సర్వదర్శన సంగ్రహం/బౌద్ధ దర్శనం

2.1 తదుత్పత్తి ద్వారానే అవినాభావసంబంధము యొక్క జ్ఞానము కలుగుతుంది. శాస్త్రాలలో ఇదే చెప్పబడినది. "నిప్పు (కారణము) మరియు పొగ (ప్రభావం) ల మధ్య ఉన్న విడదీయలేని సంబంధము నుండో, లేదా, గుర్తింపే నిర్ధారకము గా పరిగణించినపుడో, కలిగే ఫలితమే అవినాభావసంబంధము యొక్క సూత్రము. అంతే కానీ, ఇటువంటి సందర్భాలలో కేవలం కావలసిన ఫలితాన్ని గమనించటం వలనో, లేదా, ఇటువంటివి కాని సందర్భములలో ఫలితాన్ని గమనించకపోవటం వలనో కలుగదు."

2.2 ఎక్కడ పొగ యొక్క బలం ఉన్నదో, అక్కడ అగ్నికి కూడా బలం ఉంటుంది. ఎక్కడ అగ్ని లేదో అక్కడ పొగ లేదు. ఇటువంటి అన్వయ వ్యతిరేక ప్రమాణాలకు అనుసరించి కూడా నిప్పు మరియు పొగల మధ్యనున్న అవినాభావ సంబంధం యొక్క నిర్ధారణ జరుగవచ్చును. అనిశ్చితి మన వ్యవస్థలో తప్పదని తెలిసినపుడు "ఏ కారణం లేకుండానే ఫలితం వస్తుంది అనే వాదన దానికై అదే విమర్శాత్మకం." ఇటువంటి సందర్భాలలో "ఆచరణాత్మక అసంబద్ధతను దూరం కాని సందేహాలనే నివృత్తి చేయాలి" అని అనరాదు .అందుకే, ఎక్కడైతే ఆచరణాత్మక అసంబద్ధత ఉందో, అక్కడ సందేహానికి చోటు ఉండదు అని అంటారు. దీని ఉత్పత్తి నిశ్చయం ద్వారానే ధూమము మరియు వహ్ని యొక్క అవినాభావ సంబంధము నిర్ధారించబడుతుంది. అవగాహన ప్రజ్ఞానాజ్ఞాల వలన ఆచరణకు కారణాలను అన్వేషించటం, అల్ప విషయానికి అవినాభావ సంబంధాన్ని ఆపాదించటం వంటివి ఉద్భవించవచ్చును. నిప్పు మరియు పొగ, ఈ క్రింది ఐదు కారణాల వలన కారకం మరియు ఫలితాల స్థానంలో ఇముడుతాయి.

  • ఫలితం అనెడిది ఆచరణకు ముందు గుర్తించబడలేదు
  • కారకం గమనించబడుతోన్నది
  • ఫలితం గమనించబడి దాని తర్వాత ఆ ఫలితం గుర్తించబడుతుంది
  • గుర్తించబడలేకపోవటం కూడా ఉన్నది
  • భౌతిక కారకం ఎంతమాత్రం గుర్తించబడలేకపోయినపుడు


ఇలాగే కొన్ని లక్షణాలను గుర్తించి ద్వారా మనం ఒక కారకాన్ని కూడా గుర్తిస్తాం. ఉదా: ఒక చెట్టును, దాని ఆకులు, దానికి పూచిన పుష్పములు, దానికి కాసిన కాయల ద్వారా గుర్తిస్తాం. అయితే, ఎక్కడైతే అసంబద్ధత ఉన్నదో, అవినాభావ సంబంధం మరల మరల గమనించబడినదో, అవినాభావ సంబంధం యొక్క వైఫల్యం అనెడి సందేహాన్ని ఎవరు విస్మరించగలరు? కారకాల వలన ఫలితము చెప్పగలము గాని, ఫలితము వలన ఫలితము చెప్పలేము. గోవు వేరు, ఆశ్వము వేరు. రెంటినీ ఒక గాట కట్టలేము.

