సగ్గుబియ్యము వడలు
కావలసిన వస్తువులు :
- 1. అరకప్పు సగ్గు బియ్యము
- 2. బియ్యపు పిండి పావుకేజి
- 3. ఉల్లిపాయ - 1
- 4. పచ్చిమిరపకాయలు - 3
- 5. కరివేపాకు కొంచం
- 6. జీలకర్ర తగినంత
- 7.రిఫైన్ద్ ఆయిల్ పావుకేజి
- 8. చిన్న అల్లం ముక్క
- 9. ఉప్పు తగినంత
తయారు చేయుపద్ధతి :- ముందుగా సగ్గుబియ్యము ఒక గంట నానబెట్టిన తరువాత, ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యపు పిండి వేసి దానిలో నానబెట్టిన సగ్గుబియ్యము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన 4 లేదా 5 ఛిన్న అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేడి నీళ్ళతో ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ లో ఆయిల్ వేసి , ఆ నూనె కాగిన తరువాత కలుపుకున్న పిండిని చిన్నచిన్న వడలు లాగా ఒత్తుకుని బాండీ లో వేసి ఎర్రగా కాలగానే తియ్యాలి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.