హర భర కబాబ్
హర భర కబాబ్ తయారు చేయు విధానము
కావలసిన పదార్థాలు
మార్చు- బంగాళా దుంపలు - 250 గ్రా.
- బటానీలు - 150 గ్రా.
- బీన్స్ - 150 గ్రా.
- ఉల్లి కాడలు - రెండు కట్టలు
- మెంతి ఆకులు - పావు కప్పు
- పాలకూర - పావు కప్పు
- కసూరి మేతి - ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు పలుకులు - ఒక టేబుల్ స్పూన్
- గరం మసాలా పొడి - పావు టేబుల్ స్పూన్
- రవ్వ - అరకప్పు
- కార్న్ ఫ్లోర్ పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
మార్చుబంగాళాదుంపలు, బటానీలు, బీన్స్ ఉడికించి చిదమాలి. రవ్వ, కార్న్ ఫ్లోర్ పేస్ట్ మినహా అన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, టిక్కిలా మాదిరిగా నొక్కాలి. వీటిని కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో ముంచి, రవ్వ అద్ది 20 నిముషాలు ఓవెన్ లో బేక్ చేయాలి లేదా పెనంపై కాల్చాలి. చట్నీ లేదా కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి.[1]
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.