్యం; ఆత్మానుకంపం; % move to S
pivot, n. కీల; కీలకం; భ్రమక కీలకం; ఉతక; (rel.) ఇరుసు;
pivotal, adj. కీలకమైన; అతి ముఖ్యమైన;
Part 2: Pj-Pz
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
placate, v. t. శాంతింపజేయు; ఊరడించు; ఉపశమింపజేయు; అనునయించు;
mother planets, ph. మాతృ గ్రహాలు; చంద్రుడికి భూమి మాతృ గ్రహం;
primary planets, ph. ప్రథాన గ్రహాలు; సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు;
inferior planets, ph. భూమి కక్ష్య లోపల ఉన్న గ్రహాలు; ఉదా. శుక్రుడు, బుధుడు;
superior planets, ph. భూమి కక్ష్య బయట ఉన్న గ్రహాలు; ఉదా. ాంగారకుడు, గురుడు, శని, మొ.
plank, n. (1) బల్లచెక్క; (2) ఎన్నికలలో ఒక పార్టీ మద్దతునిచ్చే ముఖ్యాంశం;
plankton, n. ప్లవకం; పాచి; సముద్రాలలోను, సరస్సులలోను, నదులలోను తేలియాడుతూ ఉండే ఒక రకం సూక్ష్మజీవులు; Plankton is the collection of organisms that drift with tides and currents. Two important groups are phytoplankton (plant-like) and zooplankton (animal-life), but plankton include species from all the kingdoms of life, plus viruses.
phytoplankton, ph. వృక్ష ప్లవకం;
zooplankton, ph. జంతు ప్లవకం;
plant, n. (1) మొక్క; ఉలూపం; కంకోలం; కంకు; (2) కర్మాగారం; కట్టడం;
plant, v. t. పాతు; నాటు;
plantain, n. బొంత అరటి; కూర జాతి అరటి; కదళీఫలం;
plaque, n. (1) పతకం; బహుమాన పతకం; (2) పంటిగార; పిప్పిక; పంటి మీద చేరే కల్మషం;
silver plaque, ph. రజత ఫలకం; రజత పతకం;
plasma, n. (1) రసి; జీవద్రవ్యం; ప్లాస్మా; (2) భౌతిక పదార్థాల తురీయ స్థితి; ఘన, ద్రవ, వాయు స్థితులకు అతీతమైన తురీయ స్థితి;
plaster, n. (1) గిలాబి; గోడలకి పూసే సున్నం; గార; (2) పాలాస్త్రి; దెబ్బలకి వేసే కట్టు;
platelet, n. (1) చిరు పళ్ళెం; (2) పళ్లెరం; బింబాణువు; రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే కణం; a small colorless disk-shaped cell fragment without a nucleus, found in large numbers in blood and involved in clotting;
plate tectonics, ph. పలక విరూపణ; భూమి అశ్మావరణం బీటలు పడి పళ్ళేల మాదిరి ఉంటుందనే వాదం;
platform, n. (1) వేదిక; (2) చప్టా; చపటా; రైలు ఆగే స్థలం; (3) భావవేదిక; (4) మంచె; ఇలారం; పొలాలలో కాపు కాయడానికి వాడే బడ్డీ;
plating, n. మలామా; లేపనం; లేపరం; జలపోత; ఒక వస్తువుమీద లోహపు పూత పుయ్యడం;
electroplating, ph. విద్యుత్ లేపనం; విద్యుయిత్ ఛురితం;
gold plating, ph. బంగారు మలామా; సునర్ణ ఛురితం;
Platinum, n. ప్లేటినం; మహారజతం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 78, సంక్షిప్త నామం, Pt.); [Sp. platina = silver];
Plato, n. గ్రీసు దేశపు తత్త్వవేత్త;
Platonic solids, ph. ప్లేటో ఘన స్వరూపాలు; ఉదా: చతుర్ముఖి, ఘన చతురం, అష్టముఖి, ద్వాదశముఖి;
platoon, n. పౌజు; దండు; దళం; మూక;
platter, n. భాజనం; పెద్ద పళ్లెం; వడ్డన సమయంలో వాడే పెద్ద పళ్లెం;
plaudit, n. సన్నుతి; స్తుతి; ప్రశంస; స్తోత్రం; స్తవము;
Please come in, ph. దయ చెయ్యండి; దయచేసి లోపలకి రాండి;
Please leave, ph. దయచెయ్యండి; (note) a sarcastic way of asking some one to leave; a subtle change in the tone of the voice makes the distinction between "come in" and "leave";
Please sit down, ph. దయచేసి కూర్చోండి;
please, v. t. మెప్పించు;
pleasing, adj. హితవైన; కమనీయ; కమ్మని; మనోజ్ఞ;
pleasing to the ear, ph. శృతిహితం; శ్రావ్యమైనది;
pleasing voice, ph. కమ్మని కంఠం; శ్రావ్యమైన కంఠం;
pleasure, n. ఆహ్లాదం; హాయి;
pleasure bargain, ph. ఈళ బేరం;
pleat, n. s. మడత; రెంట;
pleats, n. pl. కుచ్చెళ్లు; మడతలు;
plebiscite, n. సర్వజన తీర్మానం; జనవాక్యం; ప్రజాభిప్రాయం; ప్రజావాణి;
pledge, n. (1) వాగ్దానం; ఉపనిధి; ప్రతిజ్ఞ; (2) కుదువ; తాకట్టు;
Pleiades, n. (ప్లయేడ్స్, ప్లయెడీస్) కృత్తిక; కృత్తికలు; వృషభరాశిలో కంటికి కనిపించే ఆరు చుక్కల గుంపు; 430 జ్యోతిర్ వర్షాల దూరంలో ఉన్న ఒక నక్షత్ర సమూహం; దూరదర్శనిలో చూస్తే ఈ గుంపులో వేల కొద్దీ తారలు కనిపిస్తాయి;
pneumonia, n. నుమోనియా; పుఫూజ్వరం; రక్తష్ఠీవి సన్నిపాతం;
pocket, n. (1) జేబు; కోశిక; కీస;(2) మూల;
pocket money, n. జేబుఖర్చు; దినవెచ్చం;
pod, n. కాయ; చిక్కుడు; బటానీ కంది మె. దినుసు మొక్కల కాయ;
podiatrist, n. పాదాలకి వచ్చే జబ్బుల మీద ప్రావీణ్యత ఉన్న వ్యక్తి; ఈ వ్యక్తి అసలయిన వైద్యుడు కానక్కర లేదు;
podium, n. వేదిక; పీఠం;
poem, n. (పోమ్) పద్యం; పద్యమాల; పద్య కావ్యం; see also verse;
witty poem, ph. చాటువు; చాటుపద్యం; ఆభాణకం;
poet, n. m. కవి; f. కవయిత్రి; కవికి ఉండాల్సిన లక్షణాలు: క్రాంత దర్శనత్వం, వర్ణనా నిపుణత్వం, రసభావ ప్రతిపాదక విశ్లేషణాశక్తి, మనీషా సంపన్నత, మొదలైన లక్షణాలుండాలని ఆలంకారికుల అభిమతం.
