This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
American spelling is used throughout.
There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
ఉగ్గడించు, uggaDiMcu
-v. t.
--utter; proclaim; announce; state; see also ఉద్ఘాటించు;
ఉగ్ర, ugra
-adj.
--fierce;
ఉగ్రత, ugrata
-n.
--ferocity;
ఉగ్రవాదం ugravAdaM
-n.
--terrorism; the unlawful use of violence and intimidation, especially against civilians, in the pursuit of political aims; (see also) తీవ్రవాదం;
ఉగ్రాణం, ugrANaM
-n.
--pantry; store room;
ఉగ్గుపాలు, uggupAlu
-n.
--a mixture of castor oil and breast milk often given to infants as an early morning feeding to promote bowel movement;
ఉచ్చ, ucca
-n.
--(1) urine;
--(2) zenith; (ant.) నీచ; అధమ; % this second meaning seems to be correct; it is not ఉచ్ఛ!
ఉచ్చ పోయు, ucca pOyu
-v. i.
--urinate; piss;
ఉచ్చాటణ, uccATaNa
-n.
--exorcism; extracting a demon out of a person's body; banishment;
ఉచ్ఛ్వాసం, ucchvAsaM
-n.
--inspiration; the taking in of breath;
ఉచితం, ucitaM
-n.
--(1) appropriate; proper; fitting; suitable;
--(2) free; at no cost;
ఉచ్ఛిష్టం, ucchishTaM
-n.
--(1) what is left in a plate after eating;
--(2) spittle;
---వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం = there is nothing in the world that had not been touched by Vyasa.
---నూటనోచ్ఛిష్టం భౌతికశాస్త్రం = no aspect of physics was left untouched by Newton.
ఉట్టంకించు, uTTaMkiMcu
-v. i.
--(1) praise; (2) establish; mention;
ఉట్టిచీల, uTTicIla
-n.
--rivet; a two-headed bolt;
ఉట్టిపడు, uTTipaDu
-v. i.
--jump forth; start up;
ఉడాయించు, uDAyiMcu
-v. i.
--escape; run away;
ఉడికించు, uDikiMcu
-v. t.
--(1) cook by boiling;
--(2) tease; josh;
ఉడుం, uDuM
-n.
--iguana; a lizard-like animal known for its strong grip. This animal is reported to have been used to help scale the fortifications in medieval India.
ఉడుం పట్టు, uDuM paTTu
-n.
--a grip as strong as an iguana's grip; very strong grip;
ఉడుకు, uDuku
-v. i.
--(1) boil; bubble with heat;
--(2) seethe;
ఉడుకులోను, uDukulOnu
-n.
--cologne water; (Fr.) Eau de cologne;
ఉడుగడ, uDugaDa
-n.
--wedding gift
ఉడుగు, uDugu
-v. i.
--disappear; fade away, wilt; fall away;
ఉడుత, uDuta; ఉడత, uData
-n.
--squirrel;
-- మలబార్ ఉడుత = Malabar Squirrel; Indian Giant Squirrel; [bio.] Ratufa indica of the Sciuridae family; ఈ ఎగిరే ఉడత ఒక చెట్టు మీదనుంచి మరో చెట్టు మీదికి అలవోకగా ఎగరగలవు; ఈ ఉడతలు ఎత్తైన వృక్షాల మీద సన్నటి చిటారు కొమ్మలపైన తమ గూళ్ళు నిర్మించుకుంటాయి;
-- మూడు చారల ఉడుత = three-striped palm squirrel; Indian palm squirrel; [bio.] Funambulus palmarumof the Sciuridae family;
-- ఐదు చారల ఉడుత = [bio.] Funambulus pennantii;
-- ఉడుతలు ఇయోసిన్ యుగం అంటే 56 నుంచి 34 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి;
ఉడుప కుక్క, uDupa kukka
-n.
--hound; hunting dog;
ఉడుపు, uDupu
-v. t.
--thrashing; beating grain out of husk;
ఉత్తర, uttara
-pref.
--leftover; the later part; post;
---ఉత్తర రామాయణం = the later part of Ramayana.
ఉత్తర అమెరికా, uttara amerikA
-n.
--North America; Canada, US and Mexico;
ఉత్తర మీమాంశ, uttara mImAMSa
- n.
-- పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస తత్వాలు, సనాతన హిందూ భావనలలో, ఆచరణల్లో పరిణామాన్ని (evolution) ని సూచిస్తాయి. పూర్వ మీమాంస తరువాత కాలగమనంలో ఋషుల కొత్త భావనలతో వేద వాంగ్మయం విస్తృతం అయింది. అప్పటికే వున్న బ్రాహ్మణికాలకి కొత్త సంహితలు చేర్చబడ్డాయి. కొత్తగా అరణ్యకాలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో పరబ్రహ్మ స్వరూపం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అది నిరాకారం , నిర్గుణం, నిర్విశేషం అన్న ప్రతిపాదన చేయబడింది. గుణాలూ, రాగ ద్వేషాలు లేనిదానిని సంతోష పెట్టడం ఎలాగ? అలాగైతే కర్మకాండకు అర్థం లేదు కదా. మరి జన్మ రాహిత్యం ఇచ్చే ముక్తి ఎలాగ వస్తుంది? పరబ్రహ్మని తెలుసుకోవడమే మానవజన్మ లక్ష్యం అనీ, అదే ముక్తి అని చెప్పబడింది. ఈ నవ్య ఆలోచనా భాగం ఉత్తర మీమాంస అని ప్రసిద్ధి చెందింది. ఇందులో జ్ఞానానికి పెద్దపీట. ఈ ఉత్తర మీమాంస పునాదులమీద ఉపనిషత్ లు నిర్మించబడ్డాయి.వీటన్నిటి సారాన్ని బ్రహ్మసూత్రాలలో, శ్రీ వ్యాస మహర్షి ఆవిష్కరించారు.
ఉత్తర సముద్రం, uttara samudraM
-n.
--North Sea;
ఉత్తర ధ్రువం, uttara dhruvaM
-n.
--north pole;
ఉత్తరధ్రువ వృత్తం, uttaradhruva vRttaM
-n.
--Arctic Circle; north polar circle;
ఉత్తరప్రత్యుత్తరాలు, uttarapratyuttarAlu
-ph.
--correspondence by letters;
ఉత్తరపదం, uttarapadaM
-n.
--suffix, the later part of a word;
ఉత్తర ఫల్గుణి, uttara phalguNi
-n.
--(1) Beta Leonis; Denebola; Yoga tara of the 12th lunar mansion; located in the constellation Leo; the Sun enters this star group on September 13th and stays there for about 13 days;
--(2) The 12th of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
ఉత్తరాభాద్ర, uttarAbhAdra
-n.
--(1) Gamma Pegasi; Alpha Andromeda; Yoga tara of the 26th lunar mansion; located in the constellation Pegasus;
--(2) The 26th of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) ముక్కంటి చుక్క;
ఉత్తరాయన రేఖ, uttarAyana rEkha
-n.
--Tropic of Cancer;
ఉత్తరాయనాంతం, uttarAyanAMtaM
-n.
--summer solstice; the day on which the sun rises in the northern most part of the sky before beginning the southward journey, namely, June 22. This day has the shortest night in the northern hemisphere;
ఉత్తరాషాడ, uttarAShADa
-n.
--(1) Tau Sagittarii; Hecatebolus; Yoga "taara" of the 21st lunar mansion; located in the constellation Sagittarius;
--(2) The 21st of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
ఉత్తరాసి, uttarAsi
-n.
--(1) upper door hinge;
--(2) socket; the female part of the plug-socket pair of a door hinge; this part is attached to the door frame; see also ఉతక;
ఉత్తరేను, ఉత్తరేణి, uttarEnu, uttarENi
-n.
--Prickly Chaff; Devil’s Horse Whip; [bot.] Achyranthes aspera of the Amaranthaceae family; a medicinal plant used for skin diseases;
-- ముండ్లతోటకూర;
--[Sans.] కీశవల్లి, ఉత్తరేణి; అపామార్గము; [Hin.] chinchari;
--ఈ మొక్కకున్న వైద్యపరమైన విలువలను గుర్తించి వినాయక చతుర్థి రోజున గణేశపూజకు వాడే 21 రకాల పత్రి మొక్కలలో ఉత్తరేణిని కూడా చేర్చారు. ఈ మొక్క లేత ఆకులను కొందరు ఆకు కూరగా వాడుకుంటారు.ఈ ఆకుల్ని పశువులు, మేకలు ఇష్టంగా తింటాయి. దీని గింజలకున్న సన్నటి నూగు ముళ్ళ కారణంగా ఇవి బట్టలమీద, ఒంటిపైన చిక్కుకుంటాయి.
--ఈ మొక్క ఆకుల రసం శరీరంలోని స్రావాలను అరికడుతుంది. మూత్రాన్ని జారీ కావిస్తుంది. ఈ రసం స్త్రీల ఋతుస్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మూల వ్యాధి (పైల్స్)ని, చర్మ రోగాలనూ నివారిస్తుంది. గనేరియా, ఉబ్బసం, కుష్ఠు వంటి మొండి వ్యాధులను నయం చేస్తుంది. దీని వేళ్ళను మెత్తగా నూరి కళ్ళలో పెట్టుకుంటే చూపు మందగించినవారికి ఎంతో ప్రయోజనకరం. ఈ వేళ్ళ కషాయం తాగితే ఉదర కోశ సంబంధమైన వ్యాధులు, మూత్ర పిండంలోని రాళ్లు నివారణ అవుతాయి.
