Part 1: V

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • V, a voiced labio-dental fricative continuant; It is articulated using the lower lips and the upper teeth: the lower lips are slightly put behind or against the upper teeth. Its phonation is "voiced". That means that you let your vocal cords vibrate when pronouncing it. దంత్యోష్ఠం; పలుకునప్పుడు V ని W ని వేర్వేరుగా పలుకవలెను;
  • vacancy, n. ఖాళీ;
  • vacant, adj. ఖాళీగానున్న; శూన్యమైన;
  • vacate, v. t. (1) ఖాళీచేయు; (2) రద్దుచేయు; న్యాయస్థానంలో తీర్పుని రద్దు చేయు;
  • vacation, n. విశ్రాంతికి గాని వ్యాహ్యాళికి గాని, వినోదానికి గాని, చేసే పని నుండి తీసుకొనే శలవులు; శలవులు; see also holidays;
  • vaccination, n. టీకాలువేయుట; వత్సీకరణ; (ety. Latin, vacca: = cow, Sans. వత్సా = ఎద్దు;)
  • vaccine, n. టీకాల మందు; వత్సలం; [Lat. vacca = cow]; vaccination is a specific type of inoculation for smallpox;

---Usage Note: Vaccinate, inoculate and immunize

  • Of the three words, vaccinate is the most narrow because it specifically means to give a vaccine to someone. Inoculation is more general and can mean implanting a virus, as is done in vaccines, or even implanting a toxic or harmful microorganism into something as part of scientific research. Immunize is the most general of the three words and can mean to grant immunity to a wide variety of things, not just diseases.
  • vacillate, v. i. ఊగిసలాడు; తటపటాయించు;
  • vacuum, n. శూన్యం; శూన్యప్రదేశం; నిప్పచ్చరం; రిక్తాకాశం; లేబరం; పీడనం లేని ప్రదేశం;
    • vacuum tube, ph. శూన్య నాళిక; నీరంధ్ర నాళిక;
  • vacuous, adj. శూన్యమైన; అస్పష్ట; సందిగ్ధ;
  • vagabond, n. బికారి; దిమ్మరి; దేశదిమ్మరి; తిరుగుమోతు; ఆవారా; ఇల్లు, వాకిలి లేని వాడు;
  • vagina, n. యోని; భగరంధ్రం; భగం; పత్త; స్త్రీ జననాంగం;
  • vagrant, n. బికారి; నిలకడ లేకుండా తిరిగే వ్యక్తి;
  • vague, adj. అస్పష్టమైన;
  • vaguely, adv. చూచాయగా; చూచావాచాయగా;
  • vain, adj. (1) వ్యర్థమైన; వృధా; నిష్ప్రయోజనమైన; నిష్ఫలమైన; (2) అహంభావంతో; గర్వ పూరితమైన; స్వాతిశయ; ఆడంబర; ఆత్మస్తుతివంత; సొంత డబ్బా కొట్టుకునే;
  • vale, n. లోయ;
  • valedictory, adj. వీడ్కోలుకి సంబంధించిన; ఆమంత్రణ;
 
బాహుబలం
  • valency, n. (1) [chem] బాహుబలం; బాలం; సంయోగ సామర్థ్యం; సంసా; సంయోజకత; ఒక రసాయన మూలకం ఇతర మూలకాలతో సంయోగపడడానికి చూపే సంసిద్ధత; (2) [ling.] భాషాశాస్త్రంలో ఒక క్రియా వాచకాన్ని ఎన్ని విధాలుగా వాడకలమో సూచించే సంఖ్య;
  • valerian, n. జాలకం; సుగంధబల; తగర్; ఒక ఓషధి; [bot.] Valeriana officinalis of the Caprifoliaceae family;
  • valet, n. (వేలే) అంగసేవకుడు; పరిచారకుడు;
  • valice, n, చిన్న చేతి సంచి; చిక్కం;
  • valid, adj. యుక్తియుక్తమైన; సమ్మతమైన;
  • validation, n. క్రమబద్ధీకరణం; నిబద్ధీకరణం;
  • validity, n. సక్రమత; సప్రమాణత; చట్టబద్ధత; క్రమబద్ధత; నిబద్ధత;
  • valley, n. లోయ; కోన;
    • Silicon Valley, n. సిరి కోన;
  • valor, n. పరాక్రమం; పౌరుషం; మగటిమి; మగతనం;
  • valuable, adj. విలువైన; అపురూపమైన;
  • valuables, n. జవాహరీ; విలువైన వస్తువులు; నగలు;
  • valuation, n. అందాజు;
  • value, n. విలువ; వెల; మూల్యం; ఫలం; దారణ; (def.) amount of money an object is worth;
    • intrinsic value, ph. అసలు విలువ; వాస్తవ విలువ;
    • moral value, ph. నైతిక విలువ;
    • social value, ph. సామాజిక విలువ;
  • valuation, n. మౌల్యమాపనం;
  • valve, n. కవాటం; కపాటిక; పిధానం; అరరం; మీట తలుపు; ఒక వైపు మాత్రమే తెరచుకొనే తలుపు;
    • heart valve, ph. హృదయ కవాటం; గుండేలో ఉండే మీద గదులకి, కింది గదులకి మధ్య ఉండే తలుపు లాంటి వ్యవస్థ:
  • vamp, n. తన అందచందాలతో పురుషులని వంచించు సాహసురాలు;
  • van, n. బండి; పెట్టె బండి; పెట్టె ఆకారంలో ఉన్న కారు;
  • vane, n. గాలి కోడి; గాలి ఎటు వీచుతున్నదో తెలియజేసే సాధనం;
  • vanguard, n. (1) వైతాళికులు; (2) ఎదురు సన్నాహులు;
  • vanish, v. i. మాయమగు; అంతర్ధానమగు; అదృశ్యమగు; హరించిపోవు; కరగిపోవు;
  • vanity, n. స్వాతిశయం; ఆడంబరం; ఆత్మస్తుతి; అహంబ్రహ్మత్వం;
  • vanquished, n. పరాజితుడు; పరాజేత; ఓడిపోయిన శాల్తీ;
  • vapid, adj. చప్పని; రక్తి కట్టని;
  • vapor, vapour (Br.), n. కావిరి; బాష్పం; (note) steam is water vapor;
  • vaporization, n. కావిరియగుట; బాష్పీకరణం; బాష్పీభవనం; (Br.) vaporisation;
    • latent heat of vaporization, ph. భాష్పీభవన గుప్తోష్ణత;
  • variable, adj. చల; చర; అవ్యక్త; మార్చుటకు వీలైన;
    • variable cost, ph. చర వ్యయం;
    • variable quantity, ph. అవ్యక్త చలరాశి;
  • variable, n. చలరాశి; చలనరాశి; చలాంశం; చరరాశి; చరాంకం; చరాంశం; అస్థిరరాశి;
    • dependent variable, ph. పరాధీన చలరాశి;
    • independent variable, ph. స్వతంత్ర చలరాశి; స్వతంత్ర చలాంశం;
  • variables, n. pl. [math.] చలరాశులు; (2) [astron.] హెచ్చుతగ్గు కాంతితో ప్రకాశించే నక్షత్రాలు;
    • eclipsing variables, [astron.] గ్రహణకారి నక్షత్రాలు;
  • variance, n. అంతరం; భేదం;
  • variant, n. (1) అసలు కంటే కొద్ది భేదముతో ఉన్నది; (2) ఒక కొత్త సూక్ష్మజీవి, ఒక అసలు సూక్ష్మజీవి నుండి వచ్చి, జన్యు పరంగా కొన్ని వేరే లక్షణాలు ఉన్నది. కానీ ఈ కొత్త సూక్ష్మజీవిని వేరే తెగకు చెందినది అనలేము, అసలు సూక్ష్మజీవితో జన్యుపరంగా పోలికలు వల్ల.
  • variation, n. మార్పు; వ్యత్యాసం; చలత్వం; వికారం; విచలనం;
  • varied, adj. వివిధ; నానావిధములైన;
  • variety, adj. వైవిధ్య; భిన్న; కదంబ;
    • variety program, ph. కదంబ కార్యక్రమం;
  • variety, n. (1) వైవిధ్యత; భిన్నత్వం; మార్పు; (2) కలగూరగంప; (3) రకం; రకరకాలు;
  • variola, n. మసూచికం; పెద్ద అమ్మవారు;
  • various, adj. వివిధ; రకరకాల; పరిపరి; నానావిధ;
  • varnish, n. మెరుగు నూనె; వార్నీషు;
  • vary, v. t. మార్చు;
  • varying, adj. తరతమ;
  • vas deferens, n. శుక్రనాళం;
  • vasectomy, n. శుక్రనాళాన్ని కత్తిరించడం; (rel.) పేగు మెలిక;
  • Vaseline, n. శిలతైల ఖమీరం; వేసలీను; పెట్రోలియం జెల్లీకి ఇది ఒక వ్యాపార నామం; జెర్మనీ భాషలోని ’నీరు’ అనే మాటని, గ్రీకు భాషలోని ’ఆలివ్‍ నూనె’ అనే మాటని సంధించగా ’వేసలీను’ అనే మాట వచ్చింది; Trade name of petroleum jelly or petrolatum; Vaseline is more refined than petroleum jelly and is often used as a medicinal ointment, although it does not have any therapeutic properties;
  • vaso, adj. ధమనులకి సంబంధించిన; రక్తనాళాలకి సంబంధించిన;
  • vasodilation, n. రక్తనాళాలు (ధమనులు) ఉబ్బేటట్లు చెయ్యడం;
  • vassal, n. సామంతరాజు; కప్పం కట్టే రాజు; పాలెగాడు;
  • vassalage, n. దాస్యం;
  • vast, adj. అపార; అపారమైన; మిక్కిలి;
  • vast, n. అపారం;
  • vat, n. బాన; గూన; గోలెం; తొట్టె;
  • vault, n. ఇనప్పెట్టె; రహస్య స్థలంలో దాచిన పెట్టె;
  • veal, n. దూడ మాంసం; (note) ఆవు (ఎద్దు) మాంసాన్ని beef అంటారు;
  • vector, n. (1) దిశమాణి; సదిశరాశి; సాయకం; తూపు; విహిత రేఖ; కాయత్వం; దిశ కలిగిన చలనరాశి; నాభిశ్రుతి; (2) రోగవాహకం; ఆరోహకం; జబ్బులని ఒక చోట నుండి మరొక చోటికి మోసుకుని వెళ్లే జీవి;
    • vector database, ph. A vector database is a specialized storage system designed to efficiently handle and query high-dimensional vector data, commonly used in AI and machine learning applications for fast and accurate data retrieval;
    • vector field, ph. (phy.) సాయక క్షేత్రం; a space in which each point represents a vector quantity; ఉదా. ఒక ప్రదేశంలో ఎక్కడెక్కడ ఎంతెంత జోరుగా, ఏ దిశలో గాలి వీచుతునాదో చెప్పాలంటే ఆ ప్రదేశంలో ప్రతి బిందువు దగ్గర ఒక సాయకం (బాణం గుర్తు) వేసి చెప్పవచ్చు;
 
Vector_field
    • vector space, ph. సాయక ఆవరణం; a space consisting of vectors, together with the associative and commutative operation of addition of vectors, and the associative and distributive operation of multiplication of vectors by scalars;
  • Vedic, adj. నైగమ; వేద; వేద సంబంధమైన;
    • Vedic civilization, ph. నైగమ నాగరికత; వైదిక నాగరికత;
    • Vedic times, ph. వేదకాలం; నైగమ కాలం;
  • Vega, n. (వీగా) అభిజిత్; బొమ్మచుక్క; రాత్రి ఆకాశంలోని ప్రకాశవంతమైన తారలలో ఇది అయిదవది;
  • vegetable, adj. ఉద్భిజ్జ; శాక;
    • vegetable color, ph. ఉద్భిజ్జ వర్ణం;
    • vegetable fat, ph. ఉద్భిజ్జ మేదం; శాకీయ మేదం; శాకీయ గోరోజనం;
    • vegetable matter, ph. ఉద్భిజ్జ ద్రవ్యం;
    • vegetable oil, ph. ఉద్భిజ్జ తైలం;
    • vegetable sap, ph. కర్రు;
  • vegetables, n. శాకములు; కాయగూరలు; కూరగాయలు; ఉద్భిజ్జములు;
    • green vegetables, ph. ఆకుకూరలు;
    • root vegetables, ph. దినుసు గడ్డలు; దుంపలు;

Usage Note: Some popular vegetables and their Telugu and (Sanskrit) names

    • aubergine = వంకాయ (వార్తాకమ్)
    • brinjal = వంకాయ (వార్తాకమ్)
    • banana = అరటి పండు (కదళీ)
    • bell pepper = బుట్ట మిరప, కాప్సికం (రాజకోశతకీ)
    • bitter gourd = కాకరకాయ (కారవేల్ల)
    • bottle gourd = సొరకాయ, ఆనపకాయ (శీతలా)
    • carrot = ముల్లంగి (మూలకమ్)
    • chili peppers = మిరపకాయలు (మరిచకా)
    • cluster beans = గోరుచిక్కుడు (క్షుద్రశింబి)
    • cucumber= దోసకాయ (ఉర్వారుక)
    • eggplant = వంకాయ (వార్తాకమ్)
    • elephant-foot yam = కంద (సూరణ)
    • garlic = వెల్లుల్లి (లశున)
    • lime, lemon = నిమ్మకాయ (జంబీరమ్)
    • okra = (అవాక్పుష్పీ) (బెండకాయ)
    • onion = ఉల్లిగడ్డ (ఒలాండు)
    • plantain = కూర అరటికాయ (రంభాశలాటు)
    • potato = (ఆలుకమ్) (బంగాళదుంప)
    • prickle eggplant = ముళ్ళవంకాయ (బృహతీ)
    • pumpkin = గుమ్మడికాయ (కూష్మాండ)
    • ridged gourd = (కోశాతకీ) బీరకాయ
    • taro root = చేమదుంప (తౄణబిందుక)
    • tindora = దొండకాయ (బింబమ్)
  • vegetarian, adj. శాకాహార;
  • vegetarian, n. శాకాహారి;
  • vegetate, v. t. ఈడిగిలపడు; బద్ధకంగా పడుండు;
  • vegetation, n. ఉద్భిజ్జ సంపద; చెట్టుచేమలు;
  • vegetative, adj. కదలికలేని; స్పందన లేని; [idiom] తోటకూరకాడ వలె;
  • vehicle, n. (1) బండి; యానం; వాహనం; శకటం; తేరు; యుగ్యం; (2) అనుపానం; చేదు మందుకి తేనె అనుపానంగా వాడతారు;
  • vehement, adj. తీవ్రమైన;
  • veil, n. మేలిముసుగు; ముసుగు; పరదా; బురకా; తెర;
  • vein, n. (1) ఈనె; (2) సిర; మలిన రక్తాన్ని మోసుకెళ్లే నాళం; (3) ధోరణి; పంథా; (4) చారిక; రాళ్ళల్లో కనిపించే చారలు;
    • jugular vein, ph. గళ సిర; శిరస్సునుండి మలిన రక్తాన్ని మోసుకెళ్లే నాళం;
    • portal vein, ph. జీర్ణాశయ సిర; ప్రతీహారిణి;
  • velar, adj. హనుమూలీయ; కంఠ్య;
    • velar fricative, ph. హనుమూలీయ కషణాక్షరం;
    • velar stop, ph. హనుమూలీయ స్పర్శ్య;
  • velars, n. కంఠ్యములు; హనుమూలీయములు; నాలుక, మీద అంగుడి సహాయంతో పలికే అక్షరాలు; క, ఖ, గ, ఘ, ఙ; (same as) gutturals;
 
