This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
American spelling is used throughout.
There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
16 March 2016.
ఈ నిఘంటువు, ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ వారు 2002 లో ప్రచురించిన ముద్రిత ప్రతి కంటే మెరుగైనది (విస్తరించాం, లోపాలను సవరించాం, కొత్త అంశాలను చేరుస్తూ ఉన్నాం)
మీరూ దీన్ని విస్తరించవచ్చు. కానీ తొలగింపులేమీ చెయ్యకండి - లోపం దొర్లిందని మీకు కచ్చితంగా, నిర్ద్వంద్వంగా, నిరాక్షేపణీయంగా తెలిస్తే తప్ప.
ఇక్కడ ఇచ్చిన పదాలు, వాటి అర్థాలూ వ్యక్తిగతంగా మీకు అంగీకారం కాదు కాబట్టి వాటిని తొలగించకండి.
ఇంగ్లీషు భాష యొక్క అమెరికను స్పెల్లింగును వాడాం.
ఇక్కడి తెలుగు పదాల అమరిక గురించిన వివరణ సుదీర్ఘమైనది కాబట్టి ఇక్కడ చర్చించలేం.
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Part 1: పం - pratima
పంకం, paMkaM
-n.
--mire; mud;
పంకజం, paMkajaM
-n.
--lotus;
పంకా, paMkA
-n.
--fan; air circulator; any device that circulates air;
పంకించు, paMkiMcu
-n.
--nod;
పంకిలం, paMkilaM
-n.
--mire; muddy place;
పంక్తి, paMkti
-n.
--row; line;
పంగ, paMga
-n.
-- (1) fork; (2) branching structure of a tree;
పంగువు, paMguvu
-n.
--lame person;
పంచ, paMca
-adj.
--five;
---పంచ తన్మాత్రలు = the five senses, namely the sense of taste, touch, smell, hearing, and sight.
పంచ, paMca
-n.
--awning; front part of a house's hanging roof;
పంచకం, paMcakaM
- n.
-- a set of five; five;
పంచకల్యాణి, paMchakalyANi
- n.
-- a superior breed of a horse with five desirable traits: (1) white feet, (2) a white spot on the upper forehead, (3) a bushy white tail, (4) white hair on the neck (జూలు), and (5) white back;
-- పంచేంద్రియ జ్ఞానం అపారంగా కల ఉత్తమాశ్వం;
పంచకోల కషాయం, paMcakOlఅ kashAyaM
- n.
-- the decoction made from పంచకోలాలు, the "five peppers";
పంచకోలాలు, paMcakOlAlu
- n. pl.
-- the five pungents; (lit) the five peppers; పిప్పలి, పిప్పలి మూలం; పిప్పలి తీగ; శొంఠి, చిత్రక (ఎర్ర చిత్రమూలం);
పంచదళ, paMcadaLa
-adj.
--pentafoliolate; also పంచదళ హస్తాకార;
పంచనామా, paMcanAmA
-n.
--arbitration in a dispute;
పంచపాత్ర, paMcapAtra
-n.
--(1) a tumbler - a short wide-mouthed metal cup, normally made of copper, silver or gold - used in Hindu religious rituals, shortened form for పంచామృత పాత్ర; each cup is meant for one of the "five sacred nectars", namely ఆవుపాలు, పెరుగు, నేయి, చక్కెర, తేనె;
--(2) five vessels or cups (for the distinct purposes of offering water to a diety: అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానీయము and పానీయము);
పంచప్రాణాలు, paMcaprANAlu
-n.
--according to Hindu belief, there are five life forces: prANa, apAna, vyAna, udAna, and samAna; the union of these five is the subtle body or సూక్ష్మదేహం;
పంచభుజి, paMcabhuji
-n.
--pentagon; a geometrical figures with five sides; literally, pentagon means " five angles";
పంచమి, paMcami
-n.
--fifth day of lunar half-month;
పంచాంగం, paMcAMgaM
-n.
--ephemeres;
పంచాయతి, paMcAyati
-n.
--village council comprised of five people; a village 'tribunal';
---శవపంచాయతి = postmortem.
పంచారించు, paMcAriMcu
-v. i.
--spread;
పంచితం, paMcitaM
-n.
--urine; cow's urine;
పంచు, paMcu
-v. t.
--distribute;
పంచె, paMce
-n.
--a cloth worn by men to cover the lower part of the body; the counterpart of the sari worn by women; also పంచ; దోవతి; దోతీ;
పంజరం, paMjaraM
-n.
-- (1) cage; especially a cage used to keep birds; (rel.) బోను;
-- (2) seer fish;
పంజా, paMjA
-n.
--paw; especially of wild cats;
పంజాగోళ్లు, paMjAgOLLu
-n.
--claws; especially of wild cats;
పంట, paMTa
-n.
--crop;
పంట్లాం, paMTlaM
-n.
--pants; pantaloon; a lower garment of men;
పంటించు, paMTiMcu
-v. i.
--delay;
పంటిగ, paMTiga
-n.
--[bot.] Briedelia montuna;
పండబారు, paMDabAru
-v. i.
--ripen;
పండా, కాయా? paMDa, kAyA?
-[idiom.]
--was it a success or a failure; good news or bad? (lit.) is it a ripe fruit or green fruit?
పండితమ్మన్యుడు, paMDitammanyuDu
-n. m.
--[idiom] charlatan; bogus scholar;
పండితపుత్రుడు, paMDitaputruDu
-n. m.
--[idiom] idiot; (lit.) son of a scholar;
పండితుడు, paMDituDu
-n. m.
--scholar; (ant.) పామరుడు;
పండు, paMDu
-v. i.
--to ripen;
పండు, paMDu
-n.
--ripe fruit; (rel.) కాయ is unripe fruit;
పందికొక్కు, paM-di-ko-kku
-n.
--(1) any of several very large rats (genera Bandicota and Nesokia) of southern Asia destructive to crops;
--(2) any of a family (Peramelidae) of small insectivorous and herbivorous marsupial mammals of Australia, Tasmania, and New Guinea
పందిరి, paMdiri
-n.
--a temporary outdoor patio usually built out of thatch or palm leaves;
పందెం, paMdeM
-n.
--(1) bet; wager;
--(2) contest; race;
---పందెం గెలిచాడు = he won the bet.
---పరుగు పందెం = running race; dash.
పంపరనారింజ, paMparanAriMja
-n.
-- grapefruit; a hybrid between orange and pomelo; got this name because it grows in clusters like grapes;
పంపరపనస, paMparapanasa
-n.
-- pomelo; pompelmos; pumello; Shaddock fruit; [bot.] Citrus maxima; of the Rutaceae family; Citrus grandis; Citrus decumana; (ety.) from Dutch pompelmoes;
-- [note] grapefruit is a hybrid of pomelo and sweet orange;
పంపిణీ, paMpiNI
-n.
--distribution;
పంపు, paMpu
-n.
--(1) pump;
--(2) a native weight measure equal to 1/8th of a వీశ; used until the metric system was introduced; 8 పంపులు = 4 ఏబులములు = 2 పదలములు =1 వీశ; also అర్ధశేరు నవటాకు;
-v. t.
--send; transmit;
పంపుకొట్టు, paMpukoTTu
-v. t.
--pump;
Part 2: ప - pa
పకపక, pakapaka
-adj.
--onomatopoeia for laughter;
పక్క, pakka
-n.
--(1) side;
--(2) bed;
--(3) direction;
---ఎటు పక్క? = which side? which direction?
పక్కపక్కన, pakkapakkana
-n.
--adj. side by side; abreast;
పక్కపుండు, pakkapuMDu
-n.
--bed sore; sores caused by staying in bed too long without movement;
పక్కగొలుసు, pakkagolusu
-n.
--[chem.] side chain;
పక్షం, pakshaM
-n.
--(1) side; part;
--(2) party in a dispute;
--(3) fifteen days;
--(4) wing; a political party;
---అధిక సంఖ్యాక పక్షం = majority party.
---మీరెవరి పక్షం? = on whose side are you?
---శుక్ల పక్షం = waxing half of a month.
---కృష్ణ పక్షం = waning half of a month.
---ఇరు పక్షాలు = both sides.
పక్కారంగు, pakkAraMgu
-n.
--fast color; a color that does not fade away; permanent color;
పక్కు, pakku
-n.
--[med.] scab; the hardened cover of a wound; hardened part of any bodily fluid that was once soft or liquidy;
పగ, paga
-n.
--grudge; desire to take revenge; (ant.) ప్రేమ;
పగటాట, pagaTAta
-n.
--day-time show; matinee;
పగటివేషం, pagaTivEshaM
-n.
--theatrical makeup;. an act involving people wearing excessive makeup and clowning around during intermissions of street-corner plays in villages;
పగటివేషగాళ్లు, pagaTivEshagALlu
-n.
--roving street-actors with heavy theatrical makeup; these actors give performances on the streets in return for donations at the end of a show;
పగడం, pagaDaM
-n.
--coral; coral head; one of the gems;
పగలు, pagalu
-n.
--daytime; lighted part of a day; (ant.) రాత్రి; రేయి;
పగ్గం, paggaM
-n.
--(1) tether;
--(2) rein; halter; the rope used to control a horse or an ox; ఎద్దుల ముగుదాళ్లకుగాని, కొమ్మల మొదళ్లకుగాని కట్టి బండితోలే మనిషి పట్టుకొనే తాడు; ఇది బండిని మలుపుకోటానికి, కావలసినప్పుడు ఆపటానికి అవసరం;
--(3) rope used by a weaver;
--(4) churning rope;
పగిది, pagidi
-n.
--mode; manner;
పగులగొట్టు, pagulagoTTu
-v. t.
--break;
పగులు, pagulu
-n.
--crack; split; a break in an otherwise smooth surface;
పగులు, pagulu
-v. i.
--crack; break;
పచ్చ, pacca
-n.
--(1) emerald; aquamarine; jade; one of the gems;
--(2) green;
--(3) raw;
పచ్చ మల్లి, pacca malli
-n.
--yellow jasmine; [bot.] Gelsemium sempervirens;
పటపట, paTapaTa
-adj.
--onomatopoeia for grinding teeth;
పటలం, paTalaM
-n.
--(1) roof; cover;
--(2) a film over the eye;
పట్టం, paTTaM
-n.
--a gold band tied around the head as a mark of coronation;
పట్ట, paTTa
-n.
--the bark of a tree;
పట్టకం, paTTakaM
-n.
--prism;
పట్టణం, paTTanaM
-n.
--city; a big town; a metropolitan area;
--- అగడ్తలు చుట్టూ ఉండే నగరం అనే నిర్వచనం ఒకటి ఉంది; ముఖ్య నగరం పట్ట్ణణం అని మరొక నిర్వచనం ఉంది;
పటాటోపం, paTATopaM
- n.
-- పటము + ఆటోపము; ఆటోపం అంటే హడావిడి, సంభ్రమము , గర్వం , ఆడంబరము అని నిఘంటువు చూపిన అర్థాలు.
-- మనిషిలో పస ఏమీ లేకపోయినా పైకి డాబుసరిగా పెద్ద హోదాలో ఉన్నట్టు నటించడం పటాటోపం;
పటాపంచలగు, paTaapaMchalagu
-v. i.
--disperse; scatter; flay apart;
పటారం, paTAraM
-n.
--a mansion with silk drapes;
---పైన పటారం, లోన లొటారం = glitter on the outside, nothing inside.
పటాలం, paTAlaM
-n.
--brigade; battalion; a regiment of soldiers;
పటాసు, paTAsu
-n.
--potassium; the chemical element whose symbol is K;
పట్టా, paTTA
-n.
--(1) rail;
--(2) diploma;
--(3) inner bark;
--(4) a deed or title document;
పటిక, paTika
-n.
--alum; a name given to a group of hydrated double salts. The most common among these, called common alum, is potassium aluminum sulfate. Because of its astringent property, i.e. it helps shrink broken skin, it is frequently used in aftershave lotions, tanning, and in many cosmetics.
పటికబెల్లం, paTikabellaM
-n.
--sugar candy; rock candy; large crystals of sugar made by evaporating concentrated sugar solution; same as పటిక పంచదార;
పటిష్ఠం, paTishThaM
- n.
-- robust;
పటిష్ఠపరచు, paTishThaparacu
-v. t.
--strengthen;
పట్టి, paTTi
-n.
--child; infant;
-past. part. of పట్టు;
--post position. on account of; because of;
పట్టిక, paTTika
-n.
--table; tabulation; an arrangement of information in an orderly fashion;
పట్టీ, paTTI
-n.
--(1) a catalog or list;
--(2) a plaster or medicated bandage as in పలాపట్టీ;
--(3) a silver chain, worn around the anklet as jewelry;
పటుత్వం, paTutvaM
-n.
--grip; strength;
పట్టు, paTTu
-n.
--(1) silk;
--(2) hive;
--(3) cobweb;
--(4) trick in a cord game;
--(5) hold;
---పట్టు చీర = silk sari.
---తేనెపట్టు = beehive.
---సాలెపట్టు = cobweb.
-v. t.
--(1) the act of feeding a child a liquid such as milk;
--(2) to knead; to rub;
---పిల్లకి పాలు పట్టు = feed milk to the child.
---నా కాళ్లు పట్టు = rub my legs; knead my legs.
పట్టుకొను, paTTukonu
-v. t.
--(1) catch;
--(2) apprehend (a lawbreaker);
--(3) to hold an object;
---బాలుడు బంతిని పట్టుకున్నాడు = the boy caught the ball.
---పోలీసు దొంగని పట్టుకున్నాడు = the police apprehended the thief.
---బాలుడు సంచీ పట్టుకున్నాడు = the boy held the bag.
పట్టుకొమ్మ, paTTukomma
-n.
--(1) crux;
--(2) refuge; primary support;
-- తీగె ప్రాకడానికి ఆధారమైన చెట్టు కొమ్మను పట్టుగొమ్మ అంటారు. అదే విధంగా ఒక కార్యానికి ముఖ్యంగా సహకరించే వ్యక్తిని పట్టు గొమ్మ అనవచ్చు .
--- అదే అతని వాదానికి పట్టుకొమ్మ = that is the crux of his argument.
పట్టుకొమ్ము, paTTukommu
-n.
--claw; specifically; the claw end of a hammer;
పట్టుపట్టు, paTTu paTTu
-v. t.
--insist; press on;
పట్టుపరిశ్రమ, paTTupariSrama
-n.
--sericulture;
పట్టుపురుగు, paTTupurugu
-n.
--silkworm;
పట్టుబట్ట, paTTubaTTa
-n.
--silk cloth;
పట్టుబట్టు, paTTubaTTu
-v. t.
--insist; press;
పట్టుమని, paTTumani
-adv.
--barely;
పట్లకర్ర, paTlakarra
-n.
--a long broomstick used to clear cobwebs;
పట్టెడ, paTTeDa
-n.
--(1) strap; tape; strip; bandage; a coarse and wide tape; braided band, usually made of cotton, and used to weave across the jambs of a cot to get a springy effect; used in lieu of box springs in Indian beds;
--(2) a strap-shaped necklace;
--(3) [bot.] Spathodea campanulata;
పడికట్టు రాయి, paDikaTTu rAyi
-n.
--weight used in scales;
పడిగె, paDige
-n.
--banner; % into e2t
పడిశం, paDiSaM
-n.
--cold; head cold; catarrh;
పడు, paDu
-v. i.
--(1) fall;
--(2) suffer; endure; sustain;
--(3) suit;
---నాకు నీళ్లు పడలేదు = the water did not suit me.
-suff. can be used to convert a noun to a verb;
--do;
-- అంకిలిబడు = అంకిలి + పడు = అడ్డుపడు = to block;
---అలవాటుపడు = fall in the habit of.
---ఇబ్బందిపడు = fall in difficulties.
-- చొప్పడు = చొప్పు+పడు = సరిపడు, అమరిఉండు = to suit;
---బాగుపడు = improve.
---బాధపడు = suffer.
---కనపడు = become visible;
పడుకొను, paDukOnu
-v. i.
--lie down!; recline!; go to sleep!
పడుకో, paDukO
-inter.
--(1) lie down! recline;
--(2) go to sleep!
పడిగాపు, paDigApu
-n.
--an expectant and long wait;
పడుగు, paDugu
-n.
--(1) woof; the longitudinal stretch of fabric in weaving; see also పేక;
--(2) heap of unthreshed grain;
పడుచు, paDucu
-adj.
--young; youthful;
-n.
--(1) a youthful girl; a youthful lady;
--(2) prostitute;
పడుచుతనం, paDucutanaM
-n.
--youth;
పడుపువృత్తి, paDupu vRtti
-n.
--prostitution;
పణం, paNaM
-n.