ఉత్పత్తి, utpatti
-n.
--(1) derivation; explanation of the source; etymology;
--(2) production; creation;
-- ఉత్పాదన;
ఉత్పరివర్తనం, utparivartanaM
-n.
--mutation; sudden change in the structure of genetic material typically caused by exposure to chemicals or radiation;
ఉత్పలం, utpalaM
-n.
--waterlily;
ఉత్పలమాల, utpalamAla
-n.
--a meter in Telugu poetry; (lit.) a garland of water lilies;
ఉత్సవ విగ్రహం, utsava vigrahaM
-n.
--parade idol; a stand-in idol used in street parades while the real idol is left in the inner sanctum of a temple; nominal candidate; a stand-in; a proxy;
ఉత్పాతం, utpAtaM
-n.
--(1) a preternatural phenomenon such as an earthquake, a tsunami, or an abnormal birth; ఉపద్రవం; (2) a prodigy; a wonderful genius; ఉత్పాతపిండము;
ఉత్సాహవంతులు, utaAhavaMtulu
-n. pl.
--excited people; enthusiastic people;
-- (note) ఔత్సాహికులు is incorrect usage;
ఉత్తుంగం, uttuMgaM
- adj.
-- tall; high;
ఉతుకు, utuku
-n.
--wash;
---రెండవ ఉతుకు = the second wash;
v. t.
--(1) wash;
--(2) criticize severely;
ఉతుకుడు, utukuDu
-n. .
--(1) wash;
--(2) severe criticism;
ఉత్తు, uttu
-n.
--[gram.] the short ఉ;
ఉత్సుకత, utsukata
-n.
--curiosity; anxiety to learn;
ఉత్తేజకం, uttEjakaM
-n.
--stimulant; invigorator;
ఉత్తేజితం, uttEjitaM
-n.
--one that was excited; one that was inspired;
ఉదంతం, udaMtaM
-n.
--news; story; narrative;
ఉద, uda
-pref.
--hydro;
ఉదకం, udakaM
-n.
--water;
ఉదకర్బనం, udakarbanaM
-n.
--hydrocarbon; an organic chemical containing hydrogen and carbon;
---ఉదకర్బనరాశి = hydrocarbon radical.
ఉదజని, udajani
-n.
--hydrogen; (lit.) one that gave birth to water; one of the chemical elements with the symbol H;
ఉదజని బంధం, udajani baMdhaM
-n.
--[chem.] hydrogen bond; a type of chemical bond; a weak bond between two molecules resulting from an electrostatic attraction between a proton in one molecule and an electronegative atom in the other
ఉదజనీకరణం, udajanIkaraNaI
-n.
--[chem.] hydrogenation; the process by which oils are converted into margarine by pumping hydrogen into them under pressure.
ఉదజనీకృత udajanIkRta
-adj.
--hydrogenated;
ఉదజనీకృత తైలం, udajanIkRta tailaM
-n.
--hydrogenated oil; margarine; Dalda is the trade name of a margarine widely sold in India;
ఉదయం, udayaM
-n.
--morning; strictly, from 6 A.M. to 12 noon;
ఉదయించు, udayiMcu
-v. i.
--rise; be born;
ఉదరం, udaraM
-n.
--(1) abdomen; stomach; belly; the part of the stomach below the chest wall and above the navel;
--(2) inner part of any thing;
ఉదర, udara
-adj.
--[anat.] ventral; stomach-related; on the stomach side;
ఉదర పోషణ, udarapOShaNa
-n.
--nourishing the belly; livelihood;
ఉదహరించు, udahariMcu
-v. t.
--cite; give as an example;
ఉద్దండ దండులు, uddaMDa daMDulu
-ph.
--(1) influential people; highly talented people;
--(2) people to be afraid of; fierce people; (lit.) people who carry a long stick; see also చండ ప్రచండులు;
---చట్టం యొక్క ఉద్దండ దండం = the long (or fierce) stick of the law.
ఉద్ధతి, uddhati
-n.
--arrogance;
ఉద్ధరణ, uddharaNa
-n.
--upliftment; support; (rel.) పునరుద్ధరణ = renovation; renaissance;
---గిరిజనోద్ధరణ = upliftment of hill tribes.
ఉద్భవించు, udbhaviMcu
-v. i.
--germinate; to come into existence;
ఉద్యతి, udyati
-n.
--effort; endeavor;
ఉద్యమం, udyamaM
-n.
--campaign; movement; (lit.) one that has risen;
---సహాయ నిరాకరణోద్యమం = non-cooperation movement.
---సత్యాగ్రహోద్యమం = movement of Truth-force (righteous indignation).
ఉద్వర్తనం, udvartanaM
-v. t.
--rubbing with oil or ointment;
ఉద్వర్తన ఒలంతం, udvartana olaMtaM
-n.