Propagation of a wave packet demonstrating a phase velocity greater than the group velocity without dispersion.
  • velocity, n. [phys.] వేగం; రయం; వడి; ఉరవడి; ధృతిగతి; వేగం; గమనవేగం; (exp.) రయం ఉంటే రంయిమని వెళుతుంది;
    • angular velocity, ph. కోణీయ ధృతిగతి; కోణీయ వేగం; గిరగిర ఆత్మభ్రమణం చేస్తూన్న వస్తువు ఎంత జోరుగా తిరుగుతోందో చెప్పే చలరాశి;
    • constant velocity, ph. స్థిర వేగం; స్థిర ధృతిగతి; ఒక వస్తువు ఒకే దిశలో ఒకే వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటే అది స్థిర ధృతిగతి తో ప్రయాణం చేస్తున్నాదని అంటాం;
    • linear velocity, ph. రేఖీయ ధృతిగతి; రేఖీయ వేగం; నేరుగా ఒక సరళరేఖ వెంబడి ప్రయాణం చేస్తూన్న వస్తువు ఎంత జోరుగా పరిగెడుతోందో చెప్పే చలరాశి;
    • group velocity, ph. గుంపు వేగం; తరంగ చలనాన్ని వర్ణించేటప్పుడు ఎదురయే ఒక సంక్లిష్ట ఊహనం;
    • phase velocity, ph. దశ వేగం; తరంగ చలనాన్ని వర్ణించేటప్పుడు ఎదురయే ఒక సంక్లిష్ట ఊహనం;
    • uniform velocity, ph. తదేక వేగం; తదేక ధృతిగతి; ఒక వస్తువు చలనంలో దిశలో మార్పు లేకుండా వేగంలో మార్పు లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటే అది తదేక ధృతిగతి తో ప్రయాణం చేస్తున్నాదని అంటాం;
  • velum, n. మెత్తని అంగులి; నోటి కప్పు వెనక భాగం; కొండనాలుక;
  • velvet, n. మఖ్మలు గుడ్డ;
  • Vena Cava, n. బృహత్ సిర; బృహన్నాళం; మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం;
    • inferior Vena Cava, ph. అధో బృహత్ సిర; గుండె దిగువ భాగాన ఉన్న శరీరం నుండి మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం;
    • superior Vena Cava, ph. ఊర్ధ్వ బృహత్ సిర; గుండె ఎగువ భాగాన ఉన్న శరీరం నుండి మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం;
  • Vena Portae, n. జీర్ణాశయ సిర; జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం;
  • vend, v. t. అమ్ము; విక్రయించు;
  • vendor, n. విక్రేత; విక్రయదారుడు; అమ్మకందారు; అమ్మేమనిషి;
  • veneer, n. తాపడం; పైపూత; పైకట్టు;
    • brick veneer, ph. ఇటికలు పేర్చి కట్టిన తాపడం;
  • venerable, adj. గౌరవ; పూజ్య; గంగి;
    • venerable bull, ph. గంగిరెద్దు;
    • venerable cow, ph. గంగి గోవు;
  • veneration, n. గౌరవం; పూజ్యభావం;
  • venereal, adj. రతి సంబంధమైన;
    • venereal disease, ph. సుఖరోగం; సవాయి;
  • vengeance, n. కసి; కక్ష; ప్రతీకారం;
  • venison, n. లేడి మాంసం; అయిణం;
 
వెన్న బొమ్మ
  • Venn diagram, n. వెన్నబొమ్మ; తర్కంలోను; బౌల్య బీజగణితంలోను వాడుకలో ఉన్న ఒక రకం బొమ్మ;
  • venom, n. విషం; జంతువుల శరరం నుండి స్రవించి కాటు ద్వారా కాని, పోటు ద్వారా కాని మన శరీరాలలోకి చేరే విష పదార్థం; ఉదా: పాము విషం;
    • neurotoxic venom, ph. నరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది; మనం సాధారణంగా భారత దేశంలో చూసే పాములు - గోధుమ వన్నె త్రాచు (కోబ్రా), కట్ల పాము(red-banded kraits, yellow-banded kraits), నల్ల త్రాచు (కింగ్ కోబ్రా) ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి;
    • heemotoxic venom, ph. రక్త నాళాల ద్వారా వ్యాప్తి చెందుతుంది; Vipers (ఇవి ఎక్కువగా కొండలు, రాళ్ళు, రప్పలు దగ్గర ఉంటాయి), సముద్ర పాములు;
    • venomous snake, ph. విష సర్పం;

Usage Note: venom, toxin, and poison

  • శాస్త్రంలో Toxin అంటే శరీరానికి హాని చేసే విష పదార్థం; ఇది జంతు సంబంధమైన (పాము, తేలు, కందిరీగ, వగైరా) venom కావచ్చు, సూక్ష్మజీవులు తయారుచేసే విషం కావచ్చు, వృక్ష సంబంధమైన (గన్నేరు గింజలు, దురదగుండాకు, వగైరా) విషం కావచ్చు; poison అనే మాట ఖనిజ సంబంధమైన (పాషాణం వంటి) విషాలకి వాడతారు; Venom is made of a complex mix of toxins, which are composed of proteins with unique characteristics; There are three main effects from venom. Neurotoxins attack the nervous system, paralyzing the victim. Hemotoxins target the blood and local tissue toxins attack the area around the site of poison exposure;
  • venomous, adj. విష; విషం గల;
    • venomous snake, ph. విష సర్పం;
  • ventilation, n. వాయుప్రసరణం; గాలి వసతి; గాలి ప్రవహించేలా చెయ్యడం;
  • ventilator, n. (1) గాలి ప్రవహించేలా చెయ్యగలిగే సదుపాయం; చిన్న కిటికీ; ఉపవాతాయనం; పంకాలు వగైరా; (2) ఆసుపత్రిలో రోగి ఉచ్ఛ్వసనిశ్వాసాలకి సహాయపడే యంత్రం, మొ. see also window;
  • ventral, adj. పొట్టవైపు; కడుపుకి సంబంధించిన; ఉదర; జఠర; (ant.) dorsal అంటే వీపు వైపు అని అర్థం;
  • ventricle, n. జఠరిక; గుండెలోని కింది గది; జవనిక; వివరం;
  • ventriloquist, n. రకరకాల గొంతుకలని అనుకరిస్తూ, పెదిమల కదలిక కనబడకుండా మాట్లాడడంలో ప్రావీణ్యత ఉన్న వ్యక్తి;
  • venture, v. i. తెగించు; ఉంకించు;
  • venture, adj. తెగువ; తెగింపు; ఉంకువ;
    • venture capital, ph. తెగింపు మదుపు; తెగింపు పెట్టుబడి;
    • venture capitalist, ph. తెగుదారి; తెగుదారు; తెగువరి; తెగింపు మదుపరి; తెగింపు పెట్టుబడిదారు; ఉంకించు పెట్టుబడిదారు; తెగువ ఉన్న పెట్టుబడిదారు;
  • venture, n. తెగువ; సాహసం;
  • venue, n. సభాస్థలి; కార్యరంగం; చోటు;
  • Venus, n. శుక్రుడు; శుక్రగ్రహం;
  • Venusquake, n. శుక్రకంపం;
  • veracity, n. యదార్థత; సత్యవాదిత్వం;
  • veranda, n. పంచ; వసారా; జగిల; అరుగు; వరండా; ఇంటి ముందుభాగం కావచ్చు, ఇంటిలోపలి ముందుభాగం కావచ్చు;
    • roof of a veranda, ph. పంచపాళీ;
  • verb, n. క్రియ; క్రియావాచకం;
    • auxiliary verb, ph. ఉప క్రియ;
    • copula verb, ph. సంయోజక క్రియ;
    • defective verb, ph. అపూర్ణ క్రియ;
    • finite verb, ph. సమాపక క్రియ;
    • infinite verb, ph. అసమాపక క్రియ;
    • intransitive verb, ph. అకర్మక క్రియ;
    • subjunctive form of verb, ph. చేదర్థకం;
    • transitive verb, ph. సకర్మక క్రియ;
  • verb, n. క్రియ; క్రియావాచకం;
  • verbal, adj. (1) వాగ్రూపంగా; వాచా; వాచిక; నోటితో; శాబారంభ; (2) క్రియకి సంబంధించిన;
    • verbal statement, ph. శాబారంభణం;
  • verbatim, adj. మాటకి మాటగా; చెప్పినది చెప్పినట్లుగా;
  • verbomania, n. ఆపకుండా మాట్లాడే తత్త్వం;
  • verbosity, n. శబ్దపుష్టి; అవసరం కంటె ఎక్కువ మాటలు;
  • verdant, adj. పచ్చని; ఆకుపచ్చని;
  • verdict, n. తీర్పు;
  • verdigris, n. కిలుం; చిలుం; ఇత్తడి, రాగి, వగైరా పాత్రలలో పులుపు పదార్థాలని ఉంచడం వల్ల కలిగే విషపూరిత మాలిన్యం;
  • verification, n. సరిచూచుట; రుజువు తీయుట;
  • verify, v. i. సరిచూచు; రుజువు తీయు; సమర్థించు; ధ్రువపరచు; నిరూపించ; ప్రమాణీకరించు;
  • verify, v. t. సరిచూడు; రుజువు తీయు; సమర్థించు; ధ్రువపరచు; నిరూపించ; ప్రమాణీకరించు;
  • verity, n. సత్యం;
  • vermicelli, n. (వెర్మిఛెల్లీ) సేమియా; అతి సన్నగా ఉన్న స్పగేటీ;
  • vermiform appendix, n. క్రిమిక;
  • vermilion, n. (1) ఇంగిలీకం; రంగులకి వాడే ఎరుపు రంగు ఉన్న రసగంధకిదం; (2) కుంకం రంగులో ఉన్న ఎరుపు రంగు గుండ, ఏదైనా సరే;
  • vernacular, n. వ్యావహారికం; వ్యావహారిక భాష; దేశభాష; ప్రాంతీయ భాష;
  • vernal, adj. వాసంతిక; వసంత; వసంత రుతువుకి సంబంధించిన;
    • vernal equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; వసంతకాలంలో రాత్రి, పగలు సమంగా ఉండే రోజు;
  • versatility, n. ప్రజ్ఞానం; చాతుర్యత; బహుముఖ ప్రజ్ఞ; సర్వతోముఖ ప్రజ్ఞ;
  • verse, n. పద్యం;
  • version, n. (1) పాఠాంతరం; (2) కథనం; విధం; పద్ధతి;
  • vertebra, n. s. వెన్నుపూస; పూస; కశేరుకం; కీకసం;
    • cervical vertebra,, ph. గ్రైవేయ కశేరుకం;
    • lumbar vertebra,, ph. నడ్డిపూస; కటి కశేరుకం;
  • versus, adv. ప్రతిగా;
  • vertebrae, n. pl. వెన్నుపూసలు; కసేరులు;
    • vertebral artery, ph. కీకస ధమని;
    • vertebral column, ph. వెన్నెముక; కీకసమాల; బ్రహ్మదండము;
  • vertebrate, n. కశేరుకం; పృష్టవంశి; వెన్నుపూస వున్న జంతువులు;
  • vertex, n. శీర్షం; అగ్రం; శిఖ; శిరోస్థానీయ బిందువు;
  • vertical, adj. నిటారైన; నిట్ర; శీర్షలంబ; క్షితిజలంబ;
    • vertical axis, ph. నిట్రాక్షము; శీర్షాక్షం;
    • vertical line, ph. లంబరేఖ; నిట్రరేఖ; క్షితిజలంబ రేఖ; నిలువు గీత;
  • vertigo, n. తలతిప్పు; తల తిరగడం; కండ్లు తిరగడం; see also dizziness;
  • verve, n. ఓజస్సు; ఉత్సాహం;
  • very, adj. (1) చాలా; (2) అదే;
  • very good, ph. చాలా బాగుంది;
  • vessel, n. (1) పాత్ర; కలశం; (2) బిందె; అండా; డెయిసా; గుండిగ; గంగాళం; (3) పడవ; నౌక; (4) నాళం; గొట్టం; రక్తనాళం;
    • large vessel, ph. అండా; డెయిసా; గుండిగ; గంగాళం;
  • verdict, n. తీర్పు;
  • verification, n. రుజువు; దాఖలా;
  • vesicle, n. బొబ్బ; పొక్కు;
    • vesicle for boiling bathwater, ph. డెయిసా; గీజరు;
  • vest, n. అంగరక్ష; కబ్బా; చేతులు లేని బిగుతైన చొక్కా;
  • vested, adj. (1) పరిపూర్ణంగా; శాశ్వతంగా; నిబంధనలు లేకుండా; పించను వంటి డబ్బు పొందడానికి సంపాదించుకున్న హక్కు వంటి పరిపూర్ణత;
    • vested interest, ph. స్వలాభాపేక్ష; స్వామికార్యంతో జరుపుకునే స్వకార్యం;
  • vestibule, n. కుహరిక;
  • vestige, n. s. జాడ; చిహ్నం;
  • vestiges, n. pl. అవశేషాలు;
  • veteran, n. (1) అనుభవజ్ఞుడు; (2) యుద్ధం చవిచూసిన వ్యక్తి; డక్కామక్కీలు తిన్న వ్యక్తి;
  • veterinary, adj. పశు; అశ్వ;
    • veterinary doctor, ph. పశు వైద్యుడు; అశ్వ వైద్యుడు;
    • veterinary science, ph. పశువుల వైద్యం; జంతువైద్య శాస్త్రం; అశ్వ శాస్త్రం;
  • vex, v. t. చీకాకు పెట్టు; విసిగించు;
  • vexation, n. చికాకు; విసుగు;
  • via, prep. మీదుగా; గుండా;
  • viability, n. స్వయంభరణ శక్తి;
  • viaduct, n. లోతైన లోయ మీద కట్టిన వంతెన;
  • vial, n. చిన్న మందు సీసా;
  • vibrate, v. i. కంపించు; వీగు; స్పందించు; చలించు;
  • vibration, n. కంపనం; స్పందనం; చాలనం; అదురు;
    • damped vibration, ph. అవరుద్ధ స్పందనం;
    • plane of vibration, ph. కంపన తలం;
    • transverse vibration, ph. తిర్యక్ కంపనం;
  • vice, adj. ఉప; ఇంకొకరికి బదులుగా;
    • vice-chancellor, ph. ఉపకులపతి;
    • vice president, ph. ఉపరాష్టప్రతి; ఉపాధ్యక్షుడు;
  • vice, n. వ్యసనం; దురలవాటు; దురభ్యాసం; దుర్గుణం; అవగుణం; సీదనం;
  • vicissitudes, n. pl. సుఖదుఃఖాలు; మంచిచెడ్డలు; పరిణామాలు;
  • vicious, adj. విష;
    • vicious circle, ph. విష వలయం;
  • victim, n. పరాజిత; పరాజితుడు;
  • victor, n. విజేత; జేత;
  • victorious, adj. జయించిన; గెలుపొందిన; గెలిచిన;
  • victory, n. జయం; విజయం; గెలుపు;
  • victuals, n. pl. దినుసులు; వంటకాలు; ఆహారపదార్ధాలు;
  • video, adj. దృశ్యమాన; వీక్షక;
  • video, n. (1) కదిలే బొమ్మలని నమోదు చేసి, తిరిగి తెరమీద చూపించగలిగే సాంకేతిక ప్రక్రియ; (2) తెర మీద కనిపించే బొమ్మలు;
  • vie, v. t. పోటీ చేయు;
  • view, v. t. చూడు; చూచు; దర్శించు; సందర్శించు;
  • view, n. (1) దృశ్యం; (2) వీక్షణం; దృష్టి; (3) అభిప్రాయం;
    • formal view, ph. స్వరూప దృష్టి;
    • functional view, ph. ప్రయోగ దృష్టి;