--ante; bet; the up-front money placed on the table before gambling;
పతంగ, pataMga
-n.
--[bot.] Caesalpinia sappan;
పతకం, patakaM
-n.
-- (1) medal; trophy; plaque; (2) an ornament like the locket;
---సువర్ణ పతకం = gold medal.
---రజిత పతకం = silver medal.
---కాంస్య పతకం = bronze medal.
పతనం, patanaM
-n.
--(1) fall; fall from glory; decline;
--(2) incident;
---నైతిక పతనం = moral decline.
---పతన కోణం = angle of incidence.
పద్మరాగం, padmarAgaM
-n.
--ruby; one of the nine gems or semi-precious stones;
-- see కెంపు; మాణిక్యం;
పద్యం, padyaM
-n.
--verse; stanza; poem;
పదాంశం, padaaMSaM
- n.
-- Syllable; a combination of elementary sounds containing only one vowel sound;
-- ఒక అచ్చుగల (పలుకదగిన) అక్షరసముదాయము, గుణితాక్షరము;
పదార్థం, padArthaM
-n.
--(1) substance; matter;
--(2) thing; item; article;
--(3) meaning of a word;
పదార్థకోశం, padArthakOSaM
-n.
--glossary;
పదావళి, padAvaLi
-n.
--vocabulary;
పది, padi
-n.
--ten;
పదిలం, padilaM
-n.
--care; caution; security;;
పదివేలు, padivElu
-n.
--ten thousand; myriad;
పదిహేడు, padihEDu
-n.
--seventeen;
పదును, padunu
-n.
--(1) sharpness;
--(2) testing cooked rice by pressing the grains between fingers;
--(3) moisture; dampness;
పదును పట్టు, padunu paTTu
-v. t.
--(1) to sharpen;
--(2) to hone;
పద్దు, paddu
-n.
--entry in an account book; entry in a log book;
పద్దెనిమిది, paddenimidi
-n.
--eighteen;
పదేపదే, padEpadE
-adv.
--again and again; repeatedly;
పనస, panasa
-n.
--(1) verse in a chapter of the Vedas;
--(2) Jackfruit; [bot.] Artocarpus scortechinii; Artocarpus integrifolia; Artocarpus heterophyllus of the Moraceae family; In Greek "arto" means bread and "carpos" means fruit; The breadfruit tree was named thus because the insides of roasted breadfruits resembled baked bread; The English name "Jack fruit" came from "cakkA", the Malayalam name for this fruit;
--- అడవి పనస = wild Jack fruit; [bot.] Artocarpus hirsutus;
--- సీమ పనస = breadfruit;
--- క్షుద్ర పనస = breadfruit;
పన్నా, pannA
-n.
--(1) the frame used in weaving;
--(2) the width of a cloth;
పనిమనిషి, panimanishi
-n. f.
--worker; domestic maidservant; maid;
పనిలోపనిగా, panilOpanigA
-adv.
--in the course of one's work;
పనిముట్లు, panimuTlu
-n.
--tools;
పనివాడు, panivADu
-n. m.
--worker; servant;
పనివాళ్లు, panivALlu
-n. pl.
--workers; crew;
పనులు, panulu
-n.
--errands; chores; tasks;
పన్ని, panni
-n.
--comb;
పన్నీరు, panniru
-n.
--scented water; traditionally made by boiling flower petals in water and let it settle overnight in a cool place. The frozen oils are churned out and a butter-like concentrate, called "attar" is extracted. About 200,000 roses yield 10 grams of attar; Eau de Cologne; also ఉడుకులోను;
పన్ను, pannu
-n. s.
--(1) tooth;
--(2) tax; see also పన్నులు; పళ్లు; పండ్లు;
పర, para
-adj.
--pref.
--(1) the other; alien; foreign; (ety.) from Latin, para;
--(2) [gram.] later; new; (ant.) పూర్వ;
పరక, paraka
-n.
--(1) blade of grass;
--(2) trifle;
--(3) the fraction one-eighth;
--(4) one-eighth of a hundred when 112 represents "hundred";
పరకాయ ప్రవేశం, parakAya pravESaM
-n.
--(1) a method of making the soul leave its physical body and enter another body; the legend has it that Sankara, the great Indian thinker of the early 8th century practiced this;
--(2) metempsychosis;
పరకాయించి చూడు, parakAyiMci cUDu
-v. t.
--carefully examine; see with deliberate care;
పరస్పర సేవ, paraspara sEva
-n.
--(1) symbiosis;
--(2) a phrase to describe "you scratch my back and I will scratch yours" attitude;
పర్ర, parra
-n.
--barren land; infertile land; ఇసక, రాయి కలిసిన నేల; పంటకు అసలు పనికిరాని నేల;
--- ఇసక పర్ర = sandy wasteland.
--- ఉప్పు పర్ర = salty marsh.
పర్వం, parvaM
-n.
--(1) step;
--(2) knot; joint;
--(3) subdivision of a book;
పర్వతం, parvataM
-n.
--(1) mountain;
--(2) one followed by 26 zeros in the traditional Indian method of counting;
పర్వత శ్రేణి, parvata SrENi
-n.
--mountain range;
పర్యంతం, paryaMtaM
-suff.
--until; as far as; the entire range; up to;
---ఆసేతు హిమాచల పర్యంతం = from the Bridge to the Himalayas; the entire country of India; here the Bridge refers to the now-submerged land bridge between India and Sri Lanka.
---నఖ శిఖ పర్యంతం = from toenail to hair; the entire body.
---పృష్ఠోష్ఠ పర్యంతం = from the anus to the lips.
---పిపీలికాది బ్రహ్మ పర్యంతం = from the ant to the Almighty.
పర్యటన, paryaTana
- n.
-- tour;
-- (note) పర్యాటన is not correct;
పర్యటకులు, paryaTakulu
- n.
-- tourists;
-- (note) పర్యాటకులు is not correct;
పర్ర, parra
- n.
-- పోరంబోకు భూమి; బంజరు భూమి [రాయలసీమ మాండలికం]; పనికిరాని భూమి [కళింగ మాండలికం];
పర్వము, parvamu
- n.
--1. A knot, a joint in a cane or body; 2. An annual festival at a certain season of the year; పండుగ; 3. A name given to certain days in the lunar month, as the full and change of the moon, and the 8th and 14th of each half month; 4. A sub-division of a book.
పరా, parA
- pref.
-- back; opposite; extreme; going;
పరాన్నజీవి, parAnnajIvi
- n.
-- parasite; a life form that derives its sustenance from a host;
---అర్ధపరాన్నజీవి = hemiparasite = a plant that derives its sustenance from a host and manufactures part from photosynthesis;
---పూర్ణపరాన్నజీవి = holoparasite = a plant that derives all its sustenance from a host;
---కాండపు పరాన్నజీవి = stem parasite =
---మూలపు పరాన్నజీవి = root parasite =
పరాన్నభుక్కులు, parAnna-bhukkulu
-n.
--[biol.] parasites; saprophytes; same as పరాన్నజీవులు;
పరామర్శ, parAmarSa
- n.
-- (1) consolation; condolence; enquiring welfare; (2) remembrance; (3) reference; attention; care; examination; investigation; inquiry; logical deduction;
-- వివేచనము; చక్కగా విచారించుట; అవమర్శము; అవలోకనము; అవలోడనము; చర్చ; విచారణ; విమర్శనము; సమీక్ష;
-- తెలుగులో దుఃఖ సందర్భాల్లో వాడే అర్థం ప్రాచుర్యంలో వుంది; దుఃఖ సందర్భాలలో చేసే పరామర్శలో కూడ ఆ దుఃఖ కారణం ఏ విధంగా సంభవించినది? ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఏమి చేసారు, అది ఏ విధంగా ఫలించకుండా పోయింది, ఇంకా ఏమి చేసి ఉండవలసింది, అలాంటి పరిస్తితులలో ఇతరులు ఇంతకూ ముందు ఏమేమి చేసారు, వాటి ఫలితాలు ఏవిధంగా వున్నాయి - ఇలాంటివన్నీ చర్చకు వస్తుంటాయి.
పరామర్శ గ్రంథాలు parAmarSa graMthAlu
- n.
-- reference books;
పరామరిక, parAmarika
-n.
--care; attention;
పరార్థం, parArthaM
-n.
--one followed by 27 zeros in the traditional Indian method of counting;
పరార్ధ, parArdha
-adj.
--pref. later half;
పరావర్తనం, parAvartanaM
-n.
--reflection;
పరావర్తన కోణం, parAvartana kONaM
-n.
--angle of reflection;
పర్యావలోకనం, paryAvalOkanaM
-n.
--overview; review; % to e2t
పరి, pari
-adj. pref.
--around; completely; extreme; big;
--- పరిఘోషం = big sound; thunder;
---పరిశుద్ధం = completely clean.
---పరిచరుడు = body guard; a guard who surrounds you.
-- పరిచ్చేదం = section; chapter;
---పరితపించు = to grieve.
---పరిత్యాగం = abandonment.
---పరిపూర్ణం = complete.
---పరిభ్రమించు = to move around; revolve.
---పరిమితి = limit.
---పరిశీలన = thorough examination thorough inspection.
పరిక, parika
-n.
--fiction; a fictional story;
పరిక పళ్ళు, parika paLLu
- n.
-- [bot.] Ziziphus oenoplia of the Rhamnaceae family;
-- రేగు పళ్ళ కుటుంబంకి చెందిన మొక్క. గ్రామీణ ప్రాంతాల్లో తుప్పల్లో పెరుగుతుంది;
పరిపరి, paripari
-adj.
--various; diverse; sundry; many faceted;
పరిపాటి, paripATi
-n.
--usual; common occurrence;
పరిపాలక, paripAlaka
-adj.
--administrative;
పరిపాలన, paripAlana
- n.
-- good administration;
పరిపీడన, paripIDana
-n.
--oppression;
పరిపూరకం, paripUrakaM
- n.
-- complement; one that completes;
పరిపూర్ణ సంఖ్య, paripUrNa saMkhya
-n.
--perfect number; according to number theory, the number 6 is a perfect number because it can be expressed as the sum of its factors, namely 1, 2 and 3. Similarly, the number 28 is also a perfect number, because 28 = 1+2+4+7+14;
పరిభ్రమణం, paribhramaNaM
- n.
-- revolution; (note) "Rotation" refers to an object's spinning motion about its own axis. "Revolution" refers an object's orbital motion around another object. For example, Earth rotates on its own axis, producing a 24-hour day.
పరిభాష, paribhasha
-n.
--jargon; nomenclature; parlance; terminology; conventional terms and words of any special branch of knowledge;
పర్రు, parru
- suff.
-- a suffix to a village name if the village is slightly above the flood plains of a river or stream; (note) the suffixes పూడి, పర్రు, తుర్రు, కుర్రు as suffixes to village names imply their location on progressively elevated grounds from a nearby river;
పలకరాయి, palakarAyi
-n.
--slate; when referring to the type of flooring tile;
పలకసరులు, palakasarulu
-n.
-- a gold ornamental chain of yesteryear made out of small disk-shaped links;
పలచబార్చు, palacabArcu
- v. t.
-- dilute; make less thick;
పలవ, palava
- n.
-- forked branch of a tree;
పలవరించు, palavariMcu
- v. t.
-- to talk in one's sleep;
పలహారం, palahAraM
- n.
-- snack; tiffin;
-- యజ్ఞాలలో ఆర్యులు జంతుబలి ఇచ్చిన తరువాత బలి పశువు మాంస ఖండాలను మంటలపై కాల్చి తినే పలలములు "కబాబ్" ల వంటివే; పలలాహారం నుంచే పలహారం అనే శబ్దం ఏర్పడింది.
పల్లకి, pallaki
-n.
--a ceremonial decorated carriage carried on a pole by two people on each end;
పల్లవం, pallavaM
-n.
--sprout; shoot;
పల్లవి, pallavi
-n.
--refrain; first line of a song; the line of a song that is often repeated; a part of a Carnatic music recital; this portion is like an Aalapana with a rhythm;
పలాయన వేగం, palAyana vEgaM
-n.
--escape velocity, the velocity an object has to attain in order to escape from the gravitational field where it is located;
పల్లి, పల్లె, palli, palle
- suff.
-- a suffix to a village name;
పల్టీ, palTI
-n.
--(1) somersault; (2) [comp.] flip-flop; a binary switching element; a device to store a binary digit;
పల్టీపేరు, palTIpEru
-n.
--[comp.] register; a string (or necklace) of flip-flops; a device to store a (binary) number;
పల్లీ, pallI
- n.
-- groundnut; peanut;
పలుకరించు, palukariMcu
-v. t.
--greet; say "helo";
పలుకరింపు, palukariMpu
-n.
--greeting; the style of saying hello;
పలుకు, paluku
-n.
--(1) word; utterance;
--(2) fragment, (esp.) seed fragment as in జీడి పలుకు;
- v. i.
-- utter; respond; say something;
పలుకుబడి, palukubaDi
-n.
--(1) influence;
--(2) pronunciation;
--(3) a popular expression to convey a message; "అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. ఏదో ఒకటి చెప్పు" అన్నప్పుడు "అడిగిన వాటిల్లో ఏదో ఒకటే ఇస్తా, అన్నీ కాదు" అనే అర్థంలో వాడేది పలుకుబడి; ఇందులో రెండో వాక్యం చేరబనిలేదు.
పలుగు, palugu
-n.
--(1) crowbar; an iron rod used for digging; (2) a hard, white, crystalline rock; (3) a wretch; bad person;
పలువ, paluva
-n.
--wicked wretch;
పల్లె, palle
-n.
--village;
-- పల్లె అంటే వంద కుటుంబాలు లేదా అంతా కన్నా తక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తూ వుంటాయి, ఇక్కడ ప్రభుత్వానికి సంబందించిన ప్రాధమిక పాఠశాల (ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి ) వరకు మాత్రమే, అంగన్వాడీ స్కూల్ మాత్రమే వుంటాయి.
-- (see also) గ్రామం; పట్టణం;
పల్లెపట్టు, pallepaTTu
-n.
--countryside;
పల్లేరు, pallEru
-n.
--caltrop; a creeper that produces small thorny fruits; [bot.] Pedalium longifolia; Tribulus terrestris Linn.;
పసుపు చామంతి, pasupu cAmaMti
-n.
-- Chinese Wedelia; [bot.] Wedelia chinensis of the Asteraceae family;
-- Wedelia trilobata and Wedelia chinensis, are now named Sphagneticola trilobata and Sphagneticola calendulacea, respectively, the former commonly known as Singapore Daisy, the latter Chinese Wedelia; the former is commonly used as ornamental groundcover and the latter as a medicinal herb used in the treatment of inflammations, including abscesses and sore throat; it is also used to treat coughs. The fresh plant, combined with sesame oil, is used to treat elephantiasis;
పసుపుపచ్చ వెన్నముద్ద, pasupupaccha vennamudda
- n.
-- Chinese ixora; [bot.] Ixora chinensis;
పస్తు, pastu
-n.
--fasting;
పహరా, paharA
-n.
--watch; police beat;
%ప్ర - pra, ప్ల - pla
ప్ర, pra
-adj.
--pref. excessive; much; very;
---ప్రకంపన = reverberation; much vibration.
---ప్రకల్పన = organization; arrangement.
---ప్రకర్షము = excellence; hard work.
---ప్రక్రియ = process; desirable work.
---ప్రక్షాళనము = cleaning thoroughly.
---ప్రఖ్యాతి = lot of fame.
ప్ర, pra-,
-pref.
ప్రమోదం = extreme happiness.
ప్రయత్నం = much effort.
ప్రలోభం = extreme miserliness.
ప్రవాదం = word that has spread far and wide.
ప్రకటన, prakaTana
-n.
--(1) announcement; revelation;
--(2) advertisement;
---వ్యాపార ప్రకటన = advertisement.
---ప్రదర్శక ప్రకటన = display advertisement.
ప్రజలు, prajalu
-n. pl.
-- one's own children; people; (rel.) జనాభా;
ప్రజ్ఞ, praj~na
-n.
--ability; skill; intelligence; enlightening wisdom; knowledge a priori; (ety.) related to Greek prognosis, implying knowledge not derived from the object, as distinguished from సంజ్ఞ, empirical knowledge;
ప్రజ్ఞానం, praj~nAnaM
-n.
--(1) intellect; enlightening wisdom; super consciousness; knowledge a priori; (ety.) related to Greek prognosis, implying knowledge not derived from the object, as distinguished from సంజ్ఞ, empirical knowledge; (2) sign; mnemonic;
ప్రజ్వలించు, prajvaliMcu
-v. i.
--burn; shine;
ప్రజానీకం, prajAnIkaM
-n.
--populace; the masses; common people; the public;
ప్రజామోదం, prajAmOdaM
-n.