--rubbing alcohol; isopropyl alcohol; this alcohol is often used to reduce fever by rubbing it on the body; this is poisonous and not the same as the alcohol in drinks;
ఉద్దెర, uddera
- n.
-- buy now and pay later system;
-- డబ్బు ఇయ్యకుండా వెచ్చాలు కొని తెచ్చుకుని తరువాత చెల్లించే పద్ధతి; పద్దులో రాయించుకుని తెచ్చుకోవడం;
ఉద్దేశం, uddESaM
-n.
--(1) intent; opinion;
--(2) purpose; motive;
--(3) opinion; idea;
--(4) elevated place; superior position;
-- [note] ఉద్దేశం cause అయితే ఉద్దేశ్యం effect; ఉద్దేశము అభిలాష అయితే ఉద్దేశ్యము అభిలాషకు విషయమైన వస్తువు. పండు తినడం ఉద్దేశమైతే, పండు ఉద్దేశ్యము అన్నమాట;
ఉపజ్ఞాతం, upaj~nAtaM
- n.
-- intuition; knowledge acquired without instruction;
ఉపజీవిక, upajihvika
-n.
--uvula; the pendulum-like muscular growth that appears to be suspended from the roof of the throat; కొండనాలుక;
ఉపతాపం, upatApaM
- n.
-- disease;
ఉపతాపి, upatApi
- n.
-- patient; a person suffering from an ailment; any person visiting a doctor for consultation;
ఉపదంశం, upadaMSaM
-n.
--pickle; relish; condiment; any spicy side dish;
ఉపదర్శి, upadarSi
-n.
--manager; supervisor;
ఉపద్రవం, upadravaM
-n.
--misfortune; calamity;
-- ఉపద్రవం అంటే ఉన్నట్టుండి ఏదో కొంప మీదికి రావడం. వరదలూ,భూకంపాలూ ఇలాంటివి అనుకోకుండా వచ్చేవి ఉపద్రవాలు; ఉత్పాతం;
ఉపద్రష్ట, upadraShTa
- n.
-- (1) the person who supervises the rituals at Hindu Vedic fire sacrifices;
-- (2) hypervisor; supervising software in a computer such as an operating system;
ఉపదేశం, upadESaM
-n.
--instruction of a good word; religious instruction;
ఉపదేశాత్మక, upadESAtmaka
-adj.
--didactic;
ఉపధ, upadha
-n.
--[gram.] penultimate letter in a word;
ఉపన్యాసం, upanyAsaM
-n.
--lecture; speech; discourse; address; exposition of a subject;
ఉపనియమావళి, upaniyamAvaLi
- n.
-- bylaws;
ఉపనిషత్తులు, upanishattulu
-n. pl.
--sacred philosophical treatises attached to the Vedas, constituting an important part of Hindu scriptures; Out of 108 of these, 10 are associated with Rigveda, 19 with Shukla Yajurveda, 32 with Krishna Yajurveda, 16 with Samaveda and 31 with Atharvanaveda;
-- (ety.) ఉపని = near; షత్తు = place = a place nearby (a teacher);
ఉపశాఖ, upaSAkha
-n.
--(1) twig;
--(2) sub-branch in an organization;
ఉపశృతి, upaSRuti
- n.
-- an omen gleaned from a conversation; a supernatural voice that reveals the future;
ఉపసంహారం, upasaMhAraM
-n.
--conclusion; termination; reversing the course of an earlier action initiated by the same person or entity;
ఉపసర్గ, upasarga
-n. [gram.]
--prefix; a prefix inserted at the beginning of a root word to alter or extend it meaning;
-- In Sanskrit there are 22 such prefixes and these are extensively used in Telugu also; these are ప్ర, పరా, అప, సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, అజ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప;
ఉప్పళించు, uppaLiMcu
-v. t.
--beat; thrash; like washing clothes by gently squeezing them against a hard surface;
ఉపాంతం, upAntaM
-n.
--margin; border;
ఉపాఖ్యానం, upAkhyAnaM
-n.
--episode;
ఉపాధ్యాయుడు, upAdhyAyuDu
-n. m.
-- teacher; a teacher who imparts knowledge with information;
-- అధ్యాపక = a teacher who gives information
-- ఆచార్య= a teacher who imparts skills
-- పండిత = a teacher who can give deep insight into a subject
-- ద్రష్ట = a teacher who is a visionary;
ఉపాధి, upAdhi
-n.
--support; supporter; prop;
ఉపాయం, upAyaM
-n.
--idea; solution; tool; trick; stratagem;
---సామ, దాన, భేద, దండోపాయములు = the four tricks, namely - persuasion, bribery, deceit or punishment.
ఉపాస్థి, upasthi
-n.
--[anat.]
--(1) cartilage;
--(2) vulva; the external part of the female genital organ;
ఉపాహారం, upAhAraM
-n.
--lunch;
ఉప్పిచెట్టు, uppi ceTTu
-n.