Usage Note: view, sight, scene, and vision

  • ---Use these words as countable nouns when you talk about things you see. Use view to talk about things you can see from a window or an elevated place: The view from this window is beautiful. Use sight to describe something that is unusual or beautiful: The Taj Mahal in the moonlight is a spectacular sight. Use scene to talk about a place where something happened: The murder scene was cluttered with footprints. Use vision to talk about an idea: Nehru had a romantic vision of a world without wars. When sight and vision are used as uncountable nouns, they mean “the ability to see”: He lost his sight due to glaucoma.
  • viewer, n. (1) చూడడానికి వాడే పరికరం; చూసేది; దర్శని; వీక్షకం;(2) చూసే వ్యక్తి; దిదృక్షువు;
  • viewers, n. pl. (1) వీక్షకులు; చూపరులు; చూసేవారు; దుర్భిణి, సూక్ష్మదర్శని, దూరదర్శని వంటి పరికరాలతో చూసేవారు; (2) ; ప్రేక్షకులు;
  • viewpoint, n. దృక్పథం; దృక్కోణం; కనురోక;
  • vigesimal, adj. వింశాంశ; ఇరవై అంశలు కల; దశాంశ పద్ధతికి ప్ది అంశలు ఉంటే వింశాంశ కి ఇరవై అంశలు; to the base twenty
  • vigil, n. జాగరం; పారా; కాసుకొని కూర్చోవడం; కాపు; కాపలా కాయడం; మెళుకువతో ఉండటం;
    • death vigil, ph. శవ జాగరం;
  • vigilance, n. అప్రమత్తత;
  • vigilant, adj. అప్రమత్త;
  • vignette, n. (విన్యట్) (1) పదచిత్రం; (2) నేపథ్యంలో కలిసిపోయే (అంచులు లేని) చాయాచిత్రం;
  • vigor, n. ఓజస్సు; బలం;
  • vigorous, adj. ఓజోమయ;
  • vile, adj. కుత్సిత;
  • vilify, v. t. ఆడిపోసుకొను; నిందించు; దూషించు;
  • village, adj. గ్రామీణ;
  • village, n. పల్లె; పల్లెటూరు; గ్రామం; ప్రోలు; ఊరు; జనపదం;
    • village council, ph. పంచాయతీ;
    • very small village, ph. కుగ్రామం;
  • villagers, n. pl. పల్లెటూరు జనం; జానపదులు; గ్రామస్థులు;
  • villain, n. కూళ; కూళుడు; తులువ; ప్రతినాయకుడు;
  • villi, n. శృంగకములు;
  • villose, n. నూగు; సన్నని జుత్తు వంటి పదార్థం;
  • vindication, n. గౌరవం నిలుపుకోవడం;
  • vine, n. (1) తీగ; పాదు; (2) ద్రాక్షతీగ;
  • vinegar, n. సిరకా; సిర్కా; పులిసిన సారా; సజల అసితామ్లం; see also acetic acid;
  • vineyard, n. ద్రాక్షతోట;
  • vinculum, n. [math] శిరోవారం; గణితంలో కొన్ని చలరాసుల నెత్తిమీద గీసే చిన్న గీత;
  • violate, v. t. అతిక్రమించు; హద్దుమీరు; ఉల్లంఘించు; జవదాటు; మేరమీరు; ఒత్తరించు;
  • violation, n. అతిక్రమణ; ఉల్లంఘన; జవదాటడం;
  • violence, n. హింస; హింసాకాండ; చిత్రహింస; అంకపొంకాలు;
  • violent, adj. హింస; హింసాయుత; అంకపొంకంగా;
    • violent activity, ph. హింసాకాండ;
  • violet, n. ఊదా; నీలలోహిత; లేత ఎరుపు నీలం కలసిన రంగు; బచ్చలిపండు రంగు;
  • violin, n. వాయులీనం; వయలిన్; వయలిన్‌కి నాలుగు తీగలు ఉంటాయి; ఫిడేలుకి నాలుగు కంటె తక్కువ తీగలు ఉంటే ఉండొచ్చు;
  • viper, n. పాము; సర్పం; ఒక జాతి విష సర్పం; అమెరికాలో ఉండే గిలక పాములు, ఆఫ్రికాలో ఉండే నల్ల మాంబా పాములు ఈ జాతి పాములే; ఈ జాతి పాములు సర్వసాధారణంగా గుడ్లు పెట్టడానికి బదులు పిల్లల్ని కంటాయి; అందుకనే వీటికి "viper" అన్న పేరు వచ్చింది; (ety.) Lat. vivo = live, partus = birth;
    • pit viper, ph. ఈ జాతి విష సర్పానికి తలమీద రెండు గంట్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది;
  • viral, adj. జనబాహుళ్యంలోకి జోరుగా వెళ్ల్లగలిగే సమర్ధత గల;
  • virgin, adj. అనుభవం లేని; దున్నని; పరిశోధించని; పచ్చి;
    • virgin land, ph. అనాది బీడు;
    • virgin oil, ph. పచ్చి నూనె;
  • virgin, n. కన్య; లైంగిక అనుభవం పొందని యువతి;
  • Virgo, n. (1) కన్యారాశి; పరిమాణంలో దీనిది ద్వాదశ రాశులలో రెండవ స్థానం; (2) హస్తా నక్షత్రం;
    • Delta, Eta, Gamma of Virgo, ph. హస్తా నక్షత్రం;
  • virility, n. మగటిమి; మగతనం; మగపోడిమి; వీర్యపటుత్వం;
  • virtual, adj. మిధ్యా; కాల్పనిక; అవాస్తవ; అభాస; ఊహాత్మక; లేనిది ఉన్నట్లు అనిపించడం లేదా కనిపించడం; almost or nearly as described, but not completely or according to strict definition;
    • virtual computing, ph. మిథ్యా కలనం; అభాస కలనం; computation done on a computer that does not physically exist as such but made possible by software to appear to do so;
    • virtual image, ph. మిధ్యా బింబం; అభాస బింబం;
    • virtual machine, ph. మిథ్యా యంత్రం; not physically existing as such but made by software to appear to do so;
    • virtual particle, ph. అభాస కణాలు; In physics, a virtual particle is a transient quantum fluctuation that exhibits some of the characteristics of an ordinary particle while having its existence limited by the uncertainty principle;
    • virtual reality, ph. కాల్పనిక వాస్తవత్వం; మిథ్యా వాస్తవం; ఊహాత్మక వాస్తవం;
    • virtual work, ph. కాల్పనిక కర్మ; Virtual work is the total work done by the applied forces and the inertial forces of a mechanical system as it moves through a set of virtual displacements;
  • virtue, n. గుణం; సుగుణం;
  • virtuoso, n. ఘనాపాటీ;
  • virulent, adj. తీవ్రమైన; ఘాటైన;
  • virus, n. (1) విషాణువు; వైరస్; జన్యు పదార్థము, దానిని రక్షిస్తూ కొంత ప్రాణ్యము ఘటకద్రవ్యాలుగా కలిగి ప్రాణం ఉందా లేదా అనే త్రిశంకులోకంలో ఉన్న పదార్థం; క్షీరదాల జీవకణాల కంటె, బేక్టీరియాల కంటె, ఎన్నో రెట్లు చిన్నదయిన విషాణువు; ఇవి జీవకణంలో తిష్ట వేసినప్పుడు తప్ప స్వయంప్రతిపత్తితో జీవించలేవు; Viruses are often no more than a set of genes wrapped inside a protein coat;”(2) కంప్యూటరులో ఉన్న క్రమణికలు చెయ్యవలసిన పనులు చెయ్యటానికి వీలులేకుండా పాడుచెయ్యగల మరొక క్రమణిక;
  • visa, n. గుత్తుపొత్తంలో వేసే అధికార ముద్ర; ఒక వ్యక్తి మరొక దేశం వెళ్లేటప్పుడు ఆ అతిథేయ దేశం ఆ వ్యక్తికి ప్రవేశార్హత ఇస్తూ గుర్తింపు పుస్తకంలో వేసే రాజముద్ర; (rel.) passport;
  • vis-a-vis, adv. సంబంధించిన; పోల్చి చూడదగ్గ; పక్కపక్కన; ఎదురెదురుగా;
  • viscera, n. పేగులు; ఉదర కుహరంలోని అవయవాలు;
  • viscid, adj. జిగట; జిగురుగానున్న; స్నిగ్ధత ఉన్న;
  • viscosity, n. స్నిగ్ధత;
  • visibility, n. కనిపించడం; దృశ్యత;
  • visible, adj. దృగ్గోచర; దృశ్యమాన; దృశ్యమైన; దృశ్య; దృష్ట; గోచరమగు; కనబడే; అగపడే; ఆదరక:
    • visible light, ph. దృశ్య కాంతి; దృష్ట కాంతి; కంటికి కనబడే కాంతి; అగపడే కాంతి;
    • visible universe, ph. దృశ్య విశ్వం; దృష్ట విశ్వం; దృగ్గోచర విశ్వం; కంటికి కనబడే విశ్వం; అగపడే విశ్వం;
  • visible, n. దృష్టం;
  • vision, n. (1) దృష్టి; చూపు; (2) దూరదృష్టి; ముందుచూపు;
    • binocular vision, ph. ద్వినేత్ర దృష్టి;
    • monocular vision, ph. ఏకనేత్ర దృష్టి;
    • peripheral vision, ph. దృష్టి పరిధి;
    • vision statement, ph. ద్రాష్టిక ప్రవచనం;
  • visionary, n. ద్రష్ట; దూర దృష్టి, ఊహాత్మకమైన దృష్టి ఉన్న వ్యక్తి; ముందు చూపు గల మనిషి;
  • visitors, n. సందర్శకులు;
  • vista, n. దృశ్యం; దిగంతర దృశ్యం;
  • visual, adj. కంటికి సంబంధించిన; దృష్టికి సంబంధించిన; చక్షుష;
    • visual field, ph. దృష్టి క్షేత్రం;
  • visualization, n. దృశ్యీకరణం;
  • visualize, v. i. ఊహించు; కంటికి ఎదురుగా ఉన్నట్లు ఊహించు;
  • vital, adj. ప్రాణాధార; మూలాధార; ప్రాణప్రద; అతిముఖ్యమైన; (lit.) to do with living;
    • vital capacity, ph. త్రాణ; మూలధారణం;
    • vital force, ph. మూలాధార శక్తి;
    • vital parts, ph. మర్మస్థానములు; మర్మావయవములు;
    • vital records, ph. జనన మరణాలకి సంబంధించిన; వివాహ విడాకులకి సంబంధించిన కాగితాలు;
    • vital signs, ph. కీలక ముఖ్యమైన ఆరోగ్య సూచికలు; శరీరపు తాపోగ్రత, నాడి రేటు, శ్వాస రేటు, రక్తపు పోటు - ఈ నాలుగు ముఖ్యమైన ఆరోగ్య సూచికలు;
  • vital, n. ప్రాణాధారం; మూలాధారం;
  • vitality, n. చేతన; చేతస్సు;
  • vitamin, n. విటమిను; వైటమిను; అతి ముఖ్యమైన పోషక పదార్థం; (ety.) vital + amine = "vitamine," from which the last letter is dropped; this is a misnomer because amines are not a part of all vitamins;
  • vitiligo, n. బొల్లి; చర్మంలో మెలనిన్‍ అనే రంజన రసాయనం లోపించినప్పుడు చర్మం మీద తెల్లటి మచ్చలు కనబడడం;
  • vitis, n. నల్లేరు;
  • vitreous, adj. స్పటికాకార; కాచాభ; గాజు;
    • vitreous humor, ph. స్పటికాకార జలం; కాచాభ ద్రవం; గాజు సొన;
    • vitreous ware, ph. గాజు సామగ్రి; కాచాభ పాత్రలు;
  • vitriol, n. తుత్తం; తుత్తము; అక్షము; గంధకము, ఆమ్లము, లోహము కలసిన సంయోగ పదార్థం;
    • blue vitriol, ph. మైల తుత్తం; కాపర్ సల్ఫేట్; CuSO4;
    • green vitriol, ph. అన్నభేది; కాసీసం; Fe2SO4;
    • white vitriol, ph. పాల తుత్తం; జింక్ సల్ఫేట్; ZnSO4;
  • vivacious, adj. చలాకీ అయిన; చురుకయిన;
  • viva voce, n. మౌఖిక పరీక్ష;
  • vivid, adj. ప్రభూత; స్పష్టమైన; జీవకళతో తొణికిసలాడేటంత స్పష్టమైన;
  • viviparous, adj. జరాయుజ; గుడ్డు నుండి కాకుండా గర్భం నుండి పుట్టిన జీవి; సజీవ సంతానోత్పత్తి; vivum అంటే జీవం . అంటే జీవం ఏర్పడిన ,పూర్తిగా పెరిగిన పిల్లలని కనటం. ఇది క్షీరదాలలో మనుషుల్లో, మనం చూసే బోలెడు జంతువులలో కనపడుతుంది.
  • vixen, n. ఆడ నక్క;
  • vocabulary, n. పదజాలం; పదావళి; పదసంపద; పదనిధి; శబ్ద సంగ్రహం; శబ్దజాలం;
    • scientific vocabulary, ph. శాస్త్రీయ పదజాలం;
    • technical vocabulary, ph. సాంకేతిక పదజాలం;
  • vocal cords, n. స్వరతంతులు; నాదతంతులు;
  • vocalization, n. సంసర్గం; గొంతుక; కంఠం; వాక్కు; వాణి; ఎలుగు;
  • vocation, n. వ్యాపారం; ఉద్యోగం; వృత్తి; పని;
  • vocational, adj. ఉద్యోగపరమైన; వృత్తికి సంబంధించిన; పనికి కావలసిన;
    • vocational training, ph. పనికి కావలసిన శిక్షణ; వృత్తికళాశిక్షణ;
  • vocative, adj. సంబోధనాత్మక;
  • vocative case, ph. సంబోధనా ప్రథమా విభక్తి;
  • voice, n. గొంతుక; గాత్రం; కంఠం; స్వరం; గళం; నాదం; ఎలుగు;
    • active voice, ph. కర్తరి; కర్తర్యర్థకం;
    • big decibel voice, ph. గౌళగాత్రం; గౌళకంఠం;
    • obstructed voice, ph. రుద్ధకంఠం; గద్గద స్వరం;
    • passive voice, ph. కర్మణి; కర్మర్థకం;
    • voice activated, ph. స్వర ఉత్తేజిత;
    • voice box, ph. స్వరపేటిక; గొంతుకలో ధ్వనిని పుట్టించే యంత్రాంగం;
  • voiced, adj. [ling.] స్వరిత; నాద; హల్లులని పలికేటప్పుడు స్వరతంతువులు కంపిస్తే అవి స్వరిత లేదా నాద హల్లులు;
    • voiced tone, ph. స్వరిత స్వరం;
    • voiced unaspirated, ph. స్వరిత అల్పప్రాణములు; ఉదా. ల;
    • voiced unaspirated plosives, ph. కంఠ్య నాద (స్వరిత) అల్పప్రాణములు; సరళములు; ఉదా. గ, స, డ, ద, బ;
  • voiced, n. [phonetics] నాదములు; నాదవర్ణాలు;
  • voiceless, adj. నిస్వర; స్వరం లేని; శ్వాస; పరుష; హల్లులని పలికేటప్పుడు స్వరతంతువులు కంపించని యెడల అవి నిస్వర హల్లులు లేదా శ్వాసలు;
    • voiceless unaspirated plosives, ph. పరుషములు; ఉదా. క, చ, ట, త, ప;
    • voiceless unaspirated bilabial plosive, ph. ఓష్ఠ్య శ్వాస అల్పప్రాణం; ఉదా. ప
  • voicing, n. [ling.] స్వరించడం;
  • void, n. ఖాళీ; రద్దు; శూన్యత;
  • void, v. i. ఖాళీచేయు; రద్దుచేయు; see also vacate;
  • voile, n. వాయిలు; పల్చటి బట్ట;
  • volatile, adj. బాష్పశీల; వాయుపరిణామశీల; లఘిమశీల; హరించిపోయెడి;
    • volatile liquid, ph. బాష్పశీల ద్రవం;
    • volatile substance, ph. బాష్పశీల పదార్థం; తక్కువ వేడికి మరిగి పోయేవి; (rel.) refractories;
  • volatility, n. బాష్పశీలత్వం;
  • volcano, n.అగ్ని పర్వతం; జ్వాలాముఖి;
  • volition, n. సంకల్పశక్తి; ఈప్స, Ipsa
  • volley, n. వేటు; గుప్పించబడ్డ పరంపర;
  • voltage, n. విపీడనం; విద్యుత్ పీడనం; విపీడన తారతమ్యం; విపీతం; (note) same as potential difference;
  • volume, n. (1) ఘనపరిమాణం; ఆయతనం; (2) ఘనం; స్థూలత; ఎక్కువ శబ్దం; ఆమంద్రణం; ఆయతనం; క్వణం; మోత; ఉరువు;(3) సంపుటం; సంపుటి; పుస్తకం;
  • voluntary, adj. అయిచ్ఛిక; స్వచ్ఛంద; కామ్య; ప్రతిఫలాపేక్ష లేకుండా; ఉమేదువారీగా; బలవంతం లేకుండా; తనుగా తాను; తనంతట;
    • voluntary action, ph. అయిచ్ఛిక క్రియ; కామ్య కార్యం;
    • voluntary control, ph. అయిచ్ఛిక నియంత్రణ; స్వచ్ఛంద నియంత్రణ;
    • voluntary muscle, ph. అయిచ్ఛిక కండరం; కామ్య కండరం;
  • voluntarism, n. ఉమేదువారత్వం;
  • volunteer, n. m. ఉపకర్త; కామ్యకారు; అయిచ్ఛికుడు; స్వచ్ఛంద సేవకుడు; ఉమేదువారీ; వాలంటీరు;
    • - corps, ph. ఉమేదువారీ పటాలం;
  • volunteers, n. pl. ఐచ్ఛిక భటులు;
  • voluptuous, adj. (1) ఒయ్యారి; ఒంపు, సొంపులు, పెద్ద పెద్ద కుచాలు, సన్నటి నడుము, విశాలమైన పిరుదులు గల; (2) భోగాసక్తమైన; విషయాసక్తమైన;
    • - woman, ph. ఒయ్యారి భామ;
  • vomit, n. కక్కు; డోకు; వాంతి; వమనం;
  • vomit, v. i. కక్కు; డోకు; వాంతి చేసుకొను; డోకుకొను;
  • vortex, n. సుడి; సుడిగుండం; నీటి సుడిగుండం;
  • vote, n. ఓటు; సమ్మతి; సమ్మతి పత్రం; మతం;
    • vote of thanks, ph. వందన సమర్పణ;
  • votary, n. భక్తుడు; పూజారి;
  • voter, n. ఓటరు; మతదాత; నియోజకుడు; నిర్వాచకుడు;
  • voucher, n. ఓచరు; కూపాను; చీటీ; రసీదు;
  • voyage, n. నౌకాయానం;
  • vow, n. ఒట్టు; వ్రతం;
  • vowels, n. pl. అచ్చులు; ప్రాణములు; ప్రాణాక్షరములు; స్వరములు;
    • back vowels, ph. తాలవ్యేతరాచ్చులు; తాలవ్యేతర స్వరములు; పశ్చిమాచ్చులు; అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ లు;
    • front vowels, ph. తాలవ్యాచ్చులు; తాలవ్య స్వరములు; అగ్రాచ్చులు; ఇ, ఈ, ఎ, ఏ లు;
    • long vowels, ph. చాపులు; దీర్ఘాచ్చులు;
    • rounded vowels, ph. ఓష్ఠీకృతమైన అచ్చులు;
    • unrounded vowels, ph. అనోష్ఠీకృతమైన అచ్చులు;
  • Vulcan, n. రోమనుల అగ్నిదేవుడు;
  • vulcanization, n. వల్కనీకరణం; పుఠం పెట్టడం; పుఠీకరించడం; వేడిచేసి చల్లార్చడం; గంధకం కలిపి వేడి చేసి చల్లార్చడం; పెళుసుతనం తగ్గించడం;
  • vulgar, adj. అసభ్య; గ్రామ్య;
  • vulgarity, n. అసభ్యత; గ్రామ్యత;
  • vulnerability, n. భేద్యత; హానిపొందే అవకాశం; దుర్బలత్వం; దుర్బలం;
  • vulnerable, adj. భేద్యమైన; హానిపొందే; దాడికి అనువైన; దుర్బల;
  • vulpine, adj. జిత్తులమారియైన;
  • vulture, n. రాబందు; బోరువ; తెల్ల గద్ద; పీతిరిగద్ద;