2.3 ఎవ్వరైననూ అనుమానం యొక్క ప్రామాణ్యతను స్వీకరించకపోతే గనుక అతనిని ఇలా ప్రశ్నించాలి, "అనుమితి సాక్ష్యం కాదనటానికి నీ వద్ద ఆధారాలున్నవా, లేవా?" ఒకవేళ ఉన్నచో ఆపాదింపు ఆధారం కాదు. ఒకవేళ లేనిచో ఆధారమే లేనిచో ఇక వాదన అనవసరం. ఇది "నా తల్లి గొడ్రాలు" అని చెప్పటం తో సమానం. ఒక రూపంలో ఉన్న ఆధారాలు మరొక రూపంలో ఉన్న తప్పుడు ఆధారాలు అవి ఒకే రకంగా ఉన్నవని తెలుపటం ద్వారా ప్రమాదవశాత్తూ, ప్రేరణను అనుమతించినట్లే. అసలు ఇంద్రియాలకు అందని ఆధారలే లేవని తెలిపితే అనుభూతి చెందలేకపోవటం అనే ప్రశ్న వస్తోంది. అందుకే తథాతథుడు - "సాధారణంగా ఆధారం యొక్క రూపాన్ని అంగీకరించటం అనేది దాని ఉనికి నుండి, అది ఇతరులకు అర్థమయ్యే దానిని బట్టి ఉంటుంది. ఆధారం యొక్క రూపం యొక్క ఉనికి దానిని ప్రశ్నించేవాడి వద్ద నుండి మొదలవుతుంది."

2.4 బౌద్ధ పండితులు నాలుగు రకాల భావనలు ద్వారా పరమ పురుషార్థాలను చర్చిస్తారు. అవే మాధ్యమిక, యోగాచార, సాత్రానిక మరియు వైభాషిక భావనలు. మాధ్యమిక భావనలలో సర్వశూన్యత్వం, యోగాచార భావనలో బాహ్య శూన్యత్వం, సౌత్రాంతికంలో బాహ్యార్థానుమేయత్వ మరియు వైభాషిక భావనలు బాహ్యార్థ ప్రత్యక్షవాదులు ఉన్నవి. దీని గురించిన వివరణాత్మక ప్రస్తావన మరో చోటు ఉన్నది.

2.5 బుద్ధుడు ఒక్కడేనైనను, అతని శిష్యులలో మాత్రం నాలుగు వేర్వేరు దృక్పథాలు ఉండెడివి. సూర్త్యాస్తమయమైనది అనగనే అక్రమ సంబంధాలు నెరుపువాడు ఆ సుఖం వైపు, దొంగతనాలు చేసేవాడు దొంగతనానికి, విద్యార్థి విద్యాభ్యాసానికి ఎలా ఉన్ముక్తులౌతారో, ఈ నాలుగు దృక్పథాలు గల శిష్యులు కూడా అలా ఉన్ముక్తులై బౌద్ధాన్ని ప్రచారం చేశారు. ఈ నాలుగు దృక్పథాలు -

  • అంతయు క్షణికమే
  • అంతయు బాధాకరమే
  • అంతయు దాని యొక్క స్వలక్షణమే
  • అంతయు శూన్యమే


- అని బోధిస్తాయి.

ఈ బోధనలానుసారం, కళ్ళ ముందు కదిలిపోయే నీలవర్ణం (లేదే ఏ ఇతర వర్ణాలైనను) దాని (వాటి) ఉనికి నుండే గుర్తించబడతాయి. కాబట్టి మేఘాల వలె, అంతయు క్షణికమే. ఉనికి ఉన్న ఏ వస్తువునూ అస్థాపితం చేయలేం. ఉనికి ఉన్న వస్తువు యొక్క అనుభూతి యొక్క స్థాపన, నీల వర్ణం మరియు ఇతర తాత్కాలిత విషయాలలో కలిగి ఉంటుంది. తాత్కాలితం కాని దాని స్థాపన యాదృచ్చికత మరియు అతాత్కాలితం నుండి వేర్పడుతుంది. ఉనికి అనెడిది యాదృచ్చికత మరియు వారసత్వం క్రింద ఉంటాయి. వీటి మధ్య మరేదీ ఉండదు.