--a thorny shrub with medicinal properties; [bot.] Volkameria capparis sepia;
ఉప్పిడి, uppiDi
-adj.
--saltless; unsalted; flat;
ఉప్పు, uppu
-n.
--salt; common salt; table salt; a dominant part of table salt is sodium chloride;
-- సముద్రపు ఉప్పు = sea salt; contains many minerals other than sodium chloride;
-- సైంధవ లవణం = rock salt; this has more sodium chloride compared to sea salt; the crystals are more coarse than those of sea salt; rock salt has some medicinal uses in Ayurveda;
-- Table salt is a processed version of naturally occuring salt; the processing may remove some minerals and add some such as iodine;
ఉప్పుకాగితం, uppukAgitaM
-n.
--sandpaper; (lit.) salt paper;
ఉప్పుకొఠార్లు, uppukoThArlu
-n. pl.
--salt flats; sea water ponds where salt is produced;
ఉప్పుగడ్డి, uppugaDDi
- n.
-- [bot.] Chloris barbata; Chloris inflata of the Poaceae family;
-- ఈ జాతి గడ్డిలో అరుగుదల అయ్యే ముడి ప్రాణ్యములు (Digestible Crude Proteins) చాలా ఎక్కువ శాతంలో ఉండటంవల్ల పశువుల మేతగా ఉప్పుగడ్డి శ్రేష్ఠమైనది. అయితే ఉప్పుగడ్డి యొక్క పోషక విలువలు అది కంకులు వెయ్యక ముందే ఎక్కువగా ఉంటాయి; కలుపు నివారణకు గ్లైసెల్ వంటివి చల్లితే గాని ఈ ఉప్పు గడ్డి చావదు. ఈ ఉప్పుగడ్డి ఎంత మొండిదంటే ఒకసారి పుష్పించిన తరువాత వెనువెంటనే దాని విత్తనాలు త్వరత్వరగా అంతటా వెదజల్లబడతాయి. కలుపుమందు
ప్రభావానికి ఇప్పుడు ఉన్న ఉప్పుగడ్డి మొత్తం చచ్చిపోయినా, అంతకుముందే జరిగిన విత్తనవ్యాప్తి కారణంగా ఆ తరువాత వెంటనే కొత్త మొక్కలు మొలుచుకొస్తాయి;
ఉప్పుటేరు, uppuTEru
-n.
--backwaters; estuary; the place where sea water backs up into a river branch as the river enters the sea;
ఉభయభాషాప్రవీణ, ubhayabhAshA pravINa
-n.
--a title given to an expert in two languages, usually in Sanskrit and Telugu;
ఉమ్మడి, ummaDi
-adj.
--joint; shared;
---ఉమ్మడి కుటుంబం = joint family.
---ఉమ్మడి వ్యాపారం = joint business.
---ఉమ్మడి సమీకరణములు = simultaneous equations.
---ఒక్కుమ్మడి = several things at one time; all at a time.
ఉమ్మనీరు, ummanIru
-n.
--amniotic fluid;
ఉమ్మి, ummi
-n.
--spit; sputum;
ఉమ్మి టపాకాయల మొక్క, ummi TapAkAyala mokka
- n.
-- Cracker Plant; Popping Pod Plant; Daniel's Great Gun; Fever Root Plant; Iron Root; Minnie Root; Minnier Root; Snapdragon Root; Blue Bell Plant; Spear Pod Plant; [bot.] Ruellia tuberosa of the Acanthaceae family;
-- నీలం, వయొలెట్ వర్ణపు గొట్టం పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ మొక్క యొక్క దాదాపు అంగుళం పొడవుండే ఎండు కాయలను నోట్లో పెట్టుకుంటే ఠాప్మంటూ నోట్లోనే పేలి గింజలను వెదజల్లుతాయి. ఎండి నల్లగా అయిన కాయలు తడి తగిలితే టపాకాయలలా పేలి గింజలను వెదజల్లుతాయి కనుక ఈ మొక్కలను ఉమ్మి టపాకాయల మొక్కలు అంటారు;
ఉల్లికాడలు, ullikADalu
-n. pl.
--green onions; spring onions; scallion; (rel.) leek; shallot; scallion is the general name for any of the three varieties of onions;
ఉల్లిపాషాణం, ullipAshANaM
-n.
--white arsenic; arsenic trioxide; often mixed with onion to conceal the former's identity and used as a poison or murder weapon; పాషాణం;
ఉష్ణతామాపకం, ushNatAmApakaM
-n.
--calorimeter; an instrument to measure the quantity of heat in a substance;
ఉష్ణమాపకం, ushNamApakaM
-n.
--thermometer; an instrument to measure the intensity of heat in a body;
ఉష్ణవాహకం, ushNavAhakaM
-n.
--conductor of heat;
ఉష్ట్రపక్షి, ushTrapakshi
- n.