Part 2: W

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • W, voiced bilabial glide; When pronouncing it, the lips are put forward and rounded.

The back part of the tongue is raised towards the soft tissue at the back of the roof of the mouth. The vocal cords vibrate during the articulation. Air is only allowed to escape through the mouth. The air is directed along the center of the tongue. ఉభయోష్ఠం;

  • wade, v. i. మొలబంటి నీటిలో నడుచు;
  • wadi, n. దొంగేరు; అరబ్బీ భాషలో లోయ అని అర్థం; అరుదుగా వర్షాలు పడ్డప్పుడు ఈ లోయ గుండా పొంగి పొర్లే ఏరు;
  • waft, v. i. తేలు;
  • wag, v. i. ఆడించు; ఊపు; కదుపు; విక్షేపించు;
  • wage, n. వేతనం; కూలి; జీతం; భృతి; దినభత్యం; బత్తెం; భర్మం; కర్మణ్యం; సాధారణంగా ఏరోజుకారోజు కాని వారానికొకసారి కాని ఇచ్చేది; (rel.) salary; stipend;
    • daily wage, ph. రోజుకూలి; కైకిలి; కైకూలి; దిన సంపాదన;
    • salaries and wage, ph. జీతబత్తెములు; జీతనాతాలు;
    • wage earner, ph. జీతగాడు; ఆర్జించేవాడు; సంపాదించేవాడు; భరటుడు; భ్హృత్యుడు;
  • wage, v. t. (1) జరుపు; చేయు; నడిపించు; (2) పందెం వేయు; పందెం కాయు;
    • wage a war, ph. యుద్ధం చెయ్యడం; కయ్యానికి కాలు దువ్వడం;
  • wager, n. పణం; పందేనికి ఒడ్డే డబ్బు;
  • wagon, n. బండి; పెట్టె;
  • wagtail, n. టిట్టిభం; ఉయ్యాల పిట్ట; కాటుక పిట్ట; కణాటీర పక్షి; జిట్టంగి; ఖంజరీటం; దాసిరిపిట్ట; కంప జిట్టిపిట్ట; లకుముకి పిట్ట;
  • waif, n. ఈబరి; పనికిరానివాడు; అప్రయోజకుడు;
  • wail, v. i. విలపించు; ఏడ్చు; కుంయ్యిమను;
  • waist, n. నడుం; మొల; కటి; కౌను;
  • waist-band, n. వడ్డాణం; నడికట్టు;
  • waist-coat, n. చేతులు లేని కోటు;
  • waist-string, n. మొలతాడు;
  • wait, v. i. వేచియుండు; కనిపెట్టుకుని ఉండు; కాచుకొనియుండు; నిరీక్షించు; ప్రతీక్షించు; పడిగాపులు పడియుండు;
    • waiting room, ph. వేచియుండు గది; నిరీక్షామందిరం;
  • waiter, n. m. భోజన ఫలహారశాలలో వడ్డన చేసేవాడు;
  • waitress, n. f. భోజన ఫలహారశాలలో వడ్డన చేసేది;
  • waive, v. t. పరిత్యజించు; హక్కులను వదలిపెట్టు;
  • waiver, n. పరిత్యాగం;
  • wake, n. (1) అబ్లోసు; ఓడ వెనుక నీళ్లలో కనబడే జాడ; (2) శవ సందర్శనం; చనిపోయిన వ్యక్తి శరీరాన్ని బంధుమిత్రులు వచ్చి చూడడానికి వీలుగా ఏర్పాటు కాబడ్డ సాంఘిక ఆచారం;
  • wake, v. i. మేల్కొను;
  • wake, v. t. నిద్రలేపు;
  • wakeful, adj. మెలకువగానున్న;
  • walk, n. నడక; దారి; నడిచే దారి;
    • random walk, ph. మలయిక నడక;
  • walk, v. i. నడుచు;
  • walk, v. t. నడిపించు;
    • walking stick, ph. చేతికర్ర;
  • walkway, n. నడవ;
  • wall, adj. గోడ; కుడ్యం; భిత్తి;
    • wall painting, ph. కుడ్య చిత్రం; భిత్తి చిత్రం;
  • wall, n. గోడ; కుడ్యం;
    • compound wall, ph. ప్రహారీ గోడ; ప్రాకార కుడ్యం; కంథావారం;
    • parapet wall, ph. పిట్ట గోడ;
  • wallet, n. ఆసిమిసంచి; డబ్బుసంచి;
  • walnut, n. అక్రోటు; అక్షోడం; కొండగొనుగు పిక్క;
  • wand, n. దండం;
    • magic wand, ph. మంత్రదండం;
  • wander, v. i. తిరుగు; తిరుగాడు; సంచరించు;
  • wanderer, v. i. సంచారి;
  • wane, v. i. క్షీణించు; తగ్గు;
  • waning, adj. క్షీణించే; క్షయించే;
    • waning moon, ph. క్షీణ చంద్రుడు; క్షీణించే చంద్రుడు; క్షయించే చంద్రుడు; కృష్ణపక్ష చంద్రుడు;
  • want, n. (1) కోరిక; (2) లేమి; లోపం; కొరత;
  • want, v. t. కోరు; v. i. కావలయు; కావాలి;
    • what are your wants?, ph. నీ కోరికలు ఏవిటి?; నీకు ఏమిటి కావాలి?
    • I want this, ph. నాకు ఇది కావాలి;
    • I do not want this, ph. నాకు ఇది వద్దు;
  • wanton, adj. కావాలని దురుద్దేశంతో చేసే;
    • wanton act, ph. కావాలని దురుద్దేశంతో చేసే పని;
    • wanton woman, ph. విచ్చలవిడిగా తిరిగే ఆడది; లైంగిక కట్టుబాట్లు లేకుండా తిరిగే స్త్రీ:
  • wants, n. కోరికలు; వాంఛలు; పురుషార్ధాలు;
  • war, n. యుద్ధం; సంగ్రామం; పోరు; పోట్లాట; కలహం;
    • civil war, ph. అంతర్యుద్ధం;
    • cold war, ph. ప్రచ్ఛన్న యుద్ధం;
    • intellectual war, ph. మేధోయుద్ధం;
    • proxy war, ph. పరోక్ష యుద్ధం;
  • warbler, n. కూజు పిట్ట; పాడు పిట్ట;
  • ward, n. (1) సాల; శాల; (2) ఒకరి రక్షణలో ఉన్న వ్యక్తి;
    • maternity ward, ph. పురిటి సాల; ప్రసూతి శాల;
  • warden, n. రక్షకుడు; పాలకుడు;
  • wardrobe, n. దుస్తులు; ఒక వ్యక్తి యొక్క దుస్తుల సముదాయం;
  • ware, n. సరుకు; వస్తువు; సామాను; బండి; (rel.) hardware; silverware; software;
  • wares, n. సరుకులు; వస్తువులు; సామానులు; బండారాలు;
  • warehouse, n. గిడ్డంగి; గాదె; గోదాం; కోపు; కోష్ఠం; కోఠా; భాండాగారం; మండీ;
  • warm, adj. (1) వెచ్చనైన; వెచ్చగా నున్న; వెచ్చని; (2) ప్రేమపూరితమైన;
  • warm, v. t. వెచ్చబెట్టు;
  • warmonger, n. యుద్ధోన్మాది;
  • warmth, n. (1) సెగ; వెచ్చదనం; (2) ఆప్యాయత;
  • warn, v. t. హెచ్చరించు; హెచ్చరిక చేయు;
  • warning, n. హెచ్చరిక;
  • warp, n. పడుగు; నేతలో నిలువు పోగు;
    • warp and weft, ph. పడుగు, పేక
  • warp, v. i. వంగు; నలుగు; వేడికి, చెమ్మకి ఆకారం పోగొట్టుకొను;
  • warrant, n. అధికారపత్రం;
  • warranty, n. అభయపత్రం; భరోసా;
  • wart, n. మొటిమ; ఉలిపిరి కాయ; చర్మకీలం; నారికాయ; సురుగుడు కాయ; పులిపిరి కాయ;
  • wash, v. t. ఉతుకు; కడుగు; శుభ్రపరచు; ధావనం చేయు;
  • washer, n. (1) ఉతకరి; ధావకి; బట్టలు ఉతికే యంత్రం; (2) కందెన బిళ్ల; కందెనకి తగిలించే బిళ్ళ;
    • washing machine, ph. ధావకి; రేవకి;
    • washing soda, ph. చాకలి సోడా; బట్టల సోడా; సోడా ఉప్పు; సోడియం కార్బనేటు;
  • washerman, n. m. చాకలి; చాకలివాఁడు; ధావకుఁడు; రేవడి; రజకుఁడు; మడివేలు;
  • washerwoman, n. f. చాకలిది; చాకిత; ధావకి;
  • wash-water, n. కడుగునీళ్లు;
  • wasp, n. కందిరీగ; గంధోళి;
  • waste, adj. బీడు; వ్యర్ధ;
    • waste product, ph. వ్యర్ధ పదార్థం; ఏబ్రాసి;
  • waste, n. దండుగ; వృథా; దుబారా; విభవం; వ్యర్ధం; రద్దు; బీడు; వమ్ము; వ్యర్ధ పదార్థం; ఏబ్రమ్;
  • waste, v. i. వృథాయగు; వ్యర్ధమగు; రిత్తపోవు; బీరుపోవు; వమ్మగు;
    • wasted effort, ph. వృథా ప్రయాస;
  • wasted word, ph. వ్యర్ధ పదం;
  • watch, n. (1) వాచీ; చేతిగడియారం; జేబుగడియారం; (2) పహరా; పారా; కావలి; కాపలా; కాపు; (3) ఝాము; యోగము; ప్రహారము; 3 గంటల కాలము; (4) length of duty for a watchman;
  • watch, v. t. కాపలా కాయు; చూడు; చూచు; పారాకాయు; పారాయిచ్చు;
  • watcher, n. కాపు; కాపలా కాసే వ్యక్తి; పారావాడు;
  • watchdog, n. కాపుకుక్క;
  • watchman, n. కాపలావాడు; కాపరి; కాపు; తలారి; తలవరి;
  • watchtower, n. అట్టాలకం; కాపుబురుజు;
  • waterwheel, n. నీటిచక్రం; జలచక్రం; అరఘట్టం;
  • watch out!, inter. పారా హుషార్;
  • water, adj. నీటి; జల; ఆప్య; ఉదక; అంబు; తోయ; సలిల; తీర్థ; వాః;
  • water, n. నీరు; నీళ్లు; ఉదకం; జలం; తీర్థం; వారి; వాః; పుష్కరం; నీరం; వానం; అప్పు; అంబువు; తోయం; సలిలం,
    • body of water, ph జల రాశి;
    • brackish water, ph ఉప్పు నీళ్లు;
    • cold water, ph చన్నీళ్లు;
    • cool water, ph చల్లటి నీళ్లు;
    • distilled water, ph స్విన్న జలం; హంసోదకం; మరగించి చల్లార్చిన నీళ్ళు; బట్టీపట్టిన నీళ్లు;
    • drinking water, ph మంచినీళ్లు; మంచి తీర్థం; తాగునీరు;
    • fresh water, ph మంచినీళ్లు; మంచి తీర్థం;
    • hard water, ph కఠిన జలం; చౌటి నీరు; కేల్సియం, మెగ్నీసియం లవణాలు ఎక్కువగా కరిగిన నీరు; ఈ లవణాలు మరీ ఎక్కువగా లేనంతసేపూ తాగడానికి ఇదే మంచిది; కాని యంత్రాలకి వాడే ఆవిరి తయారీలో ఈ నీరు మంచిది కాదు;
    • heavy water, ph. భార ఉదకం; భార జలం; ఇందులో Hydrogen కి బదులు Deuterium ఉంటుంది. Deuterium లో ఒక ప్రొటాన్, ఒక నూట్రాన్ (neutron) ఉంటాయి;
    • iced water, ph. చల్లటి నీళ్లు;
    • irrigation water, ph. సాగునీరు;
    • mineral water, ph. ఖనిజ జలం;
    • potable water, ph. మంచినీళ్లు; మంచి తీర్థం; తాగే నీరు;
    • soft water, ph. సాధు జలం; నిజమైన శసాధు జలంలో ఒక్క సోడియం అయానులు తప్ప మరే ఇతర లవణాలు ఉండవు; ఈ నీటికి కాసింత ఉప్పదనం ఉంటుంది;
    • water buffalo, ph. గేదె; బఱ్ఱె; ఎనుము;
    • water drops, ph. నీటి బిందువులు; జలకణాలు;
    • water level, ph. నీటి మట్టం;
    • water lift, ph. కపిలె; ఏతాం; గూనీ;
    • water resources, ph. నీటి వనరులు;
    • water scarcity, ph. నీటి ఎద్దడి; నీటి కరువు;
    • water table, ph. జలపీఠం;
  • watercolor, n. జలవర్ణం;
  • waterfall, n. జలపాతం; నిర్ఘరి;
  • waterfowl, n. చక్రచక్రాంగాలు; నీటి పక్షులు;
  • waterlily, ph. కలువ; తెల్ల కలువ; ఉత్పలం; కల్హారం; lotus is different from Water Lily, but often mistakenly used as synonyms. Lotus is anchored to ground below and does not float;
  • waterlogging, n. ఉరక;
  • watermelon, n. పుచ్చకాయ; కాలిందపండు; కల్లంగడీ పండు; ఖర్బూజా;
  • water-proof, adj. జలజిత;
  • watershed, n. పరీవాహక స్థలం;
  • watersnake, ph. నీటి కొయ్య; అళిగర్దము;
  • waterthrush, n. పాడెడు పిట్ట;
  • waters, n. జలాలు;
    • polluted waters, ph. కాలుష్య జలాలు; కలుష జలాలు;
    • river waters, ph. నదీ జలాలు;
  • wattle, n. (1) జోలుమెడ; కొన్ని జంతువులకి, పక్షులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; (2) గంగడోలు; ఆవులకి ఎద్దులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం; see also dewlap; wattle;
  • wave, n. అల; కెరటం; తరంగం; తరగ;
    • gravitational wave, ph. గురుత్వ తరంగం;
    • large wave, ph. లహరి;
    • longitudinal wave, ph. రేఖాంశ తరంగం;
    • mechanical wave, ph. యాంత్రిక తరంగం;
    • progressive wave, ph. ప్రగామీ తరంగం;
    • standing wave, ph. స్థావర తరంగం;
    • transverse wave, ph. తిర్యక్ తరంగం; అక్షాంశ తరంగం; పీడన తరంగం;
    • wave crest, ph. తరంగ శిఖ; తరంగ శృంగం;
    • wave trough, ph. తరంగ ద్రోణి; తరంగ గర్త;
  • wave, v. i. ఊపు; ఆడించు;
  • wave, v. t. ఆడించు; ఊపు;
  • wavelet, n. అల; తరంగిక; తవాయి;
  • wavelength, n. తరంగ దైర్ఘ్యం; తరంగం పొడుగు;
  • wavetrain, n. తరంగావళి;
  • wavy, adj. తరంగితం;
  • wax, n. మైనం; పింజూషం; మదనము;
    • wax candle, n. మైనపు వత్తి; కొవ్వొత్తి;
    • wax glands, n. పింజూష గ్రంథులు;
    • wax paper, n. మైనపు కాగితం; పద్మపత్రం;
  • wax, v. i. వృద్ధిపొందు;
  • waxing, adj. వృద్ధిపొందే; వృద్ధి;
    • waxing moon, ph. శుక్లపక్ష చంద్రుడు; రాకా చంద్రుడు;
  • way, n. (1) దారి; మార్గం; తోవ; దోవ; తెరువు; బాట; తెన్ను; రహదారి; రోడ్డు; (2) విధం; పద్ధతి; తీరు; ప్రకారం; పంథ;
    • usual way, యథా ప్రకారం; మామూలుగా;
  • wayfarer, n. బాటసారి; తెరువరి; పాంథుడు;
  • wayward, adj. అదుపులో ఉండని, దారితప్పిన; చెప్పిన మాట వినని; మొండి;
  • we, inclusive pron. మనం; మనము;
  • we, exclusive pron. మేం; మేము;
  • weak, adj. బలహీనమైన; నిస్త్రాణమైన; నీరసపు; అబలమైన; దుర్బలమైన; విలీన; విబల; ఈరు;
    • weak acid, ph. నిస్త్రాణికామ్లం; దుర్బల ఆమ్లం;
    • weak sunshine, ఈరెండ; నీరెండ;
    • weak solution, ph. విలీన ద్రావణం;
    • weak voice, ph. ఈరెలుగు; (ఈరు + ఎలుగు);
  • weakling, n. m. అర్భకుడు; అదంత్రుడు; f. అర్భకి;
  • weakness, n. బలహీనత; దౌర్బల్యం; దుర్బలత్వం; నిస్త్రాణ; నీరసం; నిస్సత్తువ; డిల్ల; అపాటవం; అవుకు;
  • wealth, n. సంపద; ఆస్తి; సిరి; కలిమి; భాగ్యం; ధనం; ధనికత; ఐశ్వర్యం;
  • wealthy, n. pl. సంపన్నులు; సామంతులు; ధనవంతులు; ధనికులు; శ్రీమంతులు; కలిగినవారు; ఉన్నవారు;
  • weapon, n. ఆయుధం; కైదువు; కైవాలు; అస్త్రం; (note) అస్త్రం really means a weapon that can be withdrawn after the initial release such as those described in the Indian legends;
    • atomic weapon, ph. అణ్వాయుధం; అణ్వస్త్రం;
    • chemical weapon, ph. రసాయనాయుధం; రసాయనాస్త్రం;
    • nuclear weapon, ph. కణ్వాయుధం; కణ్వస్త్రం;
  • weaponization, n. ఆయుధీకరణ; ఆయుధం కాని దానిని ఆయుధంగా మార్చడం;
  • weaponized, n. ఆయుధీకృతం;
  • wear, v. t. ధరించు; దాల్చు; తాల్చు;
  • wear, v. i. అరిగిపోవు; అరుగు;
  • wearer, n. ధారి; ధరించిన వ్యక్తి;
  • weariness, n. అలసట;
  • weather, n. శీతవాతతాపాలు; దైనందిన వాతావరణం; పవనస్థితి; వాలిమండ; మవుసం; వియత్తు; వాన, గాలి, మబ్బు, ఎండల స్థితి; వాతావరణం;
    • weather vane, ph. గాలికోడి; వాతసూచి; గాలి ఎటునుండీ వీచుతున్నదో సూచించే సాధనం;