--parsley; [bot.] Petroselinum crispum of the Apiaceae family;
-- a species of flowering plant that is native to the central and eastern Mediterranean region;
ప్రత్యర్థి, pratyarthi
- n.
-- opponent; defendant; enemy;
ప్రత్యక్షంగా, pratyakshamga
-adv.
--in the presence of; right in front of; (ant.) పరోక్షంగా;
ప్రత్యగాత్మ, pratyagAtma
- n.
-- finite monad;
-- monad = సూక్ష్మాత్మ;
-- (1) ప్రత్యగాత్మ అంటే "అసలు సిసలు నేను" అని అర్థం. ప్రత్యగాత్మా = ప్రతి+అక్+ఆత్మా. ప్రతి అంటే వెనుకకు అని. అక్ అంటే వెళ్ళుట. అక్ అనేది అఞ్చ్ అనే ఒక ధాతువు నుండి వచ్చింది. అఞ్చ్ గతౌ అని ధాతుపాఠం. వెనుకకు వెళ్ళటం అంటే ఏ వెనుకకు వెళ్ళాలి? ఏదైతే దేహము కాదో, దేహానికి సాక్షియో, ఏది కర్మేంద్రియములు కాదో, కర్మేంద్రియములకు సాక్షియో, ఏది జ్ఞానేంద్రియములు కాదో, జ్ఞానేంద్రియములకు సాక్షియో, ఏది మనస్సు కాదో, మనస్సుకు సాక్షియో, ఏది బుద్ధికాదో, బుద్ధికి సాక్షియో, ఏది అహంకారము కాదో, అహంకారమునకు సాక్షిగా నిలచియున్న ఏ చైతన్యము కలదో, ఆ ఎరుక, అదియే ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మయే అసలు సిసలైన నేను. అటువంటి ప్రత్యగాత్మగా, అసలు సిసలు నేనుగా విరాజిల్లుతున్నదే ఆ పరమాత్మ;
(2) భగవదనుగ్రహమో, గురూపదేశమో శాస్త్రజన్య జ్ఞానమో, సాధనయో, సంకల్పమో ఏదైతేనేమి జీవాత్మ సరియైన స్వస్వరూప జ్ఞానమును పొంది సంసారమునుండి ముక్తిని పొందుతుంది. ఇలా సంసార గంధము, శరీర సంబంధం తొలిగిపోయిన జీవాత్మ తన యాదార్థస్థితిని పొందుతుంది. పరిమితి లేని జ్ఞానస్వరూపాన్ని తిరిగి పొందుతుంది. ఇలాంటి యదార్థ స్థితిని తిరిగి పొందిన జీవాత్మను "ప్రత్యగాత్మ" అని అంటారు. దీనినే "ముక్తాత్మ" అని కూడా కొందరు వ్యవహరిస్తారు. అయితే ఈ ప్రత్యగాత్మ స్వరూప, స్వభావాలపైన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతాది మతబేధాలున్నాయి. అది అర్థంచేసుకోవడానికి కొంచెం క్లిష్టమైన విషయం.
ప్రత్యయం, pratyayaM
- n.
--[gram.] a suffix that converts a verb into a noun;
---ఉపసర్గ = prefix. (పూర్వ ప్రత్యయం)
---ప్రత్యయం = suffix. (పర ప్రత్యయం)
--ఉదా. ఒక క్రియా పదం మీద ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చినప్పుడు ఆ ప్రత్యయాన్ని కృత్ప్రత్యయం అనిన్నీ అలా వచ్చిన నామవాచకాన్ని కృదంతం అనిన్నీ అంటారు; అలుగు > అలక; ఎన్ను > ఎన్నిక;
---తద్ధిత ప్రత్యయం = a suffix that creates another noun from a given noun.
ప్రతి, prati
-adj. pref.
--(1) re;
--(2) anti-; un-;
--(3) instead of; in lieu of;
--(4) every; all; each;
---ప్రతిఫలం = reward.
---ప్రతివాడూ = every man.
---ప్రతివాది = opposing party in court.
-n.
--copy; number; issue; a single item of a periodical;
ప్రతికాయం, pratikAyaM
-n.
--[bio.] antibody; proteins produced by the immune system to defened against an invading species;
ప్రతిష్ఠించు, pratishThiMcu
-v. t.
--establish; erect; found;
ప్రతిహాతం, pratihAtaM
n.
--repulsion; beaten back; avertion; impediment;
-- ఏదన్నా వినకూడని మాట, అశుభం అనిపించే మాట విన్నప్పుడు "అమంగళం ప్రతిహాతం అవుగాక!" అంటే అది మాటతోనే ఆగాలి, జరగకూడదు అని చెప్పటం.
--"అప్రతిహతంగా సాగింది," అంటే "ఆటంకం లేకుండా జరిగింది" అని అర్థం;
ప్రదోషకాలం, pradOshakaalaM
-n.
-- evening; twilight; the time just before sunset to just after sunset;
-- సూర్యుడు అస్తమించడానికి ముందు, వెనుక మూడేసి ఘడియలు, అంటే మొత్తం ఆరు ఘడియల కాలం; మునిమాపు వేళ; నక్తముఖము; నిశాముఖము; రజనీముఖము;
ప్రధాన, pradhAna
-adj.
--principal; chief; main; prime; pre-eminent;
--ప్రధాన మంత్రి = prime minister;
-- ప్రధాన సంఖ్య = prime number;
ప్రధానాంకం, pradhAnAMkaM
-n.
--prime number; (def.) according to number theory, a number is a prime number if it cannot be divided except by itself or by the number 1. The numbers 1, 2, 3, 5, 7, 11, 13, etc. are all prime numbers.
ప్రధాని, pradhAni
-n.
--prime minister;
ప్రపంచం, prapaMcaM
-n.
--world;
ప్రపంచ వ్యాప్తం, prapaMca vyAptaM
-n.
--world-wide;
ప్రపంచీకరణ, prapaMcIkaraNa
-n.
-- globalization;
ప్రప్రథమ, praprathama
- adj.
-- primordial; at the very beginning;
ప్రప్రపితామహుడు, praprapitAmahuDu
- n. m.
-- great-great paternal grandfather;
ప్రపితామహుడు, prapitAmahuDu
- n. m.
-- great paternal grandfather;
ప్రబంధం, prabandhaM
-n.
--a comprehensive poetic work with eighteen types of descriptions typically dealing with romance or adventure of kings;
-- కల్పించిన కథ గల వర్ణనాత్మక గ్రంథము; ప్రబంధంలో సాధారణంగా ఒక ఏక సూత్రమైన కథ ఉంటుంది. ఒక నాయకుడు, నాయిక వారి ప్రణయం, వివాహం, విరహం, కలహం, పునః సమాగమం వంటి సాధారణమైన కథను కేవలం, వర్ణనలతో అందగించి, పెంచి, ఐదారు ఆశ్వాసాలుగా వ్రాయబడిన కావ్యాన్ని ప్రబంధమనవచ్చు. ప్రబంధాలు కూడా కావ్యాలే గానీ, కావ్యాలన్నీ ప్రబంధాలు కావు; ఉదాహరణ: మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం;
-- ఇంగ్లీషు నాటకాలకు చెప్పే ….కాలైక్యము, కథైక్యము, స్థలైక్యము (unity of time, unity of plot, unity of place) తెలుగు కావ్యాలకు గూడా అన్వయించి, ఇవి ఉండేది "ప్రబంధం" అనీ, ఇవి లేకపోయినవి ప్రబంధాలు కాదు కేవలం కావ్యాలు అనీ చెప్పారు ఆధునిక విమర్శకులు.
ప్రయోక్త, prayOkta
- n.
-- experimenter; the person who performs an experiment;
ప్రయోగం, prayOgaM %add this as an additional meaning
- n.
--(1) experiment; trial; attempt;
-- (2) witchcraft; black magic;
--- see also చేతబడి; కట్టుమోను; బాణామతి; గండభేరుండం;
ప్రవృత్తి, pravRtti
-n.
--(1) behavior; manner; attitude; pattern; appearance; demeanor; the costume, dress and manners of a character in a play that indicates the regional identity of the character;
--(2) hobby;
---వృత్తి, ప్రవృత్తి = profession and hobby.
ప్రసాదం, prasAdaM
-n.
--anything accepted back after first being offered to God; (lit.) ప్ర + సాదం = శ్రేష్ఠమైన సాదం = భగవన్నివేదితమైన అన్నం = ప్రసాదం = gift of God;
ప్రసారం, prasAraM
-n.
--(1) transmission;
--(2) flow;
--(3) radiation; spreading;
---రేడియో ప్రసార కేంద్రం = radio transmission center.
ప్రస్థానం, prasthAnaM
-n.
--journey; setting out on a journey;
ప్రస్థానత్రయం, prasthAnatrayaM
-n.
--the three canonical texts of the Vedanta school of Hindu philosophy; It consists of the Upanishads, Brahma Sutras and Bhagavad Gita; (lit.) the three points of departure;
ప్లవనము, plavanamu
-n.
--fluorine; one of the elements of nature;
%పాం - pAM, పా - pA, ప్రా - prA
పాంకోళ్లు, pAMkOLLu
-n.
--wooden shoes; clogs;
పాంచక్కెర, pAMcakkera
-n.
--pentose; a sugar with a five-membered ring;
పాంజియా, pAMjiyA
-n.
--[geol.] Pangea; one of the two pieces of landmass from which the seven continents broke and drifted apart, according to the theory of plate tectonics. The other piece is called గొంద్వానా;
పాకం, pAkaM
-n.
--(1) syrup; any syrupy liquid; sugar or jaggery dissolved in water and boiled to a syrupy consistency;
--(2) cooking and dressing of food;
--(3) an author's style of writing;
---జీళ్ల పాకం = caramel.
---ముదర పాకం = caramel.
---దేహపాకం = constitution of the body.
---ద్రాక్షాపాకం = smooth and easy style; a style as easy to appreciate as eating a grape.
---కదళీపాకం = intermediate in difficulty in understanding; a style as easy as peeling and eating a banana.
---నారికేళపాకం = very difficult style; a style as hard as cracking a coconut.
పాక, pAka
-n.
--hut; thatched-roof hut; shed;
పాకశాస్త్రం, pAkaSAstraM
-n.
--culinary science;
పాకీ, pAkI
-adj.
--pure; clean; sacred;
పాకీదొడ్డి, pAkIdoDDi
-n.
--latrine;
పాకీమనిషి, pAkImanishi
-n.
--scavenger; a person who cleans latrines;
పాకీవాడు, pAkIvADu
-n. m.
--scavenger; the person who cleans and purifies;
పాకు, pAku
- v. i.
-- (1) crawl on all all four, that is on hands and knees; creep; (2) climb, as a vine;
-- (rel.) డేకు
పాదిరి చెట్టు, pAdiri ceTTu
-n. [bot.] Stereospermum suaveolens;
-- కలిగొట్టు చెట్టు;[Sans.] పాటలవృక్షం is [bot.] Stereospermum suaveolens; The flower is described as dearest to Mother Lalitha Devi;
పారద్రోలు, pAradrOlu
-v. t.
--drive out; chase away; eject;
పాకుడు, pAkuDu
-n.
--moss;
పాక్షికం, pAkshikaM
-n.
--alternative;
పాగా, pAgA
-n.
--turban;
పాచకుడు, pAcakuDu
-n.
--cook; chef;
పాచి, pAci
-n.
--scum; moss; green moss;
పాచికలు, pAcikalu
-n. pl.
--dice; cubes with dots on their faces, used in gambling;
పాచిపళ్లు, pAcipaLLu
-n.
--teeth that have not yet been brushed after a night's sleep;
పాచిబద్ద, pAcibadda
-n.
--a plastic, metal or palm-leaf strip to scrape the tongue along with brushing the teeth;
పాట, pATa
-n.
--(1) song;
--(2) auction;
--(3) bid in an auction;
పాటకపుజనం, pATakapujanaM
-n.
--proletariat;
పాటరి, pATari
-n.
--hardworking person;
పాటలగంధి, pATalagaMdhi
-n.
--[bot.] Ophixylon serpentinum; the poisonous plant Rauwolfia serpentina of Apocynaceae family, from the roots of which the alkaloid reserpine is extracted;
పాఠభేదం, pAThabhEdaM
-n.
--variation in text from one version to another;
పాఠశాల, pAThaSAla
-n.
--school; school-house;
పాఠాంతరం, pAThAMtaraM
-n.
--a variation of text found in another source;
పాడ్యమి, pADyami
-n.
--first day of lunar half-month;
పాడి, pADi
-n.
--(1) justice; appropriateness;
--(2) dairy farming; animal husbandry;
---పాడి ఆవు = milch cow.
---పాడి పంటలు = dairy farming and cultivation.
---పాడి పరిశ్రమ = dairy industry.
పాడు, pADu
-adj.
--waste; desolate; neglected; dilapidated;
- v. i.
--to sing;
- suff.
-- a suffix to a village name; గుల్లిపాడు; కంకిపాదడు; పాడు చివర వచ్చే గ్రామనామాలు జైనమత సంబంధాన్ని సూచిస్తాయి. ఆంధ్రదేశంలో 12వ శతాబ్ది వరకు జైనం బాగా వర్ధిల్లింది;
పాడె, pADe
-n.
--bier; a contraption for carrying a dead body;
పాడేను, pADEnu
-n.
--[chem.] methane; (ety.) the పాడ్ sound reminds of పాడ్యమి which is indicative of one carbon atom and the -ane ending is required for alkanes; CH4;
పాడోయిక్ ఆమ్లం, pADOyik AmlaM
-n.
--[chem.] methanoic acid; chemical name of vitamin D;
పాడోల్, pADOl
-n.
--[chem.] methanol; methyl alcohol; (ety.) the పాడ్ sound reminds of పాడ్యమి which is indicative of one carbon atom and the ఓల్ ending is required for alcohols; CH3OH;
పాణి, pANi
-n.
--hand; that part of the hand from the wrist to the finger tips;
పాణిక, pANika
-n.
--spoon; % to e2t
పాణిగ్రహణం, pANigrahaNaM
-n.
--wedding; (lit.) taking the hand;
పాణిశలాకలు, pANiSalAkalu
-n.
--meta carpals; (lit.) hand bones; కరభాస్థికలు;
పాతర, pATara
-n.
--(1) a grain storage hole dug into the ground and subsequently covered with hay and dirt;
--(2) any hidden object;
--(3) buried wealth; anything buried; often used to refer to a pot of gold coins found unexpectedly; also called లంకెల బిందెలు; పాతు;
---మందు పాతర = buried land mine; a buried explosive that explodes when stepped on;
---ఉప్పు పాతర = a salt crypt to bury dead bodies;
పాత్ర, pAtra
-n.
--(1) role;
--(2) vessel; dish;
పాత్రసామాను, pAtrasAmAnu
-n.
--utensils;
పాతాళం, pAtALaM
-n.
--nether world; a world below the terrestrial plane or beneath the terrestrial sphere;
పాతాళ గంగ, pAtALa gaMga
-n.
--water from underground; groundwater;
పాతిక, pAtika
-n.
--(1) one-in-four; one fourth; a quarter;
--(2) twenty-five; one-fourth of hundred;
పాతిపెట్టు, pAtipeTTu
-v. t.
--bury;
పత్రికా రచయిత, patrikA racayita
-n.
--journalist; (usage note) పాత్రికేయుడు is not correct usage;
పాతు, pAtu
-v. t.
--to plant; to erect;
---మొక్క పాతేవా = did you plant the plant?
---రాట పాతేవా = did you erect the pole?
పాదం, pAdaM
-n.
--(1) foot;
--(2) iamb; metrical foot of a poem; line of a poem;
--(3) one-fourth;
పాదచారి, pAdacAri
-n.
--pedestrian; see also బాటసారి;
పాదముద్ర, pAdamudra
-n.
--foot-print;
పాదయాత్ర, pAdayAtra
-n.
--journey by foot;
పాదరసం, pAdarasaM
-n.
-- mercury; the chemical element with the symbol Hg; quicksilver; రసము;
పానకం, pAnakaM
-n.
--solution; (esp.) a solution of jaggery dissolved in water;
---పంచదార పానకం = a solution of sugar dissolved in water.
పానవట్టము, pAnapaTTamu
- n. A plate-like receptacle under the Shiva idol to capture the liquids offered to Shiva;
-- (Note) శివలింగానికి కింద ఉండే పళ్ళెం పేరు పానపట్టం; అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటకి వచ్చే మార్గం సోమసూత్రం; శివాలయాలు తూర్పు ముఖం గానూ, పశ్చిమ ముఖం గానూ ఉంటాయి; అవి ఏ ముఖంగా ఉన్నా సోమసూతం మాత్రం ఎల్లప్పుడూ ఉత్తరం వైపునే ఉంటుంది;
-- see also సోమసూత్రం;
పానభాజనం, pAnabhAjanaM %e2t
-n.