poet laureate, ph. ప్రతిభావంతమైన కవిగా పురస్కారం అందుకున్న వ్యక్తి; ఆస్థాన కవి;
poetic license, ph. ఆర్ష ప్రయోగం;
poetry, n. కవనం; కవిత్వం;
modern poetry, ph. నవ కవనం; ఆధునిక కవిత్వం;
poignant, adj. (పయోన్యంట్) హృదయాన్ని అంటెడు; హృదయానికి హత్తుకునే; హృదయవిదారక; ఆర్ర్ద; evoking a keen sense of sadness or regret;
point, n. (1) బిందువు; మొన; (2) ఓకు; (3) అసలు విషయం; అంశం;
fine point, ph. సూక్ష్మాంశం;
turning point, ph. క్రాంతి బిందువు;
point of incidence, ph. పతన బిందువు;
pointer, n. చూపుడుపుల్ల; సూచి; సూచిక; తర్జని;
poise, n. చందం;
poison, n. విషం; హాలాహలం;
poisonous, adj. విష; విషాక్త;
poisonous snake, ph. విషసర్పం;
poke, n. పొడుచు; కుమ్ము;
Polaris, n. ధ్రువనక్షత్రం;
polar, adj. ధ్రువ; ధ్రువీయ; చుక్క;
polar axis, ph. ధ్రువ యష్టి;
polar bodies, ph. ధ్రువ కాయములు;
polar bond, ph. [chem.] ధ్రువ బంధం;
polar circle, ph. ధ్రువ వృత్తం;
polar molecule, ph. [chem.] ధ్రువ బణువు;
polar opposite, ph. చుక్కెదురు;
Polaris, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార; ఉత్తర ధ్రువ నక్షత్రం; ప్రస్తుతం ఔత్తానపాది లేదా Polaris అనే నక్షత్రం ఉత్తర ధ్రువతారగా చెలామణీ అవుతోంది; దక్షిణ ధ్రువ తారగా చెలామణీ అవడానికి ప్రకాశవంతమైన తార ఏదీ లేదు;
polarization, polarisation (Br.) n. తలీకరణ; విద్యుదయస్కాంత తరంగాలని ఒకే తలంలో ప్రకంపించేలా చెయ్యడం; (exp.) In English, polarization is a misnomer; it has nothing to do with poles;
polarize, v. t. తలీకరించు;
pole, n. (1) ధ్రువం; (2) రాట; నిట్రాట; స్తంభం;
Flag pole, ధ్వజ స్తంభం;
North pole, ఉత్తర ధ్రువం;
South pole, దక్షిణ ధ్రువం;
pole of celestial equator, ph. కదంబం; రవిమార్గ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు;
pole of Ecliptic, ph. ధ్రువం; భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు;
polemics, n. తర్కవితర్కాలు; వాదవివాదాలు; వాదప్రతివాదాలు;
Polestar, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార;
police, n. pl. రక్షకభటులు; పోలీసు;
police, v. t. కట్టడిలో ఉంచు;
police station, n. ఠాణా; పోలీసు స్టేషను;
policy, n. (1) పట్టా; పట్టా పత్రం; పాలసీ; (2) అమలులోనున్న పద్దతి;
polish, n. మెరుగు ; నునుపు;
polish, v. t. మెరుగు పెట్టు; సాన పట్టు; నున్నపరచు;
poll, n. (1) ఎన్నికలలో ఓటు వెయ్యడం; (2) తలకాయ; బుర్రకాయ;
poll, v. t. (1) అభిప్రాయం సేకరించు; అభిప్రాయం నమోదు చేయు; (2) వార్తాప్రచార సాంకేతికంలో ఒక పనిముట్టు ఇంకా "బ్రతికి ఉందో లేదో" (నిద్రపోతున్నాదో మెలుకువగా ఉందో) తెలుసుకోడానికి చేసే ప్రయత్నం;
polyhedron, n.బహుఫలకం; బహుముఖి; బహుపీఠి; ఎన్నో ముఖాలు ఉన్న ఘనస్రం;
polymath, n. బహుముఖ ప్రజ్ఞఆశాలి;
polymer, n. బహుభాగి; గొలుసులా ఎన్నో భాగాలు ఉన్న ఒక ఆంగిక రసాయనం;
polymerize, v. t. [chem.] దండించు; దండలా చేయు; బణువులని దండలా గుచ్చు; బహుభాగి వలె మార్చు;
polymerism, n. బహుభాగత్వం;
polymorphism, n. (1) (chem.) బహురూపత; see also భిన్నరూపత; ఒకే పదార్థం రెండు (లేదా, రెండు కంటె ఎక్కువ) స్పటికాకారాలని ప్రదర్శించగలిగితే దానిని బహురూపత (polymorphism) అంటారు. ఉదాహరణకి, ఉష్ణోగ్రత కాని, పీడనం కాని మారినప్పుడు కొన్ని పదార్థాల స్పటికాకారాలలో మార్పు వస్తుంది (ఉ. మెర్క్యురిక్ అయొడైడ్, HgI); (2) [comp.] In object-oriented programming, polymorphism refers to a programming language's ability to process objects differently depending on their data type or class;
polymorphous, adj. బహురూప;
polynomial, adj. బహుపద; బహునామ; రెండు కాని అంతకంటె ఎక్కువ పదాలు ఉన్న గణిత సమాసానికి సంబంధించిన;
polynomial, n. బహుపాది; బహునామి; రెండు కాని అంతకంటె ఎక్కువ పదాలు ఉన్న గణిత సమాసం;
polyolefin, n. బహుతైలం; రెండు, మూడు రకాల చమురుల సముదాయం;
polypeptide chain, n. [biochem.] బహుజీర్ణమాల;
polypetalous, adj. బహుదళ; బహుదళాయుత; ఎన్నో రేకులు గల;
polyphenol, n. బహుఫీనాలు;
polyphonic, adj. భిన్నస్వర; Polyphonic music is a style of music that combines two or more melodic lines or tones at the same time; That is, tones can be combined without losing their individuality; In contrast, when colors are combined, they lose their individuality;
polypleagra, n. అత్యాకలి;
polyploids, n. బహుస్థితికాలు; జీవకణాలో ఉండే వారసవాహిక లలో ఒక రకం;
polysaccharide, n. [biochem.] బహుచక్కెర; రెండు, మూడు రకాల చక్కెరల మిశ్రమం;
polytechnic college, n. బహుకళాశాల; రకరకాల వృత్తి విద్యలు నేర్పే కళాశాల;
polytheism, n. బహుదేవత్వం; బహుదేవతారాధన; బహుదేవతావాదం; ఒకటి కంటే ఎక్కువ దేవతలను ఆరాధించడం;
polyunsaturated, adj. బహుఅసంతృప్త;
polyuria, n. అతిమూత్రం;
polyvinyl, n. బహువినైల్; ఎన్నో వినైల్ బణువులని దండించగా ఏర్పడ్డ రసాయన పదార్థం;
pomegranate, n. దానిమ్మ;