Usage Note: weather, climate

  • ---There are many words to describe weather. Wind is a general word for air when it moves. A breeze is a pleasant gentle wind. A gust is sudden strong wind. A gale is an extremely strong wind. Rain is water that falls from clouds. If it is raining hard, it is pouring. If it is raining little, it is a drizzle. When rain lasts only a short time it is a shower. When rain begins to freeze, it is sleet. Hard, frozen pebble-size rain is hail. Soft frozen flakes of rain is snow. A storm is a general word for bad, wet weather. A blizzard is a snowstorm. Cyclone and hurricane are extremely strong wind that usually moves over water. The word hurricane is used for events in the Atlantic Ocean and in that portion of the Pacific west of the International Date Line. Tornado or typhoon is a strong wind that moves in circles and forms funnel shaped clouds. A drought is a long period with no water. When a lot of water suddenly covers an area, then it is a flood. The long-term behavior of weather is climate.
  • weave, v. t. అల్లు; నేయు;
  • weaver, n. మగ్గరి; సాలె; నేత నేసే వ్యక్తి;
    • weaver bird, ph. బంగారు పిచ్చుక; పసుపు పిట్ట; పచ్చ పిట్ట; గిజిగాడు; [bio.] Ploceus baya; Ploceus philippinus;
  • weaving, n. నేత; అల్లిక; ఉతి;
  • wearer, n. m. కువిందుడు; ధరించువాడు; f. కువిందురాలు; ధరించునది;
  • web, n. పట్టు; గూడు; సాలె పట్టు; సాలె గూడు; జాలం; బూజు;
    • spider web, ph. సాలిపట్టు; సాలిగూడు;
    • World Wide Web, ph. ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు; ప ప ప;
  • web log, n. జాల కవిలె; [see also] blog;
  • web page, n. జాల పుట;
  • website, n. జాలస్థలం; జాలస్థలి; జాలగూడు; ఆటపట్టు; అటక; (note) మన సరుకులు దాచునే స్థలాన్ని అటక అన్నట్లే మన సమాచారాన్ని దాచుకునే స్థలం కనుక దీన్ని కూడ అటక అనొచ్చు; అంతే కాదు (వెటకారంగా) వెబ్ అంటే సాలెగూడు కనుక సాలెగూళ్లు ఉండే స్థలం అటక కనుక మాటలతో ఆట;
  • wedding, n. పెళ్లి; పెండ్లి; మనువు; లగ్గం; కళ్యాణం; కళ్యాణ ఉత్సవం; పెండ్లి వేడుక; పాణిగ్రహణం; పరిణయం; (rel.) marriage;
    • civil wedding, ph. అమంత్రకం; మంత్రములు లేని వివాహ ఉత్సవం;
    • traditional wedding, ph. సమంత్రకం; మంత్రములతో కూడిన వివాహ ఉత్సవం;
    • wedding gift, ph. ఉడుగడ; పెండ్లికానుక;
  • wedge, n. గసిక; వారిణిసీల; వారిణిపీట; కీలం;
  • wedlock, n. వివాహబంధం;
  • Wednesday, n. బుధవారం; సౌమ్యవారం;
  • weed, n. కలుపు మొక్క; అలం; సస్యంలోని గాదం;
  • weed, v. t. కలుపు తీత;
  • weeding, n. కలుపు తీత;
  • week, n. వారం; ఏడు రోజులు;
    • week by week, ph. వారం వారం;
  • weekday, n. వారపురోజు; శని ఆది వారములు కాక మిగిలిన రోజులు;
  • weekend, n. శని, ఆది వారములు;
  • weep, v. i. ఏడ్చు; రోదించు; బావురుమను;
  • weevil, n. ముక్కపురుగు; బీటిల్ జాతికి చెందిన ఈ పురుగులు రకరకాల పంటలకి తీరని నష్టం కలుగజేస్తాయి;
  • weft, n. పేక; నేతలో అడ్డుగా వచ్చే పోగుని పేక అంటారు, నిలువు పోగుని పడుగు అంటారు;
  • weigh, v. t. తూచు; తూనిక వేయు;
  • weight, n. బరువు; భారం; తూనిక; తూకం; గరిమ; ధురం: మోపుదల;
    • weights and measures, ph. తూనికలు; కొలతలు;
  • weir, n. ఆనకట్ట; అడ్డుకట్టు; నది ప్రవాహాన్ని ఆపి జలాశయాన్ని తయారు చెయ్యడానికి పొట్టిగా కట్టిన గోడ; A weir is an impervious barrier constructed across a river to raise the water level on the upstream side; The water is raised up to the required height and the water then flows over the weir; In a weir, the water overflows the weir, but in a dam, the water overflows through a special structure called a spillway; see also dam and barrage;
  • welcome, n. ఆహ్వానం; పలకరింపు; ఎదుర్కోలు; ప్రత్యుద్థానం;
  • weld, v. t. అతుకు; మాటు వేయు;
  • welfare, n. యోగక్షేమం; సంక్షేమం; శ్రేయస్సు; కుశలత; అనామయం; హితం; కంత్వం;
    • welfare society, ph. సంక్షేమ సమాజం;
    • welfare state, ph. శ్రేయోరాజ్యం;
    • public welfare, ph. పుర హితం; పుర సంక్షేమం;
  • welcome!, inter. స్వాగతం; దయ చెయ్యండి; రాండి;
  • welfare, n. యోగక్షేమాలు; సంక్షేమం;
    • welfare officer, ph. సంక్షేమ అధికారి;
    • welfare state, ph. శ్రేయో రాజ్యం; సంక్షేమ రాజ్యం;
    • social welfare, ph. సమాజ సంక్షేమం;
  • well, adj. బాగు; కులాసా; సుష్టు;
    • are you doing well? ph. బాగున్నారా; బాగున్నావా; కులాసాగా ఉన్నారా/ఉన్నావా;
    • well known, ph. (1) సుపరిచిత; (2) సుప్రసిద్ధ;
  • well, n. నుయ్యి; బావి; వాపి; కూపస్థము; కూపం;
    • artesian well, ph. బుగ్గబావి;
    • tube well, ph. గొట్టపు బావి;
    • quantum well, ph. క్వాంటం కూపం; గుళిక కూపం;
    • well with steps, ph. దిగుడు బావి; నడ బావి;
  • well-to-do, n. స్థితిపరులు; భాగ్యపరులు;
  • well-wisher, n. హితుడు; హితాభిలాషి; శ్రేయోభిలాషి; హితైషి; హితవును కోరే వ్యక్తి; మన మంచిని కోరే వ్యక్తి;
  • wellbeing, n. శ్రేయము; శ్రేయస్సు;
  • well-grown, adj. ఏపుగా పెరిగిన;
  • welt, n. (1) దద్దురు; క్రిమి కీటకాదులు కుట్టడం వల్ల కాని ఎలర్జీ వల్ల చర్మం వాచి పొంగడం; (2) బొప్పి; దెబ్బ వలన చర్మం వాచడం; (3) చెప్పులని కాలికి కట్టుకొనడానికి వాడే తోలు పటకా;
  • went, v. i. వెళ్ళెను; ఏగెను; ఏగిరి; పోయిరి; పోయెను; చనియెను; వెళ్ళేరు; m. వెళ్ళేడు; f. వెళ్ళింది;
  • West, n. పడమర; పడమట; పటమట; మలి పొడుపు వైపు; పశ్చిమం; ప్రతీచి; ఉదీచి;
  • western, adj. పాశ్చాత్య; పశ్చిమ; శ్చిమార్ధ; ప్రతీచీన; సాయన; పడమటి;
    • western civilization, ph. పాశ్చాత్య నాగరికత;
    • western hemisphere, ph. పశ్చిమార్ధ గోళం;
  • westward, adv. పశ్చిమాభిముఖంగా; పడమటివైపు;
  • westwind, ph. చారము; చారవాయువు;
  • wet, adj. పదును; పుంజ; తడిసిన; తడిగానున్న; చెమ్మ;
  • wet cloth, తడి గుడ్డ;
  • wet, v. t. పదును పెట్టు; తడిపి పెట్టు;
  • wetlands, n. pl. చిత్తడి నేలలు; బీఅ భూములు; బాడవ భూములు; పుంజనేలలు;
  • wetness, n. పదును; తడి; చెమ్మతనం; సంసిక్తత;
    • slight wetness, ph. ఒరపదును;
  • wetted, adj. ప్లుత; సంసిక్త; సిక్త; తడిపిన; తడిపిపెట్టిన;
    • wetted in blood, ph. రక్తసిక్త;
    • wetted in ghee, ph. ఘృతప్లుత;
    • wetted in honey, ph. మధుసిక్త;
  • wetted, n. సంసిక్తం; తడిపినది;
  • whale, n. తిమింగిలం;
  • wharf, n. రేవు; బందరు; పడవలు, ఓడలు ఆగు స్థలం;
  • what, adv. adj. ఏ; ఏది; ఏమి; ఏమిటి;
  • what madam, ph. ఏమండీ;
  • what sir, ph. ఏమండీ;
  • wheedle, v. t. బెల్లించు;
  • wheel, n. చక్రం;
  • wheezing, n. ఊష్మ ధ్వనులు; ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు, పిల్లి కూతలలా వచ్చే చప్పుళ్లు;
  • when, adv. ఎప్పుడు;
    • from when, ph. ఎప్పటినుండి;
    • until when, ph. ఎప్పటివరకు;
  • whence, adv. కనుక; తత్రాపి;
  • whenever, adv. ఎప్పుడైనా సరే; ఎప్పుడైతే అప్పుడు;
  • where, adv. ఎక్కడ;
    • from where, ph. ఎక్కడనుండి;
  • whereabouts, n. విశేషాలు; ఆచూకీ; పత్తా; చిరునామా వగైరా;
  • whereby, adv. అందువలన;
  • wherever, adv. ఎక్కడికైనాసరే;
  • where, adv. ఎక్కడ;
  • whetstone, n. సాన; చికిలి సాన; నూరుడు రాయి;