--goblet, a glass for drinking wine, గిన్నె;
పానా, pAnA
-n.
--wrench; spanner;
పాపం, pApaM
-inter.
--alas!;
--
పాపం, pApaM
-n.
--sin;
- inter.
-- alas!
--- అయ్యో! పాపం పసివాడు!
పాపిరి, paapiri
-n.
-- Indian podophyllum; [bot.] Podophyllum hexandrum;
-- An erect succulent herb with a creeping rootstalk;
-- వన్యకర్కటి;
పామరుడు, pAmaruDu
-n. m.
--un-learned; ordinary person; common man; (ant.) పండితుడు;
పాము, pAmu
-n.
-- snake; serpent; asp; (rel.) constrictor;
-- భారతదేశంలో విషపూరితమైన 50 జాతుల పాములున్నాయి. అయితే వీటిలో ఎక్కువభాగం జాతులవల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదు.
--- కట్ల పాము = asp; krait; (bio.) Bungarus caeruleus; a venomous snake;
--- బంగారు కట్ల పురుగు = Banded Krait; [bio.] Bungarus fasciatus; నల్లని లేక ముదురు గోధుమ వర్ణం శరీరం మీద బంగారు పసుపు రంగు పట్టీలు కలిగి ఉండే ఈ పాములు మనిషితో తలపడే సందర్భాలు చాలా అరుదు.
---బొక్క బెరడు = Pit Viper; hump-nosed pit viper; [bio.] Hypnale hypnale; The hump-nosed pit viper is a venomous snake, with heat-sensitive pits that detect temperature changes and help it locate prey. Recent studies by various toxicologists and researchers indicate that the venom it produces can cause fatalities in humans. It has already been added to the list of medically important snakes by the WHO. Bites inflicted are known to cause fever, swelling, and pain; a few reports of renal failure and death also exist;
--- జెర్రి గొడ్డు లేక జెర్రి పోతు = Common Indian Rat Snake; [bio.] Ptyas mucosus; విషరహితమైన పాము;
--- కొండ చిలువ = Rock Python; [bio.) Python molurus; విషరహితమైన పాము;
--- గిలక పాము = rattle snake.
--- తాచు పాము = నాగు పాము = cobra; (bio.) Naja naja; a venomous snake;
--- రక్త పెంజెరి = కాటుక రేకుల పొడ = Russell’s Viper; (bio.) Vipera russelli of the Viperidae family; a venomous snake; ఇది కరచినప్పుడు దీని విషం కారణంగా రక్తం విరిగి పల్చబడి పోతుంది.రక్తపోటు తగ్గిపోయి, గుండె బలహీనపడుతుంది. ఎర్ర రక్త కణాలు ధ్వంసమౌతాయి.రక్తంయొక్క గడ్డకట్టే స్వభావం తగ్గిపోయి శరీరంలో అంతర్గత స్రావాలు పెరిగిపోతాయి. ఒళ్ళంతా పోట్లు, వాంతులు మొదలౌతాయి. ఇది కరచిన చోట త్వరత్వరగా వాచుకొచ్చి, గాయం నుంచి పల్చబడిన రక్తం స్రవిస్తుంది. శరీరం చల్లబడి ఒళ్ళంతా చెమటలు పట్టుకొస్తాయి. గుండె, శ్వాసకోశ సమస్యలు, సెప్టిసీమియా (Septicaemia) మొదలైనవాటి కారణంగా ఆ వ్యక్తి 1 నుంచి 14 రోజులలోపు మరణించడం జరుగుతుంది. ముంబాయిలోని హాఫ్^కిన్ ఇన్స్టిట్యూట్ తయారుచేసే పాలీవాలెంట్ సీరం (Polyvalent Serum) రక్త పెంజెరి విషానికి ప్రభావవంతమైన విరుగుడు. సకాలంలో చికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఇది మిగిలిన చాలా పాములలాగా అండజము (Oviparous) కాదు. వాటిలా ఇది గుడ్లు పెట్టక, నేరుగా పిల్లల్ని కనే జరాయుజము (Viviparous). దీని గర్భంలోనే గుడ్లు పగిలి పిల్లలు బయటికొస్తాయి; కొన్నిటికి కంటికి సమీపంలో అటూఇటూ రెండు రంధ్రాలు ఉంటవి కనుక పిట్ వైపర్లంటారు;
--- చిన్న పెంజెరి = Indian Saw-scaled Viper; [bio.] Echis carinatus;
--- రాచనాగు = King Cobra; [bio.] Ophiophagus hannah; బాగా దట్టమైన, ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే సతతహరితారణ్యాలలోనే ఉంటుంది;
--- నలికండ్ల పాము = black dotted lizard; newt.
--- పసిరిక పాము = vine snake; Sri Lankan green vine snake; [bio.] Ahaetulla nasuta;
--- వానపాము = earthworm.
--- (note) పాము కరచిన వ్యక్తి బతకాలంటే కేవలం పెద్ద పెద్ద వైద్యశాలలలో మాత్రమే లభించే పాముకాటు సీరం (Antivenom Serum) వాడటం మినహా మార్గం లేదు; మంత్రాలకి విషం దిగదు;
-v. t.
-- rub; smear; scour;
పాయ, pAya
-n.
--(1) branch of a river; a distributary of a river;
--(2) a strand of braided hair;
--(3) a clove or division in an onion or garlic bulb;
--(4) way; path;
పాయకారీ, pAyakArI
-n.
--commuter; a person who lives in one town and goes to work in another town;
---పాయకారీ రైతు = commuting farmer.
---పాయకారీ రైలు = commuting train.
పాయసం, pAyasaM
-n.
--rice and sugar boiled in milk; rice pudding;
పార, pAra
-n.
--hand-hoe; small hand-shovel; a shovel whose handle is about as long as the length of the blade; a small spade used for digging and shoveling;
పారదర్శక, pAradarSaka
-adj.
--transparent; a transparent glass is clear;
పారభాసక, pArabhAsaka
-adj.
--translucent; (note) a translucent glass is cloudy;
పారాణి, pAraNi
-n.
--a red paste produced by mixing turmeric and quick lime; this paste is applied to the feet of women as a mark of her husband's well-being;
పారా, pArA
-adj.
--pref. the other one; పరా;
-n.
--watching; guarding;
పారా రబ్బరు, pArA rabbaru
-n.
--(lit.) the other rubber; a different kind of rubber;
పారాలంతం, pArAlaMtaM
-n.
--paraldehyde; (lit.) the other aldehyde;
పారాహుషార్, paraahushaar
- న.
-- పారశీకంలో హోష్ (هوش) అంటే తెలివి, సృహ. హోషియార్ (هوشيار) అంటే తెలివి కలిగి ఉండడం. అప్రమత్తంగా ఉండే స్థితి. హోషియార్ అన్న పదమే తెలుగులో హుషార్ గా మారిపోయింది. తెలుగులో ఉషారు అన్న పదం కూడా హోషియార్‌కు రూపాంతరమే.
--ప్రహర అన్న సంస్కృత పదానికి దినములో ఎనమిదోవంతు భాగం లేదా ౙాము అన్న అర్థం ఉంది. నిజానికి ప్రహార అంటే దెబ్బ. రోజులో ఒక ౙాము గడిచిందని సూచించడానికి ఢక్కా నాదం చేసేవారు. ఆ దెబ్బ పేరుమీదే ప్రహర అంటే రోజులో ౙాముకు సమానార్థకంగా మారిపోయింది. ఆ ప్రహర అన్న పదమే ప్రాకృతాల్లో పహరగా మారిపోయి, తెలుగులో -హ-కారం లేదు గాబట్టి పార-గా రూపాంతరం చెందింది. (సురేశ్ కొలిచాల);
పారిక, pArika
-n. f.
--maid servant;
పారికాపు, pArikApu
-n.
--attendant; servant;
పారిజాతం, pArijAtaM
-n.
--Indian coral tree; night jasmine; coral jasmine; [bot.] Nyctanthes arbortristis; same as పగడ మల్లె;
పార్థివ, pArthiva
-adj.
--belonging to the earth;
---పార్థివ దేహం = dead body; corpse;
పారీణుడు, pArINuDu
-n.
--expert; (note) పారంగతుడు is not correct
పార్టీ, pArTI
-n.
--party; a group of people with a common cause;
---రాజకీయ పార్టీ = political party.
---మీ పార్టీలో ఎంతమంది? = how many in your party?
పారు, pAru
-v. t.
--flow;
---నీటి పారుదల = irrigation; water flow.
పాలకాయలు, pAlakAyalu
- n.
-- (1) a snack food prepared by deep frying small cylindrical shaped hard batter made by mixing rice flour, salt, pepper powder and cumin seeds; (2) ఉలిపిరి కాయలు;
పాలగరుడ, pAlagaruDa
-n.
--arrowroot plant; Arrowroot is a starch obtained from the rhizomes of several tropical plants, traditionally Maranta arundinacea, but also Florida arrowroot from Zamia integrifolia, and tapioca from cassava, which is often labeled as arrowroot; [bot.] Alstonia scholaris;
-- Arrowroot powder is twice the thickening power of wheat flour and because it contains no protein, arrowroot is gluten-free;
పాలగుండ, pAlaguMDa
-n.
-- arrowroot powder; the starch made from the rhizomes of arrowroot plant; [bot.] Marantha ramosissima or [bot.] Maranta arundinacea; this arrowroot looks similar to other underground tubers such as cassava, yucca or kudzu, which are oblong;
పాలవెల్లి, pAlavelli
- n.
-- A decorative frame, suspended above the idol of Vinayaka (Ganapathi), from which several round objects are hung; this is symbolic of the planets of the solar system;
పాలసముద్రం, pAlasamudraM
-n.
--The Ocean of Milk of Hindu mythology where God Vishnu lies in repose on a serpent bed; the Milky Way galaxy;
పాలసీ, pAIasI
-n.
--an insurance policy; బీమా;
పాల సీసా, pAla sIsA
-n.
--feeding bottle; milk bottle;
పాలి, pAli
-n.
--turn; chance; time;
---ఈ పాలికి ఇది తీసుకోండి = For this time, take this.
పాలించు, pAliMcu
-v. t.
--protect; govern;
పాలికాపు, pAlikApu
-n.
--sharecropper; a farmer willing to work on a farm for a share of the crop as his compensation; పాలేరు;
పాలు, pAlu
-n.
--(1) milk;
--(2) any milky substance such as latex exuded by some plants;
--(3) portion; proportion; share;
---ఆవుపాలు = cow's milk.
---డబ్బాపాలు = canned milk.
---తల్లిపాలు = breast milk.
---గన్నేరుపాలు = latex of oleander plant.
-- పాలు పంచుకొను = భాగము తీసికొను;
పాల్గొను, pAlgonu
-v. t.
--participate;
పాళ్లు, pALlu
-n.
--proportions;
పాళీ, pALI
-n.
--(1) nib; the writing tip of a pen;
--(2) a board game;
---పచ్చీస్ పాళీ = The board game, Pacchisi.
---వైకుంఠ పాళీ = a board game similar to Chutes and Ladders.
పావంచాలు, pAavaMcAlu
-n.
--steps; సోపానాలు ;
పావడా, pAvaDA
- n.
-- frock; garment that covers the lower part of a girl's body'
-- (ety.) పాప కి అడ్డంగా ఉన్నది;
పావిలాకు, pAvilAku
- n.
-- purslane, pigweed; verdolaga, [bot.] Portulaca oleracea;
--a commonly occurring weed used as a medicinal herd and a vegetable; one of Gandhi's favorite leafy vegetables; contains more Omega-3 fatty acids than any other vegetable;
--a medicinal plant; a herb called thick-leaved sorrel;
-- పెద్ద పావిలాకు; బొడ్డు పావిలాకు; గంగ పావిలాకు;
పావు, pAvu
-n.
--(1) one-fourth; quarter;
--(2) pawn in any board game;
---పావు తక్కువ నాలుగు = quarter before four O'clock.
---నాలుగుంపావు = quarter past four O'clock.
---నీ పావుని నడిపేవా = did you move your piece.
పావురం, pAvuraM
-n.
--pigeon;
---పచ్చ పావురం = green pigeon; [bio.] Treron phoenicoptera;
---గుడి పావురం = blue rock pigeon; [bio.] Columba livia;
పాషాణభేది, pAshANabhEdi
-n.
--the rhizome of this plant is used to cure stones in urinary bladder; [bot.] Averva lanata;
-- కొండపిండి మొక్క; తెలగపిండి కూర మొక్క;
-- related [bot.] Bergenia lingulata; అశ్మభేది, శిలాభేది;
ప్రాంకురము, prAMkuramu
- n.
-- [bot.] Plumule; the end of the plant that shoots up from a seed;
-- గింజలో నుండు ప్రాథమికాక్షము మొక్క భూమి పైకి పెరుగు కొన;
ప్రాంకుర స్పృహ, prAMkura spRha
- ph.
-- the spiritual concept of primordial awarenss without primitivism;
ప్రాతిపదిక, prAtipadika
-n.
-- (1) hypothesis; (2) basis; base; support; (3) root for noun and verb forms;
-- ఒక పద రూపం ఏర్పడడానికి మూలమైన శబ్దం ప్రాతిపదిక; క్రియా ప్రాతిపదిక = verbal root;
-- "అర్థవత్ అధాతుః అప్రత్యయః ప్రాతిపదికమ్" అని దీని నిర్వచనం (a noun in its uninflected state)
ప్రాముఖ్యం, prAmukhyaM
-n.
--importance;
---(note) ప్రాముఖ్యత is not correct usage
ప్రాయం, prAyaM
-suff.
--equivalent; like; resembling;
---త్రుణప్రాయం = equivalent to blade of grass.
---పశుప్రాయుడు = equivalent to an animal; brute.
ప్రాయశ్చిత్తం, prAyaScittaM
-n.
--atonement; penance; expiation; propitiation; recompense; (ety.) ప్రాయ = commitment of an error and చిత్తం = correction of the error;
ప్రాస, prAsa
- n.
-- [prosody] using similar sounding words to get the effect of alliteration;
-- ఉచ్చారణలో ఒకే విధంగా వుండే పదాలను వాడడం. తెలుగు, హిందీలలోో అంత్య ప్రాసకు (तुकान्त) చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు;
పిండం, piMDaM
-n.
--(1) embryo;
--(2) ball of rice left for the departed ancestors at a religious ceremony;
--(3) any ball obtained by squeezing matter;
--(4) a tough character as in ఉద్దండ పిండం;
-- (note) మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు. ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు - ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది.
పిండి, piMDi
-n.
--(1) flour; powder as in వరిపిండి;
--(2) batter, as in దోసెల పిండి;
--(3) starch, as in పిండి పెట్టిన కూర;
పిండికట్టు, piMDikaTTu
-n.
--poultice; a bandage made out of cooked flour to relieve pain from a boil; a type of bandage used to help break a boil;
పిండిపదార్థం, piMDipadArthaM
-n.
--starch; starchy substance; see also కర్బనోదకం; కర్బనోదజం;
పిండిమంచు, piMDimaMcu %e2t
-n.
--snow;
పిండు, piMDu
-v. t.
--squeeze;
పిందె, piMde
-n.
--a tender, green fruit just formed; an early stage of evolution toward a fruit;
పిక్క, pikka
-n.
--(1) nut; a seed that contains some possibly edible meat inside;
--(2) seed; pit;
--(3) calf muscle;
---జీడిపిక్క = cashew nut.
---పిక్క బలం = ability to run; ability to flee.
పిక్కతీసిన, pikkatIsina
-adj.
--pitted;
---పిక్క పండు = fruit with pits; tamarind with pits.
---పిక్కతీసిన పండు = pitted fruit; pitted tamarind.
పిగిలిపిట్ట, pigilipiTTa
-n.
--(1) flycatcher; a bird;
--(2) a bird by the name bulbul; [bio.] Molpastes haemorrhons;
పిగులు, pigulu
-v. i.
--tearing of clothing due to an extremely tight fit;
పిచ్చాపాటీ, piccApATI
-n.
--banter; chit-chat; small talk;
పిచికారీ, picikArI
-n.
--syringe;
పిచికారీ చెట్టు, picikArI ceTTu
-n.
-- African Tulip Tree; [bot.] Spathodea campanulata of the Bignoniaceae family;
-- దీని లేత మొగ్గలలో నీరు ఉంటుంది. వాటి చివళ్ళు గిల్లి ఆ మొగ్గల్ని నొక్కితే పిచికారీ లాగా నీళ్లు చిమ్ముతాయి;
-- [Sans.] పాటలవృక్షం is [bot.] Stereospermum suaveolens; కలిగొట్టు లేదా పాదిరి చెట్టు అంటారు;
పిచ్చి, picci
-n.
