Part 1: ఎం - eM
ఎంగిలి, eMgili
-n.
--(1) defilement due to contact with saliva;
--(2) leftover food previously tasted by someone else, hence unclean;
ఎంగిలి చేయు, eMgili cEyu
-v. t.
--the process of making food impure by tasting (or biting into) it and putting the tasted remains back in the vessel;
---కాకెంగిలి = the process of biting into something by putting a cloth in between the teeth and the tasted item in such a way the saliva does not touch the food being bitten.
---కొంచెం ఎంగిలి పడు = [idiom.] just eat some little bit.
ఎంగిలి మంగలం, eMgili maMgalaM
- ph.
-- unclean; unhygenic;
ఎంచు, eMcu
-v. t.
--select; choose; opt;
ఎండ, eMDa
-n.
--sunshine;
ఎండ గడియారం, eMDa gaDiyAraM
-n.
--sun dial;
ఎండబెట్టు, eMDabeTTu
-v. t.
--dry; put in the sun to dry;
ఎండపోయు, eMDapOyu
-v. t.
--dry; spread in the sun to dry;
ఎండమావి, eMDamAvi
-n.
--mirage;
ఎండాకాలం, eMDakAlaM
-n.
--summer;
ఎండు, eMDu
-adj.
--dried; dry;
---ఎండు కరల్రు = dry firewood.
ఎంపిక, eMpika
-n.
--selection;
ఎంత, eMta
-adj. interrog.
--how much?;
ఎందరు, eMdaru
-adj. interrog.
--how many people?;
ఎందాక, eMdAka
-adj. interrog.
--how far?;
Part 2: ఎ - e
ఎకరారు, ekarAru
-n.
--acknowledgment; agreement; confession;
ఎకసక్కెములాడు, ekasakkemulADu
-v. t.
--make fun; disparage sportively; do a prank; trick;
ఎక్కం, ekkaM
-n.
--multiplication table; times table;
ఎక్కడ, ekkaDa
-adj. interrog.
--where?;
ఎకాయెకీ, ekAyekI
-adv.
--non-stop; without interruption; right away; posthaste;
ఎక్కాలు, ekkaalu
- n. pl.
-- multiplication tables; times tables'
ఎక్కిళ్లు, ekkiLlu
-n. pl.
--hiccups; a sudden repeated stopping of the breath probably caused by some non-specific irritation of the diaphram;
ఎక్కు, ekku
-v. i.
--rise; climb up; mount;
ఎక్కుడు, ekkuDu
-n.
--uphill; ascent;
ఎక్కువ, ekkuva
-adj.
--(1) excess;
--(2) greatness;
ఎక్కుపెట్టు, ekkupeTTu
-v. t.
--draw a bowstring with the arrow in place; take aim;
ఎక్కించు, ekkiMcu
-v. t.
--(1) increase;
--(2) to assist in entering a vehicle;
--(3) insert an item like inserting a string in the eye of a needle; an item in a ledger, a drug into the vein of a patient, etc.;
---సూదిలోకి దారం ఎక్కించు = string the needle.
ఎగ, ega
-adj.
--upward;
---ఎగ, దిగ = up and down; from head to foot.
ఎగఊపిరి, egaUpiri
-n.
--gasping; panting; dyspnea;
ఎగజల్లు, egajallu
-v. t.
--spray; sprinkle;
ఎగతాళి,
-n.
--derision; ridicule;
ఎగపీల్చు, egapIlcu
-v. i.
--sniff; inhale;
ఎగబడు, egabaDu
-v. t.
--scramble; to go after eagerly; to run after;
ఎగబాకురు, egabAkuru
-v. i.
--climb up; creep up;
ఎగరవేయు, egaravEyu
-v. t.
--fly;
ఎగసన తోయు, egasana tOyu
-v. t.
--push up; lift up; stoke the fire;
ఎగుడు, eguDu
-n.
--uphill;
---ఎగుడు దిగుళ్లు = ups and downs.
ఎగుమతి, egumati
-n.
--export;
ఎగురు, eguru
-v. i.
--(1) fly;
--(2) jump up;
ఎగ్గొట్టు, egagoTTu
-v. i.
--(1) evade; dodge; (2) abscond;
ఎట్టకేలకు, eTTakElaku
-adv.
--eventually; at last;
ఎట్టఎదుట, eTTaeduTa
-adj.