pomelo, n. పంపరపనస; [bot.] Citrus maxima;
pometo, n. potato + tomato; పిండి తక్కాలి;
pomiculture, n. ఫలసాయం; పండ్లని పండించడం;
pomology, n. ఫలశాస్త్రం; ఫలవిజ్ఞానం;
pomp, n. ఆడంబరం; అంగరంగవైభవం; పటాటోపం; పటారం; అట్టహాసం;
verbal pomp, ph. వాగాడంబరం;
pomp and circumstance, ph. అంగరంగవైభవం;
pompelmos, n. పంపరపనస; పెద్ద దబ్బపండంత ఉండే నారింజ జాతి పండు;
pompous, adj. జంభమైన; డంభమైన; ఆడంబరమైన;
pompous, adj. జంభమైన; డంబమైన; ఆడంబరమైన;
pond, n. చెరువు; చెలమ; వాద; కొలను; కాసారం;
ponder, v. i. ఆలోచించు; పర్యాలోచించు; మననం చేయు; వితర్కించు;
pony, n. తట్టు; పొట్టి గుర్రం;
pool, n. (1) కొలను; మడుగు; పల్వలం; (2) వర్గం;
business pool, ph. వ్యాపార వర్గం;
swimming pool, ph. ఈత కొలను;
pool, v. i. చందావేసుకొని; కలుపుకొని;
poor, adj. బీద; పేద;
poor, n. pl. బీదవారు; పేదవారు; దరిద్రులు;
poorest of the poor, ph. దరిద్రనారాయణులు;
popcorn, n. లాజలు; లాజజొన్నలు; పేలాలు;
populace, n. ప్రజానీకం; జనానీకం; లోకం; ప్రజ; జనబాహుళ్యం;
popular, adj. జనరంజక; జనతా; లోక; జనవ్యవహార;
popular custom, ph. లోక మర్యాద;
popular opinion, ph. ప్రజాభిప్రాయం; జనాభిప్రాయం; లోక ప్రవాదం;
popular usage, ph. జనవ్యవహారం;
popularization, n. జనీకరణ;
population, n. జనాభా; జనసంఖ్య; జనులు; జనాలు; ప్రజలు;
porcupine, n. ఏదుపంది; ముండ్లపంది; ముళ్ళపంది; శల్యసూకరం;
pore, n. బెజ్జం; రంధ్రం; సుషి; తూటు;
pork, n. పంది మాంసం; (rel.) ham; bacon;
pornography, n. అశ్లీల రచనలు; లైంగికలేఖనం; బూతులు; బూతుబొమ్మలు;
porosity, n. సారంధ్రత; సచ్ఛిద్రత;
porous, adj. సారంధ్ర; సచ్ఛిద్ర;
porpoise, n. శింశుమారం;
porridge, n. జావ; కరంభం;
port, n. (1) రేవు; ఓడరేవు; బందరు; (2) ఓడకిగాని విమానానికిగాని ఎడమవైపు భాగం; (3) చిక్కని ఎరుపు రంగు వున్న తియ్యని ద్రాక్ష సారా; (4) కంప్యూటరు లోపలికి వెళ్ళే ద్వారం, బయటకు వచ్చే ద్వారం;
portal, n. దేవిడి; ద్వారం; గుమ్మం; చిన్న ద్వారం; ద్వారకి;
portal to portal, ph. గుమ్మం నుండి గుమ్మం దాకా;
portent, n. దుశ్శకునం; వ్యతీపాతం; గండం;
porter, n. (1) ద్వారపాలకుడు; గేటు కాపరి; (2) సామానులు మోసే కూలివాడు;
portfolio, n. దస్త్రం;
portico, n. మండపం;
portion, n. వాటా; పాలు; అంశం; భాగం;
portrait, n. రూపచిత్రం; పటం; బొమ్మ; చిత్తరువు; చిత్రం;
portrayal, v. t. చిత్రీకరణ;
port side, n. దావుబోడిద; దాపల; left side of a boat or ship as one faces forward;
Portuguese, adj. బుడతకీచు;
pose, n. భంగిమ; పోజు;
posit, v. t. పెట్టు; ఉంచు; అనుకో;
position, n. (1) పదవి; స్థితి; (2) స్థలం; స్థానం; ఇరవు;
potash, n. సర్జిక; కుంభస్మము; పొటాసియం నైట్రేటు; పొటాష్; (ety.) pot + ash;
potato, n. బంగాళాదుంప; ఉరలగడ్డ; ఆలుగడ్డ;
couch potato, ph. శయ్యాళువు;
Sweet potato, ph. చిరగడదుంప; చిలగడ దుంప; గెనుసు గడ్డ; (note) Sweet potato is different from yam; in fact, in the US, the word "yam" is used very carelessly to refer to a variety of tubers;
Potassium, n. పొటాసియం; పటాసు; (అణుసంఖ్య 19, సంక్షిప్త నామం, K);
Potassium permanganate, ph. సినాల రంగు; KMnO4;
potbelly, n. బొజ్జ; గుండ్రటి బొజ్జ; బీరుబొజ్జ;
potent, n. శక్తిమంతమైన;
potency, n. శక్తి; బలం;
potentate, n. శక్తిమంతుడు; రాజు;
potential, n. (1) విభవం; పీడనం; శక్మం; (2) అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యం;
poverty, n. (1) బీదరికం; బీదతనం; పేదరికం; లేమి; ఎద్దడి; దరిద్రం; నిప్పచరం; అనగా ఒక వ్యక్తి మనుగడకి కావలసిన కనీస అవసరాలు, అనగా తినడానికి తిండి, కట్టడానికి బట్త, ఉండడానికి వసతి సౌకర్యం లేకపోవడం; కటిక దరిద్రం అంటే ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా సరిపోయే అంత తిండి (కేలరీలు, పోషకాలు) కూడ దొరకకపోవడం; సాపేక్ష దరిద్రం అంటే అదే సంఘంలో ఉన్న మిగిలిన వారితో పోల్చినప్పుడు సరిపోయే వసతులు, వనరులు లేకపోవడం; (2) గ్రాసవాసోదైన్యం; తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని దీన స్థితి;
powder puff, n. కనప పూవు; [bot.] Calliandra haematocephala;
power, n. (1) పాటవం; పటిమ; సామర్థ్యం; బలీయత; లావు; అలవు; త్రాణ; సత్తువ; సత్వం; In physics, power tells how many times a given force is exerted over a period of time; (2) [math.] ఘాతం; సూచిక; (3) అధికారం; (4) విద్యుత్తు;
electrical power, ph. విద్యుత్ పాటవం; విద్యుత్ సత్వం;
horse power, ph. అశ్వ పాటవం; అశ్వ సామర్థ్యం; అశ్వ సత్వం; Horse Power is a measure of the rate of force;
power factor, ph. [engr.] పాటవ గుణకం; విద్యుత్తులో ఉన్న శక్తిని లెక్కకట్టేటప్పుడు ఈ గుణకాన్ని వాడతారు; Power Factor expresses the ratio of true power used (measured in Watts) in a circuit to the apparent power (measured in VA) delivered to the circuit. A 96% power factor demonstrates more efficiency than a 75% power factor.