--(1) insanity; madness; craziness; see also వెర్రి;
--(2) naiveté, as in ఓరి పిచ్చి వెధవా;
--(3) idiosyncrasy, as in ఎవరి పిచ్చి వారికి ఆనందం;
పిచ్చి కుసుమ, picchi kusuma
- n.
-- [bot.] Archimona mexicana;
-- భారతదేశంలో ఉష్ణప్రాంతాల్లో రస్తాల పక్కన, బీడు భూముల్లొ కనిపిస్తుంది. చెట్టు 3 అడుగులదాకా పెరుగుతుంది. ఆకులు బూడిదరంగులో, ఆకుల చివర ముళ్ళతో పచ్చని పూతతో కనిపిస్తాయి. ఆకులు తుంచితే బంగారు రంగు రసం స్రవిస్తుంది. వర్షాకాలం తర్వాత పుష్పించి, కాస్తుంది. కాయలు ఎండిన తరవాత చిట్లి, నల్లగా ఆవాలంత సైజులో విత్తనాలు చెట్టు చుట్టూ వెదజల్లబడి మళ్ళీ మొలకలెత్తి పెరుగుతాయి. ఇది విషపు మొక్క అని భావిస్తారు కానీ ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు ఈ చెట్టునుంచి రకరకాల జబ్బులకు మందులు తయారుచేస్తారు. జ్వరం, నొప్పులు తగ్గడానికి, చర్మరోగాలకు ఇతర జబ్బులకు ఈ మొక్క నుంచి మందులు తయారుచేస్తారు. గింజలనుంచి నూనె తయారుచేస్తారు. ఈ నూనె ఆహారంలోకి వాడరాదు. సబ్బుల పరిశ్రమలోనూ, ఇతర పరిశ్రమలలోను కుసుమనూనె వాడుకచేస్తారు. అవినీతిపరులయిన కొందరు వ్యాపారులు ఈ నూనెను వంటనూనెలతో కల్తీచేస్తారు.
-- వెర్రి కుసుమ; హేమపుష్టి; నులిపుచ్చ; స్వర్ణపుష్పం; వర్ణక్షీణి;
పిచ్చుక, piccuka
-n.
--sparrow; house sparrow; there are many types of sparrows, each with a distinct biological name;
--ఊర పిచ్చుక = కలవింక = house sparrow; [biol.] Passer domesticus indicus;
--కష్మీరీ పిచ్చుక = Kashmir House Sparrow; [biol.] Passer domesticus parkini;
-- ఊర పిచ్చుకలు సాధారణంగా 15 సెంటీమీటర్ల పొడవు ఉండి గుండ్రని శరీరం, గుండ్రని తల కలిగి ఉంటాయి. మగ ఊరపిచ్చుక వీపు భాగం చెస్ట్ నట్ రంగులో అక్కడక్కడా నల్లని చారలు కలిగి ఉంటుంది. గొంతు, ఎగువ రొమ్ము భాగం నల్లగా ఉంటుంది. పొట్ట, దిగువ భాగం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తోక ఈకలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ పిచ్చుకల వీపు భాగంలోని ఈకలు మట్టి రంగులోనూ, లేత గోధుమ రంగులోనూ ఉంటాయి. పొట్ట భాగం లేత బూడిద వన్నెలో ఉంటుంది. పిచ్చుక దృఢమైన ముక్కు ఎంత గట్టి గింజలనైనా చీల్చి పొట్టు తీయడానికి అనువుగా ఉంటుంది.
పిటపిట, piTapiTa
-adj.
--onomatopoeia for describing a tightly packed bag or a woman bursting in the prime of age;
పిట్ట, piTTA
-adj.pref.
--mini; small; short; an adjective to convey a smaller version;
---పిట్టకథ = story within a story; small story.
---పిట్టగోడ = parapet wall; a short, as opposed to a tall, wall.
---పిట్టకొంచెం, కూత ఘనం = the bird is small, the call is shrill.
---పిట్టతిండి = nibble; food eaten in small quantities; used while referring to a light eater.
---పిట్టపిడుగు = brat; active youngster; (lit.) mini thunderbolt.
-n.
--small bird;
పిట్టకూత, piTTakUta
-n.
--bird call;
పిడక, piDaka
-n.
--dried cake;
---పేడపిడక = dried cake of dung; these are used as cooking fuel in many parts of India.
పిడచ, piDaca
-n.
--a rice small ball of cooked rice (or any food) made by a closed first; a morsel of cooked food small enough to be eaten at one bite;
పిడత, piData
-n.
--small earthenware pot or wooden pot;
---మట్టి పిడత = small earthenware pot.
---లక్కపిడత = small lacquered wooden vessel used as a toy.
పిడి, piDi
-n.
--handle; haft; the handle of a knife or sword;
పితలాటకం, pitalaaTakaM
- n.
-- (1) trickery; cheating; deceit; fraud; (2) miserliness;
-- పిత్తల అంటే ఇత్తడి. హాటకము అంటే బంగారం. ఇత్తడిని చూపించి బంగారం అని నమ్మించే ప్రయత్నం చేయటం పితలాటకం. ప్రస్తుతం ఈ మాటని ఇబ్బంది, సమస్య, సందేహం అనే అర్థాలలో వాడుతున్నాము.
పిసినారితనం, pisinaaritanaM
- n.
-- scrimping; parsimony; economy; miserliness;
పిత్తం, pittaM
-n.
--[med.] bile; the secretion of the gallbladder; same as పైత్యరసం;
-- In Ayurveda, a body condition;
-- ఇది అగ్నితో తయారు చేయబడింది. పిత్త ఆధిపత్యం ఉన్న వ్యక్తులు సాధారణంగా ధృడ శరీర నిర్మాణం కలిగి ఉంటారు, వారు పోటీతత్వం కలిగి ఉంటారు. అయినప్పటికీ, వారి దూకుడు, దృఢమైన స్వభావం కొంత మందికి దూరంగా ఉంచుతుంది, ఇది సంఘర్షణకు దారితీస్తుంది;
పితూరీ, pitUrI
-n.
--(1) rebellion;
--(2) conspiracy; plot;
-- పితూరీ శబ్దం అరబ్బీ ఫితూర్ శబ్దం నుండి వచ్చింది; ఫితూర్ అనగా అశాంతి, అలజడి, అరాచకం అని అరబ్బీ లో అర్థాలు. ఇది మానసికమైన అలజడి కావచ్చు, బాహ్య పరిస్థితులు బాగుగా లేక చెలరేగే అశాంతి కావచ్చు. కాలక్రమేణా ఇది ఉర్దూ ద్వారా తెలుగులోకి దిగుమతి అయి తిరుగుబాటు, దోపిడీ, రాజ ద్రోహం, కుట్ర, అరాచక శబ్దాలకు సమానార్థకంగా మారింది;
గొడవ, ఇబ్బంది
పిదప, pidapa
-adv.
--afterwards; later;
పిదపకాలం, pidapakAlaM
-n.
--bad times; modern times;
---పిదపకాలం పిల్లలు, పిదపకాలం బుద్ధులు = modern children and modern attitudes!
పిదపబుద్ధులు, pidapabuddhulu
-n.
--mean thoughts; bad attitudes;
పిప్పలి, pippali
-n. s.
--(1) long pepper; dried catkins; [bot.] Chavica roxburghii; Piper longum; Piper retrofractum; pl. పిప్పళ్లు;
-- పిప్పలమోడి, ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించే ఒక రకమైన వేరు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలలో ఏడాదికి పది కోట్ల రూపాయలకు పైగా అమ్ముడౌతున్న వేరు ఇది. గిరిజనులు చట్టబద్దంగా చేస్తున్న సాగు;
--(2) pippali n. [bot.] Ficus religiosa; same as ఆవి;
-- [Sans.] pippala; [Hindi] asvaththa;
-- గజపిప్పలి = [bot.] Pothos officinalis;
-- [ety.] the English word pepper came from the Sanskrit root పిప్పలీ;
--[Sans.] పిప్పలీ; మాగధీ; వైదేహీ;
పిపాస, pipAsa
-n.
--thirst;
పిప్పి, pippi
-n.
--stuff leftover after all the juice is extracted;
పిప్పిక, pippika
-n.
--plaque; the yellow accumulation on teeth;
పిపెట్, pipeT
-n.
--[chem.] pipette; a glass tube with which a measured amount of liquid can be taken;
పిమ్మట, pimmaTa
-adv.
--afterwards;
పియానో, piyAnO
-n.
--piano;
పియ్యి, piyyi
-n.
--feces; human excreta;
పిరల్రు, pirralu
-n.
--buttocks; derriere; fanny; ass; same as పిరుదులు;
పిరికితనం, pirikitanaM
-n.
--cowardice;
పిరుదు, pirudu
-n.
--rump; gluteus maximus;
పిలక, pilaka
-n.
--(1) tuft of hair;
--(2) offshoot of a plant such as a banana plant; sucker;
పిలవని పేరంటం, pilavani pEraMTaM
-ph.
--[idiom] uninvited guest at a party;
పిల్ల, pilla
-n. f.
--(1) daughter;
--(2) girl;
--(3) baby animal or bird when used as a suffix after the animal's name;
పిల్లకణం, pillakaNaM
-n.
--[biol.] daughter cell;
పిల్లనగ్రోవి, pillanagrOvi
-n.
--flute;
పిల్లలతల్లి, pillalatalli
- n.
-- Pink Mother of Thousands; Pink Butterflies; [bot.] Kalanchoe Pink Butterflies of the Crassulaceae family;
--దీని ప్రతి ఆకు అంచు (leaf margin) మీద ప్రతి నక్కునుంచి వచ్చే వేలాది లేత గులాబి రంగు చిట్టి ఆకులు తడినేలమీద పడి కొత్తమొక్కగా రూపొందుతాయి. అందుకే ఈ మొక్కని 'పింక్ మదర్ ఆఫ్ థౌజండ్స్' అనడం. సీతాకోక చిలుకలలగా ఉండే ఈ చిట్టి పింక్ ఆకుల్నిబట్టి ఈ మొక్క ను పింక్ బటర్ ఫ్లైస్ (Pink Butterflies) అని కూడా అంటారు;
పిల్లవేరు, pillavEru
-n.
--[bio.] secondary root;
పిల్లి, pilli
-n.
--cat;
---ఆడపిల్లి = pussy cat.
---పిల్లిపిల్ల = kitten.
---మగపిల్లి = tomcat;
---బావురుపిల్లి = tomcat;
-- [Sans.] పిల్లిని సంస్కృతంలో మార్జాలము అంటారు. 'మార్జనమ్' అంటే శుభ్రం చేసుకోవడము. కాబట్టి పిల్లి పేరులోనే ఉంది అది 'పరిశుభ్రమయినది ' అని.
పిల్లికళ్లు, pilikaLlu
-n.
--light or amber-colored eyes, rather unusual among Indians and generally considered to be a sign of ugliness;
పిల్లితేగ, pillitEga
-n.
--Climbing asparagus; [bot.] Asparagus recemosus; Phaseolus trilobus;
-- a medicinal root; సన్న ముళ్ళు కలిగిన దీని ఆకు పచ్చని కాండాన్ని పుష్పాలంకరణలో వాడతారు. దుంపలలాగా ఊరే దీని
వేళ్ళను పురుషుల శక్తి పెంపొందించే చికిత్సలలో వాడతారు;
-- పిల్లిపీచరగడ్డ; [Sans.] శతావరీ;
పిశాచం, piSAcaM
-n.
--ghost;
-- పిశాచం అంటే తీరని కోరిక ఉండి ఆయువు పూర్తి కానివి. వీటినే కామపిశాచి లేదా కామినీ అంటారు; కామం అంటే కోరిక. ఏదైనా కావొచ్చు. ఇవన్నీ శివుడిని (రుద్రుడిని)ఆశ్రయించి ఉంటాయి. దిక్కు లేని వాటికి దేవుడే దిక్కు కదా;
పిశితం, piSitaM
-n.
--meat; flesh;
పిశితాశి, piSitASi
-n.
--carnivore; meat eater; % ti e2t
ప్రియమైన, priyamaina
-adj.
--(1) costly; dear; expensive;
--(2) dear; lovable; adorable; (note) one of the words in English whose two meanings match the two meanings of the corresponding Telugu word, namely ప్రియమైన;
ప్రియతమా, priyatamA
-inter.
--Oh, dearest!;
ప్రియా, priyA
-inter.
--Oh, dear!;
ప్రియుడు, priyuDu
-n. m.
--lover; boy friend;
ప్రియురాలు, priyurAlu
-n. f.
--lover; girlfriend;
పీక, pIka
-n.
--(1) neck; front part of the neck;
--(2) butt of cigar or cigarette;
--(3) nipple of a baby's feeding bottle;
పీకు, pIku
-n.
--ache; pain with a pulling sensation;
-v. t.
--uproot; pull;
పీఠాధిపతి, pITAdhipati
-n.
--(1) chairman; chairperson;
--(2) head of a religious center such as the Shankaracharya of Sringeri Peetham;
పీఠిక, pIThika
-n.
--(1) preface; preamble; foreword; introduction;
--(2) throne;
-- గ్రంథరచనకు 'ఆధారము' అనే అర్థంలో ఈ పీఠిక అనే పదాన్ని వాడతారు; రచవల్లో ఆ రచన ఆకృతి దాల్చడానికి ప్రధాన కారణాలూ, రచనా సందర్భం మొదలైన వివరాలున్న భాగాన్ని పీఠిక అంటారు. గ్రంథరచనకు చేసిన ప్రయత్నాలు, పడిన కష్టాలు, సాఫల్యం మొదలైనవన్నీ ఇందులో చోటు చేసుకొంటాయి; కృతికర్త, కృతిభర్త, ప్రోత్సాహకులూ వాళ్ల వివరాలుంటాయి. అవన్నీ రచయితే స్వయంగా చెప్పేవి కావచ్చు, ఇతరులెవరైనా రచయిత కోరిక మీద వ్రాసినవీ కావచ్చు;
-- గ్రంథ ప్రారంభంలో కనిపించే తొలిపలుకు, ముందుమాట, భూమిక, ఉపోద్ఘాతం, పస్పశము, ప్రస్తావన, ఉపక్రమము, అవతారిక, నాంది introduction, preface, prelude, prologue, Preamble నే పీఠిక అని కూడ అంటారు;
-- గ్రంథం చివరిలో ఉపసంహారము, మలిపలుకు, చివరిమాట, భరతవాక్యం, epilogue, colophon, వీటిని ఉత్తర పీఠిక అంటారు;
పీడ, pIDa
-n.
--annoyance; suffering;
పీడకల, pIDakala
-n.
--nightmare; bad dream;
పీడనం, pIDanaM
-n.
--pressure;
పీడించు, pIDiMcu
-v. t.
--harass; bother; persecute;
పీతం, pItaM
-n.
--yellow;
పీత, pIta
-adj.
--yellow;
-n.
--crab; green crab; [bot.] Scylla serrata; blue crab; [bot.] Portunus pelagicus.
పీతి, pIti
-adj.
--polluted by stool; coprophagic;
---పీతి కుక్క = coprophagic dog; stool-eating dog.
పీతిరి గద్ద, pItiri gadda,
- n. the scavenger vulture;
-- [bio.] Neophron percnopterus;
పీన, pIna
-adj.
--fat; large; big;
పీనాహం, pInAhaM
-n.
--parapet wall around a well;
పీనుగు, pInugu
-n.
--corpse; dead body;
పీపా, pIpA
-n.
--barrel; a large cylindrical-shaped vessel to store liquids; (rel.) సీసా, బాన, తొట్టి;
పీల, pIla
-adj.
--lean; thin; slender;
పీలదత్తూర, pIladattUra
- n.
-- [bot.] Argemone mexicana; a medicinal plant used for treating "red spotting" among women; పిచ్చికుసుమ;
పీలి, pIli
-n.
--rudder; a device that shows the way to a ship;
పీలిక, pIlika
-n.
--rag; piece of cloth; thin strip of cloth;
పీల్చు, pIlcu
-v. t.
--suck; absorb; breathe; aspirate;
---పొగ పీల్చరాదు = no smoking.
---రసం పీల్చు = suck the juice.
---నీరు బాగా పీల్చుకుంటున్నాది = it is absorbing water a lot.
ప్రీతి, prIti
-n.
--love; affection; fondness;
ప్రీతిపాత్రుడు, prItipAtruDu
-n. m.