--right in front;
ఎటు, eTu
-adv.
--in what manner?; in what direction?
ఎటువంటి, eTuvaMTi
-adv.
--what sort? of what nature?;
ఎట్టి, eTTi
-adj.
--of what kind?
ఎటూ, eTU
-adv.
--any how; in any case;
ఎటొచ్చీ, eToccI
-adv.
--in any case; nevertheless;
ఎడం, EdaM
-n.
--space; gap; interval;
---కొంచెం ఎడంగా కూర్చుంటే పోలా? = why not sit by leaving some space between us?
ఎడతెగని, eDategani
-adv.
--ceaseless; incessant; non-stop; without a gap;
ఎడతెరిపి, eDateripi
-n.
--break; pause; interval;
---ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది = it has been raining without a break.
ఎడపిల్ల, eDapilla
-n.
--earlier child; the child born earlier to the current one;
ఎడబాటు, eDabATu
-n.
--separation; separation of loved ones; the state of being separated;
ఎడమ, eDama
-adj.
--left;
---ఎడమ చేయి = left hand.
ఎడారి, eDAri
-n.
--desert; treeless wasteland;
ఎడారి గులాబి, eDAri gulAbi
-n.
--desert rose; [bot.] Adenium obesumof the Dogbane Family;
-- ఎడీనియం;
ఎడారి పిల్లి, eDAri pilli
-n.
--desert cat; [boil.] Felis libyca;
ఎడ్లు, eDlu
-n. pl.
--oxen;
ఎత్తరి, ettari
-n.
--tall person;
ఎత్తిపొడుపు, ettipoDupu
-n.
--taunt;
ఎత్తు, ettu
-n.
--(1) height;
--(2) weight;
--(3) a move in chess;
--(4) scheme;
--(5) lift; a device to raise objects;
-v. t.
--lift; raise;
ఎత్తుగడ, ettugaDa
-n.
--(1) trick; stratagem;
--(2) takeoff;
ఎత్తుబండి, ettubaMDi
-n.
--lift; elevator; a device to carry people and goods to top floors of a building;
ఎత్తుబడి, ettubaDi
-n.
--beginning; opening;
ఎదిరించు, ediriMcu
-v. t.
--oppose; resist; encounter;
ఎదిరి, ediri
-n.
--opponent; enemy; defendent;
ఎదుగు, edugu
-v. i.
--grow; increase in stature; encounter;
ఎదుగుదల, edugudala
-n.
--growth;
ఎదురాడు, edurADu
-v. t.
--say an opposing word; resist; talk back;
ఎదురు, eduru
-n.
--the front;
ఎదురుచూచు, edurucUcu
-v. i.
--look forward to; await; wait with anticipation;
ఎదురుపడు, edurupaDu
-v. i.
--come in the opposite direction; encounter; bump into;
ఎద్దు, eddu
-n. m.
--ox;
ఎద్దేవాచేయు, eddEvAcEyu
-v. t.
--mock; heckle; tease; ridicule; deride;
ఎనలేని, enalEni
-adj.
--matchless; peerless;
ఎన్నాళ్లు, ennALlu
-pron.
--how many days?;
ఎనిమిది, enimidi
-n.
--eight;
ఎన్ని, enni
-adj. interrog.
-- how many things?;
ఎన్నిక, ennika
-n.
--election;
ఎనుపు, enupu
-v. t.
--mash; beat and mix thoroughly; esp. beat cooked pulses into a paste;
ఎనుపోతు, enupOtu
-n.
--he-buffalo;
ఎనుము, enumu
-n.
--she-buffalo;
ఎన్నుకొను, ennukonu
-v. t.
--elect;
ఎన్నెమ్మ, ennemma
- n.
-- name of a demon believed to target and kill newly-delivered infants; To prevent this from happening, mothers always put a lighted wick (a lamp) in the infant's room as soon as dusk falls;
--ఎరిణమ్మ/ ఎనెమ్మ/ ఎన్నెమ అనే పేర్లతో వ్యవహరించే ఒక భూతం పురిటిలో పిల్లలను చంపుతుందని ఒక (మూఢ) విశ్వాసం కొన్ని చోట్ల ఉంది; ప్రజలు తమను సరిగా ఆరాధించని పక్షంలో వారి పురిటి బిడ్డలను చంపడానికి మాతృగణ దేవతలకు కుమారస్వామి అనుమతి ఇచ్చినట్టు భారత గాథ;
ఎప్పటికి, eppaTiki
-adv.