-- ostrich; [bio.] Struthio camelus; Somali Ostrich; [bio.] Struthio molybdophanes;
--ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి; ఎగరలేని పక్షిజాతులు 40 దాకా ఇంకా భూమిమీద ఉన్నాయి. న్యూజిలాండ్ లో కనిపించే కివి (Kiwi) పక్షులు, ఆస్ట్రేలియాలో కనిపించే ఈమూ (Emu) పక్షులు, దక్షిణ అమెరికా ఖండంలో కనిపించే రియా (Rhea) పక్షులు, ఈశాన్య ఆస్ట్రేలియాలోనూ, న్యూ గినీ పరిసర దీవులలోనూ కనిపించే కసావరీ (Cassowary) పక్షులు, ఒకప్పుడు న్యూజిలాండ్ లో జీవించి, ఆ తరువాత అంతరించిపోయిన మోవా (Moa), అలాగే ఆఫ్రికాలోని మడగాస్కర్ దీవిలో జీవించి అంతరించిన ఎలిఫెంట్ బర్డ్స్ (Elephant birds) కూడా ఎగరలేని పక్షులే;
--నిప్పుకోడి;
ఉషారుగా, ushArugA
- adv.
-- gaily;
ఉష్ణోగ్రత, ushNOgrata
-n.
--temperature; a measure of the degree of hotness;
ఉసిగొలుపు, usigolupu
-v. t.
--instigate; incite someone against another, incite a dog to attack;
ఉస్తి, usti
- n.
-- gigantic swallow wort; [bot.] Solanum trilobatum of the Solanaceae family; (Potato or Tomato or Tobacco Family);
-- తీగలు సాగుతూ పెరిగే ఈ ముళ్ల పొదమొక్కకు ఒళ్ళంతా ముళ్లే. కాండం మీద మాత్రమే కాక ఈ మొక్క ఆకుల మీదకూడా మెలితిరిగిన కొక్కెం ముళ్లు ఉంటాయి. అనుకూల పరిస్థితులలో రెండు మీటర్ల ఎత్తు వరకూ కూడా ఈ పొదలు పెరుగుతాయి. ఈ పొద ఆకులు త్రిభుజాకారంలోనూ, డెల్టా ఆకారంలోనూ ఉంటాయి. ఈ ఆకులను నీడలో ఆరబెట్టి లేక నేతిలో వేయించి పొడి కొట్టి నిల్వచేసుకుంటారు. సాధారణమైన జలుబు, దగ్గులకు, జ్వరాలకు ఈ పొడి బాగా పనిచేస్తుంది. ఈ ఆకులను పొడిచేయబోయే ముందు వాటి మీద ఉండే విషతుల్యమైన ముళ్ళను తొలగించాలి. లేత వంగపండు రంగులో ఉండే ఈ మొక్క పూలు అచ్ఛం వంగపూలలాగే ఉంటాయి. గుండ్రంగా, చిన్నవిగా, గుత్తులుగా కాసే ఈ మొక్క కాయలు పండితే చూసేందుకు రక్తవర్ణంలో చిట్టి టొమాటోలలాగా అనిపిస్తాయి. చేదుగా ఉండే ఈ మొక్క వేళ్ళ కషాయం లేక చూర్ణం, దీని పూలు, కాయల రసం దగ్గు నివారణకు బాగా పనిచేస్తాయి;
-- ముండ్ల ముష్టి; అలర్క పత్రము; ఉచ్చింత; కొండ ఉచ్చింత; ఉస్తి, ఉస్తె అన్నీ ఒకటే;
--[Sans.] అలర్క; అగ్నిదమ; వల్లీ కంటకారికా;
ఉసిళ్ళు, usiLLu
- n. pl.
-- a family of winged ants;
-- also called ఇసుళ్ళు;
-- వానలు కురిసే సమయాల్లో ఒక్కోసారి వీటి పుట్టలు పూర్తిగా తడిసిపోయి వాసయోగ్యంగా లేకుండాపోయిన కారణంగా ఇసుళ్లు లేక ఉసుళ్ళు తమ పుట్టలలోంచి బయటికి వచ్చి రాత్రిళ్ళు విద్యుద్దీపాల వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. అవి దీపాల కాంతికి ఆకర్షించబడినా, ఆ వేడికి వాటి రెక్కలు కాలిపోయి అవి ఎగరలేక కిందపడి పోతాయి;
ఉసురు, usuru
- n.
-- (1) breath; exhaled breath; life-force; (2) breath exhaled in despair; a sigh; an expression of grief by releasing heavy breath;
--- ఉసురు అంటే ఊపిరి, ప్రాణం; ఏదైనా చేయగూడని పెద్ద అపకారం చేస్తే. "వాడి ఉసురు కొడుతుంది జాగ్రత్త" అంటాం. వాడు తన అశక్తత వల్ల ఏమీ చేయలేక పోయినా వాడి ప్రాణశక్తి పనిచేసి నీ ప్రాణం తీస్తుంది, అని అర్థం;
---ఆడదాని ఉసురు తగలకపోదు = the sigh of a woman will not fail to bring trouble (to him who caused her grief);
ఉస్కో, uskO
-inter.