power house, ph. పాటవ గృహం; విద్యుత్తుని తయారుచేసే భవనం;
power series, ph. [math.] ఘాత శ్రేణి; ఘాతీయ శ్రేణి; ఉదా: :
praiseworthy, n. ప్రశంసాత్మకం; శ్లాఘనీయం; కొనియాడదగ్గది; వినుతి; స్తవనీయం;
prank, n. జిత్తు; టక్కరి పని; ఠవళి;
prankster, n. జిత్తులమారి;
prawn, n. రొయ్య;
prayer, n. ప్రార్థన; ఉక్తం;
preach, v. t. ప్రబోధించు;
preacher, n. ఉపదేశకుడు; ప్రబోధకుడు; ప్రబోక్త;
preamble, n. ప్రస్తావన; ఉపోద్ఘాతం; అవతారిక; పీఠిక; ఉద్దేశ వివరణం;
precaution, n. ముందుజాగ్రత్త; అప్రమత్తత; చేకాపు;
precedent, n. పూర్వప్రమాణం;
preceding, adj. గత; పూర్వగత; ఇందాకటి;
preceptor, n. ఆచార్యుడు; కుల గురువు; ఉపదేశికుడు; విద్యాదాత;
precession, n. విషువత్ చలనం; అయనాంశ;
precession of the equinoxes, ph. విషువత్ చలనం; అయన చలనం; భూ అక్షం నక్షత్రగోళం మీద స్థిరంగా నిలవక, బహు నెమ్మదిగా, రాశి చక్రానికి వ్యతిరేక దిశలో, (అంటే మేషం, మీనం, కుంభం, ...అనే విలోమ క్రమంలో), తిరుగుతూ, ప్రతి 25,800 సంవత్సరాలకి ఒక వృత్తం పూర్తి చేస్తుంది; ఈ కదలిక వలన విషువత్ సంక్రమణ స్థానాలు కూడ కదులుతాయు;
[note] అయనాంశ is a correction term to account for the difference between the tropical and sidereal zodiacs and this difference is due to the precession of the equinoxes. Thus the computed positions of the planets and houses may differ depending on whether ayanAMSa is used or not and also, if it is used, on the specific algorithm employed to compute it!
precipitate, n. (1) మడ్డి; అవక్షేపం; (2) కారణభూతం కావడం;
precipitation, v. i. మడ్డిలా కిందకి దిగడం; అవక్షేపణ;
precipitation, v. t. మడ్డిలా కిందకి దిగేటట్టు చేయడం; అవక్షేపణ అనగా ఒక ద్రవములో కరగని పదార్థము దాని మీద గల అనేక శక్తుల వల్ల ఆ పదార్థపు కణాలు ఆ ద్రవము నుంచి వేరు కావడము. ఆ శక్తులు వివిధ రకాలుగా ఉండొచ్చును. ఉదా: గురుత్వాకర్శణ శక్తి, అపకేంద్ర శక్తి, విద్యుతయస్కాంత శక్తి;
precipitation, n. అవపాతనం; ఆకాశం నుండి కిందకి పడే నీరు; వాన, మంచు, వగైరా;
precision, adj. సున్నితపు; కచ్చితపు;
precision balance, ph. సున్నితపు త్రాసు;
precision calculation, ph. సున్నితపు లెక్క;
precocious, adj. వయస్సుకి మించిన తెలివి, నైపుణ్యం కల;
precursor, n. పూర్వగామి;
predation, n. దొంగిలించి బతకడం; ఒకరిది తస్కరించి బతకడం; మరొక జీవిని చంపి తినడం; పొంచార్పు;
predator, n. పిండారి; తస్కరి; దొంగ; పొంచార్చి; మరొక జంతువుని పొంచుండి వేటాడేది; see also parasite;
apex predator, ph. చిటారు పొంచార్చి;
predatory, adj. పిండారీ; దోపిడీ;
predicament, n. దురవస్థ; అవస్థ; క్లిష్టపరిస్థితి;
predicate, n. అఖ్యానం; అఖ్యాతం; వాక్యంలో కర్తను గురించి చెప్పేది;
predicate logic, ph. అఖ్యాత తర్కం;
prediction, n. జోస్యం; కాబల్కం;
predictable, adj. జోస్యాస్పదం;
predictor, n. కాబల్కరి;
pre-existing, adj. పూర్వస్థిత;
preface, n. పీఠిక; భూమిక; ఒక రచయిత కాని, ప్రచురణకర్త కాని ఒక రచనలోని విషయాన్ని విశదీకరిస్తూ రాసే చిన్న వ్యాసం; ఉపోద్ఘాతం; Most often found in nonfiction books or academic writing, a preface is a short introductory essay written from the point of view of the author. The author might use the preface to explain why they are qualified to write about the book’s subject matter. The author’s preface may also be used for other specific functions, such as explaining how they became interested in the subject of the book and why they chose to write about it; (rel.) foreword, introduction;
preference, n. ఇష్టత; అధిగణ్యత;
prefix, n. ఉపసర్గ; పూర్వప్రత్యయం; ఉపపదం; ప్రాదు; పూర్వలగ్నం; తల; దాపలతోక;
pregnancy, n. గర్భం; కడుపు; చూలు; గర్భధారణ; కడుపుతో ఉండడం;
preliminary investigation, ph. ఉపక్రమణిక పరిశోధన; ప్రథమ పరిశోధన;