--by what time?;
ఎప్పుడు eppuDu
-adv.
--when?;
ఎప్పుడైనా, eppuDainA
- ?
-- (1) always, at any point in time; (2) always, at all points in time; (3) once in a while; (4) not now, perhaps at another time; (5) have you ever; (6) has it ever;
-- [Sans.] సర్వదా; సదా; కదాచిత్; కదాపి; సతతం; నిత్యదా; అనిశం; అనవరతం; నిరంతరం; సర్వక్షణే;
ఎప్పుడో eppuDO
-adv.
--at some time or other?;
ఎప్పటికప్పుడు, eppaTikappuDu
-adv.
--every so often; soon after; immediately;
ఎపోజీ, epOjI
-n.
--[math.] apogee; the farthest point from the focus of an ellipse;
ఎబ్రాసి, ebrAsi
-n.
--a slovenly person; loathsome person; disgusting person;
ఎముక, emuka
-n.
--bone; (rel.) బొమిక;
---కంటె ఎముక = collar bone.
---తుంటి ఎముక = hip bone.
---పుర్రె ఎముక = skull bone.
ఎర, era
-n.
--bait;
ఎరవు, eravu
-n.
--(1) borrowed item;
--(2) difference; disparity;
ఎర్ర, erra
-adj.
--red;
-n.
--bait; the usual bait used in fishing are earthworms which are indeed red;
ఎర్రకణం, errakaNaM
-n.
--red blood cell; erythrocyte;
ఎర్రకుసుమ, errakusuma
-n.
--menorrhagia; excessive red menstrual discharge;
ఎర్రగన్నేరు, erragannEru
-n.
--Indian oleander; [bot.] Nerium indicum;
ఎర్రగలిజేరు, erragalijEru
-n.
-- Horse-purslane; [bot.] Trianthema portulacastrum L. Aizoaceae
--తెల్లగలిజేరు = [bot.] Trianthema decandra L. Aizoaceae;
ఎర్రగువ్వ, erraguvva
-n.
--red turtle dove; [bio.] Streptopelia tranquebariea;
ఎర్ర చందనం, erra caMdanaM
- n.
-- red sandalwood; [bot.] Pterocarpus santalinus;
-- ఎనిమిది మీటర్ల (ఇరవయ్యారు అడుగులు) వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమలు ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. ఎర్ర చందనం పెరగటానికి మట్టిలో స్ఫటిక శిల (Quartz) ఉండాలి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా సరిపోవాలి.ఈ మొక్క అంతరించే ప్రమాదం ఉన్నదిగా ప్రకటించారు. తర్వాత 2018 లో “అపాయం అంచున ఉన్నవి” (nearly threatened) గా దీన్ని మార్చారు.
-- రక్త చందనం; శాంటాలం; ఎర్ర బంగారం;
ఎర్ర చిత్రమూలం, erra citramUlaM
- n.
-- [bot.] Plumbago rosea;
ఎర్రజువ్వి, errajuvvi
-n.
--[bot.] Ficus retusa; Ochna squarrosa Linn.;
-- ఎర్రజమ్మి;
ఎర్రమద్ది, erramaddi
-n.
--a large tall tree; [bot.] Terminalia arjuna;
-- తెల్లమద్ది;
ఎర్రగోరింట, erragOriMTa
-n.
--alizarin plant;
ఎర్రచందనం, erracaMdanaM
-n.
--red-wood tree; [bot.] Pterocarpus santalinus;
ఎర్రతోకమోసు, erratOkamOsu
-n.
--reba; a fish of the cyprinidae family; [bio.] Cirrhinus reba;
ఎర్రమీను, erramInu
-n.
--mrigal; a fish of the Cyprinidae family; [bio.] Cirrhinus mrigala;
-- ఎర్రమోసు;
ఎర్రముల్లంగి, erramullaMgi
-n.
--carrot;
ఎర్రలొద్దుగ, erralodduga
- n.
-- [bot.] Symplocos racemosa;
-- లోధ్ర;
ఎర్రసిరి, errasiri
-n.
--[bio.] Tamarix articulata;
ఎరికె, erike
-n.
--purview; range of knowledge;
ఎరికి చెట్టు, eriki ceTTu
- n.