--command used to incite a dog to attack;
Part 3: ఊ - U
ఊ, U
- third long vowel of the Telugu alphabet. A high back rounded vowel, rather like the two vowels in English food or the first vowel in the word rule.
ఊక, Uka
-n.
--husk; chaff; the rough skin of rice paddy; see also చిట్టు; తవుడు; పొట్టు;
ఊకదంపుడు, UkadaMpuDu
-n.
--[idiom.] a talk or conversation with no substance; worthless talk;
ఊగు, Ugu
-v. i.
--swing; rock; sway;
ఊచ, Uca
-n.
--a lean thin rod; smooth rod-like stem of millet plant; the soft cylindrical core of a banana plant;
ఊచకోత, UcakOta
-n.
--torture; (lit.) cutting of a rod;
ఊట, UTa
-n.
--(1) water spring; fountain;
--(2) any liquid that oozed out, such as juice in a pickle; esp. mango pickle;
---(e. g.) ఊట కలం = fountain pen.
---(e. g.) ఆవకాయ ఊట = juice that oozed out from pickled mango.
ఊడ, UDa
-n.
--aerial root; root growing down from the branches of a banyan tree;
ఊడగొట్టు, UDagoTTu
-v. t.
--pull out; root out; disassemble;
ఊడపీకు, UDapIku
-v. t.
--pull out; root out;
ఊడిగం, UDigaM
-n.
--servitude;
ఊడు, UDu
-v. i.
--slip out; drop out; fall away; come loose;
ఊడుగు చెట్టు, ooDugu cheTTu
-n.
-- [bot.] Alangium decapetalam; Alangium salvifolium;
-- This tree is found throughout India; root decoction is used for fevers and leaf extract for skin diseases;
--[Sans.] అంకోలం;
ఊదు, Udu
-v. t.
--blow; puff; fan fire; blow with the mouth;
ఊదుగొట్టం, UdugoTTam
-n.
--blow pipe;
ఊదొత్తి, Udotti
-n.
--incense stick, a scented stick; also అగరువత్తి; ఊదువత్తి;
ఊన, Una
-pref.
--one-less;
ఊనాంత, UnAMta
-adj.
--one-less than the last; last but one; penultimate;
ఊనిక, Unika
-n.
--(1) support;
--(2) stress;
ఊను, Unu
- v. t.
-- tan; process hides into leather;
ఊపు, Upu
-v. t.
--shake; rock; swing;
ఊపిరి, Upiri
-n.
--breath; respiration;
---నాకు ఊపిరి ఆడడం లేదు = (1) I am breathless; I am suffocating; (2) I am very busy.
---ఊపిరి పీల్చు = take a breath.
---ఊపిరి బిగపట్టు = hold your breath.
ఊపిరితిత్తులు, Upiritittulu
-n. pl.
--lungs;
ఊబి, Ubi
-n.
--quicksand; mire; quagmire; mud;
--quicksand is not just an unstable patch of solid granules; It’s a non-Newtonian liquid, meaning it doesn’t follow the characteristics of Newton’s Law of Viscosity; While composed of sand, quicksand’s qualities are due to the 30% to 70% of air found between the grains. There is another component to the unusual formation, however, that helps give it that thick consistency; Along with the air-filled space, quicksand is comprised of a third component — water. Since there is a space between the grains of sand, when there is a vibration or added weight, they become unstable. With these disturbances, the water separates from the grains, causing a liquid-like consistency. As it loses viscosity, the patch of quicksand becomes unable to hold up any weight; Anything that crosses it, from a small animal to a human, will start to sink; Quicksand is often depicted as a death trap, but with the proper reaction, getting caught in it is not a dooming scenario.
ఊరకుక్క, Urakukka
-n.
--stray dog; street dog; dog without an owner;
ఊరగాయ, ooragaaya
- n.
-- pickle; a pickle is prepared for long-term use; a chutney is something that is consumed in a few of days;
-- మామిడికాయలతో ఆవకాయ, నిమ్మ పళ్ళతో నిమ్మకాయ, దబ్బకాయ, మాగాయ, వగైరాలు ఊరగాయలు. ఊరుతుంది కనుక ఊరగాయ, బాగా మాగుతుంది కనుక మాగాయ. పచ్చడి అప్పటికప్పుడు బండమీద నూరుకొనో, రోటిలో దంచుకొనో తినేది; పచ్చళ్ళు నాలుగైదు రోజులు నిల్వ వుంటాయి, ఊరగాయలు ఏడాది పైగా నిల్వ వుంటాయి;
ఊరట, UraTa
-n.