prelude, n. ప్రవేశిక; నాంది; అవతారిక;
premature, adj. పరిపక్వము కాని; పూర్తిగా ఎదగని; నెలలు నిండని;
premeditated, n. పూర్వసంకల్పితం; ప్రయత్నపూర్వకం;
premise, n. s. ఆధార వాక్యం; పూర్వ సిద్ధాంతం;
premises, n. pl. ప్రాంగణం; దివాణం;
premium, n. (1) అడితి; బీమా కిస్తు; ప్రీమియం; (2) నిజమైన విలువ కంటె ఎక్కువ చెల్లింపు;
level premium, ph. మట్టపు అడితి; మట్టపు ప్రీమియం;
prescient, adj. భవిష్యత్ జ్ఞానము గల;
pre-occupation, n. అన్యమనస్కత; పూర్వగ్రహణం;
preparation, n. (1) సన్నాహం; (2) తయారైనది; తయారీ; వంటకం;
prepare, v.i. తయారగు; సిద్ధమగు;
prepared, adj. సమాయత్త;
prepare, v. t. తయారు చేయు; సిద్ధము చేయు;
preparedness, n. సంసిద్ధత; సన్నద్ధత;
preponderance, n. అత్యధికంగా ఉన్నటువంటి;
preponderance of evidence, ph. [law] అత్యధికంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు;
preposition, n. విభక్తి ప్రత్యయం; (note) ఇంగ్లీషులో preposition అంటే విశేష్యానికి ముందు వచ్చేది అని అర్థం, కాని తెలుగులో విభక్తి ప్రత్యయం నామవాచకానికి తర్వాత వస్తుంది; ఒక విధంగా చూస్తే విభక్తి ప్రత్యయానిది post position; ఇదే ఇంగ్లీషులో వాక్య నిర్మాణానికీ, తెలుగులో వాక్య నిర్మాణానికీ మధ్యనున్న ఒక పెద్ద తేడా;
prerequisite, n. పూర్వాపేక్షితం;
prerogative, n. విశిష్టాధికారం;
presbyopia, n. దీర్ఘదృష్టి; దూరపు వస్తువులు కనిపించడం, దగ్గరవి బాగా కనిపించకపోవడం;
prescient, adj. (ప్రెషెంట్) భవిష్యత్ జ్ఞానము గల; కాలజ్ఞానము తో;
priest, n. m. పురోహితుడు; కేథలిక్ తెగకి చెందిన పురోహితుడిని ప్రీస్ట్ అంటారు. ఇతను వివాహం చేసుకోకూడదు, జీవితాంతం బ్రహ్మచర్యమే పాటించాలి; చర్చిలో హోదా పెరిగే కొద్దీ బిషప్, కార్డినల్ వగైరా బిరుదులు కనిపిస్తాయి. వీటిలో అత్యున్నతమైన స్థానం పోప్;
prig, n. పొగరుబోతు; అహంకారి; గర్విష్థి;
prima facie, adj. మొదట ఏర్పడిన అభిప్రాయం ప్రకారం; తొలి చూపులో ఏర్పడిన అభిప్రాయం ప్రకారం;
prima para, n. (1) తొలిౘూలు; మొదటి కాన్పు; (2) తొలిౘూలు స్త్రీ;
primary, adj. ప్రాథమిక; ముఖ్యమైన; ప్రాక్,
primary form, ph. ప్రాగ్రూపం;
primary school, ph. ప్రాథమిక పాఠశాల;
upper primary school, ph. ప్రాథమికోన్నత పాఠశాల;
primate, n. (1) ప్రాగ్వానరం; నరవానరం; మనిషి, కోతి జాతులకి చెందిన జంతువులని సూచించడానికి కలగలుపుగా వాడే మాట; (2) ప్రధాన శాల్తీ; ప్రధాన గురువు;
prime, adj. ప్రధాన; ముఖ్యమైన;
prime factor, ph. ప్రధాన కారణాంకం; ప్రధాన భాజకం;
prime, n. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
prime number, ph. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
absolute prime number, ph. నిరపేక్ష ప్రధాన సంఖ్య;
permutable prime, ph. ప్రస్తార ప్రధాన సంఖ్య; A permutable prime, also known as anagrammatic prime, is a prime number which, in a given base, can have its digits' positions switched through any permutation and still be a prime number. In base 10, all the permutable primes with fewer than 49,081 digits are known: 2, 3, 5, 7, 11, 13, 17, 31, 37, 71, 73, 79, 97, 113, 131, 199, 311, 337, 373, 733, 919, 991, R19 (1111111111111111111), R23, R317, R1031, ... where the "repunit" R19 stands for a sequence of 19 ones.
regular prime, ph. క్రమ ప్రధాన సంఖ్య; In number theory, a regular prime is a special kind of prime number, defined by Ernst Kummer in 1850 to prove certain cases of Fermat's Last Theorem. Regular primes may be defined via the divisibility of either class numbers or Bernoulli numbers. The number p is regular if (and only if) it does not divide the numerator of any of the Bernoulli numbers Bk for k=2, 4, 6, ..., p-3. For example, 691 divides the numerator of B12, so 691 is not regular (we say it is irregular).