--Sebesten plum; [bot.] Cordia dichotoma Forst. of Boraginaceae family;
ఎరుపు, erupu
-n.
--(1) red; crimson;
--(2) blood;
ఎరుపుమణి చెట్టు, erupumaNi cheTTu
- n.
-- barberry; Jaundice berry; [bot.] Barberis vulgaris; an erect shrub in the genus Berberis native to the Old World; The bark contains many alkaloids with medicinal properties;
ఎరువు, eruvu
-n.
--fertilizer;
ఎల, ela
-adj.
--young; tender ;
ఎలక, elaka
-n.
--rat;
--ఎలుక
ఎలదోట, eladOTa %e2t
-n.
--small park; pleasure garden;
ఎలనవ్వు, elanavvu
-n.
--smile;
ఎలనాగ, elanAga
-n.
--young woman; damsel; nymph; a mythological spirit of nature imagined as a beautiful maiden inhabiting rivers, woods, or other locations;
ఎలప్రాయం, elaprAyaM
-n.
--young age; youth;
ఎలమి, elami
-n.
--pleasure; joy;
ఎల్ల, ella
-n.
--border; object defining a border;
ఎల్లగిసె చెట్టు,
- n.
-- flax; [bot.] Linum usitatissimum of the Linaceae family;
-- a blue-flowered herbaceous plant that is cultivated for its seed (linseed) and for textile fiber made from its stalks;
ఎల్లరు, ellaru
-pron.
--all; all people;
ఎల్లప్పుడు, ellappuDu
-adj.
--all the time; at all times;
ఎలాగ, elAga
-adv.
--in what way; how;
ఎలాగో ఒకలాగ, elAgO okalAga
-adv.
--somehow;
ఎల్లింద, elliMda
-n.
-- Green Ebony Persimmon; [bot.] Diospyros chloroxylon of the Ebenaceae family;
-- a bushy shrub to a small tree; the wood is used for making plows and combs; Leaf paste applied to treat surface burns;
-- [Hindi] Kinnu;
ఎలుక, eluka
- n.
-- rat;
ఎలుక చంపు చెట్టు, eluka caMpu ceTTu
- n.
-- [bot.] Gliricidia sepium;
-- గ్రీకు భాషలో ‘glis’(గ్లిస్) అంటే ‘ఎలుక' అనీ, ‘cida’(సిడా) అంటే ‘killer’ (చంపేది) అనీ అర్థాలు; ‘సెపియం’ అంటే ‘కంచెమొక్క’ అని అర్థం. మొత్తం మీద దీని అర్థం "ఎలుకలని చంపే కంచె మొక్క" అని; వీటి కాయలలోని గింజలని బియ్యంతో కలిపి నూరిన పిండిని ఎలుక కన్నాలలో వేస్తే వాటిని తిని ఎలుకలు చచ్చిపోతాయి; కనుకనే దీనికి ‘ఎలుక చంపు చెట్టు’ అని పేరు వచ్చింది;
ఎలుకచెవి ఆకు, eluka cevi Aku
- n.
--Hairy wood rose; Tinnevelly Indian senna; [bot.] Cassia senna; Merremia aegyptia of Morning glory family
-- నేల పొన్న; నేల తంగేడు; స్వర్ణపత్రి; భూమిచారి;
ఎలుగు, elugu
-n.
--(1) bear;
--(2) voice;
ఎలుగుబంటి, elugubaMTi
-n.
--bear;
-- ఎలుఁగుబంటి అనేది విశేషణమే (adjective) తప్ప నామవాచకం (noun) కాదు; ఎలుఁగు = గొంతుక/ గొంతు; బంటి = "వరకు ఉన్నది" = గొంతు వరకు మోము కలిగినట్టిది; ఎలుఁగుబంటిని చూస్తే దానికి మెడే ఉన్నట్టు తోచదు. మెడా, మొండెమూ కలిసిపోయినట్లు ఉంటుంది;
ఎల్లుండి, elluMDi
-n.
--the day after tomorrow;
ఎవరికివారే, evarikivArE
-adv.
--each for himself/herself; Laissez Fair;
ఎవడు, evaDu
-pron.
--who? (derisively);
ఎవరు, evaru
-pron.
--who?;
ఎసరు, esaru
- n.
-- (1) boiling water meant for cooking rice or vegetables;
- v. i.