--favorite person;
%పుం - puM, పు - pu, ప్రా - prA, పు - plU
పుంఖం, puMkhaM
-n.
--base of an arrow; the feather-end of an arrow;
---పుంఖానుపుంఖంగా = one after another, as a stream of arrows.
పుంజము, piMjamu
- n.
-- a heap; a collection;
పుంజనేలలు, puMjanElalu
-n.
--lands cultivable under irrigation;
పుంజీ, puMjI
-n.
--a set of four items; especially four tamarind seeds in a children's game;
పుంజుకొను, puMjukonu
-v. i.
--gather strength; revive; improve; accumulate;
పుంత, puMta
-n.
--path; path used by cattle;
పుండాకోర్, puMDAkOr
- n.
-- thief; rowdy;
-- (ety.) పుండా అంటే మరాఠీలో దొంగ; -కోరు అన్న ప్రత్యయం పారశీకంలోని ఖువర్ నుండి వచ్చింది; అబద్ధాల కోరు, ఖూనీకోరు, దగాకోరు, దివాళాకోరు మొదలైన పదాల్లో కనిపించే కోరు ఇటువంటిదే;
పుండు, puMDu
-n.
--sore; boil; abscess; ulcer;
పుంభావ, puMbhAva
-adj.
--mature; masculine;
---పుంభావ సరస్వతి = a title given to male scholars; (note) Saraswati being a female goddess of knowledge, a male scholar cannot be compared to her without the qualifying adjective in front.
పుకారు, pukAru
-n.
--rumor;
పుక్కిటి పురాణం, pukkiTi purANaM
-n.
--folklore; lore; unsubstantiated knowledge handed down by word of mouth;
పుచ్చు, puccu
-adj.
--(1) infested with worms or parasites;
--(2) dry rot;
పుట, puTa
-n.
--page; page in a book; one side of a sheet in a book;
పుటము, puTamu
-n.
--fold; cup or hollow formed by a fold;
---నాసికాపుటము = the calix of the nose.
పుట్ట, puTTa
-n.
--anthill; anthill in which a snake lives; a pack;
---అబద్ధాల పుట్ట = a pack of lies.
---చీమల పుట్ట = anthill.
---పాముల పుట్ట = anthill in which a snake lives.
పుట్టకురుపు, puTTakurupu
-n.
-- cancer; కర్కటవ్రణము;
-- see also రాచకురుపు;
పుట్టగతులు, puTTagatulu
-n. pl.
-- hope for the future;
పుట్టగొడుగు, puTTagoDugu
-n.
--mushroom; see also కుక్కగొడుగు;
పుట్టముంగి, puTTamuMgi
-n.
--demure person; coy person; (lit.) a mongoose on an anthill;
పుట్నాలపప్పు, puTnAlapappu
- n.
-- dry-roasted (roasted in a sand-oven) garbanzo dal;
-- వేయించిన శనగపప్పు; మూకుడులో ఇసక వేసి, ఆ వేడి ఇసకలో శనగలు వేయిస్తారు;
పుట్టి, puTTi
-n.
-- (1) raft; a basket-like device to cross a river or stream; this is a basket built out of bamboo-like reeds and covered with animal skin; ఆరిగోలు; హరిగోలు;
-- (2) a volumetric measure used in pre-independent India; 1 పుట్టి = 20 తూములు = 80 కుంచములు;
పుట్టిన తేదీ, puTTina tEdI
-ph.
--date of birth;
పుట్టిన రోజు, puTTina rOju
-ph.
--birth day.
-- భారతీయ పద్ధతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పధ్ధతి:
ఓ ప్రియమైన మిత్రమా, ఈ పుట్టినరోజు నీకు ఎప్పటికీ ఐశ్వర్యాన్ని మరియు ఆనందాన్ని తెచ్చుగాక!
నీ దీర్ఘాయువు కోసం మేమంతా ప్రార్థిస్తున్నాము; దేవుడు నిన్ను ఎల్లప్పుడు రక్షించుగాక!
పుణ్యకర్మల ద్వారా నేవు కీర్తిని పొందుము; నీ జీవితం సార్థం అగుగాక!
పుణ్యం, puNyaM
-n.
-- (1) goodness; result of a good meritorious act; credit accumulated (in heaven) due to good deeds; (ant.) పాపం; (2) a water basin meant for birds; పక్షులకేర్పరచిన నీళ్ళతొట్టె;
పుత్రుడు, putruDu
-n. m.
--son; male child;
పుత్రిక, putrika
-n. f.
--daughter; female child;
పుద్గాలం, pudgAlaM
-n.
--mass; భారం; ద్రవ్యరాసి;
పుదీనా, pudInA
-n.
-- mint plant; mint leaves; mint; spearmint; mentha; [bot.] Mentha arvensis of the Lamiaceae family;
-- పుదీనా మొక్కలలో Field Mint, Pepper Mint, Spear Mint వంటి 20 కి పైగా జాతులున్నాయి.
పుదీనా కర్పూరం, pudInA karpUraM
-n.
--menthol; mint camphor;
పునర్ణవ, punarNava
-n.
--hogwood; [bot.] Boerhaavia diffusa;
-- Indigenous to India, this creeping weed contains boerhavic acid, potassium nitrate, and some tannins; the active ingredient is the alkaloid Punernavine; Ayurvedic medicine produced from this is supposed to help alleviate symptoms from prostate enlargement;
-- see also అటుకమామిడి; గలిజేరు; తెల్ల గలిజేరు;
పునర్వసు, punarvasu %updated
-n.
--(1) Beta Geminorum; Pollux; Yoga tara of the seventh lunar mansion; Brighter than Alpha Geminorum (Castor), representing a cluster of six stars;
--(2) The seventh of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) పొదరిండ్ల చుక్క;
పునరావృత్తం, punarAvRttaM
-n.
--repetition; all over again;
-- (note) పునరావృతం is not correct;
పునర్జాతం, punarjAtaM
-n.
--[bio.] regeneration; in biology this refers to the asexual process of growth or birth, such as a lizard growing its tail after it was cut;
పునరుక్తి, punarukti
-n.
--(1) repetition;
--(2) a figure of speech involving repetition;
---పునరుక్తి దోషం = futility of repetition.
పునరోత్పత్తి, punarOtpatti
-n.
--[bio.] reproduction; in biology, the word reproduction implies sexual reproduction;
పునశ్చరణ, punaScaraNa
-n.
--review; recall;
పునస్కారం, punaskAraM
-n.
-- (1) offering a "NamaskAraM;" నమస్కారాది అర్పణము; పునః కారము అంటే మరల చేయడం; (2) a component of worship; echo word used with పూజ;
పున్నమి, punnami
-n.
--full moon day;
పునాది, punAdi
-n.
--foundation;
పునాస పంట, punAsa paMTa
-n.
--third paddy crop; the crop that was sown when the Sun was in Pollux (పునర్వసు); (rel.) దాళువా;
పునిస్త్రీ, punistrI
-n.
-a woman whose husband is living;
పునుగు, punugu
-n.
--civetone, musk-like substance secreted by civet cats;
--see also జవ్వాది;
పునుగు పిల్లి, punugu pilli
-n.
--civet cat; toddy cat; [bio.] Paradoxurus hermaphroditus;
-- [note 1] పునుగు - పునుగు పిల్లి లేక మార్జారిక (Civet Cat) అనే జంతువు నుంచి సేకరించే సుగంధద్రవ్యం. దీనినే జవాది, జవాజి, జవ్వాజి, జవ్వాది, సంకు మదము అనే పలు పేర్లతో పిలుస్తారు. వేంకటేశ్వరునికి నిత్యం చేసే అలంకరణలలో సంకుమదం అలదడం కోసం తిరుమల కొండలమీద పునుగు పిల్లుల్ని ప్రత్యేకంగా పెంచుతారు.
-- [note 2] చట్టము అన్నా పునుగు చట్టము అన్నా పునుగు పిల్లి శరీరంలో ఉండే ఒక గ్రంథి లేక సంచి. దీనిని పిండి, పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని సేకరిస్తారు.
--ఇవి రాత్రివేళల్లో తిరిగే Viverridae కుటుంబానికి చెందిన పిల్లి తరహా జంతువులు. వీటిలో మొత్తం పన్నెండు ఉపజాతులున్నాయి. సుగంధభరితంగా ఉండే వీటి మదాన్ని సేకరించి సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీనినే సంకు మదము, జవ్వాజి, పునుగు వగైరా పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పరిమళభరితమైన, అత్యంత ఖరీదైన కాఫీ (Civet Coffee) ఈ పునుగుపిల్లుల నుంచి తయారు చేస్తారు. కాఫీ పళ్ళని (Coffee Berries) పునుగు పిల్లుల చేత తినిపించి, అవి విసర్జించిన కాఫీ గింజల (Coffee Beans) ను సేకరించి, శుభ్రపరచి, వేయించి, పొడిచేస్తారు. పరిమళభరితమైన ఈ కాఫీ ప్రపంచంలో అతి ఖరీదైన కాఫీ. చైనా, ఫిలిప్పీన్స్, వియత్‌నామ్ వంటి ఆసియా దేశాలలోని ధనికులు ఈ కాఫీ తాగుతారు.
పురస్కరించు, puraskariMcu
-v. t.
--keep in front; worship; give praise; honor;
పురస్కరించుకొని, puraskariMcukoni
-adv.
--in view of; in the light of; in the context of;
పురస్కారం, puraskAraM
-n.
--felicitation; expressing regard; honoring a person; (lit.) to place in front; to give importance; పురః అంటే ఎదుట; పురస్కారం అంటే ఎదుట ఉంచుట అని వాచ్యార్థం; (ant.) తిరస్కారం = తిరః కారం అంటే వెనకకు తిప్పి కొట్టడం;
పురాకృతం, purAkRtaM
-n.
--a deed done in an earlier life;
పురాణం, purANaM
-n.
--(lit.) one that is old;
--(1) epic story; large tale;
--(2) lore; knowledge handed down;
--(3) ancient books containing the legends and stories of Hindu gods; there are eighteen books in this category;
--- బ్రహ్మ పురాణం; పద్మ; విష్ణు; శివ; భాగవత; నారదీయ; మార్కండేయ; భవిష్యత్తోత్తర; ఆగ్నేయ; బ్రహ్మవైవర్త; లింగ; వరాహ; స్కాంద; వామన; మత్స్య; కూర్మ; గరుడ; బ్రహ్మాండ పురాణములు;
పురాతన, purAtana
-adj.
--old; ancient; The one at the beginning;
పురాతనజీవ యుగం, purAtanajIva yugaM
-n.
--Paleozoic era; a period of time in the early history of the planet Earth;
పురి, puri
-n.
--(1) twist; torsion; plait;
--(2) plume; fanned feathers of a bird; especially the train of a peacock;
--(3) silo to store grain;
--(4) town;
పురిశ, puriSa
-n.
--torque; short for పురిశక్తి;
పురిసెడు, puriseDu
- n.
-- the amount of liquid that can be scooped in the cup of a hand;
పురీషం, purIshaM
-n.
--feces; stool;
పురుగు, purugu
-n.
--(1) worm;
--(2) snake;
--(3) any insect or reptile;
పురుడు, puruDu
-n.
--delivery; child-birth;
పురుష, purusha
-adj.
--male;
- suff.
-- verbal suffix as in ప్రధమ పురుష, ఉత్తమ పురుష;
పురుషుడు, purushuDu
-n. m.
--male; male human;
పురుషార్థాలు, purushArthAlu
-n.
--the four designated responsibilities of a man; the four-fold desires of a human, namely, ధర్మం, అర్ధం, కామం, మోక్షం;
పురోభివృద్ధి, purObhivRddhi
-n.
--future growth; progress; advancement; see also అభివృద్ధి;
పురోహితం, purOhitaM
-n.
--priestly duty; (lit.) one that causes good in the future;
పురోహితుడు, purOhituDu
-n. m.
--priest officiating at religious ceremonies; (lit.) a person officiating at a religious ceremony (to cause good in the future);
పులస చేప, pulasa cEpa
- n.
--Hilsa; [bio.] Tenualosa ilisha of the Clupeidae family;
పుల్ల, pulla
-adj.
-- sour;
పుల్ల, pulla
-n.
--thin stick; twig;
--నిప్పు పుల్ల = match stick.
--పుల్ల పెట్టు = [idiom] sow seeds of discord.
పుల్ల బచ్చలి, pulla bacchali
-n.
-- Bladder dok; [bot.] Rumex vesicarius of the Polygonaceae family;
-- పప్పు లో వేసుకుంటే ఈ ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. కొందరు పాలకూర, తోటకూర వంటి పులుపులేని ఇతర ఆకుకూరలతో దీనిని పులుపుకోసం కలిపి కలగూరగా వండుకుంటారు;
-- చుక్క కూర;
పుల్లలు, pullalu
-n. pl.
--firewood;
పులి, puli
-n.
-- wild cat; panther;
--- కొండ పులి = cougar; mountain lion; puma; a wildcat of North America. No matter what you call it, it's still the same cat, the largest of the "small cats."
--- చిరుత పులి = leopard; [bio.] Panthera pardus;
--- చీతా = cheetah; [bio.] Acinonyx jubatus; the spotted wildcat of Africa; the fastest land animal;
--- జాగ్వారు = jaguar; a wildcat native to South America. [bio.] Panthera onca;
--- నల్లపులి = panther;
--- పెద్దపులి = tiger; [bio.] Panthera tigris;
--- బెబ్బులి = tiger; Bengal tiger; [bio.] Panthera tigris tigris;
---మంచు పులి = snow leopard. [bio.] Uncia uncia;
---మంచు కిరుబా; హిమ కిరుబా = snow leopard. [bio.] Uncia uncia;
-- ఒక తెఱఁగు చిఱుతకు తెలుఁగులో పొన్నాడ అని పేరు. ఈ విషయము మన నిఘంటువులలో వ్రాసినారు. కాని వర్ణన ఇవ్వలేదు;
పులిచంద్రాయులు, pulicaMdrAyilu,
- n.
-- [bio.] a bird seen in Andhra Pradesh;
పులిచింత, puliciMta
- n.
-- Indian sorrel; creeping woodsorrel; [bot.] Oxalis corniculata Linn. of the Oxalidaceae family;
-- a medicinal herb;
-- [Sans.] ఆమ్లపత్రికా; ఆమ్లికా; చుక్రికా;
పులిపెంజర, pulipeMjara
- n.
-- A certain venomous snake;
-- రక్త పెంజెరి = కాటుక రేకుల పొడ = Russell’s Viper; [bio.] Vipera russelli of the Viperidae family;
పుల్లెలు, pullelu
- n.
-- dinner plates made by sewing leaves together with tiny bamboo splinters;
-- పుల్లలతో కుట్టిన విస్తరాకులు; పుల్లాకులు; అడ్డాకులు;
పుల్లేరు, pullEru
-n.
--[bot.] Croton claviferum;
పువ్వు, puvvu
-n.
--flower;
పుష్కరం, pushkaraM
-n.
-- (1) 12 years; (2) In India a feast held once every twelve years at certain holy rivers such as the గోదావరి పుష్కరము, కృష్ణపు ష్కరము, etc.; (3) body of water;
పుష్కరిణి, pushkariNi
-n.
--lotus pond; a water tank on a temple premises;
పుష్కలం, pushkalaM
-n.
--plenty;
పుష్పం, pushpaM
-n.
--flower;
పుష్యమి, puShyami %updated
-n.
--(1) Delta Cancri; Asellus Australis; M44 in Cancer; Yoga tara of the eighth lunar mansion; located in the constellation Cancer;
--(2) The Beehive cluster; The eigth of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) పొట్లపు రిక్క; తొండరూపు రిక్క;
పుష్యరాగం, pushyarAgaM
-n.
--topaz; a silicate of Aluminum and Fluorine; Al2SiO4(F,OH)2;
పుష్టి, pushTi
-adj.
--well nourished; strong;
పుష్పిక, pushpika
- n.
-- colophon;
-- తాళపత్ర, ఇతర చేతివ్రాత గ్రంధాలలో చివరిలో కనిపించే గ్రంథరచయిత వివరాలు, గ్రంథరచనకు కారకులైనవారి వివరాలు, గ్రంథ రచనా కాలం, మొదలయిన వివరాలు కలిగిన పుష్పిక (colophon)లు ఆ గ్రంథానికి ఉత్తర పీఠికలు అవుతాయి;
పుస్తెలు, pustelu
-n.
--(1) a rope; a string; a thread; (2) a sacred thread, with two gold disks, tied around a bride's neck by the groom at a wedding ceremony;
-- మంగళసూత్రం; తాళి; తాళిబొట్టు; పసుపుకొమ్ము కలిగిన తాడు పసుపుతాడు.