primer, n. (1) (ప్రిమర్) శిశుబోధ; బాలబోధ; ప్రాథమిక వాచకం; (2) గోడలకి, ఇనప సరంజామాకి రంగులు అద్దే ముందు, వేసిన రంగు బాగా హత్తుకోడానికి, వేసే మొదటి పూత; (3) జీవకణాలలో వారసవాహికల తయారీకి ఓం ప్రధమంగా వాడే కణికామ్లాల దండ (పాలని పెరుగు చెయ్యడానికి తోడు వాడమూ! అలాగ అన్న మాట!);
primeval, adj. మునుముందటి; ఆది; ఆద్యం;
primeval atom, ph. బ్రహ్మాణువు;
primeval egg, ph. బ్రహ్మాండం; విశ్వకోశం;
primeval fireball, ph. ఆదిజ్వాల;
primeval ocean, ph. నారము;
primogeniture, n. ప్రథమ సంతానం;
primordial, adj. ప్రప్రథమ; ఆదికి ముందే ఉన్న; ప్రాంకుర;
progression, n. (1) ప్రగతి పథం; (2) పరంపర; అనుపాతం; ముందుకి నడుచుకుంటూ వెళ్ళేది; ఒక శ్రేఢిలో ఒకదాని వెంబడి మరొక అంశం వస్తూన్న సందర్భంలో ఆ అంశాల మధ్య నిర్ధిష్టమైన గణిత సంబంధం ఉంటే ఆ శ్రేఢిని పరంపర అంటారు;
arithmetic progression, ph. అంకలితోత్తర పరంపర; సంకలితం; ఒక క్రమంలో అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం;
geometric progression, ph. గుణోత్తర పరంపర; ఉత్కలితం; ఒక క్రమంలో వర్గీకరించిన అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం;
project, v. i. (ప్రొజెక్ట్) ముందుకు పొడుచుకుని వచ్చు;
project, v. t. (ప్రొజెక్ట్) ముందుకు దూసుకుని వచ్చేలా చేయు;
project, n. (పోజెక్ట్) పథకం; సాధించవలసిన పని;
projectile, n. ప్రక్షేపకం; ముందుకు దూసుకుని వచ్చే వస్తువు; విసరిన వస్తువు; ఎగరవేసిన వస్తువు;
projection, n. విక్షేపం; ముందరకి తొయ్యడం;
projector, n. విక్షేపణి; ముందరకి తోసేది;
prolapse, n. భ్రంశం; చ్యుతి; దిగజారుట; జాకారుట; పతనం;
prolapse of anus, ph. గుద భ్రంశం;
prolapse of gut, ph. ఆంత్ర భ్రంశం; పేగు జారుట;
proliferation, n. బహుదాకరణం; తామరతంపర వలె వృద్ధి చెందడం;
proletariat, n. శ్రామిక వర్గం; పాటకజనం; శ్రామికులు; కార్మికులు;
prolific, adj. విరివిగా సృష్టించగలిగే సామర్థ్యం గల;
prolific writer, ph. విరివిగా రచనలు చేసిన వ్యక్తి;
prologue, n. ప్రస్తావన; పీఠిక; అవతారిక; తొలిపలుకు; నాంది; ముందుమాట; పూర్వరంగం; Typically found in works of fiction, a prologue is usually written from a character’s point of view (either the main character or a character who brings a different perspective to the story). This introductory passage gives the reader additional information that will help their comprehension of the rest of the book. This can include background information on characters, events that took place before the story begins, or information that establishes the setting of the story; కథ నేపథ్యం సమగ్రంగా అర్థం అవడానికి ఈ చిన్న వ్యాసం ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇంగ్లీషులోకి అనువదించిన కన్యాశుల్కం నాటకం ఇంగ్లీషు పాఠకులకి అర్థం అవటానికి ఆ కాలపు బాల్యవివాహాల ఆచారం గురించి నాలుగు మాటలు చెబితే అది Prologue కోవకి చెందుతుంది; see also introduction; preface;
prolong, v. i. పొడిగించు; సాగదీయు;
prominent, adj. పేరున్న; స్పుటమైన; బాగా కనిపించే;
promise, n. (1) బాస; మాట; వాగ్దానం; (2) బాగుపడే అవకాశం; వృద్ధిలోకి వచ్చే అవకాశం;
promise, v. i. బాసచేయు; మాటయిచ్చు;
promising, adj. బాగుపడే అవకాశం ఉన్న; వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉన్న;
promissory note, ph. వాగ్దాన పత్రం; ప్రోనోటు;
promote, v. t. వృద్ధిచేయు; అధికం చేయు;
promotion, n. (1) పదోన్నతి; ఉద్యోగపు హోదా పెరగడం; (2) వ్యాపారంలో వస్తువుల అమ్మకం వృద్ధి పొందడానికి చేసే హడావిడి;
personal pronoun, ph. పురుషవాచక సర్వనామం; పురుష బోధక సర్వనామం; యుష్మదస్మదర్థక సర్వనామం; పురుష బోధక సర్వనామాలలో లింగభేదాలకు ప్రత్యేక పదాలు ఉండవు. ఉదా. నేను, మేము, మనం, నువ్వు, మీరు మొ.వారిని ఏ లింగానికి చెందినవారో చెప్పనవసరం లేదు. సంభాషణ లో పాల్గొన్న మాట్లాడే వ్యక్తీ, వినే వ్యక్తీ ఒకరికొకరు తెలిసినవారే అవుతారు.
proper motion of a star, ph. తార యొక్క స్వకీయ గమనం; నిజ గతి; నక్షత్రాలు ఏవీ స్థిరంగా లేవు; అవి వేరు వేరు దిశలలో వేరు వేరు వేగాలతో - సెకండుకి అనేక కిలోమీటర్ల వేగంతో - కదులుతున్నాయి;
emergent property, ph. హఠాదుత్పన్న లక్షణం; హఠాత్తుగా పుట్టుకొచ్చే లక్షణం; తాపోగ్రత (temperature) అనే భావం ఉంది. ఒకే ఒక బణువు (molecule)ని తీసుకుని దాని “తాపోగ్రత” గురించి మాట్లాడడం అర్థ రహితం. ఒక్క బణువుకి తాపోగ్రత ఉండదు. ఒక చోట కోట్ల కొద్దీ బణువులు, ఒక దానిని మరొకటి గుద్దుకుంటూ ఉంటేనే వేడి (heat) పుడుతుంది, దాని ఉగ్రతని మనం తాపోగ్రత అంటున్నాం. కనుక తాపోగ్రత అన్నది హఠాదుత్పన్న లక్షణం;
collective property, ph. (1) సాముదాయిక లక్షణం; (2) ఉమ్మడి ఆస్తి;
prospectus, n. పరిచయ పత్రం; పరిచయ పొత్తం; వివరణ పత్రం;
prosper, v. i. ప్రబలు;
prosperity, n. ఐశ్వర్యం; సౌభాగ్యం; క్షేమం; శ్రేయస్సు; అభివృద్ధి;
