మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి, బాగా మరిగించాలి.
సగ్గుబియ్యం పోసి స్టౌ మంట తగ్గించాలి.
మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి.
సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి, రంగు లేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టి పాత్రను కిందికి దించి, పచ్చి మిర్చిపేస్ట్, ఉప్పు, జీల కర్ర, నువ్వులు వేసి కలపాలి.
చల్లారాక ఎండలో గ్లాస్కో పంచె మీద కావలసిన సైజులో వడి యాలు పెట్టాలి.
బాగా ఎండిన తరువాత వీటిని వేయించుకుని స్నాక్స్‌లా కాని, సాంబారు అన్న ంలో కాని నంచుకుని తింటే బాగుంటాయి.