-- పుస్తె + కమ్మ = పుస్తకం = తాడుతో కట్టిన తాటాకుల కట్ట; కమ్మ అంటే తాటాకు;
ప్లూటోనియం, plUTOniyaM
-n.
--[phy.] Plutonium, a radioactive element;
ప్లుతం, plutaM
-n.
--[prosody] a very long vowel taking three times the time taken by a short vowel to pronounce; although its occurrence is felt to be rare, indeed this occurs often at the end of words when emphasizing quantity or stressing inclusion as చాలా, కూడా, మీరూ, etc.
పూగీఫలం, pUgIphalaM
-n.
--betel nut;
పూచిక, pUcika
-n.
--a species of tall grass; [bot.] Aristida setacea;
పూజారి, pUjAri
-n.
--priest officiating at a temple;
పూట, pUta
-n.
--a portion of a day; a time of a day;
---పొద్దుటిపూట = during morning.
---మూడు పూటలు = three times a day, specifically morning, noon and evening.
---రాత్రిపూట = during night.
పూడి, pUDi
- suff.
-- a suffix to a village name if the village is adjacent to the flood plains of a river or stream; (note) the suffixes పూడి, పర్రు, తుర్రు, కుర్రు as suffixes to village names imply their location on progressively elevated grounds from a nearby river;
పూడిక, pUDika
-n.
--silt; fill; accumulation;
పూడు, pUDu
-v. i.
--silt-up; fill-up; close-up; accumulate;
పూడ్చు, pUDcu
-v. t.
--fill in; cover;
పూత, pUta
-n.
--(1) blooming; flowering
--(2) thrush; rash; tiny eruptions on the skin or tongue indicative of some disease;
--(3) coating; smearing;
పూతిగంధం, pUtigaMdhaM %e2t
-n.
--malodor; bad smell; foul smell;
పూనకం, pUnakaM
-n.
--possession by a spirit or goddess;
పూనిక, pUnika
-n.
--perseverance; determination; willingness to do something with determination; % to e2t
పూరకం, pUrakaM
-n.
--(1) filling in;
--(2) inhalation; filling in the lungs;
పూరణం, pUraNaM
-n.
--that which fills in; stuffing;
పూర్ణ, pUrNa
-adj.
--whole; full; complete;
పూర్ణచంద్రుడు, pUrNacaMdruDu
-n.
--full moon;
పూర్తము, pUrtamu
-adj.
--filled; full; complete; covered;
-n.
-- An act of beneficence, as digging a well or tank, planting a grove, building a temple, feeding the poor,
పూర్వం, pUrvaM
-n.
--earlier time; old times; formerly;
పూర్వపక్షం, pUrvapakshaM
-n.
--the former half; the first side of an argument or dispute; The first part of an argument, the prima facie argument or view of a question అని ఆప్టే నిఘంటువు.)
-- see also ఉత్తరపక్షం;
పూర్వపక్షం చేయు, pUrvapakshaM cEyu
-v. t.
--[logic] the act of refuting the first side of an argument with a counter argument;
-- మీమాంస శాస్త్రంలో ఒక విషయాన్ని నిర్ధారించడానికి, ముందుగా ఒక విషయాన్ని తీసుకుంటారు. ఆ తరువాత ఆ వాక్యానికి ఇదే అర్థమంటూ ఒక సమస్యని లేవనెత్తుతారు. ఆ తరువాత, ఆ అర్థానికి వ్యతిరేకంగా వాదిస్తారు. దీనిని పూర్వపక్షం అంటారు. తరువాత పూర్వపక్షంలో చెప్పిన దానిని ఖండిస్తూ మాట్లాడతారు. దీనిని ఉత్తరపక్షమంటారు.
---అతని వాదాన్ని పూర్వపక్షం చేసేను = I refuted his argument.
పూర్వ ఫల్గుణి, pUrva phalguNi %updated
-n.
--(1) Delta Leonis; Zosma; Yoga tara of the 11th lunar mansion; located in the constellation Leo;
--(2) The 11th of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) పుబ్బ;
పూర్వమీమాంశ, pUrvamImAMSa
- n.
-- పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస తత్వాలు, సనాతన హిందూ భావనలలో, ఆచరణల్లో పరిణామాన్ని (evolution) ని సూచిస్తాయి. పూర్వ మీమాంస, భగవంతుడికి వ్యక్తిత్వం (రాగద్వేషాలున్న పర్సనాలిటీ) ఉందని, మనం ఆయన్ని సంతోష పెట్టవలసిన అవసరం వుందని చెప్తుంది. అందుకు మనం చేయ వలసిన పనులు (కర్మ కాండలు), వాటిని చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుపుతుంది. వీటిని పాటించడం ద్వారానే ఆయనను చేరుకోగలమన్న భావన వ్యాప్తి చెందింది. అంటే నియమాలతో చేసే కర్మ కాండలే ముక్తికి మార్గమని చెప్పబడింది.
పూర్వరంగం, pUrvaraMgaM
-n.
--prologue; an overture;
పూర్వాంగం, pUrvAMgaM
-n.
--[music] bottom tetrachord; if an octave is divided into 12 keys (corresponding to a musical keyboard), the four keys designated by "ri" and "ga" constitute the bottom tetrachord in Indian music;
పూర్వాపేక్షితాలు, poorvaapEkshitaalu,
- n. pl.
-- pre-requisites;
పూర్వాభాద్ర, pUrvAbhAdra %updated
-n.
--(1) Alpha Pegasi; Markab; Yoga tara of the 25th lunar mansion; located in the constellation Pegasus;
--(2) The 25th of the 27-star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) ఎనిమిది కాళ్ల చుక్క;
పూర్వాషాడ, pUrvAShADa %updated
-n.
--(1) Delta Sagittarii; the stars Delta and Epsilon of Sagittarius; Kaus Media; Yoga tara of the 20th lunar mansion; located in the constellation Sagittarius;
--(2) The 20th of the 27-star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) నీటి రిక్క;
పూరించు, pUriMcu
-v. t.
--(1) complete;
--(2) fill out;
పూరి, poori
-n.
-- dry grass; hay;
పూరిల్లు, poorillu
- n.
-- a thatched-roof house with mud walls;
పూర్తిచేయు, pUrticEyu
-v. t.
--finish; conclude;
పూర్వులు, pUrvulu,
-n. pl.
--forebears; ancestors;
--(note) పూర్వీకులు is not correct usage;
పూస, pUsa
-n.
--(1) bead;
--(2) vertebrae;
---ముడ్డి పూస = coccyx, the bottom-most part of the spine formed by the fusion of four vertebrae.
---నల్ల పూస = a small black bead.
---నల్ల పూసల దండ = necklace of black beads traditionally worn by Hindu married women whose husbands are still alive.
---వెన్న పూస = a bead of butter.
---వెన్ను పూసలు = spinal vertebra.
%పృ - pR, పె - pe, పే - pE, పై - pai
పృక్వకం, pRkvakaM
-n.
--[anat.] pancreas; క్లోమం;
పృచ్ఛకం, pRcchakaM
-n.
--query; question;
పృచ్ఛకుడు, pRcchakuDu
-n.
--questioner; this word is often used to refer to a person who asks questions in a literary gymnastic, called అష్టావధానం, that is very peculiar to Telugu language only.
పృధివి, pRdhivi
-n.
--the Earth;
పెంకి, peMki
-adj.
--rambunctious; mischievous;
పెంకు, peMku
-n.
--(1) tile;
--(2) roof-tile;
--(3) a broken fragment of a pot;
---గాజుపెంకు = broken piece of glass.
---చిల్లపెంకు = broken piece of pottery.
---బంగాళాపెంకు = Bengal roof-tile.
---బిళ్లపెంకు = flat roof-tile.
---నాటుపెంకు = native roof-tile.
పెంచు, peMcu
-v. t.
--raise; rear; grow; enhance; (ant.) త్రుంచు;
పెంజెర, peMjera
-n.
--a species of snake;
పెంట, peMTa
-n.
--garbage; compost;
పెంటపోగు, peMTapOgu
-n.
--compost pile;
పెంటమ్మ,peMTamma
- n.
-- name of a village goddess;
-- (ety.) పెంటి + అమ్మ = young + mother;
పెంటి, peMTi
-adj.
--(1) female of a species; (2) young; (ant.) పోతు;
---పెంటి ఏనుగు = she elephant.
పెంటిక, peMTika
-n.
--(1) hard stool in the shape of small marbles;
--(2) goat's stool;
పెండలం, peMDalaM
-n.
-- Greater yam; Lesser yam; a type of yam, a root vegetable with over 600 sub-varieties with only about ten that are edible; the above-ground part of this plant is a creeper; [bot.] Dioscorea alata; In Greek, "alata" means "winged" or "ribbed";
-- పెద్ద పెండలం = Greater yam; [bot.] Dioscorea alata; this creeper twists in a right-handed helical pattern;
-- చిన్న పెండలం = Lesser yam; [bot.] Dioscorea esculentum; In Latin esculentum means suitable for food; this creeper twists in a left-handed helical pattern;
-- విష పెండలం = poisionous yam; [bot.] Dioscorea daemona; (note) Kautilya referred to this in his ArthaSastra;
-- అడవి పెండలం = wild yam; [bot.] Dioscorea persimilis;
--[Sans.] అలూకం; పిండాల్ (పిండ + ఆలు) > పెండలం;
పెండ్లి, peMDli
-n.
--wedding; the marriage celebration; wedding is the ritual and marriage is the institution of a man and woman agreeing to live together as man and wife; wedding takes place on one day, marriage lasts much longer.
పెండ్లి పిలుపు, peMDli pilupu
-n.
--wedding invitation; పెళ్లి పిలుపు;
పెండె, peMDe
-n.
--cross-beam; transverse rafter from tthe (main) beam of a house; see also వాసం;
పెండెకట్టు, peMDekaTTu
-n.
--(1) lath; a narrow thin strip of palm leaf stem used for tying scaffoldings and other building parts;
--(2) a knot binding two poles or rafters (usually of bamboo) using long strips of bark obtained from bamboo or a palm tree;
పెడ, peDa
-adj.
--rear; backward; posterior;
--(2) sideways;
--(3) strange; wrong;
-n.
--(1) bunch or cluster of fruits; (esp.) bananas;
--(2) side; note that పెడ is really a side of a గెల; see also ఎడ, పెడ;
పెడగాలు, peDagAlu
-adj.
--a leg which is folded sideways;
పెడచెవి, peDacevi
-adj.
--back part of the ear;
పెడచెవినిపెట్టు, peDacevinipeTTu
-v. i.
--decline to listen; ignore; show indifference;
పెడముఖం, peDamukhaM
-n.
--askance; looking sideways; not showing interest; not agreeing;
పెడసరం, peDasaraM
-n.
--stubbornness; arrogance;
పెణక, peNaka
-n.
--the bottom edge of a sloping roof;
పెత్తందారు, pettaMdAru
-n.
--manager;
పెత్తనం, pettanaM
-n.
--authority; power to act; power to manage; (ety.) పెద్ద + తనం;
పెత్తనాలు, pettanAlu
-n. pl.
--wanderings; paying visits;
పెత్తల్లి, pettalli
-n. f.
--elder sister of one's mother; (lit.) elder mother;
పెదవి, peDavi
-n.
--lip; edge; border;
పెద్ద, pedda
-adj.
--big; large; elder; older; adult; (rel.) చిన్న; బుల్లి; బుచ్చి; చిట్టి;
-n.
--adult; senior; leader; judge;
---ఊరి పెద్ద = village elder.
---పెద్ద వెంకట్రావు = Venkatrao, Sr.
---పెద్దమనిషి = gentleman; lady; an elderly person; respectable person.
---పెద్దపీట = a seat of honor.
పెద్ద అత్తిపత్తి, peda attipatti
-n.
-- Black Mimosa; Giant Sensitive Plant; Bashful Plant [Bot.] Mimosa pigra of the Fabaceae family;
-- ఇది తడి నేలలలో పెరిగే బెడద మొక్క (Invasive Plant). పదునైన ముళ్ళు కలిగి త్వరత్వరగా వ్యాపించి, పొదలా పెరిగే ఈ చెట్టు ఆకులు అత్తపత్తి (Touch - me- not or Mimosa pudica) ఆకులలాగే స్పర్శ తగలగానే సిగ్గుతో ముడుచుకుపోతాయి. అయితే అత్తపత్తి కంటే ఈ మొక్క పెద్ద పొదలాగా అనుకూల పరిస్థితులలో వృక్షంలాగా కూడా పెరుగుతుంది. ప్రపంచంలో వ్యవసాయదారుల పాలిట శాపంగా మారిన చకచకా పెరిగే 100 బెడద మొక్కలలో ఇది ఒకటిగా పేరొందింది. నల్ల తుమ్మ బెరడు లాగే ఈ మొక్క బెరడులోనూ టానిన్లు (Tannins) ఉన్న కారణంగా తోళ్ళు ఊనడం కోసం వినియోగించడం, వేరు కంతులలో నత్రజని స్థిరీకరించే కారణంగా భూసారాన్ని పెంచేందుకు తోడ్పడటం మినహా ఈ మొక్కలకు ప్రత్యేకించి ప్రయోజనాలు ఏవీ లేవు. ఈ మొక్క తొట్టతొలి జన్మస్థలం మధ్య అమెరికాలోని మెక్సికో ప్రాంతం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ మొక్కని వియత్నమీస్ థార్న్ (Vietnamese Thorn) అంటారు. అత్తపత్తి లాగే లేత పింక్ రంగు పూలు, ముడుచుకుపోయే స్వభావం కలిగిన ఆకులు కలిగి ఉండటాన్నిబట్టి జనం దీనిని 'పెద్ద అత్తపత్తి' అంటున్నారు.
పెద్దరికం, peddarikaM
-n.
--guardianship; leadership; statesmanship; acting responsibly as an elder;
పెద్దలు, peddalu
-n. pl.
--elders; wise men;
పెనం, penaM
-n.
-- skillet; frying pan; a shallow pan with slanted sides. Skillets are commonly used to stir-fry or sauté, which refers to a method of cooking in which ingredients are cooked quickly in a small amount of oil or fat, often over relatively high heat.
-- griddle; gridiron; flat frying pan typically used for making pancakes;
పెరుగు, perugu
-n.
--curds; (rel.) yogurt; sour cream;
-- పెరుగుని లాక్టోబాసిలస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు; [Sans.] దధి;
-v. i.
--(1) grow; develop;
--(2) elongate; euphemism for a broken thread, because saying "the sacred thread of a woman is broken" is the same thing as saying that the woman is widowed;
---మంగళసూత్రాలు పెరిగిపోయాయి = the scared necklace-string is broken.
పేడు, pEDu
-n.
--piece of firewood; splinter; wood chip;
పేత, pEta
-n.
--prickly heat; extremely fine-textured and harmless skin rash caused by excessive heat and humidity;
పేద, pEda
-adj.
--poor;
పేదరాలు, pEdarAlu
-n.
--poor woman;
పేదరికం, pEdarikaM
-n.
--poverty; [ety.] పేద + రికం;
పేదవాడు, pEdavADu
-n. m.
--poor man;
పేనా, pEnA
-n.
--pen; fountain pen, as opposed to a quill pen that comes with an ink bottle;
పేను, pEnu
-n. s.
--louse; head louse;
పేను, pEnu
-v. t.
--entwine; twist; the act of twisting threads together to get a heavier thread;
పేము, pEmu
-n.
--cane; rattan cane; a bushy vine with thick woody growth; this grew all over India and its wood was used to make prized furniture; now rarely seen and is probably near extinction, due to overexploitation and habitat destruction; [bot.] Calamus rotang;
పేరు, pEru
-n.
--(1) name; a string of alphabetical characters;
--(2) reputation; status in a society;
--(3) a string of beads or coins; an item with a number of similar things strung together as in కాసుల పేరు; మాల; దండ;
---ఇంటి పేరు = family name; surname; last name.
---పెట్టిన పేరు = given name.
---పుట్టింటి పేరు = maiden name.
పేలు, pElu
-v. i.
--explode;
---అది పేలుతుంది జాగ్రత్త = it will explode, be careful.
పేలుడు, pEluDu
-n.
--explosion;
పేల్చు, pElcu
-v. t.
--detonate; fire; explode;
---టపాకాయలు పేల్చు = detonate the firecrackers.
పేషీ, pEshee
- n.
-- office; place of work;
-- కార్యాలయం; కచేరీ; ఒకరి ముందు హాజరు కావడం; కోర్టులో, అధికారిముందు, పోలీసు స్టేషన్లో;
-- రాజుగారి పేషీలో ప్రజల సమస్యల అర్జీలను స్వీకరిస్తారు;
ప్రేమ, prEma
-n.