  • whey, n. (1) పాలవిరుగుడు; (2) కుంపెరుగు; పెరుగులో నీళ్ల వంటి భాగం;
  • which, pron. ఏది; ఏ;
    • which one, ph. ఏది;

Usage Note: which, what

  • ---Use what when you are making a choice from an unknown number of things or people: What color shirt do you want? Use which when you are making a choice from a limited number of things or people. Which color do you want - white or blue?
  • whicheth, pron. ఎన్నో; ఎన్నవ;
  • whichever, adj. ఏదయితే అది; ఏదయినా సరే;
  • while, n. సేపు;
    • all the while, ph. అంత సేపూ;
    • for a while, ph. కొంత సేపు;
  • whimper, n. మూలుగు; తుస్సుమను; (e.g.) he went not with a bang, but with a whimper = వాడు టపాకయలా పేలలేదు, సిసింద్రీలా చీదీసేడు;
  • whip, n. కొరడా; కమ్చీ; చెలకోల; చెర్నకోల; చబురు;
  • whip, v. t. చిలుకు; బాదు; కొట్టు; పీండ్రించు;
    • whipped butter, n. చిలికిన వెన్న; పీండ్రించిన వెన్న;
  • whiplash, n. కొరడా దెబ్బ;
  • whipping boy, ph. తిట్ల పాలేరు;
  • whirlpool, n. సుడిగుండం; ఆవర్తం;
  • whirlwind, n. సుడిగాలి; చక్రవాతం;
  • whisk, n. కుంచె; మండ; లిమ్మ; చామరం;
  • whiskers, n. బుగ్గమీసాలు; పిల్లి జాతి జంతువులకి ఉండే మీసాలు;
  • whiskers, n. pl. మీసాలు; పిల్లులకి, ఎలకలకి మూతి మీద ఉండే పొడుగాటి వెంట్రుకలు;
  • whiskey, whisky, n. విష్కీ, బార్లీతో చేసిన బీరుని ధృతించి (బట్టీపట్టి) ఆల్కహోలు పాలు 40 శాతం వరకు పెంచినప్పుడు లభించే మాదక పానీయం;
  • whisper, n. గుసగుస;
  • whistle, n. (1) ఈల; ఊళ; (2) కూత;
  • white, adj. శుక్ల; తెల్ల; తెల్లని; శ్వేత; ధవళ;
    • cloudy white, ph. మునిశ్వేత;
    • white corpuscles, ph. తెల్ల కణములు;
    • white dwarf, ph. శ్వేతకుబ్జ తార;
    • white gourd melon, ph. బూడిద గుమ్మడి;
    • white horse, ph. కర్కం; శ్వేతాశ్వం; ధవళతురంగం;
    • white lead, ph. తెల్ల సీసం;
    • white matter, ph. శ్వేతాంశం;
    • white paper, ph. (1) శ్వేతపత్రం; ఒక ఊహని కాని ప్రతిపాదనని కాని రాసిన కాగితం; (2) తెల్ల కాగితం;
    • white noise, n. [elec.] తెల్ల రొద;
    • white vitriol, n. జింక్ సల్ఫేట్‍; ZnSO4; శరీరం లో పోషక పదార్థంగా యశదం లోపించినప్పుడు ఈ రసాయనాన్ని మందుగా వాడతారు;
    • white woman, ph. ధవళాంగి;
  • white, n. తెలుపు; వెల్ల; వెలి; ధవళం;
  • whiteness, n. తెల్లదనం; ధవళిమ;
  • whitepaper, n. ఏదేని విషయం, సమస్య పైన నిర్ణయాలు తీసుకోడం, పరిష్కరించడం గురించి చదువరులకు పూర్తి అవగాహన కల్పించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక/గైడు ని శ్వేతపత్రం (whitepaper) అంటారు. ఇవి రెండు రకాలు: ప్రభుత్వానికి సంబంధించినవి, వ్యాపారాలకు సంబంధించినవి;
  • whitewash, n. వెల్ల;
  • whitewash, v. t. (1) వెల్ల వేయు; (2) [idiom] కప్పిపుచ్చు;
  • whitewash, n. (1) వెల్ల; గోడలకి వేసే తెల్లటి సున్నపు నీళ్ల పూత; (2) [idiom] చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం;
  • whitewaters, n. తెల్లటి నురగలు కక్కుతూ రాళ్ల మీద ప్రవహించే నది;
  • whitlow, n. గోరుచుట్టు; గోరు మట్టు దగ్గర చీము చేరి వాచడం;
  • whiz, v. i. దూసుకొనిపోవు;
  • whiz kid, n. తెలివితేటలతో అతి త్వరగా ముందుకి దూసుకు పోగలిగే వ్యక్తి;
  • who, pron. ఎవరు; ఎవడు; ఎవతె;
  • whom, pron. ఎవరిని;
  • whole, adj. నిండు; పరిపూర్తి; పూర్ణ; అఖండ; అఖిల;
    • whole blood, ph. నిండు రక్తం; కణాలేవీ తీసెయ్యకుండా, యథాతథంగా ఉన్న రక్తం;
    • whole number, ph. పూర్ణసంఖ్య; 0, 1, 2, 3,.... వగైరాలు.
  • whole, n. మొత్తం; అంతా; యావత్తూ; సమస్తం; అఖిలం;
    • on the whole, ph. మొత్తంమీద;
  • wholeheartedly, adj. నిండు హృదయంతో; హృదయపూర్వకంగా; మనస్పూర్తిగా; మనసా;
  • wholesale, adj. టోకు; (ant.) retail;
  • wholesome, adj. (1) ఆరోగ్యదాయకమైన; ఆరోగ్యాన్ని ఇచ్చే; (2) నీతి నియమాలు పాటించే;
  • whooping cough, n. కోరింత దగ్గు;
  • whore, n. లంజ; గుడిసేటి లంజ;
  • whose, pron. ఎవరి; ఎవరిది;
    • whose book is this?, ph. ఇది ఎవరి పుస్తకం?; ఈ పుస్తకం ఎవరిది?;
    • whose people?, ph. ఎవరి వాళ్లు?;
  • why, adv. ఎందుకు?
  • wick, n. వత్తి; దశ;
  • wide, adj. వెడల్పయిన;
  • widespread, adj. విస్తార; విస్త్రృత; బహువ్యాప్త; ప్రచలిత;
  • widespread, n. విస్తారం; విస్త్రృతం; బహువ్యాప్తం; ప్రబలం;
  • widow, n. f. విధవ; వితంతువు; విశ్వస్త; అధవ; పూర్వ సువాసిని; రండ; భర్త పోయిన స్త్రీ; విగతభర్తృక; గంగాభాగీరధీ సమానురాలు;
    • widow marriage, ph. వితంతు వివాహం;
  • widower, n.m. భార్య చనిపోయినవాడు; విధురుడు; కళత్రహీనుడు;
  • widowhood, n. వైధవ్యం; వెధవరికం; ఛత్రభంగం;
  • width, n. వెడల్పు; పన్నా;
    • width of cloth in a roll, ph. పన్నా;
  • wield, v. t. చెలాయించు;
  • wife, n. భార్య; పెళ్లాం; ఆవిడ; ఇంటావిడ; ఆలు; మగనాలు; ఇల్లాలు; అర్ధాంగి; కళత్రం; గృహిణి; సతి; పత్ని; సహధర్మచారిణి; చేడి; చేడియ; ఊఢ; గేస్తురాలు; దార; దయిత; వల్లభ; ధర్మ కార్యాలలో పీటల మీద కూర్చొనే హక్కు పత్నులకే ఉంటుంది. వాళ్లకు కలిగే సంతానానికే పితృకార్యాలు, కర్మ క్రతువులు చేసే అధికారం;
    • neighbor's wife, ph. పరోఢ;
  • wig, n. టోపా; అసలు జుత్తుని కప్పిపుచ్చడానికి వాడే సవరం లాంటి ఉపకరణం;
  • wild, adj. క్రూర; వన్య; అడవి; అదుపులేని; మచ్చిక చెయ్యబడని;
    • wild animal, ph. అడవి జంతువు; వన్య మృగం; క్రూర మృగం;
    • wild boar, ph. అడవి పంది; వరాహం; ఘూర్జరం; కిటి;
    • wild goose chase, ph. [idiom] కంచి గరుడ సేవ; వ్యర్ధమైన ప్రయత్నం;
    • wild grain, ph. వన్య ధాన్యాలు;
    • wild moong, n. నెలపెసర పూవు; అరణ్యముద్గ పుష్పం [bot.] Vigna radiata;
    • wild state, ph. వన్య స్థితి;
  • wildfire, n. కార్చిచ్చు; అదుపులోకి రాని మంటలు;
  • wilderness, n. అడవి; అరణ్యం; కాంతారం; అటవీ ప్రాంతం; ఎడారి; సముద్రం; బీడు; బంజారా; సేద్యసంస్కారాలు లేకుండా, నిర్వాసమైన ఏ ప్రదేశం అయినా సరే;
  • wile, n. తంత్రం;
  • willful, adj. ఐచ్ఛిక; ఇష్టపడ్డ;
  • will, n. (1) వీలునామా; మరణాశాసనం; విల్లు; (2) పట్టుదల; ఇచ్ఛ; ఈప్స, Ipsa; సంకల్పం; కోరిక; (3) ఇష్టం; అభిమతం; అభీష్టం; చిత్తం;
  • willingly, adv. ఇష్టంతో; ఇష్టపడి;
  • willpower, n.ఇచ్ఛాశక్తి; సంకల్ప బలం;
  • wilt, v. t. వాడు; వడలు;
  • wilt, n. మ్లానత;
  • win, n. గెలుపు; జయం; ఆట;
  • win, v. t. గెలుచు; గెలుపొందు; జయించు; నెగ్గు;
    • desire to win, ph. విజిగీష; విజయాపేక్ష;
  • win-win, n. ఉభయార్ధ సాధకం;
  • win-win strategy, ph. ఉభయార్ధ సాధకమైన ఉపాయం; స్వామి కార్యంతో స్వ కార్యం కూడా;
  • wind, v. t. (వైండ్) తిప్పు;
  • wind, n. (విండ్) గాలి; పవనం; పయ్యెర; వాయువు; మారుతం; ములాయం; వాతం; ఈద; కరువలి; అనిలం; తెమ్మెర; ప్రభంజనం;
    • gale-force wind, ph. ఇరింగిణం;
    • strong wind, ph. ఈదురు గాలి;
    • wind instrument, ph. తాషామర్పా; బూరా; సన్నాయి వంటి వాయిద్యాలు;
  • windfall, adj. గాలిపంట; గాలివాటుగా వచ్చిన; కలిసొచ్చిన;
    • windfall profit, ph. గాలివాటు లాభం; కలిసొచ్చిన అదృష్టం;
  • windless, adj. నిర్వాత; గాలిలేని;
  • windmill, n. గాలి మర;
  • windpipe, n. గాలి గొట్టం; శ్వాస నాళం;
  • windsock, n. గాలి గొట్టం; వాత సూచి; గాలి ఎటు నుండి వీచుతోందో, ఎంత జోరుగా వీచుతోందో సూచించడానికి విమానాశ్రయాలలో వేల్లాడదీసే గొట్టం ఆకారంలో ఉండే గుడ్డ;
 