2.6 కొందరు ఇలా ప్రశ్నించవచ్చును. వాస్తవిక సామర్థ్యం అశాశ్వతాలలో ఎందుకు ఉండకూడదు? శాశ్వతత్వం గా చెప్పబడే వాటిలో ప్రస్తుత వాస్తవిక సామర్థ్యంగా ఉన్నపుడు భూత భవిష్యత్ వాస్తవిక సామర్థ్యాలు ఉన్నవా? దానికి అంతటి శక్తే ఉంటే, భూత భవిష్యత్ వాస్తవిక సామర్థ్యాలలో అది ఉండకుండా పోలేదు. దానికి శక్తి లేదని మనం చెప్పలేము. పర్యవసానాన్ని మనం ముందే అంచనా వేస్తాం. కారకాలు మరియు దాని పరిధి చాలా శక్తివంతమైనవి. శాశ్వతత్వానికి భూత భవిష్యత్ వాస్తవిక సామర్థ్యాలు లేకపోతే అది ఏమీ చేయలేదు. ఎందుకంటే వాస్తవిక సామర్థ్యం శక్తి నుండే ఉద్భవిస్తుంది కనుక. ఎప్పటికీ ఏమీ చేయలేనిది, అప్పటికి అది చేయలేదు. ఒక రాయి, ఒక పురుగుకు ఎప్పుడైనా జన్మనిస్తుందా?

2.7 ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే అనుబంధాలు ఉన్నవని భావించినచో, శాశ్వత సత్వమునకు భూత భవిష్యత్ వాస్తవిక సామర్థ్యమున్నదని భావించవలెను. అలా అయినచో, ఈ అనుబంధాలు సత్వానికి సహాయపడగలవా అనే ప్రశ్న ఉదయిస్తుంది. సహాయపడలేవంటే అవి అవసరం లేదు. అవి ఏమీ చేయలేవు. సహాపడగలవంటే ఈ సహాయమే కారణము కానీ అశాశ్వతము కారణము కాదు. తదుత్పత్తి ఉన్ననూ, లేకున్ననూ ఫలితం తర్వాత వస్తుంది. అందుకే -

"వర్షం, ఎండలతో ఆత్మకు ఏమి పని ఉన్నది? వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది. ఆత్మయే చర్మము వలె ఉన్నపుడు, వాటి ప్రభావం ఆశాశ్వతం. చర్మమే ఆత్మ వలె ఉన్నపుడు, దానిపై వాటి ప్రభావమనేదే ఉండదు."

2.8

2.9

2.10

2.11 ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి, తరలిపోతున్న మేఘం వంటిది. ఉనికిలో ఉన్న దాని యొక్క శక్తి వాస్తవిక సామర్థ్యానికి సంబంధించినది, ఆదర్శాలకు చెందినది. అయితే (ఆకాశం వంటి) శాశ్వతమైన వాటిలో మాత్రం ఈ శక్తి శాశ్వతంగా నిలిచి ఉండదు. ఒక్కటే రూపమన్నది లేనే లేదు. అదే ఉండి ఉంటే, ఒక దాని యొక్క పని మరొక్కటి చేసేది. కావున (వారసత్వం మరియు సమకాలీనత) అనెడి రెండు కారణములచేత క్షణికమైన మార్పు మనం ఋజువు చేయవలసినవాటిలో ఆమోదయోగ్యం మరియు నిత్యం సత్యంగా ఉండిపోతుంది.