-- exceed;
ఎసరు పెట్టు, esaru peTTu
- v. t.
--deceive; betray; damage; slash and burn;
Part 3: ఏం - EM
ఏంపియరు, EMpiyaru
-n.
--[phy.] ampere; a unit of electrical current equal to a flow of one coulomb per second; named after French physicist Andre Marie Ampere (1775-1836);
---రెండు ఏంపియర్ల ఫ్యూజు వాడాలండీ = have to use a two-ampere fuse.
ఏండ్లు, EMDlu
-n. pl.
--years;
Part 4: ఏ - E
ఏ ఎండకాగొడుగు పట్టు, E eMDakAgoDugu paTTu
- ph.
-- say and do things suitanble to the occassion;
ఏకంచేయు, EkaMcEyu
-v. t.
--unite; combine;
ఏక, Eka
-adj.
--pref. mono; solo; uni; one; [ant.] అనేక;
ఏకకణజీవులు, EkakaNajIvulu
-n.
--[bio.] unicellular organisms;
ఏకకేంద్రక, EkakEMdraka
-adj.
--concentric;
---ఏకకేంద్రక వృత్తములు = concentric circles.
ఏకగ్రీవంగా, EkagrIvaMgA
-adv.
--unanimously; with one voice;
ఏకగ్రీవత, EkagrIvata
-n.
--unanimity;
ఏకఘాత, EkaghAta
-adj.
--linear;
ఏకచక్కెర, Ekacakkera
-n.
--[chem.] monosaccharide; any of the class of sugars (e.g., glucose) that cannot be hydrolyzed to give a simpler sugar;
ఏకజాతీయ, EkajAtIya
-adj.
--homogeneous;
ఏకటాకీగా, EkaTAkIgA
-adv.
--continuously;
ఏకతాళం, EkatALaM
-n.
-- harmony;
ఏకత్వం, EkatvaM
-n.
--(1) unity; oneness; (2) singularity;
ఏకదళ, EkadaLa
-adj.
--[bio.] unifoliolate; having only one leaf;
ఏకదళబీజ, EkadaLabIja
-adj.
--[bio.] monocot;
---ఏకదళబీజ వృక్షం = monocot plant; Monocotyledons are any plants that have flower parts in multiples of three, leaf veins that run parallel and adventitious roots. Common examples include tulips, onions, garlic and lilies;
ఏకదిశాత్మకం, EkadiSAtmakaM
-n.
--unidirectional; one-dimensional;
ఏకదీక్షగా, EkadIkshagA
-adv.
--singlemindedly;
ఏకధాటిగా, EkadhATigA
-adv.
--continually; non-stop; ceaselessly;
ఏకధారగా, EkadhAragA
-adv.
--in one continuous stream;
ఏకపది, Ekapadi
-n.
--footpath; path; narrow path;
ఏకబిగిన, Ekabigina
-adv.
--non-stop;
ఏకమాత్రకం, EkamAtrakaM
-adj.
--one-dimensional;
ఏకముఖ, Ekamukha
-adj.
--(1) homogeneous;
--(2) uni-directional;
---ఏకముఖ ప్రవాహం = direct current; unidirectional flow.
ఏకరువు, Ekaruvu
-n.
--recitation; reciting a list of items;
ఏకరూప, EkarUpa
-adj.
--uniform;
ఏకలింగ, EkaliMga
-adj.
--unisexual;
ఏకవచనం, EkavacanaM
-n.
--singular number;
ఏకశృంగం, EkaSRMgaM
-n.
--one-horned one; rhinoceros;
ఏకసంథ, EkasaMtha
-adj.
--one-time; once;
ఏకసంథాగ్రాహి, EkasaMthAgrAhi
-n.
-a person who can learn or memorize in one attempt;
ఏకసంయుక్తబీజ కవలలు,
- n. pl.
-- ఒకే సారి పుట్టిన కవలలలో రెండు రకాలుంటాయి. ఒక అండం, రెండుగా విడిపోయి, రెండు శుక్ర కణాలతో సంయోగం చెందితే, అలా ఏర్పడ్డ పిల్లలని, ఏక సంయుక్త బీజ కవలలు అంటారు. ఇక్కడ పుట్టిన పిల్లలు, ఒకే లింగం కలిగి, ఇరువురు, ఎక్కువ పోలికలతో కనిపిస్తారు. ఇలా కాకుండా ఒకే సమయంలో రెండు అండాలు, రెండు శుక్ర కణాలతో, సంయోగం చెందితే, అప్పుడు ఏర్పడ్డ సంతానాన్ని, ద్విసంయుక్తబీజ కవలలు అంటారు. ఇక్కడ వేర్వేరు లింగాలు, తక్కువ పోలికలు కనిపిస్తాయి;
ఏకస్వం, EkasvaM %e2t
-n.