Windsock
  • windvane, n. వాతసూచి; గాలికోడి; గాలి ఎటు నుండి వీచుతోందో, సూచించడానికి కోడి ఆకారంలో ఉండే బొమ్మ:
  • windward, adj. అనువాత;
  • window, n. కిటికి; వివరం; గవాక్షం; సోరణం; వాతాయనం; see also ventilator;
  • wine, n. సారా; ద్రాక్ష సారా; ద్రాక్షాసవం; ఫలాసవం; మార్ద్వీకం; పండ్ల రసాలని పులియబెట్టగా వచ్చే మత్తెక్కించే పానీయం; see also liquor;
    • apple wine, ph. ఏపిల్ సారా;
    • grape wine, ph. ద్రాక్ష సారా;
  • wing, n. (1) రెక్క; గరుత్తు; (2) పార్శ్వం; పక్షం; పత్రం; (3) పంచపాళీ;
    • left wing, ph. వామ పక్షం;
  • winner, n. విజేత;
  • winnow, n. చేట;
  • winnow, v. t., చెరుగు;
  • winnowing, n. ఎగరబోత; తూర్పారబట్టడం; చెరగడం;
  • winter, n. చలికాలం; శీతాకాలం; హేమంతం;
    • nuclear winter, ph. కణ్వ హేమంతం;
    • winter solstice, ph. దక్షిణాయనాంతం;
    • winter cherry, n. పెన్నేరు గడ్డ;
  • wire, n. తంతి; తీగె; కమ్మ; కంబి; వైరు;
  • wire-gauge, n. తీగె సెల్లా;
  • wireless, adj. నిస్తంతి; తారాహీన;
  • wisdom, n. వివేకం; విజ్ఞత; విచక్షణ; ప్రాజ్ఞత; తెలివి; తెలివితేటలు;
    • worldly wisdom, ph. లోక వ్యవహారజ్ఞత; లోకజ్ఞానం; లౌక్యం;
  • wise, adj. వివేకమైన; తెలివైన;
    • wise person, ph. ధీమతి; వివేకవంతుడు; తెలివైనవాడు; తెలివైనది;
  • wish, n. కోరిక; అభిమతం; అభీష్టం; వరం; మనోరధం; ఆకాంక్ష; అభిలాష; అశంస;
  • wish, v. t. కోరు; తివురు; అభిలషించు; కాంక్షించు; ఆకాక్షించు;
    • wishful thinking, ph. ఆకాంక్షాత్మక ఆలోచన;
  • wit, n. ఛలోక్తి; వాక్చాతుర్యం; పరిహాసాత్మకమైన వాక్చాతుర్యం;
  • with, prep. తో; తోడ; చే; చెత; కూడ; సహా; సమేత;
  • withdraw, v. i. విరమించు; విరమించుకొను; ఉపసంహరించు;
  • wither, v. i. వాడిపోవు; ఎండిపోవు; వడలు;
  • withe, n. తడప; రెబ్బ; ఈనె; tough, flexible branch of a tree, used for tying, binding, or basketry.
  • without, prep. నిర్; వినా; బే; లేకుండా; కాకుండా;
    • without conditions, ph. బేషరతుగా;
  • witness, n. సాక్షి; (ety.) స + అక్షి = కంటితో చూసిన వ్యక్తి; కనుకాపు;
    • witness for the defendant, ph. ఉత్తర సాక్షి;
  • woke, adj. మేలుకో!; to be awake to racial prejudice and discrimination; to be awake to all sorts of prejudice and discrimination, including gender, religion, sexual orientation, caste, etc.; The acronym stands for "Wrongs to Our Kids and Employees."
  • wokeism, n. promotion of liberal progressive ideology and policy as an expression of sensitivity to systemic injustices and prejudices; the term is usually used disparagingly as in, “the only religion allowed around here is wokeism,” he complained.
  • wolf, n. తోడేలు; వృకం; కోకం;
    • prairie wolf, ph. కయోటీ; ఉత్తర అమెరికా మైదానాలలో తిరిగే నక్క వంటి జంతువు;
    • wolfing down, ph. గబగబా, నమలకుండా మింగేయడం;
  • woman, adj. ఆడ; ఆడు;
  • woman, n. (ఉమన్) స్త్రీ; మనిషిని; ఆడది; ఆలు; వనిత; నాతి; నారి; అతివ; అంగన; అంగయాన; పడతి; మగువ; కాంత; భామ; భామిని; ఉవిద; తలోదరి; శర్వరి; తోయజాక్షి; తెఱువ; ముద్దియ; యోషిత; కొమ్మ; ప్రౌఢ; దంట; చామ; గరిత; తెరవ; మరీచిక; నవల; మెలత; నెలతుక; పైదల; పొలతి; అన్నువ; అలివేణి; ఇంచుబోడి;

ఇంతి; ఉఙ్మలి; ఎలనాగ; ఏతులి; గుబ్బెద; అలరుబోడి; ముద్దరాలు; అన్నువి;

    • unfortunate woman, ph. అభాగిని;
    • old woman, ph. అవ్వ;
    • buxom woman, ph. గుబ్బెద; పెద్ద స్తనాలు గల స్త్రీ;
    • naked woman, ph. కోట్టవి; నగ్నాంగన;
    • woman folk, ph. ఆడువారు;
    • woman, the enemy of man, ph. నారి = నర + అరి;
    • woman, the one with a pretty face, ph. అతివ;
    • woman, the one who is not strong, ph. అబల;
    • woman, the one who charms by her wiles and graces, ph. మహిళ;
    • woman, the accelerator of man's passions by her, ph. మద, ప్రమద;
    • woman, the one who delights in men by her coquettish gestures, ph. రమ;
    • woman, the one with pretty body parts, ph. అంగన;
    • woman, the one whose body is like a creeper, ph. లతాంగి;
    • woman, the one whose body is like a flower, ph. పూబోడి; విరిబోడి;
    • woman, the one who attracts her man even in domestic quarrels, ph. లలన;
    • woman, the one who caters to the tastes of men, ph. వనిత;
    • woman, the lustful one, ph. కామిని;
    • woman, who goes to meet her lover on her own initiative, ph. అభిసారిక;
    • woman, whose husband is alive, ph. సువాసిని;
    • woman, whose husband is dead, ph. పూర్వ సువాసిని;
  • womanhood, n. స్త్రీత్వం;
  • womanizer, n. స్త్రీలోలుడు; ఇంద్రియలోలుడు;
  • womb, n. గర్భాశయం; బిడ్డసంచీ;
  • women, n. pl. (విమెన్) స్త్రీలు; ఆడంగులు; ఆడవారు; జనానా;
  • wonder, n. అద్భుతం; అబ్బురం; చోద్యం; విస్మయం; వింత; విచిత్రం; చిత్రం;
  • wonder, n. అద్భుతం; అబ్బురం; చోద్యం; విస్మయం;
  • wood, n. (1) కర్ర; కొయ్య; చెక్క; దారువు; కాష్టం; యష్టి; (2) కలప; (3) గుబురుగా పెరిగిన చెట్లు; వనం; అడవి;
    • wood alcohol, ph. కర్ర సారా; కాష్టోల్; మెతనోల్;
    • wood charcoal, ph. కర్ర బొగ్గు; ద్రుమాంగారం;
    • wood duck, n. చెట్టుబాతు; [zoo.] Aix Sponsa;
    • wood fibers, ph. దారు తంతువులు;
    • dark wood, ph. గహనవనం;
  • wood-eating, adj. దారుభక్షక;
  • woodpecker, n. వడ్రంగిపిట్ట; ద్వారాఘాటం;
  • wool, n. ఉన్ని; బొచ్చు;
  • woof, n. పడుగు; నేతలో నిలువు దారాలు;
  • word, n.మాట; పదం; ముక్క; పలుకు; కబురు; వచనం; ఉక్తి;
    • action word, ph. క్రియాత్మక పదం;
    • borrowed word, ph. ప్రతిదేయ పదం; ప్రతిదేయోక్తి;
    • compound word, ph. సమాసం;
    • good word, ph. సూక్తి;
    • harsh word, ph. దురుక్తి; దురుక్తం; పరుషోక్తి;
    • indigenous word, ph. విసర్గ పదం; నిసర్గము; నిసర్గోక్తి;
    • pleasing word, ph. ప్రియవచనం;
    • word for word meaning, ph. ముక్కస్య ముక్కార్ధం; లఘు టీక;
    • word for word translation, ph. మక్కికి మక్కి అనువాదం;
    • word of mouth, ph. ముఖవచనం;
  • wordsmith, ph. భాషాభిషక్కు; మాటల వాడకంలో దిట్ట;
  • work, n. పని; క్రియ; కార్యము; కృత్యము; చర్య; చాకిరి; కర్మము;
    • menial work, ph. నాలి;
    • unfinished work, ph. తిరుపతి క్షవరం;
    • unpaid work, ph. వెట్టి పని; వెట్టి చాకిరి;
    • virtual work, ph. నిష్‌క్రియ; పని జరగని స్థితి;
  • workbench, n. దాయి; దాతిమాను; వడ్రంగి పని చేసే కర్ర దిమ్మ;
  • working, adj. పరిమిత; పనికి సరిపడా; కార్యకారి;
    • working formula, ph. కార్యకారి సూత్రం;
    • working knowledge, ph. పరిమిత పరిచయం;
  • workload, n. కార్యభారం; పని వత్తిడి;
  • workman, n. పనివాడు; కర్మారుడు; కార్మికుడు; కర్మి;
  • workmanship, n. పనితనం;
  • workshop, n. (1) కార్యశాల; ఒక పని నేర్చుకోవడం కొరకు సమావేశం అయే స్థలం; (2) ఒక పని నేర్చుకోవడం కొరకు సమావేశం;
  • world, n. ప్రపంచం; లోకం; ఇల;
    • earthly world, ph. ఇహ లోకం;
    • heavenly world, ph. పర లోకం;
    • mental world, ph. భావ ప్రపంచం;
    • physical world, ph. భౌతిక ప్రపంచం;
  • world, adj. ప్రాపంచిక; లోక;
    • world view, ph. ప్రాపంచిక దృక్పథం;
  • world-wide, adj. ప్రపంచ విస్తృతమైన; విశ్వ వ్యాప్త;
  • world-wide web, n. విశ్వవ్యాప్త వ్యూహం; ప్రపంచంలోని కంప్యూటర్లన్నిటిని ఒకదానికొకదానిని తగిలించగా వచ్చిన జ్ఞాన భాండాగారం;
  • worm, n. పురుగు; క్రిమి; పాము;
    • hookworm, ph. కొంకి పురుగు;
    • roundworm, ph. ఏలిక పాము;
    • tapeworm, ph. నారి పురుగు;
    • thread worm, ph. నులి పురుగు;
  • wormwood, n. మాచిపత్రి; [bot.] Artemisia absinthium; This medicinal aromatic herb, while native to Europe, grows readily across various climates, including parts of Asia, Africa, South America, and the United States;
  • worry, n. బెంగ; కలత; దిగులు; సంక్షోభం;
  • worry, v. i. బెంగపెట్టుకొను; కలతపడు; దిగులుపడు; ఆరాటపడు; సంక్షోభించు;
  • worship, n. ఆరాధన; సమారాధన; ఉపాసన; పూజ;
    • hero worship, ph. వ్యక్తి పూజ;
    • idol worship, ph. విగ్రహారాధన;
    • mental worship, ph. మానస పూజ;
    • occasional worship, ph. నైమిత్తిక పూజ;
    • optional worship, ph. కామ్య పూజ;
    • regular worship, ph. నిత్య పూజ;
    • sixteen-fold worship, ph. షోడశోపచార పూజ;
  • worshiper, n. ఆరాధకుడు; ఉపాసి;
  • worthless, adj. పొల్లు; నిరర్థక; నిష్ప్రయోజన;
    • worthless remark, ph. పొల్లు మాట;
  • worthless, n. నిరర్ధకం; నిష్ప్రయోజనం;
  • worthy, n. సార్ధకం;
  • wound, v. t. (వౌండ్), past tense of wind (వైండ్), చుట్టు, చుట్టబెట్టు;
  • wound, (ఊండ్) n. గాయం; క్షతం; దెబ్బ; కడి; పుండు; ఈర్మము;
  • wounded, adj. క్షత;
  • wounded people, ph. క్షతగాత్రులు; దెబ్బలు తగిలినవారు;
  • wounded, n. క్షతగాత్రులు;దెబ్బలు తగిలినవారు;

Usage Note: wounded, injured, hurt

---Use wounded when part of the body is damaged by a weapon : a gunshot wound. Use injured when someone has been hurt in an accident or a natural calamity : the injured passengers. Use hurt to say that a part of your body feels pain.

