స్వేచ్ఛా సాఫ్టువేరు

సాఫ్టువేరు రెండు రకాల స్థితులలో ఉంటుంది, ఒకటి సోర్స్ కోడ్ కాగా రెండవది బైనరీ . సోర్స్ కోడ్ (మూల రూపకరణాలు) అంటే ప్రోగ్రామర్లు రాసేది, బైనరీ అంటే కంప్యూటర్‌లో ఎక్సిక్యూట్ చేయటానికి ఒకటి సున్నాల రూపంలో ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రూలూ నట్లతో ఉన్న బండిని సోర్స్ కోడ్ అంటే, స్క్రూలూ నట్లూ లేకుండా వెల్డింగ్ చేసి యిచ్చిన బండిని బైనరీకి సమానం అనుకోవచ్చు. మనం ఎంత మంచి బండి అయినా సరే స్క్రూలు నట్లు లేనిదయితే కచ్చితంగా కొనము. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మనకి అమ్ముతున్నది మాత్రం ఈ రకమైనవే. మనకి మెకానిక్ పని రాకపోయినా, మెకానిక్ వద్దకెళ్ళి రిపెయిర్ చేయించుకుంటాము , సాఫ్టువేరు రంగంలో ఈ రకమైన గుత్తధిపత్యానిని నిరసిస్తూ ‘source code’ తో కూడిన సాఫ్ట్వేర్ని అందించినది మాత్రమే స్వేచ్ఛా సాఫ్టువేరు. సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం మూలంగా దీని అభివృద్ది వేగంగానూ అత్యంత నాణ్యంగానూ జరిగింది. వైరస్‌లు సైతం సోకలేని సాఫ్టువేరు ఇదంటే దీని నాణ్యతేమిటో మనకర్ధమవుతుంది. స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా రమారమీ 20లక్షల మంది పని చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా సాగుతున్నది. స్వేచ్ఛా సాఫ్టువేరుతో తయారయిన ఆపరేటింగ్ సిస్టం లు సుమారు 5 వందల రకాలు వాడకంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో తయారయిన ‘స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం’ కూడా ఈ కోవకు చెందిందే. సోర్స్ కోడ్ అందుబాటులో ఉండటాన ఇది ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడుతున్నది. మాతృభాషలో విద్యనభ్యసించటంతో ఎన్ని ఉపయోగాలున్నాయో, కంప్యూటర్ వెద్యను సైతం మాతృ భాషలో అభ్యసించటంలో అన్ని ఉపయోగాలుంటాయి.

నిర్వచనం

మార్చు

ఏ సాఫ్ట్ వేర్నయినా స్వేచ్ఛా సాఫ్టువేరు అనాలంటే అది నాలుగు సూత్రాలకు నిలబడాలి

0. సాఫ్ట్ వేర్ని ఏ అవసరానికైనా స్వేచ్చగా వినియోగించుకునే హక్కుండాలి.

1. దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ ఇచ్చి తీరాలి.

2. దానిని అభివృద్ది చేసి ఇతరులకు రొక్కానికి గాని ఉచితంగా గానీ ఇచ్చే హక్కు ఉండాలి.

3. జత చేసిన, మలచిన, అభివృద్ది చేసిన సాఫ్ట్ వేర్నికూడా ఫ్రీసాఫ్ట్ వేర్‌గా ఇవ్వాలి .

స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమం

మార్చు

స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మన దేశంలో కూడా అభివృద్ది అవుతున్నది. ఇంత పెద్దమొత్తంలో ప్రజలకందరికీ అందుబాటులోకి సాఫ్టువేరుని తీసుకు వచ్చింది ఏ ఒక్క కంపెనీ కాదు. ఇదంతా స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమకారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మన రాష్ర్ట్రంలో కూడా తెలుగులోకి సాఫ్టువేరుని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఉద్యమమే. వివిధ దేశాల్లో ఉన్న వారితో కలిపి షుమారు 10,00,000 మంది వాలంటీర్ల కృషి దీనివెనక ఉంది.