--comfort; consolation; rest;
ఊరపంది, UrapaMdi
-n.
--stray pig; street pig; pig without an owner;
ఊరపిచ్చుక, Ura piccuka
-n.
--house sparrow; [bio.] Passer domesticus;
ఊర్థ్వబిందువు, UrthvabiMduvu
-n.
--[astro.] zenith; the point on. the celestial sphere directly above the observer's head;
ఊర్థ్వ బృహత్ సిర, Urthva brRhat sira
-n.
--[anat.] superior vena cava; The main vessel that brings blood from the upper parts of the body to the heart;
ఊరికే, UrikE
-adv.
--merely; for no reason;
ఊరు, Uru
-n.
--(1) town; village; city; a generic word for any of these with no indication of its size;
--(2) thigh;
---మీది ఏ ఊరు? = Where are you from?
-v. i.
--(1) ooze; watering of mouth on seeing food; oozing of water in a well;
--(2) pickle; pickling of stuff in a solution of condiments;
ఊరుకొను, Urukonu
-v. i.
--be quiet; be still; refrain from answering;
ఊరుగాయ, UrugAya
-n.
--pickle; a vegetable that was pickled;
ఊరుపిండి, UrupiMDi
-n.
--spiced and fermented sesame cake;
ఊరుమ్మడి భూములు, UrummaDi bhUmulu
-ph.
-- village common properties such as village government offices; irrigation facilities, sanitary and drainage facilities, burial/cremation grounds, parks, cattle pounds, etc.
ఊరువు, Uruvu
-n.
--thigh;
ఊరుసంధి, UrusaMdhi
-n.
--[anat.] hip joint;
ఊరుసిర, Urusira
-n.
--[anat.] femoral vein;
ఊర్పు, oorpu
- n.
-- a category of Indian dish prepared and tempered; తాలింపు పెట్టిన పచ్చిపులుసు;
-- a category of Indian dish prepared and tempered; సిగరి అంటే మెంతుల తాలింపు పెట్టిన మజ్జిగ చారు;
-- తాలింపు పెట్టిన అన్నపు వంటకాన్ని ద్రబ్బెడ అంటారు;
ఊరేగింపు, UrEgiMpu
-n.
--procession;
ఊరోపరి, UrOpari
-n.
--laptop; a computer that fits on the lap;
ఊళ, ULa
-n.
--whistle;
ఊస, Usa
-n.
--a thin rod of metal;
ఊసరం, UsaraM
-n.
--salty soil;
ఊసరవెల్లి, Usaravelli
-n.
--chameleon; [bio.] Chamaeleo calyptratus of the Chamaeleonidae family; a lizard-like animal that changes its color to blend with its surroundings;
-- the expression, "తొండ ముదిరి ఊసరవెల్లి అయింది" is not scientifically accurate because తొండ and ఊసరవెల్లి are two different animals;
-- ఊసరవెల్లులలో 202 జాతులున్నాయి. వెయిల్డ్ కెమెలియన్ (Veiled Chameleon), జాక్సన్స్ కెమెలియన్ (Jackson's Chameleon), పాంథర్ కెమెలియన్ (Panther Chameleon) వీటిలో చెప్పుకోదగినవి;
-- గ్రీకు భాషలో 'ఖమాయ్' (khamai) అంటే ' నేలమీద' అనీ ' లియోన్' (leon) అంటే 'సింహం' అనీ అర్థాలు కనుక ఇది 'నేలమీది సింహం';
ఊసు, Usu
-n.
--information; news;
---నా ఊసు నీకెందుకు? = why do you care about me?
ఊష్ణం, UshNaM
-n.
--fever; this dialect is a deformation of the word ఉష్ణం;
ఋజువర్తనుడు, RjuvartanuDu
- n.
-- straightforward person; honest person;
-- ఋజువర్తనుడు అంటే ముక్కుకు సూటిగా పోయేవాడు. పాపభీతితో —- మాటలలో, చేతలలో ఒకే విధంగా నడిచే వాడు. ఎవరెన్ని అడ్డదారులు తొక్కినా, తాను మాత్రం తాను నమ్మిన సత్యం ప్రకారమే నడిచే వాడు ఋజువర్తనుడు. మాటలలో వంచన, దాపరికం లేని వాడు ఇతడు.
ఋజువు, Rujuvu
- n.
--proof; tally;
ఋషి, Rushi
- n.
-- sage; wise person; a person who acquired wisdom from experience and deep contemplation;
-- "ఋషి" అనే పదం "దృశ్" అనే ధాతువు నుండి ఉద్భవించింది, దీని అర్థం "చూడడం" లేదా "తత్త్వాన్ని గ్రహించడం." ఋషులు అనుభవజ్ఞానం కలిగి ఉన్న మహా జ్ఞానులు. వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే పూర్వగాములు.
మూలం
V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2