prostate gland, n. వస్తి గ్రంధి; వీర్య గ్రంథి; పౌరుష గ్రంథి; The prostate's most important function is the production of a fluid that, together with sperm cells from the testicles and fluids from other glands, makes up semen;
protocol, n. పద్ధతి; ప్రవర్తనా నియమావళి; మర్యాద; అంతస్తుకి తగిన మర్యాద; ఇచ్చి పుచ్చుకొనే పద్ధతి;
protagonist, n. నాయకుడు; నాయకురాఉ; ప్రథాన పాత్రధారి;
protandry, n. [bot.] పుంభాగ ప్రథమోత్పత్తి; The condition of flowers whose male parts mature before the female ones; [bio.] The condition in which an organism begins life as a male and then changes into a female;
protonema, n. ప్రథమతంతువు;
protoplasm, n. ఆదిపదార్థం; జీవపదార్థం; see also cytoplasm;
protozoa, n. ఆదిజీవులు; ఆదిజంతువులు; తొలేలులు (తొలి + ఏలులు); ఇవి బేక్టీరియా కంటె పెద్దవి; ఎమీబా వల్ల కలిగే గ్రహణి, మలేరియా మొదలైన వ్యాధులు ఈ రకం సూక్ష్మజీవుల వల్లనే కలుగుతాయి;
proxy, n. ఒకరి తరఫున వ్యవహరించడానికి మరొకరికి ఇచ్చే అధికారం; ప్రాతినిధ్యం; వకీల్తా: అటువంటి అధికారం పొందిన వ్యక్తి; వకీలు;
prude, n. అతివినయం ప్రదర్శించే వ్యక్తి;
prudence, n. ప్రాజ్ఞత;
prunes, n. ఎండిన ఆలూబుఖారా పండు; ఎండిన ప్లమ్; [bot.] Prunus domesticus; జ్వరము తగ్గిన తరువాత నోటికి రుచిగా ఉండడానికి వాడతారు;
prune, v. t. కత్తిరించు; త్రుంచు; పత్రించు; మొక్కల కొమ్మలను కత్తిరించు; తగ్గించు;
pruner, n. కత్తెర; పత్రిక;
pruning, n. పత్రింపు; ఎదిగేదానిని కత్తిరించడం; పొదవ్యాధి; పొలుసురోగం;
psalm, n. ప్రార్ధనా గీతం; బైబిలులో ఒక భాగం;
pseudo, adj. కుహనా; మిథ్యా; అబద్ధపు; మారు;
pseudomorphism, n. అభాసరూపత్వం; Pseudomorphism occurs when a mineral is altered in such a way that its internal structure and chemical composition is changed but its external form is preserved;
pseudonym, n. (సూడోనిం) గోప్యనామం; కుహనా నామం; మారుపేరు; కలం పేరు;
pseudopod, n. కూటపాదం; జీవకణాలు కదలికకు కణసారం కోలగా సాగి పాదం మాదిరి ఉపయోగపడే సాధనం;
psoriasis, n. విచర్చిక;
psyche, n. మనస్సు; భావజాలం;
psychiatrist, n. మానసిక వైద్యశాస్త్రం ప్రకారం మానసిక రోగాలకి మందులిచ్చి కుదిర్చే వైద్యుడు;
psychic, adj. అతీంద్రియ;
psychic, n. అతీంద్రియాళువు; అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తి;
psychoanalysis, n. మానసిక విశ్లేషణ; మనస్తత్త్వ విశ్లేషణ;
psychological, adj. మానసిక; మనస్తత్త్వ;
psychologist, n. మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానసిక దౌర్బల్యాలని విశ్లేషించే వ్యక్తి; ఈ వ్యక్తి మందులు ఇవ్వడానికి వీలు లేదు;
psychology, n. (1) మనస్తత్వ శాస్త్రం; (2) మనస్తత్వం; మనుస్స్వభావం;
psychopath, n. వికలోద్వేగి; ఈ వ్యక్తి స్వయంమోహితుడే కాకుండా సిగ్గు,లజ్జ, తప్పు చేసేననే శంక లేని వ్యక్తి; a psychopath is a narcissist with no sense of guilt or shame; a psychopath is born with these traits whereas a sociopath is made by the environment;
psychosomatic, adj. మానసిక రుగ్మతకి భౌతికమైన లక్షణాలు పొడచూపే;
psychotherapy, n. మానసిక చికిత్స;
psychosis, n. గజిబిజగా, ఆందోళనకరంగా ఉండే ఆలోచనలు, లేనివి ఉన్నట్లు అనిపించే భ్రాంతి, మొదలైన లక్షణాలు ఉన్న మనో స్థితి;
psyllium, n. [bot.] Plantago ovata; Psyllium is a soluble fiber used primarily as a gentle bulk-forming laxative in products such as Metamucil. It comes from a shrub-like herb called Plantago ovata that grows worldwide but is most common in India. Each plant can produce up to 15,000 tiny, gel-coated seeds, from which psyllium husk is derived; [Tel.] ఇసపగోలచెట్టు; [Hin.] ఇస్పగోల్ (ఇసాబ్ గోల్); భారతదేశం అంతటా వివిధ కంపెనీల వారు దీనిని అమ్ముతున్నారు (డాబర్, వైద్యనాధ్, పతంజలి, హందర్డ్, … ఇంకా మరెందరో); విరేచనకారిగా ఈ ఇసాబ్ గోల్ ఎంతగా ప్రసిద్ధమంటే, దానితో అమూల్ కంపనీ వారు ఇస్ క్రీం కూడ తయారు చేసి అమ్ముతున్నారు;
pub, n. short for “public house”; the name for a small bar cum restaurant in the U. K.;
puberty, n. తారుణ్య దశ; ఈడు; యవ్వనం; శరీరం మీద వెంట్రుకలు కనబడే వయస్సు;
pubescent, adj. [bot.] నూగుతో ఉన్న;
pubescent hair, ph. తరుణ వయస్సులో శరీరం మీద కనబడే వెంట్రుకలు;
pulley, n. కప్పీ; నేమి; త్రికాసి; గిరక, giraka; గిలక, gilaka
pulley attached to a well, ph. గిలక;
pull-ups, n. pl. దండీలు; ఒక రకం వ్యాయామం; ఎత్తుగా, క్షితిజ సమాంతరంగా వేల్లాడదీసిన చిన్న కర్రని పట్టుకుని వేల్లాడుతూ, గడ్డం కర్రకి తగిలే వరకూ శరీరాన్ని లేవనిత్తడం;
pulmonary, adj. పుఫుస; ఊపిరితిత్తులకి సంబంధించిన;
pulmonary artery, ph. పుపుస ధమని;
pulmonary circulation, ph. పుపుస ప్రసరణం;
pulmonary vein, ph. పుపుస సిర;
pulp, adj. చవకబారు;
pulp fiction, ph. చవకబారు కాల్పనిక సాహిత్యం;
pulp, n. గుజ్జు; తాండ్ర;
mango pulp, మామిడి తాండ్ర;
paper pulp, కాగితపు గుజ్జు;