--love; passion; (ant.) పగ;
ప్రేరణ, prEraNa
-n.
--inspiration; motivation;
-- ప్రేరణ అనేది బాహ్యంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం. ఉదా: మందర ప్రేరణ వల్ల కైక బుద్ధి చెడింది.
ప్రేరణ కారణం, prERaNa kAraNaM
-ph.
--motivating reason;
ప్రేరణార్థకం, prEraNArthakaM
- n.
-- a transitive verb form to describe an action prompting another person to it; see also ఆత్మార్థకం;
-- మరొకరిచేత చేయించేది; ఉదా: చదివించు;
పైజమాలు, paijamAlu
-n. pl.
--pajamas; in modern usage pajamas refers to both the top and bottom half of a nightdress; (ety.) Persian, పై = foot or leg; జమా = garment;
పైట, paiTa
-n.
--a woman's mantle; loose hanging end of a sari formed by throwing the end of the cloth over the breasts and shoulder;
పైటపిన్ను, paiTapinnu
-n.
--brooch;
పైడి, paiDi
-n.
--gold;
పైడిగంట, paiDigaMTa
-n.
--an owl-like bird; this bird's cry or hoot is considered a good omen;
పైత్యపుబెడ్డలు, paiTyapubeDDalu
-n.
--gall stones; stones formed in the gallbladder;
పైత్యరసం, paityarasaM
-n.
--[med.] bile; the secretion of the gallbladder;
పైన, paina
- adj.
-- (1) outside; (2) upstairs;
పైత్యం, paityaM
- n.
-- (1) a medical condition of discomfort produced by excessive production of bile; one of the three balancing conditions for health, according to Ayurveda; (2) madness; delirium; imbecility;
పైత్యోద్రేకం, paityOdrEkaM
-n.
--biliousness; A term used in the 18th and 19th centuries pertaining to bad digestion, stomach pains, constipation, and excessive flatulence (passing gas);
పైన, paina
-p.p.
--above; on; over; (ant.) కింద;
పైను, painu
-n.
--pine; fir; [bot.] Pinus longifolia; Pinus roxburghii, this pine grows in the Himalayas; this is the source of turpentine and the charcoal used in fireworks;
పైపెచ్చు, paipeccu
-adv.
--on the top of; besides; in addition to;
పైపెచ్చు, paipeccu
-n.
--upper crust;
పైపై, paipai
-adj.
--superficial; cursory;
పైరవీ, pairavee
- n.
-- the practice of resorting to pressurizing people in important positions to get decisions made in one’s favor without any regard for the procedures or ethics;
-- పలుకుబడిని ఉపయోగించి వెంటపడి పని సాధించుకొనుట.
పొంగలి, poMgali
-n.
--rice cooked in milk; rice cooked in milk and green gram;
--- చక్కెర పొంగలి = rice cooked in milk and green gram with added sugar;
పొంగు, poMgu
-v. i.
--(1) rise in level; surge; (ant.) కుంగు;
--(2) rise with effervescence; boil;
--(3) chicken pox;
పొంగు, poM-gu
-n.
--measles; an contagious disease;
పొంత, poMta
-adj.
--near;
పొంత, poMta
-n.
--neighborhood;
పొంతనం, poMtanaM
-n.
--conjunction; the conjunction of planets; % to e2t
పొందు, poMdu
-v. i.
--get; obtain;
పొక్కించడం, pokkinchaDaM
- n.
-- the art of making a (citrus fruit) pickle by cooking (instead of, say, sun-drying or other methods);
పొక్కు, pokku
-n.
--blister; eruption; (note) పక్కు is scab;
పొగ, poga
-n.
--smoke;
పొగచుట్ట, pogacuTTa
-n.
--cigar; (lit.) a smoking roll;
పొగడ, pogaDa
-n.
--coral tree; Bulletwood Tree; [bot.] Mimusops elengi of the Sapotaceae family;
-- ‘ఎలెంజి’ అనేది దీని మలయాళీ పేరు యొక్క లాటిన్ రూపం; మలయాళంలో ‘ఇలాంజి’ లేక ‘ఎలాంజి’ అంటారు;
-- పొగడ చెట్టు పెద్ద సతతహరిత (ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే) వృక్షం. ఇది అరుదుగా 120 అడుగుల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. మొదలు చుట్టుకొలత 9 అడుగులుండే వృక్షాలు కూడా అక్కడక్కడా కనుపిస్తాయి. దీని కాండం ముదురు చాక్లెట్ రంగులో నెర్రెలు విచ్చి ఉంటుంది. చెట్టంతా ఎప్పుడూ ఆకులు ఒత్తుగా ఉంటాయి. అందుకే నీడనిచ్చే వృక్షాలలో పొగడది ఓ ప్రత్యేకమైన స్థానం.
పొగడ్త, pogaDta
-n.
--praise; (ant.) తెగడ్త;
పొగడ్తలు, తెగడ్తలు, pogaDtalu tegaDtalu
-ph.
--[idiom] praise and criticism; bouquets and brickbats;
పొగతాగు, pogatAgu
-v. i.
--smoke; as in smoking a cigarette;
పొగపట్టు, pogapaTTu
-v. t.
--smoking; as in smoking a fish or meat; as in smoke escaping into the living quarters;
పొట్ల, poTla
-n.
-- గుజ్జు పొట్ల, పొడుగు పొట్ల, లింగ పొట్ల = snake gourd; [bot.] Trichosanthes anguina of the Cucurbitaceae family;
-- అడవి పొట్ల, చేదు పొట్ల = [bot.] T. cucumerina;
-- పిచ్చుక పొట్ల = pointed gourd; [bot.] T. dioica; dioica అంటే ఆడ పూలు, మగ పూలు వేర్వేరు మొక్కలకి పూసేవి అని అర్థం;
-- [Sans.] చిచిణ్డా; పటోలికా;
పొట్టి, poTTi
-adj.
--short; not tall;
పొట్టు, poTTu
-n.
--chaff; skin from cereal grains;
పొట్టుతీసిన, poTTutIsina
-adj.
--decorticated; without the outer skin (of cereal grains);
పొట్టేలు, poTTElu
-n.
--ram; Aries; male sheep;
పొడ, poDa
-n.
--(1) proximity;
--(2) glance;
---ఎండ పొడ = within the glancing reach of sun; in the proximity of sunshine.
---వాడి పొడ వీడికి కిట్టదు = he does not like the other's proximity.
పొడచూపు, poDachUpu
- v. i.
-- to appear; to arise; to become visible;
పొడపత్రి, poDapatri
-n.
-- Gymnema; [bot.] Gymnema sylvestre Racemosa;
-- This is supposed to be an effective diabetic medicine; Is available in Ayurvedic and Homeopathic stores in India;
--[Sans.] మేషశృంగి; మధునాశని; [Hindi] గుర్మార్;
పొడి, poDi
-adj.
--dry; (ant.) తడి;
పొడి, poDi
-n.
--(1) powder;
--(2) a value-less card in a card game;
--(3) a generic name for a precious or a semi-precious stone, particularly when used in jewelry; pl. పొళ్లు;
పొన్నగంటికూర, ponnagaMTikUra
-n.
-- 1. Sessile Joyweed; [bot.] Alternanthera sessilis; an edible green that grows wild in the Indian countryside;
-- 2. A certain pot-herb called Achyranthes triandra; 3. A medicinal plant called Illecebrum sessile; ముత్స్యాక్షి.
-- ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి.
పొన్నచెట్టు, ponnaceTTu
-n.
--Alexandrian laurel; Beauty Leaf; Indian Laurel; Laurel Wood; Ball Tree; Beach Calophyllum; a tree with scented yellow flowers; [bot.] Calophyllum inophyllum;
-- ఈ ఆకర్షణీయమైన పూలు పూజకు, కాయలనుండి వచ్చే నూనె ఔషదాలకు, ఈ పూలచెట్టు కలప వ్యవసాయ పనిముట్లకు వాడతారు;
-- ఈ లాటిన్ పేరుకు మూలం ‘కాలోస్’ (అందమైన), ‘ఫిల్లం’ (ఆకు) అనే గ్రీకు పదాలు. పొన్న చెట్టు అందమైన ఆకులనుబట్టి దానికి ‘కాలో ఫిల్లం’ అనే పేరు వచ్చింది. గ్రీకు భాషలో ‘ఐనోస్’ (inos) అంటే ‘బలమైన’ అని అర్థం. దీని బలమైన, పెద్ద ఆకుల్నిబట్టి దీనికి ‘ఐనో ఫిల్లం’అనే పేరు వచ్చింది;
పొన్నారి, ponnAri
-adj.
--golden; beautiful;
---చిన్నారి, పొన్నారి = young and beautiful.
పొన్ను, ponnu
-n.
--(1) metal collar; metal tip;
-- (2) gold;
పొన్నుకర్ర, ponnukarra
-n.
--metal tipped cane;
పొయ్యి, poyyi
-n.
--hearth; a wood-burning fireplace for cooking food; traditionally built with three stones;
-- see also కుంపటి; దాలి; అధిశ్రయిణి; అంతిక;
పొర, pora
-n.
--(1) membrane;
--(2) layer; stratum;
పొరక, poraka
- n.
-- (1) broom; broomstick;
-- (2) a blade of grass;
-- (3) the rib of a leaf;
పోకచెట్టు, pOkaceTTu
-n.
--betel-nut palm; [bot.] Areca catechu;
-- Areca palm, which is different is also known as Golden cane palm, Yellow palm, Butterfly palm with the scientific names [bot.] Dypsis lutescens, Chrysalidocarpus lutescens;
పోడు వ్యవసాయం, pODu vyavasaayaM
- n.
-- shift cultivation;
-- ప్రతిఏటా కొత్త చోట అడవి నరికి వ్యవసాయం చేయటం; ఆనాటి 1882 మద్రాసు ఫారెస్ట్ యాక్ట్ గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోకుండా నిషేధించింది. దానికి వ్యతిరేకంగానే అల్లూరి సీతారామరాజు ఉద్యమించాడు;
పోతు, pOtu
-n.
--male animal; male bird;
---దున్నపోతు = he buffalo.
---పోతుటీగ = male fly.
---పోతుపిల్లి = tom cat.
పోతు పేరంటం, pOtu pEraMTaM
-ph.
--(coll.) a male in an otherwise female company;
పోపు, pOpu
-n.
--temper; a characteristically special step of spicy seasoning in Indian cooking; this step, usually the last, involves boiling a spoonful of oil with mustard seed, dried red chilies, curry leaves, etc. dumping the hot stuff in already cooked vegetables, or soups;
-- పోపు ఎందుకు వేస్తారు? నూనె ఎమోలియంట్, అంటే ఒక్క చుక్క వేగముగా పరుచుకోగలదు! మంచి సాల్వెంట్, అంటే ఆర్గానిక్ పదార్ధాలని సులువుగా తనలో విలీనము చేసుకోని ఆ పదార్ధము మూలలలోకీ తీసుకెళ్ళగలదు! అంటే పోపులోని కరివేపాకు లేదా ఇంగువ తమతమ సువాసనలను మంచి గుణాలనూ కూరలోని అన్ని చోటలకు మోసుకెళ్ళ అశక్తులు, ఇక్కడ నూనె ఆపని చేయించిపెడుతుంది!
-- తిరుగబోత; పోణీ; తాలింపు; తడకా;
పోపు పెట్టడం, pOpu peTTaDaM
-v. t.
--tempering; the act of adding temper to a cooked dish; the process involves boiling about two tablespoons of oil in a saucepan, adding mustard seeds, halved red chilies, and possibly cumin and fenugreek seeds, and curry leaves; when mustard seeds begin to splutter, the whole boiling mixture is added to previously cooked vegetables or soups which produces a characteristic sound and pungent odor that lingers on for a while;
పోబడి, pObaDi
-v. i.
--expense;
పోరంబోకు భూములు, pOraMbOku bhUmulu
-n.
--uncultivable waste lands;
-- ఏ ప్రయోజనం లేకుండా , నిరుపయోగంగా ఊరి బయట పడియున్న ఖాళీ స్థలాలకు ద్రవిడ భాషల్లో "పోరంబొక్కు" అన్న పదం ఉన్నది;
పోరా, పో!,
-inter.
--beat it!; scram!; go away!; get lost!;
పోలిక, pOlika
-adj.
--resemblance; similarity; likeness; taking after in physical resemblance;
పోలేరమ్మ,pOlEramma
- n.
-- the name of a village goddess; the goddess that guards the boundary;
-- (ety.) పొలిమేర + అమ్మ = పొలిమేరమ్మ = పోలేరమ్మ; village boundary + mother;
పోలీసు, pOlIsu
-n.
--police;
పోలు, pOlu
-v. i.
--resemble;
పోల్చు, pOlcu
-v. t.
--compare; liken;
పోవు, pOvu
-v. i.
--go; proceed;
పోషక, pOshaka
-adj.
--nutritious;
పోషకాలు, pOshakAlu
-n.
--nutrients; nourishments;
పోషకుడు, pOshakuDu
- n.
- patron; supporter;
పోషించు, pOshiMcu
-v. t.
--(1) nourish; (2) patronize;
పోహ, pOha
-n.
--concept; (ant.) అపోహ;
పోహన, pOhaNa
-n.
--fact; occurrence;
ప్రోచు, prOchu
- v. t.
-- protect;
---బ్రోచేవారెవరురా is incorrect usage; it should be ప్రోచేవారెవరురా. "ప్రోచేవారెవరురా నిను వినా రఘువరా
నను బ్రోచేవారెవరురా" అన్నప్పుడు నను లేక నన్ తఱువాత వచ్చే ప్రోచేవారు నను బ్రోచేవారు అవుతుంది. మొట్టమొదటనే బ్రోచేవారు అని ఆరంభించుట తప్పు.
ప్రోత్సాహం, prOtsAhaM
-n.
--encouragement;
ప్రోద్బలం, prOdbalaM
-n.
--active support;
---మీ ప్రోద్బలం వల్లే ఎన్నికలలో నిలబడ్డాను = I ran for the office only because of your active support.
ప్రోది, prOdi
- n.
-- patronage; cherishing; support;
పౌడరు, pauDaru
-n.
--powder; talcum powder; face powder;
పౌరుష, paurusha
-adj.
--pref. one created by man; artificial;
---వేదములు అపౌరుషేయములు = the Vedas are not created by man; Vedas are supra-mental.
---పౌరుష రసాయనం = synthetic chemistry.
---పౌరుష ఉత్తేజకాలు = amphitamines; synthetic stimulants.
పౌరుష, paurusha
-adj.
--synthetic; artificial;
పౌరుషం, paurushaM
-n.
--(1) courage; manliness;
--(2) artificially created by man;
పౌరోహిత్యం, paurOhityaM
-n.
--priesthood; office of the family priest;
Part 3: ఫ = pha
ఫంగస్, phaMgas
-n.
--[bot.] fungus; శిలీంధ్రం;
ఫక్తు, phaktu
-adv.
--merely; only;
ఫకీరు, phakIru
-n.
--(1) muslim religious mendicant;
--(2) destitute person; poor person;
ఫక్కీ, phakkI
-n.
--manner; style; fashion;
ఫణిజాకం, phaNijAkaM
-n.
--marjorum; తెల్ల మరువం;
ఫణితి, phaNiti
-n.
--manner; style; fashion;
ఫర్మానా, pharmAnA
-n.
--written order; royal mandate;
ఫలోజు, phalOju
-n.
--fructose; a type of sugar commonly found in fruits;
ఫలోత్పాదన, phalOtpAdana
-n.
--efficiency;
ఫసలీ, phasalI
-adj.
-- In India it is the period from July 1 to June 30; official revenue year;
ఫాంటు, phaMTu
-n.
--font, the artistic style in which the script of a language is set for printing or typing. The Sans Serif is a popular font in English printing. The Elite font is quite popular with typewriters. The type of Telugu lettering popularized by Bapu can be called, for example, the Bapu font.
ఫాయిదా, phAyidA
-n.
--profit; gain;
ఫారం, phAraM
-n.
--a form; a pre-formatted document that needs to be filled in by an applicant;
ఫాలం, phAlaM
-n.
--forehead;
ఫికరు, phikaru
-n.
--trace; clue;
ఫిడేలు, phiDElu
-n.
--fiddle; violin; any stringed instrument of the violin class;
ఫిదా, phidaa
- n.
-- yield; submission; I am at your service; I give up;
-- ఫిదా అంటే లొంగిపోవు, అభిమాని ఐపోవు; ఫిదా అనగా దాసోహం/ దాసి/ దాసుడు; ఒకరిమీద అత్యంత మోజు పడటం. తనివితీర ఇష్టపడటం (Diehard fan);
-- అతని పాటకి అంతా ఫిదా అయారు;