2.12

2.13

2.14 వర్తమాన పదార్థం అన్యస్థానంలో జన్మించవచ్చును. కానీ తమ స్థానం నుండే క్రియాశీలకంగానే ఉంటారో, వారందరి స్థితీ ఇలాగే ఉంటుంది. ఇది యుక్తి మతం కాదు. ఏ స్థానం నుండి భావపదార్థం వర్తమానంలో ఉంటుందో వేరే విధముగా గమనము చెందే భావపదార్థానికి, ఆ స్థానములో ఇదివరకూ లేని వస్తువుకు ఆ స్థానం తో ఆ ఎటువంటి సంబంధం ఉండదు. పరలోకములో కూడా దీని రూపము ఈషణ్మాత్రం కూడా ఉండదు. ఆ పదార్థము పూర్వాధార పరిత్యాగము చేయదు.

2.16 కారణం యొక్క అవసరం ఉనికిలో ఉన్న (ఆకాశం వంటి) వాటికి సరితూగదు. (పుష్పాలు/ఆకాశం వంటి వాటికి) ప్రభావమే లేనిచో ఏ కారణము ప్రయోజనకరమైనది కాదు. అలంకారవతారం లో బుద్ధుడు అందుకే ఇలా అన్నాడు - మేధస్సుచే భేదమును గుర్తించగలిగిన వాటికి తత్త్వాన్ని నిర్ధారించలేము. అందుకే అటువంటివి వివరించలేనివిగా, తత్త్వమే లేని వాటిగా చూపించబడ్డాయి. ఉనికిలో ఉన్నదేదీ ఫలితమును తప్పించుకొనలేదు. అందుకే మేధావులు ఉనికిలోనున్నదాని గురించి ఆలోచించిన క్షణమే అవి మాయమౌతాయి అని తెలిపిరి. మతపరమైన యాచకుడు, ప్రేమికుడు మరియు శునకములచే ఒకే స్త్రీ శవంగా, కామాన్ని తీర్చెడిదిగా మరియు మాంసపు ముద్దగా మూడు విధములుగా అర్థం చేసుకొనబడుతుంది.

2.19 ఒక పరమాణువు ఆరు పరమాణువులతో కలిస్తే, దానికి ఆరు ఉపరితలాలు ఏర్పడతాయి. వీటిని ఒక్కొక్కటిగా పరిగణిస్తే ఇవి ఒక దేహంలో భాగాలే. అంతా శూన్యమే అని మేధస్సు గుర్తించవలసిన అవసరం ఉన్నది, ఏ ప్రజ్ఞానముయు అక్కడ నిగూఢమై లేదు. గ్రాహ్యతకు, గ్రాహకుడికి ఇట్టే భేదం లేనందున మేధస్సు దానికై అదే ప్రకాశిస్తూ ఉంటుంది.

2.20 ఆత్మకు మేధస్సుకు మధ్య భేదం ఊహాత్మక అవగాహనలతో లేదు. అయిననూ గ్రాహ్యత మరియు గ్రాహకుడు అనెడి రెండు జ్ఞానముల యొక్క కలయికవలెనే అని అనిపించును.

2.21

2.22

2.23 గతంలో గ్రాహ్యత కలిగు ఉంటేనే ఇప్పుడు గత గ్రాహ్యతను గుర్తించవచ్చును. ఒక వస్తువు యొక్క సమర్థవంతమైన అనుమితి దానిపై ఏ రూపం అయితే విధించబడినదో, ఆ రూపంగానే చేకూరుతుంది.
ఒకే వస్తువులో సగభాగాన్ని వదిలేసి, మిగత సగంతో అనుకొన్నది సాధించలేము. అదే విధంగా ఒక గుర్తించవలసిన వస్తువు యొక్క గుర్తింపు చే కలిగే ఆధారాలు గుర్తించే వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది.

2.24 ఎవరికైతే అహం పై జ్ఞానం ఉంటుందో, వారికే ఆలయజ్ఞానం కూడా ఉంటుంది. నీలాదుల ఉల్లేఖనం ఉంటుందో, వారికే ప్రవృత్తిజ్ఞానం కూడా ఉంటుంది.