pulse, n. నాడి; ధాతునాడి; ఆరోగ్యమైన మగవాడి నాడి నిముషానికి డెబ్భయ్ సార్లు కొట్టుకుంటుంది;
pulsar, n. నాడీమూర్తి; నాడీతార; a celestial object, thought to be a rapidly rotating neutron star, that emits regular pulses of radio waves and other electromagnetic radiation at rates of up to one thousand pulses per second;
pulses, n. pl. కాయ ధాన్యములు; అపరాలు;
pulverization, n. పేషణము;
pulverize, v. i. గుండగు; పిండగు; నుగ్గగు; చూర్ణమగు;
pulverize, v. t. గుండచేయు; నూరు; పిండిచేయు; నుగ్గుచేయు; చూర్ణముచేయు; పేషించు;
pulverizer, పేషకి; పేషకం; పేషణ యంత్రం; పిండి మర;
pump, n. పంపు; బొంబాయి; తోడిక; చాలకం;
hand pump, ph. బొంబాయి;
sump pump, ph. కూప తోడిక; మురికి నీళ్లు ఒక గోతి (కూపం) లోకి చేరుకున్నప్పుడు ఆ నీటిని బయటకు తోడే సాధనం;
water pump, ph. జల చాలకం;
pump, v. t. కుంభించు; తోడు;
pumpkin, n. గుమ్మడి; తియ్య గుమ్మడి; భద్రపర్ణి; కూశ్మాండం;
pun, n. అక్షరక్రీడ; శ్లేష; ఒకే మాటని రెండర్ధాలు వచ్చేలా ప్రయోగించటం;
punch, n. (1) పిడిగుద్దు; (2) పంచి; అయిదు రుచులతో కూడిన పానీయం; (3) పడి అచ్చు; లోహపు రేకులమీద అచ్చువేసే పనిముట్టు;
punch line, ph. పతాక వాక్యం;
punctilious, adj. సూక్ష్మాచార; సూక్ష్మాచారపరాయణ;
punctuality, n. సమయపాలన; తరితనం;
punctually, adv. ఠంచనుగా;
punctuation mark, n. విరామ చిహ్నం;
puncture, n. తూటు; బెజ్జం; చిల్లు; పంక్చరు; పంచేరు;
puncture, v. i. తూటు పడు; బెజ్జం పడు; చిల్లు పడు;
puncture, v. t. తూటు పెట్టు; చిల్లు పెట్టు;
puncture vine, n. గోచూర పూవు; [bot.] Tribulus Terrestris;
pungent, adj; ఘాటైన; కటువైన;
punish, v. t. దండించు; శిక్షించు;
punishment, n. దండన; శిక్ష; శాస్తి, adj. శిక్షాత్మక;
capital punishment, ph. ఉరిశిక్ష;
punk, n. పనికిమాలినది; పనికిమాలినవాడు;
punish, v. t. దండించు; శిక్షించు;
puny, adj. బుల్లి; అల్పరూపి అయిన;
pup, n. కుక్కపిల్ల; కుక్కజాతి జంతువుల పిల్ల;
pupa, n. కోశస్థం;
pupil, n. (1) కంటిపాప; కంటిగుడ్డు; కన్నుయొక్క నల్లగుడ్డు; అక్షకూటం; తారక; కనీనిక; (2) అంతేవాసి; విద్యార్థి; m. శిష్యుడు; f. శిష్యురాలు;
pure science, ph. ఔపపత్తిక శాస్త్రం; జాను శాస్త్రం;
pure Telugu, ph. జాను తెలుగు;
puree, n. కట్టు; ఎక్కువ నీళ్ళతో ఉడికించి, బాగా జారుగా అయేవరకూ ఎనిపిన వంటకం;
puree of toor dal, ph. కంది కట్టు;
purgative, n. విరేచనకారి;
purgatory, n. నరకం; క్రైస్తవ మతంలో నరకం;
purge, v. t. పరిహరించు; కత్తిరించు; శుద్ధిచేయు; ప్రక్షాళించు;
purity, n. శుద్ధత; శౌచం;
purple, n. ఊదా; ఎరుపు, నీలం కలసిన రంగు; ధూమ్రవర్ణం;
purport, n. తాత్పర్యం; సారాంశం; ఫలితార్థం;
purpose, n. ప్రయోజనం; ఉద్దేశం; ఉపయోగం;
general purpose, ph. విశాల ప్రయోజనం;
special purpose, ph. పరిమిత ప్రయోజనం;
purposelessness, n. నిష్ప్రయోజనం; వ్యర్థం;
purposive, adj. ప్రయోజనార్ధక;
purslane, n. కుల్ఫా; ఒక ఓషధి; బచ్చలిని పోలిన ఒక ఆకు కూర; [bot.] Portulaca oleracea of the Portulacaceae family;
purse, n. ముల్లె; డబ్బు సంచి; కీసా; పొంకణం;
push, adj. తోపుడు;
pushcart, ph. తోపుడు బండి;
push, n. చొరవ;
push-ups, n. pl. బస్కీలు; ఒక రకం వ్యాయామం; కాళ్లతోటీ, చేతుల తోటీ నేలని దన్ను చేసుకొని, బోర్లా ఉన్న భంగిమలో, నేలకి మోకళ్లు తగలకుండా, శరీరాన్ని పైకి లేపడం;
purslane, n. పావిలాకు;
pursue, v. t. (1) వెంబడించు; వెంటతరుము; అనుసరించు; (2) అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నం చేయు;
purulent, adj. చీము కలిగినట్టి; చీము పట్టిన;
purview, n. పరిధి; దృక్ పరిధి; చూపుమేర; ఎరికె;
pus, n. చీము; see also రసి;
push, v. t. తోయు; నెట్టు;
pushy, adj. చొరవ;
pussyfoot, v. i. నాన్చు; వివాదాస్పదమైన విషయంలో ఎటూ మొగ్గకుండ నాన్చు;
pustules, n. pl. చీముపొక్కులు; చీముతో నిండిన, చిన్న, గుండ్రని పొక్కులు;
putch, n. (పుచ్) విప్లవోద్యమం;
putrid, adj. కుళ్లు; కుళ్లిన; పూతి; కోథ;
putrid odor, ph. కుళ్లు కంపు; పూతి గంధం;
putrefaction, n. కుళ్లింపు; కోథీకరణ;
puzzle, n. అరోచకం; ప్రహేళిక; పజిలు; పజిల్;
crossword puzzle, ph. గళ్లనుడికట్టు; పదకేళి;
pyol, n. అరుగు; చీడీ; ఇంటిని ఆనుకుని ఉండే ఎత్తయిన తీనె;
pyol, n. అరుగు; ఇంటి ముందు, ఇంటికి ఆనుకుని ఉన్న ఎత్తయిన తిన్నె;
pyre, n. చితి; ఒలికి;
pyro, adj. మంటకి సంబంధించిన;
pyroelectricity, n. తాప విద్యుత్తు; అగ్నివిద్యుత్తు; ఉష్ణవిద్యుత్తు;
pyrometer, n. బాగా ఎక్కువ వేడిని కొలిచే తాపమాపకం; ఉడుకుతున్న వస్తువుల వేడిని కాని, మండుతున్న వస్తువుల వేడిని కాని కొలిచే తాపమాపకం;
pyrotechnics, n. pl. బాణసంచా;
python, n. (1) కొండచిలువ; పెనుబాము; మచ్చల కొండచిలువ (reticulated python) అన్నిటికంటె పొడవైన పాము; (2) కంప్యూటర్ రంగంలో క్రమణికలు రాయడానికి వాడే ఒక భాష పేరు;
pyorrhea, pyorrhoea (Br.) n. పూతిదంతం; దంతవేష్టి; చీము పట్టిన పన్ను;
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN: 0-9678080-2-2