--patent;
ఏకసాయం, EkasAyaM
-n.
--monoculture; growing the same crop again and again;
ఏకహరితఏకేను, EkaharitaEkEnu
-n.
--[chem.] monochloromethane; CH3Cl;
ఏకాంకిక, EkAMkika
-n.
--one-act play;
ఏకాండీ, EkAMDI
-adj.
--unsplit; whole;
ఏకాంతం, EkaMtaM
-n.
--solitude; seclusion;
ఏకాంత, EkaMta
-adj.
--solitary; isolated;
ఏకాంతర, EkaMtara
-adj.
--alternate;
ఏకాంతర కోణం, EkaMtara kONaM
-n.
--[math.] alternate angle; Alternate angles are angles that are in opposite positions relative to a transversal intersecting two lines. If the alternate angles are between the two lines intersected by the transversal, they are called alternate interior angles;
ఏకాంతవాసి, EkAntavAsi
-n.
--recluse;
ఏకాకి, EkAki
-n.
--solitary person; a person in solitude;
ఏకాగ్రత, EkAgrata
-n.
--mental concentration; single-minded attention;
ఏకాదశ, EkAdaSa
-adj.
--eleventh;
ఏకాదశ వర్ష చక్రం, EkAdaSa varsha cakraM
-n.
--[astro.] eleven-year cycle; commonly the eleven-year cycle of solar activity;
ఏకాదశి, EkAdaSi
-n.
--the eleventh day of the bright or dark fortnight of the lunar calendar;
-- ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు;
ఏకాదేశం, EkAdESaM
-n.
--[gram.] one syllable replacing two individual syllables at the union of two words;
ఏకాధిపత్యం, EkAdhipatyaM
-n.
--totalitarianism;
ఏకీభవించు, EkIbhaviMcu
-v. i.
--agree; concur;
ఏకీభావం, EkIbhAvaM
-n.
--agreement; concurrence; concord;
ఏకు, Eku
-n.
--(1) ginned cotton prepared for spindle; an elongated fluffed cotton ball used in manually spinning yarn;
--(2) lambast; criticize severely;
-v. t.
--(1) gin; ginning of cotton;
--(2) severely criticize;
ఏకేను, EkEnu
-n.
--methane; a hydrocarbon with one carbon atom; CH4;
ఏకేశ్వరవాదం, EkESvaravAdaM
-n.
--monotheism;
ఏకైక, Ekaika
-adj.
--one at a time; one by one;
-- (note) it is not "only or unique;"
ఏకోదరులు, EkOdarulu
-n. pl.
--uterine siblings; (lit.) born from the same uterus;
ఏగానీ, EgAnI
-n.
--a coin of the British era with a value of 2 pies; 2 దమ్మిడీలు = 1 ఏగానీ;
ఏగిస, Egisa
-n.
--a large deciduous tree; [bot.] Pterocarpus marsupium;
-- the bark is used as an astringent and for toothache, the flowers to reduce fever and bruised leaves for external application on boils and skin sores;
--ఏగి; ఎర్ర ఏగిస;
ఏగు, Egu
-v. i.
--go; depart;
ఏగుదెంచు, EgudeMcu
-v. i.
--come; arrive;
ఏటవాలు, EtavAlu
-adj.
--inclined; sloping; slanting;
ఏటా, ETA
-adv.
--every year; annually;
ఏటిపాల, ETipAla,
- n.
-- [bot.] Salix tertraperna;
ఏటేటా, ETETA
-adv.
--every year; annually;
ఏడాకుల పాల, EDAkula pAla
-n.
