సొరకాయ పకోడి
సొరకాయ పకోడి తయారు చేయు విధానము.
కావలసిన పదార్థాలు
మార్చు- సొరకాయ (పొట్టుతీసి, తురిమి) - ఒకటి (మీడియం సైజ్)
- శెనగపిండి - ఒక కప్పు
- బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు
- ఉల్లిపాయ (సన్నగా తరిగి) - ఒకటి (మీడియం సైజ్)
- వెల్లుల్లి రెబ్బలు (సన్నటి ముక్కలు) - నాలుగు
- పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - మూడు
- చాట్ మసాలా, కారం - ఒక్కో టీస్పూన్ చొప్పున
- పసుపు - కొద్దిగా,
- బ్లాక్ సాల్ట్ - అర టీస్పూన్,
- కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూన్,
- ఉప్పు - రుచికి తగినంత,
- నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే పద్ధతి
మార్చు- శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చాట్‌మసాల, కారం, పసుపు, బ్లాక్‌సాల్ట్, కొత్తిమీర తరుగు - వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మిశ్రమం కొంత గట్టిగా వుండాలి. దీనిని ప్రక్కన పెట్టుకొని...
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసి కాగిన నూనెలో జార విడవాలి. ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు కాలనిచ్చి చిల్లుల గరిటెతో వాటిని తీసి బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే నూనెని పీల్చుకుంటుంది.
- వేడివేడిగా టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా వుంటుంది. నాలుగు రోజుల వరకు నిలువ వుంటాయి..
వనరులు
మార్చుhttp://telugutaruni.weebly.com/15/category/147ba6496a/1.html[permanent dead link]