  • wrangle, n. మల్లగుల్లం; పీకులాట;
  • wrath, n. రుష; కోపం; ఆగ్రహం; క్రోధం; రోషం; మంట;
  • wreath, n. మాలిక; తోమాల; ఒక వృత్తాకార ఆకారంలో పువ్వులు, ఆకుల అమరిక, ఒక అలంకరణగా ఉపయోగించబడుతుంది లేదా మరణించిన వ్యక్తికి గౌరవం, గుర్తుగా సూచించబడుతుంది; [see also] garland;
  • wren, n. పిద్ది పిట్ట;
  • wrench, n. పానా; మరచీలను తిప్పే పనిముట్టు;
  • wrestler, n. మల్లుడు; మలె్లూధుడు;
  • wrestling, n. మల్లయుద్ధం; కుస్తీ;
  • wretch, n. నిర్భాగ్యుడు; దేబిరిగొట్టు; నీచుడు; నీచురాలు; హీనుడు;
  • wring, v. t. పిడుచు; పిండు; నలుపు; నులుము;
  • wrinkle, n. ముడత; మెలి; మెలిక; వలితము;
  • wrinkled, adj. వాలిత్య;
  • wrist, n. మణికట్టు; మనికట్టు;
  • write, v. t. రాయు; రచించు; లిఖించు;
  • writer, n. (1) రచనాశీలి; m. రచయిత; f. రచయిత్రి; (2) రాయసకాడు; ముసద్దీ;
    • writer's block, ph. కృత్యాద్యవస్థ; కృతి + ఆది + అవస్థ, అంటే ఏ పనైనా ప్రారంభించేటప్పుడు కర్త అనుభవించే మానసిక పరిస్థితి;
  • writhe, v. i. గింజుకొను;
  • writing, n. రచన; రాత;
  • written, adj. రాసిన;
    • written agreement, ph. కరారునామా;
    • written document, ph. లిఖిత పత్రం;
    • written order, ఫర్మానా;
  • wrong, n. తప్పు; అక్రమం;
  • wrongdoing, n. తప్పుపని; అపరాధం; నేరం;
  • wrought, adj. చేసిన; మలచబడిన; సుత్తితో రూపుదిద్దబడిన;
    • wrought iron, ph. చేత ఇనుము; మలత ఇనుము;

Part 3: X

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • x-rays, n. x-కిరణాలు; రంజన కిరణాలు;
  • x-windows, n. x-వివరములు; క్షటకిటికీలు;
  • Xenon, n. జీనాన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 54, సంక్షిప్త నామం, Xe); [Gr. xexon = stranger);
  • xenophobia, n. పరాయి వారంటే భయం లేదా అయిష్టత; అపరిచితులంటే భయం; కొత్తవారంటే భయం; [Gr. xexon = stranger);
  • xerophthalmia, n. కండ్లలో చెమ్మ ఎండిపోవడం; కండ్ల దురద; కంటిపువ్వు;
  • xylo, pref. కర్ర;
  • xylography, n. కర్ర మీద నగిషీ చెక్కడం;
  • xylophagous, adj. దారుభక్షక; కొయ్యని తినే; కరన్రి తినే;
  • xylophone, n. జలతరంగిణి;
  • xylum, n. దారువు; కొయ్య; కర్రచెక్క;

Part 4: Y

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • yacht, n. (యాట్) విలాసపు పడవ;
  • yak, n. చమరీ మృగం; జడల బర్రె; సవరపు మెకము; [biol.] Bos grunniens (grunting ox) of Bovidae family;
    • wild yak = [biol.] Bos mutus (mute ox);
  • yam, n. మోహనపుదుంప; ఒక రకం ఎర్రటితియ్యదుంప; ఇది దక్షిణ ఆఫ్హ్రికాలో దొరికే ఒక రకం దుంప; Sweet potatoes are in the morning glory family, while yams belong to the lily family; A yam is the modified stem or tuber of a tropical vine called Dioscorea batatas. Although they may look similar to sweet potatoes, they are an entirely different species (yams belong to the Dioscoreaceae family and are related to grasses and lilies, and sweet potatoes belong to the morning glory family) and not even remotely related;
  • yard, n. (1) గజం; మూడడుగుల ప్రమాణం; ఉరమరగా మీటరు; (2) పెరడు; దొడ్డి; అంగణం;
    • back yard, ph. పెరడు; దొడ్డి;
    • front yard, ph. వాకిలి; వీధి వాకిలి; అంగణం;
  • yardstick, n. (1) గజం బద్ద; (2) కొలమానం;
  • yarn, n. నూలు; (1) దారం; వడికిన దారం; నేతకి పనికివచ్చే దారం; (2) కథ;
  • yawn, v. i. ఆవులించు;
  • yawn, n. ఆవులింత;
  • yean, v. t. ఈను; కను; జంతువులు పిల్లలని కనడం;
  • year, n. సంవత్సరం; ఏడాది; ఏడు; వర్షం; సాలు; పన్నెండు నెలలు; 52 వారాలు; ఫసలీ;
    • anomalistic year, ph. 365.2596 రోజులు; భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు ఒక సమీప బిందువు (perihelion) నుండి, అదే సమీప బిందువుకి చేరుకోవడానికి పట్టే కాలం; The anomalistic year (365 days 6 hours 13 minutes 53 seconds) is the time between two passages of Earth through perihelion, the point in its orbit nearest the Sun;
    • academic year, ph. విద్యాసంవత్సరం;
    • fiscal year, ph. ఫసలీ;
    • last year, ph. నిరుడు; కిందటి ఏడు; గత సంవత్సరం; గైరుసాలు;
    • leap year, ph. లంఘ వర్షం; దీర్ఘ సంవత్సరం;
    • per year, ph. సాలు ఒక్కింటికి; సంవత్సరానికి;
    • tropical year, ph. సాయన సంవత్సరం; వాసంతిక సంవత్సరం; 365.242199 రోజులు; భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు ఒక రుతువు నుండి, అదే రుతువుకి చేరుకోవడానికి పట్టే కాలం; time taken by the Sun to travel from one equinox to the same equinox.
    • sidereal year, ph. నక్షత్ర సంవత్సరం; 365.2564 mean solar days; దూరంగా ఉన్న నక్షత్రాల నేపధ్యంలో భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడానికి పట్టే కాలం;
  • yearling, n. కొదమ; ఏడాది నిండిన పశుపక్ష్యాదులు; శకలార్భకం;
  • yearly, adj. సాలుసరి; సాలుకి; సాలీనా; సాంవత్సరిక;
  • yearly income, ph. సాలుసరి ఆదాయం;
  • yearning, n. ఆత్రుత; తమకం;
  • yeast, n. మధుశిలీంద్రం; కలికుండ; తెలంగాణా ప్రాంతములో ఆహారంలో వాడు ఒక సంప్రదాయ జీవ పదార్థము; రొట్టెల పిండి పొంగడానికి వాడే ఒక రకం సూక్ష్మజీవులు; ఈస్టు;
  • yell, v. t. (1) కసురు; కోప్పడు; (2) అరుచు; బొబ్బ పెట్టు; గద్దించు;
  • yellow, adj. పసుపు పచ్చని; పచ్చని; పీత; హరిద్ర;
    • yellow fever, ph. కుంభకామెర్లు; (rel.) పచ్చకామెర్లు;
    • yellow ochre, ph. గోపీచందనం;
    • yellow thistle, ph. బ్రహ్మదండి; బలురక్కెస;
  • yellow, n. (1) పసుపురంగు; పసుపు పచ్చ; పీత; (2) పచ్చ సొన;
  • yellow-green, adj. పీతహరిత;
  • yellow-grey, adj. పీతబభ్రు;
  • yellow-white, adj. పీతశ్వేత;
  • yeoman, n. బంటు;
  • yes, n. అవును; ఔను; ఆహా;
  • yesterday, n. నిన్న;
    • The day before yesterday, ph. మొన్న;
    • the day before "the day before" yesterday, ph. అటుమొన్న;
  • yet, n. అయినప్పటికీ;
  • Yiddish, n. యూరప్ లో ఉన్న యూదులు మాట్లాడే జెర్మన్ భాషని పోలిన భాష; (rel.) Hebrew;
  • yield, v. i.(1) లొంగు; లోనగు; వంగు; ఒదుగు; అవుకు; (2) ఇచ్చు; పండు; ఫలించు;
  • yield, n. దిగుబడి; రాలుబడి; ఫలసాయం; లాభం; ప్రాప్తి; లబ్ధి;
  • yoke, n. కాడి; కాడిమాను; బండి కట్టినప్పుడు ఎడ్ల మెడమీద వేసే కర్ర;
  • yolk, n. పచ్చసొన; అండపీతం;
  • yonder, n.అదిగో; అల్లదిగో;
  • yore, adv. పూర్వం;
  • you, pron. sing. నువ్వు;
  • you, (1) pron. sing. respectful, మీరు; (2) pron.pl. మీరు;
  • young, adj. చిన్న; పిన్న; పసి; యువ;
    • young boy, ph. పిన్న వయస్కుడు;
    • young man, ph. యువకుడు; చిన్నవాడు;
    • young woman, ph. యువతి; చిన్నది;
  • younger generation, ph. యువతరం;
  • youngster, n. చిన్నవాడు; చిన్నది;
  • your, (1) pron. sing. familiar. నీ; (2) pron. sing. possessive, మీ; (3) pron. sing. respectful, మీరు; (4) pron. pl., మీరు;
  • Yours, inter. ఇట్లు; m. భవదీయుడు; f. భవదీయురాలు;
  • yourself, pron. నీవే; నువ్వే; నిన్నే;
  • yourselves, pron. మీరే; మిమ్మల్నే;
  • youth, n. (1) పడుచుతనం; ప్రాయం; యవ్వనం; పరువం; (2) f. యువతి; ఉవిద; జవ్వని; పడుచుది; పడుచుపిల్ల; (3) m. పడుచువాడు; యువకుడు; (4) pl. యువత;
  • Ytterbium, n. ఇతర్యం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 70, సంక్షిప్త నామం, Yb);
  • Yttrium, n. ఇత్రము; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 39, సంక్షిప్త నామం, Yt);

Part 5: Z

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • Z, n. గణితంలో పూర్ణ సంఖ్యలు (-2, -1, 0, 1, 2, 3, వగైరా) యొక్క సమితి; the set of integers;
  • zeal, n. ఆసక్తి; అభినివేశం; ఉత్సాహం; ఉద్విగ్నత;
  • zealot, n. ఉన్మాది; వీరభక్తుడు; అమితోత్సాహి;
    • religious zealot, ph. మతోన్మాది;
  • zebra, n. చారల గాడిద; జీబ్రా;
 
HarianaZebu
    • zebra crossing, ph. రద్దీగా ఉన్న వీధులని సురక్షితంగా దాటడానికి పాదచారుల కొరకు వీధికి అడ్డుగా చారలు వేసిన ప్రదేశం;
  • zebrula, n. మగ జీబ్రాకి ఆడ గుర్రానికి పుట్టిన పిల్ల;
  • zebu, n. పెద్ద మూపురం ఉన్న ఒక జాతి ఆవు కాని ఎద్దు కాని; [bio.] Bos indicus;
  • zedoary, n. కచ్చూరం; అడవి పసుపు; వనహరిద్ర; పసుపు జాతికి చెందిన ఒక వేరు; [bot.] Curcuma zedoaria;
  • zeitgeist, n. పిదపకాలపు బుద్ధి; వేలంవెర్రి; a schema of fashions or fads that prescribes what is considered to be acceptable or tasteful for an era;
  • Zen Buddhism, n. మహాయాన బౌద్ధమతంలో ఒక శాఖ; ఈ శాఖలో ధ్యానానికి ప్రాముఖ్యత ఎక్కువ; జెన్ అన్న మాట ధ్యానం నుండి వచ్చినదే;్
  • zenith, n. (1) ఉచ్ఛ; అత్యున్నత స్థానం; (2) శిరోబిందువు; ఊర్ధ్వబిందువు; ఆకాశంలో నడినెత్తిమీది బిందువు;
  • zero, n. సున్న; సూన్యం; పూజ్యం; హళ్లి; హుళక్కి;
  • zest, n.హుషారు; ఉత్సాహం; ఉద్దీప్తత; ఆతురత;
  • zig-zag, n. చీకిలి మాకిలి; అడ్డదిడ్డం; వంకర టింకర;
  • Zinc, n. తుత్తునాగం; యశదం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 30, సంక్షిప్త నామం, Zn);
  • zinc chloride, ph. యశద హరితం;
  • zinnia, n. బంగాళా బంతి;
  • Zionism, n. యహూదీవాదం;
  • Zirconium, n. జిర్కనం; ఒక రసాయన మూలకం; [Arabic. Azargun = gold color]; (అణుసంఖ్య 40, సంక్షిప్త నామం, Zr];
  • Zizyphus jujuba, n. [bot.] గంగరేగు;
  • zodiac, n. రాశి చక్రం; గగనమేఖలం; శింశుమార చక్రం; ఆకాశంలో మన కంటికీ కనిపించే మేషం, వృషభం, మొదలైన పన్నెండు రాశులూ ఈ చక్రంలో భాగాలే. విషువత్ చలనం వల్ల వేదకాలం నాటికీ, నేటికీ ఈ రాశులు బాగా స్థానభ్రంశం చెందేయి; The region of the sky 8 degrees on either side of the ecliptic; this region is divided into 12 constellations, called the signs of the zodiac, each occupying 30 degrees;
  • zone, n. మండలం; ప్రాంతం; ప్రదేశం;
    • danger zone, ph. ప్రమాదకరమైన మండలం;
    • frigid zone, ph. శీతల మండలం;
    • temperate zone, ph. సమశీతోష్ణ మండలం;
    • torrid zone, ph. అత్యుష్ణ మండలం;
  • zoo, n. జంతుప్రదర్శనశాల;
  • zoology, n. జంతుశాస్త్రం;
  • zoospores, n. గమనసిద్ధ బీజాలు;
  • zygote, n. యుగాండం; యుగ్మ+అండం; సంయుక్త బీజం;


మూలం

  • V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2