--Devil's tree; the Saptaparni tree; the seven-leaf tree; [bot.] Alstonia scholaris; Alstonia venenata;
--This is a glabrous tree and grows up to 40 m (130 ft) tall; According to a TV report on 18 July 2020, these trees in Visakhapatnam have been emitting a foul-smelling odor and people are worried about the negative consequences of this plant;
-- ఆల్ స్టన్ అనే శాస్త్రవేత్త పేరిట దీనిని అలా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ వృక్షాల కలపను బడిపిల్లలు రాసుకునే పలకలు తయారు చేయటానికి వాడేవారట. అందుకే దీని శాస్త్రీయ నామంలో స్కాలరిస్ (scholaris) అనే శబ్దం వచ్చి చేరింది;
-- ఏడాకుల పొన్న; [Sans.] సప్తపర్ణీ;
ఏడాకుల మందులమర్రి, EDAkula maMdulamarri
-n.
-- a climbing shrub; [bot.] Cayratia pedata;
ఏడాకుల మర్రి, EDAkula marri
-n.
--a large shrub with attractive yellow flowers; [bot.] Schefflera stellata;
ఏడాది, EDAdi
-n.
--a year;
ఏడి, EDi
-pron.
--where is he?
ఏడు, EDu
-n.
--(1) seven; (2) year;
ఏడుగురు, EDuguru
-pron. pl.
--seven people;
ఏడ్చు, EDcu
-v. i.
--cry; weep;
ఏతం, EtaM
-n.
--a water lift; a counterpoise waterlift; a see-saw like manual devise used to pull out water from village wells, used especially to pull water for irrigation purposes in south Indian villages; a fascinating sight to see as laborers walk back and forth on a narrow high beamacross a fulcrum as a bucket goes up and down to pull the water up;
-- ఏతాము; see also మోటబావి; దిగుడు బావి;
ఏతావాతా, EtAvAtA
-adv.
-- thus; finally; in conclusion; so far; thus far; so much; so many; in such a degree; meanwhile;
ఏదయినా, EdayinA
-adv.
--any; any item; anything;
ఏది, Edi
-pron.
-- which? which one?
ఏదుపంది, EdupaMdi
-n.
--porcupine;
ఏదుపంది కొయ్య, EdupaMdi koyya
-n.
--quill of a porcupine;
ఏదుము, Edumu
-n.
--a volumetric measure, equal to 5 తూములు; used to measure grain; (ety.) ఏను + తూము;
ఏనాది, EnAdi
- n.
-- a hill tribe; a tribe of forest dwellers; savage;
-- అనాది; యానాది; గిరిజన తెగ నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వీరు పుట్టలు పొడిచి పాములనుచంపి, ఉసిళ్ళు లేక ఇసుళ్ళను, ఎలుకలు, పందికొక్కులవంటి rodents ని తింటారు; యానాదులు అనాదిగా పాములను చంపుతూ, వాటిని తింటూ నాగజాతి వారుగా, ఖాళీ పుట్టలలో నివసిస్తూ Mound Dwellers గానూ పేరొందారు;
ఏనుగు, Enugu
-n.
--(1) elephant;
--(2) rook in chess;
--(3) a measure of 64 tamarind seeds in a childrens game;
ఏనుగు చెట్టు, Enugu ceTTu
-n.
--sausage tree; [bot.] Kigelia pinnata; హస్తి మేఢ్రపు చెట్టు; ఈ చెట్టు కాయలు ఏనుగు పురుషావయవాన్ని పోలి ఉండే కారణంగా దీనికాపేరు వచ్చింది;
ఏనుగు పల్లేరు, Enugu pallEru
- n.
-- [bot.] Pedalium murex Linn.;
ఏపి చెట్టు, Epi ceTTu
-n.
--sal tree; [bot.] Hardwickia binata;
ఏపిలు, Epilu
-n.
--apple; [bot.] Malus sylvestris; Pyrus malus;
ఏపు, Epu
-adj.
--fine; sturdy; well-grown;
ఏపుకోతి, EpukOti
-n.
--ape;
ఏభై, Ebhai
-n.
--fifty;
ఏమరుపాటు, EmarupATu
-n.
--inattention; off-guarded condition;
-- పరధ్యానం;
ఏర్పడు, ErpaDu
-v. i.
--form; take shape;
ఏర్పాటు, ErpATu
-n.
--arrangement; formation;
ఏరు, Eru
-n.
--(1) rivulet; stream; a stream that is longer than 8 miles is called a river;
-- ఆమడ/నాలుగు కోసులు (8 మైళ్ళు) కన్న ఎక్కువ దూరం ప్రవహించే ఏటిని నది అంటారని నిఘంటువులో వివరణ.
-- ఏరు, సెలయేరు అనేవి ఎత్తైన ప్రదేశంనుండి పల్లపుప్రదేశంలోకి ప్రవహించే నిరంతర నీటిప్రవాహం. ఏరుకూ సెలయేరుకూ గల తేడా ఏమిటంటే సెలయేరు అనేది కొండలమీదనుండి, గుట్టలమీదుగా జలజలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి ఏ నదిలోనో ఉపనదిలోనో కలసిపోయేది. మిగిలిన వాటికి దీనికి ఉన్న ప్రత్యేక భేదం ఏమిటంటే సెలయేరు చేసే ఆహ్లాదకరమైన 'గలగల' శబ్దం.
-- (rel.) వాగు; వంక;
--(2) a ready-to-go plow and oxen;
-v. t.
-- pick; gather;
ఏరుగు, Erugu
-v. t.
--defecate; excrete;
ఏరువాక, EruvAka
-n.
--a village ceremony preceding the plowing and sowing of seed;
-- ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నాగలి. ఏరువాక అంటే దున్నడానికి మొదలయే సమయం; ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. ఆషాడ మాసం పక్షం రోజులు ముందే జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం; అపుడే దుక్కి దున్నడం మొదలు పెడతారు;
ఏలం, ElaM
-n.
--auction;
ఎలా, Ela
-adv.
--why?
ఏలకి, Elaki
-n.
-- (1) మలబార్ ఏలకి = lesser cardamom; [bot.] Elettaria cardamomum; ఆకుపచ్చ ఏలకి;
-- (2) పెద్ద ఏలకి = [bot.] Amomium aromaticum; బెంగాల్ ఏలకి;
-- (3) ముర్రుంగ్ ఏలకి = [bot.] Amomium subulatum; నల్ల ఏలకి;
-- పచ్చవి పచ్చిగా ఉన్నప్పుడే సేకరించి ఎండబెడతారు. నల్లవి పండేదాక ఆగి మంటమీద వేడి చేస్తారు. నల్లవి తీపి వంటకాల్లో ఎక్కువ వేస్తారు. దాన్లో ఉన్న పొగ రుచి, మెంతాల్ ఫ్లేవర్ అందుకు సరిపోతుందిట. పచ్చవి పైన తోలు వలిచి గింజలు నలగగొట్టి వాడుకుంటే, నల్లవి మొత్తం కాయ అంతా వాడుతారు.
--[Sans.] ఏలా; సూక్ష్మ ఏలా; స్థూల ఏలా; తృటీః; ద్రావిడీ; త్విషా;
ఏలికపాములు, Elikapaamulu
- n.
-- [bio.] Ascaris lumbricoides;
-- నులిపురుగులు are different;
ఏలినాటి శని, ElinaaTi Sani
- n.
-- [astrol.] జన్మ రాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అంటారు.
శని జన్మరాశిలో (అంటే శని ఒకటో స్థానంలో) సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి; శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.
ఏలు, Elu
-v. t.
--rule; reign; protect; administer;
- suff. indicates animal; తోడేలు; పొట్టేలు; తాబేలు; కుందేలు;
ఏలుబడి, ElubaDi
-n.
--reign; administration;
ఏవగింపు, EvagiMpu
-n.
--dislike; distaste;
ఏసి, Esi
-distributive suff.
--attached to a numeral;each; at a time; at the rate of;
---నాలుగేసి = four at a time.
---ఇద్దరేసి = in groups of two.
ఏస్పిరిన్, Espirin
-n.
--aspirin; acetylsalicylic acid; a medicine used to relieve pain and inflammation;
ఏహ్యభావం, ఏహ్యత, EhyabhAvaM, Ehyata
-n.
--hatred;
Part 5: ఐ - ai
ఐక్యం, aikyaM
- n.
-- unity, union;
--- ఐక్యత సరి అయిన ప్రయోగం కాదు;
ఐచ్ఛిక, aicchika
-adj.
--optional;
ఐదవ, aidava
-adj.
--the fifth; the ordinal number 5;
ఐదువ, aiduva
-n.
--a woman whose husband is alive; (ety.) అ + విధవ = one who is not a widow;
ఐమూలగా, aimUlagA
-adv.
--obliquely; diagonally;
ఐశ్వర్యం, aiSvaryaM
-n.
--riches; wealth; prosperity;
|
|